20, అక్టోబర్ 2019, ఆదివారం

సమస్య - 3168 (అమ్మపాలు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అమ్మపాలు విషమ్మగు నర్భకులకు"
(లేదా...)
"విషమగు నమ్మపాలనుచుఁ బిల్లలు గ్రోలఁగ నిచ్చగింపరే"

43 కామెంట్‌లు:

 1. మైలవరపు వారి పూరణ

  నేటి మహిళతో... వాళ్లమ్మ ఇలా అంటోంది..

  చషకము బట్ట నేర్వడు, కుచగ్రసనమ్మును కోరగా నెదో
  మిషఁ దనుశోభ తగ్గునని మీరలు పాలిడకున్న పాడియే ?
  శషభిషలేల ? బిడ్డకు రసాయనదుగ్ధములిచ్చుచున్నచో
  " విషమగు నమ్మపాల"నుచుఁ బిల్లలు గ్రోలఁగ నిచ్చగింపరే !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి

 2. ప్రాతః కాలపు సరదా పూరణ:

  విషయము తేల్చి చూపుచును వేళకు రావని గోలజేయుచున్
  మిషములనెన్నొ జేయుచును మ్రింగుచు టాఫిలు మాటిమాటికిన్
  శషభిషలెన్నొ జెప్పుచును చంద్రుని పాలును మెచ్చి త్రాగుచున్
  విషమగు నమ్మపాలనుచుఁ బిల్లలు గ్రోలఁగ నిచ్చగింపరే

  రిప్లయితొలగించండి
 3. అందమంతయు చెదరునటంచు నీవు
  వీధిలో నమ్ము పాలనే విరివి గాను
  తెచ్చి వాడుట మానవే తెలివి లేని
  యమ్మ, పాలు విషమ్మగు నర్భకులకు.

  రిప్లయితొలగించండి
 4. ఆవుపాలకు సరిసాటియవనియందు
  అమ్మపాలు, విషమ్మగు నర్భకులకు
  వలదు పట్టింపగా పిండి పాలనెపుడు
  మాతృ స్తన్యమ్ము మించిన మందులేదు.

  రిప్లయితొలగించండి
 5. (బాలకృష్ణుడు గట్టిగా పాలు పీల్చి పూతనను వధించాక పిల్లలు భయపడి తల్లిపాలు తాగటం మానుకున్నారు )
  విషయము నెంతమాత్రమును
  వెల్లడి చేయక కంసునానతిన్
  విషము పయోధరమ్ములకు
  వింతగ పూసిన తాటకాఖ్యనే
  విషమపు పీల్పుతో నణచు
  వెన్నుని క్రీడకు విస్మితాస్యులై
  " విషమగు నమ్మపా " లనుచు
  బిల్లలు గ్రోలగ నిచ్చగింపరే !!

  రిప్లయితొలగించండి

 6. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  "వంగే మాతరం!"

  ఖుషిగొని మార్కెటందునను కొల్లలు కొల్లలు ప్రోగుజేయుచున్
  ఝషముల వండి కుక్కగను జాస్తిగ రోగము లెచ్చుచుండగా
  చషకములందు మందులను జబ్బులు తీరగ త్రాగుటందునన్
  విషమగు నమ్మపాలనుచుఁ బిల్లలు గ్రోలఁగ నిచ్చగింపరే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. శంకరకవి, మురళీకృష్ణగారి సూచనలతో

   విషమగునేల? జీవరసవేద్యము స్వ్యాస్థ్యవిధాయకమ్మునై
   తృషితమనశ్శమాన్వితము, తృప్తి నొసంగెదె మాతృమూర్తికిన్?
   భిషజుడొకండు జెప్పెనని వెఱ్ఱి విధానఁ దలంతువేలనో!
   విషమగు, నమ్మపాలనుచుఁ బిల్లలు గ్రోలఁగ నిచ్చగింపరే!

   తొలగించండి
 8. మాత చనుబాలవంటిది మాతృభాష
  అంగడిన దొరకెడిపాలె అన్య భాష
  పరుల భాషతోడనె వచ్చు పదవియనగ
  నమ్మపాలు విషమ్మగు నర్భకులకు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అంగడిని' అనండి.

   తొలగించండి
 9. మాటపాటలే నీవగు మంచిపాలు
  శారద! గ్రోలగనింపగు చదువరులకు
  నమ్మ! పాలు విషమగు నర్భకులకు
  సరసత రసఙ్ఞత గొనని చందమునను

  రిప్లయితొలగించండి
 10. శ్రేష్ఠ మందురు పెద్దలు శిశువు ల కిల
  అమ్మ పాలు : విషమ్మగు నర్భ కుల కు
  పోషకమ్ము ల నీయవు పోత పాలు
  కలు షి త మ్మ ని నమ్ముట క ల్ల కాదు

  రిప్లయితొలగించండి
 11. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  అమ్మపాలు విషమ్మగు నర్భకులకు

  సందర్భము: దేవాసుర సంగ్రామంలో దశరథు డిచ్చిన వరాలను తర్వాత ఎప్పుడైనా కోరుకుంటా నన్నది కైకేయి. రాముణ్ణి యువరాజును చేయాలని దశరథుడు సంకల్పించగా మంధర చెప్పుడు మాటలవల్ల మనసు మారిన కైక దశరథుని కోరరాని వరాలు కోరింది.
  దశరథుడు కుప్పగూలి కన్నుమూసినాడు.
  మంత్రులతో సమాలోచించిన వసిష్ఠుడు ఐదుగురు దూతలను మేనమామ యింట సుఖంగా వున్న భరత శత్రుఘ్నుల వద్దకు పంపినాడు. జరిగినది చెప్పవ ద్దని వెంటనే రమ్మని చెప్పమన్నాడు. వారు గిరివ్రజపుర మనే కేకయరాజ నగరం చేరినారు.
  ఆరాత్రి భరతుడు తన తండ్రి గిరి శిఖరంనుంచి పేడగుంటలో పడినట్టు గాడిదల రథ మెక్కి దక్షిణంవైపు పోయినట్టు దుస్వప్నం కాంచి భయపడ్డాడు. బయలుదేరి వచ్చాడు. అయోధ్య అస్తవ్యస్తంగా కనబడింది.
  భరతు డెంతో దుఃఖించి తల్లిని తీవ్రంగా దూషించినాడు.
  మృత్యు మాపాదితో రాజా
  త్వయా మే పాప దర్శిని!
  సుఖం పరిహృతం మోహాత్
  కులేఽస్మిన్ కుల పాంసని! 5
  (పాపం చేసేదానవు. నీచేత మా తండ్రి (రాజు) మరణించినాడు. వంశంలో ఎవ్వరికీ సుఖం లేకుండా చేశావు.కులాన్నే చెరచినదానవు నీవు) అన్నాడు. ఇంకా 11,19, 25 వ శ్లోకాల్లోను ఇలాంటి మాటలే అన్నాడు. (రామాయణము.. అయోధ్యా కాండము.. 73 వ సర్గము)
  కైక అనుచిత వర్తనంవల్ల ఒకేసారి ఎన్నో దుష్పరిణామాలు సంభవించినవి. 1.తాను విధవ యైనది. 2.ఇద్దరు సవతులకూ వైధవ్యం ప్రాప్తించింది. 3. దశరథుడు మృతుడైనందున రామాదులకు పితృవియోగం కలిగింది. 4. రాజ్యానికి రాజును లేకుండా పోయాడు. 5.అన్నదమ్ములు విడిపోయినారు. 6. తన కొడుకైన భరతునితోనే తాను భయంకరంగా తిట్లు తినవలసివచ్చింది.
  భరతుడు తల్లిని దూషించిన సందర్భంలో అన్న మాటలీ పద్యమునం దున్నవి.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  పాపమతివి.. పెరిగితి నీ పాలు ద్రావి..
  పరగఁ జెప్పుడు మాటలన్ బాడయితివె!..
  అన్నదమ్ముల నెడబాపు నిన్నుఁ బోలు
  నమ్మ పాలు విష మ్మగు నర్భకులకు..

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  20.10.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 12. అంటు వ్యాధికి బలియయి నడలు తల్లి |
  స్తన్య పానమిడగ లేని స్వాస్థ్య హీన |
  విధి నివారింప పాలిడ వీలులేని
  "అమ్మపాలు విషమ్మగు నర్భకులకు
  (విధి-వైద్యుడు)

  రిప్లయితొలగించండి
 13. తల్లి చనుబాలు విడువక తాగు చుండ
  నాలు గేండ్లాయె యేమని నసను బెట్టి
  చనుల మొనలకు కుంకుళ్ళు చాది రాయ
  అమ్మపాలు విషమ్మగు నర్భకులకు

  రిప్లయితొలగించండి
 14. తెలుగు సినిమాల నటియించు తీయబోడి
  ఆపరేషను సిలికాను ననుసరించె
  బిడ్డ నందె సరోగసి నడ్డు బెట్టి
  అమ్మపాలు విషమ్మగు నర్భకులకు
  తీయబోడి - ఆడుది ; సిలికాన్ ఆపరేషను - వక్షసౌందర్య సంబంధిత శస్త్రచికిత్స); సరోగసి - అద్దెగర్భము ద్వారా సంతానమొంది ప్రక్రియ)

  రిప్లయితొలగించండి
 15. విషయము నాలకింపు మిది విజ్ఞత కాదుగదోయి యెందుకీ
  శషబిషలంటి, గుబ్బలు జారునటంచును శంకతోడ నా
  సిసువుకు పోతపాలనిడ క్షేమము కాదని చెప్పె, నిల్వతో
  విషమగు నమ్మ , పాలనుచుఁ , బిల్లలు గ్రోలఁగ నిచ్చగింపరే

  రిప్లయితొలగించండి
 16. ఈమెకు నెయిడ్సు రోగము నిపుడు జన్మ

  నిచ్చె నొక శిసువుకు పాలనివ్వరాదు ,

  నమ్మ పాలు విషమ్మగు నర్భకులకు

  ననితెలిపినారు వైద్యులు నామె పతికి

  రిప్లయితొలగించండి
 17. శషభిషలేక త్రాగుచును ఛాత్రులు క్షీరము పాఠశాలలో
  చషకమునందు బల్లిపడ చప్పునజారుచు చూరునుండి నా
  విషయముదెల్సి పారుచును భీతిని గోలను సేయుచున్నికన్
  విషమగునమ్మ పాలనుచు బిల్లలు గ్రోలగ నిచ్చగించరే

  రిప్లయితొలగించండి
 18. కన్నని సమయింపక యున్నఁ గంసు పాలు
  కానఁ బడిన గోపవ్రజ కాంతు పాలు
  గ్రోల నక్కట వగలాడి పాలు పూత
  నమ్మ పాలు విషమ్మగు నర్భకులకు

  [పాలు = భాగము, క్షీరము]


  మిష యని యెంచ కమ్మ మది మిథ్యలు గావివి సత్య వాక్కులే
  సుషి గణ శోధనమ్ము లని చూడకు సంశయ మేల తల్లిరో
  తృష యది కల్గఁ ద్రాగ వలెఁ దియ్యని పాలను గాఁచ విర్గినన్
  విషమగు నమ్మ! పా లనుచుఁ బిల్లలు గ్రోలఁగ నిచ్చగింపరే

  రిప్లయితొలగించండి
 19. చంటిపిల్లలకుమిగుల శక్తినిచ్చు
  నమ్మపాలు,విషమ్మగునర్భకులకు
  నరయకుంకుడుకాయలనరగదీసి
  చన్నుమొనలకువ్రాయగసన్నుతాంగి!

  రిప్లయితొలగించండి
 20. మోహాంధులు పిల్లలనుకని పారవైచి పోగా పసిమనసు ఆలోచన

  అషుల ఋషీంద్రు జేరి తము హాయిని బొందుచు మోహమేర్పడన్
  మిషయని దేల కౌశికుడు, మేనక సద్యపు బిడ్డనే విడన్
  యిషణముదీరఁ నేడును మరీవిధి నింతులు బార వేయగా
  విషమగు నమ్మపాలనుచుఁ బిల్లలు గ్రోలఁగ నిచ్చగింపరే

  అషుల-అట్లు; మిష-కపటము; ఇషణము-కోరిక

  రిప్లయితొలగించండి
 21. పిల్లలకు పాల నిచ్చెడి తల్లి యెపుడు
  పగను క్రోధము నీర్ష్యను వదల వలయు
  నట్లు గాకున్న యొత్తిడి యధిక మగుట
  నమ్మ పాలు విషమ్మగు నర్భకులకు.

  రిప్లయితొలగించండి
 22. శషభిషలేల సూటిగనె జాటుము స్తన్యమె మేలు జేయు నా
  విషయము విస్మరించి కనువిందగు యందము గోరు వారలే
  విషమయమైన సంస్కృతికి వెంపరలాడుచు వంక జూపుచున్
  విషమగు నమ్మపాలనుచుఁ బిల్లలు గ్రోలఁగ నిచ్చగింపరే

  రిప్లయితొలగించండి
 23. విషమగునమ్మపాలనుచుబిల్లలుగ్రోలగనిచ్చగింపరే
  మృషయగుమాటలెందులకుమీరుటహద్దులుదాటన్యాయమే?
  విషముగనెట్లుమారునవివెర్రినిజేసియుబల్కనొప్పునే
  శషభిషలేలమీకిపుడుశాస్త్రులుసెప్పెనుశ్రేష్ఠమైనవే

  రిప్లయితొలగించండి
 24. తేటగీతి
  తల్లిరక్తమ్ము క్షీరమ్ము దార వోయు
  సాంప్రదాయమ్ము సంస్కృతి సంతతికన
  పబ్బు మాదక ద్రవ్యాలు వ్యసనమైన
  నమ్మపాలు విషమ్మగు నర్భకులకు

  రిప్లయితొలగించండి
 25. తే.గీ.

  మనిషి వికసింప జేయగా మంచి నడక
  చుట్టు ముట్టగు పరిసర కట్టుబాటు
  తోడు నెల్లర కందించు గూడ, లేక
  అమ్మ పాలు విషమ్మగు నర్భకులకు

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 26. చంపకమాల
  విషయ మెరుంగ లేని యవివేకము పశ్చిమ దేశసంస్కృతిన్
  దృషగొనఁ బబ్బులన్ జనుచు దేభ్యపు మత్తుపదార్థ సేవనా
  శషభిష లెంచ స్త్రీలిల విషాదమటంచును సాంప్రదాయకుల్
  విషమగు నమ్మపాలనుచుఁ బిల్లలు గ్రోలఁగ నిచ్చగింపరే!

  రిప్లయితొలగించండి