1, జూన్ 2019, శనివారం

సమస్య - 3035 (రాముని రాఘవుని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!"
(లేదా...)
"రాముని రాఘవున్ బొగడరా దనిలాత్మజ భక్తితో నిటన్"

90 కామెంట్‌లు:

 1. ఏమని కొలిచెద రాఘవు
  నీమము పాటించ లేని నిర్భాగ్యు నిగా
  భామిని సీతను విడిచిన
  రాముని రాఘవునిఁ బొగడ రాదనిల సుతా

  రిప్లయితొలగించండి
 2. ప్రాతః కాలపు సరదా పూరణ:

  కామము క్రోధమున్ విడుచు కార్యపు సిద్ధికి పూనుకొంచు భల్
  నీమము తప్పకుండగను నీతిని రీతిని నాదరించుచున్
  గోముగ తీర్చకుండనిట గుంభన తోడుత రామకార్యముల్
  రాముని రాఘవున్ బొగడరా దనిలాత్మజ భక్తితో నిటన్

  రిప్లయితొలగించండి
 3. సోముని కాంతిరే కలను సోయగ మందున వెల్గులీ నుచున్
  భామిని సీతనే మురిసి భార్యగ తాళిని గట్టెమో హమున్
  నీమము వీడగా సతిని నేరము లెంచక కానలం దునన్
  రాముని రాఘవున్ బొగడ రాదని లాత్మజ భక్తితో నిటన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొంత అన్వయదోషమున్నది.

   తొలగించండి
 4. రావణుడు హనుమతో.........

  ఏమా కావరమది నీ
  క్షేమంబొల్లని మనుజుని కీర్తించితివే
  సామాన్యుండగు దశరథ
  రాముని రాఘవునిఁ బొగడరాదనిలసుతా!.

  రిప్లయితొలగించండి
 5. (రావణాసురుడు హనుమంతునితో)
  ఆ మునులందరున్ బనుల
  నన్నిటి వీడుచు వందిమాగధుల్
  సోమరిపోతు లట్టులను
  జోద్యముగా వినుతించినారలా
  రాముని గీర్తనల్ సలిపి;
  రాక్షసలోకవిభుండ;నా కడన్
  రాముని;రాఘవున్;బొగడ
  రా దనిలాత్మజ!భక్తితో నిటన్.

  రిప్లయితొలగించండి
 6. నాస్తికుని ఉపదేశం

  కాముడె దైవమౌ మనకు, కారణ జన్ముని, కార్య సిద్ధికిన్
  భామల ప్రేమపొందగను భక్తిగ మొక్కుము కోర్కెతీరగా
  క్షామమె యుండదెన్నడును కాంతల సౌఖ్యము పొంద దృప్తిగా
  రాముని రాఘవున్ బొగడరా దనిలాత్మజ భక్తితో నిటన్!

  రిప్లయితొలగించండి
 7. నీమది తలచున దెవరిని? ;
  నీమము తప్పక కొలుతువు నిరతమ్మేరిన్? ;
  కాముకునెన్నడు జగతిని ;
  రాముని ; రాఘవునిఁ ; బొగడరా దనిలసుతా!
  **)()(**
  (క్రమాలంకారము -ఆంజనేయుడితో యెవరో అన్నారు)

  రిప్లయితొలగించండి
 8. మైలవరపు వారి పూరణ:

  🙏రామభక్తహనుమాన్ కీ జై🙏💐

  రాముని రాఘవున్ బొగడరాదనిలాత్మజ ! భక్తితో నిటన్
  ప్రేమగ రావణాసురు స్మరింపుమటన్న భటున్ ఫెటీలనన్
  వామకరమ్ముతో చరచి , వానిని ముద్దగఁ జేసి , త్రిప్పి , యెం...
  తో ముదమార నాడుకొనితో ! భజరంగబలీ ! ప్రణామముల్ !!

  మైలవరపు మురళీకృష్ణ, వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 9. నామది గెలువంగ నిలువు
  నామమ్ముల్ దిద్దరాదు నమ్మగ నీశున్
  నీమము లెరంగ వలయున్
  రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!"

  రిప్లయితొలగించండి


 10. నీ మానస మందున నా
  రాముని రాఘవునిఁ బొగడ, రాదనిలసుతా
  క్షేమము కానిదదేదియు
  నీముంగట, పొగుడు మయ్య నిండుగ హృదిలో!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. ఏమనుచుంటివి నీవిక
  రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!
  ఏమయెనీరాజునకు
  న్నామహితాత్మజనుబంపెనడవులకేలా!!

  -------యెనిశెట్టి గంగా ప్రసాద్.

  **యాగాశ్వమును విడువుమని రాముని బొగడిన హనుమతో లవ,కుశులాడినమాటల సందర్భము...

  రిప్లయితొలగించండి
 12. శ్రీగురుభ్యోనమః🙏
  లవకుశులు హనుమతో "భార్యను నిర్దాక్షిణ్యముగా అడవులకు బంపిన రాముడిని స్తుతించ రాద"ను సందర్భముగా నాకు దోచిన పూరణము.

  ఈ మెడదన జేర్చి సతి
  క్షేమము వీడి రఘుసుతుడు క్షితిపతి యగునే?
  ఆ మాణవకులు బల్కిరి
  రాముని రాఘవుని బొగడ రాదనిల సుతా!

  మెడద-అడవి;
  మాణవకులు-16 ఏళ్లలోపు బాలురు(కుశలవులు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. యజ్ఞేశ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...జేర్చి సతిని...' అనండి. లేకుంటే గణదోషం.

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. సరి జేసికొందును. సతి- క్షేమ అన్నప్పుడు ముందు పూర్వక్షరం గురువు అగునని భావించి తప్పు వ్రాసాను.
   ధన్యవాదములు🙏

   తొలగించండి

 13. హనుమంతుడు భీముని తో


  రాముని రాఘవున్ బొగడ, రాదనిలాత్మజ, భక్తితో నిటన్,
  క్షేమము కానిదేదియును! క్లేశము నోర్చెడు శక్తి చేర్చు నా
  నామము చేయ గాను భజనల్ మది నిండుగ రామ రామ శ్రీ
  రామ! గుణాభిరామ ! రఘురామ! మహోన్నత రాఘవాయనన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. నీమముగా దన వెనుకనె
  ప్రేమగ దోడై నిలచిన ప్రియ సతి యైనన్
  ఆమెను కానల కంపెను
  రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!

  రిప్లయితొలగించండి
 15. ఏమది కండకావరము హీనగుణాత్ముడు మానవాధమున్
  సోముడు భీముడంచు నిట స్తోత్రము జేయుచు నుంటి వేమిరా!
  క్షేమము గాదు నీకనుచు చెప్పుచు నుంటిని నాదు శత్రువౌ
  రాముని, రాఘవున్ బొగడ రాదనిలాత్మజ భక్తితో నిటన్.

  రిప్లయితొలగించండి
 16. రాముడ? హ! నరుడు! వానర!
  మేమా! సురసేవితులము, మేమధికులమే!
  మాముందా గంతులు? ధిక్!
  *"రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!"*

  ఎస్వీయార్ రావణుడైతే 'ధిక్కారము' లేకపోతే ఎలా!?
  😃🙏🏻

  రిప్లయితొలగించండి
 17. కరణం రాజేశ్వర రావుశనివారం, జూన్ 01, 2019 9:00:00 AM

  గురువుకు వందనాలు

  రిప్లయితొలగించండి
 18. కరణం రాజేశ్వర రావుశనివారం, జూన్ 01, 2019 9:22:00 AM

  నమస్సులు

  రిప్లయితొలగించండి
 19. నీమము మరచిన రాముని
  నామము బలుకఁకు మనసున జాకలి నమ్మెన్
  భూమిజ చూలియు గానని
  రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!

  రిప్లయితొలగించండి
 20. రామునిబొగడగ నేర్వను
  రామునిమదిదలచిసేతురామునిభజనల్
  రామునినిటులనన్యాయమె?
  రామునిరాఘవునిబొగడరాదనిలసుతా!

  రిప్లయితొలగించండి
 21. క్షేమమ జేకూరునుగద
  రాముని రాఘవుని బొగడ,రాదనిలసుతా!
  సామము పనిచేయునపుడు
  భీముడ నేననుచుబల్క భేషజముననన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హనుమంతునితో రావణుడు
   సోముని భానునిన్దిశల శూరుల గెల్చిన రాక్షసేంద్రుడ
   న్నేమరుపాటు లేకనను నేర్పునగొల్చును దిగ్గజేంద్రముల్
   యేమని పోల్చగాదగును హీనపుమానవు రాజ్యహీనునిన్
   రాముని? రాఘవున్ బొగడరా దనిలాత్మజ భక్తితోనిటన్

   రామచంద్రునికి క్షమార్పణలతో

   తొలగించండి
  2. సీతాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో "భేషజమునన్' అనే ఉండాలి.ఒక నకార మెక్కువయింది. అక్కడ "భేషజ మొప్పన్" అనవచ్చు.
   రెండవ పూరణలో '...ఇంద్రముల్ + ఏమని' అన్నపుడు యడాగమం రాదు. "దిక్కరుల్ సదా । యేమని..." అనండి.
   అవి రావణవాక్కులుగా అన్నారు కనుక క్షమార్పణలు అవసరం లేదు.

   తొలగించండి
  3. ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!

   తొలగించండి
 22. ఆ మేఘశ్యాము జన
  క్షేమంకరు మైథిలీశు శేషాహికి నా
  సోమకళాధర విధులకు
  రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!


  రామ నృపాలు ప్రాభవము రక్కసుఁ డిట్లనియెం బ్రహస్తుఁడే
  తా మది నేరకుండ ఘన దర్పుఁడు దుస్సహ భీమ సంగ రో
  ద్దాముఁడు బంధి తేంద్ర సుర దైత్యుఁడు రావణ సమ్ముఖమ్మునన్
  రాముని రాఘవున్ బొగడరా దనిలాత్మజ భక్తితో నిటన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 23. కామముతో నేత్రంబులు
  దా మూసుకొనంగ, నింక దారుణ రీతిన్
  నా మూర్ఖుఁడు వాలిపలికె
  రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా

  రిప్లయితొలగించండి
 24. గోమువ నతిగొప్పగ భృగు
  రాముని , రాఘవునిఁ బొగడరా దనిలసుతా !
  యేమన , జనకుని యానతి
  కేమిషయో తెలియకుండ నేర్పరచిరిగా

  రిప్లయితొలగించండి
 25. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  గోముగ "సాగరమ్ము" నిట గొప్పగు రీతిని శుద్ధిజేయకే
  రూమున హాయిగా వెలిసి రోడ్డు రిపేరులు చేయకుండనే
  నీమము లన్నియున్ విడిచి నిద్దుర పోవగ కల్వకుంటడౌ
  రాముని రాఘవున్ బొగడరా దనిలాత్మజ భక్తితో నిటన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. కల్వకుంటను తలవనిదే నిద్దుర రాదు శాస్త్రి గారికి :)   జిలేబి

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 26. (హనుమతో వాల్మీకి పలికిన రీతిగా..)
  స్వామిని,నీలవర్ణఘనశ్యాముని,నార్తజనావన వ్రతో
  ద్దాముని,సుప్రతీత గుణధాముని,భక్తజనాళి సంస్తుతా
  రాముని,పైన సందియము రాక,మెలుంగగఁబుత్రులిద్దరున్
  రాముని రాఘవున్ బొగడరాద?(అ)నిలాత్మజ భక్తితో నిటన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాకుమార గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఘనశ్యాముని' అన్నపుడు 'న' గురువై గణదోషం.

   తొలగించండి
  2. 'రాద?' అని ప్రశ్నార్థకంగా ఉన్నపుడు సంధి ఉండదు. 'రాద యనిలాత్మజ' అని యడాగమం వస్తుంది.

   తొలగించండి
  3. స్వామీ!నీవొక్కనివే
   ధీమంతుండా రఘుపతి తీరును దెలుప
   న్నీమహి నెవరికి నీవలె
   రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!

   తొలగించండి


 27. పూవుల్ చల్లిన వేదికన్ శుభములే పుష్పింప, పూబోడియున్
  తావుల్దాటుచు ప్రాణనాథుని విధాతై గొల్వ మాంగళ్యమున్
  భావార్థంబుగ చూచి కన్బొమని శ్రీభాగ్యంబుగా నద్దె,తా
  మావుల్ స్వారి సుదీర్ఘ జీవితములో మర్యాద బ్రోవుల్ గనన్!

  రిప్లయితొలగించండి
 28. రాముడుమానవమాత్రుడు
  రాముడుతాఁసాటియగునెరావణుతోడన్
  క్షేమముగాపోదలచిన
  రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!

  రిప్లయితొలగించండి
 29. కరణం రాజేశ్వర రావుశనివారం, జూన్ 01, 2019 1:07:00 PM

  పామరు మాటలు విని యును
  భామ ను కానల బం పె వర గుణు డకటా
  వేమరు దలచు చు నా పో
  రాముని రాఘవుని బొగడ రాదని ల సు తా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కానలకు బంపె' అనండి. లేకుంటే గణదోషం.

   తొలగించండి
 30. రాముని యయాతి గొలుచుచు
  నేమరి పాటున నకృత్యమే సలిపెనుబో
  తామసుడయి జంప దలచు
  రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!

  రిప్లయితొలగించండి
 31. ధామమునుండి నెట్టెగద దారను , తుచ్ఛుని మాటనమ్ముచున్
  నీమము తప్పినట్టి యధినేత యతండని నీవెరుంగవే
  యేమనుకొంటి వీవిపుడు , యేమరు పాటున నుండి జానకీ
  రాముని రాఘవున్ బొగడరా దనిలాత్మజ భక్తితో నిటన్

  రిప్లయితొలగించండి
 32. మిత్రులందఱకు నమస్సులు!

  [అశోకవనవిధ్వంసియైన హనుమంతుడిని మేఘనాదుడు బ్రహ్మాస్త్రమున బంధించి, తన తండ్రి రావణుని యెదుట ప్రవేశపెట్టగా, రామనామ జపం చేస్తున్న ఆ ఆంజనేయుని ఉద్దేశించి రావణుడు పలికిన పలుకులు]

  "రాముని బంటు నే ననుచు, రామ మహీపతి శౌర్యవీర్యయు
  ఙ్నామ మహత్త్వ మీ యెడను నా కిటఁ దెల్పెదె? వెఱ్ఱివాఁడనే?
  వేమఱు నాదు మ్రోలఁ దగఁ బెంపు వహింపఁగ నీదు స్వామియౌ
  రాముని రాఘవున్ బొగడరా దనిలాత్మజ భక్తితో నిటన్!"

  రిప్లయితొలగించండి
 33. ధీమతుడు సుందరుడనుచు
  రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!"*
  వేమరు సభలో నీవని
  తామసమతి తోడ పలికె దశకంఠుడటన్

  రిప్లయితొలగించండి
 34. క్షేమముగా నిను విడిచెద
  సామిగ నన్నున్ దలంచి సాగిల పడినన్
  భీమబలుండగు నాకడ
  రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!

  రిప్లయితొలగించండి
 35. భూమిజ జాడకై వెదకి మూర్ఖుడవై యిట లంకలోని యా
  రామము పాడుజేసితివి రావణు శౌర్యము నెంచ లేక యో
  పామర! ప్రాణభిక్ష గొన ప్రార్థన జేయుము నాకు మ్రొక్కుచున్
  రాముని రాఘవున్ బొగడరా దనిలాత్మజ భక్తితో నిటన్

  రిప్లయితొలగించండి
 36. సవరించిన పూరణ
  సోముని కాంతిరే కలను సోయగ మందున వెల్గులీ నుచున్
  భామిని సీతనే మురిసి భార్యగ తాళిని గట్టెమో హమున్
  నీమము వీడగా సతిని నేరము జూపుచు కానలం పగన్
  రాముని రాఘవున్ బొగడ రాదని లాత్మజ భక్తితో నిటన్

  రిప్లయితొలగించండి
 37. వేసారెన్ తనువంతయున్ శ్రమమునన్, విశ్రాంతిఁ గాంక్షించితిన్,
  ఓసారిత్తరి చేరు పాదయగళం బొత్తన్ సుఖింతున్ సఖీ!,
  నీ సంవాహనమందు తృప్తిఁ గొనెదన్, నీవేల రానంటివే!
  ఓసీ ఉత్పలగంధిరో! యిపుడు నీ వూహూ యనం బాడియే!

  నిన్నటి పూరణ

  రిప్లయితొలగించండి
 38. Dr.Pitta Satyanarayana
  గోముగ గణ తం త్ర మ్ము న
  స్వా మి యు బంటులును లే రు సౌ జన్యమున
  న్నేమి టొ నీ వలె నడ తురు
  రా ము ని రా ఘ వు ని బొ గడ రా ద ని లసు తా!

  రిప్లయితొలగించండి
 39. Dr.Pitta Satyanarayana
  రాము ని మా డ్కి గ న్ పడి నరా లి ని మో సము జే య దూ ర మై రా ము ని గా దు నే న ను ను రం డి యి దే యొక మాయ జూ డ నా
  రా మము ద బ్బ రౌ; ఏ రుక రా వ లె మో క్షము బొంద నన్న నా
  రా ము ని రా ఘవున్ బొగడ రా ద ని లా త్మ జ భ క్తి తో ని టం

  రిప్లయితొలగించండి
 40. DrPitta Satyanarayana
  రా ము నె గాదు పా ల కుల రట్టు ను దే ల్చు సమస్య దొ క్క టా
  సీమల దాట వే లు గను సేకరణoబొనరించ రో జు నీ
  కామిత మే మొ సంకటపు చాలు నే దు ర్కొన, లేవ జో దువై
  క్షేమము నందగా వలెను ఖిన్నుల మమ్మి ట గూర్చ శంకరా!

  రిప్లయితొలగించండి
 41. కందం
  నామము భజియించుచు నా
  రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!
  సేమమరయ లంకననగ
  భూమిని సేమమొసఁగునదె పూజించు మనెన్

  ఉత్పలమాల
  రాముని రాఘవున్ బొగడరా దనిలాత్మజ భక్తితో నిటన్
  సేమము గాదు లంకనన జిక్కగ బట్టుచు రాక్షసాళినిన్
  మీమది రాక్షసత్వమున మేలునెరుంగదు నాశమెంచురా
  రాముని వేడి సీతనిడ రావణు తోడుగ శ్రేయమంచనెన్

  రిప్లయితొలగించండి