కవిపుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. మనోహరమైన పూరణము. చంద్రునిలో మచ్చ వలె చిన్న పదవిభజనాంతస్స్థిత క్లిష్టత: మీ పూరణ భావములో “స్వాగతించ నా శ్రీ రఘురాముఁ బెద్ద సతి” కాని సమస్యాపాదములో నరసున్న లేదు కదా.
రావణాసురుని చంపిన తర్వాత అయోధ్య కు వెళుతూ సుగ్రీవుని భార్యలను కూడ తీసుకొని వెళ్ళదలచి కిష్కింధకు వస్తారు పుష్పకములో అప్పుడు సుగ్రీవుని పెద్ద భార్య రుమ. రెండవ భార్య తార. (వాలి మరణానంతరం తారను వివాహ మాడతాడు) వచ్చి ముందుగా రాముని చూస్తారు రుమ. సీతకు మొక్కుతుంది అను భావన
శ్రీ రాధాసఖు పాలన నా రామనవమి దినమున అష్టసతులలో ఆరున్నొక్కరు కొలిచిరి శ్రీరాముని, పెద్దభార్య సీతకు మ్రొక్కెన్
(రాధాసఖుడైన కృష్ణుని పాలనలో రామనవమి జరిగింది. ఆ వేడుకలో కృష్ణుని ఎనిమిదిమంది భార్యల్లో ఏడుగురు రాముడిని భక్తిగా కొలిస్తే, పెద్దభార్య రుక్మిణి సీతకు మ్రొక్కింది)
పద్యంలో అక్షరాల్లో కనిపించని భావం మరొకటి ఉంది. శ్రీరాముడిని కొలిచే భార్యలు తమ భర్త తమతోనే గడిపేలా చేయమని కోరితే, క్షమాగుణానికి ప్రతీక అయిన పెద్దభార్య రుక్మిణి మరింత క్షమాగుణాన్ని ఇవ్వమని సీతకి మ్రొక్కింది.
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
ప్రొద్దున రాతిరిన్ మిగుల పోరును బెట్టుచు వీధివీధినిన్
గుద్దుల నిచ్చి మోడికట క్రూరపు రీతిని చోరుడంచు తా
కొద్దిగ మందునున్ గొనుచు గొప్పగ చేరుచు పార్లమెంటునన్
నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్
సమూహములో సమస్య:
తొలగించండి"నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్"
దీనిని రేపటికి రిజర్వ్ చేసుకోండి.
తొలగించండిపేరిమి తోడ పూరణను పెక్కులు రీతుల చేయబూనుచున్
రిప్లయితొలగించండికూరిమి మీరగా గనుచు క్రూరపు నిట్టిది కైపదమ్మునున్
వేరొక దారిలేక యిక వేడెద మిమ్ముల నెక్కడయ్యరో:
శ్రీరఘురాము పెద్ద సతి సీతకు మ్రొక్కెను భక్తి మీఱఁగన్?
బాగుంది మీ సరదా పూరణ.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిప్రాతర్ద్యూతప్రసంగేన
మధ్యాహ్నే స్త్రీప్రసంగతః
రాత్రౌ చోరప్రసంగేన
కాలోగచ్ఛతి ధీమతామ్!!
ప్రొద్దున లేచి భారతపు పొత్తముబట్టి పఠించువాడునై ,
యొద్దిక రామగాధ కడునోరిమితో నపరాహ్ణవేళలో .,
ముద్దుగ దివ్యభాగవతమున్ బఠియించుచు రేయి., హాయిగా
నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్.!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
చారుగుణుండు దాశరథి శైవశరాసనమెత్తి త్రుంచగా
తొలగించండిపౌరులు మేల్ భళీ యనుచు పల్కుచునుండినయంత., వారిలో
సారసనేత్ర యొక్కతె ప్రశంసల ముంచుచు., చేయనెంచుచున్
శ్రీరఘురాము పెద్ద ., సతి సీతకు మ్రొక్కెను భక్తి మీఱఁగన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
క్రూరుల మౌనియాగమును గూల్చగనెంచిన తాటకాదులన్
తొలగించండిధీరత బాలరాముడు వధింప , వరించిన కీర్తికాంతనై
కోరుచునుంటినమ్మ! అనుకూలముగా చరియించుమంచదే
శ్రీరఘురాము పెద్దసతి సీతకు మ్రొక్కెను భక్తి మీఱఁగన్.!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
సారాగొని ప్రేలితివో
రిప్లయితొలగించండినా రాముని గూర్చి యిట్లు నాస్తిక భడవా!
చీరెద నాలుక నెవరా
శ్రీరాముని పెద్దభార్య సీతకు మ్రొక్కెన్
అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది.
తొలగించండి"చీరెద నాలుక నిట్లన" అంటే బాగుంటుందేమో?
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వద్దిక చావు పుట్టుకల బాధలు రోతలు నాకటంచు భల్
ముద్దుగ నాత్మనున్ గనుచు పుణ్యము పాపము నెంచకుండనే
కొద్దిగ నైన తానిచట కుందక నెప్పుడు హాయిహాయిగా
నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్
తొలగించండిరేపటికి వేరొక పూరణ నివ్వగోరెదను..."నిద్దుర" కిప్పటికే రెండు సరదా పూరణలను ప్రచురించితిని...నా "కోటా" పూర్తైనది
😊🙏😓
రేపటికి...
తొలగించండిసమస్య :-
రిప్లయితొలగించండిశ్రీరాముని పెద్దభార్య సీతకు మ్రొక్కెన్
*కందం**
కారాగార గృహంబున
శ్రీరాముని నింద జేసి సీత వయసునన్
మీరెనని రామదాసుడు
శ్రీరాముని పెద్ద భార్య సీతకు మ్రొక్కెన్
......................✍చక్రి
భీరుని చినభార్య కొలిచె
తొలగించండిశ్రీరాముని ; పెద్దభార్య సీతకు మ్రొక్కెన్
ఈ రీతి నిద్దరు సతుల
కోరిక తీరగ మురియుచు కోవెల వీడెన్
భీరు = పిరికివాడు ( ఆం.భా)
చక్రపాణి గారూ, పద్యం బాగున్నది. కాని పూరణ భావం అర్థం కాలేదు.
తొలగించండి***
సీతారామయ్య గారూ, బాగుంది మీ పూరణ.
పెద్ద భార్య : పెద్ద వయసు కలిగిన భార్యగా వాడుకున్నాను సర్
తొలగించండిమారీచు డెవని మెచ్చెను?
రిప్లయితొలగించండినారీమణి,దశరథేశు నగుసతి యెవరో?
ధీరుండు హనుమ యెట్లయె?
శ్రీరాముని, పెద్ద భార్య, సీతకు మ్రొక్కెన్
క్రమాలంకారంలో పూరించాలన్న మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని రెండవ మూడవ ప్రశ్నలు స్పష్టంగా లేవు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండి( శ్రీరాముడు సీతాసమేతుడై అయోధ్యకు తిరిగి రాగానే
రిప్లయితొలగించండిఅతని పెద్దభార్య రాజ్యలక్ష్మి సీతకు నమస్కరించింది .)
మీరని రాజధర్మమున
మేలుగ మైథిలి వెంటనంటగా
క్రూరుడు రావణాసురుని.
గూల్చిన పిమ్మట పుష్పకమ్ముపై
చేర నయోధ్యకున్ ; మురిసి
చేరెడు కన్నుల "రాజ్యలక్ష్మి" యన్
శ్రీరఘురాము పెద్దసతి
సీతకు మ్రొక్కెను భక్తి మీరగన్ .
మనోహరమైన పూరణ.
తొలగించండిఆరావణుడే గూలగ
రిప్లయితొలగించండిచేరిన మండోదఁరంత చెదిరిన మదితో
నారుచు భర్తను, బొగడెను
శ్రీరాముని పెద్ద; భార్య సీతకు మ్రొక్కెన్
ఆరు-తిట్టు
బాగుంది. 'పొగడెను శ్రీరాముని పెద్ద' అన్నపుడు అన్వయం సరిగా లేదు.
తొలగించండికోరికదీర బుత్రునకు గొప్పగ విద్య విదేశమందునన్
రిప్లయితొలగించండినేరిపినారు వార లిది నిక్కము వాడు స్వదేశసంస్కృతీ
దూరుడు భక్తురాలి నొకతొయ్యలి నింగని పల్కె యీమె యా
శ్రీరఘురాము పెద్ద సతి సీతకు మ్రొక్కెను భక్తి మీఱఁగన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిశ్రీరామభక్తవర్యుఁడు
రిప్లయితొలగించండినారూఢిగకీర్తికాంతపతియగు ఘనుడౌ
నారాము మ్రొక్కి భక్తిన్
శ్రీరాముని పెద్దభార్య సీతకు మ్రొక్కెన్
పూరణ సమర్థంగా లేనట్టున్నది. రెండవ పాదంలో యతి తప్పింది.
తొలగించండిశ్రీరామచంద్రమూర్తికి
తొలగించండికారా మరి సీత కీర్తికాంతలు పత్నుల్
శ్రీరామభక్తు డట్టుల
శ్రీరాముని పెద్దభార్య సీతకు మ్రొక్కెన్
చేరియు సినిమా యందున
రిప్లయితొలగించండితారలు గా స తు లిరు వురు తమ తమ నటన న్
మేరకు త్రిజట గ సవతి కి
శ్రీ రాముని పెద్ద భార్య సీ త కు మ్రొక్కె న్
పద్యం బాగుంది. కాని భావంలో స్పష్టత లోపించినట్లున్నది.
తొలగించండి
రిప్లయితొలగించండినా పూరణ.
***** ***
వారిజ నేత్రి నాథు దయ వర్షము గుర్వగ, నామధేయమున్
శ్రీరఘురాముడయ్యె డొక సేద్యమొ నర్చెడు రైతు మోదమున్
దారల గూడి క్షేత్రమును దా వడి దున్నగ నేగి నంతటన్
శ్రీరఘురాము పెద్ద సతి సీతకు మ్రొక్కెను భక్తి మీఱగన్
( సీత అనగా నాగలి )
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
బాగుంది మీ పూరణ.
తొలగించండిచేరి రయోధ్య నందరును చెండిన పిమ్మట రాక్షసేశ్వరున్
రిప్లయితొలగించండిపోరున రాము, డత్తరిని ముందుగ వానర రాజు భార్యలం
జీరి యిదే కనుండు మన శ్రీలని జూపగ జానకీసతిన్,
శ్రీరఘురాము, పెద్దసతి, సీతకు మ్రొక్కెను భక్తి మీఱఁగన్.
పోరిడు సవతులిరువురున్
రిప్లయితొలగించండిచేరగ దేవుని, నవమిన జేసెను పూజల్
వారల చిన్నది మ్రొక్క
శ్రీరాముని, పెద్దభార్య సీతకు మ్రొక్కెన్
కళ్యాణ్ చక్రవర్తి
నేరములెంచక నిహ సం
రిప్లయితొలగించండిసారపు బంధముల ద్రెంవి సద్గతి నొసగన్
గోరుచు మహరాజు గొలిచె
శ్రీరాముని, పెద్దభార్య సీతకు మ్రొక్కెన్
ఉ:
రిప్లయితొలగించండిచేరగ నాటకాన నిరు చెంతగు భామల గూడి రాముడున్
కోరగ పాత్రకై తగుగ గుర్తిడు సీతగ చిన్నదానినిన్
మారము జేయనెంచి ముఖమంతయు ద్రిప్పుచు వాదులాడుచున్
శ్రీ రఘురాము పెద్ద సతి సీతకు మ్రొక్కెను భక్తి మీరగన్
వై. చంద్రశేఖర్
ఇద్దరు భార్యల శ్రీరఘురాముడు ,ఒకానొక వ్యక్తి మాత్రమే.
ఘోర రణాంతరమ్మున రఘోత్తము బాణపు వేటుగూల్చె హిం
రిప్లయితొలగించండిసీరుని, రావణున్వెదకి చేరె నటేడ్చుచు వేదనమ్ముతో
దారుణ మింతకున్ ఋజువు తానని దార నుతించి వేడె తా
శ్రీరఘురాము పెద్ద; సతి సీతకు మ్రొక్కెను భక్తి మీఱఁగన్
ఆరావణుడే గూలగ
రిప్లయితొలగించండిచేరిన మండోదఁరంత చెదిరిన మదితో
నారుచు భర్తను, గొల్చెన్
శ్రీరాముని పెద్ద; భార్య సీతకు మ్రొక్కెన్
ఆరు-తిట్టు
శ్రీరాముడనెడునతనికి
రిప్లయితొలగించండిదారలలేగలరుమువురుతాయారాదుల్
వారలలో దాయారే
శ్రీరామునిపెద్దభార్య,సీతకుమ్రొక్కెన్
సారా గ్రోలిన మత్తు న
రిప్లయితొలగించండివే రీతిగ పల్కు చొ కడు వెక్కసఫణ తి న్
ధీర ము గా నిట్టు లనియె
శ్రీరాముని పెద్ద భార్య సీత కు మ్రొక్కె న్
కందము:
రిప్లయితొలగించండిఆ రాముకు సీతయొకతె
కారా రాములు నిపుడును కాంతల దాసుల్ !
పేరును జూడకుమ, మరో
శ్రీరాముని పెద్దభార్య, సీతకు మ్రొక్కెన్"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీరఘురాముపెద్దసతిసీతకుమ్రొక్కెను భక్తిమీఱగన్
రిప్లయితొలగించండిశ్రీరఘురాముడెన్నగనుసీతనుమాత్రమునాలిగాగొనెన్
మీరుచుహద్దులన్దమినిబెద్దయుభార్యయమ్రొక్కెనేయటన్
నేరముగాదలంచుచునునెమ్మదిరామునివేడుకొందుమా
ఆరామమందు గనుగొని
రిప్లయితొలగించండిక్రూరాత్ముని పాలబడిన కోమలిజాడన్
వీరాధివీరుడు హనుమ
శ్రీరాముని పెద్దభార్య సీతకు మ్రొక్కెన్
పెద్ద = ఘనమైన
గారవ మొప్పఁగ నా ము
రిప్లయితొలగించండిన్యారా మావాస ప్రవిమ లాంతఃకరణం
గూరిమి మదిఁ పుణ్య తప
శ్శ్రీ రా ముని పెద్దభార్య సీతకు మ్రొక్కెన్
[ తపశ్శ్రీ – తత్సమాంతము చేయఁ బడినది]
వారని శ్రద్ధతో వెతకి పాదప మూలము నందు నుండగాఁ
దారల నంటు హర్షమునఁ దన్వి నెఱింగి ధరా తనూజగా
మారుతి పెద్దకోతి యనుమానము తీరఁగఁ గాంచి దీవిలో
శ్రీరఘురాము పెద్ద సతి సీతకు మ్రొక్కెను భక్తి మీఱఁగన్
[పెద్ద సతి = గొప్ప సతి]
సారను గ్రోలి దుష్టజన సంగతమందు చరించుచుంటివో
రిప్లయితొలగించండిమీరితి వీవు హద్దులను మేలును గూర్చదు దైవదూషణ
మ్మో రవి! వాగుడేల కడు మూర్ఖుని రీతిని, చెప్పు మెవ్వరో
శ్రీరఘురాము పెద్ద సతి సీతకు మ్రొక్కెను భక్తి మీఱఁగన్
వీరుడు మారుతాత్మజుడు వీథులవెంటను జ్వాలవాలమున్
రిప్లయితొలగించండిదీరుగ ద్రిప్పుచుండగ దితీయులు లంకను గేలిసేయుచున్
ఆరసి జాతవేదసుడు హాయినిగూర్చగ దల్లిదీవెనల్
శ్రీరఘురాము పెద్దసతి సీతకు మ్రొక్కెను భక్తిమీరగన్
పెద్దసతి = గొప్పసతి
వారిధి దాటి శీఘ్రగతిఁ వాయుసుతుండట రమ్యలంకకున్
రిప్లయితొలగించండిజేరి పురమ్మునన్ దిరిగె చింతిత కార్యము మానసమ్మునే
యారటి పెట్టుచుండ హరి యంగన గాంచి ముదమ్ముతోడ నా
శ్రీరఘురాము పెద్ద సతి సీతకు మ్రొక్కెను భక్తి మీఱఁగన్
పెద్ద సతి= శ్రేష్ఠురాలైన భార్య
ఔరాపట్టముగట్టగ
రిప్లయితొలగించండిశ్రీరాజ్యంబుగనయోధ్యశ్రీసతియయ్యెన్,
శ్రీరంజిల్లగనాడటు
శ్రీరామునిపెద్దభార్యసీతకుమ్రొక్కెన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
ఆ రావణుడేరి నెదరె?;
రిప్లయితొలగించండిదారిద్ర్యమునకు ప్రతీక తార్క్ష్యుని కేమౌ?;
గారాల కుశ కుమారుడు;
శ్రీరాముని ; పెద్దభార్య ; సీతకు మ్రొక్కెన్
కందం
రిప్లయితొలగించండిమీరానతి నిడ గుహుఁడున్
గూరిమి పాదంపు సేవఁ గూర్చునటంచున్
బేరిమిఁ జేయుచు నప్పతి
శ్రీరాముని పెద్ద, భార్య సీతకు మ్రొక్కెన్
ఉత్పలమాల
కోరిన వారు వచ్చి సమకూర్చుము నా దరిఁ నావలోననన్
మీరలు నానతీయవలె మీ గుహు నంచును కీర్తనమ్ములన్
హారతులిచ్చి తాఁ గడిగి నంబుజ పాదములంది చేయుచున్
శ్రీరఘురాము పెద్ద, సతి సీతకు మ్రొక్కెను భక్తి మీఱఁగన్
యేరా సారా పొట్టన
రిప్లయితొలగించండిచేరగ పలుకు పలుకులివి,ఛీ ఛీ నోటన్
కూరెద సీసము, నెచ్చట
శ్రీ రాముని పెద్దభార్య సీతకు మ్రొక్కెన్
నిన్నటి సమస్య
రిప్లయితొలగించండి(తనయుని తలనరికినట్టి తల్లికి జేజే)
ఇచ్చిన సమస్య కంద పద్య పాదము నా పూరణము సీసములో
సత్యభామ నరకాసురుని జంపిన తరవాత ప్రజలను ఉద్దేశించి గ్రామములో ముఖ్యులు పలుకు మాటలు
దండయాత్రల్జేసి దాక్షిణ్య మేలేక పదునారు వేలశు భాంగనలను
పట్టి బంధించిన ప్రామిడీ నరకాసురుండుగా, జచ్చెను భండనమున
యదువంశ తిలకు ప్రోయాలు సాత్రాజితి చేతిలో,యాదవ జాతి పలుక
రే తనయుని తల నరికినట్టి తల్లికి జేజే లు జనులార ,చేటు తొలగె
యెల్లలోకమునకు నేడు, పల్లెలెల్ల
జరుపు కొనగవలయురేపు సవురు నిచ్చు
పండు గైన దీపావళి భక్తి తోడ
ననుచు బలికె ప్రముఖులెల్ల జనత గాంచి
ప్రామిడి =క్రూరుడు ప్రోయాలు = భార్య సవురు = కాంతి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిపంచపాది:
మేరను మీఱకుండ, జనమే తన వెన్కను రాఁగఁ, బంపియున్,
ఘోరతరాటవిన్ విడిసి, కూల్చియు రక్కసి మూఁక, రావణున్
జేరి, బిరానఁ జంపి, సతి సీత గ్రహించి, యయోధ్య కేఁగఁ, ద
త్పౌరుని చిన్నభార్యయె ముదమ్మునఁ గాంచుచు స్వాగతించ నా
శ్రీరఘురాము, పెద్ద సతి సీతకు మ్రొక్కెను భక్తి మీఱఁగన్!
కవిపుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. మనోహరమైన పూరణము.
తొలగించండిచంద్రునిలో మచ్చ వలె చిన్న పదవిభజనాంతస్స్థిత క్లిష్టత:
మీ పూరణ భావములో
“స్వాగతించ నా శ్రీ రఘురాముఁ బెద్ద సతి”
కాని సమస్యాపాదములో నరసున్న లేదు కదా.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచేరిరి కిష్కింధకు సతి
రిప్లయితొలగించండితో రాముడు లంకనుంచి,దురముగ రుమతో
తారా మణులత్తరి కనె
శ్రీ రాముని ,పెద్ద భార్య సీతకు మ్రొక్కెన్
రావణాసురుని చంపిన తర్వాత అయోధ్య కు వెళుతూ సుగ్రీవుని భార్యలను కూడ తీసుకొని వెళ్ళదలచి కిష్కింధకు వస్తారు పుష్పకములో అప్పుడు సుగ్రీవుని పెద్ద భార్య రుమ. రెండవ భార్య తార. (వాలి మరణానంతరం తారను వివాహ మాడతాడు) వచ్చి ముందుగా రాముని చూస్తారు రుమ. సీతకు మొక్కుతుంది అను భావన
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏరా త్రాగేవటరా
రిప్లయితొలగించండిసారా? నీ కడుపు మాడ చావ వదేరా!
నోరా ? డబ్బానా? యే
శ్రీరాముని పెద్దభార్య సీతకు మ్రొక్కెన్?
వీరుని దానవేశ్వరుని పీచమడంచియు పుష్పకంబున
రిప్లయితొలగించండిన్నేరుగ భార్య తమ్ముడును స్నేహితులందరయోధ్యజేర కో
టీరము దాల్చి భూమికిని ఠీవిగ భూపతి కాగ హన్మయే
శ్రీరఘురాము పెద్ద సతి సీతకు మ్రొక్కెను భక్తి మీఱఁగన్
వీరుని దానవేశ్వరుని పీచమడంచియు రామచంద్రుడే
తొలగించండిన్నేరుగ భార్య తమ్ముడును స్నేహితులందరయోధ్యజేర కో
టీరము దాల్చి భూమికిని ఠీవిగ భూపతి కాగ హన్మయే
శ్రీరఘురాము పెద్ద సతి సీతకు మ్రొక్కెను భక్తి మీఱఁగన్
రిప్లయితొలగించండితీరుగ తాళిని, తనయుడు
మా రాముడు కట్టి సతుల మర్యాదగనెన్
పోరామి వలదనుచు మా
శ్రీరాముని పెద్ద భార్య, సీతకు మ్రొక్కెన్!
***
ఓరోరీ చిచ్చరపిడు
గా రారా తాటనొలిచి కారము వేతున్!
యేరా! యేమికథా ? యే
శ్రీ రాముని పెద్ద భార్య సీతకు మ్రొక్కెన్?
జిలేబి
నేటి నా శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయములో నొక పద్యము:
రిప్లయితొలగించండిదూరము నందు గాంచెను యదుప్రవరుం డమలాంతరంగు డ
క్రూరుఁడు నీర దాభ వర కుంతల లోచన రమ్య భాగ్వపు
స్సారస సన్ని భాక్షి యుగ సార భుజద్వయ పింఛశీర్ష సో
దార రసస్వ నాకలిత తన్మురళీధర జిష్ణుఁ గృష్ణునిన్ 72.8.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీరాముడు వరియించెను
రిప్లయితొలగించండిదారగనా ధర్మమున్ను తలపగ తొలిగా
ఘోరాగ్నిన నిలిచినపుడు
శ్రీరాముని పెద్దభార్య సీతకు మ్రొక్కెన్
భావం: శ్రీరాముడు ముందుగా వరించింది ధర్మాన్ని. ఆ రకంగా ధర్మం ఆయనకి పెద్దభార్య. సీతాదేవి అగ్నిప్రవేశం చేసినప్పుడు ఆ ధర్మమే ఆమెకు దండం పెట్టింది.
-సిరాశ్రీ
శ్రీ రాధాసఖు పాలన
రిప్లయితొలగించండినా రామనవమి దినమున అష్టసతులలో
ఆరున్నొక్కరు కొలిచిరి
శ్రీరాముని, పెద్దభార్య సీతకు మ్రొక్కెన్
(రాధాసఖుడైన కృష్ణుని పాలనలో రామనవమి జరిగింది. ఆ వేడుకలో కృష్ణుని ఎనిమిదిమంది భార్యల్లో ఏడుగురు రాముడిని భక్తిగా కొలిస్తే, పెద్దభార్య రుక్మిణి సీతకు మ్రొక్కింది)
పద్యంలో అక్షరాల్లో కనిపించని భావం మరొకటి ఉంది. శ్రీరాముడిని కొలిచే భార్యలు తమ భర్త తమతోనే గడిపేలా చేయమని కోరితే, క్షమాగుణానికి ప్రతీక అయిన పెద్దభార్య రుక్మిణి మరింత క్షమాగుణాన్ని ఇవ్వమని సీతకి మ్రొక్కింది.
- సిరాశ్రీ
నారీమణియౌ జనకుజ
రిప్లయితొలగించండిధారుణి యనుభార్యలుండ దశరథ సుతుకున్
కూరిమి తో సౌమిత్రి యు
శ్రీరాముని పెద్ద భార్య సీతకు మ్రొక్కెన్.