14, అక్టోబర్ 2019, సోమవారం

సమస్య - 3162 (తనయుని తల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తనయుని తల నరికినట్టి తల్లికి జేజే"
(లేదా...)
"తనయునిదౌ తలన్ నరుకు తల్లికి వందన మాచరించెదన్"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

36 కామెంట్‌లు:

 1. నిన్నటి పూరణ.

  రంగమదేదియైన సమరాంగణమట్లుగ చర్చ సాగఁ దీ
  రం గన నెంచి భార్యకెదురాడక యోర్పు వహించె, నప్పుడా
  యంగనయే జయించితి నటంచు ముదమ్మునఁ గోర్కెఁ దీర్చఁ ద
  ద్రంగము నందు నోడి యొక రాణిని గెల్చెఁ గవీంద్రుఁ డొక్కఁడున్.

  రిప్లయితొలగించండి

 2. ప్రాతః కాలపు సరదా పూరణ:

  వనమున జేరి పూవులను వందలు వేలను కోయుచుండగా
  ధనధన మంచు మేఘములు ధారల వానలు మొత్తుచుండగా
  కనుగొన లేక దారినిక కాంగ్రెసు నేతగ టోపి బెట్టుచున్
  తనయునిదౌ తలన్ నరుకు తల్లికి వందన మాచరించెదన్

  రిప్లయితొలగించండి
 3. పెనకువకై పతితో జని
  దనుజుని నరకాసురుడను ధైర్యముతో తా
  దునుమాడిన భూదేవిని
  తనయుని తల నరికినట్టి తల్లికి జేజే

  రిప్లయితొలగించండి


 4. అనఘా పాపియె నరకుడు
  తన సమయము రాగ చెరచ తరుణుల బట్టన్
  తన విధిగ సత్య భామయె
  తనయుని తల నరికినట్టి తల్లికి జేజే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. కం॥
  తన పుత్రుడు సోమరిగ వ్య
  సనలోలుండై తిరుగగ చంపెను తలలో
  గుణమును ప్రాణము తీయక
  తనయుని తలనరికి నట్టి తల్లికి జెేజే

  రిప్లయితొలగించండి
 6. తనతనయుడె మద్యముగొని
  కనుగాననికామమతని కన్నులుగప్ప
  న్ననలజ్వాలలుకనలన్
  తనయుని తల నరికినట్టి తల్లికి జేజే"

  రిప్లయితొలగించండి
 7. వినయము దప్పిచరించగ
  అనునిత్యముభూసురులను అంతము జేయన్
  మనసున దలచెడి రాక్షస
  తనయుని తల నరికినట్టి తల్లికి జేజే!!

  రిప్లయితొలగించండి


 8. అనవరతమ్ము గా కొమరు డాతని నెమ్మిని కాచె తల్లియై
  మునుగడ; దుష్టుడై కొమరు ముష్కరుడై భువి లోన నెక్కొనన్
  వినయత వీడగా నతని పీడను తీర్చగ కట్టిపెట్టుచున్
  తనయునిదౌ తలన్ నరుకు తల్లికి వందన మాచరించెదన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. మైలవరపు వారి పూరణ

  నమో దుర్గాయై 🙏

  తనయుని దుష్టవర్తననితాంతనిపీడితసాధువర్గసం...
  జనితదురంతపాపిని నిశాతసముజ్జ్వలితత్రిశూలఘా...
  త నిపతితున్ బొనర్చె మహి ధర్మము నిల్పగ మాహిషాసురున్!
  తనయునిదౌ తలన్ నరుకు తల్లికి వందన మాచరించెదన్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 10. అనయము మద్యముంగొనుచునారడిబెట్టుచు నెల్లవారలన్
  తనయుడు మత్తులోమునిగి తల్లడమందగ జేయుచున్  సదా
  కనులకుకప్పు కామమున కన్యలమానము దోచునట్టియా
  తనయునిదౌ తలన్ నరుకు తల్లికి వందన మాచరించెదన్

  రిప్లయితొలగించండి


 11. అణకువ లేక జిలేబీ
  తన తలిదండ్రులకు మేలు తలపెట్టక మూ
  తిని త్రిప్పెడు పాంసనుడగు
  తనయు, "నితల" నరికినట్టి తల్లికి జేజే!

  నితల- అధోభాగము - అధోప్రవర్తన అన్న అర్థములో  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. జననిని మించు దైవము విశాలజగత్తున నుండదైననున్
  తనదు సుతుండుఁ గ్రూరుఁ గని తల్లియె దున్మును సత్యభామయై
  యనయము వీర్యగర్వితుడునై జనకంటకపాపకర్ముడౌ
  తనయునిదౌ తలన్ నరుకు తల్లికి వందన మాచరించెదన్.

  రిప్లయితొలగించండి

 13. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  Metaphorical (not literal)

  కనుగొని బీద వర్గముల కాసిని గూడులు కోపమొందుచున్
  పనియును పాట లేకయిక పంతము మీరగ కూల్చివేయుచున్
  జనముల వీక కోయుటను చక్కగ చూచుచు నవ్వుచుండు నా
  తనయునిదౌ తలన్ నరుకు తల్లికి వందన మాచరించెదన్

  రిప్లయితొలగించండి
 14. అనయము దురిత పు పనులను
  మును కొని యొన రించు దైత్యు మూర్ఖుని నరకు న్
  సునిశిత ఖ డ్గ ము గైకొని
  తనయుని తల నరికి నట్టి తల్లి కి జేజే

  రిప్లయితొలగించండి
 15. అనయము దుండగములతో
  జనులను బాధించునట్టి సకటుడు వానిన్
  కనికరమేమియు జూపక
  తనయుని తల నరికినట్టి తల్లికి జేజే

  రిప్లయితొలగించండి
 16. జనులకు మరణము తేవగ
  తన తనువుకు చావునీయ తపమొనరెడి యా
  మనుజుని గని రోదించగ
  తనయుని తల నరికినట్టితల్లికి జేజే

  కసాబ్ లాంటి వారిని దృష్టిలో నుంచుకొని రాసినది 🙏🙏

  రిప్లయితొలగించండి


 17. మన విదురులు మూర్ఖులరరె
  తనయుని తల నరికినట్టి తల్లికి జేజే
  యని పల్కుదురు వినకు వా
  రిని నమ్మకుమా జిలేబి రింఛోళినహో


  జిలేబి

  రిప్లయితొలగించండి
 18. కనివిని యెరుగని రీతిన
  మన పురమున మంగలులకు మనుగడ లేమిన్
  పెనుపగు యక్కర చేతను
  తనయుని తల నరికినట్టి తల్లికి జేజే

  రిప్లయితొలగించండి
 19. వినగను ఛీయనిపించెను
  తనయునితలనరికినట్టితల్లికిజేజే
  యనుచున్నీయగపాదము
  తనయునితలనరుకునట్టితల్లులుగలరే?

  రిప్లయితొలగించండి
 20. (అతిథులుగా విచ్చేసిన మాయాశివయోగి దంపతుల కోరి కపై పుత్రుడు సిరియాలుని వండి వడ్డించటానికి సిద్ధమైన చిరుతొండనంబి దంపతులు - శ్రీనాథుని హరవిలాసం )

  అనయము పార్వతీపతి ప
  దాబ్జములన్ దమ మానసమ్ములన్
  గని చిరుతొండడున్ సతియు
  కన్నకుమారుడు సేవజేతురే !
  ఘనమగు పుత్రభోజనము
  కాలగళుండదె కోరినంతనే
  తనయునిదౌ తలన్ నరుకు
  తల్లికి వందన మాచరించెదన్ .  రిప్లయితొలగించండి
 21. మునునరకాసురుడిచ్చట
  జనులనుబాధించినాడుచారముతోడన్,
  రణమున నాధుడుమూర్చిల
  తనయుని తలనరికినట్టితల్లికిజేజే
  కొరుప్రోలు రాధాకృష్ణారావు  రిప్లయితొలగించండి
 22. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  తనయుని తల నరికినట్టి తల్లికి జేజే

  సందర్భము: అర్హులకు ఐహికం గాని ఆముష్మికం గాని ఇవ్వడానికైనా ఇచ్చిన దాన్ని తీసుకోవడానికైనా ఆ తల్లికే (జగన్మాతకే) తగును.
  దైవ కరుణయే ఆ తల్లి. ఆ తల్లి కొడుకే ఇక్కడ ఇహము. (అనగా తల్లి ఇచ్చిందే ఇహము.)
  ఆమె.. తర్వాత పరమును కూడా యీయవలసి వున్నది.
  ఎప్పు డిస్తుంది అంటే ఇహమునందు విరక్తి (వైరాగ్యం) కలిగినాక..(పరముయొక్క విలువ తెలిసే దప్పుడే సుమా!)
  ఐహిక సుఖానుభవ వేళలోనే నిత్యానిత్య విచారంవల్ల విరక్తి కలిగితే ఆ ఐహికం అతనిని బంధించజాలదు. కాబట్టి దాన్ని అలాగే వుంచి పరమును ఇస్తుంది (అనుగ్రహిస్తుంది) ఆ తల్లి.
  ఒకవేళ ఐహిక సుఖాలలో విరక్తి ఎంతకూ కలుగకపోతే చూసి చూసి ఒక్కసారి ఐహికాన్ని మొత్తం బలవంతంగా తీసేసుకుంటుంది. అప్పుడైనా విరక్తి కలుగుతుంది కదా!..అని..
  (ఎప్పటికైనా విరక్తి కలుగడమే ముఖ్యం)
  అందుకని 'అటనట' (అక్కడక్కడ తీసేసుకుంటుంది.) అన్నాను.
  ఇక అప్పుడు విరక్తి కలిగింది కదా అని పరమును అనుగ్రహిస్తుంది.
  ఎటొచ్చీ పరమును ఈయటంకోసమే ఇహమును తిరిగి తీసుకుంటుంది అని..
  ఆ విధంగా తనయు డనే ఐహికాన్ని తుదముట్టించే దైవకరుణ అనే తల్లికి (జగదీశ్వరికి) జోహారు.. అని పద్యభావం.
  పిల్లికూన ప్రమేయం లేకుండానే దాన్ని నోట్లో కరచుకొని గెంతుతూ సురక్షిత స్థానానికి చేరుస్తుంది తల్లిపిల్లి. అలా దైవాన్ని శరణు చెందటం మార్జాల కిశోర న్యాయ మంటారు. దాన్ని అనుసరించే వాని స్థితి కింది విధంగా వుంటుంది.
  తల్లి పిల్లవానికి బొమ్మలను కొని యిస్తుంది ప్రేమతో.. వాడు ఆకలి మరచిపోయి బొమ్మలాటల్లోనే అస్తమానం గడుపుతూ వుంటే తల్లి రెండు మూడు సార్లు పిలుస్తుంది. ఎంతకూ రాకుంటే చెంప చెళ్ళు మనిపించి బొమ్మల్ని చిందరవందర చేసి లాక్కెళ్ళిపోయి అన్నం తినిపిస్తుంది.
  నిజమే! వాడి ఆకలి ఏదో వాడికే తెలియదు కదా!
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  జనని యగును దైవ కరుణ..
  తనయు డగు నిహము.. విరక్తి
  దనరఁ బర మొసం
  గ నిహము గైకొను నటనట..
  తనయుని తల నరికినట్టి తల్లికి జేజే

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  14.10.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 23. నేటి శంకరాభరణము సమస్య
  (తనయుని తలనరికినట్టి తల్లికి జేజే)

  ఇచ్చిన సమస్య కంద పద్య పాదము నా పూరణము సీసములో

  సత్యభామ నరకాసురుని జంపిన తరవాత ప్రజలను ఉద్దేశించి గ్రామములో ముఖ్యులు పలుకు మాటలు


  దండయాత్రల్జేసి దాక్షిణ్య మేలేక పదునారు వేలశు భాంగనలను
  పట్టి బంధించిన ప్రామిడీ నరకాసురుండుగా, జచ్చెను భండనమున
  యదువంశ తిలకు ప్రోయాలు సాత్రాజితి చేతిలో,యాదవ జాతి పలుక
  రే తనయుని తల నరికినట్టి తల్లికి జేజే లు జనులార ,చేటు తొలగె  యెల్లలోకమునకు నేడు, పల్లెలెల్ల
  జరుపు కొనగవలయురేపు సవురు నిచ్చు
  పండు గైన దీపావళి భక్తి తోడ
  ననుచు బలికె ప్రముఖులెల్ల జనత గాంచి

  ప్రామిడి =క్రూరుడు ప్రోయాలు = భార్య సవురు = కాంతి
  రిప్లయితొలగించండి
 24. కని విని యెఱుఁగని రీతిం
  దన పతి వైద్యార్థ మకట తల్లడపడుచున్
  ధనమున కిడి తాకట్టుం
  దనయుని తల నరికి నట్టి తల్లికి జేజే

  [తలను +అరికిన్ =అట్టి = తల నరికి నట్టి]


  కనుఁగొన నొక్క కూరయినఁ గానక యింటను జింత సేయఁగా
  మనమునఁ దట్ట గొప్ప దగు మంత్రము మోదిలి శీఘ్ర మేఁగి తా
  మునుకొని దూటకై పెరట మూరిన పండిన సప్తపత్రపుం,
  దనయునిదౌ, తలన్ నరుకు తల్లికి వందన మాచరించెదన్

  [తనయునిదౌ సప్త పత్రపు : తనయుఁడు వేసి నట్టి అరఁటి చెట్టుది]

  రిప్లయితొలగించండి
 25. అనయముహింసబెట్టుచునుహర్షముతోడనుసంచరించునా
  తనయునిదౌతలన్నరుకుతల్లికివందనమాచరించెదన్
  వినుమురహింసజేయుటనుభీకరమైనదిగాదె నేర్వుమా
  కనుకనెయమ్మచంపెసుతుగ్రౌర్యముజెందుచునాక్షణంబునన్

  రిప్లయితొలగించండి
 26. కం. పనిమాలినకొడుకుయొకడు
  తనదేశమునందెబాంబుతప్పుగ బెట్టన్
  తనకొద్దీకొడుకుయనుచు
  తనయుని తల నరికినట్టి తల్లికి జేజే.

  రిప్లయితొలగించండి
 27. నెనరది లేనివాడు, పరనిందలు జేయుచు పానశౌరుడై
  యనయము జూదమాడు, వెలయాలుల గూడుచు వావివర్తనే
  కనుమరుగై చరించు, కులకాంతలఁ బట్టి బజారిగ మార్చెడిన్
  తనయునిదౌ తలన్ నరుకు తల్లికి వందన మాచరించెదన్

  రిప్లయితొలగించండి
 28. 🙏నమస్కారములు.
  భరతుని వంటి పరాక్రమవంతులు కాలేదని,భరతుని మువ్వురు భార్యలు తమ పుత్రుల తలలునరికిరని పోతన భాగవతంలోనుంది.

  తన భర్త భరతు జేతన్
  తనకును బుట్టిన కొమరుడు తా నసమర్థుం
  డనిదేల భండనమ్మున
  తనయుని తల నరికినట్టి తల్లికి జేజే.

  గర్భశోక మేతల్లికీ రాకుండుగాక 🙏

  రిప్లయితొలగించండి
 29. పెనుకువ లోన కృష్ణుడట భీకర పోరును సల్పి మూర్చిలన్
  వనితయె పట్టి కార్ముకము భండన మందున వీవనారియై
  దనుజుని సంహరించినది ధాత్రి సుతుండను సత్యభామయే
  తనయునిదౌ తలన్ నరుకు తల్లికి వందన మాచరించెదన్

  రిప్లయితొలగించండి
 30. తన రక్తము పంచు కొనిన
  తనయుడె కాని పనిచేసి దారుణ రీతిన్
  వనితల మానము దోచగ
  తనయుని తల నరికి నట్టి తల్లికి జేజే

  రిప్లయితొలగించండి
 31. అనయమ్మును మధువుఁ గొనుచు
  వినయము విడి పరులతోడ పెనగుచు మనుచున్
  తన తలిదండ్రుల నఱుము
  తనయుని తల నరికినట్టి తల్లికి జేజే

  రిప్లయితొలగించండి
 32. ఈ వారం ఆకాశవాణి సమస్య దయచేసి తెలుపగలరు

  రిప్లయితొలగించండి
 33. చంపకమాల
  వినఁగ భరించ రానిదిగ వేదనఁ గూర్చెడు మాటకాదె? భూ
  మిని సుతుఁ బొందు కంటెఁ గని మెచ్చగ వానిని లోకమంతయున్
  దనరరె తల్లిదండ్రులు, విదారక మానస పాపకృత్యుడౌ
  తనయునిదౌ తలన్ నరుకు తల్లికి వందన మాచరించెదన్

  రిప్లయితొలగించండి
 34. కందం
  కనగూడని సుతుఁ గంటిని
  వినగూడని పనులఁ జేసి వేదన పెంచెన్
  మనగూడదు భువి వీడని
  తనయుని తల నరికినట్టి తల్లికి జేజే!

  రిప్లయితొలగించండి