కవిమిత్రులకు నమస్కృతులు! నేను రేపు ఎ.ఎస్.రావు నగర్ నుండి నా పాత నెలవైన గండిమైసమ్మ దగ్గరి బౌరంపేటలోని వడ్డెపల్లి నర్సింగ రావు సీనియర్ సిటిజన్స్ హోముకు మారుతున్నాను. ఈ రెండు రోజులు సామాన్లు సర్దడం, అక్కడికి చేర్చడం, అక్కడ సర్దుకొనడంలో వ్యస్తుడనై ఉంటాను. కనుక మీ పద్యాలను సమీక్షించే అవకాశం ఉండక పోవచ్చు. మన్నించండి.
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
రాం రహీం బాబా:
నామము గొప్పగా పలికి నందన మొందుచు మందులోన భల్
కామము మీరగా సతుల గైకొని రూమున రేపుజేయుచున్
గోముగ నేతలన్ గొనుచు కొంపలు కూల్చుచు జైలుజేరెడిన్
తామసచిత్తుఁడే జనుల దైవముగా ప్రణతుల్ గొనెం గదా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిభామా! నిత్యా నందుల
రిప్లయితొలగించండినామము వినియుంటివే! సనాతనుననుచున్
కాముకుడై చిరియించెను
తామస చిత్తుండు, జనుల దైవం బయ్యెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చరియించెను' టైపాటు.
రిప్లయితొలగించండిపామరు బోయడు,మారగ
తామసచిత్తుండె, జనుల దైవం బయ్యెన్
రాముడతని కావ్యముచే
కోమల హృదయులను తాకె కొంగు పసిడిగా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పామరుడు బోయ మారగ" అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినీమమొకింత లేదిచట నిక్కముగా యుగధర్మ మౌటచే
రిప్లయితొలగించండిస్వామిని నేను చూడుడని వస్త్రము గట్టిన మాత్ర మీభువిన్
కామము చావనట్టి ఖలకర్ముడు వంచకుడై చరించు నా
తామసచిత్తుఁడే జనుల దైవముగా ప్రణతుల్ గొనెం గదా.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి*దుర్యోధనుడు సభలో పలికిన మాటవవి....*
రిప్లయితొలగించండిమామను జంపుట కొరకై
భూమిని జన్మించె నతడు పూతనఁ గీలా
ర్చే, మేనత్త సుతుఁ చిదుమె
తామస చిత్తుండు జనుల దైవం బయ్యెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కీలార్చే' అనడం సాధుప్రయోగం కాదు.
( వరగర్వితుడైన హిరణ్యకశిపుని యాజ్ఞతో భయపడిన
రిప్లయితొలగించండిప్రజలు అతనినే దేవునిగా ఆరాధించటం )
కోమలి భార్యతో కలసి
కొల్లగ గర్వము నెత్తికెక్కగా
క్షేమముగా స్వరాజ్యమును
జేరి హిరణ్యుడు - దుర్మదుండదే
నీమము బెట్టె బౌరులిక
నేతగ దేవుగ దన్నె గొల్వగా ;
దామసచిత్తుడే జనుల
దైవముగా ప్రణతుల్ గొనెం గదా !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఏమియు పట్టదు జనముల
రిప్లయితొలగించండిబాములపై జాలి లేదు పాలించుటకౌ
సామర్థ్యము కనుపింపదు
తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యాదాలండీ.
తొలగించండికవిమిత్రులకు నమస్కృతులు!
రిప్లయితొలగించండినేను రేపు ఎ.ఎస్.రావు నగర్ నుండి నా పాత నెలవైన గండిమైసమ్మ దగ్గరి బౌరంపేటలోని వడ్డెపల్లి నర్సింగ రావు సీనియర్ సిటిజన్స్ హోముకు మారుతున్నాను. ఈ రెండు రోజులు సామాన్లు సర్దడం, అక్కడికి చేర్చడం, అక్కడ సర్దుకొనడంలో వ్యస్తుడనై ఉంటాను. కనుక మీ పద్యాలను సమీక్షించే అవకాశం ఉండక పోవచ్చు. మన్నించండి.
ఏమను వాడ కర్మ మిది, యిట్టి దురాత్ముడు, నాకు నీయరే
రిప్లయితొలగించండిప్రేముడి నొక్కసారి మిము బ్రేమగ పాలన చేయు భాగ్యమున్
తా మన గంపగుత్తగను దానము చేసిరి యోట్లు నేడహో
తామసచిత్తుఁడే జనుల దైవముగా ప్రణతుల్ గొనెం గదా.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు.
తొలగించండిగురువు గారికి ధన్యవాదాలు.
తొలగించండితామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్
రిప్లయితొలగించండిఏమియు దెలియక బోయిన
భూమిన మోసము తలఁపగ బూనుచు నెపుడున్
మోమున నవ్వులు జూపెడి
తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్
🙏🙏
తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్పా
తొలగించండిపాముని మించిన విషమును
మోమున చిరు నవ్వు గలిగి మోసము జేయఁన్
హోమము పూజలు నొసగా
తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్
🙏🙏
తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్
తొలగించండినా మది నన్నడి గెనుగా
నేమిది కలియుగ విషమిట నెరుగము నెపుడున్
ఏమియు దెలియని నొకరగు
తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్
🙏🙏
తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్
తొలగించండిఏమైనను చింతన లే
దేమనినను సిగ్గునొదలి దేహము నందున్
హోమముతో మోసమొనరు
తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్
తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్
తొలగించండిదేముని దూతల మనుచున్
ప్రేమగ మాట్లాడుచుండ ప్రేరణ నొందా
నామంబొక్కటి చాలను
తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్
🙏🙏
తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్
తొలగించండిదేముని గొల సమయము లే
నోములు నోచుట దెలియక నోరిట మూయన్
నేమది నిక నమ్మను యే
తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్
🙏🙏
Jilebi effect ! Half a dozen poems !
తొలగించండిమీ ఆరు పూరణలు బాగున్నవి అభినందనలు
తొలగించండి1లో .. తెలియక పోయిన భూమిని....
2లో... పామును... జేయన్... ఒసగా?
3 లో.. నన్నడిగె నిటుల. . నెరుగ మెపుడు తా నేమియు దెలియని యొకడగు...
4లో..సిగ్గు వదలి...
5లో...దేముని..అనడం తప్పు. ఒంది+ఆ... అన్నపుడు సంధి లేదు.
6లో...దేముని..తప్పు.నమ్మను+ఏ...అన్నపుడు సంధి నిత్యం యడాగమం రాదు
ధన్యుణ్ణి, గురువులకు నమస్సుమాంజలి
తొలగించండితప్పులతో ఇబ్బంది కలిగించినందుకు మన్నించ ప్రార్ధన 🙏🙏🙏🙏🙏🙏
ఏమో! కలిమాయ యిదా!?
రిప్లయితొలగించండికామాదులఁ జంపలేని కాపురుషుండై
భామల పొందును గోరెడి
"తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్"
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిపామరుల మోసగిం చుచు
రిప్లయితొలగించండిమోమున నవ్వుల ను జిందు ముని వేష ము న న్
కామము తో వర్తించె డు
తామస చిత్తుం డె జనుల దైవం బ య్యె న్
మీ పూరణ బాగున్నది .అభినందనలు.
తొలగించండి*దుర్యోధనుడు సభలో పలికిన మాటవవి....*
రిప్లయితొలగించండిమామను జంపుట కొరకై
భూమిని జన్మించె నతడు పూతనఁ దునిమెన్
కోమలి ని దొంగి లించిన
తామస చిత్తుండు జనుల దైవం బయ్యెన్.
(కోమలి రుక్మిణిని అపహరించాడని)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
"God sees the Truth, But Waits"...Leo Tostoy
గోముగ సిస్తులన్ ధనము కూరిమి తోడను ఖర్చు చేయుచున్
రాముని కోసమై నగలు రమ్యపు భక్తిని కూర్చ, ఖానుడే
జాములు మాసముల్ సమలు జైలున త్రోయగ వేచియుండెడిన్
తామసచిత్తుఁడే జనుల దైవముగా ప్రణతుల్ గొనెం గదా :)
సమ = సంవత్సరము
తామసము = ఆలస్యము (శబ్దరత్నాకరము)
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివాల్మీకి
నీమపు దారి చూపుచు పునీతము గా బతుకన్ జనాళికై
రాముని నామ మెల్లెడ స్థిరమ్ముగ నెక్కొలుపంగ కావ్యమున్
కోమల చిత్తుడై నిలిపి కొవ్విలిపువ్వు నయమ్ము దేలగా
తామసచిత్తుఁడే జనుల దైవముగా ప్రణతుల్ గొనెం గదా
జిలేబి
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు
తొలగించండిఆ మూడింటను రాములు
రిప్లయితొలగించండితామెప్పుడు సత్వమందు దలపుచు పనులన్
కామంబుల సల్పి నరుడు
తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్
ఆమూడు-సత్వ రజస్తమములు
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిస్త్రీ మధుపానమత్తుడు విచిత్రగతిన్ శయనించి రాత్రి శ్రీ...
రాముని మందిరమ్మున వరమ్మగు స్వప్నము గాంచెనందులో
భూమిజనావళుల్ తనకు మ్రొక్కుచు హారతులిచ్చుచుండగా
తామసచిత్తుఁడే జనుల దైవముగా ప్రణతుల్ గొనెం గదా !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండితామసమయ లోకంబుల
రిప్లయితొలగించండితామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్
తామరసాక్షుని గొల్వగ
తామసమే తొలగి భువిని ధర్మము వెలిగెన్
మీ పూరణ బాగున్నది అభినందనలు.
తొలగించండికామనలే గమ్యమగుచు
రిప్లయితొలగించండిదామసవృత్తులు చెలగగ ధారుణియందున్
నీమము లేమియుబట్టని
తామసచిత్తుండె జనుల దైవంబయ్యెన్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిపామరు డాతడు తపమున
రిప్లయితొలగించండితామసచిత్తుండె, జనుల దైవం బయ్యెన్
రామా యని నొడువగ నీ
నామము నిలలో నిరతము నామదిలోనన్
మీ పూరణ బాగున్నది అభినందనలు.
తొలగించండినుడువగ నీ నామమె నిలుచును నిరతము... అనండి
కామము నిండిన వానికి
రిప్లయితొలగించండియేమియు జెప్పినను వినరు యెక్కదు మతికిన్
భూమికి దిగగన్ శుచియై
తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండివానికి+ఏమియు, వినరు+ఎక్కదు.. అన్నపుడు యడాగమం రాదు
పామరుడౌవాల్మీకియ
రిప్లయితొలగించండితామసియైరచనజేసిధారుణియందున్
రామునిగాధనునీయగ
తామసచిత్తుండెజనులదైవంబయ్యెన్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిగాథ నొసంగగ... అనండి
కాముకుడై చరించుచు నకార్యములందు నిమగ్నమౌనుగా
రిప్లయితొలగించండితామసచిత్తుఁడే; జనుల దైవముగా ప్రణతుల్ గొనెం గదా
రాముడు సత్య వర్తన పరాయణుడై ఘన రాక్షసారియై
తామసచిత్తులన్ యణచి ధర్మము నిల్పెను ధాత్రి యంతటన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండిచిత్తులన్+అణచి... అన్నపుడు యడాగమం రాదు
సోమరి ప్రభుత్వ మున పర
రిప్లయితొలగించండిచామలపయి చీదఱ పనిసలిపెడి వారౌ
కాముకుల మందలించని
తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితా మది నెఱుంగఁ డింతయు
రిప్లయితొలగించండినామర్షంబు నవసరములం దాదుకొనుం
బ్రేమగ నీతం డక్కట
తామస చిత్తుండె జనుల దైవం బయ్యెన్
భూమి జనించి నంతటను భూసుర వంశము నందుఁ జాలునే
యీ మను జాలి నిన్ను మహి నేల నుతించుఁ దపః ప్రపూర్ణ స
త్కామిత చిత్తు బ్రహ్మ ఋషిగా వచియింపఁగఁ బద్మజుండు త
త్తామస చిత్తుఁడే జనుల దైవముగాఁ బ్రణతుల్ గొనెం గదా
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిఏమని జెప్ప లోకమున యేలిక తానని నుగ్గ డించుచున్
ధామము సృష్టి జేసుకొని తానిక దైవ సమానమంచనన్
కోమలు లెల్ల జేరగని కొంటెగు రీతిని కేళియాడుచున్
తామస చిత్తుడే జనుల దైవముగా ప్రణతుల్ గొనెం గదా
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిలోకమున నేలిక తనని యుగ్గడించుచున్... అనండి
కొంటె+అగు... అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
కామన మిక్కుటంబవగ గాంచక నుచ్ఛమునీచ మాదటన్
రిప్లయితొలగించండిరాముని భార్య భూమిజను రావణుడావని దొంగలింపగా
నేమని చెప్పగాదగును హేయపు రాక్షస రాజ్యమందునన్
తామసచిత్తుడే జనుల దైవముగా ప్రణతుల్ గొనెంగదా!
మీ పూరణ బాగున్నది అభినందనలు.
తొలగించండిరామునిగాధలన్మిగులరమ్యపుపోకడలన్రచించియా
రిప్లయితొలగించండితామసచిత్తుడేజనులదైవముగాప్రణతుల్గొనెంగదా
తామసుడైననున్వినుముతాలిమిగల్గియునెల్లవేళలన్
బ్రేముడిజూచువారలనుబ్రీతినిదైవముగాదలంతురే
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిక్షామము తెచ్చెను రాజై
రిప్లయితొలగించండితామసచిత్తుండె, జనుల దైవం బయ్యెన్
సోమరి నాయకుల నడచి
ప్రేమను పంచి యువనేత, పెఱవా రేడ్వన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు
తొలగించండితామసుడగు వాల్మీకియె
రిప్లయితొలగించండిరాముని నామము జపించి రమణీయముగా
కోమల సత్వము బొందెను
తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్
*రాయబారిగా వచ్చిన కృష్ణుని స్తుతించు భీష్మాదులతో దుర్యోధనుడు పల్కిన మాటలుగా......*
రిప్లయితొలగించండిమీ మదిలో మహాత్ముడయి మేదినిఁ నిల్చిన వాడు బాల్యమున్
లేమను సంహరించె, తన లీలలటంచును స్నానమాడెడిన్
భామల చీరలెత్తె శిశు పాలుని జంపె, కులంభరుండెయౌ
తామసచిత్తుఁడే జనుల దైవముగా ప్రణతుల్ గొనెం గదా.
ఉ:
రిప్లయితొలగించండిగోముఖ వ్యాఘ్రమున్ దలుప కోరిన యాస్తుల కూడబెట్టగన్
చీమలు దూర చిట్టడవి జీవములేని నిశాంతమందునన్
దీమము వోలె వ్రాలునట దిక్కగు మాటల నెచ్చరించుచున్
తామస చిత్తుడే జనుల దైవముగా ప్రణతుల్ గొనెం గదా
వై. చంద్రశేఖర్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ నాటి శంకరాభరణము వారి సమస్య
రిప్లయితొలగించండితామస చిత్తుండె జనుల దైవం బయ్యెన్"
ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో
సూత మహాముని శ్రీహరి యొక్క లీలలు మునులకు అడవిలో వర్ణించు ఘట్టము
కరుణాంత రంగుడై కౌసల్య తనయుడు కొలువ బడుచు నుండె గోత్ర మందు
శూరుడై రాజులన్ పేరడగించి భార్గవుడు జగమున సంస్తవము నొందె
సరసుడై శృంగార పురుషుడై భూషిoచ బడుచుండె కంసారి యిచట,నార
సింహుడు (తామస చిత్తుండె, జనుల దైవంబయ్యె ని)లలోన వరము లిడుచు
తరచి చూడగ ధరణిలో తరము గాదు
మనుజులకు హరి లీలలు, కనిన, వినిన,
కలుగు ముక్తి మన కనుచు పలికె సూత
ముని వరుండు వనము లోన మునుల గాంచి
గోత్రము = భూమి
భూమిజయైన జానకిని భూరిగ గొల్చెడు దేశమందునన్
రిప్లయితొలగించండిరాముల వారుతక్కువవ రావణ రాక్షస లీలలెక్కువై
సామజమై చరించుటను సాయుధమున్ గొని బుద్ధిజెప్పకన్
తామసచిత్తుడే జనులు దైవముగా ప్రణతుల్ గొనెన్ గదా
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
తామసచిత్తుఁడే జనుల దైవముగా
ప్రణతుల్ గొనెం గదా
సందర్భము: గాఢ నిద్రలో మునిగియున్న కుంభకర్ణుణ్ణి రావణుడు మేల్కొలిపినాడు.
"కేవలం వీర్య దర్పేణ నానుబంధో విచారితః.. (కేవలం బలగర్వంతోనే సీతాపహరణం చేశావు. పరిణామాలను ఆలోచించలేదు.) అన్నాడు కుంభకర్ణుడు.
కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరగా లంకలోని ప్రజ లిలా భావించినారు.
"లంకారాజ్యం విజయం సాధించటానికి కుంభకర్ణుడే తగినవాడు. ఎలాగంటే...
రావణునివల్ల విజయం చేకూరదు. అతణ్ణి ముప్పుతిప్పలు పెట్టిన వాలినే తుదముట్టించినవాడు రాముడు.
విభీషణునివల్ల లంకకు విజయం కలిగే ప్రసక్తియే లేదు. ఎందుకంటే అతడు చేతకానివానిలా యుద్ధారంభంలోనే శత్రుపక్షంలోకి చేరిపోయాడు. శత్రువైన రామునికే విజయం కలిగేందుకు ప్రయత్నిస్తాడు.
అట్లే లంకారాజ్యం పరువు నిలబెట్టడానికీ కుంభకర్ణుడే తగినవాడు.
అతడు రావణునిలాగా కాముకుడై జనాల్లో చెడ్డపేరు తెచ్చుకోలేదు. విభీషణునిలాగా శత్రువుల నాశ్రయించి మాతృదేశానికి ద్రోహం తలపెట్టి సానుభూతి కోల్పోయి చెడ్డపేరు తెచ్చుకోలేదు.
కుంభకర్ణుడు రావణుని లాగా కాముకుడు కాడు, ధార్మికుడు కావటంచేత
రావణునకు తన వంతుగా హితవు చెప్పినాడు కదా!
అట్లే విభీషణునిలాగా శత్రుపక్షపాతి కాడు. జన్మభూమిపట్ల అంటే లంకపట్ల తోబుట్టువైన రావణునిపట్ల ప్రేమాదరాలు కలిగినవాడు. చచ్చినా బ్రతికినా లంకా ప్రజల నడుమనే అన్నయైన రావణునివైపే.. స్వజనంవైపే వుండా లనుకున్నవాడు.
ధర్మపక్షపాతి కాబట్టి దైవ సమానుడే!"
అందుకే తమోగుణం కలవాడైనా లంకలోని ప్రజలు కుంభకర్ణుణ్ణి దైవంగా భావించి నమస్కరించినారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
రాముడు వాలినే దునిమె..
రావణు కింక జయమ్ము సున్నయే!
రామునికే జయ మ్మెపుడు
రాగఁ దలంచు విభీషణుం డిసీ!
నీమము దప్పడే! పరువు
నిల్పి జయింపడె!కుంభకర్ణుడే!
తామస చిత్తుఁడే! జనుల
దైవముగా ప్రణతుల్ గొనెం గదా!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
31.10.19
-----------------------------------------------------------
సేమముగోరి వచ్చుచును, సేవలపేరిట ఖర్చుబెట్టుచున్
రిప్లయితొలగించండిరాముని వేషమున్ మురిసి, రావణుజేరిరి వంచనమ్ముతో
భీమునివోలె రావలయు, భీతిలజేసెడు గొప్పవీరుడౌ
తామసచిత్తుడే జనులు, దైవముగా ప్రణతుల్ గొనెన్ గదా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండికామ వికారి గోపికల కప్పడముల్ గొని బాధ పెట్టెనే!
లేమను పెళ్లికై యపహరించిన వెన్నల చోరుడీతడున్
యామిని వేళలోన మగధాదిపు ద్రుంచెడు తంత్రమల్లెడున్
దామస చిత్తుఁడే జనుల దైవముగా ప్రణతుల్ గొనెం గదా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికామమున నమ్మె కపటిని
రిప్లయితొలగించండిరాముని మదినికనుఁగొనని , పామరజనులకు
కామాంధుడుకపటముగన్
తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్