ఘనుడగు రావణాసురుడు కప్పురగంధుల లోలుడై జనెన్ మనియెనె? యా సుయోధనుడు మానధనుండయి వంశ నాశనం బునకును దారిదీయడె? యమోఘ చరిత్రము లెన్నిలేవు, నే మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో?
ఈ రోజు ఆకాశవాణిలో ప్రసారం: దినమునకొక్క పద్యమును దీరుగ పూరణచేసిగాని నే కునుకునకిచ్చగించ మది కోరదు విశ్రమమేమి చేతు నా మనముననున్నమాటయిది మన్ననఁగోరుచు విన్నవించెదన్ మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో.
మనసున శాంతమున్ సరళమౌ గతి జీవన మొప్పుచుండుటే మనిషికి మోదమిచ్చును; సమస్యలు నిత్యము జీవితమ్ములో మనసును క్రుంగదీసినను మానవ యత్నము మానకుండుటే మనుజుల కర్మ యోగులుగ మార్చి ప్రశాంతత గూర్చు నెమ్మదిన్ (ఆకాశవాణికి పంపినది)
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. 1లో... 'శరంపరమున్'? 'సపత్నిని చేరె'.... సపత్ని అంటే సవతి. 2లో... 'తలంపు + ఉన్నచో = తలం పున్నచో' అవుతుంది. యడాగమం రాదు. 'ఏరికైనయున్' .. ఇక్కడ యున్ అవసరం లేదు. 3లో... 'ఎళ్ళగ' ? 'కష్టములెల్లను' అనడం సాధువు.
ధనమది మేలు గొల్పినను దానిని జేకొన కష్టమన్నటుల్ కనుగొన నీ సమాజమున ఖ్యాతి గడించగ భారమౌను, తా ననయము నెత్తు పల్లముల నన్నిటి నొక్క తెఱంగు జూడఁగన్ మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో!
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
తినుటకు నిడ్లి దోసెలను తేరకు నిచ్చుచు కమ్మకమ్మగా
వినగనె పాతజోకులను వేగమె నవ్వుచు ముద్దుముద్దుగా
కనుటకు రంభ వోలెడిని కాంతయె కాన్పుకు నింటికేగ నే
మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో?
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(ఆకాశవాణికి ఈ పూరణనే పంపారా?)
🙏
తొలగించండిఅవును సార్! ఆకాశవాణికి ఎంతమాత్రం సరదా ఉందో చూద్దామని 😊
👍
తొలగించండివిరించి
రిప్లయితొలగించండిధనమది లేకపోయినను ధర్మము వీడక చిత్తశుద్ధితో
ననవరతమ్మొనర్చు పరమాత్ముని నామజపమ్ముఁ జేసినన్
మనిషికి మోదమిచ్చును, సమస్యలు నిత్యము జీవితమ్ములో
జనితములైన భీతిలక సాగుచు నుండెడి వాడె ధీరుఁడౌ.
విరుపుతో చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిచం॥
గణితము నభ్యసించునెడ కష్ట సమస్యల సాధనంబునన్
మననము జేెసి సూత్రముల మానసశుద్ధిని మేధ పెంచుచున్
ఘనమగు వృత్తి బొంది తన గమ్యము చేరెనొకండు కీర్తితో
మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో
గణిత సమస్యల పరిష్కారంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచంపకమాల
రిప్లయితొలగించండిఅనయము నీదు ధ్యానమున నంచిత భక్తినిఁ గల్గ జేసెడున్
బెనఁగులు నీయ మంచిదని వేడెనె కృష్ణునిఁ గుంతి మాతయే
మనమది వాడికిన్ గుడిగ మార్చిన మార్గము జూప తీరగన్
మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో
తీరిన సమస్యలు మోదమిస్తాయన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు తమరి ఆదేశానుసారం సవరించిన పూరణ :
తొలగించండిచంపకమాల
అనయము నీదు ధ్యానమున నంచిత భక్తినిఁ గల్గ జేసెడున్
పెనఁగులు నీయ మంచిదని వేడెనె కృష్ణునిఁ గుంతి మాతయే
మనమది వానికిన్ గుడిగ మార్చిన మార్గము జూప తీరగన్
మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో
రిప్లయితొలగించండిఅనఘా! అలాది పూరణ
గనుడీ కవిరాట్ జిలేబి కందపు గంధం
బనఘా యిదియే సుమ్మీ
మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరామస్వామి కిడాంబి, ఎర్రమంజిల్ హైదరాబాద్
రిప్లయితొలగించండిదిన దినమూ పరీక్షల మదిం దలచే విజయార్థి గోముగా
తనకొక కష్ట మైనదగు ప్రశ్నను వేరుగ నీయ గోరుచూ
కనుమని వేడుచున్, ప్రతిగ మాస్టరు పాదము పట్టగా భళా
మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'దినమూ, తలచే, కోరుచూ' అన్నవి వ్యావహారికాలు. "దినమున్, తలచున్, గోరుచున్" అనండి.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వినయము గారమున్ గొనుచు విద్యల తల్లియె హర్షమొందగన్
ఘనమగు కైపదమ్ములకు కమ్మని పూరణలల్లి హృద్యమౌ
సునిశిత పద్యరాజములు శ్రోతల కింపుగ పాడుచుండగా
మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిజననము మృత్యువున్ సుతులు సంపదలన్ని సమస్యలంచు జీ...
