17, మే 2019, శుక్రవారం

సమస్య - 3021 (హింస లేనిచోట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హింస లేనిచోట హితము లేదు"
(లేదా...)
"హింసయె లేనిచో హితము నెట్టులఁ బొందగ వచ్చు నీ ధరన్"
(ఈ సమస్యను పంపిన విట్టుబాబు గారికి ధన్యవాదాలు)

100 కామెంట్‌లు:

  1. క్రీడ యనగ జనులు వేడుక మీరగ
    ప్రాణ హాని జేసి పరవ శించ
    పాప భీతి లేదు పరులను బాధించ
    హింస లేని చోట హితము లేదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పాపభీతి లేని పాపుల బాధించు । హింస లేనిచోట...' అంటే అన్వయం బాగుంటుందేమో?

      తొలగించండి
  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    "పరిత్రాణాయ సాధూనాం"

    హంసల వోలు సాధువుల హాయిని గూర్చుచు రక్ష జేయుటన్
    హింసయె వృత్తియై చెలగు హీనుల నెల్లర చావగొట్టుటన్
    ధ్వంసము జేయగా దలచు దండుగ మాలిన నాకతాయిపై
    హింసయె లేనిచో హితము నెట్టులఁ బొందగ వచ్చు నీ ధరన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      ఏవిధంగా చూసినా ఇది 'సరదా పూరణ' విభాగంలో చేరదు. ఎంతో సీరియస్‍గా వ్రాసిన పూరణ ఇది...
      'పరిత్రాణాయ సాధూనాం...' భావాన్ని సమర్థంగా అనుకరించిన పూరణ ఇది. చాలా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. ఎల్ల జగములు హరి యిల్లుగానెరుగుము
    శుభముగోరుమంచు సూరులనరె
    ఏల యీసడించ యీశుసంతునిల? య
    హింస లేని చోట హితము లేదు

    రిప్లయితొలగించండి
  4. కంసుడు బాలబాలికల గర్కశుడై వధియించు శుద్ధులౌ
    హంసల యోగిపుంగవులనాయసురాళియు గూల్చిధర్మమున్
    హింసకు మేతవేయ సుజనేప్సితమణ్చ జనించు శ్రీశు డే

    "హింసయె లేనిచో హితము నెట్టులఁ బొందగ వచ్చు నీ ధరన్"?

    రిప్లయితొలగించండి
  5. ధ్వంసము జేయుడంచు భరతావని సేనకు నానతీయ వి
    ధ్వంసమొనర్చె మ్లేచ్ఛులగు బాకు నికాయము నుగ్రగహ్వరాల్
    హింసకునాటపట్టులని, యీర్ష్య కబంధుల పీచమణ్చిరా
    హింసయె లేనిచో హితము నెట్టుల బొందగవచ్చు నీధరన్

    రిప్లయితొలగించండి
  6. మానవత ను గల్గి మనుట యే ధర్మం బు
    సర్వ వేళ లందు సమత మమత
    చూప వలయు కాని చోద్యమేమి యు కా ద
    హింస లేని చోట హితము లేదు

    రిప్లయితొలగించండి

  7. శంకరాభరణం 17/05/2019

    సమస్య

    హింసయె లేనిచో హితము నెట్టులఁ బొందగ వచ్చు నీ ధరన్"

    నా పూరణ. ఉ.మా.
    ***** **** ***

    కంసడు రావణాసురుడు కర్కశ రక్కస శ్రేణి ద్రుంచగన్

    హంసల వోలె యుండు సుజనావళి గూల్చెడు వారి జంపగన్

    ధ్వంసము గోరు వారలను దండన జేయగ హింస నెంచుమా!

    హింసయె లేనిచో హితము నెట్టులఁ బొందగ వచ్చు నీ ధరన్"


    🌱 ఆకుల శాంతి భూషణ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతి భూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కంసుడు' టైపాటు. 'కర్కష రక్కస' అనడం దుష్టసమాసం. "కర్కష రాక్షస" అనండి. 'వోలె నుండు' అని ఉండాలి.

