9, అక్టోబర్ 2019, బుధవారం

సమస్య - 3157 (ప్రాగ్దిగ్గ్రావమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్"
(లేదా...)
"ప్రాగ్దిగ్గ్రావమునందుఁ గ్రుంకె రవియున్ బ్రత్యూషకాలమ్మునన్"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

83 కామెంట్‌లు: 1. బాగ్దాదు దొంగ కొరకై
  ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్
  దుగ్దయు తీరగ నతనికి
  ప్రాగ్దిగ్గ్రావమునఁ మరల రవి యుదయించెన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దుగ్ధయు' టైపాటు. (స్వర్గజ ప్రాస... పరవాలేదు).

   తొలగించండి
 2. మైలవరపు వారి పూరణ

  దిగ్దంతుల్ బెదరంగ బల్కుచును వందేమాతరధ్వానమున్
  త్వగ్దేహమ్ముల రక్షనెంచకయె సీతారామరాజల్లదే
  ప్రాగ్దిగ్భారతభానుడై ఖలులచే ప్రాణమ్ములన్ కోల్పడన్
  ప్రాగ్దిగ్గ్రావమునందుఁ గ్రుంకె రవియున్ బ్రత్యూషకాలమ్మునన్"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.

   తొలగించండి
  2. 😊😀
   దృగ్దారిద్ర్యము గల్గ నాకు జనితిన్ దృష్ట్యంశనిష్ణాతభై...
   షగ్దైవమ్మితడంచు నమ్ముచు., పరీక్షన్ జేసి యద్దమ్ములన్
   దృగ్దోషమ్ము తొలంగనిచ్చెనతడంతే! దాల్ప., గన్పట్టెడిన్
   ప్రాగ్దిగ్గ్రావమునందుఁ గ్రుంకె రవియున్ బ్రత్యూషకాలమ్మునన్.!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి


  3. ఆ దృగ్వైద్యవిద్వన్మణి ఈ పద్యమును దృగ్దోషణాపరిహారార్థపరీక్షాకార్యార్థమై వెంటనే కుడ్యమున ప్తతిష్టాపించు కొనునని జిలేబి ఆశ :)
   జిలేబి

   తొలగించండి

 3. ప్రాతః కాలపు సరదా పూరణ:

  ప్రాగ్దిగ్నందున జూచి దండ మిడుచున్ వైనమ్ముగా మ్రొక్కి నేన్
  ప్రాగ్దిగ్నందున దర్పణమ్ము నిడుచున్ పర్కించగా బింబమున్
  ప్రాగ్దిగ్గ్రావమునందుఁ గ్రుంకె రవియున్;...బ్రత్యూషకాలమ్మునన్
  వాగ్దేవిన్ భళి గొల్చి కష్ట పడుచున్ వాకాటి సాయమ్మునన్ 😊

  వాకాడు = మా నెల్లూరు జిల్లా గ్రామము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. మైలవరపు వారి దయ:

   ప్రాతః కాలపు సరదా పూరణ:

   ప్రాగ్దిగ్భాగము జూచి దండ మిడుచున్ వైనమ్ముగా మ్రొక్కి నేన్
   ప్రాగ్దిగ్భానుని దర్పణమ్మున గనన్ భాసించెనీరీతిగన్
   ప్రాగ్దిగ్గ్రావమునందుఁ గ్రుంకె రవియున్;...బ్రత్యూషకాలమ్మునన్
   వాగ్దేవిన్ భళి గొల్చి కష్ట పడితిన్ వాకాటి సాయమ్మునన్

   వాకాడు = మా నెల్లూరు జిల్లా గ్రామము

   తొలగించండి
  2. కంది సార్ సవరణ:

   ప్రాతః కాలపు సరదా పూరణ:

   ప్రాగ్దిగ్భాగము జూచి దండ మిడుచున్ వైనమ్ముగా మ్రొక్కి నేన్
   ప్రాగ్దిక్కున్ గన దర్పణమ్ము నిడుచున్ భావింపగా బింబమున్
   ప్రాగ్దిగ్గ్రావమునందుఁ గ్రుంకె రవియున్;...బ్రత్యూషకాలమ్మునన్
   వాగ్దేవిన్ భళి గొల్చి కష్ట పడుచున్ వాకాటి సాయమ్మునన్ 😊

   వాకాడు = మా నెల్లూరు జిల్లా గ్రామము

   తొలగించండి
  3. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
   నా సవరణ కంటే మైలవరపు వారి సవరణ ప్రశస్తంగా ఉన్నది.

   తొలగించండి
  4. ఇస్త్రీ సుంతయు నలుగని
   వస్త్రంబుల దాల్చి సభకు వచ్చెను కవితా
   మేస్త్రి సరదా ప్రభాకర
   శాస్త్రియె మొన్న కలిగించె సంతస మెంతో!

   (కవితా మేస్త్రి... దుష్టసమాసమే సుమా!)

   తొలగించండి
  5. ఇస్త్రీ సుంతయు నలుగని
   వస్త్రంబుల దాల్చి సభకు వచ్చెను సరదా
   మేస్త్రి కవితా ప్రభాకర
   శాస్త్రియె మొన్న కలిగించె సంతస మెంతో!

   ఇలా బాగుంటుందేమో.. దుష్టసమాసప్రయోగపరిహారోऽస్తు! 🙏

   తొలగించండి
 4. రిప్లయిలు
  1. పొద్దునె సమస్య పూరుతు
   యద్దరి నే పాలు గాచి కాఫీ వెతకన్
   ఇద్దరి పాలే పొంగెను
   ప్రాద్దిగ్గ్రావమున గ్రుంకె రవి యుదయమునన్

   తొలగించండి
  2. రామ్ గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని ప్రాస? అది 'ప్రాగ్దిగ్గ్రావము'.

   తొలగించండి
 5. సమస్య :-
  "ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్"

  *కందం**

  వాగ్దానముజేసిపలికె
  ప్రాగ్దిశ యరుణుడుదయించె పశ్చిమ క్రుంగెన్
  వాగ్దేవి కరుణ లేకన్
  ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్
  .................✍చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్రపాణి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "ప్రాగ్దిశ నరుణు డుదయించె బడమట గ్రుంకెన్... కరుణ లేకయె" అనండి.

   తొలగించండి
 6. ప్రాగ్దిగ్రావమునందుఁ బొద్దుబొడుచున్ బ్రాభాతతేజస్సులన్
  ప్రాగ్దిగ్దేశములందుఁ జల్లుచును ప్రారంభించఁ కృత్యమ్ము న
  ర్వాగ్దేశమ్ములు మున్గు సాంద్రనికరధ్వాంతమ్ములో, నెట్లహో
  ప్రాగ్దిగ్గ్రావమునందుఁ గ్రుంకె రవియున్ బ్రత్యూషకాలమ్మునన్?

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   మనోహరమూ, ప్రశస్తమూ అయిన పూరణ మీది. అభినందనలు.
   'అర్వాగ్దేశమ్ములు' అర్థం కాలేదు.

   తొలగించండి
  2. అర్వాక్ అంటే అంతకు ముందున్న అని అర్థం కదా

   తొలగించండి
 7. దిగ్దంత్యాభులు సత్కవీంద్రగణముల్ ధీశాలినౌ నాకిటన్
  వాగ్దర్పంబున సాటిరారనుచు గర్వంబున్ ప్రదర్శించు వి
  ష్వగ్దంభుం డొక డన్యదేశగతుడై పల్కెన్ దిశల్ పోల్చకన్
  ప్రాగ్దిగ్గ్రావమునందుఁ గ్రుంకె రవియున్ బ్రత్యూషకాలమ్మునన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'పోల్చక' కళ. "పోల్చకే" అనండి.

   తొలగించండి

 8. ... శంకరాభరణం...
  09/10/19 .బుధవారం

  సమస్య:

  ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్"

  నా పూరణ
  ***** ****

  వాగ్దేవి!యేమని జెపెద

  వాగ్దానము మరుచు వాడు వాగెనిటుల మా

  బాగ్దాద్ నగరంబున గన

  బ్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్

  ( ఏదో మమ అనిపించా....😂😂😂)

  🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
  🌷🌷 వనపర్తి 🌷🌷


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నా సవరణను సమూహంలో చూడండి.

   తొలగించండి
 9. భుగ్దివ్యామృత పానచిత్తుడయి సంపూజ్యంపు వంశంబులో
  దిగ్దేవస్తుత వర్తనుండగుచు పృధ్వీ మండబంబందునన్
  దృగ్దావానల భాసమాను డొకడున్ తీవ్రంబుగాఁగీల్పడన్
  ప్రాగ్దిగ్గ్రావమునందుఁ గ్రుంకె రవియున్ బ్రత్యూషకాలమ్మునన్

  రిప్లయితొలగించండి
 10. గురువు గారికి నమస్సులు.
  ముగ్ధయు కాంచెన్ కలలో
  బాగ్దాదు నగరమునన్ ప్రభాతంబు శుద్ధా
  దిగ్దేవి శపింప యంతట
  ప్రాగ్దిగ్రావమున గ్రుంకె రవి యుదయమునన్ .

  రిప్లయితొలగించండి
 11. ఈరోజు పాలు పొంగాల్సిందే

  దుగ్ధన్ వేగము తోడన్
  దోగ్ధిని మరిగించు కార్య ధోరణి యందున్
  ముగ్ధత నతిశయమవగా
  ప్రాగ్దిగ్గ్రావమున గ్రుంకె రవి యుదయమునన్

  ముగ్ధత .. alertlessness, stupidity, innocence

  రిప్లయితొలగించండి


 12. ప్రాగ్దిగ్గ్రావము పైన ధీరుడగు సైరా రెడ్డి కాలూనుచున్
  దిగ్దంతుల్ బెదురంగ దేశమునకై త్రిప్పంగ కత్తుల్ దమిన్
  ప్రాగ్దిగ్రాయలసీమ సింగమునరే రాకింప నాంగ్లేయులే
  ప్రాగ్దిగ్గ్రావమునందుఁ గ్రుంకె రవియున్ బ్రత్యూషకాలమ్మునన్!


  జై సై రా!
  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. బాగ్దాదుపట్టణంబున
  ప్రాగ్దిగ్గ్రావమునగ్రుంకెరవియుదయమునన్
  బ్రాగ్దిశకవివరుడగునా
  హెగ్దేవాయట్టులనియెయినుడున్ లేమిన్

  రిప్లయితొలగించండి
 14. (ఉదయమే జరిగిన ఇందిరమ్మ హత్యకు తల్లడిల్లిన
  సూర్యుడు ముందుకు సాగలేక వెనుకకు మరలినాడు )
  వాగ్దానమ్ముల నిల్పి నిల్చె ప్రజకున్
  వందారుమందారమై ;
  దిగ్దంతుల్ గొనియాడ " పాకు " సలిపెన్
  దేశద్వయమ్మట్టులన్ ;
  దగ్ధంబాయెగ నిందిరాహృదయమే
  తద్భృత్య రౌద్రాగ్నికిన్ ;
  బ్రాగ్దిగ్రావము నందు గ్రుంకె రవియున్
  బ్రత్యూషకాలమ్మునన్ .
  (వందారుమందారమై - నమస్కరింపదగిన కల్పవృక్షమై ;
  దేశద్వయమ్ము - రెండుదేశాలు పాకిస్థాన్ , బంగ్లాదేశ్ )

  రిప్లయితొలగించండి
 15. బాగ్దానామకపట్టణంబునగనన్బ్రాభాతవేళంబునన్
  బ్రాగ్దిగ్గ్రావమునందుగ్రుంకెరవియున్బ్రత్యూషకాలంబునన్
  బ్రాగ్దిగ్గ్రావపుకోనలందునదగన్భానుండుగన్పించలేకుండుట
  న్హెగ్దేవాయనెనిట్లుభాస్కరుడుదాబ్రాగ్దిక్కునన్ గ్రుంకెనో

  రిప్లయితొలగించండి
 16. దుగ్ధద కడ నేనొకపరి
  ముగ్ధుడనై కొట్టమందు దుగ్ధము పితుకన్
  దుగ్ధను బోవగ తంతే
  ప్రాగ్దిగ్గ్రావమున గ్రుంకె రవి యుదయమునన్

  దుగ్ధద .. పాడియావు
  దుగ్ధము .. పాలు
  దుగ్ధ .. బాధ , ఆవేశం

  రిప్లయితొలగించండి
 17. కం.
  ప్రాగ్దిశ నుదయించ నినుడు
  ముగ్ధత వెలుగుల నొసఁగుచు ముచ్చట గొల్పన్
  దుగ్ధన మేఘుడు గ్రమ్మగ
  ప్రాగ్ధిగ్రావమున గ్రుంకె రవి యుదయమునన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి


 18. జీపీయెస్ వారికి అంకితము :) హమారీ మొరం మొరం దీది :)


  ప్రాగ్దిక్కున దీది యరరె
  బాగ్దోగ్రా నగరమున సభన్ జరుపంగన్
  వాగ్దాన తుంపరలతో
  ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 👏👏👏

   శంకరాభరణం సమస్య - 1318

   "అక్కకు సాటి యొక్కొ యెవరైనను రూప విలాస సంపదన్"


   ముక్కుకు సూటిగా చనుచు మ్రొక్కెడి వారికి దేవదేవిగా
   గ్రక్కున దీవెనల్ నిడుచు గాభర లేకయె మోడిఁ దిట్టుచున్
   చక్కగ "దీది దీది" యన జానెడి మూతిని నవ్వుచుండు వం
   గక్కకు సాటి యొక్కొ యెవరైనను రూప విలాస సంపదన్?


   (కంది శంకరయ్య గారి సౌజన్యంతో)

   తొలగించండి
  2. జిలేబి గారూ,
   బాగున్నది.
   ****
   ప్రభాకర శాస్త్రి గారూ,
   బాగున్నది. 'దీవెనల్ + ఇడుచు = దీవెన లిడుచు' అవుతుంది. అక్కడ "చక్కగ నిచ్చి దీవెనల గాభర..." అనండి.

   తొలగించండి
 19. వాగ్దానము దప్పని యా
  వాగ్దేవీ వర ప్రసాది వసతిని వీడెన్
  దిగ్దేశం బేగె నహా
  ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్

  వాగ్దానము దప్పెను యా
  వాగ్దేవీ వర ప్రసాది వ్యర్ధుండంచున్
  వాగ్దండము లేల నహా
  ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్

  వాగ్దండము సైపని యా
  వాగ్దేవీ వర ప్రసాది వ్యగ్రత యందున్
  వాగ్దానము దప్పె నహా
  ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూడు పూరణలు బాగున్నవి.
   2వ పూరణలో '..దప్పెను + ఆ' అన్నపుడు యడాగమం రాదు. "వాగ్దానమ్మును దప్పెను । వాగ్దేవీ..." అందామా?

   తొలగించండి
  2. 🙏 తప్పకుండా

   వాగ్దానమ్మును దప్పెను
   వాగ్దేవీ వర ప్రసాది వ్యర్ధుండంచున్
   వాగ్దండము లేల నహా
   ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్

   తొలగించండి
 20. వైద్యుఁడు మిత్రుఁడు రవి మరణమును దెలుపు సందర్భము:

  వాగ్దీధితి సుజన సఖుఁడు
  రుగ్దమనుఁడు, చెప్పుటకుఁ బలుకులు తడఁబడన్
  దుగ్ద చెలగంగఁ బల్కెను
  బ్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్


  దృగ్దైన్యం బను కొంటి రేమొ యకటా దివ్యంబు నా దృష్టియే
  దుగ్దం జెందఁగ నేల నెల్లరును దాఁ దొల్లింటి యట్లే చుమీ
  వాగ్దోషం బనరాదు సాయముననే, భాసిల్లి దివ్యంబుగాఁ
  బ్రాగ్దిగ్గ్రావమునందుఁ, గ్రుంకె రవియున్, బ్రత్యూషకాలమ్మునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సెప్టెంబర్ 01, 2018 నాటి సదృశ సమస్యా పూరణములు:

   విశేష ప్రాస వికల్ప ప్రాస లక్ష్యముగా:

   మగ్నుండై పని యందు న
   భగ్నపు రీతి నిరతమ్ముఁ బన్నుగఁ దా ప్ర
   త్యఙ్నగము సేరి కదలుచుఁ
   బ్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్


   రుఙ్నయ నారవింద సఖ రోష విలుప్త ముఖుండు నా పయో
   ముఙ్నిచయచ్యుతానన విముక్త నిదాఘ సువిగ్రహుండు ఋ
   త్విఙ్నర నిత్యపూజితుఁడు వేగఁ జలించి రయోద్ధృతిన్ మహా
   ప్రాఙ్నగ శృంగభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
   మీకు జ్వరము తగ్గి స్వస్థత చేకూరినట్లు తలఁచెదను.

   తొలగించండి
 21. దిగ్దంతమౌ నగాసునఁ
  ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి, యుదయమునన్
  వాగ్దేవినిన్ స్తుతించుచు
  ప్రాగ్దిశనున్న దినకరుని ప్రతిమ ముగించెన్౹౹

  రిప్లయితొలగించండి
 22. దిగ్ద o తి యొకటి క ల లో
  బాగ్దాదు న గాంచె వింత బహు విధ భంగి న్
  వాగ్దేవి తోడు మరియును
  ప్రాగ్ది గ్రావ ము న గ్రుంకె రవి యుద య ము న న్

  రిప్లయితొలగించండి
 23. ఇదే భావనలో గతంలో ఇచ్చిన సమస్యకు అప్పటి నా పూరణ.

  దిఙ్నగబౌద్ధజైనమతదీవ్యదవైదికులన్ జయించగన్,
  ధిఙ్నుతకీర్తులై తలలు దించిరి వారలు, నట్లు జేసి యా
  వాఙ్నిధిశంకరుండు జిరు బ్రాయమునన్ దివికేగె, నక్కటా!
  ప్రాఙ్నగమందుఁ జూడఁగ విభాకరుఁడౌ రవి యస్తమించెరా

  రిప్లయితొలగించండి
 24. హిరణ్యాక్షుడి చేతిలో భూమి చుట్టబడగా దిక్కులకు పట్టిన గతి.

  దిగ్దంతులు తల్లడిలగ
  దుగ్ద గలిగి ధరణియేడ్వ దుర్మార్గు చెఱన్
  దుగ్దుగ దోచెను జనులకు
  ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్

  దుగ్ద-ఆందోళన; దుగ్దు-రూపము చెడిన

  రిప్లయితొలగించండి
 25. ప్రాగ్దిశ యందును భానుడు
  దిగ్దంతములకు సతతము దీప్తుల పంచన్
  వాగ్ధారతోడ కవియనె
  ప్రాగ్దిగ్రావనము గ్రుంకె రవి యుదయమునన్

  రిప్లయితొలగించండి
 26. ప్రాగ్దిగ్గ్రావమునందుఁ సూర్యు డుదయించున్ సాజమౌ జూడగా
  ప్రాగ్దిగ్గ్రావమునన్ బ్రభాతముననే భానుండగు న్నిత్యమున్
  ప్రాగ్దిగ్గ్రావము సుప్రభాతమును మిత్రాధారమై యుండ నే
  ప్రాగ్దిగ్గ్రావమునందుఁ గ్రుంకె రవియున్ బ్రత్యూషకాలమ్మునన్?

  రిప్లయితొలగించండి
 27. ముగ్ధ మనోహరి సుందరి
  స్నిగ్ధ వదనము గనినంత స్త్రీలోలుడు సం
  దిగ్దముతో పలికె నిటుల
  ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్.

  రిప్లయితొలగించండి
 28. బాగ్దాదందున పూజలందుకొనియెన్ వాగ్దేవి, యచ్చోటనే
  ప్రాగ్దిగ్గ్రావమునందుఁ గ్రుంకె రవియున్ బ్రత్యూషకాలమ్మునన్
  దుగ్దంబన్నను తాటికల్లనుచు, సంతోషమ్మనన్ బాధ, సం
  దిగ్దంబన్నను ముదమ్మటంచు పలికెన్ దిమ్మయ్య మూర్ఖంబుతో.

  రిప్లయితొలగించండి
 29. వాగ్దోషము కారణమో
  దృగ్దోషము కారణమ్మొ తెలియగ లేమా
  ముగ్ధాగ్రేసరు డనె నిటు
  ప్రాగ్దిగ్రావమున గ్రుంకె రవి యుదయమునన్

  రిప్లయితొలగించండి
 30. ముగ్ధత తోడన వెలసెను
  ప్రాగ్దిగ్గ్రావమునఁ ; గ్రుంకె రవి యుదయమునన్
  స్నిగ్ధపు మేఘము చాటున,
  దుగ్ధపడిరి మనుజులెల్ల తొంగలి లేకన్

  తొంగలి = కాంతి

  రిప్లయితొలగించండి
 31. ఈ నాటి శంకరాభరణము బ్లాగు వారి సమస్య

  ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్"

  ఇచ్చిన పాదము కందము నా పూరణ సీసములో

  పుష్య మాసం బొచ్చె,పొద్దు తక్కువ గదా పగటి పూట, పొలము పనులు కడకు
  వచ్చె, పెరటి లోన పుచ్చి కొక్కొరకో యని యరుచు చూనుండె , నిదుర లేచి
  వాకిళ్ళలో చల్ల వలయు కళ్ళాపిని, ముగ్గు లేయ వలయు ముదముగ, పత
  ముండు ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె , రవి యుదయమునన్"నగముల నడుమకు జేరి

  వెలుగు రేఖలు భువిపైన వెచ్చ దనము
  నిచ్చు చుండెగా, యిటులైన మెచ్చ బోరు
  మనల ననుచు నవ వధువు తనదు పతి క
  రమును వీడి నిదుర లేచె రయము గాను

  చలి కాలము ఎవరైనా త్వరగా నిదుర లేవరు కొత్త దంపతుల విషయము ఇక చెప్ప లేము నిదుర లేస్తున్న భార్యను భర్త చేయి పట్టి లాగి పడుకోమని గొడవ చేస్తుంటే ఒక ఇల్లాలు తన భర్తతో పలుకుట (చలికాలములో చంద్రుడు కొన్ని రోజులు తూర్పున కుంగుట సహజము )


  రిప్లయితొలగించండి
 32. అవధానులు శ్రీ నరాల రామారెడ్డి గారిని ఒక అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకుడడిగిన ప్రశ్న మరియు వారల జవాబు నన్వయిస్తూ...

  శార్దూలవిక్రీడితము

  ముగ్ధుండై భగినిన్ బతిన్ జెరనిడెన్ బుట్టంగ సంతానమున్
  దుగ్ధన్ జంపెనె! యేల జంట మునుపే దూరమ్ము నుంచండు? సం
  దిగ్ధమ్మంచును బృచ్ఛకుండడుగఁ దా నీయంత క్రూరుండె? నీ
  దృగ్దోషంపు మహత్యమేమొ మరి నేతిన్నంగ నేడున్ గనన్
  బ్రాగ్దిగ్రావము నందుఁ గ్రుంకె రవియున్ బ్రత్యూషకాలమ్మునన్

  (ముగ్ధుండై= మూర్ఖుడై)

  రిప్లయితొలగించండి
 33. కందం
  దృగ్దోషముఁ గలుఁగుచు సం
  దిగ్ధమ్ముగ నాది లోనె దించుచు పనులన్
  దుగ్ధన్ జీవించు ప్రజకు
  ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్

  రిప్లయితొలగించండి