23, అక్టోబర్ 2019, బుధవారం

దత్తపది - 162 (నేల-మన్ను-పుడమి-మట్టి)

కవిమిత్రులారా,
'నేల - మన్ను - పుడమి - మట్టి'
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి. 

31 కామెంట్‌లు:

  1. బృహన్నల ఉత్తరకుమారునితో.....

    బీరు పడ'నేల' యుత్తరా! వీరుఁడవని
    నిన్నుఁ గాంతలెల్లరు గరి'మన్ను'తింప
    ని'పుడ మి'తిలేని భీతి నీ వేగఁ దగునె?
    వీరులము గాన మే'మట్టి' దారిఁ జనము.

    రిప్లయితొలగించండి

  2. పుడ- ఆనందించుట
    కడమ- ఆఖరి

    ధృతరాష్ట్రుడు ఆఖరి ఘట్టము లో

    పుడ మిక్కుటముగ కొండా
    డడాండ డడడాం డమన్ను డమరమ్ములతో
    కడమట్టియు లేకన్ భీ
    ముడడచ నేల! నడచెద ప్రముదితుడినింకన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    విపులముగా వచించితివి ! వింటిని , చింతిలనేల ? చంపెద..
    న్గపటిని గాంచుమన్నుడుల నమ్మిన ద్రోవది మోము దమ్మిపై
    నపుడమితమ్ముగా విరిసె హాసము ! చంపెను నాట్యశాలలో
    కృప యిసుమంతలేక ఖలు కీచకు., భీముని ధైర్యమట్టిదే.!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా, మనోహరంగా ఉన్నది.

      తొలగించండి

    2. తక్షకుడు సర్పయాగసందర్భమున ఇంద్రుని శరణు గోరుట..

      పడగల విప్పనైతినిక పాకుటఁ జెప్పగనేల ? దొర్లుచున్
      వడి నిను జేరియుంటినిదె వాసవ ! మన్నుతులయ్య ! పిల్చిన...
      ప్పుడమితభీతి గల్గె స్వరపూతభుజంగమహాధ్వరమ్మునం...,
      దడరుచునుంటి ! యజ్ఞభయమట్టిదనెన్ గన తక్షకుండటన్.!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

  4. అర్జునా! దేహముల నేల నంత మమత?
    మన్నునే యవి నిత్యమై మహిని? జంప
    కున్న నీ విపుడ మిగిలి యుండు వారు
    లే రిలను వీడు మట్టి వారి యెడ ప్రేమ.

    రిప్లయితొలగించండి
  5. కృష్ణ రాయబార సన్నివేశం. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో..

    పాండు సుతులకు సగమివ్వ వగవనేల
    తమను ప్రేమన్నుతింపుచు దలతురెపుడు
    గాన విను మిపుడమితమౌ ఖ్యాతి గాంచ
    దలపు మట్టి ఘోరరణంబు తగదు మీకు


    రిప్లయితొలగించండి
  6. (శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్లి ధృతరాష్ట్రునికి వినిపించిన
    ధర్మరాజు పలుకులు )
    దూరముంపగ మమునేల ? ధీరవర్య !
    మన్నుతుల నాలకింపవె ? మాన్యచరిత !
    చూపు డమితవత్సలతను ; సుతులమయ్య !
    పెంచుకొను మట్టిప్రేమను పెద్దతండ్రి !

    రిప్లయితొలగించండి
  7. నేలంటు బాయని బాలుని నొక్కని
    .... నందరు నొక్కటై యడచ లేదె
    మన్నుచేయుదునని మహిని పాండవులను
    .... జాల మారులు తెగ ప్రేల లేదె
    పుడమికాపరి ముందు తొడవు లూడ్చెడి వేళ
    .... పరిహసించవొకొ ద్రౌపదిని జూచి
    మట్టికరచు వేళ మరపు కల్గిన వేమి
    .... సిగ్గుమాలిన పనుల్ చిత్ర మాయె

    నాగు విడువకు బాణము నర్జున యని
    యేల వేడెదవు పరువు మాలి కర్ణ?
    జాలి వలదు ధనంజయ కోల నేయు
    మంగరాజు ననియె గృష్ణు డాగ్రహించి.

    రిప్లయితొలగించండి

  8. నా పూరణ. తే.గీ.
    **** *** ***

    ......కీచకుడు ద్రౌపదితో ....

