3, అక్టోబర్ 2019, గురువారం

సమస్య - 3151 (నరకమునందుఁ జూచె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నవ్వుల స్వర్గమును జూచె నరకమునందున్"
(లేదా...)
"నరకమునందుఁ జూచె నొక నవ్వుల స్వర్గము మోద మందుచున్"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతవధాన సమస్య)

73 కామెంట్‌లు:


 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  తిరుగుచు తాతగారు భళి త్రిప్పట నొందుచు హైద్రబాదునన్...
  కరువగ నుల్లి పాయలట కమ్మని మున్గల సాంబరందునన్...
  బిరబిర ప్రాకుచుండగను ప్రీతిని ముద్దుల మన్మరాలినిన్...
  నరకమునందుఁ జూచె నొక నవ్వుల స్వర్గము మోద మందుచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   "హైద్రబా దనన్ । నరకమునందు జూచితిరె నవ్వుల స్వర్గ మిషాని రూపునన్"
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'మునగ'... మున్గ అయింది.

   తొలగించండి
 2. మైలవరపు వారి పూరణ

  అరిగి దశాస్యులంకకు మహావనసౌధములన్ చరించుచున్
  ధరణిజ గాంచి మారుతి ముదమ్మున రామజయాఖ్యమంత్రమున్
  గరిమను బల్కినంత క్షణకాలము జానకి దుఃఖవార్ధియన్
  నరకమునందుఁ జూచె నొక నవ్వుల స్వర్గము మోద మందుచున్"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 3. నవ్వించుటె యోగమ్మట
  నవ్వుటె యొకభోగమనెడు నానుడి కలదే
  నవ్వుచు నవ్వించు నరుడు
  నవ్వుల స్వర్గమును జూచె నరకమునందున్

  రిప్లయితొలగించండి
 4. కెవ్వున కేరింత లిడుచు
  రివ్వున ఢీకొని మనుమని రీతిని గనుచున్
  సవ్వడి చేయుచు తాతొక
  నవ్వుల స్వర్గమును జూచె నరకము నందున్

  తాత ఒక

  రిప్లయితొలగించండి

 5. గృహమే కదా స్వర్గ సీమ :)


  జవ్వాది సుగంధములన్
  పువ్వుల పరిమళములమర పువుబోడియకై
  లవ్వాడి పెండ్లి యాడుచు
  నవ్వుల స్వర్గమును జూచె నరకమునందున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. (సూర్యునకు అర్ఘ్యమిస్తున్న శ్రీ కృష్ణుని
  దోసిలిలో గంధర్వరాజు గయుని నోటి
  నుండి నమిలిన తమ్ములం పడింది )
  ఎరుగక చేసె తప్పు గయు
  డెంగిలి తమ్ముల మూసి కృష్ణు శ్రీ
  కరములలోన ; వాని హరి
  కంఠము దున్మ ప్రతిజ్ఞ సల్ప ; కా
  తరమున పర్వులెత్తుచు న
  తండు కిరీటియె చేరదీయగా;
  నరకము నందు జూచె నొక
  నవ్వుల స్వర్గము మోదమందుచున్ .
  (తమ్ములము -తాంబూలము ; కిరీటి -
  అర్జునుడు ; కాతరము - భయము )

  రిప్లయితొలగించండి


 7. అరె! అరమోడ్పుకన్ను లరయంగను చేతికి వచ్చు విద్య గా
  పరిణయమాడు వేళ "ననిభాలని" నయ్యరు నర్మకీలుడై
  పరిణితి చెంది తప్పదని వారిజ నేత్ర జిలేబి తోడుగా
  నరకమునందుఁ జూచె నొక నవ్వుల స్వర్గము మోద మందుచున్!

  నిభాల - చూచుట
  అనిభాల - చూడలేక పోవుట గమనించలేక పోవుట  :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. దవ్వు యొకింతయు లేదని
  లవ్వాడిన యా యతివను అందరి యెదుటన్
  దువ్వక జాలక పార్కున
  నవ్వుల స్వర్గమును జూచె నరకము నందున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దవ్వు + ఒక' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "దవ్వొక యింతయు లేదని" అనండి.

   తొలగించండి

 9. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం):

  December 2018 Elections:

  బిరబిర రాగ రాష్ట్రమున భేషగు రీతిని సీటులప్పుడున్
  పరువులు పెట్ట నాయుడహ పంతము వీడుచు హైద్రబాదునున్
  నరవర చంద్రశేఖరుడు నందము నొందుచు నీళ్ళు లేనిదౌ
  నరకమునందుఁ జూచె నొక నవ్వుల స్వర్గము మోద మందుచున్

  రిప్లయితొలగించండి
 10. లవ్వుతొ దరిచేరిన సతి
  జివ్వున కోర్కెల శతములు జిల్ జిల్ మనగా
  సవ్వడి సేయక యా పతి
  నవ్వుల స్వర్గమును జూచె నరకము నందున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'లవ్వుతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.

   తొలగించండి
  2. ధన్యవాదాలు గురువు గారూ..

   లవ్వున యంటే ?

   లవ్వున దరిచేరిన సతి
   జివ్వున కోర్కెల శతములు జిల్ జిల్ సల్పన్
   సవ్వడి సేయక యా పతి
   నవ్వుల స్వర్గమును జూచె నరకము నందున్

   తొలగించండి
 11. అవ్వైదేహిని చెఱగొని
  నవ్విఖరుండుంచ సీతఁనపవన మందున్
  ఎవ్వన హనుమను గాంచగ
  నవ్వుల స్వర్గమును జూచె నరకము నందున్

  విఖరుడు-రాక్షసుడు; ఎవ్వ-కష్టము;
  అపవనము-ఉద్యానవనం

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   సీత తర్వాత అర్ధానుస్వారం అవసరం లేదు. 'ఎవ్వన'?

   తొలగించండి
 12. పువ్వుల రంగడు జేరెను
  రవ్వలహారము నిడుకొని రమణిని జూడన్
  పువ్వుల బోణిక మార్చగ
  నవ్వుల స్వర్గమును జూచె నరకము నందున్

  ఎవ్వరి కష్టములు వారివి🤔

  రిప్లయితొలగించండి
 13. ఎవ్వరిబతుకులువారివి
  నవ్వుకు కరువాయెనయ్యొ నగరమునందున్
  నవ్వుల సినిమా కేగియె
  నవ్వుల స్వర్గమును చూసె నరకమునందున్

  రిప్లయితొలగించండి
 14. కందము:
  పువ్వును బోలిన పడతియు
  నవ్వున కేకల జననము "నా" యను బ్రేమన్
  దవ్వుల నెవరును లేకను
  నవ్వుల స్వర్గమును జూచె నరకమునందున్"
  (శంకరాభరణం వారి సమస్య)

  రిప్లయితొలగించండి
 15. ప్రహ్లాదుడు

  రవ్వలరువ్వెడి నగ్నిని
  పువ్వుల పానుపుగబడసి బుడతడు దానే
  దివ్వెగ వెల్గగ దోచెను
  నవ్వుల స్వర్గమునుజూచె నరకమునందున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రువ్వెడి యగ్నిని/రువ్వెడు నగ్నిని' అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా,సవరిస్తాను!

   తొలగించండి
 16. తిరిపెము నెత్తు వారలొక తీర్థ మహోత్సవ మందు చేరగన్
  వరముగ దానమిచ్చె నొక భాగ్య సమున్నత భక్తి తత్పరుం
  డిరవుగ పెక్కు రూప్యముల-నింపుగ వారు సుఖాబ్ధి తేలగన్--
  నరకము నందుఁజూచె నొక నవ్వుల స్వర్గము మోదమందుచున్

  రిప్లయితొలగించండి

 17. ... శంకరాభరణం... . 03/10/19 ...గురువారం...

  సమస్య::

  "నరకమునందుఁ జూచె నొక నవ్వుల స్వర్గము మోద మందుచున్

  నా పూరణ. చం.మా.
  *****

  ( ఒకడు ప్రేమిస్తున్నానని మోసము చేసి ఒక అమ్మాయిని డబ్బులకు వేశ్యగృహానికి అమ్ముతాడు...ఆ సందర్భములో...)

  కఱుకుడొకండున్ తెలుగు కన్నెను వేశ్యగ మార్చె ఢిల్లీలో

  విరివిగ వచ్చుచున్ విటులు వేదనలిచ్చిరి వింత చేష్టచే

  ఎరిగిన వాడొకండును రమించగ రాగ వచించ బాధలున్

  తరుణి!విముక్తి జేతు నిను తప్పక తక్షణ మంచు తాననన్

  నరకమునందు జూచె నొక నవ్వుల స్వర్గము మోద మందుచున్  🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
  🌷🌷 వనపర్తి 🌷🌷  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. "కఱకు డొకండు దా దెలుగు కన్నెను..." అనండి.

   తొలగించండి
 18. కవ్విం చెడి యంద ము తో
  పువ్వుల బోలు ద ర హా స పు చెలి య గ తన న్
  జివ్వు మని పిం చు చుండ గ
  నవ్వుల స్వర్గ ము ను జూచె నరక ము నందున్

  రిప్లయితొలగించండి
 19. సరసము జేయ నెంచుకుని జారిన గుండెను చేత బట్టుకున్
  వరముల పట్టినే దలచి వాడని పూలను చేర్చు చుండగా
  పరువపు సొంపు లీనుచును వారిజ తానుగ వచ్చి చేరగా
  నరకమునందు జూచెనొక నవ్వుల స్వర్గము మోదమందుచున్

  రిప్లయితొలగించండి
 20. నా ప్రయత్నం :

  కందం
  జవ్వని మాయా శశి గని
  దువ్విన లక్ష్మణ కుమారుఁ దుంటరియగుచున్
  కెవ్వుమన ద్రొక్క కాలిన్
  నవ్వుల స్వర్గమును జూచె నరకమునందున్

  చంపకమాల
  మురహరి తోడ వైరమున పొందగ ముక్తిని రావణాఖ్యుడున్
  దొరఁకొని సీతఁ దెచ్చి తన తోటనుఁ బెట్టుచు రామమూర్తికిన్
  హరి యవతారికిన్ మిగుల నక్కసు దెచ్చితి నంచు మోహమన్
  నరకమునందు జూచె నొక నవ్వుల స్వర్గము మోద మందుచున్

  రిప్లయితొలగించండి
 21. జివ్వున లాగెడి బాధల
  కెవ్వను రోగుల యరుపుల కేకల నడుమన్
  నవ్వుల చిత్రమె శమనము
  నవ్వుల స్వర్గమును జూచె నరకమునందున్

  రిప్లయితొలగించండి
 22. పువ్వులబోణియ యొకపరి
  నొవ్వగదాభర్తవలన నోవగలేకన్
  జువ్వనుబోలిన యాయమ
  నవ్వులస్వర్గమునుజూచె నరకమునందున్

  రిప్లయితొలగించండి
 23. అవ్వర పుత్రుని మహిమము
  సువ్వే సేంద్రమ్ము ధర్మజుం డడుగిడి తా
  నొవ్వులు రివ్వున పోవన్
  నవ్వుల స్వర్గమును జూచె నరకమునందున్


  హరుసము కల్గు నాకలిని నారట మందెడు ప్రాణి కోటికిన్
  విరివిగ భోజనమ్మది లభించిన స్వర్గము కన్న మిన్నగన్
  గిరగిర తిర్గుచున్ జలము క్రింద తటాకము నందు నొక్క మీ
  నరకము నందుఁ జూచె నొక నవ్వుల స్వర్గము మోద మందుచున్

  [మీను +అరకము = మీ నరకము; అరకము = నాచు]

  రిప్లయితొలగించండి
 24. నిరతముగాయకష్టములునెవ్వగలొందుచుజేయుచుండగా
  భరణముజాలకుండగ నుభారమునొందుచుబొట్టకూటికై
  యిరవుగజేయుచుండియునుయిక్కటులన్నియునోర్చుచుండుచున్
  నరకమునందుజూచెనొకనవ్వులస్వర్గముమోదమందుచున్

  రిప్లయితొలగించండి
 25. దురితము వెంబడింప తనుతోలెడి బండియె ముక్కలవ్వగన్
  విరిగిన గాలుసేతులను బెడ్డునజేరగ వైద్యశాలలో
  కరుణను వారలచ్చటను కార్టునుఛానలు బెట్ట టీవిలో
  నరకమునందు జూచెనొక నవ్వులస్వర్గము మోదమందుచున్

  రిప్లయితొలగించండి
 26. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  నరకమునందుఁ జూచె నొక నవ్వుల స్వర్గము
  మోద మందుచున్

  సందర్భము: ధర్మమార్గమే శాశ్వతమైన సౌఖ్యాన్ని ప్రసాదించేది. క్షణికోద్రేకానికి లోనై ఇంద్రియ ప్రలోభాలకు లొంగిపోయి పాపాలు చేస్తే క్షణికానందం కలిగితే కలుగవచ్చు కాని అంతకంత దుఃఖం మాత్రం ఈలోకంలోనో నరకంలోనో కలిగితీరుతుం దన్నదిమాత్రం అక్షరాల యథార్థం.
  ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేస్తున్నా నని ఎవడూ అనుకోవడానికి వీలే లేదు. అలా అనుకుంటే అతడు మూర్ఖుడే! విశ్వ వ్యవస్థలో ప్రతి మానవునికీ అతని కర్మానుసారమే ఫలితా లీయబడుతూ వుంటాయి. అవి ఈయబడా లంటే ప్రతి యొక్కని ప్రతి యొక్క కర్మా పదిల పరుచబడాల్సిందే! అంటే రికార్డ్ చేయబడాల్సిందే!
  విశ్వేశ్వరు డేర్పరచిన విశాలమైన విశ్వ వ్యవస్థలో సూర్య చంద్రులు పంచ భూతాలు మొదలైనవి అందుకోసం నియమించబడ్డాయి. అవన్నీ నిరంతరం సాక్షులుగా వుంటాయి. తప్పించుకోవడానికి లేదు.
  కణ్వాశ్రమంలో శకుంతలను గాంధర్వ విధి వివాహమాడిన దుష్యంతుడు లోకభీతిచేత ఆమెను తన వద్దకు రప్పించుకోకుండా ఎంతో కాలం వుండిపోయాడు. శకుంతలకు సర్వదమనుడు (భరతుడు) పుట్టి పెద్దవాడయాక వానితోబాటు శకుంతల దుష్యంతుని సభ కేగి పూర్వ వృత్తాంతాన్ని వివరిస్తుంది. సూర్యచంద్రులు పంచభూతాలు రాత్రింబవళ్లు మొదలైనవి సాక్షిత్వం వహిస్తా యని చెబుతుంది.. భారతం.. ఆదిపర్వం చూడవచ్చు. లేదా గరుడ పురాణం విష్ణువు గరుత్మంతునితో అన్న మాటలు.
  చిత్రగుప్తుడు నరకాని కప్పుడే కొని తేబడిన ఒక నరునిగురించి యముని కిలా చెబుతున్నాడు.
  అర్కుడు=సూర్యుడు, హిముడు=చంద్రుడు
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఎరుగమి ధర్మ మార్గ మది
  యిచ్చును శాశ్వత సౌఖ్య మంచుఁ.. బా
  ప రతిఁ జరించి నైధనము
  పాలయి కూలెను వీడు భీదమౌ
  నరకమునందుఁ.. జూచె నొక
  నవ్వుల స్వర్గము మోద మందుచున్
  స్థిర మిది యంచు నెంచె మదిఁ..
  జింతిల డర్క హిమాది సాక్షులన్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  3.10.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 27. రిప్లయిలు
  1. ఈ నాటి శంకరాభరణము వారి సమస్య

   నవ్వుల స్వర్గమును జూచె నరకము నందున్

   ఇది కందపద్యము దీనిని నేను సీస పద్యములో పూరించాను


   నరకము చేరిన నందమూరి నెదిరిం
   చక యమ భటులను చకచక తన

   మాటల తో సమ్మె మంత్రమును జపించి
   యమ లోకమున జేసె యముని పైన

   దండయాత్ర, యముని తలకిందులను చేసి
   నట్టి తీరుకు తమ పొట్ట
   బట్టి

   జనులు (నవ్వుల స్వర్గమును జూచె నరకము నందున్) ,ముదము తోడ డెందము లొక


   పరిగ చిందులు వేయగ , మరువ లేని చిత్ర

   రాజమే యమగోల, చేసె తెలుగు

   నాట జైత్ర యాత్ర, ఘనుడు నంద మూరి,

   వారికి సలుప వలయు జోహారు లెపుడు

   తొలగించండి
 28. మరణసమానదుస్సహవిమర్దవిదీర్ణశరీరజన్యమౌ
  గురుతరయాతనం గుములు కోమలి యోర్చు ప్రసూతివేదనన్
  చిరమనపత్యముం దొలగి చెన్నలరారెడు బిడ్డనుం గనన్
  నరకమునందుఁ జూచె నొక నవ్వుల స్వర్గము మోద మందుచున్

  రిప్లయితొలగించండి

 29. కం ll
  ఎవ్వని తలచిన హాయిగ
  నవ్వుల పూచె వదనమున నందనవనమో
  దివ్వెల నగవులు కూడని
  నవ్వుల స్వర్గమును జూచె నరకమునందున్

  రిప్లయితొలగించండి
 30. కం ll
  ఎవ్వని తలచిన హాయిగ
  నవ్వుల పూచె వదనమున నందనవనమో
  దివ్వెల నగవులు కూడని
  నవ్వుల స్వర్గమును జూచె నరకమునందున్

  రిప్లయితొలగించండి
 31. దవ్వున నాడెడు బాలుర
  నవ్వుల స్వర్గమును జూచె ;నరకమునందున్
  రివ్వున నలజడి రేగెన్
  యెవ్వరి కేమియు జరుగ నెరుగుట లేమిన్

  రిప్లయితొలగించండి
 32. కొవ్వును కరిగించుటకై
  రివ్వున వెళితిని పరుగుకు రెక్కలు తొడగన్
  జివ్వన నడుమే, పడగనె,
  నవ్వుల స్వర్గమును జూచె నరకమునందున్

  కళ్యాణ్ చక్రవర్తి

  రిప్లయితొలగించండి

 33. అసలు సిసలు నరక పూరణ:

  కురియగ కంటి వానలిట కుండల పోతగ నాదు మోమునన్
  కిరికిరి చేసి నేనిచట క్రిందను మీదను కుందుచుండగా
  బరబర లాగి నా సుతుడు పట్టుకు పోవగ దంతశాలకున్
  నరకమునందుఁ జూచె నొక నవ్వుల స్వర్గము మోద మందుచున్

  రిప్లయితొలగించండి
 34. కొవ్వును కరిగించుటకై
  రివ్వున వెళితిని పరుగుకు రెక్కలు తొడగన్
  జివ్వన నడుమే, పడగనె,
  నవ్వుల స్వర్గమును జూచె నరకమునందున్

  కళ్యాణ్ చక్రవర్తి

  రిప్లయితొలగించండి
 35. కం.

  ఎవ్వని జూచిన ఖేదము
  కవ్వింపులమధ్య బ్రతుకు గండము గడుపన్
  మువ్వన్నెల జెండాతో
  నవ్వుల స్వర్గమును జూచె నరకము నందున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 36. కరువులు దాపురించి నరకమ్ముగ మార్చిన జీవితమ్ములో
  హరుని కృపాకటాక్షముమ యంగభవుండె జనింప కార్షుడే
  యరుసము తోడ నెత్తుకొన యడ్డపు పట్టియె నవ్వగా గనన్
  నరకమునందుఁ జూచె నొక నవ్వుల స్వర్గము మోద మందుచున్

  రిప్లయితొలగించండి
 37. కం.
  నొవ్వుచు ప్రాణము లిమ్మని l
  జవ్వని సావిత్రి యముని జంకక యడుగన్ l
  చివ్వున వరమున్ యివ్వగ l
  నవ్వుల స్వర్గమును జూచె నరకమునందున్ ll

  రిప్లయితొలగించండి