వనమున కుందనేల ? ఇది వైష్ణవమాయ యటంచు నమ్మి , నె....
మ్మనమున విష్ణువున్ గన సమస్యలు నీకు వరమ్ములౌనురా !
మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచం.
రిప్లయితొలగించండిజననము నేకమై బ్రతుకు సాగదు నెమ్మది నెల్ల వేళలన్
దినదిన మేగుచుండ మది దేలును నాశలు కష్ట సాధ్యముల్
వినయము నోర్చి సాధనగ విశ్వత నిండిన కార్య సాధనే
మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ము లో
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'విశ్వత నిండిన'?
రిప్లయితొలగించండితనదగు శక్తి మించని విధాతయె వ్రాసిన గీతలే సుమా
మనిషికి మోద మిచ్చును, సమస్యలు, నిత్యము జీవితమ్ములో,
మునకలు వేయ మానవుల ముంగట త్రోయ విరక్తి కల్గున
మ్మ నెలతుకా! జిలేబి యవి మాన్పుట నెట్లని తోచకన్ సుమా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మాన్పుట యెట్లని తోచకే సుమా' అనండి. (తోచక కళ)
రిప్లయితొలగించండిఆకాశవాణికి పంపినది
మనుగడ లోన చిక్కులు కమాచివలెన్ తవిలించు, భూరిజ
మ్మున నవి మీర సాధ్యమకొ? ముమ్ముర మై కొలువంగ దైవమే
మనిషికి మోదమిచ్చును, సమస్యలు నిత్యము జీవితమ్ములో
తన కృపతో సుతారముగ తాము తొలంగు తమంత తాముగా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికనిరా! యంతర్జాలము
రిప్లయితొలగించండిగనిరా! శంకర గురువుల కరములఁ బుట్టున్
గనుగొనఁ, బూరణ చేసిన
"మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅనుకూలముగ తిరిగినన్
మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్,
తనకలి చేర్చిన నెపుడున్
మనుజుడె క్రుంగును సొలపుల మహిని జిలేబీ!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివనముల కేగియు నట భా
రిప్లయితొలగించండిమను యందరు పొందిన తరి పాండవులు మరిన్
తనువున వాడని చేవగు
మనుజునకు బ్రమోద మిడు సమస్యలు సతమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భామను + అందరు' అన్నపుడు యడాగమం రాదు. 'మరిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. 'చేవ + అగు' అన్నపుడు సంధి లేదు.
రిప్లయితొలగించండిగనుడి సమస్యా పృచ్ఛక
మనుజేంద్రు డిత డనుదినము మానడు వేయన్
మునుగడ కైపదమరె! యీ
మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కనుడి' అని ప్రారంభించండి.
రిప్లయితొలగించండిఅనఘా గనుడీ మోడిన్!
మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్!
తన తలకెత్తు కొనెనుగా
మన దేశపు తీరనట్టి మకిలిని ప్రీతిన్!
జాల్రా
జిలేబి :)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంబోధన తర్వాత సరళాదేశం రాదు. "అనఘా కనుడీ..." అనండి.
కనగా వినగా చదువగ
రిప్లయితొలగించండిమనుటకు తాజేయు ప్రయతమల వలన కదా
చనియెను గుహ నుంచి శశికి
మనుజునకు బ్రమోద మిడు సమస్యలు సతమున్
కనగా వినగా చదువగ
తొలగించండిమనుటకు తాజేయు జతనమల వలన కదా
చనియెను గుహ నుంచి శశికి
*మనుజునకు బ్రమోద మిడు సమస్యలు సతమున్*
జతనము .. ప్రయత్నం, శ్రేష్టము, జాగ్రత్త
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'జతనము + అల'?
