విద్వత్తులో తనను పరాజయించిన వానినే పరిణయమాడెదను అని ప్రతిజ్ఞ పూనిన విద్యోత్తమ అనబడే ఓ యువరాణి, విక్రమాదిత్యుని ఆస్థానములోని పండితులనందరినీ తన పాండిత్యముచే పరాజయము పాలుచేసినది. ఈ అవమానము సహించలేని ఆ పండితులు, ఆనాటికి మందబుద్ధిగా ఉన్న కాళిదాసుని గొప్ప పండితుడని ఆమెను మోసగించి, వారిరువురికినీ పరిణయము గావించిరి. పెళ్ళి తరువాత కాళిదాసు నిజస్వరూపమును గ్రహించిన ఆమె తన అవివేకమునకు మరియు తనకు జరిగిన అవమానమునకు క్రుంగిపోవును. ఇది గ్రహించిన కాళిదాసు జ్ఞాన సముపార్జనకునూ, విద్వత్తు గల భార్యకు తగు సమానునిగను ఉండవలెనన్న తలంపుతో, తన ఇష్టదైవమయిన కాళికాదేవిని ప్రసన్నము చేసుకొనుటకు ఇల్లు విడుచును. అతని ప్రార్థన ఆలకించిన మాత ప్రసన్నురాలై, కాళిదాసుకు గొప్ప విద్వత్తును, మాటనేర్పరి తనాన్ని అనుగ్రహించును. భార్యతో వివాహానికి పూర్వము జరిగిన విద్యా పాటవ ప్రదర్శనలో, విద్యోత్తమ తన మొదటి ప్రశ్నగా, అస్తి కశ్చిత్ వాగ్విశేషా:? (నీ భాషలో ఏమైనా ప్రత్యేకత యున్నదా?) అని అడుగుతుంది.దానికి ప్రతిగా కాళిదాసు తన మందబుద్ధితో అరకొరగా సమాధానము ఇస్తాడు. కానీ మాత అనుగ్రహముతో, గొప్ప జ్ఞానసముపార్జనతో ఇంటికి తిరిగి వచ్చిన కాళిదాసు భార్యతో, ఆమెను తన భార్యగా కన్నా, తనకు జ్ఞానమార్గోపదేశము చేసిన గురువుగా తలచి, ఆమె ప్రశ్నకు నివాళిగా, ఆమె గతములో సంధించిన ప్రశ్నలోని మూడు పదాలతో ప్రారంభింపబడిన తన మూడు కావ్యాలలోని మొట్ట మొదటి వాక్యాల ద్వారా తన సరికొత్త ఉనికిని తెలియచేస్తాడు. అవే అస్తితో మొదలయ్యే (అస్త్యుతారాస్యా దిశి) కుమారసంభవము, కశ్చిత్ తో మొదలయ్యే (కశ్చిత్ కాంతా) మేఘసందేశం మరియు వాక్ తో మొదలయ్యే (వాగర్థావివ సంపృక్తౌ) రఘువంశము.
రిప్లయితొలగించండిభంగము కాకన్ పద్యపు
రంగమ్మున పూరణ చదరముగా చేయన్
చెంగట ముద్దులొలుక చద
రంగమ్మున నోడిన కవి రాణిని గెల్చెన్!
జిలేబి
ఏ రాణిని గెలిచారండీ....😊😊
తొలగించండి
తొలగించండిఉత్పల మా లలో జవాబు కలదు :)
జిలేబి
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
సంగము కోరుచున్ మిగుల చక్కగ మెచ్చుచు రాజవీధినిన్
వంగుచు రాణికిన్ విరివి పద్యము లల్లుచు నందగత్తెకున్
భంగును త్రాగుచున్ తెగని వంగల రంగుల హోలియాటలో
రంగమునందు నోడి యొక రాణిని గెల్చెఁ గవీంద్రుఁ డొక్కఁడున్
*ఏకాంతములో భార్యతో చదరంగ మాడు భర్త కాలయాపనను సహించలేక తనకుతానుగా ఓడి పోయి తదుపరి భార్యతో సుఖించాడనే భావనతో*
రిప్లయితొలగించండిసింగారించుకు వచ్చిన
యంగన తాకోరెనంచు నసహనమున తా
శృంగారముఁ గోరుచు చద
రంగమ్మున నోడిన కవి రాణిని గెల్చెన్
రంగమ్మత్తా విను విను
రిప్లయితొలగించండిమంగమ్మక్కా కనుమిక,మారడు చూడే
చెంగున దూకంగ కదన
రంగమ్మున నోడిన కవి రాణిని గెల్చెన్!!
*****ఇరుగు పొరుగు వారి సరదా సంభాషణ..
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
బంగరు రాణికిన్ ముదపు పాటల నల్లెడి మైకమందునన్
కొంగును పైకిదోపుచును కోరిక మీరగ బుద్ధి వీడగా
చెంగున గంతుచున్ పడుచు చిక్కడపల్లిని గాన నాట్యపున్
రంగమునందు నోడి యొక రాణిని గెల్చెఁ గవీంద్రుఁ డొక్కఁడున్
సింగము నోలెడి యా కవి
రిప్లయితొలగించండిపుంగవుని గెలుచుట దుర్లభంగ తలచి నా
రంగము సిద్దమనగ చద
రంగమ్మున నోడిన, కవి రాణిని గెల్చెన్
(రాణి ని గెలుచుటకు చదరంగమున ఓడవలెననగా)
రిప్లయితొలగించండిరంగంపేట క్రాసు కాడ రా రమ్మని బిల్వ నారంగియే :)
భంగము కాక కైపదము ప్రౌఢిమ చేర్చుచు పూర్తి చేసి యా
రంగము పేట క్రాసుని విరామము కోరుచు చూడ బాపురే
రంగి రికార్డు డాన్సుల తరంగిణి బిల్వగ బంభరమ్ముగా
రంగమునందు నోడి యొక రాణిని గెల్చెఁ, గవీంద్రుఁ డొక్కఁడున్!
జిలేబి
భళా..భళ్ భళా...
తొలగించండినాకు తెలిసొచ్చినది....
🙏🙏🙏🙏
రిప్లయితొలగించండినా పూరణ.
***** ***
బంగరు బొమ్మ లాంటి తన భామ మనమ్మును గెల్వ నెంచి నో
పుంగవుడున్ గవీంద్రుడును బోటియె పెట్ట వివాహమందునన్
యుంగుర మాటలో నతడు యుక్తిగ జిక్కిన నుంగురమ్మునే
భంగము నోర్చ నెంచుచును భార్యకు బ్రేమయె పొంగ నిచ్చుచున్
రంగమునందు నోడి యొక రాణిని గెల్చె గవీంద్రు డొక్కడున్
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
భంగ పడియె నాడుచు చద
రిప్లయితొలగించండిర o గ మ్ము న : నోడి న కవి రాణి ని గెల్చె న్
పొంగినక వి తా వేశపు
హంగు ల తో పద్య మల్లి హా యను భంగి న్ a
(షాజహాన్ చక్రవర్తి ఆస్థానయువకవి జగన్నాథ పండితరాయలు రాజకుమారి
రిప్లయితొలగించండిలవంగి ప్రేమను అందుకున్నాడు.చదరంగంలో మాత్రం ప్రభువుతో ఓడిపోయాడు)
చెంగున లేచి రాజసుత
చిత్తము ముగ్ధమొనర్చు పద్యముల్
బొంగుచు బల్కునట్టి కవి
పుంగవు ;డాంధ్రుడు ;రమ్యరూపుడున్ ;
భంగము లేని కావ్యకరణ
" పండితుడే "చతురంగకేళికా
రంగమునందు నోడి యువ
రాణిని గెల్చె గవీంద్రు డొక్కడున్ .
చివరిపాదంలో 'యువ'బదులుగా 'యొక 'అని చదువ మనవి ,
రిప్లయితొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిసంగరమేమిలేదు , రససాంద్రకవిత్వమునల్ల జాలు , వా...
మాంగి లభించు మీకనగ నట్లెయటన్న కవిత్రయమ్ము జె...
ప్పంగవితల్ వినన్ మొదటవచ్చిన ఇద్దరు పారిపోవగా
రంగమునందు నోడి.,
యొక రాణిని గెల్చెఁ గవీంద్రుఁ డొక్కఁడున్!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
కం.
రిప్లయితొలగించండిరంగుల పండగ రోజున
కొంగున ముడివేయనెంచి కోరిక దెలుపెన్
యంగన ప్రతిపాదనలకు
రంగమ్మున నోడిన కవి రాణిని గెల్చెన్
వై. చంద్రశేఖర్
నా ప్రయత్నం :
రిప్లయితొలగించండివిద్వత్తులో తనను పరాజయించిన వానినే పరిణయమాడెదను అని ప్రతిజ్ఞ పూనిన విద్యోత్తమ అనబడే ఓ యువరాణి, విక్రమాదిత్యుని ఆస్థానములోని పండితులనందరినీ తన పాండిత్యముచే పరాజయము పాలుచేసినది. ఈ అవమానము సహించలేని ఆ పండితులు, ఆనాటికి మందబుద్ధిగా ఉన్న కాళిదాసుని గొప్ప పండితుడని ఆమెను మోసగించి, వారిరువురికినీ పరిణయము గావించిరి. పెళ్ళి తరువాత కాళిదాసు నిజస్వరూపమును గ్రహించిన ఆమె తన అవివేకమునకు మరియు తనకు జరిగిన అవమానమునకు క్రుంగిపోవును. ఇది గ్రహించిన కాళిదాసు జ్ఞాన సముపార్జనకునూ, విద్వత్తు గల భార్యకు తగు సమానునిగను ఉండవలెనన్న తలంపుతో, తన ఇష్టదైవమయిన కాళికాదేవిని ప్రసన్నము చేసుకొనుటకు ఇల్లు విడుచును. అతని ప్రార్థన ఆలకించిన మాత ప్రసన్నురాలై, కాళిదాసుకు గొప్ప విద్వత్తును, మాటనేర్పరి తనాన్ని అనుగ్రహించును. భార్యతో వివాహానికి పూర్వము జరిగిన విద్యా పాటవ ప్రదర్శనలో, విద్యోత్తమ తన మొదటి ప్రశ్నగా, అస్తి కశ్చిత్ వాగ్విశేషా:? (నీ భాషలో ఏమైనా ప్రత్యేకత యున్నదా?) అని అడుగుతుంది.దానికి ప్రతిగా కాళిదాసు తన మందబుద్ధితో అరకొరగా సమాధానము ఇస్తాడు. కానీ మాత అనుగ్రహముతో, గొప్ప జ్ఞానసముపార్జనతో ఇంటికి తిరిగి వచ్చిన కాళిదాసు భార్యతో, ఆమెను తన భార్యగా కన్నా, తనకు జ్ఞానమార్గోపదేశము చేసిన గురువుగా తలచి, ఆమె ప్రశ్నకు నివాళిగా, ఆమె గతములో సంధించిన ప్రశ్నలోని మూడు పదాలతో ప్రారంభింపబడిన తన మూడు కావ్యాలలోని మొట్ట మొదటి వాక్యాల ద్వారా తన సరికొత్త ఉనికిని తెలియచేస్తాడు. అవే అస్తితో మొదలయ్యే (అస్త్యుతారాస్యా దిశి) కుమారసంభవము, కశ్చిత్ తో మొదలయ్యే (కశ్చిత్ కాంతా) మేఘసందేశం మరియు వాక్ తో మొదలయ్యే (వాగర్థావివ సంపృక్తౌ) రఘువంశము.
ఉత్పలమాల
అంగన పాండితీ గరిమ నందని మందుని కాలిదాసునిన్
బొంగునడంచ రాణికిఁ బ్రభుద్ధుడటంచును గట్ట బెట్టిరే
చెంగట కాళిమాతదయ శేముషి నందుచు నీడుజోడనన్
రంగమునందునోడి యొక రాణిని గెల్చెఁ గవీంద్రుఁ డొక్కఁడున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅస్తి కశ్చిత్ వాగ్విశేషా!!!
తొలగించండిసహదేవుఁడు గా రద్భుతమైన పూరణము మఱియు నాసక్తి కర కథా సూచనము. ఈ విషయము నాకు క్రొత్తయే.
ధన్యవా దాభినందనలు.
ఆర్యా, ధన్యవాదములు.
తొలగించండినేనునూ ఈ సరదా పూరణను కవివరేణ్యులు జిలేబి గారికి అంకితము జేసితి సంతసమ్ముగన్...
రిప్లయితొలగించండిముందస్తుగా వారి అనుమతి పొంది....
Permission granted పత్రము కూడ దీనికి జతపరుచనైనది...
నా పూరణ.
***** ***
జంగమదేవ!లింగ!గిరిజా ప్రియ వల్లభ!యేమిజేతురా!
పుంగవుడున్ గవీశుడు ప్రబుద్ధుడు జ్ఞానుడు శంకరుండు నే
ఖంగుతినంగ నిచ్చె గద గాఢ సమస్యనె యివ్విధంబుగన్
"రంగమునందు నోడి యొక రాణిని గెల్చె గవీంద్రు డొక్కడున్"
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
తొలగించండికవివరేణ్యులు జిలేబి గారికి !!! :)
అయ్యయ్యో ములగ చెట్టు పైనుండి పడి కాలు ఢమాలు :)
గౌరవనీయులు శాంతి భూషణ్ గారికి
జిలేబి ది టైం పాస్ కడలై సుండల్ బఠాణీ లంతే ! ఏదో సరదా శారదా విభావరి !
మీ అభిమానానికి నెనరులు
చీర్స్
జిలేబి
👌👌🙏🙏🙏
తొలగించండిధన్యవాదాలండీ...
మూడవపాదంలో " భంగము లేని గ్రంథముల " అని
రిప్లయితొలగించండిచదువగలరు .
రంగనితోనాడుచుచద
రిప్లయితొలగించండిరంగమ్ముననోడినకవిరాణినిగెలిచెన్
సంగమమందున రకరక
భంగిమలన్ దృప్తిపఱచిప్రమదముగలుగన్
అంగనకు నంతరంగము
రిప్లయితొలగించండిభంగము కాక మనఁ గలదె పన్నుగఁ బ్రేమో
రం గాభం గోత్తుంగ త
రంగమ్మున నోడిన కవి రాణిని గెల్చెన్
[ఉరంగము = పాము; ప్రేమయను పామనెడు నిరంతరముగా లేచిన కెరటము]
ఆది శంకరాచార్యుని ప్రసక్తి:
జంగమ సర్వ సంగ సువిసర్జిత లోక హితానుయోక్త స
న్మంగళ సంచయప్రదుఁడు మార విరోధికి నిత్య భక్తుఁడే
యంగజ శాస్త్ర విద్యల మహా సతికిం బరమంపు సాహితీ
రంగమునందు నోడి యొక రాణిని గెల్చెఁ గవీంద్రుఁ డొక్కఁడున్
రంగమునందునోడియొకరాణినిగెల్చెగవీంద్రుడొక్కడున్
రిప్లయితొలగించండిఖంగుతినంగనిచ్చెనిదికందివరేణ్యులువ్రాయలేనిచో
భంగముగల్గునంచిపుడువ్రాయగబూనితినిట్లుగాదగన్
బొంగినసంతసంబుననపూర్వపురీతినినాదరింతురే?
భంగపడెను కవితా రణ
రిప్లయితొలగించండిరంగమ్మున నోడిన కవి; రాణిని గెల్చెన్
పొంగుచు రసమయ కావ్య త
రంగమ్ముల దేల్చినట్టి రాజే కవియై
వంగర లోనబుట్టి బహు భాషల నేర్చిన నేమి యోట్లనే
రిప్లయితొలగించండిసంగర మందుతాను జన సమ్మతి లేక యోడెరా
యింగిత మున్నవాడనుచు నిందిర గాంధియె మెచ్చెగాదె, యా
రంగమునందు నోడి యొక రాణిని గెల్చెఁ గవీంద్రుఁ డొక్కఁడున్
సంగర మందు శాత్రువుల సైన్యపు తీరు గనంగఁ భీతితో
రిప్లయితొలగించండిచెంగున వెన్నుజూపి వడిఁ జెంతన యున్న గృమ్ముకేగగా
నంగన గాంచుచున్నతని యందము మెచ్చివివాహమాడె, వీ
రంగమునందు నోడి యొక రాణిని గెల్చెఁ గవీంద్రుఁ డొక్కఁడున్
రిప్లయితొలగించండిఅంగన పాలిత నాడున
భంగురమగు పదవికై ప్రబంధము నీయన్
లొంగనని, రాణినిగని తు
రంగమ్మున నోడిన కవి రాణిని గెల్చెన్
తురంగము = మనస్సు
ఓడు = వశుడగు
అంగనయంగాంగమ్ముల
రిప్లయితొలగించండిశృంగారముగాంచి మరులు చివురులుదొడగన్
అంగజు పూశరముల రణ
రంగమ్మున నోడిన కవి రాణిని గెల్చెన్"
రిప్లయితొలగించండిలకలక లక లకా :)
ముంగురులట నడుమును తా
కంగ నరరె చంద్రముఖి పకాల్మని నవ్వెన్
చెంగున దూకంగను వీ
రంగమ్మున నోడిన కవి రాణిని గెల్చెన్!
జిలేబి
అంగన పోటీ నిడగా
రిప్లయితొలగించండినంగము నుప్పొంగ గనట యానందముతో
సంగడి చేరుచు నా చద
రంగమ్మున నోడిన కవి రాణిని గెలిచెన్.