..............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂సమస్య 🤷♀.................... రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్
సందర్భము: వానరోఽహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామ నామాఙ్కితం చేదం పశ్య దేవ్యఙ్గులీయకమ్ రామాయణము.సుందరకాండము సర్గ36 శ్లో2 (ఓ మహా భాగ్యవంతురాలా! నేను బుద్ధిశాలియైన రాముని దూతను. ఓ దేవీ! రాముని పేరు గుర్తు వున్న ఈ ఉంగరమును చూడుము.) అని పలికి ఆంజనేయుడు రాముని ఉంగరాన్ని సీతమ్మ కందించినాడు. అది సీత తండ్రి జనక మహారాజు అల్లుడైన రామునికి సీతారామ కళ్యాణ వేళలో బహూకరించినది. శ్రీ రామచంద్ర.. అనే అక్షరాలు చెక్కబడివున్నది. అది పుట్టింటి వా ళ్ళిచ్చింది కావటంచేత ఆమె కెంతో ప్రియమైనది. దాన్ని సీతాదేవి చూచింది. పోయిన ప్రాణాలు లేచివచ్చిన ట్టయినవి. అందంగా ఎంతో విలువైన మణులు పొదగబడి వున్న ఆ అంగుళీయకంలో గత స్మృతులను గుర్తుకు తెచ్చే ఒకానొక ప్రత్యేకమైన రాయి వున్నది. దానిని చూడగానే జానకికి సంతోషం విషాదం రెండూ ఒకే సారి కలిగాయి. వాతాత్మజ+ఆదత్తము=ఆంజనేయునిచేత ఈయబడినది. జ్ఞాపక+ఆనీతము=జ్ఞాపకములచేత కొనిరాబడినది. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ ప్రీతిన్ భూసుత తండ్రి యల్లున కిడెన్ శ్రీ రామచంద్రాక్షర వ్రాతోపేతము, నంగుళీయకము; నా వాతాత్మ జాదత్తమున్ సీతామాత గనుంగొనెన్.. మణుల రా శిం జ్ఞాప కానీతమౌ రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 4.10.19 -----------------------------------------------------------
*రాముని గని శూర్పణఖ మోహించిన సందర్భము*
రిప్లయితొలగించండిత్రేతా యుగమున సతియగు
సీతను గూడి వనమందు జీవించెడి యా
ఖ్యాతివహించిన దనుజా
రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
తాతల్ కాలము నాటి రోలు విడుచున్ ధైర్యమ్ముతో నేగుచున్
ఖాతర్ చేయక దోసె పిండి కొరకై కష్టమ్ములన్ హాయిగా
ప్రాతః కాలమునందు స్విచ్చి నిడగా వంటిల్లునన్ రుబ్బెడిన్
రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమైలవరపు వారి సవరణ:
తొలగించండి* వంటింటిలో రుబ్బునా
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
తొలగించండి
రిప్లయితొలగించండినా తలపులు దేశమునకు!
నేతగ నిల్తు విడనాడి నెమ్మి జశోదా!
బ్రాతియు మీరగ నా గుజ
రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
చేతం జేయిని బట్టి ప్రేమమున రా చిన్నారి చంద్రాననా
రిప్లయితొలగించండిప్రీతిం గూర్చుము పంచి నీ వలపులన్రేలుం బవళ్ళుం జెలీ
కాతు న్నిత్యము కంటిరెప్పగ నినుం గల్యాణి యన్నం బతిన్
బ్రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలు గురువు గారూ.
తొలగించండిఖ్యాతిగ రాధయు,వలపుల
రిప్లయితొలగించండిజాత,మనోహారి,శుభజ,సరసుని కృష్ణున్
భూతల నాథుం డసురా
రాతినిఁగన నాతికి ననురాగము పుట్టెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'శుభదు' అంటే బాగుంటుందేమో?
ధన్యవాదములు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రీతిని యందరు గూడుచు
రిప్లయితొలగించండిచేతుల కర్రలను పట్టి చెంగున యాడే
రాతిరి కోలాటపు నవ
రాతిని గన నాతికి ననురాగము బుట్టెన్
మీ ప్రయత్నం ప్రశంసింప దగినది.
తొలగించండి'ప్రీతిని నందరు... చెంగున నాడన్' అనండి. 'నవరాతిని'?
దేవీ నవరాత్రి సమయంలో గర్భా
తొలగించండిపేరిట, గుజరాత్, బాంబే ఇత్యాది స్థలాలలో
కోలాటం ఆడతారు. చూడ ముచ్చటగా ఉంటుంది.
అలా నవరాతి
(శ్రీరాముని తిలకించిన శూర్పణఖ )
రిప్లయితొలగించండిచైతన్యం బిసుమంత లేని సతికిన్
జైతన్యసంధాతృడున్ ;
జేతోమోద మెలర్ప నిండుసభలో
సీతమ్మ ప్రాణేశుడున్ ;
బూతంబౌ ఘనసూర్యవంశమున సం
పూజ్యుండునౌ ; దానవా
రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్
రాగమ్ము పుట్టెం దమిన్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥
రిప్లయితొలగించండిఆ తరుణి ధవుడు శిల్పియె!
జాతరకు కుటుంబమంత చనగా నచటన్
నూతికి సమీపము నలుపు
రాతిని గనఁ నాతికి నను రాగము పుట్టెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాతికి రెప రెప లాడుచు
రిప్లయితొలగించండినాతుల గోకలు భలే మనసును దరిమెడిన్
భ్రాతిని కలిగించెడి యా
రాతిని గన నాతికి ననురాగము బుట్టెన్
హంపి శిల్ప కళా సౌందర్యం
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాతిరి వేళల కోప్పడు
రిప్లయితొలగించండినాతికి ముదముఁ గలుగంగ నాధుడు ప్రేమన్
చేతికి తొడిగిన వజ్రపు
రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కోప్పడు' అనడం వ్యావహారికం. "వేళల నలిగెడు" అనండి.
రాతిరి వేళల నలిగెడు
తొలగించండినాతికి ముదముఁ గలుగంగ నాధుడు ప్రేమన్
చేతికి తొడిగిన వజ్రపు
రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్"
ప్రీతిని పెండిలి యాడుము
రిప్లయితొలగించండినాతోనని యంచు వేడు నాతని చాపే
చేతిని యుంగరపు మెరయు
రాతిని గన నాతికి ననురాగము బుట్టెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చాపే' అనడం వ్యావహారికం. 'చేతిని నుంగరపు..' అనండి.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
ప్రీతిన్ జెందుచు ఘాటు ఘాటు రకమౌ బీడీలనున్ గాల్చెడిన్
రాతింబోలెడు భర్త మేలుకొరకై
ప్రార్థించగా నేగుచున్
ప్రాతః కాలము నందు నాలయమునన్ రమ్యంపు ముక్కంటి దౌ
రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభ్రాతను రక్షణ గోరుచు
రిప్లయితొలగించండిచేతికి తోరము ధరింప జేసెడి దినమున్
భ్రాత యిడిన యుంగరమున
రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండియశోదాదేవి ఆనందం🙏
రిప్లయితొలగించండిమాతుల జంపునని వెరసి
రాతిరి దాటించి యమున లలి వసుదేవున్
జాతుని దాచగ, కంసా
రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మాతులు జంపు..' అనండి.
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిధాతా పురస్తా మంత్రము
జాతికి నిండుగ వెలుగులు జేర్చున్ గదయా
రాతలు మార్చుసు దివ్యపు
రాతిని గన నాతికి ననురాగం బుట్టెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణదోషం. సవరించండి.
ఆతడు యూరికి వెళ్లుచు
రిప్లయితొలగించండినాతో రమ్మంచు గోమున బలుకగా నా
శీతల వసంత వెన్నెల
రాతిని గన నాతికి ననురాగము బుట్టెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఆతం డూరికి వెడలుచు... గోమునన్ బలుకగ..' అనండి. 'వెన్నెలరాతిని'?
ఆతత నావే శ మ్మున
రిప్లయితొలగించండివా తెరువు మనిన య శోద పర వ శు రా లై
ప్రీతి గ పుత్రుని కంసా
రాతి ని గ న నా తి కి న ను రాగ ము పుట్టె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఆతత + ఆవేశము = ఆతతావేశము' అవుతుంది. నుగాగమం రాదు.
ఆ త త పు టా గ్ర హ మ్ము న అని మొదటి పాద o లో సవరణ చేయడ మైంది
తొలగించండిచేతిని వీడక ఫోనున్
రిప్లయితొలగించండిరోతను బుట్టించు తీరు రోజొక బూతున్
యూతగ బల్కెడి బల్ యే
రాతిని గన నాతికి ననురాగము బుట్టెన్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'బూతున్ + ఊతగ, బల్ + ఏ' అన్నపుడు యడాగమం రాదు.
రిప్లయితొలగించండిచేతన్విల్లుని బట్టి మన్మథుడు రాజిల్లంగ తాసంగి పై
రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్,
బ్రాతిన్ చేర్చుచు నెమ్మితోడు ప్రియుడా ప్రాణేశ్వరిన్ బిల్వ తా
నేతంబెత్తుచు చెంత చేరి సుఖముల్ నిక్కాక గాంచెన్ వెసన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండి... శంకరాభరణం... . 04/10/19 ...శుక్రవారం...
సమస్య::
రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్
నా పూరణ. శార్ధూలము
***** ****
ఖ్యాతిన్ గాంచిన మౌని పత్ని గని మాయావేషమున్ దాల్చుచున్
భీతిన్ వీడి అహల్య సన్నిధికి నా వృద్ధశ్రవుండున్ జనెన్
నీతే యంచు ధవుండుగా దలచి సందేహించకన్ దానవా
రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్
🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
🌷🌷 వనపర్తి 🌷🌷
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నీతి + ఏ' అన్నపుడు సంధి లేదు. 'సందేహించక' అన్నది కళ. ద్రుతాంతం కాదు.
చేతోమోదకశిల్పశోభితకళాశ్రీరాజదౌన్నత్యమై
రిప్లయితొలగించండిఖ్యాతిం గూర్చిన మన్మథప్రభవశృంగారాంగభంగీయమై
చైతన్యాప్తసుగాత్రిపూరుషపరిష్వాంగాత్మకోద్విగ్నమౌ
రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసేతువుగట్టిన ధీరుని
రిప్లయితొలగించండికోతుల సైన్యమునుగూడి కోదండముతో
త్రాతగనిల్చిన లంకా
రాతినిగన నాతికి ననురాగము పుట్టెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ రోజు శంకరాభరణము సమస్య
రిప్లయితొలగించండిరాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్
ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో
వేకువ ఝామాయె, వేగముగా నదీస్నానమును ముగించి జపతపములు
చేయంగ వలయును చేడియా నేనని, వెడలిన నా వల్లభుడు రయముగ
తిరిగి వచ్చెనని పసరిలుచు నుండగన్, ముదముగ నెదుట నా ముని నిలబడ
గ, దహనారాతినిఁ గన నాతికి ననురాగము పుట్టె ,నిరివురు కామ కేళి
సలుపు చుండ కాలిడె నిజ పలుకు వాలు,
మోసము గని,దల్మికి శాపము నిడి, సతిని
గాంచి రాతివై పొమ్మని గాలన మిడి
గౌతముడు వెళ్ళె తపసుకు కలత చెంది
మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపోతిని నా భార్య జయ స
రిప్లయితొలగించండిమేతముగా నగలను కొన, మీరిన సంతో
షాతిశమున్ ఘన వజ్రపు
రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్౹౹
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం.
రిప్లయితొలగించండినూతన దీపము కాంతుల
పాతగు పరికరము వెదుక పరవశ మొందన్
రాతి యుగము దా చెకుముకి
రాతిని గన నాతికి ననురాగము పుట్టెన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమా తెలుగు గొప్పదనె, నట
రిప్లయితొలగించండిరాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్
పోతన విగ్రహము కడను
జోతలు పెట్టెను మరి మరి చోద్యమెటులగున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రీతినిదలచుచునామము
రిప్లయితొలగించండిరాతిరివేజామువరకుప్రార్ధనజేయన్
ద్రాతగ వచ్చిన కంసా
రాతినిగననాతికి ననురాగము పుట్టెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏ తీరున నీ భవమున
రిప్లయితొలగించండినాతనిఁ బెండ్లాడఁగ నగు నను వ్యాకులతం
బూతనఁ జంపిన కంసా
రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్
సీతాసాధ్వి ధరా తనూజ గుణ సత్శీల ప్రభా కీల గా
ఢాతీహా కలి తాంతరంగ వర సూర్యామ్నాయ సుక్షత్రియ
వ్రాత శ్రేష్ఠుని నంబరాంబర మహేష్వాసఘ్న దైత్యవ్ర జా
రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్
అద్భుతమైన పూరణలు. అభినందనలు.
తొలగించండిమీ సూచన ప్రకారము చేసిన సవరణముతో:
తొలగించండిసీతాసాధ్వి ధరా తనూజ గుణ సచ్ఛీల ప్రభా కీల గా
ఢాతీహా కలి తాంతరంగ వర సూర్యామ్నాయ సుక్షత్రియ
వ్రాత శ్రేష్ఠుని నంబరాంబర మహేష్వాసఘ్న దైత్యవ్ర జా
రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
రాతిని నాతిని జేసిన
రిప్లయితొలగించండిభూతలనాధుఁడు దశరథ పుత్రుకుడును భూ
జాతకు పతియౌ దైత్యా
రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపుత్రకుడును
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసీతాదేవియు లక్ష్మణుండు తనకుంజేదోడువాదోడుగా
రిప్లయితొలగించండినేతెంచన్ విపినాంతరంబులకు నేగెన్ రామభద్రుండు నా
ఖాత్రంబందున నొక్క రక్కసి రమాకాంతున్ గనెన్, దానవా
రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిత-త్ర... ఇటువంటి విశేష ప్రాసలము సాధ్యమైనంత వరకు ప్రయోగించకండి.
అలాగే గురువుగారూ
తొలగించండిరాతి శిలనట కను గొనఁగ
రిప్లయితొలగించండిజాతిపిత నపుడు, మన జన జాతికి జేసిన
నాతని త్యాగము తెలియగ
"రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్"
కళ్యాణ్ చక్రవర్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం రెండవ పాదం చివర తప్పక గురువుండాలి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినా ప్రయత్నం :
రిప్లయితొలగించండికందం
మాతన్ పురిటిని వీడుచు
బ్రాతన్ గొని మామఁ జంపి వచ్చెడు వేళన్
చేతనమున సుతుఁ గంసా
రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్
శార్దూలవిక్రీడితము
సేతున్గట్టియు రామమూర్తి కపులున్ జేరంగ శ్రీలంకకున్
గోతుల్దప్పవు రావణాదులకనన్ గూరంగ సంగ్రామమే
పూతల్ బూసిన దోట లోన రఘురామున్ జూపెడున్నీరజా
రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్
✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిభూతేశుండతడంబరాంబరుడు సంపూజ్యుండెయౌ యుగ్రునిన్
రిప్లయితొలగించండిచేతన్ శూలముఁ గంఠమందు ఫణినిన్ శీర్షమ్ము పై గంగనున్
శీతాంశుండఁ దలన్ ధరించు ఘనుడౌ శ్రీకంఠునిన్ మన్మథా
రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'శీతాంశున్ దలపై ధరించు...' అనండి.
కం.
రిప్లయితొలగించండిరోతగ నుండెడి సరసిన్ l
శ్వేతకమల సొక్కు శిల్పవేత్తను గనుచున్ l
భూతల మాయాదర్పణ l
రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్ ll
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కమల సొక్కు, దర్పణ రాతిని' అన్న ప్రయోగాలు సాధువులు కావు.
ఖ్యాతిని గడించ గలిగిన
రిప్లయితొలగించండిజాతిపిత నపుడు మన జన జాతికి జేసిన
నాతని త్యాగము తెలియగ
"రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్"
#కళ్యాణ్ చక్రవర్తి#
ఘాతకులను తునుముచు గో
రిప్లయితొలగించండిమాతల రక్షించుచు భువి మను గోపాలున్
వ్రేతల నాథుని కంసా
రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఖ్యాతింగాంచినదైన భాగ్యపురినుద్యానమ్మునందెల్లరున్
రాతింజెక్కిన కృష్ణరాయవిభుశిల్పంబొక్కటిన్ జూడగా.,
ప్రీతిన్ శిల్పముజూచునట్టిమిషతో పిల్వంగ నన్ శ్వేత యన్
రాతిం గాంచిన నాతి ., నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్"
( ఇది కల్పన మాత్రమే.. నిజమనుకొనేరు.. 😊)
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
భీతిల్లన్ ప్రజ రక్కసాళి కతనన్ వెన్నుండు జన్మించె తా
రిప్లయితొలగించండినూతమ్మిచ్చి సదా జనావనముచే నుల్లాస మివ్వంగ ధా
త్రీతానమ్ముపయిన్ జనాళికి, దృతిన్, శ్రీకాంతునిన్ దాన వా
రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్
రిప్లయితొలగించండికందము:
ప్రీతిగ "బంగాళ్ భౌభౌ"
చేతికి నందీయ నేమి జెప్పక పతియే
మూతిని ముడువక మనసా
రా, తినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్.
---గోలి.
తొలగించండిఈ బంగాళ్ భౌ భౌ ఏమి వస్తువండీ !!!
బంగాళా దుంప తో ఒక పతివ్రత చేసిన ప్రయోగాత్మక వంటకం.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము
పుట్టెం దమిన్
సందర్భము:
వానరోఽహం మహాభాగే
దూతో రామస్య ధీమతః
రామ నామాఙ్కితం చేదం
పశ్య దేవ్యఙ్గులీయకమ్
రామాయణము.సుందరకాండము
సర్గ36 శ్లో2
(ఓ మహా భాగ్యవంతురాలా! నేను బుద్ధిశాలియైన రాముని దూతను. ఓ దేవీ! రాముని పేరు గుర్తు వున్న ఈ ఉంగరమును చూడుము.)
అని పలికి ఆంజనేయుడు రాముని ఉంగరాన్ని సీతమ్మ కందించినాడు.
అది సీత తండ్రి జనక మహారాజు అల్లుడైన రామునికి సీతారామ కళ్యాణ వేళలో బహూకరించినది. శ్రీ రామచంద్ర.. అనే అక్షరాలు చెక్కబడివున్నది. అది పుట్టింటి వా ళ్ళిచ్చింది కావటంచేత ఆమె కెంతో ప్రియమైనది. దాన్ని సీతాదేవి చూచింది.
పోయిన ప్రాణాలు లేచివచ్చిన ట్టయినవి. అందంగా ఎంతో విలువైన మణులు పొదగబడి వున్న ఆ అంగుళీయకంలో గత స్మృతులను గుర్తుకు తెచ్చే ఒకానొక ప్రత్యేకమైన రాయి వున్నది. దానిని చూడగానే జానకికి సంతోషం విషాదం రెండూ ఒకే సారి కలిగాయి.
వాతాత్మజ+ఆదత్తము=ఆంజనేయునిచేత ఈయబడినది.
జ్ఞాపక+ఆనీతము=జ్ఞాపకములచేత కొనిరాబడినది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ప్రీతిన్ భూసుత తండ్రి యల్లున కిడెన్
శ్రీ రామచంద్రాక్షర
వ్రాతోపేతము, నంగుళీయకము; నా
వాతాత్మ జాదత్తమున్
సీతామాత గనుంగొనెన్.. మణుల రా
శిం జ్ఞాప కానీతమౌ
రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్
రాగమ్ము పుట్టెం దమిన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
4.10.19
-----------------------------------------------------------
చేతుల యందున దనుజా
రిప్లయితొలగించండిరాతి ప్రతిమ నారదుడిడ రహితో గనుచున్
ప్రీతిగ తడుముచు కంసా
రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్"*
ప్రీతిన్ యమునా తటమున
చేతము నందున తలచుచు చిద్రూపంబున్
కాతురమున నా కంసా
రాతిని గన నాతికి నను రాగము పుట్టెన్