6, అక్టోబర్ 2019, ఆదివారం

సమస్య - 3154 (శతకములన్ రచించుట...)

కవిమిత్రులకు దుర్గాష్టమి, చద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శతకముల రచనమ్ము నిష్ఫలమె సుమ్ము"
(లేదా...)
"శతకములన్ రచించుట ప్రశస్తము గాదది నిష్ఫలమ్మె పో"
(ఈరోజు నా 'శంకర శతకము' ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ సందర్భముగా...)

41 కామెంట్‌లు:


 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  మితమగు మాట లాడకయె మిక్కిలి సూక్తులు నొక్కి పల్కుచున్
  పతనము కాగ సత్కృతులు పాపము! కర్చు భరింప జాలకే
  సతమత మౌచు శంకరయ! సత్యము చెప్పిరి సూటిపోటుగా:
  "శతకములన్ రచించుట ప్రశస్తము గాదది నిష్ఫలమ్మె పో"

  రిప్లయితొలగించండి
 2. అర్థ సాధనొకటె పరమార్థమనుచు
  రాగ బంధాలు విడి రంగు రాలవెనుక
  పరుగు లెత్తెడు మూర్ఖుని పలుకులివియె
  శతకముల రచనమ్ము నిష్ఫలమె సుమ్ము

  రిప్లయితొలగించండి
 3. ప్రభాకర శాస్త్రి గారూ,
  మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
  నా శతకాలను ముద్రించడానికి సహృదయ కవిమిత్రులు ఎవరో ఒకరు ముందుకొస్తున్నాను. కాని మంచి శతకాలు వ్రాసి ముద్రించుకులేని పరిస్థితుల్లో ఉన్న కవిమిత్రులెందరో ఉన్నారు.

  రిప్లయితొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  మతి జలధిన్ మథించి , పరమంబగు భావసుధన్ గ్రహించి, భా..
  రతి కృపగా దలంచి మధురంపు పదాల కవిత్వమల్లగా
  కృతి సుకృతమ్మగున్ ., కవికి కీర్తినిడున్ , రసహీనమైనవౌ
  శతకములన్ రచించుట ప్రశస్తము గాదది నిష్ఫలమ్మె పో !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 5. ఘనముగ నొనరించితిని నే ననువుగ బహు

  శతకముల రచనమ్ము , నిష్ప లమె సుమ్ము

  రమ్యముగ వాటిని కనుచు సాయ

  పడని వారు లేకున్మ నీ పుడమి పైన

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
 6. చదువరులు కరువౌ ప్రపంచమున నేడు
  శతకముల రచనమ్ము నిష్ఫలమె సుమ్ము
  యనుట తరచుగా నిలలోన వినుట కద్దు
  అచ్చు కావచ్చునే కాని రచన కాదు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. అచ్చు నిష్ఫలము కావచ్చేమో కానీ, రచన ఏనాటికీ నిష్ఫలము కాదు... అని

   తొలగించండి
 7. మనసునను కలావాసిని మధురమైన
  పలుకు లొసగిన నత్తమ్మ చల విదిల్చ
  లేని కలుముల నతులును లేమి కతన
  "శతకముల రచనమ్ము నిష్ఫలమె సుమ్ము"

  రిప్లయితొలగించండి

 8. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితము)

  గతుకుల బాట గాంచగను కయ్యము వియ్యపు రాజధానినిన్
  స్తుతమగు రీతి దెప్పుచును శోకము దీర్చెడి నవ్వులాటలన్
  యతనము జేసి వ్రాయుమయ! హైరన నొందక యిట్టి మాటలన్:
  "శతకములన్ రచించుట ప్రశస్తము గాదది నిష్ఫలమ్మె పో"

  (నేను రచించిన "రంగరాయ వాస్తవ శతకము" దృష్ట్యా)

  రిప్లయితొలగించండి


 9. "శతకముల రచనమ్ము నిష్ఫలమె సుమ్ము"
  ముతక మాటల పల్కుచు మూర్ఖు లేను
  చెప్పె దరిటుల వినకుడి చెడు కనవల
  దయ్య చెడును, కదలవలె ధాటి గాను
  ధ్యేయమును చేర నడవండి ధీమతులుగ


  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. సారహీనమైనట్టి సంసార జలధి
  తరణమొనరింప జేయు నుపకరణముగ
  హితముఁదెలుపని పసలేని శత సహస్ర
  శతకముల రచనమ్ము నిష్ఫలమె సుమ్ము

  రిప్లయితొలగించండి


 11. శతకములన్ రచించుట ప్రశస్తము; గాదది నిష్ఫలమ్మె పో
  బతుకున కిచ్చుచున్ దెసను భారతి చెంగట వందనమ్మిడన్
  సతతము, ప్రేరితమ్మగును; సాచివిలోకిత మై కృపన్ గనన్
  స్థితిగతు లెల్లమారు సఖ శ్రేయము ప్రేయము గూడు లెస్సగా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. శంకరునిగూర్చి వ్రాయగ శంక లేదు
  తనివి దీరి ముక్తి లభించు తథ్యముగను,
  ప్రజల బాగును గోరుచు వ్రాయు నీతి
  శతకముల రచనమ్ము నిష్ఫలమె సుమ్ము

  రిప్లయితొలగించండి

 13. నా పూరణ. చం.మా.
  ***** ****
  సతతము జ్యోత్స్నలే ప్రకృతి సంద్రము భామిని ఒంపు సొంపులే

  కృతులకు వస్తువయ్యె! విపరీతమె యిద్దియు!కర్షకాళి దు

  ర్గతులను గూటి పేదలను శ్రామిక క్షోభలు భాగ్య హీనులన్

  సతమత జీవితమ్ములను జక్కగ దెల్పగ లేని హీనమౌ

  శతకములన్ రచించుట ప్రశస్తము గాదది నిష్ఫలమ్మె పో


  🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
  🌷🌷 వనపర్తి 🌷🌷  రిప్లయితొలగించండి
 14. ఏమి కోర్కొని రచనల జేసి నావు?
  ఎవరు చదువంగ వలెనని వ్రాసి నావు?
  శతకముల రచనమ్ము నిష్ఫలమె సుమ్ము
  కాదు నెప్పుడు సరసమౌ కవికి జూడ
  నీ దురదను గోకితివిగా తీరు బడిగ???

  రిప్లయితొలగించండి
 15. ఘనముగ నొనరించితిని నే ననువుగ బహు

  శతకముల రచనమ్ము , నిష్ప లమె సుమ్ము

  రమ్యముగ వాటిని కని ముద్రణకు సాయ

  పడని వారు లేకున్మ నీ పుడమి పైన

  రిప్లయితొలగించండి
 16. అతులిత భావ సంపదల నందరి మెప్పునుఁ బొంది హృద్యమై
  సతతము నిల్చి నీతులను చంద్రికలన్ గురిపించి నిత్యమున్
  బ్రతుకున జీకటుల్ తుడుచు భర్తృహరిన్ దలపించు గొప్పనౌ
  శతకములన్ రచించుట ప్రశస్తము, గాదది నిష్ఫలమ్మె పో!

  రిప్లయితొలగించండి
 17. భవుని మహిమ ల ను దెలు పి భక్తి నింపు
  శంకర శ త క మ్మి ల లోన శంకలేక
  శత క ము ల రచ న మ్ము ని ష్ప ల ము సుమ్ము
  గాక కనువిప్పు జనులకు గలుగ జేయు

  రిప్లయితొలగించండి
 18. సతతము ధర్మ మార్గమున సాధన జేయుచు భక్తి శ్రద్ధలన్
  శతకములన్ రచించుచు ప్రశంసలనందుట శ్రేష్టమౌనుగా
  కృతకములైన మాటల నకృత్యపు భావనలందు దేలుచున్
  శతకములన్ రచించుట ప్రశస్తము గాదది నిష్ఫలమ్మె పో

  రిప్లయితొలగించండి
 19. సకల జనులకుశ్రేయమ్ముశతముకొలది
  శతకములరచనమ్ము,నిష్ఫలమెసుమ్ము
  శతకపఠనముజేయకముద్రజేయ
  మూలవేతురుకట్టల పొత్తములను

  రిప్లయితొలగించండి
 20. (కావ్యంలోలా నవరసాలు ,అలంకారాలు ,ధ్వని ,
  పాత్రచిత్రణం ,శ్రేయస్సు లేని శతకరచన వ్యర్థమే )
  వెతకిన నెంతగన్ శతక
  వీథులలోన నొకేవిధంబుగా
  నుతులిడు భక్తిభావములు
  నొప్పుగ నుండు ; రసంబు - వ్యంగ్య - మౌ
  చితియు - నలంకృతుల్ - హితము -
  చిత్రితపాత్రలు లేని శుష్కమౌ
  శతకములన్ రచించుట ప్ర
  శస్తము గాదది నిష్ఫలమ్మె పో !!

  రిప్లయితొలగించండి
 21. తే.గీ.
  నీతి బోధించ కుదురుగ నిలుచు నటుల
  పూర్వ రచనలు యెన్నియో పుట్టు కొచ్చె
  నేటి కల్పన గణముల మేటికాగ
  శతకముల రచనమ్ము నిష్ఫలమె సుమ్ము

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 22. హితమగు సాహితీ సరస హృష్టిని చల్లని, మానవాళిఁ జా
  గృత పరచే సనాతనపు దృష్టి నొసంగని, తేనెలొల్కు లా
  లితమగు తెన్గు మాట ప్రసరించని వృద్ధిని జేయనట్టి యా
  శతకములన్ రచించుట ప్రశస్తము గాదది నిష్ఫలమ్మె పో౹౹

  రిప్లయితొలగించండి
 23. ధన మొసంగినఁ బాడునె యనిమకమ్ము
  విత్త మీయంగ విచ్చునె విరులు పుడమి
  ఫల మనంగ విత్తంబని తలఁచ నిజము
  శతకముల రచనమ్ము నిష్ఫలమె సుమ్ము


  దక్ష యజ్ఞము:

  సిత నగ వాస నర్తన విశిష్ట వికాస సతీ మనః ప్రి యా
  సిత గళ భస్మ చర్చిత విశేష నిభాక్ష విలాస నిత్య స
  న్నత జన రక్ష ణైక రత నాగ కలాప నిరీశ్వ రార్చనా
  శతకములన్ రచించుట ప్రశస్తము గాదది నిష్ఫలమ్మె పో

  రిప్లయితొలగించండి
 24. కృతకములైన భావములగూర్చుచువేలకువేలుగానికన్
  శతకములన్ రచించుట ప్రశస్తముగాదది నిష్ఫలమ్మెపో
  శతకములన్నియున్ జనుల సమ్మతమైనవిధంబునుండుచో
  నతులితభక్తిభావముననందరుమోదముతోబఠింతురే

  రిప్లయితొలగించండి
 25. అతుకని పాదముల్ మరియునర్థములెట్టి నిఘంటువందునన్
  వెతికిననెంతమాత్రము లభింపని పిచ్చి పదాలఁగూర్చుచున్
  ప్రతినను బూని పద్యములు వంద రచించుటె లక్యమైనచో
  *"శతకములన్ రచించుట ప్రశస్తము గాదది నిష్ఫలమ్మె పో"*

  రిప్లయితొలగించండి
 26. గురువు గారికి నమస్సులు.
  చక్కని కవితయున్ వ్రాయ సరిపడునటు
  ప్రాస గణ,యతి, నియమముల్ , భావముగద
  పద్య మగు సూక్తియున్ దెల్పి పారి బోవ
  శతకమ్ముల రచనమ్ము నిష్పలమె సుమ్ము.

  రిప్లయితొలగించండి
 27. విరించి.

  కృతులవి జాతి సంపదగ కీర్తి గడించిన వెన్నొ యట్టియౌ
  కృతులను వ్రాయు సత్కవులఁ గేలుల మోడ్చి నుతింపగా వలెన్
  సతతము జాతి శ్రేయమును సంస్కృతి గొప్పదనమ్ము చాటెడిన్
  శతకములన్ రచించుట ప్రశస్తము, గాదది నిష్ఫలమ్మె పో

  రిప్లయితొలగించండి
 28. నా ప్రయత్నం :

  తేటగీతి
  గతమున వెలయించిన వారి గౌరవించి
  నూతనత్వము గూర్చుచు జాతిహితము
  భక్తి భావము ప్రజలకేర్పఱచ లేని
  శతకముల రచనమ్ము నిష్ఫలమె సుమ్ము

  చంపకమాల
  అతులిత వేద గ్రంధములు నర్థము గావని యంగముల్ దగన్
  జతగను గూర్చిరే యుపనిషత్తుల, స్వానుభవాంతరంగపున్
  శ్రుతులన నేటికాలమున లోకము మెచ్చని భావ శుష్కతన్
  శతకములన్ రచించుట ప్రశస్తము గాదది నిష్ఫలమ్మె పో

  రిప్లయితొలగించండి
 29. అతులితభక్తిభావమిళితార్థనుతిప్రతిపాదితమ్మునై
  శృతిసుభగత్వశబ్దవివశీకృతమానసహారకమ్మునై
  కృతి సుకృతిం గనున్, కవులు శ్రీశసమర్పణఁ జేయనట్టి యా
  శతకములన్ రచించుట ప్రశస్తము గాదది నిష్ఫలమ్మె పో.

  రిప్లయితొలగించండి
 30. ఛందమేదైన జనులు కానంద మొసగు
  శతకముల రచనమ్ము, నిష్ఫలమె సుమ్మ
  టంచు చులకన చేయుట యనుచితమని
  పలుకు చుందురు విబుధులు వసుధ యందు

  రిప్లయితొలగించండి
 31. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "శతకములన్ రచించుట ప్రశస్తము గాదది
  నిష్ఫలమ్మె పో"

  సందర్భము: పద్య కవిత్వం వ్రాసే ఆరంభ దశలో ఇష్టదైవం మీద శతకం వ్రాయటం ప్రాచీనకాలంనుంచీ అలవాటుగా వస్తున్నది.
  ఎందుకంటే దానితో రెండు ప్రయోజనా లున్నవి. ఒకటి ఇష్టదైవాన్ని ధ్యానించటం.. అది ఆధ్యాత్మికం. రెండవది సాహితీ కృషి చేయటం. అది ఐహికం. ఈ విధంగా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. అన్నట్టుగా ప్రయోజనం కలుగుతుంది.
  ఏ కృతినైనా ఏకాలంలోనైనా ఎంతటి వారైనా సర్వశుభదం కాబట్టి శ్రీ కారంతోనే ఆరంభిస్తారు. అప్పుడప్పుడే పద్యాలు వ్రాయటం మొదలుపెట్టి తన జీవిత కాలంలో తొలి పద్య కృతిని వ్రాయబోతున్న దశలో శతకాన్ని ఆరంభించినపుడు ఒక ఆరంభ కవి శ్రీ కారాన్ని తొలి పద్యంలో నిలుపటం ఎంతైనా శుభప్రదం. ఒక సంప్రదాయం.

  శ్రీ కారము కృత్యాదిని
  బ్రాకటముగ నున్నఁ జాలు బహు దోషములం
  బోకార్చి శుభము లొసగును
  బ్రాకృతమున నినుము సోకు
  పరుసము భంగిన్ 188

  కృత్యాదిలో శ్రీ కార ముంచి రచించినచో ఇనుము పరుసవేది సోకిన బంగార మగునట్లు ఎన్ని దోషము లున్నను దొలగి శుభము కలుగును. ప్రాచీన గ్రంథములం దెల్ల మొదటి పద్యము శ్రీ కారముతోఁ బ్రారంభ మగుట ప్రసిద్ధము.

  (సులక్షణసారము.. లింగమగుంట తిమ్మకవి.. పుట 146,147పుటల్లోనుంచి👆)
  కావ్యాది వర్ణ శుద్ధి గురించి పు. 150 లోని కింది ఛాయా చిత్రాన్ని మరియు కవిజనాశ్రయం.. మల్లియ రేచన పు.2 లోని ఛాయా చిత్రాన్ని అనుసంధించబడిన వాటిని చూడవచ్చు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  కుతుకము మీరఁ గైత గిలు
  కుం దశలోఁ దొలినాళ్ళ నిష్ట దే
  వతకు సమర్చగా శతక
  పద్మము నొక్కటిఁ గూర్చు టొప్పు శ్రీన్
  తత శుభదంబు తొల్దొలుత
  తప్పక నిల్పుచు.. నట్లు గా కెవో
  శతకములన్ రచించుట ప్ర
  శస్తము గాదది నిష్ఫలమ్మె పో

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  6.10.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి