ఉల్లము పొంగ దాయె తను వూరికి వచ్చిన నేడ్పు మోముతో చెల్లనికాని వాడు తమ చెంగట వచ్చిన ఖర్చు లెన్నియో కొల్లయు గొట్టు నింటిని నిగూఢత యిద్దియె కారణంబిదే యల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్త మామలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'అల్లారు ముద్దుగ' అనడం సాధువు. 'వెళ్ళగను' అనడం వ్యావహారికం. దాని తర్వాత యడాగమం రాదు. "...దాటి తాను చన నెప్పుడు..." అనండి.
పిల్లల జేరిపెద్ద లటుపెద్దగపండుగ జేయనెంచుచున్ అల్లుని బిల్వబంపిరటుహంగులుహద్దులుదాటునట్లుగన్, అల్లుని రాకలేదననిరాశగ వారలుఖేదమంద నా యల్లుని రాక యున్న,ముదమందగ పండుగ నత్తమామలున్ కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ రంగారెడ్డి
పిల్లల జేరిపెద్ద లటుపెద్దగపండుగ జేయనెంచి తా మల్లుని బిల్వబంపిరటుహంగులుహద్దులుదాటునట్లుగా నల్లుని రాకలేదననిరాశగ వారలుఖేదమంద నా యల్లుని రాక యున్న,ముదమందగ పండుగ నత్తమామలున్ కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ రంగారెడ్డి
కమలాప్త భూ నభో జన రమణీ యార్చిత నితాంత లావణ్యాంగా కమలాప్త భూ నభో జన రమణీ యార్చిత నితాంత లావణ్యాంగా
[కమలాప్త: లక్ష్మీ దేవి చేఁ బొందఁ బడిన వాఁడు, విష్ణుమూర్తి. కమలాప్త : పద్మములకు మిత్రుఁడు, సూర్యుఁడు. లావణ్యాంగా : అందమైన దేహము కలవాఁడా లావణ్యాంగా : సముద్ర జలము (లవణముతోఁ గూడినది) తో నిండిన నోరు కలవాఁడా]
మెల్లన 'కూతు'తో మనసు మెచ్చగ కాపురమందు సంగతుల్ చల్లగ మాటలాడుటకు చక్కని కాలము చేరువయ్యె; సం ధిల్లెను సంతసాన్విత సుదీర్ఘ విలాస విలోల హాస మం చల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్
విరించి
రిప్లయితొలగించండిపిల్లలు పెద్దలెల్లరులు భీతిలు రీతిన కుంభవృష్టియే
పల్లెలఁ బట్టణమ్ములను వాసిగ ముంచగ మెట్టకై జనుల్
ముల్లెలు మూటగట్టుకొని పోయిన వేళను భార్యతో సహా
యల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
పిల్లలు పెళ్ళమున్ విడిచి పెక్కులు రాత్రులు ల్యాబునందునన్
కొల్లలు గ్రంథముల్ చదివి క్రొత్తవి బల్బులు కన్గొనంగ తా
వెళ్ళగ స్టాకుహోమునకు పెళ్ళము తోడను నోబెలందగా
నల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్
క్రొత్తవి బల్బులు = Blue LEDs (Nobel Prize 2014)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
తొలగించండిచెల్లి కుమారుడంచు లలి చెన్నగు కూతురు పాణి నివ్వగా
రిప్లయితొలగించండిప్రల్లదుడైన వాడు కడు బాధలు పెట్టుచు నుండ ముల్లెకై
క్రుళ్ళుచు వచ్చె బిడ్డఁ గొని కొంపకు నేడ్చుచు, కూతు వెంట మే
నల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చెన్నగు బిడ్డను కట్టబెట్టగా' అంటే బాగుంటుందేమో?
నల్లని వాడు సీతహృదినందున నిల్పుచు విక్రమంబుతో
రిప్లయితొలగించండినెల్లర గాచువా డడవి కేగి ఖరాదుల గూల్చెనంచు దా
ముల్లము లందు నా రవికులోద్భవుఁ భద్రము, నున్నతిన్ గనన్
అల్లుడు రాకయున్న, ముదమందిరి పండుగ నత్త మామలున్
యజ్ఞేశ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉత్పలమాల
రిప్లయితొలగించండిఉల్లము రంజిలన్ బఠితులొప్పు కవిత్వము వ్రాయువాడనన్
జెల్లుచు నీ యుగాది 'కవిశేఖరు' డన్ బిరుదందఁ బోవగన్
వెళ్లుచు భార్యనున్ సుతుల వెంటనె పంపి క్షమించు మంచుఁ దా
నల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్త మామలున్!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చూపుల నార్ద్రదృక్కలితశుద్ధకృపారసధార లూర, ను
రిప్లయితొలగించండిద్దీపితవాక్కు తోడ వగఁ దీర్చు యతీంద్రుల తూలనాడుచో
పాపమె దక్కు సుమ్ము , పదవందనముల్ వొనరించువారికిన్
బాపమడంగు సుమ్ము , సులువౌ గద మోక్షపథమ్ము లత్తరిన్.
నినినటి పూరణ
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
పాత కాలం బీరకాయ పీచు సంబంధాలు:
చల్లగ మెల్లగా చనుచు శ్రద్ధను గాంచగ చార్మినారునున్
తల్లిని తండ్రినిన్ ముసలి తాతను పిన్నిని నాయనమ్మనున్
పిల్లలు పాపలన్ గొనుచు పేరిమి కూతురి బావగారి మే
నల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్
ఆటవిడుపుగా చార్మినార్ సందర్శనాకాంక్షతో ముడిపడ్డ మీ పూరణ చాల బాగున్నది. ఆకాశవాణిలో దోరవేటి వారు కూడా మెచ్చుకున్నారు. అభినందనలు.
తొలగించండి🙏🙏🙏
తొలగించండిఅంతా మీ దయ!
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిపిల్లను మాటిమాటికిని పిల్చును తిట్టగనెంచి , వాడు మే...
నల్లుడె, యైన యేమిటికి ? నాకిదిలేదదిలేదటంచు.,! తా..
మెల్లరు వింతఁజూడ పొరుగింటి జనుల్ పరువేమి దక్కునం...
చల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పిల్లను *రాజకాంచన* ను బిల్తురు ముద్దుగ *రాక* యంచు., శో...
తొలగించండిభిల్లగ రంగవల్లికలు వీథుల , గాదెల పంటలెల్ల , రం...
జిల్లగ పిండివంటలను జేసెడి వేడుక భోగినాటికే
అల్లుడు, *రాక* ., యున్న ముదమందిరి పండుగ నత్తమామలున్.!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి.
తొలగించండిపిల్లలు తాతీల్లనుచును
రిప్లయితొలగించండిదల్లులతో గూడి పల్లె తరలియె రాగా
యిల్లే యిరుకైన హరిమ
నల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(పండుగలలో అల్లుని ఖర్చులకు అలసిన అత్తమామలకు అనూహ్యంగా దీపావళికి రాడని తెలిస్తే ఎంత ఆనందమో)
రిప్లయితొలగించండిచిల్లరకొట్టు ఖాత నిక
జీటికిమాటికి బెంపుసేయుచున్ ;
గిల్లుచు భార్యచేయి పడ
గెత్తెడి కోర్కెల బర్వులెత్తుచున్ ;
జిల్లుగ మామగారి జత
జేబుల శూన్యమొనర్చుచుండు నా
యల్లుడు రాకయున్న ముద
మందిరి పండుగ నత్తమామలున్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఇల్లును గుల్లఁ జేసి, దురపిల్లగఁ జేసి, యెడంద నీటలన్
రిప్లయితొలగించండిముల్లులు గ్రుచ్చి, యాత్మజను మూర్ఖుడునై సతతమ్ము హింసతోఁ
దల్లడమొందఁ జేసి, చెడు దారుల నెత్తరి సంచరించు నా
యల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి'ఈటలన్/ఈటెలన్' టైపాటు.
కల్లలు బల్కుచున్ సతము కాసుల కోసము గట్టిగా సతిన్
రిప్లయితొలగించండిప్రల్లదమాడుచుండుచును బట్టుకు రమ్మని కట్నమింకనున్
తల్లడపెట్టు విట్పతియె తప్పక రానను వార్తబంపగా
అల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్త మామలున్!!!
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఉత్పలమాల:
అల్లుఁడుఁగూతురున్ మనుమరాండ్రును వచ్చిరి పర్వమే యనన్
నల్లని చీకటుల్నణచ నర్తన మాడె సుదీప కాంతులే
వెల్లువయైన తారలిట వెన్నెలఁగుర్వగఁబంపి దక్షునిం
టల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్!!
(దక్షునింటల్లుడు =దక్షుని సంతానమైన 27 తారలకు భర్త- చంద్రుడు)
(దీపావళి రోజున అమావాస్య కనుక చంద్రుడు రాలేదనే భావంతో.)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచీకటుల నణచ.. అనడం సాధువు.
ధన్యవాదములు .... సవరించే ప్రయత్నం చేస్తాను
తొలగించండిపిల్లకు పెళ్లి చేసితిరి పిల్లయు నల్లుడు వచ్చినప్పుడే
రిప్లయితొలగించండియుల్లము లుల్లసిల్లు నని యొప్పుగ జెప్పితి రట్టి మాటకా
యల్లుడు సమ్మతించె, నిసుమైనను మోదము కల్గు టెట్లగు
న్నల్లుడు రాకయున్న, ముదమందిరి పండుగ నత్తమామలున్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యాదాలండీ.
తొలగించండి
రిప్లయితొలగించండిపిల్లను మనువాడి కువై
టల్లన వెడల, ఖజ రాన్ తటాల్మని, ససియై
యల్లన యున్న వరమదియె
యల్లుఁడు రాకున్న, మురిసి రత్తయు మామల్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇల్లు గడవని దినంబుల
రిప్లయితొలగించండిపిల్లలు పండుగకు రాగ వెతయగుననుచున్
తల్లడిలుచుండు నప్పుడు
యల్లుడు రాకున్న మురిసి రత్తయు మామల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిజిందగీ మే సబ్ కుచ్ హై సచ్
పిల్లల కాచుకొంచు నెలవీడున డబ్బులు కూడబెట్టుచున్
డొల్లయవంగ భర్తయె కడొత్తుగ నిల్చెను నింట భద్రమై
చల్లగ సాగ జీవితము చాకిరి చేయుచు చేతకత్తెగా!
మెల్లగ లేఖ నంపుచు సమిత్తు సకారణమంచు తెల్పగా
యల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తెల్పగా నల్లుడు...' అనండి.
రిప్లయితొలగించండిఆకాశవాణికి పంపినది :)
వస్తే ఇల్లు గుల్ల !
ఉల్లము పొంగ దాయె తను వూరికి వచ్చిన నేడ్పు మోముతో
చెల్లనికాని వాడు తమ చెంగట వచ్చిన ఖర్చు లెన్నియో
కొల్లయు గొట్టు నింటిని నిగూఢత యిద్దియె కారణంబిదే
యల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్త మామలున్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తను, వూరికి' రెండూ సాధువులు కావు. "పొంగదాయె నత డూరికి..." అనండి.
రాణీపేట జిలేబి గారికి మహాభినందనలహో!
తొలగించండి👏👏👏
అల్లరుముద్దుగ న్పెరిగె నందరు మెచ్చగ తల్లిదండ్రులా
రిప్లయితొలగించండిపిల్లకు నీడుజోడుగని పెండ్లి యొనర్చగ జీవనంబుకై
యెల్లలు దాటి వెళ్ళగను యెప్పుడు జూడగ సెల్లులుండగా
నల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్త మామలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అల్లారు ముద్దుగ' అనడం సాధువు. 'వెళ్ళగను' అనడం వ్యావహారికం. దాని తర్వాత యడాగమం రాదు. "...దాటి తాను చన నెప్పుడు..." అనండి.
Dhanyavaadaalu. Try to rectify my mistakes.
తొలగించండిఅల్లుని కోర్కెలన్ జడిసి యందరిలో నగుబాటు లేలనిన్
రిప్లయితొలగించండిమెల్లగ నప్పు సొప్పులను మేలగు వస్తువులన్ని గూర్చినన్
చిల్లుల బట్టలే మిగిలె చింతిలుచుండగ నింతలోన నా
యల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్త మామలున్
(ఆకాశవాణికి పంపినది)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "నగుబా టటంచు తా మెల్లగ..." అనండి.
పిల్లల జేరిపెద్ద లటుపెద్దగపండుగ జేయనెంచుచున్
రిప్లయితొలగించండిఅల్లుని బిల్వబంపిరటుహంగులుహద్దులుదాటునట్లుగన్,
అల్లుని రాకలేదననిరాశగ వారలుఖేదమంద నా
యల్లుని రాక యున్న,ముదమందగ పండుగ నత్తమామలున్
కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ రంగారెడ్డి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'...జేయనెంచి తా మల్లుని... నట్లుగా నల్లుని..." అనండి.
పిల్లల జేరిపెద్ద లటుపెద్దగపండుగ జేయనెంచి తా
తొలగించండిమల్లుని బిల్వబంపిరటుహంగులుహద్దులుదాటునట్లుగా
నల్లుని రాకలేదననిరాశగ వారలుఖేదమంద నా
యల్లుని రాక యున్న,ముదమందగ పండుగ నత్తమామలున్
కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ రంగారెడ్డి
రిప్లయితొలగించండిఅల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్
ఇల్లుని గుల్లయు జేయుచు
ఇల్లుని తాకట్టు బెట్టిరిట గొప్పకు, యా
ఇల్లరికము వచ్చుననెడి
యల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్
🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'..గొప్పక నా యిల్లరికము.." అనండి.
ధన్యవాదములు 🙏🙏
తొలగించండిఅల్లుడు కాడు పుత్రుడిత డందరి మన్నన పొందినాడు, దుః
రిప్లయితొలగించండిఖిల్లుచు బాధ యెందులకు కృష్ణుడు తమ్ముడు, చెల్లి, బావ, మే
నల్లుడు రాకయున్న, ముదమందిరి పండుగ నత్త మామలున్
అల్లుడు పుత్రి మన్మడికి నాదరమున్ అభిమంత్రణమ్మిడన్ ౹౹
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచివరి పాదంలో రెండు అచ్చులను ప్రయోగించారు విసంధిగా...
సమస్య :-
రిప్లయితొలగించండిఅల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్
*కందం**
ఇల్లును పీకుచు పందిరి
నల్లెడు తంటాలమారి యల్లుని పిలవన్
వెల్లను పరీక్షలనియే
యల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్
............✍చక్రి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
రిప్లయితొలగించండిసమస్యాపూరణ కార్యక్రమంలో...
19/10/2019 శనివారం ప్రసారమైన నా పూరణ..
అల్లుడు రాకయున్న ముదమందును పండుగ నత్తమామకున్...
నా పూరణ.
**** *** ***
( అల్లుడుని పండుగకు పిల్చినా పని వత్తిడి వల్ల రాలేకపోయాడు...)
ఉత్పలమాల:
అల్లుని దల్చరే శని గ్రహమ్మని మేదిన నత్తమామలున్
కొల్లగ గోరి కోరికలు ఘోరపు వేదన లిచ్చి యిల్లునే
గుల్లగ జేయు నాతడును కూరిన కృత్యము చేత రాననెన్
అల్లుడు రాకయున్న ముదమందును పండుగ నత్తమామకున్...
-- ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మేదిని నత్తమామలున్' అనండి.
చిల్లుల జేబుల తోడను
రిప్లయితొలగించండినల్లుని కీయగ మురిపెము నరణము లేకన్ |
పిల్లను నొంటిగ పంపగ
"అల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికల్లలునిత్యమున్బలుకుకాంతునిరోసినగారణంబుగా
రిప్లయితొలగించండినల్లుడురాకయున్నముదమందిరిపండుగనత్తమామలు
న్నల్లునిమాటలన్వినిననాతనిపిల్లలుగూడనేర్చియు
న్గల్లలుమాటలాడుటనుగారణమయ్యదిమోదమౌటకున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచెల్లని కాసని జెప్పిన
రిప్లయితొలగించండిజల్లగ బెండ్లాడ దనయ జామాతయ్యెన్
యిల్లరి కమ్మును గాదని
అల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'జామాత + అయెన్' అన్నపుడు సంధి లేదు. 'అయెన్' అన్నది సాధుప్రయోగం కాదు. "జామాతగ తా నిల్లరికమ్మును..." అందామా?
కల్లలు పల్కుచు క్రూరత
రిప్లయితొలగించండినిల్లాలిని హింస పెట్టి యేడ్పించు చు తాచెల్లని వాడై మెలిగెడి
యల్లుడు రాకున్న మురిసి రత్త యు మామ ల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపల్లెకుబోవలెనటబడి
రిప్లయితొలగించండిపిల్లలకున్వేయవలయువేషములచటన్
మరినేరాననిజెప్పగ
నల్లుడురాకున్నమురిసిరత్తయుమామల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
అల్లుఁడు రాకున్న మురిసి రత్తయు
మామల్
సందర్భము: రాముడు లోక కంటకుడైన రావణుణ్ణి వధించగలుగడం జగదానందకారణం. తమకూ ఆనందం.
అయోధ్యకు రాముడు తిరిగి వచ్చా డంటేనే రేపోమాపో పట్టాభిషేకం జరుగబోతోం దన్నది మరో ఆనంద కారణం.
అందుకని ఇన్నాళ్ళూ అల్లుడూ కూతురూ అనగా రాముడూ సీతా తమవద్దకు రాకపోయినా అత్తా మామలు మురిసిపోయినారు.
(ఇక ముం దెలాగూ రానే వస్తారు.)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"ఎల్లరు వొగడగ రావణు
నల్లన వధియించి, రాము డరిగెను పురికిన్
జల్లగ.." ననిరి మిథిల జను...
లల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
19.10.19
-----------------------------------------------------------
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం.
రిప్లయితొలగించండిఅల్లరియగు మాటలతో
పిల్లగు చేష్ట లనగూడి బెట్టిడ నొప్పన్
వల్లన వలదని తలుచగ
అల్లుడు రాకున్న మురిసి రత్తయు మామల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఒకానొక బావమఱిది పల్కులు:
రిప్లయితొలగించండిఅత్తయు మామల్ : అపార్థ నివార ణార్థమై “మా మలు” గా విఱుపు:
తెల్లంటులు గొని పంపఁగ
వెల్లువగ నుతుల గృహప్రవేశమునకుఁ దా
నుల్ల మలరంగ మామయు,
నల్లుఁడు రాకున్న, మురిసి రత్తయు మా మల్
[తెల్లంటి = బహుమతి; మా మల్ = మా మలు: మా రెండవది]
మల్లన యంబికా వరుఁడు మామకు నప్రియుఁ డైన వాఁడు దా
నొల్లఁడు జన్న మారయ మదోద్ధత దక్షుఁడు పిల్వ కుండినం
గల్లలు పల్క రాదు కద కాంచఁగ మామయె యత్త గాదు లే
యల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్
మీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండికమలాప్త భూ నభో జన
రిప్లయితొలగించండిరమణీ యార్చిత నితాంత లావణ్యాంగా
కమలాప్త భూ నభో జన
రమణీ యార్చిత నితాంత లావణ్యాంగా
[కమలాప్త: లక్ష్మీ దేవి చేఁ బొందఁ బడిన వాఁడు, విష్ణుమూర్తి.
కమలాప్త : పద్మములకు మిత్రుఁడు, సూర్యుఁడు.
లావణ్యాంగా : అందమైన దేహము కలవాఁడా
లావణ్యాంగా : సముద్ర జలము (లవణముతోఁ గూడినది) తో నిండిన నోరు కలవాఁడా]
మనోహరంగా ఉంది.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండివిష్ణువు పరముగా కమలాప్తుడు సమాస విగ్రహ వాక్య మామోద యోగ్యమేనా తెలుపఁ గోరెదను. ఆప్తము= పొందఁ బడినది. ఈ అర్థమును గ్రహించి చేసినది.
ఆమోద యోగ్యమే. మీకా సందేహం ఎందుకు వచ్చింది?
తొలగించండిధన్యవాదములండి. నిర్ధారణమునకు నడిగితిని.
తొలగించండిఅల్లుడు దుండగీడుకడునారడిపెట్టుచునుండునెల్లరన్
రిప్లయితొలగించండిపిల్లనొసంగియాతనికి పెండిలిజేసినయత్తమామలన్
ప్రల్లదనంబుజూపి ప్రతిపంధివలెన్ చరియించు దుష్టుడా
యల్లుడురాకయున్న ముదమందిరి పండుగనత్తమామలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికల్లాకపటంబెరుగడు !
తల్లియు తండ్రి వలె నెపుడు దలచె నతండే!
కల్లయగు సుమీ పల్కగ
నల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్!
పైవారమునకు ఆకాశవాణిసమస్య తెలుపవలె
జిలేబి
తొలగించండి"నవదీపమ్ములవేలకో గృహవితానమ్మందు నీవేళలో"
తొలగించండినెనరుల్స్ పంపినాము
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండి:) పూరణ యింకా ప్రచురించనే లేదు :)
జిలేబి
అల్లుని పెద్ద పుత్రునిగ నాదర ముంచెడి దేశమందునన్
రిప్లయితొలగించండి"అల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్"
చెల్లునె యిట్లనంగ మరిచీదర నొందుదురెల్లరున్ వినన్
బాగుంది. కాని నాల్గవ పాదం?
తొలగించండి
తొలగించండికల్లయె కల్ల కల్ల యె పుకారుల నమ్మకుడీ కవీశ్వరా!
:)
జిలేబి
కందం
రిప్లయితొలగించండిత్రుళ్ళుచు నుగాది దినమున
వెల్లఁగ గవియనఁ బ్రభుత్వ బిరుదందుకొనన్
జెల్లెడు వాడై సుతతో
నల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅల్లుడు విష్ణువంచునె పదాంబుజ క్షాళన మాచరిం చిరే
రిప్లయితొలగించండిఅల్లుని పెద్ద పుత్రునిగ నాదర ముంచెడి దేశమందునన్
"అల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్"
చెల్లునె యిట్లనంగ మరిచీదర నొందుదురెల్లరున్ వినన్
ఆకాశవాణి కి నేను పంపినది
రిప్లయితొలగించండిమెల్లన 'కూతు'తో మనసు మెచ్చగ కాపురమందు సంగతుల్
చల్లగ మాటలాడుటకు చక్కని కాలము చేరువయ్యె; సం
ధిల్లెను సంతసాన్విత సుదీర్ఘ విలాస విలోల హాస మం
చల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్
తేటగీతి
రిప్లయితొలగించండితల్లిరక్తమ్ము క్షీరమ్ము దార వోయు
సాంప్రదాయమ్ము సంస్కృతి సంతతికన
పబ్బు మాదక ద్రవ్యాలు వ్యసనమైన
నమ్మపాలు విషమ్మగు నర్భకులకు