    నిజము!!మనమన్నుకొనె గద నిన్ను గనుచు

    నపుడమితపు ప్రేమ గలిగె నంగన; మన

    వి విను మట్టిటపడుటేల?విరులలోన

    పెట్టి చూచెద ;నిన్నేల వీడెదనిక


    ( అన్నుకొను.....పరవశమగు
    అట్టిటపడు....కలతపడు. )


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  9. సంశయ పడగ నేల కొ సవ్య సాచి
    యిపుడ మితి లేని దుఃఖ మ దే ల నోయి
    బంధు బల గ మట్టి తెగువ బ వ ర మందు
    చూప నీ మ ము న్ను డు వు ట చోద్య మ వ దె

    రిప్లయితొలగించండి
  10. రాయబారమునకు రాబోవు పాండవుల ప్రతినిధి శ్రీకృష్ణునుద్దేశించి దుర్యోధనుడు పలికిన పలుకులు.


    రాయ బారము కునునేల రాక నేడు?
    వినుము! యిపుడమితంబాయె వీరి మదము!
    వారి కేమట్టి గర్వంబొ? వదల నేను
    మన్నురేడును! విడువను! మనకె శుభము!

    మన్నుఱేఁడు : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) - రాజు, భూపతి.

    రిప్లయితొలగించండి
  11. చిన్నచూపుగ మమునేల జేయుటేమి
    యాలకించియుమన్నుతుల నందరెదుట
    బేర్మిజూపుడమితముగ బెద్దనాన్న!
    పెంచుకొనుమట్టికీర్తినిబెద్ద కతన

    రిప్లయితొలగించండి
  12. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    దత్తపది
    *'నేల - మన్ను - పుడమి - మట్టి'*
    పై పదాలను అన్యార్థంలో..
    భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో పద్యం

    సందర్భము:
    ఉత్తరుడు బృహన్నలతో..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఈవు నాదు సారథివి కా నేల? సురథి
    కుడను నేఁ.. బారిపోదమ న్నుడిని వినిన
    యపుడ మిగులు నూకలు భూమి
    యందు మనకు..
    నరయవే నేటి పరమార్థ మట్టిదె సుమ!

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    23.10.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  13. విరాటుని కొలువులో చేరబోవుముందు అర్జునుడు బృహన్నల అవతారము తో ఉంటూ కించిత్ బాధ తో ఉంటాడు అలవాటు ప్రకారము ఊర్ధ్వపుండ్రము పెట్ట బోతాడు అప్పుడు ద్రౌపది అతని చూచి ఈ రూపములో చాలా చక్కగా ఉన్నావు ఊర్ధ్వపుండ్రము పెట్ట కూడదు కాలి వేళ్ళకు మెట్టెలు పెట్టవలేను అని పలుకు తుంది అను భావన

    పట్టె తిరు(మన్ను) ముఖమున పెట్ట వలదు
    (మట్టి)యలు కాలి వేళ్ళకు పెట్టు మయ్య
    ఇ(పుడమి)త సుందరమగు నడపొడ గలిగె
    తల్లడిల్ల (నేల) ననుచు ద్రౌపది యనె
    పట్టె తిరుమన్ను = ఊర్ధ్వపుండ్రము
    మట్టియ = కాలి

    రిప్లయితొలగించండి
  14. సువనే లసత్కుసుమ నిభ
    వివృతాక్ష! నమన్నుత! నిను విన్న యపుడ మి
    శ్ర విమల హాస ముఖమ్మ
    ట్టి విశ్వ వంద్యా మురారి ఠేవం గొల్తున్

    రిప్లయితొలగించండి

  15. కందివారికి

    విన్నపాలు వినవలె :)


    జిలేబి జాంగ్రి , రస్మలాయ్( ఇది జీపీయెస్ వారిది :) , మరొక్కటి మీకిష్టమైన స్వీటు తో ఒక దత్తపది ఇవ్వవలె :)


    ఇట్లు

    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. *కీచకుడు మదోన్మత్తుడై ద్రౌపదితో పలికిన మాటలు*


    నిన్నేలను వదులు కొనెద
    మన్నుల, యిపుడమిత కాంక్ష యందడిగితిమే
    నిన్నిక మందిర మట్టి యె
    దన్నిలుపెదనో లతాంగి దయజూపుమికన్.

    రిప్లయితొలగించండి
  17. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    దత్తపది
    *'నేల - మన్ను - పుడమి - మట్టి'*
    పై పదాలను అన్యార్థంలో..
    భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో పద్యం

    సందర్భము: పాండవులు వనవాసంలో కామ్యక వనంలో వున్నప్పడు ద్రౌపదిని అపహరించుకొనిపోతున్న జయద్రథుని తల గొరిగి ఐదు శిఖలు పెట్టి పరాభవించి వదలివేశారు. (అతడు ధృతరాష్ట్రుని కూతురైన దుశ్శల భర్త కావటంచేత ధర్మరాజు చంపనీయలేదు.)
    ద్రౌపదిని విడిపించుకొని వచ్చిన తరువాత ధర్మరాజు మునుల నడుమ కూర్చొని మార్కండేయు డనే దేవర్షిని నాలాగా కష్టపడ్డ దురదృష్టవంతు లెవరైనా వున్నారా! అంటే ఆయన రామచంద్రుని వృత్తాంతాన్ని వివరించి ఓదార్చినాడు.
    చూ. మహాభారతం..ఆరణ్య (వన) పర్వం.
    6 వ ఆశ్వాసం (267-411),
    7 వ ఆశ్వాసం (1- 169) ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    అరయ ధర్మజు డిట్టు లడిగె మార్కండేయు
    "నిన్ని కష్టాలు రా నేల మాకు?
    నెన్నడే నెవరైన మన్నుదురే యిట్టు?"
    లనిన నా దేవర్షి యతని కనియె..
    "ధర రాము డపు డమితములైన కష్టాల
    పా లాయెఁ, దండ్రిఁ గోల్పడియె, భ్రాత
    లను బాసె, వనవాసమున కేగె, నపహృత
    యయ్యె సీతమ..చూడ మట్టి ఘనునిఁ
    గందమూలాలఁ దినుచునే గడిపినాడు..
    కడకు రావణు, లోకభీకరు వధించె..
    బాగుపడెఁ దాను.. లోకమున్ బాగుపరచె
    నట్టి శ్రీ రాముఁ దలపుమా! ఆర్య పుత్ర!"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    23.10.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  18. రాయబారమంచు రప్పింపగా(నేల)
    సత్య(మన్ను)డువ నశాంతి యేల
    మిడిసిపడుచు న(పుడమి)త తామసగుణులు
    పాప(మట్టి) పనుల బరగుటేల

    (సత్యమన్నుడువ = సత్యమని + నుడువ అనే భావములో)

    రిప్లయితొలగించండి
  19. సూదిమొన మోపినంత భూమిని కూడ నీయమనిన కౌరవ సభలో శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో ...

    తే॥గీ॥
    కౌరవ నృ 'పుడ,మి'మ్మునతిగ గౌరవించు
    భ్రాతసుతుల 'నేల' చులకబరచు రీతి
    నెరపు చుండిరి? తా'మట్టి'నిర్ణ యమును
    తెలుప పురజనులు త'మన్ను'తింపరుగద

    రిప్లయితొలగించండి

  20. డాక్టర్ గుఱ్ఱం సీతాదేవి గారి పూరణలు:

    నేటిది:

    స్త్రీల చెరబట్టనేలర సింహబలుడ?
    విడువుమట్టి యాలోచన వేగపడక!
    ఎప్పుడమిత కామనునది ముప్పుదెచ్చు
    మన్నుతుల వినుమోయి నీ మనుగడకును

    ******************************

    నిన్నటిది:

    ఘోరాఘములను దీర్చును
    శ్రీరామ కథామృతంబు, చింతల గూర్చున్
    తారకరాముని మరచిన
    పేరాసల జీవనంబు పెక్కగురీతుల్

    రిప్లయితొలగించండి
  21. పార్వతిని తలచు రుక్మిణి:
    అనయ మ *మ్మన్ను* తించుచు మనుచు నుంటి
    చండి న *న్నేల* పరికించు చుండె? ని *ప్పు
    డమి* త మగునా వ్యథను కనుమమ్మ! కావు
    *మట్టి* దయ జూపుచు, హరిఁ జేపట్ట గాను

    రిప్లయితొలగించండి
  22. తేటగీతి
    అనిన బంధులు గురులంచు బెణఁక నేల?
    విజయ! ప్రేమన్నుడువ గీత విశదపడుచు
    నిపుడమిత శ్రద్ధఁ గర్తవ్య మేమొ తెలియు
    మట్టి విధమెంచు తెగడకు చిట్ట చివర


    రిప్లయితొలగించండి
  23. *బృహన్నల యుత్తరునితో పలికిన మాటలు*


    వినుమ! మేమన్నులకు నృత్య విద్యనేర్పు
    వార మట్టి సంగరమందు పోర గలమె?
    యపుడమితబీరముల్ పల్కి యరుల గాంచి
    భీతిలగ నేల యువరాజ బేలవవకు.

    రిప్లయితొలగించండి
  24. మీరు అన్ని పద్యాలు చూసి గుణదోషాలు చెప్పకపోతే.. విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించి జవాబుల పేపర్లు దిద్దకుండా ఉన్న విధంగా ఉంటుంది. ఆసక్తి సన్నగిల్లుతుంది. దయచేసి రోజులో ఎంతో కొంత సమయం కేటాయించండి.

    రిప్లయితొలగించండి