11, అక్టోబర్ 2019, శుక్రవారం

సమస్య - 3159 (మోదీ పెండ్లికి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్"
(లేదా...)
"మోదీ పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో!"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

87 కామెంట్‌లు:


 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  బాదర్బందిది బ్రహ్మచర్యమనుచున్ బంగారు బెంగాలులో
  ఖాదర్వల్లులు బ్రాహ్మణేతరులునున్ గర్వమ్ముతో చూడగా
  దీదీ తోడను కూడు మూర్తముననున్ దివ్యంపు నానందమున్
  మోదీ పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. కంది వారి సవరణతో:

   ప్రాతః కాలపు సరదా పూరణ:

   బాదర్బందిది బ్రహ్మచర్యమనుచున్ బంగారు బెంగాలులో
   ఖాదర్వల్లులు బ్రాహ్మణేతరులునున్ గర్వమ్ముతో చూడగా
   దీదీ తోడను కూడు మూర్తముననా దివ్యంపు టానందమున్
   మోదీ పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో!

   తొలగించండి
 2. శ్రీదుండై యనిశంబు భక్తతతికిన్ చిత్సౌఖ్య మందించు న
  వ్వేదారాధ్యుడు శంకరుండు గిరిజన్ వేదోక్తసద్రీతిలో
  నేదంపూర్వవిధాన నందునని తామెంతేని హర్షంబుతో
  మోదీ! పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో!

  రిప్లయితొలగించండి
 3. వేదన గాంచిన యింద్రుడు
  సాదరమున దలచె పెండ్లి సామజమునకే
  యాదరమున బిలువగ నా
  మోదీ పెండ్లికిఁ జనిరట ముక్కోటి సురల్

  ఆమోది...= పదిహేడేళ్ళ యేనుగు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుంది. కాని 'ఆమోది పెండ్లికి' అనాలి కదా! సంబోధనగా ఆమోదీ అని దీర్ఘాంతం?

   తొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  ఛేదించెన్ ఘనమౌ సమస్యనట కాశ్మీరమ్మునందెన్నొ స...
  మ్మోదమ్ముల్ విరబూసె, నెల్లరకునామోదమ్ముగాన్ ,వేడ్కగా
  తాదాత్మ్యమ్మున భక్తితో జరుప సీతారామకళ్యాణమున్
  మోదీ., పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి

 5. ... శంకరాభరణం... . 11/10/2019 ......శుక్రవారం

  సమస్య:

  మోదీ పెండ్లికి జనిరట ముక్కోటి సురల్

  నా పూరణ.
  ***** ***

  షాదీ యన గంపరమనె

  మోదమిడక శోకమిడిచి ముంచునది యనెన్

  ఏదీ!యెక్కడ నెప్పుడు

  మోదీ పెండ్లికి జనిరట ముక్కోటి సురల్


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
 6. వాదనలు మరచి కూడిరి
  మోదీ తో కాంగులెల్ల మోములు దాచిన్
  కాదన కుండగ పిలిచెను
  మోదీ, బెండ్లికి జనిరట ముక్కోటి సురల్

  రామస్వామి కిడాంబి

  రిప్లయితొలగించండి
 7. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  దాదా రాహులు జందెమూనుచునువే తంత్రమ్ము మంత్రమ్ములన్
  గోదారొడ్డున జేరి కుల్కుచును భల్ గూఢమ్ముగా పన్నగా
  సీదాసాదగ దీది తెల్ల వలువన్ సిగ్గొందుచున్ కూడగా
  మోదీ పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో!

  *******************************

  Zilebiఅక్టోబర్ 10, 2019 6:56 PM

  జీపీయెస్ వారి దే పూరణైనా దీది చుట్టు తిరగాల్సిందే :)

  జిలేబి

  *******************************

  G P Sastry (gps1943@yahoo.com)అక్టోబర్ 10, 2019 8:18 PM

  She fascinates me...came up from nowhere like a tornado in Bengal politics

  రిప్లయితొలగించండి


 8. ఖాదీ గ్రామోద్యోగులు
  మోదీ పెండ్లికిఁ జనిరఁట, ముక్కోటి సురల్
  దీదీ తోడుగ వచ్చిరి
  షాదీ చూడంగ కంది శంకర వర్యా !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. సమస్య :-
  "మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్"

  *కందం**

  కోదండరాముని మనువు
  వేదపు మంత్రము చదవగ విశ్వము జరిగెన్
  ఖాదీ వస్త్రము లివ్వగ
  మోదీ, పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్
  ....‌‌‌‌..... చక్రి

  రిప్లయితొలగించండి
 10. ఈరోజు సమస్యాపూరణం

  మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్

  మోదీ వరుడని యన నా
  మోదీ నీరవ్ గ యంచి మోసము సేయగ
  గాదా వజ్ర మహారాజ్
  మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్

  #కళ్యాణ్ చక్రవర్తి#

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుంది. రెండవ పాదం చివర తప్పక గురువుండాలి. 'నీరవ్‌గ నెంచి...' అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
  2. మోదీ వరుడని యన నా
   మోదీ నీరవ్ గ నెంచి మోసముసేయఁన్
   గాదా వజ్ర మహారాజ్
   మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్

   చెప్పిన మార్పులతో
   ధన్యోస్మి

   తొలగించండి
 11. కేదారుని ధనుసు విరిచి
  యా దాశరథియె పరిణయ మాడె కుజను తా
  మోదము తోడను వినుమా
  మోదీ! పెండ్లికి జనిరట ముక్కోటి సురల్.

  రిప్లయితొలగించండి
 12. సాదర భక్తి వి న మ్ర త
  మోద ము జనియింపఁ జరుప పొల్పగు రీతి న్
  పాదు గ శివ కళ్యాణ ము
  మోదీ : పెండ్లి కి జని రట ముక్కోటి సురల్

  రిప్లయితొలగించండి
 13. ఏదో కల్లును చవిగొని
  సౌదీ సుల్తానొకండు స్వప్నమునందు
  న్నీ దేశము వైపు కనగ -
  మోదీ పెండ్లికి జనిరట ముక్కోటి సురల్!
  - డా. ఆచార్య ఫణీంద్ర

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు శంకరాభరణంలో మీ పూరణ. సంతోషం.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. మరొక ప్రయత్నం

  కాదని యనిపించినదియు
  లేదని తెలిసినది మనకు లేటుగ నయినా
  మోదీ వరుడని యన, యే
  మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్?

  రిప్లయితొలగించండి


 15. మోదీ చీనియ చాయి తోడు దసరా మోదమ్ము రామ్లీల నా
  మైదానమ్మున కౌసలేయుని కెడన్ మైథిల్య! వేంచేయగా
  మోదీ, పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో,
  ఖాదీనేతలు, భాజ్ప నేతలు భళా కాషాయవస్త్రమ్ములన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 16. నా దేవుడు మోదీ యని
  నా దేశపు రక్షకుడని నమ్ముచు మదిలో
  మోదముగా కల గాంచెను
  మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నా దేశమ్మును నిల్పు నాయకుడుగా నాతండె ప్రాజ్ఞుండనున్
   నా దైవంబతడే యటంచు విధిగా నమ్మున్ ప్రగాఢమ్ముగా
   మోదీ భక్తుడొకండు స్వప్నమున సమ్మోదమ్ముగా గాంచెనే
   మోదీ పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో

   తొలగించండి


 17. ఈ పాదానికి ఆముదాల వారి పూరణ ఏమిటో కుతూహలము . చెప్పగలరు


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వారిని అడిగాను. వారు పంపగానే పోస్ట్ చేస్తాను.
   (నేను మొదటి రోజు మాత్రమే ఆ శతావధానంలో ఉన్నాను).

   తొలగించండి
 18. రిప్లయిలు
  1. బాగుంది.
   '...గాంక్షించంగ' టైపాటు. 'ఆమోదీ'?

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు.

   టైపాటు సవరణతో...

   ఆమోది : వావిళ్ల నిఘంటువు 1949
   సం.వి. (న్.ఈ-నీ.న్.)
   1. ఆమోదము గలది, సువాసన గలది;
   2. ఆమోదించువాఁడు, సంతోషించువాఁడు.

   శార్దూలవిక్రీడితము
   ఖేదమ్ముల్ విడ తారకాసురుని మక్కించన్ గుమారున్ గనన్
   గేదారున్ సురలెల్ల స్తోత్రముల గాంక్షించంగఁ బుష్పాయుధున్
   బూదిన్జేయుచు పార్వతిన్గొనఁగ సమ్మోదంబుఁ జూపంగ నా
   మోదీ పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో!

   తొలగించండి
 19. (ఒక వీరవైష్ణవుడు పరమాత్ముని గద పేరు కుమార్తెకు పెట్టాడు . ఇప్పుడు అమ్మాయి కౌమోది పెండ్లి .దీవించ టానికి దేవతలందరూ వచ్చారు .)
  వేదాంతంబున కందనట్టి ప్రభువౌ
  విష్ణున్ సదా నెమ్మదిన్
  మోదంబార భజించు భక్తుడదియే
  మూఢత్వదైతేయ వి
  చ్ఛేదన్ విష్ణుగదన్ సుపుత్రి కిడె సు
  శ్రేయంపు నామంబు ; " కౌ
  మోదీ " పెండ్లికి పోయినారు గదరా
  ముక్కోటి దేవుళ్ళహో !!
  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆధునిక భక్తుడు కనుక ఇప్పటికి తగినట్లు
   " కౌమోదీ " అని కొత్తపాతల క్రొమ్మెరుగులతో
   బిడ్డకు పేరు పెట్టాడండీ !😊

   తొలగించండి
 20. ఏదీ? విద్యను జూపుము
  మాదీ మీ కులమె! యన్న మాజిక్ గ్రూప్ లో,
  దీదీ రాహుల్ను గలుప
  మోదీ, బెండ్లికి జనిరట ముక్కోటి సురల్!

  కులము .. సమూహము

  రామ్ కిడాంబి

  రిప్లయితొలగించండి
 21. దీదీ, రాహుల్ వివాహానికి అందరూ తరలి రావలసిందిగా విజ్ఞప్తి !😊

  రిప్లయితొలగించండి
 22. కందం
  ఆదరమునఁ బెండ్లి వలెన్
  ' హౌదీమోదీ' జరుగఁగ నమెరిక నాశీ
  ర్వాదము భక్తినిఁ గోరఁగ
  మోదీ, పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్!

  రిప్లయితొలగించండి
 23. మోదీ భారత కీర్తి పెంపొదవగా మూర్ధన్యుడాయెన్ గదా
  మోదంబాయెను బంధు మిత్రులకు దామూహింపగా నిట్టులన్
  మోదీ పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో
  మోదీ దీవెనలందెనేమొ యపుడే మున్ముందు కాలమ్ముకున్

  రిప్లయితొలగించండి
 24. మిత్రులందఱకు నమస్సులు!

  [గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీకి జరిగిన షష్టిపూర్తి మహోత్సవ సందర్భము]

  పాదమ్మూనియు భారతీయ జనతా పార్టీనిఁ బెంపొందుచున్
  సీదా సాదగ ముఖ్యమంత్రి గుజరాత్ శ్రేష్ఠుండునై మోది స
  మ్మోదమ్మందుచు వందనమ్ము లిడి తా మున్ బిల్వ  షష్ట్యబ్దికిన్,
  మోదీ పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో!

  రిప్లయితొలగించండి
 25. ఈ దేశమందు పన్నులు
  మోదుట చేతన యిడుమల మోసిరి జనముల్
  యా దేవుళ్ళే మికనుచు
  మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్ ?

  రిప్లయితొలగించండి
 26. మూడవ ప్రయత్నం

  మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్

  మోదమె యని తలచగనా
  మోదీ పదవితొ పరిణయ మొనరఁగ తెలిసెన్
  పోదామని యనుకొన నా
  మోదీ పెండ్లికిఁ, జనిరఁట ముక్కోటి సురల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుంది.
   'పదవితొ' అని తో పత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.

   తొలగించండి
  2. ధన్యోస్మి .. చెప్పిన మార్పుతో

   మోదమె యని తలచగనా
   మోదీ పదవిని పరిణయ మొనరఁగ తెలిసెన్
   పోదామని యనుకొన నా
   మోదీ పెండ్లికిఁ, జనిరఁట ముక్కోటి సురల్


   ఇంత చక్కగా తప్పులు దిద్దుతున్న మీకు నా నమస్సుమాంజలి

   తొలగించండి
 27. సాదము పైఁగల మక్కువ
  వేదన యేల సురలన భువికి సురలనుకో
  కాదన మున్నిచ్చిరి యే
  మో దీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్
  [దీ = డీ]


  పాదాక్రాంత సితాద్రి నేత్ర విల సత్ఫాలుండు వేదాంగ సం
  వేదోద్యాన విహారుఁ డద్రి తనయం బెండ్లాడఁ గారుణ్య భా
  రోదారాస్వని తాంతరంగ రుచి విద్యోతుండు మృష్టాన్న స
  మ్మోదీ! పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో

  రిప్లయితొలగించండి
 28. ఏదీ దారిక నప్పులిచ్చి యకటా యీ నీరవున్ బెంచినా
  మా దుర్మార్గుడు మోసగించి చనె నమ్మా యంచు బ్యాంకేడ్వగా
  నా దేశం బతనిన్ స్వదేశమునకే యంపంగ నిచ్చోట నా
  మోదీ 'పెండ్లి'కి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో.

  రిప్లయితొలగించండి
 29. రాదే బుధ్ధియె మీకిక
  *"మోదీ పెండ్లికి జనిరట ముక్కోటి సురల్"*
  ఏదీ ఎక్కడ చూపుడి
  షాదీ గానా బజాన సైతము లేదే!!

  చడీ చప్పుడు లేకుండా ఎక్కడి పెళ్ళెకెళ్ళారొ?

  రిప్లయితొలగించండి
 30. మోదమునన్ మది నెంచగ
  కాదేదియు నిట సమస్య; కవివరులారా
  ఖేదమనక పూరింపుడు,
  "మోదీ బెండ్లికి జనిరట ముక్కోటి సురల్!"

  రిప్లయితొలగించండి
 31. మోదమలర దొరికెనుమన    
  మోదీకిన్నాళ్ళకునొక ముచ్చట యిల్లాల్    
  ఖేదములన్నియుఁ దొలగగ
  మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్

  రిప్లయితొలగించండి
 32. మోదమ్మొందగ కాశి నెన్నికను నామోదించి గెల్పించ ని
  ర్వాదాంశమ్ములునౌ లసత్పథకముల్ వాసిం గనన్ జేకొనెన్
  వేదోక్తమ్ముగ పార్వతీసతికిఁ గావింపన్ వివాహమ్ము నా
  మోదీ, పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో

  రిప్లయితొలగించండి
 33. సాదరముగ తేనీటిని
  చీదరపడకుండ నమ్ము చిరుతని లోనన్
  ఆ దేవుళ్ళే మికనుచు
  మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్ ?

  రిప్లయితొలగించండి
 34. కం.
  సాదా సీదా బ్రతుకున
  నేదో సాధింప దలచి నేతగ నిలువన్
  కాదనుటెట్లగు నా విధి
  మోదీ పెండ్లికి జనిరట ముక్కోటి సురల్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 35. రాదే బంధువులైన మైత్రి వలనన్ ప్రాపై, వినా తండ్రి యా
  మోదంబే యొకటైన జంటకిక తామూ సాక్షులై రాణి, యా
  మో దీ పెండ్లికి పోయినారు గదరా, ముక్కోటి దేవు ళ్ళహో
  మోదంబున్ తెలిపెన్ కదా! శుభము శంభో శంకరా భార్గవా!

  రిప్లయితొలగించండి
 36. కం.
  షాదీ గాదది పేరున
  కాదా చదురని తెలుపగ కానగు టెట్లో
  సీదా భారత ప్రతినిధి
  మోదీ పెండ్లికి జనిరట ముక్కోటి సురల్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 37. దీదీకలగనిజెప్పెను
  మోదీపెండ్లికిజనిరట ముక్కోటిసురల్
  సౌదామినివధువటయిక
  మోదీజీయగుటవరుడుమోదముగలిగెన్

  రిప్లయితొలగించండి
 38. రిప్లయిలు
  1. మోదంబొందిరహో! స
   మ్మోదంబున సుజనమంత,ముద్దార సం
   ధ్యాదంగన శోభా!కౌ
   మోదీపెండ్లికి జనిరట ముక్కోటిసురల్

   తొలగించండి
 39. దాదాసాహెబు చెప్పెనిట్లనిభళామోదంబునొందంగగా
  మోదీపెండ్లికిపోయినారుగదరాముక్కోటిదేవుళ్ళహో
  మోదంబందుచుజూడశూన్యమెకటాభోస్వప్నమందుండెగా
  దాదాసాహెబుమాటలన్నియుకలన్దధ్యంబులేయౌనుసూ

  రిప్లయితొలగించండి
 40. హోదా నీయగ రాదా?
  లేదా సాక్ష్యము? తిరుపతి లెక్కకు రాదా?
  వాదా మరచుట తగదని
  మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్..��

  రిప్లయితొలగించండి
 41. శ్రీదేవేరుల జతగొని
  గాదిలి బ్రహ్మోత్సవమున కల్యాణమనన్
  వేదాత్మకుడగు హరియా
  మోదీ, పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్..🙏

  రిప్లయితొలగించండి