29, అక్టోబర్ 2019, మంగళవారం

సమస్య - 3176 (భగినీ హస్తాన్నమనిన...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే"
(లేదా...)
"అడలెన్ సోదరుఁ డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుఁడై"

101 కామెంట్‌లు:

  1. మిగిలిన ఆస్తిని కోరుచు

    తగవులు సతతమ్ములాడు

    తననీ దినమున్,

    జగడము లుమాని పిలువన్,

    భగినీ హస్తాన్నమనిన వడకెననుజుడే

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు

    1. "వడఁకెన్ సోదరుఁడారగింపభగినీ హస్తాన్నమున్ భీతుఁడై"

      ...యతి అర్థం కాలేదు సార్!

      తొలగించండి
    2. వృత్త సమస్యాపాదంలో యతిదోషం. మైలవరపు వారు ఫోన్ చేసి చెప్పేవరకు నేను గుర్తించలేదు. ఇప్పుడు సవరించాను. ధన్యవాదాలు.

      తొలగించండి

    3. ప్రాతః కాలపు సరదా పూరణ:

      విడకే ప్రేమను పంచుచున్ వడివడిన్ వీక్షించగా బావనున్
      పడకల్ సర్దుచు పుట్టినింటినను తా బ్రహ్మాండమౌ రీతినిన్
      కడకున్ బంగరు నిండ్లనున్ విడిచి తా కష్టమ్ములే గ్రోలగా
      నడలెన్ సోదరుఁ డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుఁడై...

      తొలగించండి

    4. "వడఁకెన్ సోదరుఁడారగింపభగినీ హస్తాన్నమున్ భీతుఁడై"

      (ఛందోగోపనము)

      నడవన్ జాలని వార్థకమ్ముననునా నల్గొండలో గూడునన్
      తడకల్ మాటున మగ్గమున్ తెరచుచున్ తాదాత్మ్యమౌ ప్రీతినిన్
      చిడియున్ జేసెడి భార్యనున్ కసరుచున్ చేనేతదౌ చీర! వా
      హ్వడఁకెన్ సోదరుఁడారగింపభగినీ హస్తాన్నమున్ భీతుఁడై

      వడఁకు = నూలు తీయు
      భీతుడు = అత్తగారికి భయపడువాడు

      నాల్గవ పాదపు యతిని "జిలేబీయ యతి" అనెదరు

      తొలగించండి
    5. నా కా శ్రమ లేదండి. నేను చూచు దనుక సవరణ తో నే యుండును.
      అయినను నదియును సమస్యా భాగమే కాఁ గలదు. పూరణము యతి మైత్రిని సాధించ వలెను.

      తొలగించండి

    6. కంది సారు: 👇

      "మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇది ఛందో గోపనం కాదు. సమస్యాపాదం పూర్తిగా ఇవ్వబడింది. ఇక ఇక్కడి యతి ప్రసిద్ధమైనదే.. వాహ్ వడకెన్ = వాహ్వడకెన్... సంయుక్తాక్షరమైన హ్వలో హకార వకారాలకు యతి వేయవచ్చు."

      తొలగించండి


  3. జగడాలమారి తిట్టుచు
    సెగలను కక్కుచు నితరుల చెక్కాడెడు జీ
    వి, గరిత వలెన్ కనబడని
    భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే"


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. సరదాగా ఆలిని, సోదరిని దృష్టిలో ఉంచుకుని రాసిన పూరణలు🙏🙏

      రెండవ పూరణము 🙏🙏

      భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే

      ఎగబడి బోవుట తగదని
      తగవుల తో తెలుపు సతిని తప్పించుకు నా
      తెగువను జూపి వెడలు యా
      భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'తగువాడుచు నా, ... వెడలు నా...' అనండి.

      తొలగించండి
    3. ధన్యోస్మి 🙏🙏
      కంది గురువులు చెప్పిన మార్పుతో

      భగ భగ మని కోపముతో
      తగదని సోదరుని తోడ తగువాడుచు నా
      నగలెన్నో కొనవలెనను
      భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే

      :2:
      ఎగబడి బోవుట తగదని
      తగవుల తో తెలుపు సతిని తప్పించుకు నా
      తెగువను జూపి వెడలు నా
      భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే

      తొలగించండి
  5. జగడము లాడుచు నెప్పుడు
    నగరమ్మున తిరుగునట్టి నాయకు రాలౌ
    మగువకు వంటయె రాదని
    భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే

    రిప్లయితొలగించండి


  6. పిడివాదమ్ముల చేయు నెల్లపుడు కుంభీపాకమోయంచుదో
    చెడురీతిన్ కసు బుస్సులాడుచు సదా చెక్కాడుచున్వంటచే
    యు డమాలంచు డుమాలటంచు వెస నయ్యో;విందు నాకేలనో!
    వడఁకెన్ సోదరుఁ డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుఁడై!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. పిడివాదమ్ముల చేయు నెల్లపుడు కుంభీపాకమోయంచుదో
      చెడురీతిన్ కసు బుస్సులాడుచు సదా చెక్కాడుచున్వంటచే
      యు డమాలంచు డుమాలటంచు వెస నయ్యో;విందు నాకేల జి
      హ్వ! డఁకెన్ సోదరుఁ డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుఁడై!


      జిలేబి

      తొలగించండి
  7. నిన్నటి శంకరాభరణము సమస్య
    (కేదారేశ్వరుని నోమఁ గీడొనఁ గూడున్)

    ఇచ్చిన సమస్య పాదము కందము నా పూరణము సీసములో

    పూర్వము ఒకపట్టణమున కడు బీద రాళ్లైన వైశ్య పుత్రికలు భాగ్యవతి, పుణ్యవతి అను యువతులు కలరు. వారు ఒకసారి తండ్రి అనుజ్ఞ తో
    తమ బీదరికమును విస్మరించి భక్తిగా కేదారేశ్వర స్వామి వారి వ్రతము చేసినారు వారి భక్తికి మెచ్చి కేదారేశ్వరుడు రాజ్యమునేలు యువరాజులతో పరిణయ అనుగ్రహము కలిగించినాడు. పుణ్యవతి భర్త కడు మూర్ఖుడు అతడు ఒకనాడు
    తన మందిరములో తన భార్య చేతికి ఉన్న తోరము ఏమిటి అని అడిగాడు దానికి ఆ పుణ్యవతి కేదరేశ్వర స్వామి వారి నోము చేసినట్టి తోరము ఇది మనకు సర్వ సంపదలను ఒసగును అని తెల్పింది. మూర్ఖుడైన ఆ భర్త ఆవిడ మాటలు వినక తనను వశ పరుచు కొనుటకు దుష్ట బుద్ధితో వ్రతములు ఆచరించి తనను నాశనము చేయ దలచినది అని దుర్భాషలు ఆడుచు ఆ పుణ్యవతిని తిట్టుచు ఆ తోరమును తెంపి అగ్నిలో వేస్తాడు అట్టి సందర్భము లోనిది ఈ పూరణము ఇది కేదారేశ్వర వ్రత మహత్యము కధలో చెప్పబడిన ఉదంతము నా కల్పితము కాదు .



    తోరము కట్టిన కారణం బడుగ కే
    దారేశ్వరుని నోము తోరమనచు
    తెలిపితివి, యెవరి దీవెనల్ కోరను ,
    దుష్ట బుద్ధి కలిగి తోరమును ధ
    రించ తగదు నీకు, వంచన తో నోము
    నోయగ నేల?తునుచగ వలయు
    తోరము నిపుడు (కేదారేశ్వరుని నోమఁ
    గీడొనఁ గూడున్), తెగించి యిట్టి

    నోములను గృహమున చేసి నా మనసును
    వశ పరుచు కొన దలచితివా? గడుసరి
    యనుచు నా తోరమును లాగి నగ్ని లోన
    వేసె పుణ్యవతి మగడు రోస పడుచు

    రిప్లయితొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    కార్యాలయములో ఒకగంట అనుమతి గొని దగ్గరలోనున్న సోదరి యింటికి వెళ్లిన ఆధునికుని ఆందోళన...

    దడబుట్టెన్ నియమమ్ములన్ గనగ, వింతౌ పద్ధతిన్ గాంచగా
    మడి బట్టన్ గొని , నేలఁ గూర్చొనుమనెన్, మంత్రప్రపూతమ్ముగా
    నిడె పళ్లెమ్మున వంటకమ్ము, సమయమ్మే లేదు లేదంచు దా...
    నడలెన్ సోదరుఁ డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుఁడై!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి

  9. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పడిగాపుల్ పడి కొంప చేరుచును తా పాటానుచెర్వందునన్
    వడిగా పోవుటకై తయారవుచుతా బంజార హిల్సందునన్
    జడివానల్ వడగళ్లు భాగ్యనగరిన్ ఝాడించి బాధించగా
    నడలెన్ సోదరుఁ డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుఁడై...

    రిప్లయితొలగించండి
  10. తగని పనులను జేయుచు
    మగువగ రాణించ లేని మానిని యగు చు న్
    సుగ తి కి దారులు వె ద క ని
    భగినీ హస్తా న్న మన్న వడ కె నను జు డే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "తగనట్టి పనుల జేయుచు" అనండి.

      తొలగించండి


  11. మొగసాలన పడి యుండెను
    భగినీ! హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే
    పగడమ్ముల వ్యాపారి గ
    డగడన్ ! సున్నితుడయె నితడా సంచరిగా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. తగని మురిపెంబున బెరిగి
    సెగనెరుగని చెల్లెలమ్మ చేయగవంటన్
    వగచుచు నూహించి రుచుల
    భగినీ హస్తాన్నమనిన వడకె ననుజుడే!

    రిప్లయితొలగించండి
  13. అగజవలె మంచి యక్కకు
    మగరాయుడిలా మసలెడి మాలిక తోడన్
    డిగడిగ డుండుం దలచుక
    భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వలె'ను 'లా' అనరాదు. "మగరాయుడి వలె..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు. సరిదిద్దుకొనెదను 🙏

      తొలగించండి
  14. అగచాట్ల పాలయితిగా
    నగలిచ్చెడి బాసచేసి నగుబాటైతిన్
    తగునని యెటులేగెదనని
    భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే

    రిప్లయితొలగించండి
  15. మత్తేభవిక్రీడితము
    సడలెన్ నావగు నోపికల్! గొణుగుడుల్ ఛాదస్తపున్ పోకడుల్
    బడలేనయ్యరొ యత్తమామ! ననెడున్ బత్నీ ప్రకోపమ్ముతోఁ
    బడదోయన్ తలిదండ్రి నాశ్రమమునన్ వాదించ నా చెల్లెలే
    యడలెన్ సోదరుఁ డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుఁడై

    రిప్లయితొలగించండి
  16. (పాకశాస్త్రప్రవీణ కాని సోదరి యింట అన్న పడిన అవస్త )
    ఒడలే వంగదు వంటచేయుటకు నా
    యొయ్యారియౌ చెల్లికిన్ ;
    వడలన్ లడ్డుల బాయసంబు నరిసెల్
    బాద్షా జిలేబీలనే
    యెడ నూహించుచు గంపెడాశలను న
    ట్టింటన్ సుఖాసీనుడై
    యడలెన్ సోదరు డారగింప ; భగినీ
    హస్తాన్నమున్ భీతుడై .
    (ఎడ - గుండె )

    రిప్లయితొలగించండి
  17. నగరపు సంస్కృతి యలవడి
    తగదీ వంటల పని యను తరుణియె పిలువన్
    సగముడికిన కూరల గని
    భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే
    (సరదా ప్రయత్నం - సోదరీమణులను నొప్పిస్తే క్షంతవుడను)

    రిప్లయితొలగించండి
  18. సరదాపూరణ
    (అన్నయ్యకు అంకితం)

    వడలెన్ దేహము జీర్ణశక్తి తగు నభ్యాసంబు దప్పెన్ దినన్
    సడలెన్ దంతపటుత్వమున్ రుచుల నాస్వాదింప జిహ్వాప్తియున్
    కడునాప్యాయత వండివడ్డనిడ శాకాహార మృష్టాన్నము
    న్నడలెన్ సోదరుడారగింప భగినీహస్తాన్నమున్ భీతుడై !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరూ సరదాపూరణలు మొదలు పెట్టారా? అన్నకు తగ్గ చెల్లెలు కదా... ఆ గూటి పక్షే కదా!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

    2. 😊

      శంకరాభరణం సమస్య - 1633

      "ప్రవరుఁడు పాదలేపనము వద్దనె సిద్ధుఁ డొసంగవచ్చినన్"

      నవులుచునుండి బాదముల నాలుగు కోరలు కోలుపోవగా
      చివరవి నాల్గు దంతములు చీకుడు పళ్ళను పీకివేయగా
      చవిగొనలేక యాత్రలను జానువు కీళ్ళను తీపులెచ్చగా
      ప్రవరుఁడు పాదలేపనము వద్దనె సిద్ధుఁ డొసంగవచ్చినన్

      (కంది శంకరయ్య గారి సౌజన్యంతో)




      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా!అన్నయ్య విషయంలో పైపూరణ సత్యము!వారు మాయింట్లో భోజనం చేసి చాల కాలమయినది! ఎప్పుడూ పై సాకులే చెప్పెదరు!నమస్సులు!

      తొలగించండి


  19. భుగభుగ పొగలన్ గ్రక్కుచు
    సెగయెగయ ఘుమఘుమలన్ వశీకరణము చే
    యు గరిమ గలదే యనుచున్
    భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. వడిగా సోదరి యింటికిన్ జనగ నావంతైన యోచింపడే
    సడిగా సోదరి పిల్లలం గలిసి నుత్సాహమ్ము నాడించునే
    జడివానల్ గని జేరగా నెటులనో సాధ్యమ్ముగా దోచకన్
    అడలెన్ సోదరుఁ డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుఁడై

    రిప్లయితొలగించండి


  21. విన్న కోట వారి కోరిక మీర :)



    అగచాట్లన్ పడి చేరగ
    నగరమ్మున, స్విగ్గి స్విగ్గి నాయింటికిరా
    వె! గభాలు తెమ్మ ఫుడ్డన
    భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. మిగుల తనివినిచ్చె నిపుడు
    భగినీ హస్తాన్న మనిన .; వడఁకె ననుజుఁడే
    మగనాలి చూపుకు బెదరి
    గగనమగును ముసళ్ళపండు గ యనుచు తోచన్

    గగనము = దుర్లభము
    ముసళ్ళ పండుగ = కలహాలు

    రిప్లయితొలగించండి
  23. సగ జీతంబు వ్యయం బగు
    దిగి తగుదు ననంగఁ దృప్తిఁ దిని తాఁ జన్నం
    దగునే యీయక ధన మని
    భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే


    వడలున్ బూరెలు పప్పు భోజనమునం బాల్బువ్వ పచ్చళ్ళు న
    ప్పడముల్ గూరలు దప్పలమ్ము పెరుగున్ భవ్యంపుఁ జిత్రాన్నమున్
    విడియమ్ముం బులిహోర లడ్డు లచటన్ విస్తారమై యుండఁగా
    నడలెన్ సోదరుఁ డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుఁడై

    రిప్లయితొలగించండి
  24. వడిగా సోదరి యింటికిన్ జనగ నావంతైన యోచింపకన్
    సడిగా సోదరి పిల్లలం గలిసి నుత్సాహమ్ము నాడించుచున్
    కడుపారంగ భుజింపుమంచు శత భక్ష్యమ్ముల్ ప్రదర్శింపగా
    అడలెన్ సోదరుఁ డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుఁడై

    రిప్లయితొలగించండి
  25. వగలాడిదనముదోడను
    బగలనునికబెంచుచుంటపబ్బముగాగన్
    భగభగలతోడగన్పడు
    భగినీహస్తాన్నమనినవడకెననుజుడే

    రిప్లయితొలగించండి
  26. సరదాగా...

    సడలన్ దాలిమి భార్య చేష్టలకు చిచ్చై బావ చిందేయగా
    వడలన్ మోములు పిల్లవాండ్రు గదిలో వా యంచు వాపోవగా
    వడియాల్ మాడిన కాటుకంపు కటువై వాసాలకున్ బట్టగా
    నడలెన్ సోదరుఁ డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుఁడై.

    రిప్లయితొలగించండి
  27. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    అడలెన్ సోదరుఁ డారగింప భగినీ
    హస్తాన్నమున్ భీతుఁడై

    సందర్భము:
    "కన్యాం దశరథో రాజా
    శాంతాం నామ వ్యజీజనత్౹
    అపత్యకృతికాం రాజ్జే
    రోమపాదాయ తాం దదౌ౹౹
    విభండక సుతః ఋశ్యశృంగః తా ముపయేమే."
    (భవభూతి ఉత్తర రామచరితమ్ నాటకం.)
    శాంత రాముని అక్క. దశరథు డామెను రోమపాదు డనే రాజుకు నిస్సం తగుటచే దత్తత ఇచ్చాడు. విభండక ముని కుమారుడు ఋశ్యశృంగుడు శాంత భర్త.
    లోక కంటకులైన రావణాదులను సంహరించి సీతా లక్ష్మణులతో క్షేమంగా చాలాకాలానికి రాముడు తిరిగివచ్చా డని ఎంతో సంతోషించి శాంత లక్ష్మణునితో సహా విందు భోజనానికి పిలిచింది.
    అంతేకాకుండా చిన్నబుచ్చుకుంటా రని భరత శత్రుఘ్నులనూ పిలిచింది.
    ఐనా భరతుడు మనసు నొచ్చుకున్నాడు. జంకినాడు.
    ఎందుకంటే ఇది సంతోష సమయం. విజయం సాధించిన వాళ్ళు రామ లక్ష్మణులు. వాళ్ళను అడవులకు పంపడానికి కష్టపడడానికి కారకులైన వారు తాను, తన తల్లి. అందువల్ల ఇంతకాలం తమను ఎదురుగా కాకున్నా చాటుకు తిట్టిపోసుకుంటూ వుండి వుంటారు పురజనులూ బంధువులూ.
    చాలా కాలానికి తిరిగి వచ్చారు కాబట్టి రామ లక్ష్మణులను పిలువడంలో సామంజస్యం వుంది. వాళ్ళను పిలిచినందుకు తనను శత్రుఘ్నణ్ణి కూడ ఏదో తప్ప దని పిలిచింది అక్క. అనుకున్నాడు భరతుడు. ఇంత జరిగాక సంతోష సమయంలో పాలుపంచుకోవటం ఏమీ బాగనిపించలేదు.
    అతనిలో అట్టడుగున ఏదో ఆత్మ న్యూనత (గిల్టీ కాన్షియస్ నెస్) వున్నది. కనుక పిలువగానే విందు భోజనానికి చప్పున వెళ్ళలేకపోయాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    కడలిన్ దాటి మహాసురున్ దునిమి లో
    క క్షేమమున్ గూర్చి రా
    ముడు సౌమిత్రిని గూడి వచ్చె ననుచున్
    మోదాన శాంతమ్మయున్
    గుడువన్ విందులు నల్వురిన్ బిలిచె జం
    కో! కైక పుత్రుం డెదో!
    యడలెన్ సోదరుఁ డారగింప భగినీ
    హస్తాన్నమున్ భీతుఁడై

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    29.10.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  28. పళ్ళెం చూసి భయపడిన బ్రదర్

    వడలా కావవి బండరాళ్ళు ప్రభువా పండేను నాపాపమే
    పెడగా నవ్వెను మాడి పూర్ణములు కుంభీపాకమున్ బంపునన్
    ఉడికెన్ నన్నమె యుండలుండలుగ నోహో గుండెలేజారె నం
    *చడలెన్ సోదరుఁ డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుఁడై*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఉడికె నన్నము..' అన్నది సాధుప్రయోగం.

      తొలగించండి
  29. భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే

    వెగటును పుట్టించుచు మన
    పగ వారల్ భయపడు చెడు వంటలు జేయఁన్
    పొగరుగ నిట తినమను నా
    భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే

    🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు ఇచ్చే ప్రోత్సాహముతో ఇది ఈరోజు నా మూడవ పూరణము..
      ధన్యోస్మి 🙏🙏

      తొలగించండి

    2. మూడేనా :)

      ఓ డజనయినా వేయాలండి :)
      పాత హిస్టరీ రికార్డ్ బద్దలు కొట్టాలె :)

      జిలేబి

      తొలగించండి
    3. ఇక్కడ ఉన్న కవి పండితులందరికి హృదయపూర్వక నమస్సులతో .. నేను పద్యములు నేర్చుకుని రాయడం మొదలు పెట్టి కేవలం 46 రోజులు అయ్యింది.. నాకు ఇందరు గొప్పవారి మధ్య పోస్ట్ చెయ్యడమే మహద్భాగ్యం .. అయినా మీరు అడిగారు కనుక 🙏🙏లతో

      ఇందరు నిట కొలువుండగ
      కంది గురువు చూపుచుండ కరుణను నాపై
      పొందగ నే ప్రోత్సాహము
      విందుని యందించ బూను వినయము తోడన్
      🙏🙏

      తొలగించండి
  30. మ. హడలన్ జేయుచుభార్యలిద్దరకటానంగాంగవీరంగమున్
    గొడవుల్ బెట్టుకొనంగసాగుపడతుల్కోపాలనేద్రుంచగన్
    మెడలన్బట్టుచు చావగొట్టరిరువున్బెత్తంబుమొత్తెన్బతిన్
    విడిపుట్టిళ్లకువెళ్లిపోవనకటావీలన్నదేలేకికన్
    అడలెన్ సోదరుఁ డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుఁడై.

    Note : ఇరువురి భార్యల పోరుపడలేక. భార్యలిద్దరు ఎవరికివారు వారి పుట్టింటికి వెళ్లడం మూలాన
    చేసేదిలేక భగినీ హస్తభోజనానికి భయపడి వెళ్ళినాడు అన్న అర్ధంలో .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చావగొట్ట రిరువున్...'?

      తొలగించండి
    2. అంటే అతడు తన భార్యలను చావగొట్టపోగా వారే అతనిని బెత్తంతో బాదారు అని అర్ధం గురువుగారు .

      తొలగించండి
  31. తడివస్త్రాలను వీడబోదెపుడు మంత్రాలే పఠించున్ సదా
    మడితో వంటలు చేయనేమి రుచి యేమాత్రమ్ము లేకుండునే
    వడకున్ బూరికి భేదముండదుకదా పాకమ్ము తాజేయగా
    యడలెన్ సోదరుడారగింప భగినీహస్తాన్నమున్ భీతుడై!

    రిప్లయితొలగించండి
  32. తగలెను జ్వరమని తెలియగ
    వగచెను తమ్ముడు సహజకు వండుట శ్రమనిన్ |
    తగదుగ వ్యాధితొ వండెడి
    "భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. 'వ్యాధితొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.

      తొలగించండి
  33. సుభద్ర ఇంటికి భగినీ హస్తభోజనోత్సవానికి వెళ్లబోయెడు శ్రీకృష్ణ పరమాత్మ అంతరంగం....

    కందం
    నగుమోమున నభిమన్యునిఁ
    దగవందున కావవైతి ధర్మమె యన్నా!
    నగధర! యను నే మోనని
    భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే!

    రిప్లయితొలగించండి
  34. అడలెన్ తల్లి కుమార్తె వంటకుశలం బత్తింట నెట్లుండునో
    కడకేమవ్వునొ యంచు గుండెలదిరెన్ కన్నెత్తి యా తండ్రికే
    అడలెన్ సోదరుఁ డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుఁడై
    వెడలెన్ పుత్రిక వంటవాడు పతితో స్వేచ్చా విహంగంబులా౹౹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవ్వునొ' అన్న ప్రయోగం సాధువు కాదు. "కడ కేమౌనొ యటంచు.." అనండి. వలెను లా అనరాదు. "స్వేచ్ఛా విహంగంబునై/గా" అనండి.

      తొలగించండి
  35. నేటి శంకరాభరణం సమస్య

    అడలెన్ సోదరు డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుడై

    ఇచ్చిన పాదము మత్తేభము

    నాపూరణము సీసములో

    జనకుని సంపదన్ సగభాగ
    మివ్వని
    కారణమున నేను కయ్యమునకు

    కాలు దువ్వితి గదా ,కక్షలు పోయెను ,
    సోదరా! రావలె, మోదమునిడి

    విందుకు ,రమ్ము ఆనందము
    కలుగును ,
    భయము వలదనుచు పలికె గడగ


    డ , నడలెన్ సోదరు డారగింప
    భగినీ
    హస్తాన్నమున్, భీతుడై, నిజమని

    తలచి విందుకు వెడలిన తనకు‌ముప్పు

    ‌కలుగ వచ్చు,నమ్మ గరాదు
    కఠిన మైన

    మనసు గలది నా సోదరి, మార్పు కల్ల

    యని పలికె నొకడు సతితో మనసు విప్పి

    రిప్లయితొలగించండి
  36. అడరన్గోపముసోదరీమణికినాయాసంబుతోనుండగాన్
    నడరెన్సోదరుడారగింపభగినీహస్తాన్నమ్మున్భీతుడై
    కడునాలోచనజేయగాదెలియునెక్కాంతల్సరేతాముగా
    బుడమిన్గోరుదురెల్లవేళలనుదాపుట్టింటీసౌభాగ్యమున్

    రిప్లయితొలగించండి
  37. మగనిని దిట్టెనటంచును
    మగనాలియు నలిగి చేయ మాడిన వంటన్
    వగచుచు తానట గడగడ
    భగినీ హస్తాన్న మనిన వడకె ననుజుడే.

    సగమే యుడికిన యన్నము
    మిగిలిన సాంబారు కలిపి మెల్లగ నిడగా
    దిగుటెటు గళమునటంచును
    భగినీ హస్తాన్న మనిన వడకె ననుజుడే.

    రిప్లయితొలగించండి
  38. కం.
    తగవులు వలదని భ్రాతను
    ఎగ గొట్టక నీ ద్వితీయ యెట్టులనైనన్
    దిగుమన గగనము యేలన
    భగినీ హస్తాన్న మనిన వడకె ననుజుడే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      "భ్రాతను + ఎగగొట్టక, గగనము + ఏలన" అన్నపుడు సంధి నిత్యం.

      తొలగించండి