25, అక్టోబర్ 2019, శుక్రవారం

సమస్య - 3172 (వ్యాసుఁడు దెనుఁగున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వ్యాసుఁడు దెనుఁగున రచించె భాగవతమ్మున్"
(లేదా...)
"వ్యాసమహర్షి వ్రాసెనఁట భాగవతమ్మును దెన్గుబాసలో"

88 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    బోసిగ నవ్వు తాత నిట బొత్తిగ రావుర! నాకు విద్యలే!
    వాసిగ తెల్పుమయ్య యిక భారత కావ్యము నేరు వ్రాసిరో!
    వాసిగ పోతనార్యుడట పండుగ జేయుచు నేమివ్రాసెనో?
    వ్యాసమహర్షి వ్రాసెనఁట; భాగవతమ్మును దెన్గుబాసలో!

    రిప్లయితొలగించండి

  2. కంది వారికి,

    బ్లాగు బ్యాక్ గ్రౌండ్ ఎరుపు చదవటానికి వీలుగా లేదు. దయచేసి సరి చేయగలరు ( మా కళ్లు పోనాయి :))


    వ్రాసె మహా భారతమును
    వ్యాసుఁడు, దెనుఁగున రచించె భాగవతమ్మున్
    పూసలు గ్రుచ్చుచు హారపు
    రాసిగ పోతనయె బమ్మెర నివాసముగా !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. వ్రాసెను భారత ము ను కవి
    వ్యాసుడు : దెనుఁగు న భాగవ తమ్ము న్
    వాసిగ బమ్మెర పోతన
    వేసెను తనదై న ముద్ర విఖ్యాతుండై

    రిప్లయితొలగించండి
  4. ( భాగవతాన్ని సంస్కృతంలో వ్యాసమహాముని , తెలుగులో
    పోతనమహాకవి జనహితార్థం వెలయించారు )
    హాసము చిందులాడు నధ
    రాంచలశోభల సర్వలోకముల్
    ధ్యాసను బెట్టి చూచుచును
    ధన్యత నందగ సంస్కృతమ్ములో
    వ్యాసమహర్షి వ్రాసెనట
    భాగవతమ్మును ; దెన్గుబాసలో
    వాసము నోటజేయునటు
    బమ్మెర పోతన వ్రాసె తీయగా .

    రిప్లయితొలగించండి


  5. రాసుల కొద్ది పూసలుగ వ్రాసెను భారత మున్ జిలేబి శ్రీ
    వ్యాసమహర్షి, వ్రాసెనఁట భాగవతమ్మును దెన్గుబాసలో
    వాసిగ పోతనార్యుడు నివాసిగ బమ్మెర నందు చందమై
    దోసిలి తెల్పు వారలకు తోయజలోచన సంస్కృతాంధ్రమున్


    జిలేబి

    రిప్లయితొలగించండి

  6. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కాసిని గూడ నేర్వకయె కమ్మగ పల్కెను శాస్త్రివర్యుడే:
    "వ్యాసమహర్షి వ్రాసెనఁట భాగవతమ్మును దేవభాషలో"
    వాసిగ శంకరాభరణ ప్రాంగణ మందున జేరి నేర్చెనే:
    "వ్యాసమహర్షి వ్రాసెనఁట భాగవతమ్మును దెన్గుబాసలో" 😢

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. కంది సారు ఉవాచ:

      "మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      శంకరాభరణంలో చేరక ముందు కాకరకాయ అన్నవారు చేరాక కీకరకాయ అంటున్నారన్నమాట!"

      😊

      తొలగించండి


    2. :)

      ఇరు గురువుల పరస్పర గుణ దోష రహిత some వాదము :)


      జిలేబి

      తొలగించండి

  7. మైలవరపు వారి పూరణ

    ఏ సిరి కోరబోక, హరినే మదినెంచుచు సేద్యపద్యవి...
    న్యాసము చేసి పోతనమహాకవి., *స్వర్గమునుండి* *మెచ్చగా*
    *నా సురలా సురాధిపుడు నా చతురాస్యుడు , వాణి , యట్టులే*
    *వ్యాసమహర్షి* ., వ్రాసెనఁట భాగవతమ్మును దెన్గుబాసలో!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  8. సరదాగా రాసినది, తప్పులుంటే పెద్దలు మన్నించాలి

    వ్యాసుఁడు దెనుఁగున రచించె భాగవతమ్మున్

    దేశము నెరుగును బమ్మెర
    వ్రాసెనుగ తెనుగున మనకు వాదనలేలన్
    యే సినిమా దెలిపెనురా
    వ్యాసుఁడు దెనుఁగున రచించె భాగవతమ్మున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో సరదా పూరణం 🙏🙏

      వ్యాసుఁడు దెనుఁగున రచించె భాగవతమ్మున్

      కాసులు వేలును లక్షల్
      రాసుల గేసి చదివొచ్చె రాజకుమారా
      ఆశలు వీడె నువు దెలుప
      వ్యాసుఁడు దెనుఁగున రచించె భాగవతమ్మున్

      తొలగించండి
    2. వ్యాసుఁడు దెనుఁగున రచించె భాగవతమ్మున్

      కాశీలోన మునిగినను
      మూసీ ముందు తపమొనగ ముక్కును మూసీ
      ఆశనొదలరా తప్పది,
      వ్యాసుఁడు దెనుఁగున రచించె భాగవతమ్మున్!
      🙏🙏🙏

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో "దేశ మ్మెరుగును పోతన వ్రాసె తెనుగులోన మనకు వాదనలేలా యే..." అనండి.
      రెండవ పూరణలో "రాసులుగా పోసి చదివె రాకుమారుం డాశలు వీడె నిటు దెలుప..." అనండి.
      మూడవ పూరణలో 'మూసీ' అనడం వ్యావహారికం. 'వదలు'ను 'ఒదలు' అనరాదు. "ఆశలు వదలుము తప్పది..." అనవచ్చు.

      తొలగించండి
    4. అన్ని పూరణలు ఇంత ఓపికగా చూసి తప్పులు దిద్దిస్తున్న మీకు నా హృదయ పూర్వక నమస్సుమాంజలి.🙏🙏
      త్వరగా రాసి పోస్ట్ చెయ్యకపోతే మీ పరిశీలనకి నోచుకోవేమో అనే ఖంగారు గోరంత, మిడి మిడి జ్ఞానం కొండంత🙏🙏
      మార్పులు చేసుకొనెదను🙏🙏

      తొలగించండి
  9. వ్రాసెగ పోతన తెనుగున
    వాసిగ భాగవత కథలు వందన మలరన్ |
    దోసమె తెలియక పలుకుట |
    *"వ్యాసుఁడు దెనుఁగున రచించె భాగవతమ్మున్"

    రిప్లయితొలగించండి
  10. నిన్నటి పూరణ.

    అనవరతాన్యచారువదనాంచితతామరసాక్షిసక్తదు
    ర్మననపరైకచిత్తుఁ దునుమాడగఁ దీవ్రతరస్వభావుడై
    యనయము సాధుశీలనిరతార్తిఁ జెలంగు హృదంతనైచ్యదృ
    గ్జనహననైకతత్పరుఁడె సజ్జనుఁడై యశమందు నిద్ధరన్.

    రిప్లయితొలగించండి
  11. ఉ.
    వ్యాసుడు బూనగన్ యడరు భాసుర కీర్తిని పోతనార్యుడే
    బాసను మార్చి వ్రాసెనట భావము దప్పక నెల్ల తావులన్
    భాసిల నిట్లు లోకముల వాసిని బొందగ సాధ్యమే గనన్
    వ్యాస మహర్షి వ్రాసెనట భాగవతమ్మును దెన్గు బాసలో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పూనగన్ + అడరు' అన్నపుడు యడాగమం రాదు. "..బూన నట్లడరు.." అనండి.

      తొలగించండి
  12. ఆ సత్యవతీ సుతుడౌ
    వ్యాసుడు సంస్కృత మునందు భాగవతమ్మున్
    వ్రాసెను, పోతన యిప్పటి
    వ్యాసుఁడు , దెనుఁగున రచించె భాగవతమ్మున్

    రిప్లయితొలగించండి
  13. ఆ సంస్కృతమున భగవాన్
    వ్యాసుఁడు;దెనుఁగున రచించె భాగవతమ్మున్
    నాసాంతమ్మిటు పోతన
    తా సామాజిక భవికము* దలపెను సతతమ్

    *శ్రేయస్సు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భాగవతమ్ము న్నాసాంత...' అనండి. 'సతతమ్' అని హలంతంగా వ్రాయరాదు. "సతమున్" అనండి.

