2, నవంబర్ 2019, శనివారం

సమస్య - 3180 (కలువలు కత్తులయ్యెడిని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలువ కత్తి దండ కార్ముకమ్ము"
(లేదా...)
"కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

79 కామెంట్‌లు:

  1. మైలవరపు వారి పూరణ:

    అల నరకున్ వధించు సమయమ్మున సత్య రణాంగణమ్మునన్
    విలయవిజృంభితాంతకవివృద్ధమహాకృతియై రహింపగా
    నలకలు కాలనాగులయె, హాసము వహ్నియనంగ , కన్నులన్
    గలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్ !

    (విరిదండలు కార్ముకములయ్యెనని అన్వయం)

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి

  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    తెలివియె లేని బాపడట తెల్లని కల్వల దాచిపెట్టుచున్
    తెలివిగ కార్ముకమ్ములను తీయుచు గొయ్యిని పాతిపెట్టగా
    నలువురు చోరులాదటను నవ్వుచు బాపని మోసగించగా
    కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  3. విరహమందు కాగు పురుషున కగుగదా
    కలువ కత్తి, దండ కార్ముకమ్ము
    ముగ్ద చెంతజేరి ముద్దులాడెడి వేళ
    మండు భాను డైన మంచు వేల్పు.

    రిప్లయితొలగించండి
  4. విరించి

    వలదని చెప్పినన్ వినక పావను డైన హరిన్ స్మరింపగా

    నలకను బూనినట్టి దనుజాధము డెంతటి శిక్షవేసినన్

    ఫలితము శూన్యమయ్యె, భగవంతుని లీలలనంతమే కదా

    కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరి దండలయ్యెడిన్.

    రిప్లయితొలగించండి
  5. ( మహిళారాజ్య మహారాణి ప్రమీల యుద్ధసన్నద్ధురాలై అర్జునునితో )
    అలుకను బూనినాము పురు
    షాధములందరి మీద నర్జునా !
    అలికులవేణులందర న
    గాధములోనికి నెట్టినారలే ?
    మెలకువనందినార ; మిక
    మిన్నక నుండుట కల్ల ; చూడు ; మా
    కలువలు కత్తులయ్యెడిని ;
    కార్ముకముల్ విరిదండలయ్యెడిన్ .

    రిప్లయితొలగించండి

  6. పూరించుడీ అంటే పూరించుడీ అని‌ తిరిగి అంటే యెట్లా :)


    భార తార్థ మందు భవ్యపు పూరణ
    చేయుడి కవులార శ్రేష్ట మైన
    పద్యమలర! దత్తపది వరుసగనుడు
    కలువ, కత్తి, దండ, కార్ముకమ్ము!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      అద్భుతమైన పూరణ. అభినందనలు.
      ...... సరే! ఏదీ ఆ దత్తపదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో ఒక పద్యం చెప్పండి.

      తొలగించండి


  7. మొలకల చెర్వు వూరుని సమున్నతి యెన్ జివొ డ్వాక్ర స్కీముతో
    నెలతుక లెల్ల శ్రేష్టముగ నేర్వగ నల్లిక తట్ట బుట్టలన్
    కలపనసేయ నార్థికత గాంచిరి పెక్కువ మీర! చూడగా
    కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వూరు' తెలుగులో వు,వూ,వొ,వో లతో మొదలయ్యే పదాలు లేదు. "మొలకలచెర్వు గ్రామము సమున్నతి.." అనండి.

      తొలగించండి

  8. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    చెలువపు శైశవమ్మునను చెన్నుగ నొల్లుచు ప్రీతి భావనన్
    కలువల దండలూనితిని కత్తుల రోసితి కార్ముకాలనున్
    తెలియగ భేషజమ్మునను తెల్లవి నల్లవి శుక్ర నీతినిన్
    కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  9. చం.

    విలువలు లేని లోకమున విస్మయమందగ వెర్రి చేష్టలన్
    పలుకగ నోచు మానవులు పబ్బముగడ్పగ నిచ్ఛ రీతినిన్
    కలుగున బూడ్చరే బలిమి కాసుల వేటన మార్చ రూపులున్
    కలువలు కత్తు లయ్యెడిని కార్ముకముల్ విరి దండ లయ్యెడిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రశేఖర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేటను' అనండి.

