పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ పూరణము నాకు నర్థానందమే గాని సంపూర్ణ తృప్తి నీయ లేదండి. ఆపద్ధర్మముగా దత్తపది “గుఱ్ఱం” ను గుఱ్ఱము గా సాధురూపము చేసి ప్రయోగించినారు. దత్తపది లోని సున్నను నే యచ్చు తోను సంధి చేయ లేము కదా. దత్త పదిని మార్చి నట్లే యయ్యింది.
కృష్ణుడు అర్జును ని తో కురు క్షేత్ర ము న ---- మన సు గుర్రము న దు పు లో మనుజు లుంచి సకల జనులు బాగుండాలి సవ్య సాచి రాదు గద మైల వర పుత్రి రాజ్య లక్ష్మి రా వెల యు దు వీ వ య్య రమ్య మల ర
..............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂సమస్య 🤷♀.................... దత్తపది *"గుఱ్ఱం - మైలవరపు - గుండా - రావెల"* పై పదాలతో భారతార్థంలో పద్యం
సందర్భము: "రాముడు రావణుని సంహరించిన తరువాత సీత అగ్ని పరీక్ష జరిగింది. ఆ సాధ్వికి కళంక మనేదే లే దని అగ్ని దేవుడు ప్రత్యక్షమై చెప్పి సీత నప్పగించినాడు. రాముడు సతీ సోదర వానర సమేతంగా హంసలతో కూడిన పుష్పక విమాన మెక్కి అయోధ్యకు బయలుదేరాడు. ప్రయాణంలో గత సంఘటనలను చెప్పుకున్నారు. దూరంగా అయోధ్యాపురి కనిపించింది. పుష్పకం నేలకు దిగింది. శ్రవణా నక్షత్రంలో రామునికి పట్టాభిషేకం జరిగింది. పుష్పకాన్ని కుబేరునికడకు వెళ్ళిపొ మ్మన్నాడు రాముడు." అని ధర్మరాజుకు మార్కండేయుడు రామునిగూర్చి చెప్పాడు. బభౌ తేన విమానేన హంస యుక్తేన భాస్వతా.. అని అధ్యాత్మ రామాయణము యు.కాండం స.13 శ్లో.59 అబ్రవీత్ పుష్పకం దేవో గచ్ఛ వైశ్రవణం వహ.. అని అధ్యాత్మ రామాయణం యుద్ధకాండం స.14 శ్లో.99 వాహనమా! కుబేరుని కడకు పొమ్ము.. అన్నాడు రాముడు. కిష్కింధను సుగ్రీవునికి, లంకను విభీషణునికి ఎట్లా అప్పగించాడో పుష్పకాన్ని కూడా కుబేరుని కప్పగించాడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ "గుఱ్ఱంబులా కావు.. కొమరారు హంసలన్ పుష్పక మొప్ప రాముండును త ది తరు లెక్కి.. " 'రెది మైల? వరపుత్రి యీ సీత..' యని యగ్ని రామున కప్పగించె.. వానరేశ్వర! శాస్త్ర పారగుండా! వింటె!" యని గత కథఁ జెప్పికొనుచుఁ జనిరి.. వేగ మయోధ్య రా వెలలేని సౌధాలు కనిపించె.. దిగె పుష్పకమ్ము భువికిఁ.. జెలగి రాముని పట్టాభిషేక మాయె శ్రవణమందు.. రాముండు వైశ్రవణు కడకు నా విమానమున్ బొ మ్మనె" ననుచుఁ జెప్పె ధర్మజునకు మార్కండేయ తాపసుండు..
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 30.10.19 -----------------------------------------------------------
శ్రీకృష్ణుఁడు ద్రౌపదితో...
రిప్లయితొలగించండిపావనత్వమ్ము గుఱ్ఱమై పరుగుఁ దీయు
నంట దేమైల వరపుత్రి వమ్మ నీవు
తరుణి! కొంత జాగుం డా పిదప శుభంబు
తృప్తిగం బొందరా వెలదీ! సయిఁపుము.
తొలగించండిఅద్భుతం!
🙏
నమోన్నమః 🙏
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
తొలగించండిమీ పూరణము నాకు నర్థానందమే గాని సంపూర్ణ తృప్తి నీయ లేదండి.
ఆపద్ధర్మముగా దత్తపది “గుఱ్ఱం” ను గుఱ్ఱము గా సాధురూపము చేసి ప్రయోగించినారు. దత్తపది లోని సున్నను నే యచ్చు తోను సంధి చేయ లేము కదా. దత్త పదిని మార్చి నట్లే యయ్యింది.
