23, మే 2019, గురువారం

సమస్య - 3026 (కలలు కల్లలైన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలలు కల్లలైనఁ గల్గె ముదము"
(లేదా...)
"కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో"

79 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    పలువురు వైరులే గెలిచి పండుగ చేయుచు బీరు త్రాగెడిన్
    కలలవి చూచి నాయకుడు కంపర మొందుచు గుండెబాదగా
    మెలకువ రాగనే తనకు మెండుగ స్వేదము పోయు క్లేశపుం
    కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో

    రిప్లయితొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
    క్లేశపు కలలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    "బీరు త్రాగగా... మెలకువ వచ్చినంతటనె..." అనండి.

    రిప్లయితొలగించండి
  3. ( అభిమన్యుడు పద్మవ్యూహానికి వెళుతూ ఉత్తరతో )
    మిలమిలలాడు కన్నులను
    మెల్లగ జార్చకు నీటిముత్తెముల్ ;
    విలవిలలాడు మానసపు
    వేదన కొంచెము చిక్కబట్టుమా !
    కిలకిలనవ్వుచున్ బనుపు ;
    కేళిగ యుద్ధమొనర్చి వత్తునే !
    కలలవి కల్లలైనపుడు
    కల్గెడి మోద మదెంత గొప్పదో !!

    రిప్లయితొలగించండి





  4. రాత్రి పగలు మదిని రావము గా తొల
    చు తలపులవి ఫలము శూన్యమయ్యె
    విధి విలాసముగ భవితకు పనికిరాని
    కలలు కల్లలైనఁ గల్గె ముదము!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. పీడ కలలవెన్నొ వేదన కలిగింప
    కూడు నిద్ర మాని కుములుచు మది
    కలత చెంది నేను విలపించు నవ్వేళ
    కలలు కల్ల లైనఁ గల్గె ముదము.

    రిప్లయితొలగించండి
  6. సమస్య :-
    "కలలు కల్లలైనఁ గల్గె ముదము"

    *ఆ.వె**

    ఓట్లు గెలిచి పిదప కోట్లు కూడగ బెట్ట
    రాజకీయ వ్యూహ రచన జేసె
    ప్రజలు దెలిసి భంగ పరచ, నాకును వాని
    కలలు కల్ల లైన గల్గె ముదము
    .................‌.....✍చక్రి

    రిప్లయితొలగించండి
  7. కనులు మూసి నంత కరణము లేకుండ
    కయ్య మాడు చుండె గరిత కాళి
    భీతి చెంది నేను బిగుసుకొ నియుండ
    కలలు కల్లలైనఁ గల్గె ముదము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి


  8. మలమల కొందలమ్ములసమానపు రీతిని కర్మ భోగముల్
    సలసల మాడు మూఢములు సవ్యత నవ్యత లేని చింతలున్
    ములముల బోవ గా సరసి, మోహన రాగపు పంక్తి దోచెడా
    కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. తలచి నట్టి దోకటి దైవ మొకటి చే సె
    గుడ్డి లో న మెల్ల కోర్కె తీరె
    జయము పొంది తాను సంబర మందు చు
    కలలు క ల్ల్ల లైన గల్గె ముదము

    రిప్లయితొలగించండి



  10. నా పూరణ. చం.మా.
    ***** **** ***

    కలుషితమైన మానసము గల్గియు నిచ్చిన హామి దప్పుచున్

    పలువిధ యక్రమార్గమున పైకము గోరెడు నాయకుండు తా

    గెలువక నోడె ఘోరమున ;గేలొనరించె ప్రజాళి;వానిదౌ

    కలలవి; కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో

    🌱 ఆకుల శాంతి భూషణ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విధ + అక్రమ' అన్నపుడు సవర్ణ దీర్ఘసంధి వస్తుంది. 'అక్రమమార్గము' అనవలసింది 'అక్రమార్గము' అన్నారు.

      తొలగించండి
  11. Exit poll

    ఆంధ్ర దాష్ట్ర మందు నాశపడి కనిన
    కలలు కల్లలైనఁ ; గల్గె ముదము
    కేంద్ర మందు నేను కేకరించి నటుల
    కుదిరె మిత్రపక్ష కూటమి జితి

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. రాకుమార గారూ,
      మొదటి పూరణ కందంలో చేసారు. సమస్యాపాదం ఆటవెలది.
      రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
    3. తెలతెల వారు చుండగను
      దేహము నిండుగ పట్టె చెమ్మటల్
      మెలకువ వచ్చి చూడగను మేలది తోచెను స్వప్న మంచు నా
      కలతలు పెంచు పీడ కల కారణమా వ్యధకంచు,నిట్టివౌ
      కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో

      తొలగించండి
    4. తెల్లవారుజాము దేహము క్రమ్మెను
      చెమ్మ చలియు లేక చిత్రముగను
      పీడకలన,నిట్లు వేదన పెంచెడు
      కలలు కల్లలైనఁ గల్గె ముదము

      తొలగించండి
    5. 🙏 నిదుర మబ్బు పొరపాట్లు 🙏

      తొలగించండి
  13. ఎన్నికలలుకందురెన్నికలందున
    తామెగెల్తుమంచు తథ్యముగను
    ఎదిరి పార్టివారు ఎన్నికనోడిన
    కలలుకల్లలైన కల్గె ముదము

    రిప్లయితొలగించండి
  14. మైలవరపు వారి పూరణ

    నలుగురు దొంగలొక్కటయి నన్ బెదిరింపనరణ్యమందు నే...
    నలసితి వారితో పెనుగులాడుచు , గట్టిగ పిల్చునంతలో
    మెలకువ వచ్చి గిచ్చుకొని మేనును నవ్వితి., నివ్విధమ్ములౌ
    కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పీడకలతో మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  15. రాజకీయమందు రాటుదేలిన నేత
    చంద్రబాబు నెన్న జనము నేడు
    రాజపీఠమెక్క రంజిల్లెడి జగను
    కలలు కల్లలైన గల్గె ముదము

    రిప్లయితొలగించండి
  16. డా. పిట్టా సత్యనారాయణ
    అస్తమించలేని అర్కుని సాధించు
    బ్రిటిషు వారి స్వప్న భేషజమును
    గాంధి యడచగాదె గర్వ మణగె, నాటి
    కలలు కల్లలైన కలిగె ముదము

    రిప్లయితొలగించండి
  17. మగత నిద్ర వంటి మనిషి జీవితమున
    రేపు నేటి మార్పు రెప్ప పాటు
    కనులు తెరచి నిజముఁ గాంచుట మోక్షమే
    కలలు కల్లలైనఁ గల్గె ముదము..

    రిప్లయితొలగించండి
  18. డా.పిట్టా సత్యనారాయణ
    ఇల బలు యూహలన్ జెలగి యీప్సితముల్ చిగురించ దైవమున్
    బలువిధ కార్యధుర్యుడవె భక్తిని గొల్వగలేవు దైవమున్
    మెలకువ గూర్చ మూలము సమేతముగా బెరికేయ నాశలన్;
    జలరుహనాభుడిచ్చునట జాలము జేయకు మోక్షమబ్బు నీ
    కలలవి కల్లలైనపుడు కల్గెడు మోదమదెంత గొప్పదో!

    రిప్లయితొలగించండి
  19. కన్నవారికైన కావలసిన వారి
    కైన కీడు చేటు గల్గినట్లు
    మనసు క్లేశ మందు మునుచేయు నీ పీడ
    కలలు కల్లలైనఁ గల్గె ముదము ౹౹

    రిప్లయితొలగించండి
  20. భరత మాత యేడ్వ భారమాయెను గుండె
    నిద్ర లేచి జూడ నిజము దెలిసె
    మోడి మరల గెల్వ మోదంబు హెచ్చెగా
    కలలు కల్లలైనఁ గల్గె ముదము!

    రిప్లయితొలగించండి
  21. తెలతెల వారువేళ,నతి తీవ్రమునైనది,వింతయైనదిన్,
    కలచెడునట్టిదైన కల గంటిని, దుష్టుడు కత్తితో ననున్
    కులుకుచు పొత్తలో పొడిచె క్రూరముగా;భయ మంది లేచితిన్;
    కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వింత గొల్పుచున్... పొట్టలో.." అనండి.

      తొలగించండి
  22. ఫలితము దేలెడిన్ దినము పాలనపగ్గము జేకొనంగగన్
    విలువగు సీట్లగోలుపడి వెర్రిగకేకలువేయు దృశ్యమున్
    తెలతెలవారు ఝామున యధీరత బెంచెడురీతి గాంచగా
    కలలవి కల్లలైనపుడు కల్గెడి మోదమదెంత గొప్పదో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...దేలు నీదినము... జేకొనంగ తా... జామున నధీరత..' అనండి. (ఝాము శబ్దాన్ని బ్రౌణ్యం, శ్రీహరి నిఘంటువు పేర్కొన్నా అది సాధురూపం కాదు)

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!

      తొలగించండి
    3. ఫలితము దేలునీదినము పాలనపగ్గము జేకొనంగ తా
      విలువగు సీట్లుగోలుపడి వెర్రిగకేకలువేయు దృశ్యమున్
      తెలతెలవారుజామున నధీరత బెంచెడురీతి గాంచగా
      కలలవి కల్లలైనపుడు కల్గెడి మోదమదెంత గొప్పదో!

      తొలగించండి
  23. చెట్టు పేరు చెప్ప చెల్లున కాయలు
    గాంధి పేరు జెఱచె గాంచగాను
    కాంగి రేసు గెలుపు కాంక్షలన్ని పగటి
    కలలు కల్లలైనఁ గల్గె ముదము

    రిప్లయితొలగించండి
  24. జనుల సేవజేయ జననేత గావలె
    ఎన్ని కలలలోన యెన్నబడిన
    ఎంత పుణ్య మదియ,యేలనిజమగును
    కలలు కల్లలైనఁ గల్గె ముదము!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గంగాప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లోన నెన్నబడిన..' అనండి.

      తొలగించండి
  25. పగలు రాత్రి లేక పదవి కొరకు తాను
    పడిన కష్టమంత వ్యర్థమంచు
    ఫలితములను జూపి భయపెట్టునా పీడ
    కలలు కల్లలైనఁ గల్గె ముదము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కలతలు లేక జీవితము కమ్మగ సాగుచు హాయి నుండగా
      కలవరమౌను కష్టముల గాధలనైనను గాంచినంతనే
      కలలనె యైన గాని నరకంబుగ దోచు భయానకమ్ములౌ
      కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో

      తొలగించండి
    2. సూర్య గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  26. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    రైతు జీవితాన రాళ్లు మిగిలినను
    కూడునిచ్చి మనకు, కుంగిపోక
    తానుపడిన బాధ, తాఁగన్న యా చేదు
    కలలు కల్లలైనఁ గల్గె ముదము

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ముడుంబై ప్రవీణ్ కుమార్

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  27. కలనుగంటినిన్నకాడుజూచినటుల
    కలలుకల్లలైనగల్గెముదము
    కలలుకలలుగానెగాంచుచోగలుగును
    సుఖముమనకునిజముసూర్య!వినుము

    రిప్లయితొలగించండి
  28. ఆటవెలది
    దున్నపోతు రౌతు ద్రుంచిన రీతిగ
    కలను గాంచె రాజు కలత నొందె
    నిద్ర లేచి చూడ నిజమది కలయయ్యె
    కలలు కల్ల లైన గల్గె ముదము
    ఆకుల శివరాజ లింగం వనపర్తి
    ్్

    రిప్లయితొలగించండి
  29. వర్ష ముద్భవంపు భంగి వరము లీయఁ
    గర్షకులకు నెల్ల మర్ష మలరి
    పంట కొఱకు నీయ దొంటి ఋణమ్ములఁ
    గలలు కల్లలైనఁ గల్గె ముదము

    [కల = వడ్డీ]


    నలిన దళాక్షి కైక నిజ నాథుని చావున కయ్యె హేతువే
    యెల పద మెత్తి తన్నె నొక యింతియె యెయ్యది సేయఁ నేర్చుఁ బే
    రలుక సతీ మతల్లి యిలు లందుఁ జెలంగును నుంకు లంచు శం
    క లలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో

    [శంకలు + అలవి; అలవి = కొలఁది; నుంకులు = పస్తులు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  30. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తలపులు మెండుగా మెరిసి తాండవ మాడగ మోహనమ్మునన్
    తలుపులు మూసి నా మదిని తన్నుకు వచ్చెడి కాంక్షనందునన్
    వలపున వంగ రాణినట బాహుల జేర్చుచు పెండ్లియాడెనన్
    కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  31. అంతు లేని వెతల యవినీతి పాలనె
    యంత మయ్యెను గద యెంత సుఖము !
    'తిరిగి గెలుపు మాదె'మరలయనెడి వారి
    కలలు కల్లలైనఁ గల్గె ముదము

    రిప్లయితొలగించండి
  32. కలలనుగందురందఱునుగాఢపునిద్రనుభీతిగొల్పువై
    కలలవికల్లలైనపుడుకల్గెడిమోదమదెంతగొప్పదో
    కలలులనుండుమంచివియుగంటికినింపునుగొల్పునట్టియౌ
    తలపులలోనదాగుచునుదద్దయుహర్షముగల్గజేయుగా

    రిప్లయితొలగించండి
  33. కలలవి యెన్నొరీతులుగ గాంచితి రాతిరి నిద్రయందునన్
    గలవరమాయె మానసము కన్నుల నీరునిండగన్
    మెలకువ వచ్చెనాకపుడు మిథ్యయటంచునెఱంగినంతనే
    కలలవి కల్లలైనపుడు కల్గెడి మోదమదెంత గొప్పదో.

    రిప్లయితొలగించండి

  34. ఈ వారమునకు ఆకాశవాణి సమస్య తెలియ జేయగలరు


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధర్మా చరణము జనులకు దైన్యము పెంచున్ [ ఆకాశ వాణి వారి సమస్య ]

      తొలగించండి
  35. savarimchina pUraNa
    కనులు మూసి నంత కరణము లేకుండ
    కయ్య మాడు చుండె గరిత కాళి
    భీతి చెంది నేను బేజారు పడియుండ
    కలలు కల్లలైనఁ గల్గె ముదము

    రిప్లయితొలగించండి
  36. కేసియార్ ఊహల్లో....

    చంపకమాల
    గెలిచిన స్ఫూర్తితో దనరి కేంద్రమునందున త్రిప్ప చక్రమున్
    గలువగ కేసియార్ మొదట కాదని చెప్పక ముఖ్య నాయకుల్
    నిలువఁగ బాబు వెంటపడి నేరుగ కూటమి యోడ వైరివౌ
    కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో!



    రిప్లయితొలగించండి