      తొలగించండి


  10. ఆకాశవాణికి పంపినది





    వలపులు మీర పెన్మిటియె వర్షపు వేళని రమ్మటంచు కో
    మలి హృదయమ్ము విచ్చుకొన మానస వీణను మీటి జానుగా
    నలకలకొల్కి యన్నువకు నచ్చెడు రీతిని వల్లభుండవన్
    కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. మాయ జాల విద్య మహిమ ను జూపించి
    మంత్ర దండ ము న ను మార్చు చుండ
    విస్మ యంబు నొంద వింతగా మారెను
    కలువ కత్తి దండ కార్ము క మ్ము

    రిప్లయితొలగించండి
  12. విలసిత శౌర్య ధైర్య పటు విక్రమ సంభృత 'సత్య ' పోరిలో
    కలుషితు,దైత్యునిన్, 'నరకు'గాంచి ,రథంబున నిల్చి,సాయకం
    బులు పలు వేయుచుండ-నిటు పొల్పుగ పల్కఁదగున్ మహోన్నతిన్
    కలువలు కత్తులయ్యెడిని,కార్ముకముల్ విరిదండ లయ్యెడిన్.

    రిప్లయితొలగించండి
  13. నరకాసురవధ ఘట్టములో ఏక కాలములో సత్యభామ నరకాసురునకు శ్రీకృష్ణపరమాత్మ కు కనిపించిన విధము...

    చంపకమాల
    విలయముఁ గాంచె రాక్షసుడు, వేడుకలా హరి కొప్పెఁ, గళ్ళలోన్
    గలువలు కత్తులయ్యెడిని, కార్ముకముల్ విరిదండలయ్యెడిన్
    దళుకిడె ధూమకేతువుగఁ, దామరతూపరి టెక్కమో యనన్
    బొలసెను, సత్యభామ కొస భూసుతు దృష్టికిఁ గృష్ణమూర్తికిన్

    కొస = చీరకొంగు
    భూసుతుడు = నరకాసురుడు

    రిప్లయితొలగించండి
  14. వలచితి నంచు వెంట పడి వంకర మాటల నాడి నిత్యమున్
    విలువలు వీడి గర్వమున వెంబర చేష్టల చేయు చుండగా
    మెలఁతల మానసమ్ములవి మిక్కిలి క్రోధముతో జ్వలింపగన్
    కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  15. చెలువు మీరునటుల జేయగ యుద్ధము
    ఆటవిడుపుగాను నార్యుగూడి
    కులుకులొలుకు లలన పలుకులు ములుకులు
    కలువ కత్తి దండ కార్ముకమ్ము

    రిప్లయితొలగించండి
  16. కలువల రేని వెన్నెలల కాంతులు చిందు సరోవరమ్మునన్
    కలువల కన్నులన్ వలపు కాకలు రేపెడి కన్నెలన్ గనన్
    కలవరమౌను మానసము కంతుని శస్త్రములంచు దోచునా
    కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  17. ఈరోజు ఆకాశవాణిలో ప్రసారమైన నా పూరణ:
    కులుకు మిటారి వాల్కనులు కోలుమసంగుకఠారి ధారయై
    పొలుపుగనుండనీవు మది పోరుచునుండునదేమి చిత్రమో
    చిలుకపటాణిరౌతువిలుచేగొనిపూలశరాలనేయగన్
    కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  18. తలపున నిర్మలత్వమును దన్మయ మెల్లసుకర్మలందునన్
    బలుకులలోన మార్దవము పావనవర్తన మన్నిజీవులం
    దలఘుదయాస్వభావ మిట నంది చరించుచునున్నవారికిన్
    గలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్"

