3, నవంబర్ 2019, ఆదివారం

సమస్య - 3181 (అన్నప్రాశనము....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అన్నప్రాశనముఁ జేయుఁ డాఱవయేటన్"
(లేదా...)
"అన్నప్రాశన మాచరింప హితమౌ నాఱేండ్లకున్ సద్విధిన్"
(నేడు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి మనుమడి అన్నప్రాశనోత్సవము)

60 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    విన్నారా! ప్రజలార! పెండ్లి జరుపన్ వెన్వెంటనే సంతునున్
    కన్నుల్ పండుగ జేయగా వలదురా గారాబుగా పొందుటన్
    కన్నెన్ దానము జేసినంత శిశుకున్ కంగారు లేకుండనే
    యన్నప్రాశన మాచరింప హితమౌ నారేండ్లకున్ సద్విధిన్

    రిప్లయితొలగించండి
  2. కం.
    కన్నఁడు తనకొమరునకున్
    నన్నప్రాశనముఁ జేయుఁ డారవయేటన్ l
    తిన్నగ శ్రీశైలంబున
    నెన్నెన్నోవింత రుచుల నేర్పడ జేసెన్ ll

    రిప్లయితొలగించండి
  3. కన్నడి కారవ నెలనే
    అన్నప్రాశనముఁజేయుఁ;డాఱవయేటన్
    మిన్నగ విద్యాభ్యాసము
    మన్ననలను బడసి సల్పు మాన్యులజేతన్

    రిప్లయితొలగించండి
  4. ఎన్నగ నారవ మాసము
    నన్నప్రాశనముఁ జేయుఁ, డారవ యేటన్
    మిన్నగ నేజేతు తనకు
    కన్నుల పండువగ నొల్లె కట్టెడు వేడ్కన్

    రిప్లయితొలగించండి
  5. పిన్నలు పెద్దలు చక్కగ
    కన్నుల పండుగ యటంచు కన్నయ్య కటన్
    మిన్నులు ముట్టగ వేడుక
    అన్నప్రాసనముఁ జేయుఁ డారవయేటన్
    చాలా రోజుల తర్వాత అనారోగ్యము వలన మన మితృలందరికీ దూరమయ్యాను. ఇప్పుడే కొంచం కోలుకుంటున్నాను ఇది మనవడి అన్నప్రాసన మహత్యం . సోదర సోదరీ మణులందరరికి పండుగల సుభాకాంక్షలు . మనవడిని ఆశీర్వదించి .సెలవు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీరు అస్వస్థులుగా ఉండి పూరణలు చేయలేకపోతున్నారని ఊహించాను. కోలుకుంటున్నందుకు సంతోషం.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఆరవ యేట కదా!... "చదువను నన్నప్రాశనము.." అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. పిన్నలు పెద్దలు చక్కగ
      కన్నుల పండుగ యటంచు కన్నయ్య కటన్
      మిన్నులు ముట్టగ చదువను
      అన్నప్రాసనముఁ జేయుఁ డారవయేటన్

      తొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    చిన్నా! అల్లరిమాను రా! చదువురా! చిత్రాతిచిత్రంబులౌ
    యెన్నో కావ్యములెన్నొశాస్త్రములునెన్నెన్నో మహాగ్రంథముల్
    క్రన్నన్ నేర్చెడి ప్రాయమిద్ది వరపుత్రా! యంచు శాస్త్రార్థధా...
    రాన్నప్రాశన మాచరింప హితమౌ నారేండ్లకున్ సద్విధిన్" !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నాణము లేని యొకడు
      మున్ను విభూతిని ధరించి బుధుడననొప్పన్
      పన్నుగ బల్కె శిశువునకు
      నన్నప్రాశనముఁ జేయుడారవయేటన్.!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి.

      తొలగించండి

  7. ఈ యెల్ కేజీ యు కేజీ లేలా !

    మిన్నగ మనవడి కిపుడే
    అన్నప్రాశనముఁ జేయుఁ డాఱవయేటన్
    చిన్నగ "ఉసుకూలు" కతని
    తిన్నగ నంపుడయ! "కేజి" తిప్పలవేలా!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  8. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కన్నన్ నెత్తిని మోసి గోకులమునన్ కంగారుగా చేర్చుచున్
    మన్నున్ గ్రోలుట మానిపించి సరియౌ మర్యాద నేర్పించుచున్
    వెన్నన్ దొంగిలు రీతినిన్ కసరుచున్ వెంటాడి గారమ్ముతో
    నన్నప్రాశన మాచరింప హితమౌ నారేండ్లకున్ సద్విధిన్

    రిప్లయితొలగించండి
  9. అన్నప్రాశనముఁ జేయుఁ డాఱవయేటన్

    చిన్న వయస్సున జనులిట
    అన్నప్రాశనముఁ జేయుఁ, యాఱవయేటన్
    ఉన్న చదువుసున్న యనుచు
    భిన్న చదువు కొరకు జనులు వీసా బొందున్

    🙏🙏

    రిప్లయితొలగించండి
  10. కం.
    చెన్నుగ సోనాబియ్యపు
    టన్నప్రాశనముఁ జేయుఁ డారవయేటన్ l
    చిన్నాపెద్దలు గలువగ
    నెన్నెన్నోవింత రుచుల నేర్పడ జేసెన్ ll

    రిప్లయితొలగించండి
  11. ఎన్నగ నారవ నెలలో
    నన్న ప్రాస న ము జేయు : దారవ యేట న్
    పన్నుగ బుడుత కు చదువ
    న్న ప్రాస న ము జేయుడా ర వ యే ట న్

    రిప్లయితొలగించండి


  12. అన్నపు రెడ్డి వారి మనుమడు కదా :)


    కన్నా! పుట్టితి వీవు తెల్గు బువిలో కాణాచి సంవిత్తుకై!
    యన్నప్రాశన మాచరింప హితమౌ, నాఱేండ్లకున్ సద్విధిన్
    చిన్నా! కందివ రార్యు కొల్వునకు మంజీరంపు వృత్తమ్ములన్
    విన్నాణమ్ముగ నేర్వనంపెదను ప్రావీణ్యమ్ముతో భాసిలన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. సరదాగా ప్రస్తుత పిల్లల నుద్దేశించి రాసినది

    అన్నప్రాశనముఁ జేయుఁ డాఱవయేటన్

    అన్నము సున్నము యనుచును
    మిన్నయు బయటనె దొరుకగ మీమాంసేలా
    బన్నును యన్నము గ తలచి
    అన్నప్రాశనముఁ జేయుఁ డాఱవయేటన్

    🙏🙏

    రిప్లయితొలగించండి


  14. కంది వారి ఆశీస్సుగా !


    మిన్నగ మనవడి కిపుడే
    అన్నప్రాశనముఁ జేయుఁ డాఱవయేటన్
    తిన్నగ నంపుడి బుడతడి
    నన్నా! పద్యముల నేర్వ నాకొల్వునకున్!


    శుభాకాంక్షలతో

    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. కం.
    పన్నులు వచ్చెననుచు తా
    మన్నప్రాశనముఁ జేయుఁ డారవయేటన్ l
    గన్నులపండగ చేయగ
    చిన్నోడెగబడి దినుచునె చివ్వున నగియెన్ ll

    రిప్లయితొలగించండి
  16. సరదాగా ఆవకాయ అన్నము తో అన్నట్టుగా 😀

    అన్నప్రాశనముఁ జేయుఁ డాఱవయేటన్

    ఖిన్నుడ నైతిని వినగనె
    అన్నములో కలుప వలదు యావమెతుకులున్
    విన్నారా ఎవడది యిట
    అన్నప్రాశనముఁ జేయుఁ డాఱవయేటన్?

    🙏🙏

    రిప్లయితొలగించండి
  17. అన్నా! వింటివె బ్రాహ్మణబ్రువు డొకం డాడెన్ ముహూర్తంబులం
    దెన్నంగల్గిన జ్ఞానముం గొనక తా నెప్డేని పంచాంగమున్
    గన్నున్నిల్పుచు జూడకుండ నపు డక్కల్యాణికిన్ శుంఠయై
    యన్నప్రాశనమాచరింప హితమౌ నాఱేండ్లకున్ సద్విధిన్.

