2, అక్టోబర్ 2019, బుధవారం

సమస్య - 3150 (దేశ జనులకు వలదు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దేశ జనులకు వలదు గాంధీ జయంతి"
(లేదా...)

"కలనైనన్ దలపోయరే జరుపఁగన్ గాంధీ జయంతిన్ జనుల్"

63 కామెంట్‌లు:


 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  తలుపుల్ మూయుచు స్వచ్ఛ భారతమునున్ దండించి బంధించుచున్
  వలపుల్ మీరగ విస్కి పై నిచట భల్ బ్రాండీని బాధించకే
  బలుపౌ మేకల మాంసమున్ విడువకే బంగారు రాజ్యమ్మునన్
  కలనైనన్ దలపోయరే జరుపఁగన్ గాంధీ జయంతిన్ జనుల్

  రిప్లయితొలగించండి
 2. తేటగీతి
  వారి సత్య మహింసల బాట విడచి
  స్త్రీల గారవమ్ము మఱచి జాలి లేక
  వదల ఖాదీ స్వదేశంపు వస్తువులను
  దేశ జనులకు వలదు గాంధీ జయంతి

  రిప్లయితొలగించండి
 3. సత్యమునహింస యేతన సాధనముగ
  పోరు సల్పె, సచ్చీలడు పూజ్యు డతడు
  దేశ జనులకు, వలదు గాంధీ జయంతి
  నాడు మద్య మాంసపు భక్ష్యణంబు వినర.

  రిప్లయితొలగించండి
 4. మైలవరపు వారి పూరణ


  విలువల్ రూపముదాల్చ గాంధి యగు , లేవే శస్త్రముల్ చేతిలో !
  పలుకే బంగరుముద్ద , సత్యమది సంపద్భాండమౌ ! వైరికిన్
  జలి పుట్టించునహింస ! తాత యనగా సామాన్యుడౌ ! నందుచే
  కలనైనన్ దలపోయరే ? జరుపఁగన్ గాంధీ జయంతిన్ జనుల్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 5. హింసయే జీవితముగ భావించు వారు
  స్టాకు మార్కెట్లె యునికిగా సాగు వారు
  కులము మతముల పేరుతో కుమ్ము వారు
  దేశ జనులకు వలదు గాంధీ జయంతి

  రిప్లయితొలగించండి

 6. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  వలపుల్ మీరగ కాంగ్రెసున్ నడుపుచున్ వైరాగ్య భావమ్ముతో
  కలనున్ గాంచని రీతినిన్ కలుపగా కాశీని గంగమ్మనున్...
  నలభై తొమ్మిది వత్సముల్ గడువగా నాట్యమ్ము గానమ్ములన్
  కలనైనన్ దలపోయరే జరుపఁగన్ గాంధీ జయంతిన్ జనుల్

  గాంధి = రాహుల్ గాంధి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   'వత్సరాల్ గడువగా...' అనండి.

   తొలగించండి
 7. స్వాతంత్ర్యానికి పూర్వము బ్రిటీషువారు అంతర్గత కలహాలను రెచ్చగొట్టి విభజించి పాలించు అనే దృక్పథంతో భారతదేశ జనుల ఐకమత్యానికి తూట్లుపొడిచే రోజుల్లో...

  మత్తేభవిక్రీడితము
  బలహీనుండుగ గానుపించి మదిలో వాంఛించ స్వాతంత్య్ర మున్
  శిలులై సత్య మహింస తెల్లలను భర్త్సించంగ! లోపాయికా
  రులుగన్ వారికి నూడిగమ్ము సలుపన్ రొక్కమ్ము నాశించుచున్
  గలనైనన్ దలపోయరే జరుపఁగన్ గాంధీ జయంతిన్ జనుల్

  రిప్లయితొలగించండి


 8. కాంగి రేసువారికి మూడు కాళ్ల తాత
  సొంతమాయె నతని దోచి సొత్తు చేయు
  భాజపా వారు దుష్టులు వారు! వినుడి
  దేశ జనులకు వలదు గాంధీ జయంతి!  జిలేబి

  రిప్లయితొలగించండి

 9. ... శంకరాభరణం... . 02/10/19 ....బుధవారం...

  సమస్య::

  "దేశ జనులకు వలదు గాంధీ జయంతి"

  నా పూరణ.
  *****

  హింసనే ప్రోత్సహించెడు హీనులకును

  నిత్యమున్ నీతి దప్పెడు నీచులకును

  సర్వ దుర్గుణంబుల దాల్చె డుర్వి భరత

  దేశ జనులకు వలదు గాంధీ జయంతి


  🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
  🌷🌷 వనపర్తి 🌷🌷  రిప్లయితొలగించండి
 10. ఇలవేల్పై జనియించి ; లండనున దా
  నిష్టమ్ముగా లాయరై ;
  చలనంబున్ గలిగించి ;; భారతికి సు
  స్వాతంత్ర్యమే తెచ్చెనే ;
  నలభై కోటులు మూడురెట్లగుచు వి
  న్నాణమ్ముగా వెల్గుచున్
  కలనైనన్ దలపోయరే !జరుపగన్
  గాంధీజయంతిన్ జనుల్ .

  రిప్లయితొలగించండి
 11. హింస వలదెప్పుడు నని వాదించు వారు
  సమ సమాజము త్కృష్టమౌ సాగు వారు
  మోసము కలలో తలుపక మసలు నెవరి
  దేశ జనులకు వలదు గాంధీ జయంతి?

  రిప్లయితొలగించండి

 12. ... శంకరాభరణం... . 02/10/19 ....బుధవారం...

  సమస్య::

  కలనైనన్ దలపోయరే జరుపఁగన్ గాంధీ జయంతిన్ జనుల్

  నా పూరణ.
  *****
  ఇలయౌ భారతదేశ వాసులను వీక్షించంగ డెందంబుకున్

  దలపోయున్ గద నీతి సత్యగుణముల్ ధర్మంబులనన్ వీడుచూ

  మెలగంగన్;కడు నీచ హీన గణముల్ మేధస్సులో నెంచుచున్

  కలనైనన్ దలపోయరే జరుపఁగన్ గాంధీ జయంతిన్ జనుల్  🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
  🌷🌷 వనపర్తి 🌷🌷  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'డెందంబునన్... వీడుచున్..' అనండి.

   తొలగించండి
 13. జాతి పిత యన్న మిన్నగా ప్రీతి గలిగి
  యతని నాదర్శ ము గ గొని యలరు నట్టి
  దేశ జను ల కు వలదు గాంధీ జయంతి
  యనుట నంగీ కరింప దీ యవని నేడు

  రిప్లయితొలగించండి
 14. దేశ జనులకు వలదు గాంధీ జయంతి
  నేడు తలతును ప్రేమతో నిండు మదిని
  భరత దేశపు ముద్దుల బడుగు నేత
  జైజవాను జయకిసాను యన్న శాస్త్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "జయ కిసా నటన్న శాస్త్రి" అనండి.

   తొలగించండి
 15. త్యాగ ధనుడు సబర్మతీ యోగివరుడు
  శాంత్యహింసల,ననుపమ సత్య,ధర్మ
  ములను చాటగ,క్రౌర్య సమూహముల వి
  దేశ జనులకు వలదు గాంధీ జయంతి

  రిప్లయితొలగించండి
 16. ఆత్మపరిశీలనములేకయజ్ఞులగుచు
  శాంతి యొనగూర్చు మంత్రము సాగనీక
  సత్య ధర్మము యదిలేక సాగు వరకు
  దేశ జనులకు వలదుగాంధీజయంతి
  కొరుప్రోలు రాధాకృష్ణారావు
  రిప్లయితొలగించండి
 17. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  దేశ జనులకు వలదు గాంధీ జయంతి

  సందర్భము: జనాలకు గాంధీ వద్దు.. జయంతి కావాలి.
  వినాయక చవితివంటి సందర్భాల్లో లాగా అదంత బహిరంగ కార్యక్రమం కా దని తెలియని ఔత్సాహికు డంటున్న మాట.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "దేశ జనులకు వలదు గాంధీ... జయంతి
  వలయు, నెందుల కందురా! బ్రాంది విస్కి
  లక్షణంబుగఁ గోడి కూరలను దెచ్చి
  తాగి, తిని యాడవచ్చుఁ దందానతాన"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  2.10.19
  -----------------------------------------------------------
  శ్రీ ప్రభాకర శాస్త్రి గారి దారిలో..

  రిప్లయితొలగించండి
 18. భరత జాతిని ప్రార్ధింతు భక్తి తోడ
  ప్లాస్టికువినియోగమునిక పనికి రాదు
  దేశ జనులకు వలదు, గాంధీ జయంతి
  నాటి నుంచి మానవలయు నమ్మకముగ
  చేయుము ప్రతిఙ,ఎల్లరు చేయి చేయి
  కలిపి సహకరిం చమనుచు పలికె మోడి
  భరత జనులను ద్దేశించి శరణు యనుచు

  రిప్లయితొలగించండి
 19. సత్యము, నహింస దొడవులు సంతతమ్మ
  టంచు భువనభాండమునెల్ల నలరె గాంధి,
  ఎల్లరును బొగడగ వారినింక, మరువ
  దేశ జనులకు వలదు, గాంధీ జయంతి

  రిప్లయితొలగించండి

 20. ... శంకరాభరణం... . 02/10/19 ....బుధవారం...

  సమస్య::

  కలనైనన్ దలపోయరే జరుపఁగన్ గాంధీ జయంతిన్ జనుల్

  నా పూరణ. మత్తేభము
  *****

  ఇదే రోజు జన్మించిన L B శాస్త్రి ని మరిచి గాంధీ జయంతినే జరుప ఉత్సాహపడుచున్న సందర్భంగా ఈ పద్యము.....


  ఇలయౌ భారతదేశ వాసులను వీక్షించంగ డెందంబుకున్

  దలపోయున్ గద శాస్త్రి జన్మదిన ముత్సాహంబుగా సల్పగన్

  కలనైనన్ దలపోయరే ; జరుపఁగన్ గాంధీ జయంతిన్ జనుల్

  కులగోత్రాల కతీతమై నిలువరే గొప్పంగ నిద్దేశమున్


  🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
  🌷🌷 వనపర్తి 🌷🌷  రిప్లయితొలగించండి
 21. తే.గీ.

  అసలు గాంధి గారెప్పుడో యంతమవగ
  నాసి గాంధీలు దేశము నవతరింప
  వెరసి పుట్టుక యెవరిదో వింతగాగ
  దేశ జనులకు వలదు గాంధీ జయంతి

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 22. జాతి పితను మరచి పోవు జాడ్యమెపుడు
  దేశ జనులకు వలదు; గాంధీ జయంతి
  ఘనముగా జరుపుటె జాతి గౌరవమ్ము
  శాంత్యహింసలె సత్యము చాటుమెపుడు

  రిప్లయితొలగించండి
 23. మాయమర్మపుటార్జన నేహ్హ్యమగుట
  దేశజనులకువలదు,గాంధీజయంతి
  జరుపుకొందుము ప్రతియేట సంతసముగ
  రెండుతేదీన యీనెల రండిసామి!

  రిప్లయితొలగించండి
 24. గురువు గారికి నమస్సులు.
  ప్రేమ ,కరుణయు , దయయును పెంపు సేయ
  ని ,నమలిన విధంబుల తోడ నిగ్గు సేయు
  హింస నాచరించు మధా oదు హీన కుటిల
  దేశ జనులకు వలదు గాంధీ జయంతి.

  రిప్లయితొలగించండి

 25. పరుషమగు పరదేశపు ప్రభుత మనల
  నెగవిడువ తెల్లవారి పయిన సమరము
  నడిపినట్టి జాతిపిత నెన్నడు మరువని
  దేశ జనులకు వలదు గాంధీ జయంతి

  వలదు = అక్కరలేదు

  రిప్లయితొలగించండి
 26. కులము, మతము, ధనములన గూర్మి జూపు
  రాజకీయ వాదులకును, రహిని మఱచి
  మద్యపాన సేవనమున మత్తు నందు
  దేశజనులకు వలదు గాంధీ జయంతి!

  రిప్లయితొలగించండి
 27. ఓట్ల నమ్మి నేతలొసంగు నోట్ల కొరకు
  త్రాగితందనా లాడుచు ప్రతిదినమ్ము
  సోమరితనమున తిరుగు శుంఠ లైన
  దేశ జనులకు వలదు గాంధీ జయంతి

  రిప్లయితొలగించండి
 28. కలనైనన్ దలపోయరే జరుపగన్ గాంధీజయంతిన్ జనుల్
  గలలోసైతము దాదలంపగను నాగాంధీజినామంబునున్
  నిలలోజీవనమొందగాసబబెయాయీగాంధియేశాంతితో
  నలనాడేమఱిదెచ్చెగామనకునాద్యంతంబుస్వారాజ్యమున్

  రిప్లయితొలగించండి
 29. నిత్యము జరుప మే లగు నిగదితములు
  సత్యము నహింసఁ బాటించఁ జాలు సుమ్మి
  వాగనుచరణ శూన్యము వరజన వర
  దేశ! జనులకు వలదు గాంధీ జయంతి


  అల పేట్రేగి ప్రజాధినాయకులు వాగావేశముల్ చూపరే
  యిల హింసా రత పూరుషేంద్రులును గాంధీయమ్ము వాక్రుచ్చరే
  వలదన్నం గలుగున్ ముదమ్ము భర తాంబా, వేడుకల్ మానుటల్
  కలనైనం దలపోయరే, జరుపఁగన్ గాంధీ జయంతిన్ జనుల్

  రిప్లయితొలగించండి
 30. విలువల్ వీడి చరించుచున్ సతతమున్ విధ్వంసమున్ చేయుచున్
  పలు నేరమ్ములొనర్చుచున్ బ్రతుకు పాపాత్ముల్ వివేకమ్ముతో
  కలనైనన్ దలపోయరే జరుపఁగన్ గాంధీ జయంతిన్, జనుల్
  కలుషమ్మున్ విడ నాడినప్డు కననౌ గాంధీ మహత్వమ్మిలన్

  రిప్లయితొలగించండి
 31. కలమున్ చేతను బూని కావ్యముల నా గాంధేయ వాదంబుకున్
  కలకాలమ్మెన లేని ఖ్యాతి నొసగన్ కార్యోన్ముఖుల్ గావుతన్
  కలనైనన్ దలపోయరే; జరుపఁగన్ గాంధీ జయంతిన్ జనుల్
  కల మాకంచును భాషణమ్ములవె సత్కార్యమ్ముగా నెంతురే

  రిప్లయితొలగించండి
 32. విలువల్గోల్పడి మద్యమాంసముల సంప్రీతిన్ గొనున్వారలై
  తలపుల్ నిత్యము దుష్టచింతనను జిందాడంగ హింసాపరుల్
  విలసిల్లంగను భారతావనిని నిర్భీతిన్ బశుప్రాయులై
  కలనైనన్ దలపోయరే జరుపగన్ గాంధీజయంతిన్ జనుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గాంధీగారికి నివాళి!
   ధనము గోల్పోయినంతను దరుగులేదు
   స్వాస్థ్యముడిగెనేని రవంత శక్తితగ్గు
   శీలమడుగంట సర్వము శిథిలమగును
   గాంధిగారిమాట మిగులఘనము నిజము!

   తొలగించండి
 33. మందు లేకుండ నొక పూట నుండ లేక
  సత్య మను మాటయే నెన్న జాల కెవరు
  తమను ఆపగలరనుచు తాండవించు
  దేశ జనులకు వలదు గాంధీ జయంతి

  రిప్లయితొలగించండి
 34. బ్రాంది షాపకు లైసెన్సు బొంది యొకడు
  పరమ గాంధేయవాదిగా బరగుచుండె
  జాతి మత్తులో మరచెను జాతి పితను
  దేశ జనులకు వలదు గాంధీ జయంతి

  రిప్లయితొలగించండి
 35. విలువౌ స్వేచ్ఛను దేశమాతకొసగెన్ వీరుండతండే గదా!
  యిలలో మేలును గూర్చినట్టి ఘనుఁ బ్రత్యేకమ్ముగా కొల్తురే
  పలురీతుల్ మనభారతీయులదియే బ్రహ్మమ్ము, గొడ్డేరుగా
  కలనైనన్ దలపోయరే జరుపఁగన్ గాంధీ జయంతిన్ జనుల్

  రిప్లయితొలగించండి
 36. కొవ్వును కరిగించుటకై
  రివ్వున వెళితిని పరుగుకు రెక్కలు తొడగన్
  జివ్వన నడుమే, పడగనె,
  నవ్వుల స్వర్గమును జూచె నరకమునందున్

  కళ్యాణ్ చక్రవర్తి

  రిప్లయితొలగించండి