21, అక్టోబర్ 2019, సోమవారం

సమస్య - 3169 (కలలం గాంచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్"
(లేదా...)
"కలలం గాంచి ముదంబు నందిననె సంకల్పంబు సిద్ధించులే"

82 కామెంట్‌లు:


 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  బలుపౌ రీతిని శీర్షమందునుచుచున్ బంగారు చెల్లెమ్మనున్
  వలపుల్ తోడుత రాహులున్ గొనుచు భల్ వడ్డించగా లడ్డులన్
  తలపుల్ మీరగ కాంగ్రెసోత్తములు వే తాదాత్మ్య మందంగ హా!
  కలలం గాంచి ముదంబు నందిననె సంకల్పంబు సిద్ధించులే

  రిప్లయితొలగించండి
 2. సంకలితములా బాధలు
  శంకనదేలన్ సతతము చక్కని హరి యా
  సంకటమోచను దలపన్
  సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్

  రిప్లయితొలగించండి


 3. ఇంకక పనిచేయంగన్
  సంకల్పము సిద్ధిఁ గాంచు, స్వప్నములఁ గనన్
  పొంకము లేక జిలేబీ
  మంకురమందు కనిపించి మాయంబగునోయ్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. శంకన్నదివీడి నిరా
  తంకము గాను కృషిఁ జేయఁ దథ్యము గా నా
  టంకము లేతొలుగుచు నీ
  సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్.

  రిప్లయితొలగించండి


 5. పంకజనాభుని గొలుచుచు
  లంకేశులద్రుంచునట్టి లక్ష్యము తోడన్
  శంకయు వీడగ వచ్చును
  సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్!

  --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

  రిప్లయితొలగించండి


 6. కలలన్గాంచగ జింక సింహమునకై గ్రాసమ్ముగావచ్చునా?
  అలలన్ తేలెద వంతయేను రమణీయమ్మై మదిన్ దోచెడా
  కలలం గాంచి ముదంబు నందిననె; సంకల్పంబు సిద్ధించులే
  కలలన్ దాటుచు కార్యసాధకునిగా కర్తవ్యమున్ చేయగా


  జిలేబి

  ఉద్యమేనహి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై:
  నహి సుప్తస్య సింహస్య ప్రవిశన్తి ముఖే మృగా:


  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. అలఘుస్వచ్ఛమనంబుతోడ ఫల మాకాంక్షించి యన్యంబులౌ
  తలపుల్ సేయక లక్యగామియగుచున్ ధైర్యంబుతో విఘ్నముల్
  కలుగన్ గుందక వాంఛితార్థముల సాక్షాత్కార మైనట్లుగా
  కలలం గాంచి ముదంబు నందిననె సంకల్పంబు సిద్ధించులే.

  రిప్లయితొలగించండి
 8. (రాయలవారికి స్వప్నంలో ఆంధ్రవిష్ణువు కనిపించి "ఆముక్త
  మాల్యద " ను రచించి సమర్పించమని ఆనతినివ్వటం )
  అలలై సాగెడి కృష్ణవేణి కడ క
  ర్ణాటాంధ్రసమ్రాట్టు రా
  యలవా రెంతయు శాంతచిత్తులయి ని
  ద్రారూఢులై యుండగా ;
  లలితంబౌ కల నాంధ్రవిష్ణు " డొక లీ
  లాకావ్య మిమ్మా ! " యనెన్
  గలలం గాంచి ముదంబు నందిననె సం
  కల్పంబు సిద్ధించులే !

  రిప్లయితొలగించండి

 9. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  తలపుల్ మీరగ వంటలన్ జరుపుచున్ ధట్టించి రోడ్లందునన్
  చిలిపిన్ సాగర మందునన్ విసరుచున్ చెండాడి శిల్పమ్ములన్
  బలుపౌ నాకలి దెబ్బతో చరచుచున్,...బంగారు రాష్ట్రమ్మునున్
  కలలం గాంచి ముదంబు నందిననె సంకల్పంబు సిద్ధించులే

  ఆకలి దెబ్బ = hunger strike

  రిప్లయితొలగించండి


 10. పొంకముగ పనుల చేయగ
  సంకల్పము సిద్ధిఁ గాంచు, స్వప్నములఁ గనన్
  జింక తనంతట తానై
  పొంకముగా వచ్చి హరికి బువ్వగ పడునా?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. మైలవరపు వారి పూరణ