    రిప్లయితొలగించండి

  19. (no subject)
    R
    Radhakrishna Rao
    to radhakrishnarao
    2 minutes agoDetails
    పలువురు తత్త్వవేత్తలటుపద్దతి జూపిరి బాలకేంద్రమై
    విలువలవిద్య నేర్పుటకు విత్తులు నాటిరి మూలమంత్రమై,
    కలువలుబాలబాలికలు కల్లలు సేయక సాగుచుండగా
    కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్విరిదండలయ్యెడిన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు,మీర్ పేట్ ,రంగారెడ్డి

    రిప్లయితొలగించండి
  20. "కలువ కత్తి , దండ కార్ముకమ్ము"గమారు
    ననుచు మంత్రగత్తె యనగ , వింత
    గొల్పె మాకు గాని కూర్చ గలిగె నామె
    ఏమి చోద్య మిదయ యెరుక రాదె

    రిప్లయితొలగించండి
  21. దుష్ట శిక్షణ జేసి దునిమేటి విష్ణుండు
    ఈయరాని వరము లిచ్చిన భర్గుని
    చింత వదలు మనుచు చిత్రము జేయగా
    కలువ కత్తి దండ కార్ముకమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      తునిమేటి... అనడం వ్యావహారికం. "...దునిమెడి" అనండి. 'విష్ణుండు + ఈయరాని' అన్నచోట సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "శ్రీహరి యీయరాని..." అనండి. రెండవ పాదంలో గణభంగం. 'భర్గుని' బదులు "హరు" అనండి.

      తొలగించండి
  22. ములుకుల వోలె గుచ్చినవి ముద్దియ మాటలు కృష్ణదేవునిన్
    పలుకుల దీయగా బలుక పాదపు తాడనమే పొసంగగన్
    విలువయు లేని సత్యయును వీగెను రోషపు ద్రాచనంగనన్
    కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్

    చిలుకల గొల్కి యందకను జిత్తము దోచి వరాల నియ్యకన్
    పలుకులు తేనె జిందగను పాటవ మొప్పుచు దాను జేరకన్
    మెలుకువలోన మోదమును మెచ్చని గోరిక వేదనయ్యెడిన్
    కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్
    (ఆకాశవాణి వారు చదివిన పూరణ)

    రిప్లయితొలగించండి
  23. కలువలుకత్తులయ్యెడివికార్ముకముల్ విరిదండలయ్యెడిన్
    కలియుగమాయలాయనగకానివియాయెనునబ్బురంబుగా
    గలువలుగత్తులౌటనిలగాంచితె?యోరమ!నీవజెప్పుమా
    కలువలుజూడయుండునటగాంతులుజిమ్ముచుజూడముచ్చటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పదాల మధ్య వ్యవధానం ఉంచండి.

      తొలగించండి
  24. చం. చెలువము లెన్ని యేనియును చెన్నుగ దోచవు, మిత్ర వాక్యముల్
    చిలుకగ లేవు మూఢజన చిత్తము లెందును! యేక పక్షమై
    పలుకగ జూచు వారలెడ పచ్చి నిజమ్మె యబద్ధమై జనున్!
    కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండ లయ్యెడిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఎందును + ఏకపక్ష' మన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. గురువర్యులకునమస్సులు. పొరబాటుగా సవరించని పూరణ ను బ్లాగ్ లో పోస్ట్ చేశాను, సరి చేసినదానిని (ఈ రోజు ఆకాశవాణిలో చదివినదానిని)ఇప్పుడు ఇక్కడ ప్రకటిస్తున్నాను పరిశీలించప్రార్థన.
      ధన్యవాదములు.
      చం. చెలువము లెన్ని యేనియును చెన్నుగ తోచవు, మిత్ర వాక్యముల్

      చిలుకగ లేవు మూఢజన చిత్తము లిచ్ఛగ నేక పక్షమై

      పలుకుచు నుండ వారియెడ పచ్చి నిజమ్మె యబద్ధమై జనున్!

      ‘కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండ లయ్యెడిన్!’

      తొలగించండి

  25. ఈ వారము ఆకాశవాణి విశేషములేమిటి తెలుపగలరు !

    కంది వారి కోరిక మేరకు దత్తపది ప్రయత్నము ద్రౌపదీ స్వయంవరము :)


    కలువ కత్తి దండ కార్ముకమ్ము దత్తపది‌ భారతార్థములో :)


    చెలికత్తియలమర సరస
    న లలిత సుకుమారి కలువ నగుమోము వయా
    రి,లిలిక్షయు పూదండని
    వలచె నరుని కార్ముకమ్ము వంచగ చేపన్ !



    రిప్లయితొలగించండి
  26. కిరాతార్జునీయము

    తలపడెఁ సవ్యసాచియగు ధన్వి, దయాళు కిరాతు తోడుతన్
    వలసిన వాడె వచ్చెనని పార్థుడెరుంగమి, యుగ్ర నేత్రముల్
    కలువలు కత్తులయ్యెడిని; కార్ముకముల్ విరిదండలయ్యెడిన్
    జ్వలికి,లలాటనేత్రునకు,శంభుకు,
    సాంబకు సాంఖ్య ముఖ్యుకున్
    (నేడాకాశవాణి నందు చదివినది)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      శంభునకు, సాంబునకున్, ముఖ్యునకున్... అనవలసి ఉంటుంది.

      తొలగించండి
  27. చంటిపాప దన్న సంతసింత్రు జనులు
    కాని వారు నవ్వ మేను కాలు
    నిష్ట మించు కేని నష్టమైన నగును
    గలువ కత్తి దండ కార్ముకమ్ము


    జలచర జంతు జంతు నర సత్య వరాల్ప మనుష్య సుంద రా
    మల తర రూప సంపదల మానుగఁ గన్పడి నిగ్ర హానుకం
    పల హరి సూచె నేని సిరిభర్తయె దుర్జన శిష్ట కోటికిం
    గలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  28. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కలువ కత్తి దండ కార్ముకమ్ము

    సందర్భము:
    తం శోచమానం కాకుత్థ్సం
    నిత్యం శోకపరాయణం
    తుల్య దుఃఖోఽబ్రవీ ద్భ్రాతా
    లక్ష్మణోఽనునయన్ వచః
    (కి.కాం.. 27 స 33 శ్లో.)
    రోజూ విలపించే అన్నను చూచి తానూ దుఃఖిస్తూ లక్ష్మణు డోదార్చినాడు.
    ఇది ఒక అవతార పురుషుని ఆవేదన..
    సీతా వియోగంతో కన్నీరు మున్నీరుగా విలపించే రామచంద్రుడు లక్ష్మణునితో ఇలా అన్నాడు..
    "తమ్ముడా! నాకు చివరకు మిగిలినవి..
    పూవూ పూబోడీ కాదు..
    కత్తులూ కటార్లే!..
    చంపుడూ చచ్చుడే!..
    ఇక జీవితాంతం వీటితోనే గడుపాల్సి వుం దేమో!
    ఒకనాడు స్వయంవరంలో మీ వదిన ఒక పూలదండ వేసింది నా మెడలో..
    అది యిప్పుడు కనిపించదు.
    అదే స్థానభ్రంశం చెంది నా భుజంమీదకు జారి రూపు చెడి కార్ముకమై పోయిందేమో!..
    మందిని చంపడాని కదే కదా ఎక్కువగా నాకు పనికివచ్చేది!!
    ఒకనాడు నా ప్రేమకు గుర్తుగా ఒక విరిసిన కలువపూవు నందించాను మీ వదిన చేతికి..
    అది ఇప్పుడు కనిపించదు.
    అదే స్థానం కోల్పోయి నా నడుము నంటిపెట్టుకుని రూపుచెడి వేలాడే కరవాల మైపోయిందేమో!..
    నన్ను నేను చంపుకోవటాని కదే కదా చక్కగా నాకు పనికివచ్చేది!!.."
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "మెడను దండ నిడెను మీ వదిన.. భుజాన

    పడి ధనువుగ రూపు చెడెను.. నేను

    వలపు మీర నిడితిఁ గలువ.. కత్తిగ మారె..

    కలువ కత్తి.. దండ కార్ముకమ్ము.."

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    2.11.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  29. వలిమలచూలినిన్ హరుని వాసిగ నొక్కటి జేయుయత్నమున్
    వలపులు బూయగా నగజ పార్వతి వంకను జూచువేళలో
    వలపులవింటివాడు తగు బాణము లేయగ నీశుచిత్తమున్
    కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్!!!

    రిప్లయితొలగించండి
  30. ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
    సమస్యాపూరణ కార్యక్రమంలో...
    02/10/2019 శనివారం ప్రసారమైన కాబోతున్న సమస్య...

    కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్

    నా పూరణ. చం.మా.
    **** *** ***

    లలనల నేడు గాంచగను రాతి మనమ్మును గల్గి ప్రాణ నా

    థులకును సంకటమ్ము లిడి తోరగ హింసలపాలు జేయ వా

    రల నెదురించకన్ బతులు మ్రాన్పడిపోయిరయో!యిదెట్లన్నన్

    కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్

    -- ఆకుల శాంతి భూషణ్

    వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఎదురించక అన్నది కళ. ద్రుతాంతం కాదు.

      తొలగించండి
  31. కలువ దండ కత్తి కార్ముకములనుట
    బదులుబలికెనిట్లు భరణి!వినుము
    కలువ కత్తి దండ కార్ముకములనుచు
    దికమకగను దెలిసిదెలియకమ్మ!

    రిప్లయితొలగించండి


  32. కలనము నందు పుత్రుడటు గాసిలినంత సుభద్ర లేచుచున్
    బలమును చూప నెంచుచట వాడిగ మాటలనాడు చుండగా
    ఛలమది హెచ్చవేగముగ జాణతనంబును చూప కన్నులన్
    గలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  33. శీఘ్ర గతిని వత్తు సినిమా కెళదమని
    యాశ పెట్టిన పతి బాస మరచి
    తప్ప తాగి రాగ దార కసి కనుల
    కలువ కత్తి దండ కార్ముకమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఎళదము' అనడం గ్రామ్యం. "వత్తు సినిమాకు పోదమం । చాసపెట్టిన..." అనండి.

      తొలగించండి
  34. ఆటవెలది
    వీర వరులె కాదు వీరాంగనలఁ గల్గు
    వారసత్వమొదవె భారతమున
    ఝాన్సి వెంట సాగు చానల కళ్లలో
    కలువ కత్తి! దండ కార్ముకమ్ము!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చానల కనులలో" అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించుకుంటాను.

      ఆటవెలది
      వీర వరులె కాదు వీరాంగనలఁ గల్గు
      వారసత్వమొదవె భారతమున
      ఝాన్సి వెంట సాగు చానల కనులలో
      కలువ కత్తి! దండ కార్ముకమ్ము! !

      తొలగించండి
  35. 1) చ. కులుకులమేను, చూడగనె,కూర్చొనలేక విమానయానమున్,
    చెలిమినిమీరి, చెంగుమని,చేతికిచిక్కిన చెంగులాగగన్,
    కలువనుబోలు, నోచెలువ, కాలికియుండెడి,చెప్పుతీసి,ఛీ
    తులవని, చెంపవాయగను,దూరముదోయగ,మెచ్చిబల్కెరే,
    కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్.

    2) చ. బలమునగెల్తునందరని,బాహువుజూపినకొంతకాలమే,
    గెలుతురునెవ్వరైన, విధిగీతనుమీరుటసాధ్యమాయిలన్,
    గెలవనిరోజుకూలబడ,గేలినిసేతురు,లోకమెల్లయున్,
    తలవనికాలమేతగల,తాడనుకున్నది పామెయవ్వురా,
    కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్.



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'కాలికి నుండెడి' అని ఉండాలి. 'తులువ + అని' అన్నపుడు యడాగమం వస్తుంది. 'దూరము ద్రోయగ' అని ఉండాలి.
      రెండవ పూరణలో 'గెలుతురు + ఎవ్వరైన = గెలుతు రెవ్వరైన' అవుతుంది. నుగాగమం రాదు. 'తలపని కాలమే' అనండి. 'అవ్వురా' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి