వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య.... "కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్" మీ పూరణలను గురువారం సాయంత్రం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి. padyamairhyd@gmail.com
కంది గురువు బ్లాగున నే కంద పదములు రచియింప గనపడ లేదే బంధి నయితిని సమస్యల విందున తెలవారగ నిల విశ్వ గురువరా!!
అయ్యా, కొందరి ప్రోత్సాహంతో ఈ మధ్యనే దాదాపు ఓక 40-45 రోజుల నుండి కొంచెం కంద పద్య నభ్యసించి రాస్తున్నాను, ఉదయమే సమస్యా పూరణ కందము లేకపోతే డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిన వాడికి డ్రగ్ దొరకనట్టు అయిపోతోంది నా పరిస్థితి. కొంచెం కంద పద్య పాదములలో కూడా ప్రతిరోజూ సమస్యనివ్వగలరని సవినయ ప్రార్థన 🙏🙏🙏🙏🙏
మిస్సన్న గారికి ధన్యవాదాలు. నిజానికి ముందుగా ఈ సమస్యకు కందపాదాన్ని ఇలా వ్రాసాను. "నవదీపము లేక గృహవితానమునందున్". తీరా షెడ్యూల్ చేసి గుండు మధుసూదన్ గారికి వినిపిస్తే ఆ పాదంలో యతి తప్పిన విషయాన్ని తెలియజేసారు. అందువల్ల దానిని తేటగీతి పాదంగా మార్చాను.
వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య.... కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్ మీ పూరణలను గురువారం సాయంత్రం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి. padyamairhyd@gmail.com
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
జవసత్వమ్ములు కూలిపోవుచును నా జంజాటమే తీర్చగా
జవరాలే మది నోలలాడుచును నన్ జల్దీని రావో యనన్
కవనంబందున ముంచి తేల్చగను మా కందీశులే హాయిగా
నవదీపమ్ములవేలకో గృహవితానమ్మందు నీవేళలో
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
ఇంతకూ దేనికి ప్రాధాన్యత? జవరాలి పిలుపుకా? కందీశుని కవనాహ్వానానికా?
🙏😊
తొలగించండిఈశ్వరేచ్ఛ...
విరించి
రిప్లయితొలగించండినవలా! నీదగు మందహాస మదియే నల్దిక్కులన్ తేజమై
ప్రవిభాసిల్లుచు నుండగా కనుచు నా పక్షాంతమే క్రుంగినన్
భువిఁజేరంగను లేదు ధ్వాంతమది నాప్రోయాలి నవ్వుండగా
నవదీపమ్ములవేటికో గృహవిధానమ్మందు నీవేళలో.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పక్షాంతమే వచ్చినన్/క్రమ్మినన్' అంటే బాగుంటుందేమో?
మత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండిశివమున్ గూర్చఁగ నార్టికల్ దొలఁగెఁ గాశ్మీరమ్మునన్ ద్రీసెవె
న్టి, విరాజిల్లచు భారతమ్మదియె తా ఢీకొట్టునన్ భ్రాంతితో
నవివేకమ్మునఁ 'బాకు' మీఱగనె, సైన్యంబెంచఁ బ్రేలుళ్లనే
నవదీపమ్ములవేలకో గృహవితానమ్మందు నివ్వేళలో?
సహదేవుడు గారూ,
తొలగించండిచక్కని సందర్భశుద్ధి కలిగిన పూరణ. బాగున్నది. అభినందనలు.
'విరాజిల్లుచు' టైపాటు.
🙏ధన్యోస్మి గురుదేవా. సవరించుకుంటాను🙏
తొలగించండికవితావేశముపొంగె నెమ్మనమునన్ కాంచంగ దీపావళుల్
రిప్లయితొలగించండినవచైతన్యవిభాసమానము,లనంతంబైన రోచిస్సులన్
దివిలోతారలు తెల్లబోవు పగిదిన్ దేదీప్యమానంబుగా
నవదీపమ్ములవేలకో గృహవితానమ్మందునీవేళలో
దివిలో మబ్బులు జల్లులై భువికినేతేరన్ సకాలంబులో
రిప్లయితొలగించండిఅవనిన్ నీరము నిండగా నదులలోనానందమే రైతుకున్
నవలావణ్యపు దీధితుల్ పరచుచున్ నల్దిక్కులన్ వింతగా
నవదీపమ్ములవేలకో గృహవితానమ్మందునీవేళలో
ఫణీంద్ర గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
స్తవనీయంబగురీతి చిత్తపటలిన్ సంధించగాలేక స
రిప్లయితొలగించండిచ్ఛివముల్ లోకమునందు గూడుటకునై శ్రేష్ఠప్రయత్నమ్ము లీ
యవనిన్ జేయగలేక స్వార్థమతివై యార్భాటముం జూపి మా
నవ! దీపమ్ము లవేలకో గృహవితానమ్మందు నీవేళలో.
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపవలున్ రేలును వెల్గుచుండినను భాస్వంతమ్ముగా నల్దిశల్
శివముల్ కావవి చిత్తమందు కటువౌ చీకట్ల బోకార్చకన్
ధ్రువమై యుండెడి జ్ఞానదీప మొకటే లోనున్న జాలున్ గదా
నవదీపమ్ములవేలకో గృహవితానమ్మందు నీవేళలో.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'పోకార్చక' కళ కదా... "చీకట్ల బోకార్చకే..." అందామా?
అవును గురువు గారు. పొరపాటు సవరించినందుకు ధన్యవాదాలు.
తొలగించండినవనీతమ్మును బోలు వస్త్రముల విన్నాణమ్ముతోఁ దాల్చి యా
రిప్లయితొలగించండిధవలాక్షుల్ తిరుగాడు చుండ కడు నుత్సాహమ్ముతోనచ్చటన్
భువికేతెంచిన దేవకాంతల వలెన్ భూషింపగా వీథులన్
నవదీపమ్ము లవేలకో గృహవితానమ్మందు నీవేళలో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినవ్య దీపముల్ గృహవితానమున నేల
పైన సోరణుల వరుస బల్పసందు
గాను పేర్చి రమణులెల్ల కార్యశీలు
రై ఛదిస్సుల తీర్చిరి రస్మలాయి
జాంగ్రియు, జిలేబి లడ్డుల చక్కగాను!
శుభాకాంక్షలతో
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిశివనామాంకితదివ్యమాసమనసుశ్రీకారసంరంభదీ
పవిశేషంబులుధాత్రినిండసహజంబౌదీపదీక్షాతతుల్
భవరాగమ్ములదివ్యశక్తులసుసంపన్నంబుగావింపగా
నవదీపమ్ములవేలకోగృహవితానమ్మందునీవేళలో
కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ ,రంగారెడ్డి
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిదివిజేంద్రుండదె ఆంధ్రరాష్ట్రములపై దింపెన్ మొయిళ్లన్ భళా!
వ్యవసాయమ్మనుకూలమై తనరగా భాగ్యోదయంబయ్యె., మా...
నవనేత్రమ్ములె కాంతిపుంజముల జిందన్ నేడు భార్యామణీ!
నవదీపమ్ములవేలకో గృహవితానమ్మందు నీవేళలో ?
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినూతన జ్ఞాన దివ్వెలను వెలి గించి
రిప్లయితొలగించండిచిత్తమందలి యజ్ఞాన చీకటులను
తరిమివేయుటకై ప్రయత్నము సలుపక
నవ్య దీపముల్ గృహవితానమున నేల ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'జ్ఞాన దివ్వెలు' దుష్టసమాసం. "జ్ఞాన దీపాలను.." అనండి.
🙏🏽
తొలగించండిచిచ్చు బుడ్లు మతాబులు విచ్ఛుకొనగ
రిప్లయితొలగించండివింత వెలుగులు విను వీధి విస్తరించ
నవ్య దీపము ల్ గృహ వితా న ము న నేల
యను విధంబు న దోచెను యవని యంత
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తోచెను + అవని' అన్నపుడు యడాగమం రాదు. "...దోచె నియ్యవని నంత" అనండి.
వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య....
రిప్లయితొలగించండి"కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్"
మీ పూరణలను గురువారం సాయంత్రం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
padyamairhyd@gmail.com
మ:
రిప్లయితొలగించండితివియించంజన ప్రాణముల్ నరక తా దేవేరితో గృష్ణుడున్
కవికా వీడిన యుద్ధమున్ దునుమ రేగామున్ప్రజా క్షేమ మై
భువి నందున్ జనులెల్ల సంతసమునన్ పొంగార దీపావళిన్
నవదీపమ్ములవేలకో గృహవితా నమ్మందు నీవేళలో
వై. చంద్రశేఖర్
మొదటి రెండు పాదాల భావం స్పష్టంగా లేదు.
తొలగించండిఇఃటిదీపమై యిల్లాలు యింపుగూర్చ
రిప్లయితొలగించండికంటి వెలుగులై సంతానమంటి యుండ
మింటినంటగ తోషము పంటపండి
నవ్య దీపముల్ గృహవితానమున నేల?
నిత్య దీపావళియె గాదె నీరజాక్ష!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఇంటి' టైపాటు. 'ఇల్లాలు + ఇంపు = ఇల్లా లింపు' అవుతుంది. యడాగమం రాదు. "ఇల్లాలె యింపు..." అనండి.
ధన్యవాదములు గురుదేవా,సవరించెదను.
తొలగించండిఇంటి
రిప్లయితొలగించండినవదీపమ్ములవేలొకో గృహవితానమ్మందునీ వేళలో;
రిప్లయితొలగించండినవచైతన్యము వెల్లువై విరిసెనా నక్తంచరున్ గూల్చగా
నవలావణ్య ప్రభా విరాజితుని శ్రీనారాయణున్ గొల్చుచున్
నవతారామణిహారముల్ మెరయుచున్నాకాశమే శోభిలెన్
(ఆకాశవాణికి పంపినది)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినవదీపమ్ములవేలకోగృహవితానమ్మందు నీవేళలో
రిప్లయితొలగించండిభవముల్సేమములుండగోరుచునునాఫాలేక్షుబ్రార్ధించుచు
న్నవదీపంబులనిచ్చగించిరటనానాదేశమేధావులే
భువికిన్మేలుగదీపకాంతులవియావ్యోమంబుకాంతీయగాన్
నవ్యదీపముల్ గృహవితానముననేల
రిప్లయితొలగించండియనగగృహములుకళకళలాడుచుండు
బెరుగునాయువుగలుగునుసిరులుభువిని
నవ్యదీపాలవెలుగులునావరించ
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
లవలేశమ్మును సొమ్మసిల్లకయె నన్ లాలించి పాలించెడిన్
జవరాలుండగ రాణివాసమునహో జాబిల్లివోల్ మోముతో...
పవళించన్ వటపత్రశాయివలె మా పాపాయి నట్టింటిలో...
నవదీపమ్ములవేలకో గృహవితానమ్మందు నీవేళలో?
మనోహరమైన పూరణ. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిపూజ్యులు కంది శంకరయ్య గారికి నమస్సులతో 🙏🙏
రిప్లయితొలగించండికం#
కంది గురువు బ్లాగున నే
కంద పదములు రచియింప గనపడ లేదే
బంధి నయితిని సమస్యల
విందున తెలవారగ నిల విశ్వ గురువరా!!
అయ్యా, కొందరి ప్రోత్సాహంతో ఈ మధ్యనే దాదాపు ఓక 40-45 రోజుల నుండి కొంచెం కంద పద్య నభ్యసించి రాస్తున్నాను, ఉదయమే సమస్యా పూరణ కందము లేకపోతే డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిన వాడికి డ్రగ్ దొరకనట్టు అయిపోతోంది నా పరిస్థితి. కొంచెం కంద పద్య పాదములలో కూడా ప్రతిరోజూ సమస్యనివ్వగలరని సవినయ ప్రార్థన 🙏🙏🙏🙏🙏
నవ దీపము లేల గృహ గణమునను సుకవీ!
తొలగించండి🙏🙏🙏
తొలగించండి
తొలగించండి:)
డ్రగ్గు కలవాటుపడి నే
నగ్గడు బగ్గడుగ మారినాను కవివరా!
మ్రగ్గితి కందపుటగ్గియు
భగ్గున మండక చకచక ప్రతిదినమిచటన్
జిలేబి
😀😀😀🙏🙏🙏👌👌👌
తొలగించండిమిస్సన్న గారికి ధన్యవాదాలు.
తొలగించండినిజానికి ముందుగా ఈ సమస్యకు కందపాదాన్ని ఇలా వ్రాసాను. "నవదీపము లేక గృహవితానమునందున్". తీరా షెడ్యూల్ చేసి గుండు మధుసూదన్ గారికి వినిపిస్తే ఆ పాదంలో యతి తప్పిన విషయాన్ని తెలియజేసారు. అందువల్ల దానిని తేటగీతి పాదంగా మార్చాను.
(కృష్ణుడు పారిజాతపుష్పంతో రుక్మిణి నలంకరించాడని
రిప్లయితొలగించండితెలియగానే తన మందిరంలో దీపాలు వద్దన్న సాత్రాజితి )
అవనిన్ భర్తలు భార్యలన్ మిగుల న
న్యాయమ్ముగా శ్లాఘతో
నివతాళింపగజేయుచున్ దుదకు ము
న్నీటన్ బడన్ ద్రోతురే !
సవతిన్ గృష్ణుడు పారిజాతకలితన్
జక్కంగ మన్నించెనే ?
నవదీపమ్ము లవేలకో గృహవితా
నమ్మందు నీ వేళలో ?
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిజవసత్వమ్ములు వీగె నో ముసలి వాజమ్మై విచారించినా
ను? విశాలమ్ము సనాతనమ్ము! హృదిలో నూత్నంపు టాలోచనా
నవదీపమ్ముల, వేల, కో! గృహ వితానమ్మందు,నీ వేళలో
కవియించున్ తమదైన రీతిని, నిరాకారమ్ము సాకారమై!
వేల - చెలియలికట్ట, ఉప్పెన అన్న అర్థములో
దీపావళి శుభాకాంక్షలతో
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిదివ్య దీపావళికి వచ్చి తేజమలర
మురిపెముల్ బంచి దౌహిత్రుఁడిరుగు పొరుగు
కళ్ల దివ్వెళ్లు వెలిగించ నుల్లమలర
నవ్య దీపముల్ గృహవితానమున నేల?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅయితే పండుగకు దౌహిత్రుడు వచ్చాడన్న మాట!
🙏గురుదేవులకు ధన్యవాదములు. వచ్చియున్నాడు. మురిపిస్తున్నాడు. 🙏
తొలగించండిఈ వ్యయం బాపుమా ధీవ రేంద్ర యింక
రిప్లయితొలగించండినవ్యయపు రీతు లింపుగ నాదరించు
భావ్యమే వెలిఁగించుట పట్టపగలు
నవ్య దీపముల్ గృహవితానమున నేల
నవనీతం బది యుండఁ గృత్రిమపు టన్యం బాజ్య మేలా యిఁకన్
స్తవనీయం బగు కావ్యముల్ పరఁగఁ దుచ్ఛంబైన వేలన్ వినం
బవ లుద్దీప్తముగం చెలంగ నిచ టన్భానుప్రకాశమ్ము మా
నవ దీపమ్ముల వేలకో గృహ వితానమ్మందు నీవేళలో
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి'ఉద్దీప్తముగం చెలంగ/జెలంగ...' టైపాటు అనుకుంటాను.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిమొదట ఉద్దీప్తములై చెలంగ అని వ్రాసితిని. దానిని ఉద్దీప్తముగం గా మార్చాను. అప్పుడు చె సంగతి మఱచితినండి.
నవనీతం బది యుండఁ గృత్రిమపు టన్యం బాజ్య మేలా యిఁకన్
తొలగించండిస్తవనీయం బగు కావ్యముల్ పరఁగఁ దుచ్ఛంబైన వేలన్ వినం
బవ లుద్దీప్తముగం జెలంగ నిచ టన్భానుప్రకాశమ్ము మా
నవ దీపమ్ముల వేలకో గృహ వితానమ్మందు నీవేళలో
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
నవ దీపమ్ముల వేలకో గృహవితానమ్మందు
నీవేళలో
సందర్భము: రావణ వధను రాముని విజయాన్ని ఘోషిస్తూ వానరులు సింహనాదాలు చేశారు.
పపాత పుష్పవృష్టిశ్చ
సమంతా ద్రాఘవోపరి
తుష్టువు ర్మునయః సిద్ధా
శ్చారణాశ్చ దివౌకసః
దేవతలు రామునిపై పూలవాన కురిపించిరి. సిద్ధులు చారణులు దేవతలు స్తుతించిరి.
(అధ్యాత్మ రామాయణం.. యుద్ధకాండం 11వ సర్గం 77 శ్లో.)
రామునిచేత విభీషణునికి లంకారాజ్య పట్టాభిషేకం జరిగింది. సీత కగ్ని పరీక్ష జరిగింది. పుష్పక విమానంలో సీతా రామ లక్ష్మణులు అయోధ్యకు చేరుకున్నారు.
పురజను లమం దానందంతో స్వాగతం పలికి పట్టణమంతా దీపాలతో తోరణాలతో పూలతో అలంకరించినారు.
"నిజానికి ఇండ్లన్నీ దీపాలు పెట్టకుండానే సహజంగానే వెలిగిపోతున్నాయి. చూడడం లేదా!" యని ఒక పౌరు డానందంతో అంటున్నాడు..
~~~~~~~~~~~~~~~~~~~~~~~
దివిజుల్ మెచ్చగఁ.. బుష్ప వర్షములతో
దీవింపగా.. ఘోర దా
నవ నిర్మూలనమున్ బొనర్చి పురికిన్
రాముండు రా నా యయో
ధ్య వెలుంగుల్ గనవా! గృహంబులు దమం
తన్ దాము సత్కాంతిఁ బూ
నవ! దీపమ్ము ల వేలకో గృహ వితా
నమ్మందు నీ వేళలో!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
26.10.19
-----------------------------------------------------------
మీ పూరణ వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభవ్య మైన గృహమ్ముల ప్రభుత కట్టి
రిప్లయితొలగించండిలబ్ధిదారుల కీదు దశాబ్ద మైన
వీధి దీపాల మాత్రము వెలుగు చుండె
నవ్య దీపముల్ గృహవితానమున నేల.
వీథి దీపాలు
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిరించి.
రిప్లయితొలగించండినేలను విడిచి ధరలవి నింగి జేరి
తారల సరసన మెరయు తరుణమందు
పర్వ దినమంచు నార్థిక భారమొసగు
నవ్యదీపముల్ గృహవితానమున నేల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ అల్పుడి బాధ నర్థం చేసుకున్న శ్రీ మిస్సన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏
రిప్లయితొలగించండికందములో 🙏🙏
నవ దీపము లేల గృహ గణమునను సుకవీ
అవసరము లేదు దీపము
లవసరము వలదు మనకు కళ కళనడయ నా
జవరాళ్ల నవ్వు గల దిక
నవ దీపము లేల, గృహ గణమునను సుకవీ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యోస్మి 🙏🙏
తొలగించండిచెలియ కన్నుల వెలుగులు చిచ్చు బుడ్లు
రిప్లయితొలగించండితరుణి కనుల వెలుగులు మతాబులవగ
భార్య యింటిలో వెలుగులు పంచు చుండ
నవ్యదీపముల్ గృహవితనమునయేల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికంటి దీపాల వలె పిల్లలింట నుండ |
రిప్లయితొలగించండిజంట బాయని యనురాగ చామ తోడ |
నిత్య కళ్యాణ మై యిల్లు నెలవు దీర |
"నవ్య దీపముల్ గృహవితానమున నేల"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఫేసుబుక్కులో ఒక సవరణ సూచించాను. చూడండి.
భావము సరి చేస్తాను
రిప్లయితొలగించండిఆకాశవాణికి బంపిన పూరణము
రిప్లయితొలగించండిఅవనీ పుత్రుడు నంతమొందగను ప్రహ్లాదంబుతో బోటులా
భవనాశున్ తమభర్తగా కొలచి దివ్యానంద తేజమ్మునన్
దివిజుల్ మెచ్చగ దారలై మెరియ నా దేవేరులే ముర్యగా
నవదీపమ్ము లవేలకో గృహ వితానమ్మందు నీవేళలో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఈ వారపు ఆకాశవాణి వివరములు తెలుపగలరు
జిలేబి
యథావిధిగా జిలేబి గారి పూరణ చదువబడినది...పేరులోనే ఉన్నది పెన్నిధి
తొలగించండి😊
తొలగించండిఆహా :)
జిలేబి
వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య....
రిప్లయితొలగించండికలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్
మీ పూరణలను గురువారం సాయంత్రం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
padyamairhyd@gmail.com
తొలగించండినెనరుల్స్ పంపినాము
జిలేబి
నవలా! త్వన్ముఖరామణీయకలసన్నవ్యప్రభాదీధితుల్
రిప్లయితొలగించండిభవనంబంతయు విస్తరించె నిబిడధ్వాంతమ్ములం గూల్చుచున్
బవలున్ రేయి వెలుంగులీన నిట సంభావించు జ్యోత్సాభులై
నవదీపమ్ములవేలకో! గృహవితానమ్మందు నీవేళలో.
మీ పూరణ రమణీయంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచిన్న సందేహమండి.
తొలగించండిప్రభా దీధితుల్ కాంతివంతపు కిరణములు: జడములు
జ్యోత్సాభులు: మహద్వాచకము
జ్యోత్సాభములు: జడముల కన్వయమని నా సందేహము.
విస్తరించె క్రియ జడములకు సరిపోయినది.
“ జ్యోత్స - జ్యోత్స్న” అనుకుంటాను
తొలగించండికీ.శే. ముదిగంటి గోపాలరెడ్డిగారు సంకలనము చేసిన సంస్కృత-ఆంధ్ర నిఘంటువు (వ్యుత్పత్తి, నిర్వచన సహితంగా) శోధనకు జతచేశాము.
తొలగించండి»
దీధితిpermalink
దీధితి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 Report an error about this Word-Meaning గ్రంథసంకేతాది వివేచన పట్టిక
సం. వి. ఇ. స్త్రీ.
दीधिति स्त्री।
తొలగించండిकिरणः
समानार्थक:किरण,अस्र,मयूख,अंशु,गभस्ति,घृणि,रश्मि,भानु,कर,मरीचि,दीधिति,शिखा,गो,रुचि,पाद,हायन,धामन्,हरि,अभीषु,वसु
1।3।33।2।4
किरणोऽस्रमयूखांशुगभस्तिघृणिरश्मयः। भानुः करो मरीचिः स्त्रीपुंसयोर्दीधितिः स्त्रियाम्.।
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఆర్యా!
తొలగించండిసంస్కృతపర్యాయపదాలు అన్నీ అర్థాన్ని అనుసరించి మహతీవాచకాలో మహద్వాచకాలో కావాలని నియమేమి లేదండి, అందుకు దార శబ్దమే ఉదాహృతి.
జ్యోత్స్నయే టైపులో తప్పిదము జ్యోత్స అని టైపు అయింది.
తొలగించండిమీ సూచనకు ధన్యవాదాలండి.
విస్తరించె చు అదీ టైపు పొరపాటు.
తొలగించండిదయచేసి అన్యథా భావించవలదు
అవనీనాథుడు రామచంద్రునికి రాజ్యంబిచ్చు కోర్కెన్ భళా!
రిప్లయితొలగించండిలవలేశంబును జాగుసేయక నిసీ!రాకాసి వేళన్నిటుల్
సవనార్భాటమునన్ ముహూర్తము దలంచంగాను నోమంథరా!
నవ దీపమ్ములవేలకో గృహవితానమ్మందు నీవేళలో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండి[10/21, 9:14 PM] Kandi Shankaraiah
రిప్లయితొలగించండిదివియే ముంగిట వచ్చినట్లుగను దేదీప్యం బుగావెల్గుచున్
నవదీపమ్ము లవేలకో గృహవితానమ్మందు నీవేళలో"*
దివసాం తమ్మున కాంతులన్నొసగ నీదేహాలయంబున్నిదే
భువిలో గొప్పగ చేయనెంచుచును తామున్మందుగా నిచ్చటన్.