  లలనాలింగితవామదేహుని జగద్రక్షాకరున్ శంకరున్
  విలసన్నాట్యమనోభిరాముని , శివున్ వేదాంతవేద్యున్ మదిన్
  నిలుపన్ పల్కుల, శ్వాసలన్, తలపులన్ నిత్యంబు యత్నించుచున్
  కలలం గాంచి ముదంబు నందిననె సంకల్పంబు సిద్ధించులే !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 12. సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్

  జంకగ జేయుచు పనులను
  వంకల నెతగగ మెదడున వందలు వేలున్
  బింకము జూపుచు మొదలిడు
  సంకల్పము, సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్
  🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వంకల దగినట్లు మదిని వందలు వేలున్' అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 13. అంకితభావపు గృషికిని
  సంకల్పము సిద్ధిగాంచు,స్వప్నముల గన
  న్నంకించును బుద్ధికి నవ
  సంకేతములిచ్చి గెలువ సాహసికునిగన్

  రిప్లయితొలగించండి
 14. అంకిత భావము చేతను
  సంకల్పము సిద్ది గాంచు : స్వప్న ము లు గ న న్
  శంకగ పనులను జేయుచు
  వంక లు చెప్పెడు జనులకు ఫలియించవు గా

  రిప్లయితొలగించండి
 15. శంకలు మానుచు పూనగ
  సంకల్పము సిద్ధిఁ గాంచు ; స్వప్నములఁ గనన్
  ఇంకును నిర్ణయమంతయు
  మంకుతనము విడిచిపెట్టి మసలుకొనవలెన్

  మంకుతనము = మూర్ఖత్వము

  రిప్లయితొలగించండి
 16. శంకలు తలపకమదిలో
  నంకితభావమునపనులనవిరళ కృషితో
  బింకముగా చేబూనిన
  సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్

  రిప్లయితొలగించండి
 17. ఈ రోజు శంకరా భరణము సమస్య
  కలలం గాంచి ముదంబు నందిననె సంకల్పంబు సిద్ధించులే"

  ఇచ్చిన సమస్య మత్తేభ విక్రీడితము నా పూరణము సీస పద్యములో
  అబ్దుల్ కలాము గారి సందేశము

  సీసము :
  దేశ ప్రగతికి ప్రతినిధులు యువకులు, యుక్త వయసులోన యోగ్యమైన
  నిర్ణయములు గైకొని ఘనత నొప్పారు చదువులనే వారు చదువు కొనగ
  వలయు, సు బుద్ధితో మెలగుచు మంచి కలలనే సతము కనవలయును యువ
  త కలలం గాంచి ముదంబు నందిననె సంకల్పంబు సిద్ధించు లే, లయించు

  చెడు తలంపులు మదిలోన, శీఘ్ర గతిన
  కనవలయును సు స్వప్నములను యువకు
  లనుచు, పలికెగా నబ్దుల్ కలాము ఘనుడు
  పసిడి లే ప్రాయపు యువత భవిత కోరి

  రిప్లయితొలగించండి
 18. సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్

  ఇంకయు నది కావలెనని
  ఇంకయు నిది కావలెనను నింటల్లుడి యా
  జంకక నడిగెడి కోర్కెల
  సంకల్పము సిద్ధిఁగాంచు, స్వప్నములఁ గనన్

  హమ్మయ్య, సరదాగా ఇంకొకటి గిట్టించేసాను🙏🙏

  రిప్లయితొలగించండి
 19. జంకును గొంకును లేకయు
  అంకిత భావము కలిగిన యాశయములతో
  శంకలు లేకను సాగిన
  *"సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్"

  రిప్లయితొలగించండి
 20. కలలో గాంచగ నాశమై చనవె! లంకారావణానీకముల్
  చెలియల్ సుందరభర్తనున్ వడయరే? చెల్వార స్వప్నించినన్
  లలితప్రాభవభోగభాగ్యసుఖవిభ్రాజత్ప్రమోదమ్ములన్
  కలలన్ గాంచి ముదంబు నందిననె, సంకల్పంబు సిద్ధించులే.

  రిప్లయితొలగించండి
 21. బొంకుట గాదిది నమ్ముడు!
  సంకటమౌ విధినిదప్ప సాధ్యమె మనకున్!
  సంకుల సమరము మరి యే
  సంకల్పము సిద్ధిగాంచు స్వప్నముల గనన్

  రిప్లయితొలగించండి
 22. సంకటముల మది నెంచక
  శంకలు వంకలను మాని సరి యోచనతో
  జంకక సాగెడి యోధుడె
  సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'యోధుని సంకల్పము...' అంటే అన్వయం బాగుంటుందేమో?

   తొలగించండి
 23. మిత్రులమధ్య సంభాషణ...

  కందం
  సంకల్పముఁ గలగనుచున్
  జంకలు గ్రుద్దుకొనినంత సరిపడునే? నీ
  యెంకమ్మా! శ్రమతో స
  త్సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్

  రిప్లయితొలగించండి
 24. మత్తేభవిక్రీడితము
  ఫలముల్ వారము నన్మహత్తరమనన్ భాగ్యమ్ముకై జూచుచున్
  బొలమారెన్ శుభమీయవత్తురెవరో పోగొట్టగా బాధలన్
  దలపుల్ స్వప్నములైన లాభమెటు? ప్రాధాన్యానఁ గష్టించుచున్
  గలలం గాంచి ముదంబు నందిననె సంకల్పంబు సిద్ధించులే

  రిప్లయితొలగించండి
 25. వంకలు వెదకక ఘన గణ
  నాంకము లూహించి నిర్మలాత్మఁ జెలంగం
  బంకజలోచను గరుణన్
  సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్


  కల దీ మేధ కపూర్వ శక్తి నర సంఘశ్రేష్ఠ శీర్షమ్ములన్
  నలినాక్షుం డిడఁ దప్ప దియ్యది మదిన్ నమ్మంగ సన్మాన్యు లౌ
  దల యందుంచిన భాషణమ్ములివి ప్రాతఃకాల సంజాతముల్
  కలలం గాంచి ముదంబు నందిననె సంకల్పంబు సిద్ధించులే

  రిప్లయితొలగించండి
 26. కలలే కల్లలు బుద్భుదమ్ములవి యే కాలమ్ములో నైన స
  త్ఫలితమ్మేమియు నుండదే, కృషియు విశ్వాసమ్మదే వీడుచున్
  కలలం గాంచిముదంబునందిననె, సంకల్పంబు సిద్ధించులే
  యిలలో జేసెడి సాధనొక్కటదియే యేకాలమందైన నున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సాధన + ఒక్కటి' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

   తొలగించండి
 27. మ.
  తలపన్ తీవ్రము యోచనల్ మదిని సంధానమ్ము నొందించుటై
  వెలుగున్ జూచిన గ్రొత్త పుస్తకములన్ వెద్కంగ నెన్నింటినో
  ఎల నైనన్ గనరాని చిత్తముల నూహించంగ నెట్టెట్టు లౌ
  కలలం గాంచి ముదంబు నందిననె సంకల్పంబు సిద్ధించు లే

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 28. అంకితభావము జూపిన
  సంకల్పము సిద్ధి గాంచు, స్వప్నములఁగనన్
  జంకక నవిదీర్చుకొనెడు
  వంకలు వెదకంగ వలెను వసుమతి లోనన్!!!

  రిప్లయితొలగించండి
 29. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్

  సందర్భము: రామాయణం.. సుందరకాండం.. 27 వ సర్గం త్రిజటా స్వప్న వృత్తాంతం.
  అశోకవనంలోని సీతకు రావణుడు రెండు నెలల్లో మనసు మార్చుకొ మ్మన్నాడు. రాక్షస స్త్రీలు సీతను భయపెట్టారు.
  త్రిజట అనే రాక్షసి ఇలా చెప్పింది.
  "నాకొక కల వచ్చింది. రామ లక్ష్మణులు తెల్లని పూదండలు వస్త్రాలతో నింగి నెగిరే వేయి హంసలు మోయగా ఏనుగు దంతాల పల్లకీలో వచ్చారు.
  సీత తెల్లని బట్టలతో సముద్రం నడుమ తెల్లని కొండపై నుండి రాముని కలుసుకొన్నది.
  తర్వాత నాలుగు దంతాల ఏనుగు నెక్కి రాముడు తమ్మునితో వస్తూ ఆకాశంలోనే ఆగి సీత నెక్కించుకున్నాడు. ఆమె చంద్ర సూర్యులను తుడిచినది. వారు పుష్పక విమానంపై ఉత్తర దిశకు వెళ్ళినారు.
  తల గుండైన రావణుడు నల్ల బట్టలతో పుష్పకంనుంచి పడిపోగా ఒక స్త్రీ ఈడ్చుకుపోయింది.
  అత డెఱ్ఱని బట్టలు మాలలు దాల్చి నూనె పూసుకొని నేలపై పడినాడు. పిచ్చిగా నూనె తాగుతూ ఆడుతూ నవ్వుతూ గాడిదల రథంపై వెళ్లినాడు.
  మరోసారి ఆతడు గాడిదమీ దెక్కి దక్షిణంవైపు వెళుతూ తలకిందుగా పడి లేచి కంగారుగా మాట్లాడుతూ దుర్గంధమైన మలంలో పడిపోయినాడు.
  విభీషణుడు మాత్రం తెల్లని బట్టలు దండలు గంధం తెల్లగొడుగు ధరించి మహావైభవంతో నాలుగు దంతాల ఏనుగు నెక్కి మంత్రులతో కనపడినాడు.
  లంకా నగరాన్ని ఒక వానరుడు చిత్తుగా కాల్చివేసినాడు. కాబట్టి మీరు సీతను భయపెట్టకండి."
  అప్పుడు సీత "మీరు కలలు గన్నంత సులభం కాదు. (సముద్రం దాటడమే ఎంతో కష్టం. లోకా లన్నింటినీ గడగడ లాడించిన రావణుని జయించడం మరింత కష్టం.) ఇంకెన్ని రాక్షస మాయల నెదుర్కోవాలో! మీరు కలలు గంటే నా సంకల్పం సిద్ధిస్తుందా!" అని విలపించింది.
  దుస్స్వప్న దోష శాంతికై ఈ సర్గను 3 రోజులు పారాయణం చేస్తారు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఇం కెన్ని మాయలో! అక
  లంకమతివి త్రిజట! ఈ కలం గంటి.. వెవో
  శంకలు వీడ.. వెటుల నా
  సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్?

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  21.10.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి


 30. అంకితమైన మనసుతో
  టెంకణ మిడ విభునికిన్ తృటిన్ తప్పక నా
  వెంకట రమణుని చేరెడు
  సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 31. జంకకు! జీవితమే కల!
  యింక కలయెది? నిజమెద్ది? యీప్సితమై నీ
  వంకిత భావము గాంచన్
  సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 32. జంకక ముందుకు సాగిన
  సంకల్పము సిద్ధిగాంచు,స్వప్నములగనన్
  శంకలుగలుగును నిరతము
  సంకటములుగలుగునేమొస్వప్నమువలనన్

  రిప్లయితొలగించండి

 33. చెలులం గానగ చేయివేయకుమయా ఛీకొట్టి చెడ్డందురే
  బలుపంటున్ బహురీతులన్ బలికి శాపాలిచ్చి వాపోవరా
  కలుషంబుల్ తెగబాపుకోగనిక భారంబౌట నోమిత్రమా
  లలినంబోరుహునేత్రునే దలపు కాలంబద్దియేవచ్చులే
  కలలం గాంచి ముదంబు నందిననె సంకల్పంబు సిద్ధించులే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చెడ్డ + అందురే' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. '...బాపుకోగ' అనడం సాధువు కాదు. 'తలచు కాలంబు' అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
 34. కలలంగాంచిముదంబునందిననెసంకల్పంబుసిద్ధించులే
  కలలేవచ్చునురాత్రిపూటయవియెక్కాలంబునందైనసూ
  పలుమారెయ్యదిదాదలంచుచునునెవ్వారల్ సునేత్రాలనన్
  నలమూయంగనెభీకరాకృతినిహాహాయంచువిన్పించుగా

  రిప్లయితొలగించండి
 35. శంకయు వలదిక పుత్రా
  సంకల్పము సిద్ధిగాంచు స్వప్నముల గనన్
  సంకటము లెన్ని వచ్చిన
  జంకక సాధించు మయ్య జగతిని నెపుడున్

  రిప్లయితొలగించండి