      తొలగించండి
  8. హింస పెరిగిపోయి యీదేశమందున
    శాంతియె కరవయ్యె జనులకిపుడు
    ఉగ్రవాదతతుల నిగ్రహించక నేడ
    హింస లేని చోట హితము లేదు

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    ధ్వంసవిధానతత్పరుని భారతశాంతివిరోధి , నిత్యగో...
    మాంసనిషేవణోత్సుకుని ,మారణకృత్యపరాయణున్ ఖలున్
    హంసయనంగ జెల్లునె ? దురాత్ముని పీచమడంచువేళలో
    హింసయె లేనిచో హితము నెట్టులఁ బొందగ వచ్చు నీ ధరన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  10. కామక్రోధలోభ గర్వమోహంబులు
    మదిని నంటుకొనెడి మలినములవి
    మరువకుండి సతము మనసునందున వాటి
    హింస లేనిచోట హితము లేదు

    రిప్లయితొలగించండి
  11. సరదాగా:

    వండుకొనుచునింట వంకాయనే త్రుంచి
    కడుపు నింపుకొనుట కానిపనియ?
    జీవమున్న దాని ఛేదన హింసయా!
    *"హింస లేనిచోట హితము లేదు"*

    రిప్లయితొలగించండి
  12. ( మహారాణి మణికర్ణిక యుద్ధరంగ వీరవిహారం )
    హంసము వంటి రాణి కద !
    హాయిగ పాలన సల్పుచున్నదే !
    అంసమునందు బిడ్డనిడి
    యాంగ్లపు నక్కల జీల్చివైచెనే !
    శంసన జేసినారలదె
    చల్లుచు పువ్వుల భారతీయులే !
    హింసయె లేనిచో హితము
    నెట్టుల బొందగవచ్చు నిద్ధరన్ ?
    ( అంసము - మూపు ; శంసన - ప్రశంస )

    రిప్లయితొలగించండి
  13. మిత్రులందఱకు నమస్సులు!

    హింసను హింసచే గెలువ నెంచియు దైత్యుల రావణాదులన్,
    కంసులఁ జైద్యముఖ్య నర ఘాతుకులందఱ నొంచి, విష్ణుఁడే
    హింసను రూపుమాపి, కరుణించెను శిష్టుల! నిట్లు శౌరిదౌ
    హింసయె లేనిచో, హితము నెట్టులఁ బొందఁగ వచ్చు నీ ధరన్?

    రిప్లయితొలగించండి
  14. హింసయె సూదిమందులిడి యీతనువంతయు కుళ్ళబొడ్చుటన్
    హింసయె చేదుమాత్రలిటులెన్నియొగొంతున మ్రింగబెట్టుటన్
    హింసయె ఛిద్రమౌయెముకనిట్టుల గట్టిగకట్టువేయుటీ
    *"హింసయె లేనిచో హితము నెట్టులఁ బొందగ వచ్చు నీ ధరన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      హితము గూర్చే హింసను భరిస్తూ స్వానుభవానికి పద్యరూప మిచ్చిన మీ పూరణ కరుణరసాత్మకంగా ఉన్నది. స్వస్థతా ప్రాప్తిరస్తు!

      తొలగించండి
  15. ఆటవెలది
    హీంస వృత్తి వీడి యింగ్లీషు వారితో
    రణ మొనర్చె గాంధి రాణమొప్ప
    భరతమాత దాస్య బంధంబు విడె.నెటుల
    హింస లేని చోట హితము లేదు
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శివరాజలింగం గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "బంధంబు విడె నెటుల్" అనండి.

      తొలగించండి
  16. నిదుర పట్టనీక నింపాదిగా జేరి
    కుట్టి రోగ మిచ్చునట్టి *దోమ*
    బ్యాటు విసరి చంప,పాపమా!నేరమా!
    హింస లేని చోట హితము లేదు.

    రిప్లయితొలగించండి
  17. భూమిమీద హింస భూరిగా బెరిగిన
    భూమిభార మణచ మూలమూర్తి
    తానె యవతరించు దనుజుల శిక్షింప
    హింసలేని చోట హితములేదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేమనగారికి నమస్సులతో

      చాకి కోకలుదికి చీకాకు పడవైచి
      మైలదీసి లెస్స మడచినట్లు
      బుద్ధిచెప్పువాడు గుద్ధిననేమయా?
      హింసలేని చోట హితములేదు!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  18. కఠిన జిత్తు తలచు కసిబిసి మదిలోన
    మంచి నెంచి జూడ మహిని రమతి
    శాంతి నెంచు మదిని సతతము నిలలో న
    హింస లేని చోట హితము లేదు!

    రమతి-స్వర్గం; కసిబిసి-ద్వేషం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కఠినచిత్తు డెంచు..." అనండి.

      తొలగించండి

  19. శంకరాభరణం 17/05/2019

    సమస్య

    హింసయె లేనిచో హితము నెట్టులఁ బొందగ వచ్చు నీ ధరన్"

    నా పూరణ. ఉ.మా.
    ***** **** ***
    ధ్వంస మొనర్చి సంస్కృతిని భారత సంపద గొల్లగొట్టుచున్

    హింసయె యాంగ్ల పాలకులు హెచ్చుగ జేసిరి; బాపు వారలన్

    హింసను వీడి ద్రోలెను నహింసను నమ్ముచు;పల్క కివ్విధిన్

    హింసయె లేనిచో హితము నెట్టులఁ బొందగ వచ్చు నీ ధరన్"


    🌱 ఆకుల శాంతి భూషణ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  20. సకల ప్రాణులందు సతతమ్ము జనులంత
    భూతదయనుచూప ప్రీతిగాదె
    విశ్వమందు శాంతి వెల్లివిరియును న
    హింసలేనిచోట హితములేదు!!!

    రిప్లయితొలగించండి
  21. హింసయె లేనిచో పొలము నెట్టుల దున్నగ వచ్చు దెల్పుమా
    హింసయె లేనిచో కొమరుడెట్టుల సన్మతి నొందు గాంచగన్
    హింసయె లేనిచో పచనమెట్టుల జేయగవచ్చు నిత్యమున్
    హింసయె జేయకున్ననిక నెట్టుల మీరది గాలిబీల్చు నా
    హింసయె లేనిచో హితము నెట్టులఁ బొందగ వచ్చు నీ ధరన్

    రిప్లయితొలగించండి


  22. నారద ఉవాచ


    కంస! చంపుమయ్య కరుణయె వలదయ్య
    పిల్లకాయ లనుచు విడువ వలదు
    చచ్చెదవు విడువగ చంపుము చంపుము
    హింస లేనిచోట హితము లేదు!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. సమత మమత గలిగి సామరస్యము తోడ
    మనుగడెచట నుండు మనుజులకును?
    శాంతి సుంత లేని జనసంఘ మందున
    హింస లేనిచోట ; హితము లేదు.

    రిప్లయితొలగించండి
  24. జైశ్రీమన్నారాయణ.
    ఆర్యులకు శుభోదయమ్.
    శంకరాభరణ సమస్య.
    హింసయె లేనిచో హితమునెట్టులఁ బొందఁగ వచ్చునీ ధరన్
    శ్రీమన్నారాయణుని కృపతో
    సమస్యను
    గూఢ పంచమపాదముగా చేసి
    నేను చేసిన పూరణము.
    హింసను మాని సద్గుణమునే భువిఁ బొందఁగ వచ్చు, నెత్తరిన్
    హింసను వీడుచో సుఖమునెన్నుచునందఁగవచ్చు,నీ విధిన్
    హంసయె చూచు నీ హితము నట్టులనుండఁగఁగల్గ సాధనన్ .
    హింసయె లేని భారతము హృద్య లసద్వర భావ మిద్ధరన్.
    జైశ్రీమన్నారాయణ.
    నమస్సులతో
    సద్విధేయుఁడు
    చింతా రామకృష్ణారావు.
    తేదీ. ౧౭ - ౫ - ౨౦౧౯.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చింతా వారూ,
      'చిత్రకవితా సమ్రాట్టు' లనిపించుకున్నారు. అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  25. డా.పిట్టా సత్యనారాయణ
    కూరగాయలందు గుప్పెడు యుప్పున
    బ్రాణ మున్నదనుట భయద వాణి
    శాస్త్రవేత్తయైన జగదీశ బోసుదే!
    హింసలేని చోట హితము లేదు!!

    రిప్లయితొలగించండి
  26. డొ.పిట్టా సత్యనారాయణ
    హంసవె మానవా!యడవి హాయిని సృష్టీని గొప్ప జేయ వి
    ధ్వంసపు గ్రూర జంతువు లవారితమాయె నమాయకుండవై
    కంసుని దిట్టిపోయుదువు కావలె నీ ప్రజ రాజులన్న నే
    హింసయె లేనిచో హితము నెట్టుల బొందగ వచ్చు నీధరన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'గుప్పెడు + ఉప్పు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

      తొలగించండి
  27. కర్మభూమి మనది ధర్మభూమియునిదే
    ధర్మనిరతి పెంచు ధన్యభూమి
    శాంతి తోడ నన్ని సాధ్యమౌ నిచట య
    హింస లేనిచోట హితము లేదు.

    మరొక పూరణ

    మదికి శాంతి కలుగు మహిలోన నెచటన
    హింస లేని చోట;హితము లేదు
    సమత శూన్య మగుచు సతము జగడ మాడ
    ననుచు నరయు మయ్య ననవరతము



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఇచట నహింస...' అనండి.

      తొలగించండి
  28. శాంతి సౌఖ్యములవి చక్కగా కొలువుండు
    హింస లేని చోట; హితము లేదు
    మారణమ్ము తోడ మలగిపోవు జగము
    మంచి పెంచకున్న మనుజులార

    రిప్లయితొలగించండి
  29. విశ్వశాంతిఁజెరచు విభవమ్ముఁజెరచును
    తరచిఁజూడహింస చెరచు సుఖము
    అన్ని సౌఖ్యములకునాలవాలమగు య
    హింసలేనిచోట హితము లేదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణీంద్ర గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..నాలవాలమగు నహింస...' అనండి.

      తొలగించండి
  30. ఆకతా యి పనుల నాచ రించెడు వాని
    హింస లేనిచోట హితము లేదు
    హితము గోరు వారి కెప్పుడు కలుగును
    మంచి భువిని నిజము మాన్య చరిత !

    రిప్లయితొలగించండి
  31. ఆటవెలది
    కత్తి దూసి మీద కసితోటి రగిలెడు
    పరుడు పైన దూకు తరుణమందు
    ఆత్మరక్షణార్థ మవసరమైనంత
    హింస లేనిచోట హితము లేదు

    రిప్లయితొలగించండి
  32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  33. ఎన్ని కలలు గంటి ఎన్ని కలలలోన
    ఓట్లుగొంచు జనమునోగిరమున
    కొరత లేని విధము నరయగ,తప్పక
    హింస లేనిచోట హితము లేదు!!

    రిప్లయితొలగించండి
  34. కంసుని వంటి వారలధి కారము కాంచుచు దొడ్డిదారిలో
    ద్వంసము చేయుచున్ ప్రకృతి పాపపు చెయ్దుల తోడ ముల్లెకై
    హింసను పెంచుచుండ కడు హేయపు బుద్ధిని, వారి వంచగన్
    హింసయె లేనిచో హితము నెట్టులఁ బొందగ వచ్చు నీ ధరన్

    రిప్లయితొలగించండి

  35. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పుంసవనమ్ము త్రాగుచును పూజలు జేసెడి బాపనయ్యరో
    మాంసపు భోజనమ్ము కడు మస్తుగ నుండును; మార్కెటందునన్
    అంసను తెచ్చి పట్టుకొని నల్లరి వద్దని గొంతుకోయుటన్
    హింసయె లేనిచో హితము నెట్టులఁ బొందగ వచ్చు నీ ధరన్?

    పుంసవనము = క్షీరము
    అంస = తెల్లని కోడి పుంజు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  36. సక్రమముగ సాధు జన జీవన మలరఁ
    జేయుటకు నధిపతి సెలఁగ వలయు
    ధాత్రి లోనఁ గ్రూర తర దుష్ట మానవ
    హింస లేని చోట హితము లేదు


    సంసరణమ్ము సేయ వలె సాఁక ధరిత్రిని వన్య వృక్ష వి
    ధ్వంసము మాన వాళికి నపార మొసంగు వినాశమే చుమీ
    మాంసము చేటు మే లగు సమస్త చరా చర జీవ సంచ యా
    హింసయె, లేనిచో, హితము నెట్టులఁ బొందఁగ వచ్చు నీ ధరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  37. వేలు లక్షలాది బేలలమాయక
    జనుల పట్ల హింస జరుపు రాక్ష
    సాధముల ఎడలను సరియయిన ప్రతి
    హింస లేనిచోట హితము లేదు

    వేలు, లక్షల సంఖ్యలో నిస్సహాయులు, అమాయకులు అయిన ప్రజల పట్ల హింసాకాండ సాగించే రాక్షసులైన తీవ్రవాదుల పట్ల అదే స్థాయిలో ప్రతి హింస జరపకపోతే సమాజానికి మేలు జరగదు.

    రిప్లయితొలగించండి
  38. రిప్లయిలు
    1. హింసకు హింసయే తగు నిదే జగదున్నతధర్మమంచు మీ
      మాంసను మానుమా! వినుము మానితమానవ! మాననీయమౌ
      ధ్వంసవిలుప్తభాసురవిధానసమంచితజీవరక్షణా
      హింసయె లేనిచో హితము నెట్టుల బొందగ వచ్చు నీ ధరన్

      కంజర్ల రామాచార్య
      వనస్థలిపురము

      తొలగించండి
    2. రామాచార్య గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  39. హింసయెలేనిచోహితమునెట్టులబొందగవచ్చునీధరన్
    హింసకులేనివస్తువులనెందునుగానముగాదెనెచ్చటన్
    కంసునిమేనమామయగుగృష్ణుడుహింసనుజేసియేగదా
    కంసునిజంపెభీకరముగానని,బొందదెమేలులోకమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గాదె యచ్చటన్' అనండి. కంసుని మేనమామ కృష్ణుడా? "కంసుని మేనయల్లుడగు కృష్ణుడు..." అనండి.

      తొలగించండి
  40. సినిమా కథానాయకుడు శత్రువులతో మీ వీథి కొచ్చా, మీ ఇంటి కొచ్చా.. తేల్చుకుందాం రమ్మను సంధర్భము...

    ఉత్పలమాల
    ధ్వంసము జేసి జీవితము వారసులందరి మట్టుబెట్ట వి
    ధ్వంసము జేయవచ్చి తమ 'వాడ' ను నిల్చితి నింటిముందు మీ
    మాంసము కాకి మూక కిడ, మౌనము వీడుచు రండు రోషులై
    హింసయె లేనిచో హితము నెట్టులఁ బొందగ వచ్చు నీ ధరన్

    (వాడ = వీథి)

    రిప్లయితొలగించండి
  41. ధ్వంసనకుద్యమించిపెడదారుల బోయెడి దుష్ట బుద్ధులన్ 
    హింస యొనర్పపాపమొకొ?హీనులయుద్ధతినాపకున్నచో
    హంసల సాధుపుంగవుల హానిని గూర్చుదురెల్లవేళలన్
    హింసయె లేనిచో హితము నెట్టులఁ బొందగ వచ్చు నీ ధరన్?

    రిప్లయితొలగించండి
  42. వేరుజేయు హంస నీరును పాలును!
    దుష్టశక్తులున్న?దునుముహరియె
    మంచినిలుపగలుగు! వంచనమాన్పె డ
    హింస లేనిచోట హితములేదు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వంచన మాన్పు నహింస...' అనండి. 'మాన్పెడి + అహింస' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
  43. జైశ్రీమన్నారాయణ.
    ఆర్యులకు శుభోదయమ్.
    శంకరాభరణ సమస్య.
    హింసయె లేనిచో హితమునెట్టులఁ బొందఁగ వచ్చునీ ధరన్
    శ్రీమన్నారాయణుని కృపతో
    సమస్యను
    గూఢ పంచమపాదముగా చేసి
    నేను చేసిన పూరణము.
    హింసను మాని సద్గుణమునే భువిఁ బొందఁగ వచ్చు, నెత్తరిన్
    హింసను వీడుచో సుఖమునెన్నుచునందఁగవచ్చు,నీ విధిన్
    హంసయె చూచు నీ హితము నట్టులనుండఁగఁగల్గ సాధనన్ .
    హింసయె లేని భారతము హృద్య లసద్వర వర్ణ మిద్ధరన్.
    జైశ్రీమన్నారాయణ.
    నమస్సులతో
    సద్విధేయుఁడు
    చింతా రామకృష్ణారావు.
    తేదీ. ౧౭ - ౫ - ౨౦౧౯.

    రిప్లయితొలగించండి
  44. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    హింస లేనిచోట హితము లేదు

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    దుష్ట శిక్షణమ్ము తోచు హింసవలెనే...

    కాని యదియు లేక కలదె శాంతి

    సంఘమందు.. ప్రగతి సాధ్యమే! అటువంటి

    హింస లేనిచోట హితము లేదు

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    17.5.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  45. హంసల వోలె హాయిగ విహార మొనర్చెడి స్వేచ్ఛ గల్గునే
    హింసయె లేనిచో; హితము నెట్టులఁ బొందగ వచ్చు నీ ధరన్
    హింసను రేపు ముష్కరులు హేయముగా జన జీవనమ్మునే
    ధ్వంసము జేయుచుండనిటు దారుణ మారణ హోమమందునన్

    రిప్లయితొలగించండి
  46. వంశవినాశనమ్మదియె పౌష్యము జేయగ లేనటంచు తా
    సంశయ మంది యర్జునుడు చంకురమున్ దిగి యస్త్రముల్ విడన్
    కంసవిఘాతి చెప్పెనట కాపురుషాళిని ద్రుంచు వేళలో
    హింసయె లేనిచో హితము నెట్టులఁ బొందగ వచ్చునీ ధరన్.

    రిప్లయితొలగించండి
  47. భక్తి లేని చోట భగవంతుడుండడు
    సౌఖ్యముండ బోదు శాంతి లేక
    నీతి లేని వేళ నిలువదే ధర్మమ
    హింస లేని చోట హితము లేదు

    రిప్లయితొలగించండి