రిప్లయితొలగించండిమా అర్ణాబు గోస్వామి అరణా కయరు పట్టుకుని లాగి లాగి కొట్టు నను దినము :)
తను జంకని గోస్వామి! ప్ర
తి నిమిషమరచుచు విడువక తిట్టును, దుష్టుల్
చన గునగున పరుగుల! యీ
మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పరుగుల నీ మనుజునకు..' అని ఉండాలి.
దనుజునివలె వర్తించుచు
రిప్లయితొలగించండిదను కోరినవెల్ల మానధనుడై దోచన్
మనగలిగిరె శంకర? యే
మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తాను'ను 'తను' అనరాదు.
ఘనుడగు రావణాసురుడు
రిప్లయితొలగించండికప్పురగంధుల లోలుడై జనెన్
మనియెనె? యా సుయోధనుడు మానధనుండయి వంశ నాశనం
బునకును దారిదీయడె? యమోఘ చరిత్రము లెన్నిలేవు, నే
మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'లోలుడై చనెన్' అని ఉండాలి.
జననుతి నొందు రీతినిఁ బ్రశంసల పూవులఁ జల్లు నట్లుగన్
రిప్లయితొలగించండిమననరసోద్భవత్కవనమాన్యకవీశ్వరపూరణమ్ములో
ననితరకష్టసాధ్యవిషయాన్వితకందికవిప్రదత్తముల్
మనిషికి మోద మిచ్చును సమస్యలు, నిత్యము జీవితమ్ములో.
మనోహరంగా, అద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిధనమది లేకున్నను కడు
రిప్లయితొలగించండిఘనముగ బ్రతికిన మనుజుడె కారణ జన్ముడు
అనురక్తిగ తలచిన యా
మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదం చివర కచ్చితంగా గురువుండాలి. "కారణజన్ముం । డనురక్తిగ తలచిన నా । మనుజునకు..." అనండి.
గురువు గారికి నమస్సులు
రిప్లయితొలగించండికనుడీ దేవుని లీలలు
వినలేదా సుకృత ధర్మ విశ్వం బందున్
తనవే యను తలచు హిత
మనుజునకు ప్రమోద మిడు సమస్యలు సతమున్ .
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణదోషం. సవరించండి.
ఘన మగు సంకల్ప ము తో
రిప్లయితొలగించండివెను కంజ ను వేయ బోక వేయి విధ ము లన్
మును కొని పరి ష్క రిం చెడు
మనుజు నకు ప్రమో ద మిడు సమస్య లు స త మున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివచ్చే వారం ఆకాశవాణి వారి సమస్య
రిప్లయితొలగించండిదుర్గా! నీ వలెనన్ జగద్వలయ మెంతో దుఃఖ మందెన్ గదా
Padyamairhyd@gmail.com కు పంపవలె
ఈ రోజు ఆకాశవాణిలో ప్రసారం:
రిప్లయితొలగించండిదినమునకొక్క పద్యమును దీరుగ పూరణచేసిగాని నే
కునుకునకిచ్చగించ మది కోరదు విశ్రమమేమి చేతు నా
మనముననున్నమాటయిది మన్ననఁగోరుచు విన్నవించెదన్
మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇది మీ శ్రీమతి గారి పేరున ఆకాశవాణికి పంపినట్టున్నారు!
అవును గురువుగారూ
తొలగించండిఅనరున నున్నయప్పుడును యక్కఱపాటున సొక్కునప్పుడున్
రిప్లయితొలగించండికనుగొన భోగభాగ్యములకన్నను సాంత్వననిచ్చు పల్కులే
మనిషికి మోదమిచ్చును, సమస్యలు నిత్యము జీవితమ్ములో
పొనుగువడంగ నుల్లసము పోఁడుము లుల్లమునందు జేకురున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అనరున'? 'అప్పుడును + అక్కఱపాటు' అన్నపుడు యడాగమం రాదు.
అనరు అన్న మాటకు దౌర్బల్యము, సంకటము మొదలైన అర్థాలు నిఘంటు శోధనలో ఇచ్చారు గురువుగారు. సంకటస్థితిలో వున్నప్పుడు అనే భావనతో వ్రాశాను. సరికాకుంటే తెలుపగోర్తాను.
తొలగించండిఅనరుల నున్నయప్డు మది యక్కఱపాటున సొక్కునప్పుడున్
తొలగించండికనుగొన భోగభాగ్యములకన్నను సాంత్వననిచ్చు పల్కులే
మనిషికి మోదమిచ్చును, సమస్యలు నిత్యము జీవితమ్ములో
పొనుగువడంగ నుల్లసము పోఁడుము లుల్లమునందు జేకురున్.
అనుభవశీలతాత్వికుడుఅమ్మనుగొల్చుచుపద్య పాదపూ
రిప్లయితొలగించండిరణములయజేయుచున్ రాగము భావము తాళముల్ మరిన్
గణములు దప్పకన్ చెలగి కమ్మని పద్యము లందజేయ నా
మనిషికి మోదమిచ్చును సమస్యలునిత్యము జీవితమ్ములో
కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ ,రంగారెడ్డి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తాత్వికుడు + అమ్మను' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. రెండవ పాదంలో గణదోషం. 'తప్పక' కళ. ద్రుతాంతం కాదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅనుభవశీలుడై వెలిగియమ్మనుగొల్చుచు పద్యపాద పూ
తొలగించండిరణమునుజేయనెంచియిక రాగముభావముతాళమొప్పగా
గణములుదప్పనట్టివగు కమ్మనిపద్యములందజేయ నా
మనిషికి మోదమిచ్చునుసమస్యలుజీవితమ్మునన్
గురువు గారికి నమస్కారములు తప్పులు గ్రహీంచాను
తొలగించండితెనుగు పద భాండ మందలి
రిప్లయితొలగించండియనువైనవి యెంచి గణము లమరిచి కవనం
బను నాటలాడుచుండెడి
మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్
చక్కని పూరణ. బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిఅనయము సమస్య దొరకక
పెనగొనఁడనఁ జక్రవర్తి! పృచ్ఛక పదవిన్
దనరెడు మద్గురుఁ బోలెడు
మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమనసున శాంతమున్ సరళమౌ గతి జీవన మొప్పుచుండుటే
రిప్లయితొలగించండిమనిషికి మోదమిచ్చును; సమస్యలు నిత్యము జీవితమ్ములో
మనసును క్రుంగదీసినను మానవ యత్నము మానకుండుటే
మనుజుల కర్మ యోగులుగ మార్చి ప్రశాంతత గూర్చు నెమ్మదిన్
(ఆకాశవాణికి పంపినది)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిన్నటి సమస్యా పూరణకు నా ప్రయత్నము పరిశీలింపగలరు:
రిప్లయితొలగించండిపీతాంబరధారుని హరి
నా తరుణీ జన ప్రియ హితు నంబుజ నేత్రున్
ప్రీతిం గూర్చెడి కంసా
రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివినుమురచేతినిండుగనువేలకువేలుగసొమ్ములుండుచో
రిప్లయితొలగించండిమనిషికిమోదమిచ్చును,సమస్యలునిత్యముజీవితంబులో
చెనకుచునుండుగావునసజీవనదృష్టినిబారద్రోలగా
ననిశముబాటునొందుచునుహర్షముగల్గెడుమార్గమెన్నుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిను మిది కష్టమై నపుడె వెల్లడియౌ సుఖమూల్య మేరికిం
రిప్లయితొలగించండిగనులకు జీకటుల్ తెలియ కాంతి విశిష్టత తేటతెల్లమౌ
ఘనముగ నుష్ణమైన చలి గణ్యత తేలును తీరినంతనే
మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురువు గారూ.
తొలగించండిఈరోజు ఆకాశవాణి లో చదువబడిన నా పూరణ
రిప్లయితొలగించండిమనిషికి ఖేదమేర్పడు ప్రమాదము లేపున వచ్చి పైబడన్
మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితంబులో
తనకొక పూర్ణ రూపమిడి ధైర్యముతో మునుముందుకేగగన్
వనముల కేగి రాఘవుడు పల్మరు దాటడె కంటకంబులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిగురువు గారి whats app number ఎవరైనా తెలియజేయగలరు.
రిప్లయితొలగించండిగతంలో వారిచ్చారు కానీ నా ఫోన్ మారటంలో నంబరు పోయింది
7569822984
తొలగించండివినుటకు సొంపుగ లేదిది
రిప్లయితొలగించండిమనుజునకుబ్రమోదమిడు సమస్యలు సతమున్
మనుజునకరయసమస్యలె
యనుదినముందుఃఖమిచ్చునవునా కాదా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అనుదినమున్ దుఃఖ' మన్నపుడు ద్రుతం బిందువుగా మారదు.
( సమస్యల మధ్యతరగతి మనిషిని శంకరార్యుల "శంకరాభరణం"సమస్యలు సంతోషపరుస్తాయి )
రిప్లయితొలగించండికనికని సంఘమందలి వి
కంపితగాత్రుల కష్టదృశ్యముల్ ;
వినివిని కర్షకావళుల
విస్మయదాయకశోకగాథలున్ ;
మనము నదల్ప " శంకరుని "
మంజులశీర్షిక చూచు మధ్యపుం
మనిషికి మోదమిచ్చును స
మస్యలు నిత్యము జీవితమ్ములో .
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మధ్యపున్ మనిషి' అన్నపుడు ద్రుతం రూపం దాల్చదు. అయినా 'మధ్యపున్ మనిషి'?
"మధ్యతరగతి మనిషి " అనే అర్థంలో అలా అన్నానండీ ! ధన్యవాదాలు .
తొలగించండిమూడవపాదం చివర " మాంద్యుడౌ " మనిషి
తొలగించండిఅందామండీ ! " సమస్యలతో మొద్దుబారిన మనిషి "
అనే భావంతో .
మననమె చిక్కౌ మఱి పసి
రిప్లయితొలగించండిదనమ్మునఁ జదు వగుఁ జిక్కు తారుణ్యమునం
గనవలె పండిత వర్గము
మనుజునకుఁ బ్రమోద మిడు సమస్యలు సతమున్
తనరఁగ నంధకారము సతమ్ము నిశా తతి వచ్చె దీపముల్
తనరఁగ నడ్డుగాఁ గడలి దాటఁగ నింపుగ వచ్చె నోడలే
తనర నిరోధమై గిరులు దారికి వచ్చె విమాన రాజముల్
మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిదినమొక యాతనై గడుపు దీన దరిద్రు లనేకు లీ భువిన్
రిప్లయితొలగించండిధనమది లేక బంధు సముదాయము లేని యభాగ్యులెల్ల జీ
వనమున గ్రుచ్చు మోదు పలు బాధల వేదన నోర్వగా నెటుల్
మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో?
ప్రశ్నార్థకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి1) జనకునియాజ్ఞతీసుకొనిజానకిరాముడుకానకేఁగఁ, తా
రిప్లయితొలగించండివనమునసీతబాయ, పలువానరమూకలకూడగట్టి, తా
రణమొనరించిదైత్యుల, శరంపరమున్న్దునుమాడి, దుష్టరా
వణుతెగనాడి,రాముడు సపత్నినిచేరె, జనానుమోదుడై
మనిషికిమోదమిచ్చును, సమస్యలు,నిత్యముజీవితమ్ములో.
2) వినదగు, వేయిరీతులు, వివేకులమన్న తలంపుయున్నచో,
కనదగు, సూక్ష్మతత్వమును కార్యముసిద్దిగ, నెర్పజాలినన్
కొనుటదిసాధ్యమామనకు, కోరిననేర్పుల, నాకళింపఁగన్
తనువదిబాగనల్గిన, విధానమదేర్పడు, నేరికైనయున్
మనిషికిమోదమిచ్చును సమస్యలునిత్యముజీవితమ్ము లో.
3) చం. మనదగుజీవితంబును,సమంజసమెళ్ళగ,దీయబూనినన్,
కనపడుదారిలోతగులు,కష్టములెల్లయు నోర్చిదాట,నీ
వనుకొనియున్న తీరముల, నందుకొనంగగ,నర్హుడౌదువే
మనిషికిమోదమిచ్చును సమస్యలునిత్యముజీవితమ్ము లో
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి1లో... 'శరంపరమున్'? 'సపత్నిని చేరె'.... సపత్ని అంటే సవతి.
2లో... 'తలంపు + ఉన్నచో = తలం పున్నచో' అవుతుంది. యడాగమం రాదు. 'ఏరికైనయున్' .. ఇక్కడ యున్ అవసరం లేదు.
3లో... 'ఎళ్ళగ' ? 'కష్టములెల్లను' అనడం సాధువు.
అనయము బెగ్గలమ్మడర స్వాంతము నందు, సమస్యగా కనున్
రిప్లయితొలగించండిపనులను ధాత్రిపైన పెను బాధగ నెంచుచు తల్లడిల్లుచున్
వినయము శక్తియుక్తిగల విజ్ఞుడు మంచి వివేకశాలియౌ
మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికనివిని యెరుగని రీతిన
రిప్లయితొలగించండిమనసుకు బదునిచ్చు యా సమస్యల పూరణ
లను సాధించ గలుగు నా
మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్
ధనమది మేలు గొల్పినను దానిని జేకొన కష్టమన్నటుల్
రిప్లయితొలగించండికనుగొన నీ సమాజమున ఖ్యాతి గడించగ భారమౌను, తా
ననయము నెత్తు పల్లముల నన్నిటి నొక్క తెఱంగు జూడఁగన్
మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో!