1, అక్టోబర్ 2019, మంగళవారం

సమస్య - 3149 (నన్నయభట్టు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నన్నయ కవివరుండు తెనాలివాఁడు"
(లేదా...)
"నన్నయభట్టు వాసము తెనాలి యటంద్రు చరిత్రశోధకుల్"

89 కామెంట్‌లు:


 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  చెన్నుగ చేరుచున్ కడలి చెన్నయి నందున శ్రావణమ్మునన్
  పొన్నుగ మెక్కి పొంగలిని బూరెలు గారెలు కజ్జికాయలన్
  పున్నమి రేయినిన్ కుడిచి భూరిగ మద్యము తెల్లవారగా
  నన్నయభట్టు వాసము తెనాలి యటంద్రు చరిత్రశోధకుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
   "భూరిగ మధ్యము గ్రోలి మత్తులో..." అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 2. నన్నయ కవి వరుండు తెనాలి వాడు
  అనగ కొంపలు మునుగున? వసుధ యేక
  కులము అన్న జాతి మనది! కులమతముల
  దాటినపుడె ప్రగతి మనదౌను గాదె?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. కాని ఇక్కడ 'కుల ప్రసక్తి' సరిగా అన్వయించదేమో...

   తొలగించండి
  2. నమస్సులు!
   పోనీ, ఊరు వాడ దాటునపుడె
   అందాము.
   నన్నయ కవి వరుండు తెనాలి వాడు
   అనగ కొంపలు మునుగున? వసుధ యేక
   కులము అన్న జాతి మనది! ఊరు వాడ
   దాటినపుడె ప్రగతి మనదౌను గాదె?

   తొలగించండి
 3. నన్నయ కవివరుండు తెనాలివాఁడు
  కాదు రాజనరేంద్రుని కాలమందు
  నాత డాస్థాన కవిగాదె, యాది కవియు
  శబ్ద శాసనుడీతడే జగతి యందు

  రిప్లయితొలగించండి
 4. చెన్నుగా శారదాంబ ప్రసిద్ధిచెందు
  నెట్టి చోటైనఁగాని మరెప్పుడైన
  కట్టుబాటుకు పెద్దలు కారు వశులు
  నన్నయ కవివరుండు తెనాలి వాడు?

  రిప్లయితొలగించండి
 5. మైలవరపు వారి పూరణ

  శంకరాభరణం.. సమస్యాపూరణం..

  నన్నయభట్టు వాసము తెనాలి యటంద్రు చరిత్రశోధకుల్ !!

  ఎన్నని ఎన్ననౌదును కవీ ! మన హైందవజాతి సంస్కృతిన్
  ఛిన్నము జేయ వ్రాసిరి విచిత్రముగాగ చరిత్ర ., సర్వలో...
  కోన్నతధాత్రి భారతమహో ! ఇల నమ్మెడి వారలున్నచో
  నన్నయభట్టు వాసము తెనాలి యటంద్రు చరిత్రశోధకుల్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 6. (ఆదికవి నన్నయ్య - వికటకవి రామకృష్ణయ్య)
  అన్నయవంటి యాదికవి
  కంచితరాజమహేంద్రమే కదా
  నన్నయభట్టు వాసము ; తె
  నాలి యటండ్రు చరిత్రశోధకుల్
  సన్నుతిపాత్రుడౌ వికట
  సాహితిచంద్రుడు రామకృష్ణుడే
  మిన్నగ గృష్ణరాయసభ
  మిన్నును దాకిన కీర్తిశాలికిన్ .

  రిప్లయితొలగించండి
 7. ఆదికవిగాను మన్నన లందుకొనుచు
  శబ్ద శాసనుడై వెల్గె జగతి యందు
  నన్నయ కవివరుండు, తెనాలి వాడు
  వికట కవియంచు నెఱగుమో విమలులార

  రిప్లయితొలగించండి
 8. నన్నయ లేడటంచు విన, ' నాదియు నీది తెనాలి ' యన్నటుల్
  మిన్నుగ స్వాభిమానముల మేయములై తగి, ప్రాంతభాషలన్
  తన్నుక చచ్చు వాడొకడు తప్పుడు కూతల వాగె నిట్లుగన్
  నన్నయభట్టు వాసము తెనాలి యటంద్రు చరిత్రశోధకుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   మీ పూరణ మనోరంజకమై ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 9. పెన్నును చేతబట్టినిక పేలెనవాకుచవాకులెన్నియో
  ఎన్నగవానితీరుగన యేలెను వాడిని మద్యపానమే
  సన్నుతమైన యాదికవిసఖ్యముజేసెనువాడిలొపిచ్చికూతగా
  "నన్నయభట్టు వాసముతెనాలియటంద్రు చరిత్ర శోధకుల్".

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రావెల వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "చేతబట్టి యిక ప్రేలె... తీరుగన నేలెను" అనండి. మూడవ పాదంలో గణదోషం. "సఖ్యము జేయగ పిచ్చికూతగా..." అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
 10. సమస్య :-
  నన్నయ కవివరుండు తెనాలి వాడు

  *తే.గీ**

  రాజరాజనరేంద్రుడు మోజు పడగ
  భారతమ్మును రచియించె భక్తి మీర
  నన్నయ కవివరుండు; తెనాలి వాడు
  చదివి గ్రహించె యందలి సారమెల్ల
  ......................✍చక్రి

  రిప్లయితొలగించండి
 11. సొంతయూరన్నమమకారమెంతయుగల
  వదరుబోతొకనాడుతా మదిర గ్రోలి
  యిచ్చవచ్చిన తీరుగా నిట్టులనియె
  "నన్నయ కవివరుండు తెనాలివాఁడు"

  రిప్లయితొలగించండి

 12. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  మిన్నని రైటువారులును మిక్కిలి క్రుద్ధులు లెఫ్టువారు భల్
  తన్నుకు చచ్చుచున్ మిగుల తర్జన భర్జన చేసి దిల్లినిన్
  కన్నులు మూయుచున్ మనవి, కాకుల వోలెను కూయురిట్టులన్:
  "నన్నయభట్టు వాసము తెనాలి యటంద్రు చరిత్రశోధకుల్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   "కూయురు' అన్న ప్రయోగం సాధువు కాదు. "కూయ నిట్టులన్" అంటే సరి!

   తొలగించండి
 13. ఆది పర్వమును లిఖించి నాది కవిగ

  వినుతి పొందె నెవరు ,ఘన వికట కవిగ

  పేరు గల రామకృష్ణుడే యూరు వాడు,

  నన్నయ కవి వరుండు,తెనాలి వాడె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
   "లిఖించి యాదికవిగ..." అనండి.

   తొలగించండి


 14. అన్నమాచార్యుల కొటిక అరిసివిల్లి
  నన్నయ కవివరుండు తెనాలివాఁడు
  తిక్కనార్యుల ఖేటము తిరుపతియగు
  ప్రగడ వారి పల్లె జిలేబి ఫ్రాంకుఫర్టు !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 15. ఆది కవి యని పేరొంది యలరి తాను
  వాస మొందె రాజ మ హేంద్ర వర ము నందు
  నన్న య కవి వరుo డు తెనా లి వాడు
  కాదని తెలియు నాంధ్ర కు ఖఛ్చి త ము గ

  రిప్లయితొలగించండి


 16. ఎన్నగ భారతమ్మును నరేంద్రుని కై తెనిగించె నాంధ్రుడా
  నన్నయభట్టు! వాసము తెనాలి యటంద్రు చరిత్రశోధకుల్
  మిన్నగ రామకృష్ణునికి! మేవడి కల్గిన వారి కుప్పముల్
  పన్నుగ నేదియైన సఖి వాసురమంతయు వారిదే సుమా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. గురువు గారికి నమస్సులు
  ఆంధ్ర భారత భావశబ్దాది గణుడు
  నన్నయ కవి వరుండు ,తెనాలి వాడు
  తేటతెలుగుల వెలుగుకు తేజ మిచ్చు
  మాతృభాష కిదియుఁ నట మమత మూట.

  రిప్లయితొలగించండి

 18. ... శంకరాభరణం... . 01/10/2019 ......మంగళవారం

  సమస్య:

  "నన్నయభట్టు వాసము తెనాలి యటంద్రు చరిత్రశోధకుల్

  నా పూరణ.
  ***** ***

  నన్నయభట్టు వాసము తెనాలి యటంద్రు చరిత్రశోధకుల్

  నన్ను వచింప మన్న మరి న్యాయము జెప్పెద శబ్ధశాసనుం

  డన్నను నన్ని ప్రాంతముల కాయన చెందును దెల్గునేలలో...

  సన్నుతి జేయ వచ్చెదరు చక్కటి యాతని ఖ్యాతి నందరున్

  ఎన్నగ గొప్పవా రెపుడు నే యొక ప్రాంతపు వాసు లౌదురే??


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
 19. ఎవరు ఏఊరివారైన నేమి మనకు
  ఆది కవి యయ్యివెలిగెను నాంధ్రమందు
  నన్నయ కవివరుండు, తెనాలివాఁడు
  రామకృష్ణునే యెరుగరా రసికులార!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదాన్ని "ఆదికవిగ వెలింగినా డాంధ్రమందు" అంటే బాగుంటుంది.

   తొలగించండి
 20. పెద్దసన్మానమతనికి ప్రియముతోడ
  జేసినారుగ కవిగాను వాసికెక్క
  పొగడియిచ్చిరి బిరుదమ్ముపో "యభినవ
  నన్నయ"- కవివరుండు తెనాలివాఁడు.

  రిప్లయితొలగించండి
 21. ఉత్పలమాల
  మిన్నగ మెచ్చిరేని ప్రజ మేదిని వానిని గర్వకారణం
  బెన్నుచుఁ బ్రాంతమున్ గులము నేర్పడఁ జెప్పరె సొంతవాడనన్
  మున్నును పోతనన్ గనిరె పోరుచు బమ్మెర నొంటిమిట్టలన్
  నన్నయభట్టు వాసము తెనాలి యటంద్రు చరిత్రశోధకుల్

  రిప్లయితొలగించండి
 22. తిన్నపదార్ధమేదొవికటించగ వెర్రిగ వెంగళుండనెన్
  నన్నయభట్టు వాసము తెనాలి యటంద్రు చరిత్రశోధకుల్,
  చెన్నపురంబునం గడిపె చిన్నతనంబును ట్రంపనంచనున్
  చిన్నయసూరియే తనదు చిన్నతనంబున మిత్రుడేయనున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ట్రంపటంచు నా । చిన్నయసూరియే...' అనండి.

   తొలగించండి
 23. తేటగీతి
  పేరు ప్రఖ్యాతులన్ గొన వేదినెక్కి
  వాడు మనవాడె యనుట రివాజు భువిని
  బమ్మెరయె పోతనార్యుని వాసమయ్యె!
  నన్నయ కవివరుండు తెనాలివాఁడు!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని పోతన బమ్మెర వాడని, ఒంటిమిట్ట వాడని వివాదం ఎలాగూ ఉన్నది. కాని నన్నయ విషయంలో వివాదం లేదు కదా! రెండింటికి పొంతన?

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. కొత్తగా అదికూడా తెరపైకి వచ్చిందేమో నని ఊహించి వ్రాసిన పూరణ

   తొలగించండి
 24. నన్నయకవి వరుండుతెనాలివాడు
  నాబ లికిరార్యులు నిజమ?నమ్మబుద్ధి
  యగుటలేదునాకామాటరాజమండ్రి
  పురని వాసుడై గణుతినిబొందెగవిగ

  రిప్లయితొలగించండి
 25. తేనెలూరు కవితలల్లి తీయగాను
  మేటి పద్య కవిగ దాను మెప్పు నొందె,
  నితని పద్య ధారా పటిమ దలపించు
  నన్నయ; కవివరుండు తెనాలివాఁడు

  రిప్లయితొలగించండి
 26. ఇద్దరు కవులం రాజమ హేంద్ర వరము
  వాడయి, నతడాదికవిగ వన్నెకెక్కె
  నన్నయ కవివరుండు ; తెనాలివాఁడు
  వికటకవి రామకృష్ణకవి యనితెలియు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కవులన్' అనండి. అక్కడ బిందువు రాదు. "ఇద్దరు కవులలో రాణ్మహేంద్రవరము..." అనండి బాగుంటుంది.

   తొలగించండి
 27. తే.గీ.

  భారతమ్మను పొత్తము భవము దెలియ
  పొరుగు వారిని పరికింప బొంద నిజము
  తేర పలికిరి బంధము తీరు దెలుప
  నన్నయ కవివరుండు తెనాలి వాడు

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 28. పద్య గద్యము లెన్నఁగఁ బండితుండు
  శైలి తలపించు నా కవిసార్వభౌము
  నిక్కము వచింతు నాతఁడు నీ వడిగిన
  న న్నయ కవివరుండు తెనాలివాఁడు

  [నన్ను +అయ = నన్నయ]


  సన్న పదాలి గర్భిత విశాల మనోహర భావ జాల మా
  సన్న సనాతనీ వర విశారద రాజ దయా ప్రకాశుఁ డా
  సన్నత దిక్కవి ప్రవర సంచయ ధీనిధి రామకృష్ణ నా
  నన్నయభట్టు వాసము తెనాలి యటంద్రు చరిత్రశోధకుల్

  రిప్లయితొలగించండి
 29. ఆంధ్ర భారత రచనకు ఆద్యుడెవరు?
  ఊహ లోకానఊయలలూపునెవరు?
  ఎన్న దిగ్గజ కవివరుడెచటివాడు?
  నన్నయ,కవివరుడు,తెనాలి వాడు
  కొరుప్రోలు రాధాకృష్ణారావు  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఊహాలోకము' అనడం సాధువు.

   తొలగించండి
 30. ఆంధ్ర భాషకు మేటియౌ యాది కవియె
  నన్నయ కవి వరుండు, తెనాలి వాడు
  వికటకవి ఒక్క రాముడే వినుడు జనుల
  వీరి నెఱుఁగని వారుండ బోరు వెదుక

  రిప్లయితొలగించండి
 31. నన్నయ కవివరుండు తెనాలి వాడు
  కాడు, పోతనార్యుని యూరు కాదు తణుకు,
  కాదితనిది ఖమ్మమనక కవుల నెపుడు
  దలచ వలయు తెలుగు నేల తనయు లనుచు!

  రిప్లయితొలగించండి
 32. నన్నయభట్టువాసముతెనాలియటండ్రుచరిత్రశోధకుల్
  బన్నపుమాటలాడుటనుభావ్యమె?చెప్పుడు,నన్నయార్యుడున్
  నెన్నగ నుండెనే,యెపుడయైనదెనాలిన?నేర్వకుండగా
  గ్రన్నననట్లుగాబలుకగామితలోకముసంతసించునే!

  రిప్లయితొలగించండి
 33. వరలె తాను రాజమహేంద్ర వరము నందు
  నన్నయ కవివరుండు, తెనాలివాఁడు
  రామకృష్ణ కవీంద్రుడు, రాయల కొలు
  వందు వికటకవిగ పేరు నందు కొనియె

  రిప్లయితొలగించండి
 34. రిప్లయిలు
  1. అన్నది ఎవరో తెలుసున ? అక్కజమున !!
   వెన్న మనసు వికటకవి వేడ్క జూపి
   వెన్ను దట్టుచు ప్రియమార, వెడలు వారు
   నన్నయ కవివరుండు, తెనాలివాఁడు"

   తొలగించండి
 35. తే. నన్నయ కవి వరుండు తెనాలి వాడు
  తిక్కనామాత్యరాణ్మహేంద్రియనితెలిసు
  బొమ్మెరయనివినుతికెక్కె పోతనకవి
  మేటి కవులగు వారికి పోటి ఎవరు?

  రిప్లయితొలగించండి
 36. ఎన్నగ రాణ్మహేంద్ర వరమిప్పుడు పిల్చెడి రాజమండ్రియే
  మన్నన పొందినట్టి మహిమాన్వితు డైన కవీంద్ర చంద్రుడౌ
  నన్నయ భట్టు వాసము, తెనాలి యటంద్రు చరిత్ర శోధకుల్
  చెన్నుగ భట్టుూర్తి యను శ్రేష్ఠ కవీంద్రుని దంచు చెప్పిరే.

  రిప్లయితొలగించండి
 37. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  నన్నయ కవివరుండు తెనాలివాఁడు

  సందర్భము: తెనాలి వా డొకడు శ్రీ శైలం చేరి నన్నయ కవి వరుం డంటే యెవ రని ఒక శివభక్తుని పొరపాటున అడిగినాడు. అత డెలా చెప్పినాడో చూడండి.
  పైవాడు=దేవుడు.. పైన చెప్పబడిన వాడు..
  డుబుడక్కల వాడు, డుబుడక్క వాడు, బుడుబుడుక్కుల వాడు= డుబుడక్క (ఉడుక, ఉడుకై, ఝల్లరి) అనే వాయిద్యం వాయించే వాడు
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  " *నన్* అనన్ నటరాజ! *న* యనంగ నగజేశ!
  *య* యనంగ యమవైరి! యగు *క* యనగ
  కమలాక్ష మిత్రమా! క్రమ మొప్ప *వి* యనంగ
  విశ్వనాథా! యని వినుతికెక్కె..
  *వ* యనంగ వసుధా రథ! యని *రుం* అన రుండ
  మాలాధరా! యని మరియు *డు* యనఁ
  దెలియరా! డుబుడుక్క దేవరా! యని.. నీవు
  నీమాత్ర మెరుగవా! ఏమి చదువొ!
  యతడె.. పైవాడె.. శ్రీశైలమందు నెపుడు
  నన్నయ కవి వరుండు.." తెనాలి వాడు
  చేరి శివభక్తు నడుగగాఁ జెప్పిన దిది..
  చెప్పినది యొప్పుకొనకుండఁ దప్పదాయె..

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  1.10.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి