15, మే 2019, బుధవారం

సమస్య - 3019 (గాడిద కాల్పట్ట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్"
(లేదా...)
"గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్"

89 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    చేడియ గొప్పగా పలికి చిందుచు నవ్వులు చేతులెత్తుచున్
    దాడిని జేయగా మురిసి దండము లిచ్చుచు పైకినెత్తుచున్
    మోడిని స్వీకరించనని మొండిగ దీదిని నెన్నబోకెటుల్
    గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్?

    రిప్లయితొలగించండి
  2. ఏడికి బోయెద జముడా
    వేడుక మీరగ వరమని ప్రియుడే బ్రతుకన్
    నేడిట నిలలో సాద్వికి
    గాడిద కాల్పట్ట మోక్ష గతి లభ్యమగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సాధ్వికి' టైపాటు.

      తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    ఆడది శక్తిరా ! యనిన ఆఁ అది ఒట్టిదటంచు బల్కి , వెం...
    టాడితి , చూడు రక్షకభటాలయవాసివి ఐతివిప్డిటుల్
    చూడకు జాలిగా ! యడిగిచూడు క్షమాపణ , తప్పులేదురా !
    గాడిద ! కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  4. కూడకు కుజనుల పొంతకు
    వీడకుమీ సాధుజనుల వెరవెన్నటికిన్
    కూడుట కుజనులకన్నను
    గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్

    రిప్లయితొలగించండి
  5. చూడర పరమాత్మ యునికి
    వీడుచు నీ భోగవాంఛ, వీడుచు నహమున్
    వేడుము భక్తిని ముక్తిన్,
    "గాడిద! కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్"

    రిప్లయితొలగించండి
  6. ( చిలకమర్తివారి "గణపతి"గాడిదస్వారీ చేస్తూ మిత్రులతో )
    ఏడకొ పోయినారుగద !
    యిచ్చట నుండక మీరలందరున్ ;
    జూడుడు నాదువాహనము ;
    సోకుగ గంతుల వేయుచున్నదే !
    యాడుచు బాడుచున్ జదువు
    నంతయు జంకను బెట్టు ; డింక నీ
    గాడిదకాలు బట్టుకొన
    గల్గును మోక్షము తన్నకుండినన్ .
    (విజయవాడ ఆకాశవాణిలో బందావారి దర్శకత్వంలో
    నండూరి సుబ్బారావు , సీతారత్తమ్మలు గణపతిగా
    తల్లి సింగమ్మగా నవలకు ప్రాణం పోశారు )

    రిప్లయితొలగించండి
  7. చేడియతో తగవేలర?
    మూడును నీకు మరణమ్ము భువిపై నా పూ
    బోడి ప్రియసఖుని చేతను
    గాడిద ! కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్

    రిప్లయితొలగించండి
  8. ఆడది శక్తి స్వరూపిణి
    చూ డ కు చులకన గ నామె శోభిత మతి యౌ
    వేడు ము మన్నించు మనుచు
    గాడి ద !కాల్పట్ట్గ మోక్ష గతి లభ్యమగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శక్తి స్వరూపిణి' అన్నపుడు 'క్తి' గురువై గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. ఆడది శక్తి కి రూప గు అని సవరణ చేయడమైనది

      తొలగించండి
  9. వాడికడ నేపనైనను
    రూడిగ కోరు విధముగ జరుగవలె నన్నన్
    వాడుకగ లంచమిడి యా
    గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్

    రిప్లయితొలగించండి
  10. వాడే విష్ణువు మరియున్
    వాడే హరుడును విరించి వాడే కాదే
    వీడుచు వారిని మరియే
    గాడిద కాల్పట్ట మోక్ష గతి లభ్యమగున్?

    రిప్లయితొలగించండి
  11. మూడెను నీ జాతి కిలను
    వేడుము రాముని, విడచుచు వేగమె సీతన్
    వీడుము దురహంకారము
    గాడిద! కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్

    రిప్లయితొలగించండి
  12. పోడిమితో వేడుకొనుము
    నాడెంబగు జీవనమును నయముగ బొందన్
    మూడును దేవుని దూరిన
    గాడిద! కాల్పట్ట మోక్ష గతిలభ్యమగున్!!!

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. కాడే సర్వోత్కృష్ఠుడు
    వేడిన కాపాడు వాని, వెన్నునితా కా
    పాడగ వసుదేవుడికిల
    గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్

    రిప్లయితొలగించండి
  15. మిత్రులందఱకు నమస్సులు!

    [ఎవరితోనూ కలవకుండా, ఒంటరిగా, తనలో తానే మాట్లాడుకొంటూ, సమాజంతో సంబంధం లేకుండా బతుకుతున్న తన తమ్ముని నుద్దేశించి, అన్న ఎవరితోనో మాట్లాడుతున్న సందర్భం]

    "తో డెవఁడేని లేఁడు! తనతో మఱి మాటలనాడువార లీ
    వీడుఁ గవేషణన్ జలుపఁ, బెక్కుఱు లేరయె! యొక్క రిద్దఱో
    కూడఁగ, సంతసానఁ జని, కోరిక తీఱఁగ మాటలాడు! నీ
    గాడిద కాలుఁ బట్టుకొనఁ, గల్గును మోక్షము, తన్నకుండినన్!"
    [ఈ గాడిదకు+ఆలున్+పట్టుకొనన్+కల్గును మోక్షము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'వీడుఁ గవేషణన్'?

      తొలగించండి


  16. చూడుము!పండితోత్తముడ!శోభిలు కీరితి గల్గియున్ననున్

    వేడగ జింత యేల నవివేకుల నల్పుల కార్యసిద్ధికై ?

    వీడి యశంబు గాడిదను వేడిన నా వసుదేవు రీతిగన్

    గాడిద కాలు బట్టుకొన గల్గును మోక్షము తన్నకుండినన్"


    🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
    🌷 వనపర్తి 🌷


    రిప్లయితొలగించండి
  17. వాడుక భాషను సామెత
    చూడగ వింతగు విషయము చోద్యంబగు నే
    గాడిద బల్కిన నెవ్విధి
    గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్

    రిప్లయితొలగించండి


  18. ఆడుట తెలియని నటియే
    చాడీల్ చెప్పుచు పలికెను చక్కగ నేదై
    నా డైరెక్టరనబడెడు
    గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఏదైనా' అనడం వ్యావహారికం.

      తొలగించండి


  19. మేడని నిల్చె దేవుడు సమేతము తల్లియు చూడ రే సుమా
    గోడకు బాదుకొంచు తల కూడ జిలేబియ బొప్పికట్టెనే !
    వేడుట మాని నీశుని హవిస్సుగ గడ్డిని చూపి చట్టనన్
    గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మాని యీశుని' అనండి. మొదటి పాదం కొంత గందరగోళంగా ఉన్నది. అర్థం కాలేదు.

      తొలగించండి
  20. రూథర్ ఫర్డ్ తో అల్లూరి సీతారామరాజు?


    గాడిద గుడ్డని (god, the good) చెప్పుచు
    గీడొనరించ దొరగావు కీటకుడవు పో
    వీడర నీవొక కంచర
    గాడిద, కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్?

    రిప్లయితొలగించండి
  21. మాడుగుల!గురువుపలుకులు
    గాడిదకాల్పట్టమోక్షగతిలభ్యమగున్
    వీడకపట్టుమునీవును
    గాడిదపాదాలనిపుడగలుగునుశమమున్

    రిప్లయితొలగించండి
  22. వాడిగ పలుకగ నేలా
    గాడిద, కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్!
    వీడుము కోపము అమ్మయె
    వేడిగ నీకెన్నొరుచుల ప్రేమగ బెట్టున్!!

    రిప్లయితొలగించండి
  23. ఇద్దరు దొంగల సంభాషణ...
    కుక్క చేయవలసిన పని గాడిద చేయునో యని...

    ఉత్పలమాల
    కూడదు నే ప్రయత్నమని గోప్యముగా నిల నెంచి చౌర్య మి
    వ్వాడను నింట దూర మన పంటయె పండెను సొమ్ము గూరెనే
    వీడని శ్వానమున్ వదిలె బిస్కతు నీయఁగ, నోండ్ర పెట్టు నా
    గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కూడదు + ఏ = కూడదే' అవుతుంది. అక్కడ నుగాగమం రాదు. పద్యంలో కొంత అన్వయక్లేశ మున్నది.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన :

      ఉత్పలమాల
      కూడక రాబడుల్వగచి గోప్యముగా నిల నెంచి చౌర్య మి
      వ్వాడను నింట దూర మన పంటయె పండెను సొమ్ము గూరెనే
      వీడని శ్వానమున్ వదిలె బిస్కతు నీయఁగ, నోండ్ర పెట్టు నా
      గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్!





      తొలగించండి
  24. వేడగ రోగము బోవును
    తోడుగ నిలుచును యడఁకువ తోడుత కొలవన్
    షోడశి శీతల నెక్కెను
    గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిలుచును + అడఁకువ' అన్నపుడు యడాగమం రాదు. "తోడుగను నిలుచు నడఁకువ" అనవచ్చు. 'శీతల నెక్కెను' ?

      తొలగించండి
  25. బీడీ సిగరెట్టు గొనుచు
    పాడగు నలవాట్లవల్ల ప్రల్లదుడౌచున్
    గాడిదల గాయగా నే
    గాడిద కాల్బట్ట మోక్షగతి లభ్యమగు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కూడగ యాత్రజేయగను కోరికమీరగ శీతశైలమున్
      గూఢపు వంపులన్ మిగుల ఘోరపు కోనల మార్గమందునన్
      వేడుచు జేర్చగా దరిని వేసటలేకయె వాహనమ్ముగా
      గాడిద కాలుబట్టుకొన గల్గును మోక్షము తన్నకుండినన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పద్యంలో డ-ఢ ప్రాస వేసారు.

      తొలగించండి
  26. చేడియలన్ కనుంగొనుచు చేయుచు సైగల కన్నుగొట్టుచున్
    దాడులు చేయుచున్ తిరుగ తప్పక కీడు ఘటిల్లు పృథ్విపై
    వేడు క్షమించ మంచు చని పెద్దల ముందర చిత్తశుద్ధితో
    గాడిద! కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్

    రిప్లయితొలగించండి
  27. వేడుక మీఱఁ బరుండఁగ
    నీడ యనంగ మెలఁగంగ నిత్యముఁ బ్రీతిం
    జూడుమ బాలిక బాలుఁడు
    గా డిద కాల్పట్ట మోక్షగతి లభ్య మగున్

    [..గాడు +ఇది+అ = ..గా డిద; కాల్పట్ట: గూఢార్థము భార్య యయితే]


    ఏడ గలండు విష్ణువు మహిం గన నంచును దాను దైవమే
    యీడ చెలంగు రా జని యథేచ్ఛ చరించుచు మించి మెచ్చఁ బూఁ
    బోఁడులు నిచ్ఛ స్వర్ణకశిపుం డనె, దైత్య వరుండు గర్వి రా
    గాడిద, కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్

    [రా గాడిద = రాచ గాడిద]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
      బాలుఁడు కాఁ డను నర్థము గ్రహించుటలోఁ గించిద్దోషము విస్మరించితిని.
      అరసున్న రావలసి యున్న విస్మరించితిని.
      సమస్యా పాదములోని గాడిద లో నరసున్న లేదు కదా. కాని కాఁడు వాడిన నరసున్న కావలెను కదా.
      కాన పూరణ మామోద యోగ్యము కాదని నా బాధ.

      తొలగించండి
    4. నేను అంత నిశితంగా పరిశీలించలేదు.

      తొలగించండి
  28. వేడగ నా వసుదేవుడు
    వీడిన బింకమున ఖరము వెన్కకు మరలన్
    కూడదె జగదానందము!
    గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్!

    రిప్లయితొలగించండి
  29. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గాడిద లెందరో నిలిచి గమ్మున మమ్ముల నెన్నరోయనన్
    నేడిట గాభరా కలిగి నేనిక భీతిల వోటు వేయుటన్
    వేడెద నిన్ను శాస్త్రివర! వేగమె తెల్పు ప్రభాకరుండ! ఏ
    గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్?

    రిప్లయితొలగించండి
  30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  31. గాడిదకాలుబట్టుకొనకల్గునుమోక్షముతన్నకుండినన్
    వీడకయున్నచోపదమువెన్కకుబోర్లగనౌనునట్లుగా
    మాడుననొక్కతాపునిడిమంచిగమోక్షముగల్గజేయుసూ
    వేడుడుమోక్షమున్వలయుపెద్దలుపట్టుడుగార్దభంబునున్

    రిప్లయితొలగించండి
  32. ఏడుపుయెరుగక మంచిగ
    కాడెద్దుగ పనినిజేసి!కర్షకుడిగ యే
    నాడు స్వార్థమెరుగక
    గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఏడుపు నెరుగక... కాడెద్దుల... కర్షకుడుగ నే... స్వార్థ మెరుంగక...' అనండి.

      తొలగించండి
  33. నీడను కూడ నమ్మడవి నీతిని నమ్మిన వాడు తల్లికిన్
    కూడును పెట్టడాతడట కుట్రలు పన్నుటలో ఘనుండెయౌ
    వాడొక చండశాసనుడు వాడిని వేడుట కంటె వీధిలో
    గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్.

    రిప్లయితొలగించండి
  34. గాడిద కాలు నందు నొక గాయము గా నల చాకి, వైద్యునిన్
    వేడె చికిత్సకై, పసుల వెజ్జువు మందును బూయ నిచ్చినన్
    గాడిద బాధ దొల్గుచు సుఖమ్మొనగూరును చాకి వానికిన్
    గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  35. కూడదు దుష్టమానవులఁ గూడిచరించుట, గొప్పవారితో
    వేడుక భాషణల్ జరుప వేగిరపాటును వీడఁ నిమ్మగున్
    వేడగరాదుమూర్ఖులను బేలతనంబుననైన, మారుగా
    గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్

    రిప్లయితొలగించండి
  36. ఉత్పలమాల
    చేడియ వన్నె చిన్నెలకు చిత్తవికారము జెందబోకుడీ
    రూడిగ రుద్రచాపమును ద్రుంచిన శ్రీరఘురాము పాదమల్
    పాడిగ గొల్వ మోక్షము నవశ్యము గల్గును పృథ్వి నెవ్విధిన్
    గాడిదకాలు బట్టుకొన గల్గును మోక్షము తన్నకుండినన్
    ఆకులశివరాజలింంగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  37. వడిగా పనికావలెనన
    గడియ గడియకును ధనమును కానుక నొసగన్
    నడుగగ మామూలిడుచా
    గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్

    రిప్లయితొలగించండి
  38. దోష నివారణార్థము పూరణాంతరము:

    వేడుక నుండును శ్రీహరి
    చూడఁ జరాచర జగతినిఁ జోద్యం బగునే
    యోడకు చతుష్పదం బని
    గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్య మగున్

    రిప్లయితొలగించండి
  39. డా. పిట్టా సత్యనారాయణ
    గాడిని భాట్ట ప్రభాకర("భాట్టప్రభాకరాది గ్రంథంబులు శోధనను బెంచు..".తిరుపతి వేంకటకవులు
    సూడిదముల వలని దృష్టి సోకగ తర్కాల్
    పాడియె?నరవర! సమదృ
    గ్గాడిద కాల్బట్ట మోక్షగతి లభ్యమగున్

    రిప్లయితొలగించండి
  40. డా.పిట్టా సత్యనారాయణ
    పాడియె సర్వ వ్యాపకుని బాడగనే సరిపోదహంకృతిన్
    వీడిన భక్తి చేకురదె వెన్నుని జూడగ సర్వ జీవులం
    దాడిన తేజమున్ గనుము, దౌష్ట్యము కాలిని దాక; తద్ధృతిన్
    గాడిద కాలు బట్టుకొన గల్గును మోక్షము;తన్నకుండినన్

    రిప్లయితొలగించండి