ప్రభాకర శాస్త్రి గారూ, బాగుంది మీ సరదా పూరణ. (మహ్మద్ ఖదీర్ బాబు వ్రాసిన 'దర్గామిట్ట కథలు, పోలేరమ్మబండ కథలు' నెల్లూరు యాసలో అద్భుతంగా ఉంటాయి. నాకెంతగానో నచ్చిన పుస్తకాలు. ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం చదివిన పుస్తకాలను గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు).
స్వర్గమ్మాయెను భూమి రాక్షస వినాశమ్మీవు గావింపగా దుర్గా! నీ వలనన్; జగద్వలయ మెంతో దుఃఖ మందెన్ గదా మార్గమ్మేమియు లేక నా మహిషు దుర్మార్గమ్ములన్ వేగుచున్; దుర్గా! నీ కరుణా కటాక్ష బలమందుద్విగ్నతల్ మాయునే! (మొదటి పాదములో యతి సరి చేశాను)
దుర్గాష్టమి అయిన తర్వాత వచ్చు దసరాకు కోడి మాంసము అమ్ముకుని బాగా లభ్ది పొందుదాము అనుకున్న సమయములో వచ్చిన భీకర తుఫానుకు పేర్లు రాష్ట్రములలో కోళ్ల సంతతి నాశనము అవ్వగా ఆ వ్యాపారులు పడు బాధ
బ్లాగు మిత్రులందరికీ శుభోదయం!నా లలితాష్టోత్తరశతక గ్రంథావిష్కరణ సభకు మీ అందరికీ యిదే నా హృదయపూర్వక ఆహ్వానము!మీ ఆశీస్సులను యెల్లవేళలా ఆశిస్తూ సీతాదేవి!నమస్సులు!!
సందర్భము: పాతాళలంకలో మైరావణుడు ప్రభువు. అక్కడ 81 అడుగుల విగ్రహం వున్న కాళికాలయం వుంది. పురుషులకు వేరే చెరసాల లున్నవి. అందు కిన్నర కింపురుషాదు లున్నారు. స్త్రీలకు వేరే చెరసాల లున్నవి. అం దొకదాంట్లో అతడు చెల్లెలు దుర్దండిని చేతులు కాళ్ళకు తగుమాత్రం కదల్చడానికి నడువడానికి మాత్రం వీలుండేలా గట్టి సంకెళ్ళు వేసి బంధించాడు. ఆమె కొడుకు మరో చెరసాలలో వున్నాడు. మైరావణుడు రామ లక్ష్మణులను విభీషణుని రూపంలో వెళ్లి తెచ్చి కాళి గుడిలో బంధించినాడు. బలి ఈయా లనుకున్నాడు. ఆచారం ప్రకారం ఇంటి ఆడపడుచుచేత పసుపు నీళ్ళతో మంగళ స్నానం చేయించాక గన్నేరు పూదండలు మెడలో వేస్తారు. అప్పు డవి బలి ఈయదగిన నరపశువులు. మైరావణుడు చెల్లెలుకు పురమా యించాడు రామ లక్ష్మణులకు స్నానాలు చేయించ మని. అట్లైతే శాశ్వతంగా బంధ విముక్తురాలిని చేస్తా నన్నాడు. ఆమె పొలిమేరలోని అమృతసరస్సులో 12 బిందెల నీళ్ళు తేవాలని బయలు దేరుతుంది. ఆమె ఏడుస్తుంటే ఆంజనేయుడు ఓదార్చి ఆమె సంకెళ్ళు ఒక్క దెబ్బతో విరగ్గొడుతాడు. అవి మైరావణుడు తప్ప మరెవరూ తొలగించలేనివి. "నా కొడుకు బాల్యంలో వుండగా నారదుడు 'వీడు పాతాళ లంకకు రాజౌతా' డని చెప్పగా మా యన్న మమ్మ ల్నిద్దరినీ చెరలో బంధించా" డని ఆమె చెబుతుంది. ఆంజనేయు డెంతో కష్టపడి అక్కడికి చేరుకొని ఆవేదనతో దుర్గాదేవి నీ విధంగా ప్రార్థించినాడు. ఇలా ఎంతో కథ జరిగాక మైరావణుణ్ణి మారుతి సంహరిస్తాడు.. (వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనంలోని కొన్ని మాటల చిన్న ఆడియో అనుసంధించబడింది.) ~~~~~~~~~~~~~~~~~~~~~~~ స్వర్గంబందలి వారికిన్ నరులకున్ సౌఖ్యంబు సాధింప దు ర్మార్గ శ్రేణి వధింప భూమిపయికిన్ రాముండు సౌమిత్రియున్ భర్గ ప్రేయసి! వచ్చిరే! బలిగొనన్ వారిన్ భవత్కృత్యమే! దుర్గా! నీవలనన్ జగద్వలయ మెం తో దుఃఖ మందెన్ గదా!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 12.10.19 -----------------------------------------------------------
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
దర్గామిట్టను జేరి గడ్డపులహో తర్జించి భర్జించుచున్
ముర్గా గోవుల హత్య నొల్లుచును భల్ పుణ్యంబుగా నెంచుచున్
బర్గర్ తో బిరియాని కుమ్ముచును నిన్ ప్రార్థించిరే భక్తితో
దుర్గా! నీవలనన్ జగద్వలయమెంతో దుఃఖమందెన్ గదా!
దర్గామిట్ట= నెల్లూరులో ప్రాంతము
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిబాగుంది మీ సరదా పూరణ.
(మహ్మద్ ఖదీర్ బాబు వ్రాసిన 'దర్గామిట్ట కథలు, పోలేరమ్మబండ కథలు' నెల్లూరు యాసలో అద్భుతంగా ఉంటాయి. నాకెంతగానో నచ్చిన పుస్తకాలు. ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం చదివిన పుస్తకాలను గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు).
తొలగించండి🙏
నేను పూర్తిగా చదివిన ఒకే ఒక తెలుగు వచన పుస్తకం:
"మిట్టూరోడి కథలు"
...నెల్లూరోడు
విరించి.
రిప్లయితొలగించండిఈ ర్గా ప్రాసము తోడ పద్యమని నేనిచ్చోట చింతింపగా
మార్గంబొక్కటి దోచె నీ కృపను నిర్మాణమ్ము నే చేయగా
దుర్గా! నీ వలనన్, జగద్వలయ మెంతో దుఃఖించెన్ గదా
ఈ ర్గా ప్రాసము చూచి, మానుకునిరే యీ పద్యమున్ వ్రాయగన్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
అవును...నిజంగా నే మానితిని 🤣🤣🤣
తొలగించండిస్వర్గప్రాంతము, భూరసాతలములున్ బాపాత్ముడౌ వాని దు
రిప్లయితొలగించండిర్మార్గున్ దైత్యుని జంపుటన్ దలచుచున్ మాతా! ముదంబందె నో
దుర్గా! నీవలనన్, జగద్వలయ మెంతో దుఃఖమందెన్ గదా
సర్గవ్యాపిని! వాని దౌష్ట్యములకున్ సంతోషముల్ గూలుటన్.
మీ పూరణ బాగున్నది.
తొలగించండిదుర్గమమగు ముక్తి దొరుకు
రిప్లయితొలగించండిదుర్గా నీ వలన, జగము దుఃఖమ్మందెన్
మార్గమ్మే దొరకక దు
ర్మార్గుడగు మహిషుని చేత మము బ్రోవుగదే.
విరుపుతో మీ పూరణ బాగున్నది.
తొలగించండి
రిప్లయితొలగించండిభర్గో దేవీ! ధీమతి
దుర్గా! నీవలన జగము దుఃఖమ్మందెన్
స్వర్గంబందెను కారణ
మార్గంబాయెను సకలము మాతా నీవే
జిలేబి
రిప్లయితొలగించండిఅమ్మలగన్న అమ్మయే అన్నిటికి మూలము !
దుర్గా నీవలెనన్ జగద్వలయమెంతో వ్యాప్తి గాంచెన్ సదా!
దుర్గా నీవలెనన్ జగద్వలయమెంతో నిట్ట నొందెన్ సదా
దుర్గా నీవలెనన్ జగద్వలయమెంతో సౌఖ్యమందెన్ గదా!
దుర్గా! నీ వలెనన్ జగద్వలయ మెంతో దుఃఖ మందెన్ గదా!
జిలేబి
తొలగించండిThou art the cause and effect expansion and stability, happiness and sorrow.
Amen
జిలేబి
మీ రెండు పూరణలు బాగున్నవి. "నీ వలనన్" టైపాటు.
తొలగించండిజయహో! బెంగుళూరు జిలేబీ!
తొలగించండి
తొలగించండిపద్యము చదువబడెనా ?
జిలేబి
బ్రహ్మాండంగా...వ్యాఖ్యతో సహా!
తొలగించండి😊
తొలగించండిఏమి వ్యాఖ్య అండీ ?
జిలేబి
శార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించండినిర్గమ్మందున పాపభీతి కరువై నేరమ్ములన్ జేయు దు
ర్మార్గుల్ బెక్కురు రెచ్చి పోయెదరుగా, మాకందు సేమమ్ములున్
దుర్గా! నీ వలనన్, జగద్వలయమెంతో దుఃఖమందెన్ గదా
మార్గాంతర్మథనమ్ముతో! కరుణతో మమ్మేలు, దిక్కీవెగా!
చక్కని పూరణ.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిదుర్గంధంబులు స్వీయకార్యములచే దుష్టాత్ముడై యెల్లెడన్
రిప్లయితొలగించండిమార్గంబందున జిమ్ముచుండు సఖునిన్ మాతంగి గూల్చంగ నా
భర్గార్ధాంగికి నొక్కదైత్యు డెదురై పల్కెన్ విచారంబునన్
దుర్గా! నీవలనన్ జగద్వలయ మెంతో దుఃఖమందెన్ గదా
మీ పూరణ బాగున్నది.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిమార్గంబిద్ది జనాళికంతటికి దుర్మార్గమ్ముగా దోచి., యీ
దుర్గమ్మున్ రచియించి నీవిచటనే ద్యూతమ్మునాడంగనా
భర్గుండైనను మెచ్చునే.? ఖలుడ ! పాపాచారభూయిష్ఠదు....
ర్దుర్గా! నీవలనన్ జగద్వలయ మెంతో దుఃఖమందెన్ గదా"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించండిస్వర్గంబుకు నిచ్చెనలరి
రిప్లయితొలగించండివర్గంబులఁబడుచువేయు వారలకిక స
న్మార్గము జూపవె ముక్తికి?
దుర్గా నీవలన జగము దుఃఖమ్మందెన్..🙏
బాగుంది.
తొలగించండిస్వర్గంబునకు అనడం సాధువు. అక్కడ 'స్వర్గమునకు...' అనవచ్చు.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
కలకత్తా దుఃఖాలు:
మార్గమ్మందున నీదు మూర్తినిడుచున్ మర్యాద పాటింపకే
భార్గవ్ రీతిని దండయాత్ర కెగుచున్ పండాల యద్యక్షుడే...
స్వర్గమ్మా! యను వంగదేశమున వే చందాకు విచ్చేయునే
దుర్గా! నీవలనన్ జగద్వలయమెంతో దుఃఖమందెన్ గదా!
పండాలు = (puja) pandal
దుర్గా మండపాల చందాలా? బాగుంది మీ పూరణ.
తొలగించండి🙏
తొలగించండివర్గంబున్ జతజేసితాము పరులన్ బాధించి రాణించగా
రిప్లయితొలగించండిమార్గాన్వేషణ సల్పిబాగు పడగా మౌనంబు బాటించుచున్
స్వర్గారో హణమార్గమని పూజలు సల్పుట చేతనే నో
దుర్గా నీవలనన్ జగద్వలయ మెంతో దుఃఖ మందెన్ గదా
బాగుంది. కాని మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
తొలగించండిక్షంతవ్యుణ్ణి. గణ సవరణానంతరం
తొలగించండివర్గంబున్ జతజేసితాము పరులన్ బాధించి రాణించగా
మార్గాన్వేషణ సల్పిబాగు పడగా మౌనంబు బాటించుచున్
స్వర్గారో హణమార్గమంచు సతమున్ సల్పంగ బూజాదు లో
దుర్గా నీవలనన్ జగద్వలయ మెంతో దుఃఖ మందెన్ గదా
దుర్గమమైన యడవులన్
రిప్లయితొలగించండిబర్గుని గుడి యంచునుండి పారుచు సతమున్
నిర్గమ మలినమ్ములతో
దుర్గా! నీవలన జగము దుఃఖమ్మందెన్
బాగుంది.
తొలగించండిస్వర్గం బాయెను లోకము
రిప్లయితొలగించండిదుర్గా నీ వలన; జగము దుఃఖమ్మందెన్
దుర్గమమై మహిషుని దు
ర్మార్గమ్ముల జీవితమ్ము; రక్షించితివే
విరుపుతో చక్కగా ఉంది మీ పూరణ.
తొలగించండిస్వర్గమ్మాయెను భూమి రాక్షసుల సంహారమ్ము గావింపగా
రిప్లయితొలగించండిదుర్గా! నీ వలనన్; జగద్వలయ మెంతో దుఃఖ మందెన్ గదా
మార్గమ్మేమియు లేక నా మహిషు దుర్మార్గమ్ములన్ వేగుచున్;
దుర్గా! నీ కరుణా కటాక్ష బలమందుద్విగ్నతల్ మాయునే!
(ఆకాశవాణికి పంపినది)
స్వర్గమ్మాయెను భూమి రాక్షస వినాశమ్మీవు గావింపగా
తొలగించండిదుర్గా! నీ వలనన్; జగద్వలయ మెంతో దుఃఖ మందెన్ గదా
మార్గమ్మేమియు లేక నా మహిషు దుర్మార్గమ్ములన్ వేగుచున్;
దుర్గా! నీ కరుణా కటాక్ష బలమందుద్విగ్నతల్ మాయునే!
(మొదటి పాదములో యతి సరి చేశాను)
విరుపుతో బాగున్నది మీ పూరణ.
తొలగించండిఆకాశవాణిలో ప్రసారమైన నాపూరణ:
రిప్లయితొలగించండిదుర్గాంబా నినునమ్ము భక్తులకుఁ నే దుఃఖంబువాటిల్లినన్
దుర్గంబై పరిరక్షజేసెదవు, సంతోషంబు సంప్రాప్తియౌ
దుర్గా నీవలనన్, జగద్వలయమెంతో దుఃఖమందెన్ గదా
దుర్గా చెచ్చెరఁ నేగుదెంచి ఖలులన్ త్రుంచంగ నే మ్రొక్కెదన్.
బాగుంది మీ పూరణ.
తొలగించండివచ్చే వారవు ఆకాశవాణి వారి సమస్య
రిప్లయితొలగించండిఅల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్త మామలున్
Padyamairhyd@gmail.com
కు గురువారం సాయంత్రం లోగా పంప వచ్చును
తొలగించండినెనరుల్స్ పంపించినాము
జిలేబి
మార్గము సుగమం బాయెను
రిప్లయితొలగించండిదుర్గా; నీవలన జగము దుఃఖమ్మందెన్
దుర్గతి; ఇక మిగిలెను సన్
మార్గంబొక్కటె జగమున మాతా చూడన్
రాం కిడాంబి
బాగుంది.
తొలగించండినిర్గమ మయ్యె నసుర తతి
రిప్లయితొలగించండిదుర్గా నీ వలన : జగము దుఃఖ మ్మ o దె న్
దుర్గుణ మహిషు ని దుష్టపు
మార్గం బది బాధ పెట్ట మహి లో జనుల న్ u
బాగున్నది.
తొలగించండిముర్గి పొలసు మా వర్గా
రిప్లయితొలగించండివర్గిగద, జనని! తుఫాను వచ్చిగతించెన్
ముర్గి విజములన్నియు, నో
దుర్గా నీవలన జగము దుఃఖమ్మందెన్"
(పొలసు = మాంసము , వర్గా వర్గి = రాబడి
విజములు = పక్షులు కోడి పక్షి జాతికి చెందినది )
దుర్గాష్టమి అయిన తర్వాత వచ్చు దసరాకు కోడి మాంసము అమ్ముకుని బాగా లభ్ది పొందుదాము అనుకున్న సమయములో వచ్చిన భీకర తుఫానుకు పేర్లు రాష్ట్రములలో కోళ్ల సంతతి నాశనము అవ్వగా ఆ వ్యాపారులు పడు బాధ
బాగున్నది.
తొలగించండిగురువు గారికి నమస్సులు
రిప్లయితొలగించండిమార్గము దోచెను కవులకు
దుర్గ నీవలన, జగము దుఃఖమ్మందెన్
వర్గవిభేదము వలెనన్
దర్గయు ,దుర్గయు రక్షించు దర్మపరులకున్.
దోచును గ చదువ ప్రార్థన.
రిప్లయితొలగించండి(శ్రీనాథకవిసార్వభౌముని కాశీఖండకావ్యంలో
రిప్లయితొలగించండిదుర్గాసురసంహారఘట్టం-దుర్గాదేవి పలుకులు )
స్వర్గంబున్ వణకించి దేవతలనే
స్వాధీనమం దుంచితే !
దుర్గా ! నీ వలనన్ జగద్వలయ మెం
తో దుఃఖమందెన్ గదా !
మార్గం బేమియు లేదురా ఖలుడ ! కొ
మ్మా శక్తులన్నింటినిన్ ;
భర్గార్ధాంగిని వచ్చియుంటి నిక నీ
ప్రాణంబులన్ జేకొనన్ .
(భర్గార్ధాంగిని - పరమేశ్వరుని పత్నిని )
ప్రశస్తమైన పూరణ.
తొలగించండి
రిప్లయితొలగించండిదుర్మార్గమ్ముననెందరొ
మర్మము దెలియక దుడుకుగ మారుచునుండన్
మార్గము లేదామాకిక
దుర్గా నీవలన జగము దుఃఖమ్మందెన్
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
బాగున్నది.
తొలగించండిదర్గా దరి నువు జేసెడి
రిప్లయితొలగించండిబర్గర్లను తిన్నవారు బ్రదుకుట యరుదౌ!
మార్గమ్మవి నరకమునకు
దుర్గా! నీవలన జగము దుఃఖమ్మందెన్!
{Just for fun }
బాగుంది. 'నువు' అన్నది సాధువు కాదు. "నీ జేసెడి" అనవచ్చు.
తొలగించండిదుర్గానీవలనన్జగద్వలయమెంతోదుఃఖమందెన్గదా
రిప్లయితొలగించండిదుర్గాదేవినిబూజజేసినగడున్దోషంబుతోడన్నికన్
దుర్గంబైననునిచ్చుమోక్షముసుమాదుఃఖంబులేకుండగా
దుర్గాదేవిల గ్రామదేవతగదాదోర్దండమున్ గల్గెడిన్
బాగున్నది.
తొలగించండిబ్లాగు మిత్రులందరికీ శుభోదయం!నా లలితాష్టోత్తరశతక గ్రంథావిష్కరణ సభకు మీ అందరికీ యిదే నా హృదయపూర్వక ఆహ్వానము!మీ ఆశీస్సులను యెల్లవేళలా ఆశిస్తూ సీతాదేవి!నమస్సులు!!
రిప్లయితొలగించండిచాలా సంతోషమండి. శతకావిష్కరణము కనువిందుగఁ బూర్తి కావలెనని నా యాకాంక్ష మఱియు నభినందనలు.
తొలగించండిధన్యవాదములార్యా!మీ శుభాకాంక్షలకు మహదానందము!మీవంటి పెద్దల ఆశీస్సులే మావంటి ఔత్సాహికులకు ప్రోత్సాహము!నమస్సులు!
తొలగించండిస్వర్గపు సుఖములనుంటిమి
రిప్లయితొలగించండిదుర్గా!నీవలన,జగముదుఃఖమ్మందెన్
భర్గుని వరమునుబొందిన
దుర్గుణుడారాక్షసుండుతొగలేయిడగన్
బాగున్నది.
తొలగించండికం.
రిప్లయితొలగించండివర్గము పోరును వదలగ
దిర్గుడు రోగమునుమాని ద్రిపురను గొల్వన్
దుర్గుణుడే యింకన యో
దుర్గా నీవలన జగము దుఃఖమ్మయ్యెన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది.
తొలగించండిభర్గానురాగమయ సం
రిప్లయితొలగించండిసర్గా! మాతృత్రయాభిసంజ్ఞా! యకటా
దుర్గమ రూపం బూనఁగ
దుర్గా నీవలన జగము దుఃఖమ్మందెన్
దోర్గర్వమ్మునఁ బ్రజ్వలించ వసుధన్ దుష్టా! మురక్రూర సం
సర్గా! పాలిత దుర్గపంచమ! సదా సంపీడ్య మానార్య స
ద్వర్గా! క్ష్మా తనయాధమా! నరక దైత్యా! నిర్జరాభేద్య దు
ర్దుర్గా! నీవలనన్ జగద్వలయ మెంతో దుఃఖమందెన్ గదా
[దుర్గము = కోట]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిమార్గమ్మేదియు లేదటంచు మహిషున్ మర్దించగా నంతటన్
రిప్లయితొలగించండిస్వర్గమ్మే దిగి వచ్చినట్టుల ప్రజల్ సమ్మోదమున్ బొందిరే
దుర్గా నీ వలెనన్! జగద్వలయమెంతో దుఃఖమందెన్ గదా
వర్గమ్మెంచుచు నేడు భాష, మతమున్, వర్ణాల ద్వేషింపగా!
స్వర్గాద్యాఖిలలోకవైరి! వనితావ్వ్యామోహివౌ రావణా!
రిప్లయితొలగించండిభర్గున్ భీతిలఁ జేసి తన్నివసతిన్ పాణిస్థలిన్ నిల్పు ని
స్సర్గక్రూరదురంతపాలనకళాసందీప్తలంకాపురీ
దుర్గా! నీ వలనన్ జగద్వలయ మెంతో దుఃఖమందెన్ గదా.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈరోజు సమస్యాపూరణము
రిప్లయితొలగించండిదుర్గా నీవలన జగము దుఃఖమ్మందెన్
దుర్గావతారమున మా
వర్గమున రణమును జేసి వధజేయఁసురున్
స్వర్గము నీయనిచో నిల
దుర్గా, నీవలన జగము దుఃఖమ్మందెన్
నువ్వు నరకాసురుని వధించకున్న, మా ఈ లోకము దుక్కమందును అనే భావముతో
🙏🙏
దయచేసి పరిశీలించ ప్రార్ధన 🙏🙏🙏
తొలగించండిదుర్గతిగ నింపితివిగద
రిప్లయితొలగించండిమార్గము నంతను కృతకపు మల్లెల తెరలన్
సర్గమొనరించ కష్టము
దుర్గా ! నీవలన జగము దుఃఖమ్మందెన్
గురువు గారికి నమస్సులు
రిప్లయితొలగించండినా పూరణ దయచేసి పరిశీలించండి.నా పూరణ తరువాత పూరణలు పరిశీలించ బడినాయి.
నా శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయములో నేటి పద్యములలో నొకటి:
రిప్లయితొలగించండిమురళీ నాదము గాన రాగములకుం బూర్ణానుకూలమ్ము గాన్
దరుణీ పాద సుతాడ నారవము గీతధ్వాన మిశ్రమ్ము గాన్
గర తాళధ్వని కంకణోత్కర కృతక్వాణమ్ము నేకమ్ము గాన్
గరముల్ నీ విడ మూపు లందుఁ దఱచుం గట్యంబరమ్ముల్ చలిం
ప రమాకాంతుని రాసలీల లలరన్ భక్తిన్ సమీక్షించిరే
శా. భర్గున్డానతి,మీరియాహుతయెనే,బాధింపదాక్షాయణిన్
రిప్లయితొలగించండిఒర్గెన్దక్షుడువీరభద్రునికి,ఠావుల్దప్పెదేవాదులే,
మార్గంబేమియుతోయలేక,శివభామాదేహమేముక్కలై
విర్గన్గూలెనుశక్తిపీఠముగ,కంపించంగభూభారమై
స్వర్గంబాయెను,నేటికాస్థలములే,సాంబయ్యకావంగ,నో
దుర్గానీవలనన్ జగత్వలయమెంతో దుఃఖమందెన్గదా.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
దుర్గా నీవలనన్ జగద్వలయ మెంతో
దుఃఖమందెన్ గదా
సందర్భము:
పాతాళలంకలో మైరావణుడు ప్రభువు. అక్కడ 81 అడుగుల విగ్రహం వున్న కాళికాలయం వుంది. పురుషులకు వేరే చెరసాల లున్నవి. అందు కిన్నర కింపురుషాదు లున్నారు. స్త్రీలకు వేరే చెరసాల లున్నవి. అం దొకదాంట్లో అతడు చెల్లెలు దుర్దండిని చేతులు కాళ్ళకు తగుమాత్రం కదల్చడానికి నడువడానికి మాత్రం వీలుండేలా గట్టి సంకెళ్ళు వేసి బంధించాడు. ఆమె కొడుకు మరో చెరసాలలో వున్నాడు.
మైరావణుడు రామ లక్ష్మణులను విభీషణుని రూపంలో వెళ్లి తెచ్చి కాళి గుడిలో బంధించినాడు. బలి ఈయా లనుకున్నాడు. ఆచారం ప్రకారం ఇంటి ఆడపడుచుచేత పసుపు నీళ్ళతో మంగళ స్నానం చేయించాక గన్నేరు పూదండలు మెడలో వేస్తారు. అప్పు డవి బలి ఈయదగిన నరపశువులు.
మైరావణుడు చెల్లెలుకు పురమా యించాడు రామ లక్ష్మణులకు స్నానాలు చేయించ మని. అట్లైతే శాశ్వతంగా బంధ విముక్తురాలిని చేస్తా నన్నాడు.
ఆమె పొలిమేరలోని అమృతసరస్సులో 12 బిందెల నీళ్ళు తేవాలని బయలు దేరుతుంది. ఆమె ఏడుస్తుంటే ఆంజనేయుడు ఓదార్చి ఆమె సంకెళ్ళు ఒక్క దెబ్బతో విరగ్గొడుతాడు. అవి మైరావణుడు తప్ప మరెవరూ తొలగించలేనివి. "నా కొడుకు బాల్యంలో వుండగా నారదుడు 'వీడు పాతాళ లంకకు రాజౌతా' డని చెప్పగా మా యన్న మమ్మ ల్నిద్దరినీ చెరలో బంధించా" డని ఆమె చెబుతుంది.
ఆంజనేయు డెంతో కష్టపడి అక్కడికి చేరుకొని ఆవేదనతో దుర్గాదేవి నీ విధంగా ప్రార్థించినాడు.
ఇలా ఎంతో కథ జరిగాక మైరావణుణ్ణి మారుతి సంహరిస్తాడు..
(వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనంలోని కొన్ని మాటల చిన్న ఆడియో అనుసంధించబడింది.)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
స్వర్గంబందలి వారికిన్ నరులకున్
సౌఖ్యంబు సాధింప దు
ర్మార్గ శ్రేణి వధింప భూమిపయికిన్
రాముండు సౌమిత్రియున్
భర్గ ప్రేయసి! వచ్చిరే! బలిగొనన్
వారిన్ భవత్కృత్యమే!
దుర్గా! నీవలనన్ జగద్వలయ మెం
తో దుఃఖ మందెన్ గదా!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
12.10.19
-----------------------------------------------------------
శార్దూలము:
రిప్లయితొలగించండిభర్గున్ రాణివి మాకు దల్లివిగ యంబానిన్ గనంగా సదా
మార్గంబే సుగమంబుగా జనగనే మాకీయ విన్నాణమున్
దుర్గంబే గనుసన్న గావక దయా దుర్గాంబ మమ్మేలకన్
దుర్గా నీవలనన్ జగద్వలయ మెంతో దుఃఖ మందెన్ గదా!
(నీవలనన్ = నీ దయలేక/కృపలేక.. జగద్వలయ = జగమంతా)