కుడిచెన్ బేర్మిని కంఠదఘ్నము నటన్ గూర్మిన్ హితాహూతుడై
రిప్లయితొలగించండివడి నేతెంచు తరిన్ గనుంగొనె సఖున్ బాల్యాప్తునిన్ ద్రోవలో
నెడబాటుం దలబోసి మద్యమును వారెందేనిఁ ద్రావన్ గటా!
యడలెన్ సోదరుఁ డారగింప భగినీహస్తాన్నమున్ భీతుఁడై
మీ నిన్నటి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి( ధర్మరాజు అశ్వమేథం చేసి అర్జునుని అశ్వరక్షకునిగా
రిప్లయితొలగించండినియమించి పలుకుతున్నాడు )
లెమ్ము ! రావయ్య ! రా ! వెలలేని పార్థ !
గుర్రము ననుసరింపుము కూర్మి మీర ;
అంట దేమైల అర్జున ! యగును జయము ;
వేదపారగుం డాధౌమ్యు వెంట గొనుము .
(ధౌమ్యుడు - పాండవపురోహితుడు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమూడవపాదంలో "అర్జున " బదులుగా " వరపుత్ర "
రిప్లయితొలగించండిఅని చదువ మనవి )
రిప్లయితొలగించండిఖాండవదహనము-
పారగ గుఱ్ఱము గుండా!
హేరాళము కంజరమిక హివ్వన వలె రా!
నారాశంసుని కై బా
వా రా వెలబోవ మైల! వరపు నెలకొనన్!
జిలేబి
తొలగించండి* గుండా- శూరుడా!
ఆంధ్ర భారతి ఉవాచ :)
__/\__
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండివెస గుఱ్ఱంబులనాపి కృష్ణుడనె "నిర్భీతిన్ బ్రవర్తింపుమా!
అసలేమంటదు నీకు మైల., వరపుత్రా! యోధులన్ జంపగాన్
గసితో., యుద్ధములన్న పెక్కు సుడిగుండాలయ్య ! యోచింపుమా !
పస జూపింపనినాడు రావెలమితో భాగ్యమ్ములిద్ధాత్రిలో" !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపది గుఱ్ఱంబుల శక్తి వచ్చు హరి! నీ పాదమ్ములన్ బట్ట., నెం..
తొలగించండితది యైనన్ మదిలోనీ మైల వరపుణ్యంబౌను ., భాగ్యాలకున్
కొదువేముండును? కోటికోటి యఘముల్ గుండాలలో దగ్ధమౌ !
పదిలమ్మీవిక యేలరావెలమితో పగ్గంబులన్ బట్టుమా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిడాక్టర్ గుఱ్ఱం సీతాదేవి గారి పుస్తకానికి కితాబు కష్టేఫలి వారిది లంకె బిందె :)
https://kastephale.wordpress.com/2019/10/30/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b6-15/
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
తొలగించండిశ్రీలలితాష్టోత్తర శతకం (Dr.సీతాదేవి)
నా పుస్తకాన్ని తమ బ్లాగులో సమీక్షించిన శ్రీ శర్మగారికి,దాని లింకును బ్లాగులో ప్రకటించిన జిలేబిగారికీ ,వారి సహృదయతకు కృతఙ్ఞతాంజలులు!!
తొలగించండి👍👌👏
తొలగించండి*కీచకుడు తనని కాంక్షించుచున్నాడని ద్రౌపది రహస్యముగా భీముని కలిసి చెప్పినపుడు భీముడామెను ఓదారుస్తూ పలికిన మాటలుగ...*
రిప్లయితొలగించండిచేర రావెలతాంగినా చెంతకనుచు
కోరికలవి గుఱ్ఱంబులై కూయ నేమి
యంటదేమైల వరపుత్రి యాలకింపు
నీ మొగుండాలమిక సేయ నేరడంటి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినా పూరణ. తే.గీ.
**** **** **
(.....కీచకుడు ద్రౌపదితో.......)
కలగ దేమైల వరపుత్రిక వలె గలవు
రావె! లలన !నీకొరకు గుఱ్ఱమయి నాదు
మనసు పరుగిడుతున్నది.మనవిని విని
నంత చక్కగుం డానందమౌను! నిజము
నిన్ను జేపట్ట వరమౌను వన్నెలాడి
ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగుఱ్ఱమధి రోహణము సేసి గొప్ప గాను
రిప్లయితొలగించండిలేక యేమైల వరపును లేకయె మఱి
మేటి గుండాల నెదిరింప మేలుగాను
వెసగ నభిమన్యు డేగెరా!వెలక వాఱ !
**)(**
వరపు = లేమి;క్షామము
గుండాల = ధీరుల
వెలకవాఱ = తెల్ల వారగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే.గీ.
రిప్లయితొలగించండిభటులు (గుఱ్ఱం)బునకు (మైలవరపు)సీమ
బాగు (గుండా)డ నొకయింత యాగు టొప్పు
నలఘుఖాద్యంబు దొరకు(రా వెల)యు సుంత
యనిరి ధర్మజు యజ్ఞాశ్వ మనుసరించి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ రోజు దత్తపది
రిప్లయితొలగించండిగుఱ్ఱం - మైలవరపు - గుండా - రావెల"
మన కవిమిత్రుల ఇంటిపేర్లైన
పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయవలెన్ .
సీసములో నా పూరణము
కీచకునితో ద్రౌపది పలుకులు
ఉత్త (గుర్రమ)ని నీ చిత్తమున కలిగె, వెల్ల గుఱ్ఱము యిది, వేశ్య వీవు,
దరికి (రా, వెల) కట్టి దండగా వేతును నీ బారక సమమౌ జాంబవంబు
ననుచు పిలచితివి,కనులకు కమ్మెను మైల, వరపు కల్గు శీల వతిని
హింసించ రాజ్యమున్,హేయమైన పనులు మానుము,ధూర్తుడా!మానవతిని,
గలరు గంధర్వులైదుగుర్,కాచు సతము,
మాట వినుము,తొలగునీకు చేటు,చిక్కు
కొందువు సుడి(గుండ)ము లందు పొందు కోర,
ననుచు పలికె ద్రుపద సుత దనుజు గాంచి
ఉత్త గుఱ్ఱము = రౌతు లేని గుఱ్ఱము
వెల్ల గుఱ్ఱము = ఉచ్చైశ్శ్రవము. బారకము = బరువు జాంబవము = బంగారము
మైల = చీకటి, వరపు = కరువు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితీరుగ (గుర్రం) బెక్కిరు
రిప్లయితొలగించండి(మైల వర)పును దలపింప మారిని ద్రుంచున్
నౌర యనం(గుండా)తడు
లే(రా వెల)యింప నకులు రీతిని కవులే
ఇరుమైల = ఇరువైపుల; వరపు = అనావృష్టి; మారి = వాన
మీ పూరణ భావం అర్థం కాలేదు.
తొలగించండినకులుడు గుర్రపు స్వారీ చేస్తూ కత్తితో వాన చినుకులు ఛేదిస్తూ పోయేవాడనీ, అందగాడని పేరొంఫిన వాడు కదా... గుర్రపు స్వారీ చేస్తూ వానను ఛేదుస్తుండగా ఇరువైపులా వాన లేనట్లుగా ఉందనే ఉద్దేశ్యంతో వ్రాశాను. సరి కాదనిపిస్తే మరల ప్రయత్నిస్తాను. 🙏
తొలగించండికీచక ప్రలాపము
రిప్లయితొలగించండిరావె!లక్ష్మీసమాన!వరాంగ!నీవె!
కోర్కెలవియె గుర్రంబులై గుబులుబుట్టె
నంటదే మైల వరపుత్రి యంటనన్ను
కన్ను లగ్నిగుండాలయ్యె కావరావె!
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా,నమస్సులు!!
తొలగించండికృష్ణుడు అర్జును ని తో కురు క్షేత్ర ము న ----
రిప్లయితొలగించండిమన సు గుర్రము న దు పు లో మనుజు లుంచి
సకల జనులు బాగుండాలి సవ్య సాచి
రాదు గద మైల వర పుత్రి రాజ్య లక్ష్మి
రా వెల యు దు వీ వ య్య రమ్య మల ర
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'బాగుండాలి' వ్యావహారికం.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిజవ్వనపు గుఱ్ఱమూర్వశి దువ్వినంత
నంటదే మైల వరపుత్ర! యాగకుండ
వలపు సీమగుండా నిను చెలఁగి సాగి
నరవరా! వెలయన్ జేర్తు సరస మాడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికీచకుడు సైరంధ్రి తో
రావె లలనామణీ వేగ రాగమధిక
మయ్యె కోర్కెలు గుర్రము లయ్యె నాకు
నంట దిట మైల వరపుత్రి యగుట వలన
చేయబోను గుండాగిరి చేరరమ్ము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగుండాటా?యిది జూదమా? తెలివిగా గొట్టంగ ప్రత్యర్థినిన్,
రిప్లయితొలగించండిగుండెల్ తీసినబంట! రావె లయమౌ క్రోధోగ్రతన్ పార్థుడే
చెండన్ నీ దగు సేనలన్, బరచ నీ సేనాపతుల్ గుఱ్ఱమో
బండో చూచుక, పొంద మైలవరపుం బాటున్, సుయోధాగ్రణీ!
మైలు=దేహములు, అవరపుంబాటును=చిన్నతనమును
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివనిఁ బృథ గుఱ్ఱం గన విని
రిప్లయితొలగించండితన కనుమైల వరపు జిగి తగ్గ నడియఁగాఁ
దన కడుపును బోఁగుం డా
య నెలఁత ముని రా వెలవెల యాయె భృశమ్మున్
[కనుమైలు = మేను కనులు; పోఁగు = రాశి, పిండపు రాశి; నెలఁత =వనిత, గాంధారి; ముని = వ్యాస మహర్షి]
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండికోరికయనెడుగుర్రమ్ముకోరునెడల
రిప్లయితొలగించండిపొసగనోపమైలవరపుపుత్రివినుము
వానిగుండాటనాడింతునీనిమిసము
చీరరావెలతాంగికజేరనన్ను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
దత్తపది
*"గుఱ్ఱం - మైలవరపు - గుండా - రావెల"*
పై పదాలతో భారతార్థంలో పద్యం
సందర్భము: "రాముడు రావణుని సంహరించిన తరువాత సీత అగ్ని పరీక్ష జరిగింది. ఆ సాధ్వికి కళంక మనేదే లే దని అగ్ని దేవుడు ప్రత్యక్షమై చెప్పి సీత నప్పగించినాడు.
రాముడు సతీ సోదర వానర సమేతంగా హంసలతో కూడిన పుష్పక విమాన మెక్కి అయోధ్యకు బయలుదేరాడు. ప్రయాణంలో గత సంఘటనలను చెప్పుకున్నారు. దూరంగా అయోధ్యాపురి కనిపించింది. పుష్పకం నేలకు దిగింది.
శ్రవణా నక్షత్రంలో రామునికి పట్టాభిషేకం జరిగింది. పుష్పకాన్ని కుబేరునికడకు వెళ్ళిపొ మ్మన్నాడు రాముడు."
అని ధర్మరాజుకు మార్కండేయుడు రామునిగూర్చి చెప్పాడు.
బభౌ తేన విమానేన
హంస యుక్తేన భాస్వతా..
అని అధ్యాత్మ రామాయణము యు.కాండం స.13 శ్లో.59
అబ్రవీత్ పుష్పకం దేవో
గచ్ఛ వైశ్రవణం వహ..
అని అధ్యాత్మ రామాయణం యుద్ధకాండం స.14 శ్లో.99
వాహనమా! కుబేరుని కడకు పొమ్ము.. అన్నాడు రాముడు. కిష్కింధను సుగ్రీవునికి, లంకను విభీషణునికి ఎట్లా అప్పగించాడో పుష్పకాన్ని కూడా కుబేరుని కప్పగించాడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"గుఱ్ఱంబులా కావు.. కొమరారు హంసలన్
పుష్పక మొప్ప రాముండును త ది
తరు లెక్కి.. " 'రెది మైల? వరపుత్రి యీ సీత..'
యని యగ్ని రామున కప్పగించె..
వానరేశ్వర! శాస్త్ర పారగుండా! వింటె!"
యని గత కథఁ జెప్పికొనుచుఁ జనిరి..
వేగ మయోధ్య రా వెలలేని సౌధాలు
కనిపించె.. దిగె పుష్పకమ్ము భువికిఁ..
జెలగి రాముని పట్టాభిషేక మాయె
శ్రవణమందు.. రాముండు వైశ్రవణు కడకు
నా విమానమున్ బొ మ్మనె" ననుచుఁ జెప్పె
ధర్మజునకు మార్కండేయ తాపసుండు..
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
30.10.19
-----------------------------------------------------------
ఔర యనంగుం డాతడు
రిప్లయితొలగించండిలేరా వెలరారు నకులు రీతిని సములే
గుర్రంబుల వీలెరిగిన
పారగు డే మైల వరపు బడయని జోదే
కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునితో:
రిప్లయితొలగించండికదన రంగాన గుండాల మదమడంచ
తాకదయ్య మైల, వరపుత్ర!భయము విడి
రథములును,గుఱ్ఱముల నతిరథుల గూడు
యనిని హరికుమారా వెలయంగ వలయు!