మంచిభావము. సంస్కృత విభక్తులతో వాడారు కొన్ని తత్సమము చేయకుండ. నాదానందమయాన్విత: మయము , అన్వితము రెండు సమానార్థకములే. ఆనందమయ మంటే ఆనందముతో కూడునదనియే. నాదానందరసాన్విత అన్వితాప్రమద: అన్విత అప్రమద అవుతుంది. అప్పుడు వ్యతిరేకార్థము. అట్లే విన్యాస అవిలాసాని అవుతుంది. అప్పుడు వ్యతిరేకార్థము. విలాసాని = విలాసములు ప్రథమా విభక్తి బహువచనము. తత్సమము చేసి వాడాలి. తత్సమము విలాసములు. సా ప్రాదాక్షిణ్యము: స కి దీర్ఘము రాదు. ప్రాదాక్షిణ్యము అంటేనే ప్రదక్షిణము చేయుట. ఇంక కృతము అవసరము లేదు. కృతం అని సున్నతో కూడదు. పునీత ఛదనా: పునీతచ్ఛదన అవుతుంది. నా దీర్ఘము రాదు. ప్రాలంకృతాన్: ప్రాలంకృతతన్ అని తత్సమము చేయాలి.
ఈ నాటి శంకరాభరణము సమస్య (కేదారేశ్వరుని నోమఁ గీడొనఁ గూడున్)
ఇచ్చిన సమస్య పాదము కందము నా పూరణము సీసములో
పూర్వము ఒకపట్టణమున కడు బీద రాళ్లైన వైశ్య పుత్రికలు భాగ్యవతి, పుణ్యవతి అను యువతులు కలరు. వారు ఒకసారి తండ్రి అనుజ్ఞ తో తమ బీదరికమును విస్మరించి భక్తిగా కేదారేశ్వర స్వామి వారి వ్రతము చేసినారు వారి భక్తికి మెచ్చి కేదారేశ్వరుడు రాజ్యమునేలు యువరాజులతో పరిణయ అనుగ్రహము కలిగించినాడు. పుణ్యవతి భర్త కడు మూర్ఖుడు అతడు ఒకనాడు తన మందిరములో తన భార్య చేతికి ఉన్న తోరము ఏమిటి అని అడిగాడు దానికి ఆ పుణ్యవతి కేదరేశ్వర స్వామి వారి నోము చేసినట్టి తోరము ఇది మనకు సర్వ సంపదలను ఒసగును అని తెల్పింది. మూర్ఖుడైన ఆ భర్త ఆవిడ మాటలు వినక తనను వశ పరుచు కొనుటకు దుష్ట బుద్ధితో వ్రతములు ఆచరించి తనను నాశనము చేయ దలచినది అని దుర్భాషలు ఆడుచు ఆ పుణ్యవతిని తిట్టుచు ఆ తోరమును తెంపి అగ్నిలో వేస్తాడు అట్టి సందర్భము లోనిది ఈ పూరణము ఇది కేదారేశ్వర వ్రత మహత్యము కధలో చెప్పబడిన ఉదంతము నా కల్పితము కాదు .
తోరము కట్టిన కారణం బడుగ కేదారేశ్వరుని నోము తోరమనచు తెలిపితివి, యెవరి దీవెనల్ కోరను,దుష్ట బుద్ధి కలిగి తోరమును ధ రించతగదు నీకు, వంచన తో నోము నోయగ నేల? తునుచగ వలయు తోరము నిపుడు, (కేదారేశ్వరుని నోమఁ గీడొనఁ గూడున్), తెగించి యిట్టి
నోములను గృహమున చేసి నా మనసును వశ పరచు కొన దలచితివా గడుసరి? యనుచు నా తోరమును లాగి నగ్ని లోన వేసె పుణ్య వతి మగడు రోస పడుచు
మీ కధలో కేదారవ్రతము సరిగా పాటించక పోవడం వలన ఏర్పడ కష్టం ఉంది .సమస్య లో కేదార వ్రతము చేస్తే వచ్చే ముప్పు ఉంది దీనికి ఎలా అన్వయం కలదు ?ఇక్కడ స్వేచ్ఛ చందం అని అనలేదు మరి మీరు ఇచ్చిన చందం కాకుండా స్వేచ్చా చందం చేస్తే సమస్య కి పూరణ ఎలా అవుతుంది?
“కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్” ఇది సమస్య. దీనిని నొక పాదము గా దలంచ నవసరము లేదండి. యథాతథముగా నెట్టి యక్షరపు మార్పులు లేకుండ పాదముగా నైనఁ బాదాంతరముగా నైనను బూరించ వచ్చును. మొదటి చివరి యక్షరములు సంధి గతములు కావచ్చును. ఛందోభేదముకావచ్చును.
Note: ఇవాళ ఏపనిచేయాలన్నా ఒక కాంట్రాక్టు ఇస్తే తప్ప కావు .అందుకే ఠేకేదారులు(Contractors) ఎక్కువవుతున్నారు.వీళ్ళ గురించి చేసే వ్రతమే దుఃఖానికి కారణం అన్న విధంగా
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
గోదారిన్ పయనించకే ప్రజలహో కొండంత ధైర్యమ్ముతో
మా దారే కడు మిన్న దారియనుచున్ మర్యాద లేకుండనే
కేదారమ్మున పోయి మెండు వరదల్ కీడించి పీడించగా
కేదారేశు వ్రతమ్ముఁ జేసిన జనుల్ గీడొంది దుఃఖింపరా
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏదారి బట్టి వెళ్లిన
రిప్లయితొలగించండినా దారియె కడకు జేరు గాదా యటకున్
ఆధారము లేదే! ఏ
కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్?
రామ్ కిడాంబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేదనలను హరియించును
రిప్లయితొలగించండికేదారేశ్వరుని నోమఁ, గీడొనఁగూడున్
రోదనము చేయుచు బ్రతుకు
పేదలకు సహాయ పడక వేధించినచో
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలేదేని భక్తి మనమున
రిప్లయితొలగించండికేదారేశ్వరునియందుకించిత్తయినన్
వేదోక్తవిధిని పావన
కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్"
భక్తిశ్రద్ధలు లేని పూజ కీడు కలిగిస్తుందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినేదంపూర్వవిధాన దుష్టమతులై నిత్యమ్ము సన్మార్గులన్
రిప్లయితొలగించండివేదారాధ్యుల దూరుచుండి ఖలతావేశమ్ముతో దీనులన్
మోదం బందుచు ఖేదసాగరమునన్ ముంచంగ యత్నించుచున్
కేదారేశు వ్రతమ్ముఁ జేసిన జనుల్ గీడొంది దుఃఖింపరా.
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిచేదున్ మ్రింగినవాడు లోకములకున్ శ్రేయస్సునందింప , శ్రీ...
పాదమ్మున్ మది నమ్మువారలకు సద్భాగ్యప్రదుండాతడే
కేదారేశుడు., వాని నింద దగునే ? కీడౌను మీకిట్లనన్
" కేదారేశు వ్రతమ్ముఁ జేసిన జనుల్ గీడొంది దుఃఖింపరా!"
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండికేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్
రిప్లయితొలగించండిబాధింపగ జనుల నెపుడు
వేధించుచు వారిని, బహు వేదములొల్లన్
బోధించుచు నీతుల నిల
కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యుణ్ణి 🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండినీ దారి సుగమ మగునా
కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్
రాదారి బోవు వారల
మోదమ్ముగ గురువులంచు మ్రొక్కగ నరుడా!
జిలేబి
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
Feminist Viewpoint:
వేదాంతమ్మును నేర్చినట్టి మునులన్ వేవేల ప్రార్థించుచున్
కేదారేశు వ్రతమ్ము జేసి సతియే క్లేశమ్ము కోల్పోవుటన్
మోదమ్మున్ కడు పొంది యర్ధ తనువున్ పోరాడి కోల్పోయెనే
కేదారేశు వ్రతమ్ముఁ జేసిన జనుల్ గీడొంది దుఃఖింపరా :)
సతి = భార్య
రెండవ పూరణము 🙏🙏
రిప్లయితొలగించండికేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్
బాధను పరులకు నొసగెడి
లేదా జనులకు భయమవ లేస్యము యంతన్
కాదా మరియిది సత్యము,
కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్!!
కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్
తొలగించండిమోదంబెరుగక మూర్ఖపు
వాదన జేసెడి మనుజుని పాపంబెరుగన్
రోదన తప్పదు జగమున
కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్
రిప్లయితొలగించండినా పూరణ. శార్ధఃలము
*****
ఏ దైవ వ్రత మాచరించి హృది బూజించన్ నితాంతమ్ముగా
నా దైవమ్మె యశస్సు శ్రీలు ఘన భాగ్యంబుల్ ప్రసాదించడే??
ఏ దోషమ్ము స్పృశించదే కుమతి భాషించంగ నీరీతిగన్?
కేదారేశు వ్రతమ్ముఁ జేసిన జనుల్ గీడొంది దుఃఖింపరా"
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
దైవ వ్రతము లో...
తొలగించండివ లఘువా గురువా?
పండితులు వివరించగలరు
పేదల నార్తుల యందున
రిప్లయితొలగించండినే దయ జూపని మనుజు ల దెంత యు భక్తి న్
తాదా త్మ్య ము లేని మదిని
కేదారే శ్వ రు ని నోమ కీ డొ న రిం చున్
బాధాకరమగు వినగను
రిప్లయితొలగించండికేదారేశ్వరుని నోము కీడొనరించున్
నాదాత్మకు నర్చించిన
ఖేదంబులు దొలగిపోయి ఖిలమగు నఘముల్
ఖేదములు తొలగిపోవును
రిప్లయితొలగించండికేదారేశ్వరుని నోమఁ ; గీడొనఁగూడున్
మేధావిగ చెప్పుకొనెడి
నాధుని నమ్మగ , నిజమిది నమ్ము మికపయిన్
శంకరార్యులకు,సభ్యులకు కేదారేశ్వరుడు ఖేదముల కలగనీయకుండు గాక!💐
రిప్లయితొలగించండియాదవికిఁమేను సగమిడె
కేదారేశ్వరుని నోమఁ; గీడొనఁగూడున్
ఖేదము గల్గును, శంకరు
నాదేవుని దలపకున్న నస్సలు చెడునే!
యాదవి-పార్వతి
రాదేపుణ్యము సంతతమ్ము భువి స్వార్థమ్మౌగతిన్ బోవుచున్
రిప్లయితొలగించండికేదారేశు వ్రతమ్ముఁ జేసిన, జనుల్ గీడొంది దుఃఖింపరా
కాదంబమ్ముల బోలు వానలువెసన్ గావించవిధ్వంసమున్
బాధల్ పొందుచునుండు వారలను కాపాడన్ శుభమ్మౌ గదా
రిప్లయితొలగించండినాదానందమయాన్వితాప్రమదవిన్యాసావిలాసానిసా
ప్రాదక్షిణ్యకృతంపునీతఛదనాప్రాలంకృతాన్ పుణ్యమౌ
కేదారేశు వ్రతమ్ముఁ జేసిన, జనుల్, గీడొంది దుఃఖింపరా
రాదారిన్ చను వారలెల్లరిని వీరావేశులై గొల్వగా!
జిలేబి
తొలగించండివావ్!!!
ఈరోజు మీరు కేదారేశ్వర వ్రతం చేసినట్లున్నారు
👌
జిలేబి గారి పద ప్రయోగము అద్భుతము
తొలగించండి
తొలగించండి:) ఇంతకీ సరియా కాదా తెలుపగలరు :)
జీపీయెస్ వారు
మీ సమూహము లో వేసి ఈ పదబంధము సరి యే నా అని తెలుపవలె :)
జిలేబి
తొలగించండిప్రయత్నించెదను...సారు వరంగల్ యాత్రలోనున్నారు
తొలగించండిసమూహములో ప్రచురించితిని...స్పందన వచ్చినచో ఇచ్చట తెలిపెదను
జిలేబి గారు గీర్వాణభాషాజ్ఞు / జ్ఞ లవు చున్నారు. మహదానందము.
తొలగించండినాదానందమయాన్వితాప్రమదవిన్యాసావిలాసానిసా
ప్రాదక్షిణ్యకృతంపునీతఛదనాప్రాలంకృతాన్ పుణ్యమౌ
ఈ సమాసమును పద విభజన చేసి మీ భావము వివరించిన గుణ దోషములను పరిశీలించఁ దగును.
తొలగించండిపోచిరాజు వారికి నమస్సులు
Just experimented only :)
Pl do let me know for learning.
నాదానందమయాన్వితా - నాదానందముతో కూడుకొన్నట్టి
ప్రమద విన్యాసా విలాసాని - సంతోషము కూడినట్డి రచనల విలాసము తో
సా ప్రాదక్షిణ్యకృతం - ప్రదక్షిణలతో
పునీత ఛదనా ప్రాలంకృతాన్ - పునీత మైనట్డి ఆకులతో ( బిల్వపుటాకులతో) అలంకరించబడిన ట్టి కేదారేశు వ్రతమ్ముఁ జేసిన పుణ్యమగును.
సరియేనాండి ?
జిలేబి
మంచిభావము. సంస్కృత విభక్తులతో వాడారు కొన్ని తత్సమము చేయకుండ.
తొలగించండినాదానందమయాన్విత: మయము , అన్వితము రెండు సమానార్థకములే.
ఆనందమయ మంటే ఆనందముతో కూడునదనియే.
నాదానందరసాన్విత
అన్వితాప్రమద: అన్విత అప్రమద అవుతుంది. అప్పుడు వ్యతిరేకార్థము.
అట్లే విన్యాస అవిలాసాని అవుతుంది. అప్పుడు వ్యతిరేకార్థము.
విలాసాని = విలాసములు ప్రథమా విభక్తి బహువచనము. తత్సమము చేసి వాడాలి. తత్సమము విలాసములు.
సా ప్రాదాక్షిణ్యము: స కి దీర్ఘము రాదు. ప్రాదాక్షిణ్యము అంటేనే ప్రదక్షిణము చేయుట. ఇంక కృతము అవసరము లేదు. కృతం అని సున్నతో కూడదు.
పునీత ఛదనా: పునీతచ్ఛదన అవుతుంది. నా దీర్ఘము రాదు.
ప్రాలంకృతాన్: ప్రాలంకృతతన్ అని తత్సమము చేయాలి.
నా దానంద రసాన్వితప్రమద విన్యాసమ్ములం గ్రీడలన్
బ్రాదక్షిణ్యములం బునీత దళ సుప్రాలంకృతం బైన మేల్
కేదారేశు వ్రతమ్ముఁ జేసిన ...
తొలగించండినమో నమః
నెనరులు !
జిలేబి
ఖేదంబుల్ దరిజేరవెన్నడునునాకీడుల్ నివారంబగున్
రిప్లయితొలగించండికేదారేశు వ్రతమ్ముఁ జేసిన, జనుల్ గీడొంది దుఃఖింపరా
భేదంబుల్ మదినిల్పిజేయ నిల నిర్భీతాత్ములైమానవుల్
కేదారేశు వ్రతమ్ము? సత్ఫలములింకేరీతిగా ప్రాప్తిలున్ ?
రిప్లయితొలగించండిరాదారి మూర్ఖుడనగా
"కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్"
సోదర! వాదించగ నీ
వా దోమ నడచను చెంప వాయించినటుల్!
సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ :)
కష్టేఫలి - మూర్ఖుల మనసు రంజింపరాదు
http://kasthephali.blogspot.com/2019/10/blog-post_28.html
జిలేబి
బాధలు తీర్చెడు వాడే
రిప్లయితొలగించండియాదిశబరుడంచు నమ్మి యారాధింపన్
మోదమె గలుగున్ మరచిన
కేదారేశ్వరుని నోమఁ, గీడొనఁగూడున్.
ఆదిశమొల వేల్పు శివుని
రిప్లయితొలగించండియా దహనాంబకుని గొలువు నాపకు మెపుడున్
వాదింపకు తప్పనుచును
కేదారేశ్వరుని నోమఁ ; గీడొనఁగూడున్ !
వాదమ్మేల ప్రశాంత చిత్తమమరన్ బంధమ్ములన్ ద్రుంచగన్
రిప్లయితొలగించండిలేదే వేరొక మార్గమీ యవనిపై లేదంద్రు దుఃఖ్ఖమ్మికన్
కేదారేశు వ్రతమ్ముఁ జేసిన జనుల్; గీడొంది దుఃఖింపరా
వేదార్థమ్ముల నింద సేయు కుమతుల్ వేవేల జన్మంబులన్
వేదో క్తంబగు వ్రతములు
రిప్లయితొలగించండియాదా లాపముగ జేయ హానిని జేయున్
ఆదట లేకను జేసిన
కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్
వేదమ్మెందుకు మంత్రమెందుకిల సర్వేశుండనే కొల్వగన్
రిప్లయితొలగించండిమోదమ్మందడె నామమున్ దలచుచున్ బూజించినన్ జాలుగా
కాదేసత్యము నీదుమాటలవి నేఖండింతునీ మాటలౌ
కేదారేశు వ్రతమ్ముఁ జేసిన జనుల్ గీడొంది దుఃఖింపరా
బాధల్ తీరును భాగ్యమబ్బు గదరా, ప్రాప్తించు మోక్షమ్మదే
రిప్లయితొలగించండియాదేవేశుడు లోకరక్షకుడు సంధ్యావాటి విశ్వాత్ముడౌ
కేదారేశు వ్రతమ్ముఁ జేసిన, జనుల్ గీడొంది దుఃఖింపరా
వేదార్థమ్ముల వీడి నాస్తికతపై విశ్వాసమున్ జూపినన్.
ఆదాయముపెరుగునుసుమ
రిప్లయితొలగించండికేదారేశ్వరునినోమ,గీడొనగూడున్
కేదారవ్రతముజేయక
యాదినమున్బీరుద్రాగియటునిటుదిరుగన్
వాదోప వాదముల నే
రిప్లయితొలగించండిలా దూఁకంగ ననివార్యమా యియ్య దిటం
బోదము వేగమ్ముగ నే
కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్ ?
ఏ దానమ్ములు సేయ కీ పుడమి ద్వేషేర్ష్యాది భావమ్ములం
దాదాత్మ్యమ్మున దుష్ట కార్య రతి నిత్యం బుండి ఘోరంబుగం
బాదాక్రాంతులఁ జేసి దీనుల నిలన్ బాధించి తోరమ్ముగం
గేదారేశు వ్రతమ్ముఁ జేసిన జనుల్ గీడొంది దుఃఖింపరా
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్
సందర్భము:పంచక్రోశ శ్రీ కాశీ క్షేత్రంలో మృతి చెందనున్న వాని కుడి చెవిలో శివుడు తారక మంత్రాన్ని ఉపదేశించి ముక్తి ప్రసాదిస్తాడు. (ముక్తికోపనిషత్)
కాశీలో శవాలను దహన సంస్కారాలకై తీసుకుపోయేటప్పుడు "రామ్ నామ్ సత్య్ హై" "రామనామ్ సత్య్ హై.." అనే నినాదాలు వినిపిస్తాయి.
అవిముక్త క్షేత్ర మని ప్రసిద్ధి గాంచిన కాశిలో మృతి జెందబోయే వాని చెవిలో విశ్వనాథుడు రామతారక మంత్రాన్ని ఉపదేశించగా ఆతడు ముక్తి నందుతా డని విజ్ఞులు చెబుతారు.
అటువంటప్పుడు కేదారేశ్వర వ్రత మాచరించే వారి కెలా కీడు కలుగుతుంది?
~~~~~~~~~~~~~~~~~~~~~~~
శ్రీద మగు కాశి మృతునికి
కా దన కా రామ తారకముఁ జెవిఁ జెప్పున్
మోదమున ముక్తిఁ గన.. నెటు
కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్?
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
28.10.19
-----------------------------------------------------------
ఆదాయమ్మదివృద్ధిగానగునికన్నారోగ్యమున్బెంపగున్
రిప్లయితొలగించండిగేదారేశువ్రతమ్ముజేసిన,జనుల్ గీడొందిదుఃఖింపరా
కేదారేశువ్రతమ్ముజేయకనికన్గేదారునిందించుచో
నాదైవమ్మునుగోపగించిననికన్నైరాశతోనుండుచున్
(కొన్నేండ్ల క్రిందట కేదారనాథ్ జలప్రళయంలో మరణించిన కుటుంబాలకు చెందిన ఒకరి భావన)
రిప్లయితొలగించండివేదమ్ముల్ గొనియాడు శంకరునిపై
వేనోళ్ల స్తోత్రంబులన్
మోదమ్మేచగ పాడుకొంటి ; మకటా !
ముద్దారు పూమొగ్గలే !
వాదమ్మేల ? జలప్రవాహమున వే
ప్రాణాల గోల్పోయిరే !
కేదారేశు వ్రతమ్ము జేసిన జనుల్
గీడొంది దుఃఖింపరా ?
శార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించండిఏ దారైనను ముక్తినందుటకునౌ యేర్పాటనన్ మూర్ఖులై
మాదైవమ్మన బ్రహ్మచారి మిగులన్ మన్నించు పాపాత్ములన్
మీదైవమ్మున కిద్దరాండ్ర తగవుల్ మేల్బాపు గేస్తుండనన్
గేదారేశు వ్రతమ్ముఁ జేసిన జనుల్ గీడొంది దుఃఖింపరా?
మాదారెంచి పునీతులౌమనెడు నీ మైకమ్ము నేమందుమే?
కేదారమ్ములు పండుచో మనుగడల్ కేరింతలై యొప్పగన్
రిప్లయితొలగించండిమోదంబొందరె!, పంట పండని తరిన్ ముప్పొద్దు ఖేదంబులౌ
కేదారమ్మలకీశుడర్చితుడునై కీడెంచునే? యెవ్విధిన్
కేదారేశు వ్రతమ్ముఁ జేసిన జనుల్ గీడొంది దుఃఖింపరా?
ఈ నాటి శంకరాభరణము సమస్య
రిప్లయితొలగించండి(కేదారేశ్వరుని నోమఁ గీడొనఁ గూడున్)
ఇచ్చిన సమస్య పాదము కందము నా పూరణము సీసములో
పూర్వము ఒకపట్టణమున కడు బీద రాళ్లైన వైశ్య పుత్రికలు భాగ్యవతి, పుణ్యవతి అను యువతులు కలరు. వారు ఒకసారి తండ్రి అనుజ్ఞ తో
తమ బీదరికమును విస్మరించి భక్తిగా కేదారేశ్వర స్వామి వారి వ్రతము చేసినారు వారి భక్తికి మెచ్చి కేదారేశ్వరుడు రాజ్యమునేలు యువరాజులతో పరిణయ అనుగ్రహము కలిగించినాడు. పుణ్యవతి భర్త కడు మూర్ఖుడు అతడు ఒకనాడు
తన మందిరములో తన భార్య చేతికి ఉన్న తోరము ఏమిటి అని అడిగాడు దానికి ఆ పుణ్యవతి కేదరేశ్వర స్వామి వారి నోము చేసినట్టి తోరము ఇది మనకు సర్వ సంపదలను ఒసగును అని తెల్పింది. మూర్ఖుడైన ఆ భర్త ఆవిడ మాటలు వినక తనను వశ పరుచు కొనుటకు దుష్ట బుద్ధితో వ్రతములు ఆచరించి తనను నాశనము చేయ దలచినది అని దుర్భాషలు ఆడుచు ఆ పుణ్యవతిని తిట్టుచు ఆ తోరమును తెంపి అగ్నిలో వేస్తాడు అట్టి సందర్భము లోనిది ఈ పూరణము ఇది కేదారేశ్వర వ్రత మహత్యము కధలో చెప్పబడిన ఉదంతము నా కల్పితము కాదు .
తోరము కట్టిన కారణం బడుగ కేదారేశ్వరుని నోము తోరమనచు
తెలిపితివి, యెవరి దీవెనల్ కోరను,దుష్ట బుద్ధి కలిగి తోరమును ధ
రించతగదు నీకు, వంచన తో నోము నోయగ నేల? తునుచగ వలయు
తోరము నిపుడు, (కేదారేశ్వరుని నోమఁ గీడొనఁ గూడున్), తెగించి యిట్టి
నోములను గృహమున చేసి నా మనసును
వశ పరచు కొన దలచితివా గడుసరి?
యనుచు నా తోరమును లాగి నగ్ని లోన
వేసె పుణ్య వతి మగడు రోస పడుచు
మీ కధలో కేదారవ్రతము సరిగా పాటించక పోవడం వలన ఏర్పడ కష్టం ఉంది .సమస్య లో కేదార వ్రతము చేస్తే వచ్చే ముప్పు ఉంది దీనికి ఎలా అన్వయం కలదు ?ఇక్కడ స్వేచ్ఛ చందం అని అనలేదు మరి మీరు ఇచ్చిన చందం కాకుండా స్వేచ్చా చందం చేస్తే సమస్య కి పూరణ ఎలా అవుతుంది?
తొలగించండి“కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్” ఇది సమస్య.
తొలగించండిదీనిని నొక పాదము గా దలంచ నవసరము లేదండి. యథాతథముగా నెట్టి యక్షరపు మార్పులు లేకుండ పాదముగా నైనఁ బాదాంతరముగా నైనను బూరించ వచ్చును. మొదటి చివరి యక్షరములు సంధి గతములు కావచ్చును. ఛందోభేదముకావచ్చును.
అజ్ఞానాంధకారము నందు తూగు జనుల మానసము....
రిప్లయితొలగించండికందం
నీదానను నేనే నా?
పాదుకొనుచు జూటమందు పారెడు గంగా??
సాధించ గిరిజ తడబడు
కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్!?
మోదంబొందిరిగదనా
రిప్లయితొలగించండికేదారేశ్వరుని నోమ, గీడొనఁగూడున్
ప్రోదింజేసినపాపము
కాదనలేనిది గదనిట కరుణనువీడన్!!
కం.
రిప్లయితొలగించండిపాదును పొందగ జీవుల
కాధారమునాకపర్ది కనికరమందున్
కాదని వ్యర్థపు మాటల
కేదారేశ్వరుని నోమ గీడొన గూడున్
వై. చంద్రశేఖర్
శా. సౌధంబై ననుపెళ్ళియైనఁ పుడమిన్సౌలభ్యమేదున్నయున్
రిప్లయితొలగించండినీదారిన్గనివచ్చునే హతవిధీ నీవిచ్చుకాంట్రాక్టుకే
పోదారేదియుకానకీవిధినవాపోవంగబాధాయె, ఠే
కేదారేశు వ్రతమ్ముఁ జేసిన జనుల్ గీడొంది దుఃఖింపరా.
Note: ఇవాళ ఏపనిచేయాలన్నా ఒక కాంట్రాక్టు ఇస్తే తప్ప కావు .అందుకే ఠేకేదారులు(Contractors)
ఎక్కువవుతున్నారు.వీళ్ళ గురించి చేసే వ్రతమే దుఃఖానికి కారణం అన్న విధంగా
రిప్లయితొలగించండిమోదము కూర్చును సతతము
కేదారేశ్వరని నోము,గీడొనగూడున్
లేదేఫలమని తిట్టిన
వేదనె మిగులును నిజమిది వినుమిది పుత్రా