      తొలగించండి
  14. కాసుల కై యాశ పడని
    భాసుర ప్రతిభాన్వితుడగు పండితుడు, భువిన్
    దోసరహితుడౌ యభినవ
    వ్యాసుఁడు దెనుఁగున రచించె భాగవతమ్మున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దోస రహితుడు' అంటే దుష్టసమాసం. "దోష రహితుడు" అనండి. స-ష ప్రాస ఉంది కదా!

      తొలగించండి
  15. తాసంస్కృతమున వ్రాయగ
    వ్వ్యాసుఁడు;దెనుఁగున రచించె భాగవతమ్మున్
    కాసుల నాశింపకయే
    భూసురులందరు బొగడగ పోతన కవియే!

    రిప్లయితొలగించండి
  16. కౌసల్యా సుత రాముని
    దాసుడు పోతన్న భక్తి తనరగ, వ్రాయన్
    భాసురముగ సురభాషన్
    వ్యాసుఁడు, దెనుఁగున రచించె భాగవతమ్మున్.

    రిప్లయితొలగించండి
  17. వ్రాసె పురాణములన్నియు
    వ్యాసుఁడు; దెనుఁగున రచించె భాగవతమ్మున్
    భాసురముగ పద్యములను
    భూసురుడా పోతన తన పుణ్యఫలమ్మై

    రిప్లయితొలగించండి
  18. ఆసన మందున పోతన
    మూసిన గన్నులు, గనుగొనె మూర్తిని! యంతన్
    జేసిన తపముకు మెచ్చెను
    వ్యాసుఁడు, దెనుఁగున రచించె భాగవతమ్మున్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మూర్తిని నంతన్" అనండి. 'తపమునకు' అనడం సాధువు. అక్కడ "తపమును మెచ్చెను" అనండి.

      తొలగించండి
  19. భాసితమౌ భాగవతము
    వ్రాసెను పోతన తెలుగున రమణీ నీవే
    శాసనము గంటివో? యే
    వ్యాసుఁడు దెనుఁగున రచించె భాగవతమ్మున్?

    రిప్లయితొలగించండి
  20. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    వ్యాసుఁడు దెనుఁగున రచించె భాగవతమ్మున్

    సందర్భము: వ్యాస మంటే విరివి లేదా విరివిగా వ్రాయటం.. ఆ విధంగా వ్రాసినవాడు కాబట్టి పోతనయే మన పాలిటి అంటే తెలుగు వారి పాలిటి వ్యాసుడు.
    సంస్కృతం గొప్పగా నేర్చుకొని చదివి అర్థం చేసుకోలేనివారే మనలో ఎక్కువ కాబట్టి వ్యాసుడు సంస్కృతంలో వ్రాసిన పురాణాలతో మనకు పరిచయం తక్కువ. ఎవరైనా వాటిని తెలుగులో అనువదిస్తేనే చదువగలం.
    ఆ సీతాపతియైన రాముడే పలికించినాడు కాబట్టి పోతన అంత విరివిగా వ్రాయగలిగినాడు కాబట్టి అతణ్ణి వ్యాసు డనవచ్చు.
    పలికెడిది భాగవత మట!
    పలికించెడువాడు రామభద్రుం డట! నే
    పలికిన భవహర మగు నట!
    పలికెద వేరొండు గాథ పలుకగ నేలా!
    అన్న భాగవత పద్యం ప్రసిద్ధమే కదా!.
    1.రాముడు పలికించినాడు.
    2.చదివితే భవహర మౌతుంది.
    3.తెలుగులో వుంది.
    ఇవి చాలు.. భాగవతం హాయిగా చదువుకోవడానికి.. చదివితే.. బాగవుతాం..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    వేసము మాత్రము పోతన..

    ఆ సీత పతి పలికింప వ్యాసము దోపన్

    వ్రాసె గనుక మన పాలిటి

    వ్యాసుఁడు.. దెనుఁగున రచించె
    భాగవతమ్మున్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    25.10.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  21. ఉత్పలమాల
    బాసట రామమూర్తియని వాణి భయంబును దీర్చి భక్తితో
    బాసలఁ జేయుచున్ మిగుల భాగ్యమటంచును పోతనార్యుడున్
    ధ్యాసను మోక్షసాధనమునన్ బరిపూర్ణత నిల్పి పూనగన్
    వ్యాసమహర్షి, వ్రాసెనఁట భాగవతమ్మును దెన్గుబాసలో

    రిప్లయితొలగించండి
  22. వాసి గుణాబ్ది చంద్రికయు పంచమ వేద మటంచు చెప్పెడిన్
    భాసురమానమౌ కృతిని భారత మందురు గాదె దానిన్
    వ్యాసమహర్షి వ్రాసెనఁట, భాగవతమ్మును దెన్గు బాసలో
    వ్రాసిన వాడు రాఘవుని భక్తుడు పోతన వాస్తవమ్మిదే.

    రిప్లయితొలగించండి
  23. కూసిన కూతలింక సరి కూయకు మెక్కడ, పల్కిన వదే
    శాసన మందు గాంచి, జయ సంహిత పేరున సంస్కృతమ్ములో
    వ్యాసుడు వ్రాసెనందురె, యవాస్తవ మాటల పల్కనేల యీ
    వ్యాసమహర్షి వ్రాసెనఁట, భాగవతమ్మును దెన్గు బాసలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పల్కినా వదే" టైపాటు. 'అవాస్తవ మాటలు' దుష్టసమాసం. "...యవాస్తవ వాక్కుల" అనండి.

      తొలగించండి
  24. భాసురవాఙ్మయోత్తమముఁ బ్రాక్తననిర్జరదివ్యభారతిన్
    వాసినిఁ గాంచగా బహుళభవ్యపురాణకవిత్వధారలన్
    వ్యాసమహర్షి వ్రాసెనఁట భాగవతమ్మునుఁ, దెన్గుబాసలో
    వ్రాసె విముక్తికై మధురభక్తిసమున్నతపోతనాఖ్యుడే.

    రిప్లయితొలగించండి
  25. అనవరతాన్యచారువదనాంచితతామరసాక్షిసక్తదు
    ర్మననపరైకచిత్తుఁ దునుమాడగఁ దీవ్రతరస్వభావుడై
    యనయము సాధుశీలనిరతార్తిఁ జెలంగ హృదంతనైచ్యదృ
    గ్జనహననైకతత్పరుఁడె సజ్జనుఁడై యశమందు నిద్ధరన్.

    రిప్లయితొలగించండి
  26. వాసము పల్లెటూరు, సహవాసము గిత్తలతో పొలమ్మునన్
    కాసులతో నృపుండిడు సుఖమ్మును కోరడు, భక్తిరాముపై,
    వాసికి నెక్కె నాంధ్ర కవిపండితు లందున, నానవీనమౌ
    వ్యాసమహర్షి వ్రాసెనఁట భాగవతమ్మును దెన్గుబాసలో

    రిప్లయితొలగించండి
  27. వ్యాస కృతము సుందర దర
    హాసాస్య విశుద్ధ బమ్మె రాన్వయ కవియే
    భాసిత సుమహద్విద్వ
    ద్వ్యాసుఁడు దెనుఁగున రచించె భాగవతమ్మున్

    [విద్వత్ + వి +ఆసుడు = విద్వద్వాసుడు: విద్వ త్తను గొప్ప యాసనము కలవాడు; ఆసము = ఆసనము]


    రాస విలోల చిత్త యదు రాట్చరితమ్ము విశుద్ధ మాన సో
    ల్లాస కరమ్ము నర్థ పద లాస్య సుధానిధి సత్కవివ్ర జో
    ద్భాసము భక్తి పోషణము బమ్మెర పోతనయే, నుతించి యా
    వ్యాసమహర్షి, వ్రాసెనఁట భాగవతమ్మును దెన్గుబాసలో

    రిప్లయితొలగించండి
  28. భాసురముగనభినవ శ్రీ
    వ్యాసుఁడు దెనుఁగున రచించె భాగవతమ్మున్
    దోసములెంచగదగునా
    వ్రాసెనుపోతన తెనుగున భాగవతమ్మున్

    రిప్లయితొలగించండి

  29. వ్యాసునిభాగవతంబును
    భాసురముగదెలుగునందుబమ్మెరవ్రాయన్
    వ్యాసుడు ననుటనున్యాయమె
    వ్యాసుడుదెనుగునరచించెభాగవతమ్మున్ ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వ్యాసు డనుట న్యాయమె యే వ్యాసుడు..." అనండి.

      తొలగించండి
  30. వాసిగసంస్కృతంబునిలభాగవతమ్మునుగృష్ణలీలగా
    వ్యాసమహర్షివ్రాసెనట,భాగవతమ్మునుదెన్గుబాసలో
    భాసురమైనరీతినికబమ్మెరపోతనదేటతెల్లమౌ
    బాసనుదియ్యగుండునటువ్రాసినమేటికవీంద్రుడేగదా

    రిప్లయితొలగించండి
  31. వ్రాసెను పంచమవేదము
    వ్యాసుడు;దెనుగున రచించె భాగవతమ్మున్
    కాసుల నాశింపని కవి
    దాసుడు శ్రీరాముని కిల తరియింప జనుల్

    రిప్లయితొలగించండి
  32. వ్రాసిన దెవ్వరంట కురురాజుల పాండవ భారతమ్మునన్
    వాసిగ నేమి జేసె బహుపావనమైనది కార్యమిద్ధరన్
    వ్యాసుని గ్రంథరాజ మనువాదము పోతన చేసెనెందులో
    వ్యాసమహర్షి, వ్రాసెనఁట భాగవతమ్మును, దెన్గుబాసలో౹౹

    రిప్లయితొలగించండి

  33. తెలుగు కవుల తో పోటీ కై వచ్చె :)


    రోసమ్మున తెలుగు కవుల
    తో సరి సాటి తెనిగింప ద్యోతగ వచ్చెన్
    వాసిగ నాపోతనగా
    వ్యాసుఁడు, దెనుఁగున రచించె భాగవతమ్మున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  34. ఆ సంస్కృతమున భగవాన్
    వ్యాసుఁడు;దెనుఁగున రచించె భాగవతమ్ము
    న్నాసాంతమ్మిటు పోతన
    తా సామాజిక భవికము* దలపెను సతమున్.

    *శ్రేయస్సు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...దలచెను ..' అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  35. వ్రాసెనుభాగవతమ్మును
    వ్యాసుడు దెనుగున రచించె భాగవతమ్మున్
    వాసిగ పోతన యనుకవి
    కాసుల కాశింపకుండ ఘనచరితుండై.

    వ్యాసుని భాగవతమ్మును
    చేసిరి పారాయణమును జీవులు జగతిన్
    భాసుర చరితుండభినవ
    వ్యాసుడు దెలుగున రచించె భాగవతమ్మున్

    రిప్లయితొలగించండి


  36. వ్రాసెను పురాణములనిల
    వ్యాసుడు దెలుగున రచించె భాగవతమ్మున్
    వాసిగ మెచ్చిరి ప్రజశహ
    బాసనుచును చేసి సతము పారాయణమున్.


    రిప్లయితొలగించండి
  37. వ్రాసిన కావ్యసంపదలువాసిగడింపను వ్యాకులుండవన్
    జేసిన నారదర్షికృషి జేతను గొప్పగ సంస్కృతమ్మునన్
    వ్యాసమహర్షి వ్రాసెనఁట భాగవతమ్మును; దెన్గుబాసలో
    భూషణమయ్యెనా రచన భూరిగ పోతన వ్రాసినంతనే

    రిప్లయితొలగించండి
  38. కందం
    'బాస'కు మ్రొక్కి త్రిశుద్ధిగఁ
    గాసులకమ్మనని మోక్షకాంక్షాతురుడై
    వాసిగ పోతన 'యభినవ
    వ్యాసుఁడు' దెనుఁగున రచించె భాగవతమ్మున్

    రిప్లయితొలగించండి
  39. కందము:
    వ్రాసెను పంచమ వేదము
    వ్యాసుఁడు; దెనుఁగున రచించె భాగవతమ్మున్
    ఆ సేద్యపు కవి పోతన,
    ఊసులు గావవి జరిగిన యుద్ధపు గాథల్

    రిప్లయితొలగించండి