14, మే 2019, మంగళవారం

సమస్య - 3018 (పుఱ్ఱెలు మాటలాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్"
(లేదా...)
"పుఱ్ఱెలు మాటలాడె తమ పూర్వపురీతి సజీవులో యనన్"

80 కామెంట్‌లు:

  1. ఎఱ్ఱని భానుడు పడమట
    సఱ్ఱున యుదయించె నేని సాహస మౌనా ?
    వెఱ్ఱిగ యోచన జేసిన
    పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్

    రిప్లయితొలగించండి
  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    వెర్రిగ డెబ్బదేండ్లుగను వెళ్ళిరి వచ్చిరి వేనవేలుగా
    తొర్రలు పూడ్చుచున్ తమవి తోరపు సంచుల కోటికోట్లతో
    గొర్రెలు గాగ వోటరులు ఘోరపు రీతిని రాజనాయకుల్
    పుఱ్ఱెలు మాటలాడె తమ పూర్వపురీతి సజీవులో యనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాజకీయ౦పున్ । పుఱ్ఱెలు...' అంటే ఇంకా బాగుంటుందేమో?

      తొలగించండి
  3. "కఱ్ఱెన్నొ"కపరి వెడలగ
    మఱ్ఱి కడకు బిచ్చి పట్టె ;మతి పోవంగన్
    వెఱ్ఱిగ వచించె నివ్విధి
    "పుఱ్ఱె లవియె మాటలాడె బూర్వపు రీతిన్"

    రిప్లయితొలగించండి

  4. మైలవరపు వారి పూరణ

    అఱ్ఱులు సాచ నీటికవి యందక వానలలేమి , జాలిగా
    నెఱ్ఱెలు విచ్చినట్టి ధరణిన్ గని పుర్వులమందు త్రాగిరా
    వెఱ్ఱి కృషీవలుల్ , కలచివేసె మనంబన జూడబోవగా
    పుఱ్ఱెలు మాటలాడె తమ పూర్వపురీతి సజీవులో యనన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ కరుణరసార్ద్రమై, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పుఱ్ఱెలు మాటలాడె తమ పూర్వపురీతి సజీవులో యనన్
      "వెఱ్ఱివి ! యుద్ధవాంఛనిట వేవురి జంపితివేమి పొందితీ...
      వఱ్ఱులు సాచి కీర్తికని" యల్లదె యాజి కళింగసీమలో ,
      జుఱ్ఱుకొనంగ శాంతిని అశోకుడు మానవతావినోదియై !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  5. ( పలనాటి వీరుల సంగ్రామరంగం కార్యమపూడి వెళ్లాను )
    ఎర్రని యెండలోన గర
    మెత్తుచు కత్తుల ధాళధళ్యముల్
    మిర్రుల బ్రాకగన్ దలల
    మేదిని మీద బడంగజేయగన్
    నెర్రులు విచ్చు సంగరపు
    నేలను నేనటు సంచరింపగా
    బుర్రెలు మాటలాడె తమ
    పూర్వపురీతి సజీవులో యనన్ .
    ( మిర్రులు - ఎత్తైన ప్రదేశాలు ,నెర్రులు - పగుళ్లు )

    రిప్లయితొలగించండి
  6. వెఱ్ఱి జనాలని తలచుచు
    జెఱ్ఱీస్మితుతీసెనొక్క సినిమా యందున్
    బఱ్ఱెలు నింగిన యెగసెను
    పుఱ్ఱెలవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నింగిని నెగసెను' అనండి.

      తొలగించండి
  7. గుర్రున జూచు చు నెగు రుచు
    పుర్రె లవి యె మాట లాడెపూర్వపు రీతిన్
    వెర్రి గ వెకిలి గ నవ్వుచు
    మర్రి కి వ్రేలాడు చుండె మాయా మహి మన్

    రిప్లయితొలగించండి
  8. గొఱ్ఱెల మందవోలె గుమి గూడుచు చోద్దెము జూడబో వగన్
    వెఱ్ఱిగ మానవుండు తన వేగిర పాటును నెంచకుండ గన్
    పుఱ్ఱెలు మాటలాడె తమ పూర్వపు రీతి సజీవులో యనన్
    గుఱ్ఱపు స్వారివం టిదట గూడును వీడుచు సాగి బోవుటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. కఱ్ఱులు త్రుప్పు పట్టినవి, కాడులు పల్గులు వారె, బావులే
      యఱ్ఱులు చాచె లోతు లడుగంటి జలమ్ము, కనీసపున్ ధరల్
      వెఱ్ఱుల జేసె, రైతులకు వేరు పథమ్ములు కాన రాక, యా
      పుఱ్ఱెలు మాటలాడె తమ పూర్వపురీతి సజీవులో యనన్

      కంజర్ల రామాచార్య
      వనస్థలిపురము.

      తొలగించండి
    3. రామాచార్య గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  9. అఱ్ఱులు జాచెడి కోరిక
    వెఱ్ఱిగ దీర్పగ నురుకుచు విధులను వీడెన్
    నెఱ్ఱెలు బాసిన మరువక
    పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్

    రిప్లయితొలగించండి
  10. సర్రాజు పొలము చెడెనే!
    మర్రాకులు,చెత్త,తోడ మకిలము నిండెన్!!
    చిర్రెత్తి తాతలేడ్వగ
    పుర్రెలవియె మాటలాడె పూర్వపు రీతిన్.

    (శకట రేఫ బదులు సాధు రేఫ వాడాను కీ బోర్దులో అది లేదు క్షమించండి)

    రిప్లయితొలగించండి
  11. అది ఒక స్మశానస్థలి.... అర్థరాత్రి.... ఎక్కడో దూరంగా నక్క ఒకటి ఊళ పెట్టినట్టుంది.. ఊఊఊఊఊ.....
    ఒంటరిగా భయంభయంగా దిక్కులు చూస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడొక పిల్లవాడు. అంతలో.........

    కం.
    బిఱ్ఱున బిగుసుకు పోయెను
    సఱ్ఱున నా గాలిలోన శబ్ధము రాగా
    వెఱ్ఱిగ నరచెను బాలుడు
    "పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్"

    అంతే! ఒక్కసారి కెవ్వుమన్నాడు... చూస్తే తనమంచం మీదున్నాడు.... కల...
    అవునుమరి... పెద్దలు వద్దన్నా వినకుండా ఆన్‌లైన్‌లో హారర్ సినిమా చూసి పడుకున్నాడు కదా!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ స్వాప్నిక పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. మిఱ్ఱున విఠలాచార్యుని
    యఱ్ఱలు గన కీలుగుఱ్ఱమను సినిమాలో
    గుఱ్ఱమునెగిరె హుళక్కిన
    పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్
    అఱ్ఱలు=సమూహములు అఱ్ఱము=సమూహము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వామన్ కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అయినా 'కీలుగుఱ్ఱం' విఠలాచార్య సినిమా కాదు!

      తొలగించండి
    2. తెలిసింది. కీలుగుఱ్ఱం సినిమా దర్శకుడు M. కొండయ్య గారు.

      మిఱ్ఱున కొండయ్య గారి
      యఱ్ఱలు గను కీలుగుఱ్ఱమను సినిమాలో
      గుఱ్ఱమునెగిరె హుళక్కిన
      పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్

      తొలగించండి
    3. మొదటి పాదం చివర గణదోషం. "మిఱ్ఱున కొండయ తీసిన" అందామా?

      తొలగించండి
  13. గగనమున నెగిరె కప్పలు ఘనముగ, కర్రలు నర్తించి కనుల విందు
    చేసెను , చేరుచు చెట్ల తొర్రలలోన గజములు భీకర కలను చేసె,
    మగువలు కోతులై మారెను, పురుషులు చిలుకలయ్యెను చిత్ర సీమ లోన
    విఠలార్యు పుఱ్ఱెలవియె మాట లాడెఁ, బూర్వపు రీతి నెవ్వరు రమ్య మైన
    చిత్ర రాజముల నిపుడు చేయ లేరు,
    డిజిటలు యుగము లోన నేడెవ్వరట్టి
    వారు లేరన్నది నిజము , రారు ,దొరక
    రు, విఠలాచార్య జోహారు లివియె నీకు

    రిప్లయితొలగించండి
  14. ఎఱ్ఱని యెండల ధాటికి
    నెఱ్ఱెలు విచ్చంగ భూమి నీరము లేకన్
    తొఱ్ఱలనుండియు వెలువడు
    పుఱ్ఱెలవియె మాటలాడె బూర్వపు రీతిన్!!!

    కుఱ్ఱల చిత్రము లందున
    బఱ్ఱెలు కోతులు చిలుకలు భల్లూకమ్ముల్
    యెఱ్ఱలు గుఱ్ఱములు మరియు
    పుఱ్ఱెలవియె మాటలాడె బూర్వపు రీతిన్!!!

    రిప్లయితొలగించండి
  15. మిత్రులందఱకు నమస్సులు!

    [ఒక గారడీవాని చతురత]

    బుఱ్ఱటకొమ్ము నూఁదుచును, పొంగుచు, నొక్కెడ గారడీఁడు లేఁ
    గుఱ్ఱల కిచ్చెఁ దా నచటఁ గ్రోఁతుల రూపముఁ; జూచుచుండఁ బెన్
    గఱ్ఱనుఁ గత్తిగా మలచి, కాంక్షఁ దలల్ పెను వ్రేఁటఁ ద్రుంప, నా
    పుఱ్ఱెలు మాటలాడెఁ, దమ పూర్వపు రీతి, ’సజీవులో’ యనన్!

    రిప్లయితొలగించండి
  16. కుఱ్ఱతనమ్మున కోర్కెల
    గుఱ్ఱములందదుపు లేక గోరితి నిహమని
    యెఱ్ఱని నిప్పుల గాలుచు
    పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గొఱ్ఱెల మంద వీరనుచు కుఱ్ఱతనమ్మున విర్ర వీగుచున్
      బుఱ్ఱయె లేని రాజు తన పూర్వజులందర దూలనాడగా
      పుఱ్ఱెలు మాటలాడె తమ పూర్వపురీతి సజీవులో యనన్
      వెఱ్ఱియె వీనికింక విలువేమియు లేదిక వంశమందునన్

      తొలగించండి
    2. సూర్య గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ రెండవ పాదం గురువుతో అంతం కావాలి. సవరించండి.

      తొలగించండి
    3. _/\_

      కుఱ్ఱతనమ్మున కోర్కెల
      గుఱ్ఱములందదుపెరుగక గూలితిమంచున్
      యెఱ్ఱని నిప్పుల గాలుచు
      పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్

      తొలగించండి
  17. గొఱ్ఱె వలె పలుక బోకుము
    పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్
    ఒఱ్ఱే నమ్మకు మనుచును
    పోఱ్ఱా యని వదలబోడు బ్రోహుడు యిలలో

    ప్రోహుడు-తార్కికుడు,సమర్థుడు

    రిప్లయితొలగించండి
  18. కర్రలుమండచునుండగ!
    ఎర్రని నాకారమందు యెదపైనిలచెన్!
    సర్రునకలలో గనపడి
    పుర్రెలవియె మాటలాడె పూర్వపురీతిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఎర్రని యాకారమందు నెదపై...' అనండి.

      తొలగించండి
  19. ఉ. బుఱ్ఱన దాచి యుంచుకొను బోలెడు మాటల చేరి యొక్కటై
    వెఱ్ఱివి మంచివిన్గలసి వేకువ ఝామున మిశ్రితమ్ముచున్
    చుర్రున వచ్చు స్వప్నమున చూచితి చిత్రవిచిత్రరీతిలో
    "పుఱ్ఱెలు మాటలాడె తమ పూర్వపురీతి సజీవులో యనన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భళ్ళముడి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విశ్రితమ్ముచున్'....?

      తొలగించండి
  20. తొఱ్ఱలలో చిక్కి నరులు
    బఱ్ఱెలు గుఱ్ఱములు వీడ ప్రాణము లనిలో
    సఱ్ఱున లేచెను మానవ
    పుఱ్ఱె లవియె ; మాటలాడెఁ బూర్వపు రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మానవ పుఱ్ఱెలు' దుష్ట సమాసం. అక్కడ "మనుజుల । పుఱ్ఱెలు" అనండి.

      తొలగించండి


  21. కర్రుచ్చుకొని జిలేబీ
    బర్రున లాగినడిరోడ్డు పైపడ వేస్తా
    చుర్రుమనగ నెచ్చట నే
    పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కర్రుచ్చుకొను, వేస్తా' అన్నవి వ్యావహారికాలు.

      తొలగించండి
    2. జిలేబి గారు
      లఘు రేఫమునకు ద్విత్వంబు లేదు; శకట రేఫమునకుఁ గలదు.

      తొలగించండి
  22. బిఱ్ఱిన శవములు కదిలెను
    పుఱ్ఱెలవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్
    వెఱ్ఱిదనమునవ్రాయగ
    గొఱ్ఱెలవలె తులసిదళము గొప్పగ జదివెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వెఱ్ఱిదనమ్మున' అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  23. కుఱ్ఱతనంబుననేనొక
    నెఱవిద్దెనుజూడజనితి నేర్పరియగునా
    నెఱవిద్దెగాఁడుచెప్పగ
    పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణీంద్ర గారూ,
      రెండవ మూడవ పాదాలలో ప్రాస సవరించండి.

      తొలగించండి
    2. పొరపాటు గ్రహించాను. ధన్యవాదాలండీ.

      కుఱ్ఱతనమునందుననేఁ
      నుఱ్ఱముగా మసనముకడనురుకుచుబోవన్
      ౙఱ్ఱునజారిపడగనట
      పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్

      తొలగించండి
  24. అఱ్ఱులను చాచి గదిలో
    కుఱ్ఱలు మదిలో కరమగు కొండాటముతో
    వెఱ్ఱిఁ గన చలన చిత్రము
    పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్

    రిప్లయితొలగించండి
  25. గుఱ్ఱు నిడు నిదుర నందున
    వెఱ్ఱి చిఱుతడి కలయందు బిరికి తనమునన్
    బుఱ్ఱకు తోచిన విధమున
    పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్

    రిప్లయితొలగించండి
  26. పొగాకు వాడుట ప్రమాదమను సందేశాత్మక చిత్రంలో....

    ఉత్పలమాల
    ఎఱ్ఱని మేన మోము శిరమెల్లను నల్లని జుట్టు నుంగరాల్
    మిఱ్ఱుగ మూతిమీదఁ గన మీసము ద్రిప్పుచు నుంటివే దొరా!
    వెఱ్ఱిగ నా పొగాకు దిని బిద్దితివా? యని తొఱ్ఱి నోటితో
    పుఱ్ఱెలు మాటలాడె తమ పూర్వపురీతి సజీవులో యనన్

    రిప్లయితొలగించండి
  27. బిఱ్ఱున నెఱ్ఱని చక్కటి
    గుఱ్ఱము నెక్కి చనుదెంచి గురు కామలకుం
    గఱ్ఱి, భయము లేక యరసి
    పుఱ్ఱె లవియె, మాటలాడెఁ బూర్వపు రీతిన్


    కుఱ్ఱలు సేరి మోదముగఁ గూతలు కూయుచు నాడు చుండిరే
    వెఱ్ఱినె నమ్మ సుద్దులను వింతలు సెప్పకు మింకఁ జాలులే
    యఱ్ఱులు సాచి యున్నయవి యచ్చట జీవులె, కావు చూడుమా
    పుఱ్ఱెలు, మాటలాడె తమ పూర్వపురీతి సజీవులో యనన్

    రిప్లయితొలగించండి
  28. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    S.I.I.B.H. School, Muthukur (1957):

    (కీ. శే. శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ గారికి నెనరులతో)

    కుర్రలు చొంగ కార్చుచును కున్కులు తీయగ లాస్టు బెంచిలో
    వెర్రిగ శబ్దశాస్త్రమున వేయగ వ్రేటులు తెన్గు పండితుల్
    గుఱ్ఱపు శాస్త్రి వర్యులహ గుర్రును కొట్టగ నన్నయాదులౌ
    పుఱ్ఱెలు మాటలాడె తమ పూర్వపురీతి సజీవులో యనన్

    రిప్లయితొలగించండి
  29. అఱ్రులుసాచుచుశంకరు
    జర్రునబ్రాణంబులీయసాదరమొప్పన్
    వెర్రివీసంతసమొందుచు
    పుర్రెలవియమాటలాడెబూర్వపురీతిన్

    రిప్లయితొలగించండి
  30. ఎఱ్ఱగ బుఱ్ఱగా గల మహేశ్వరి టక్కుట మారవిద్యలన్
    నెఱ్ఱన వద్ద నేర్చి తన యింట ప్ర దర్శన నివ్వగా నటన్
    గొఱ్ఱెలు గాలిలో నెగిరె కోడియె కోకిల వోలె కూసెనే
    పుఱ్ఱెలు మాటలాడె తమ పూర్వుల రీతిసజీవులో యనన్.

    రిప్లయితొలగించండి
  31. అర్రులుసాచుచున్మిగులనాఱడివెట్టుచునుండగాదమిన్
    జర్రునసాంబమూర్తిగనిసాదరమొప్పగబ్రాణమీయగా
    బుర్రెలుమాటలాడెదమపూర్వపురీతిసజీవులోయనన్
    బుర్రెలుమాటలాడుటనుబూర్తిగగల్కిమహాత్మ్యమేసుమా

    రిప్లయితొలగించండి
  32. అఱ్ఱెఱ్ఱే యేమ్ సినిమా
    బఱ్ఱెలెగరబట్టె, కఱ్ఱ బఱ్ఱని ఎగిరెన్
    తొఱ్ఱల మడుసుల్ దూరెన్
    పుఱ్ఱెలవియె మాటలా డె పూర్వపు రీతిన్

    రిప్లయితొలగించండి
  33. అఱ్ఱెఱ్ఱే యేమ్ సినిమా
    బఱ్ఱెలెగరబట్టె, కఱ్ఱ బఱ్ఱని ఎగిరెన్
    తొఱ్ఱల మడుసుల్ దూరెన్
    పుఱ్ఱెలు మాటాడ బట్టె పూర్వపు రీతిన్

    అచ్చు తెలంగాణా మాండలికంలో సమస్యని కొద్దిగా మార్చితిని.

    రిప్లయితొలగించండి
  34. నాటి జానపద చిత్రం లో...

    కందం
    పుఱ్ఱెగల మంత్రదండము
    బిఱ్ఱుగ మాంత్రికుడు నూప విఠలాచార్యుల్
    కిర్రెక్కించ నిడుపునన్
    బుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్

    రిప్లయితొలగించండి
  35. జఱ్ఱు న జారుచు పిల్లలు
    పుఱ్ఱె ను గని భీతి చెంది భోరున నేడ్వన్
    పుఱ్ఱె తొడుగుతో నొకడనె
    పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్"

    రిప్లయితొలగించండి
  36. వెఱ్ఱిగ నిచ్చిరి గొఱ్ఱెల
    వెఱ్ఱిగ బెంచగ, బ్రతుకులు బీటలు వారెన్
    వెఱ్ఱి గజచ్చెనువిరివిగ
    పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్"

    రిప్లయితొలగించండి
  37. డా. పిట్టా సత్యనారాయణ
    పుర్రెల బుద్ధులు మార్చగ
    వర్రెల వాగులను వాడ వలదనలేదే
    కుర్రును మానెనె యిస్లామ్
    పుర్రెలవియె మాటలాడె బూర్వపు రీతిన్(సాహచర్యం వల్ల క్రూర చింతనలు మానలేదు.)

    రిప్లయితొలగించండి
  38. డా.పిట్టా సత్యనారాయణ
    గొర్రెల దండులై భరత గూటిని జేరి విదేశ ముష్కరుల్
    బిర్రును జూప హింస గొని బీరము బల్కిన నాడు యా పటేల్
    కర్రుకు లొంగి చాటుగ నగౌరవ మారణ కాండనేర్ప నే
    డర్రులుజాచు బుద్ధులెటు లారడి మానక బోయె నై.య్యె.సై(ISI)
    పుర్రెలు మాటలాడె తమ పూర్వపు రీతి సజీవులో యనన్

    రిప్లయితొలగించండి