    రిప్లయితొలగించండి
  18. మరో సరదా పూరణము (నాల్గవది ఈరోజు) కంది గురువుల ఆశీర్వాద బలముతో

    అన్నప్రాశనముఁ జేయుఁ డాఱవయేటన్

    ఉన్నది విదేశ ము గనుక
    బన్నులు బర్గర్లు పెడుతు భరియింపఁగనే
    తిన్నగ దేశము వచ్చిన
    అన్నప్రాశనముఁ జేయుఁ డాఱవయేటన్

    🙏🙏

    రిప్లయితొలగించండి
  19. కం.
    పన్నులతో కొరుకుట గని
    అన్నప్రాశనముఁ జేయ నారవయేటన్ l
    అన్నముదిను ఆచారము
    కన్నఁడు నేర్పగ మరిగెను గారాభముగన్ ll

    రిప్లయితొలగించండి
  20. విన్నది నిజమేనా మరి
    తిన్నగ వైద్యుని యడిగిన దెలియును గాదే
    అన్నా యెవ్వరు జెప్పిరి
    అన్నప్రాశనముఁ జేయుఁ డాఱవయేటన్

    రిప్లయితొలగించండి
  21. అన్నాయిమ్మనుజుండు బుట్టిపెరుగన్ నాబాల్యమందేగదా
    యెన్నోరీతుల బుద్ధిరాగ విధిగా నెంచారు మాసంబునన్
    అన్నప్రాశన మాచరింప హితమౌ; నాఱేండ్లకున్ సద్విధిన్
    చన్నున్మర్వగనంత వడ్గు సలుపన్ శాస్త్రంబు ఘోషింపదే

    రిప్లయితొలగించండి
  22. చన్ను గుడిచెడి సమయమున
    దున్నపొడిచె నాడు బిడ్డ దురితపు మహిమన్
    ఛిన్నమయి నట్టి పాపకు
    అన్నప్రాశనముఁ జేయుఁ డాఱవయేటన్

    రిప్లయితొలగించండి
  23. చెన్నుగ మూడవ నెలననె
    నన్నప్రాశనము జేయుఁ ;
    డాఱవయేటన్
    మున్నుగ నందరిని బిలిచి
    కన్నుల విందుగ నొడుగును గావించదగున్

    రిప్లయితొలగించండి
  24. తిన్నగ నోరును తెరచియు
    పన్నుగ నములుట నెరుగని బాలలు నెటులన్
    నన్నము తినెదరు నరయన్
    "అన్నప్రాశనముఁ జేయుఁ డారవయేటన్"

    రిప్లయితొలగించండి
  25. ఈ రోజు శంకరాభరణం సమస్య


    అన్నప్రాశనము చేయు డారవ యేటన్

    ఇచ్చిన సమస్య కంద పద్య పాదము

    నా పూరణము సీసములో

    ఒక తండ్రి తన కుమారునికి కవుల శిశువులు జన్మించగా చేయ బోవు పనులు గురించి తెలుపు సందర్భం


    కలిగిరి మన యింట కవలలు, నామ క
    రణము జరుపుము చైత్ర మ్మునందు,

    పుట్టు వెంట్రుకలను పుష్యము వెళ్ళిన
    పిమ్మట మీరు దుర్గమ్మ వద్ద

    తీయించ వలయును,
    తిరుపతి యేడాది
    గడచిన తదుపరి వెడలి బహుఘ

    నముగ నన్నప్రాశనము చేయు,
    డారవ
    యేటన్ చదువుకొన నెచటి కైన



    శిశువులను గురు కులమునన్ చేర్చ వలయు

    నుపనయనపు వేడుకలు జరి
    పిన పిదప,

    నిదియె మనకు నాచారము
    నిక్క మిదియె,

    ననుచు బల్కెను తండ్రి తనయుని గాంచి

    రిప్లయితొలగించండి
  26. అన్నమయంబగుజగతిన
    అన్నమెగదయక్షరంబుయన్నార్తులకున్,
    అన్నముకొరకక్షరమన
    అన్నప్రాశనము జేయుడాఱవయేటన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  27. అన్నమయంబగుజగతిన
    అన్నమెగదయక్షరంబుఅన్నార్తులకున్,
    అన్నముకొరకక్షరమన,
    అన్నప్రాశనము జేయుడాఱవయేటన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  28. సరదాగా

    అన్నపరెడ్డి కవివరా !
    "అన్నప్రాశనముఁ జేయుఁ డాఱవయేటన్"
    యన్నది పూరణ కొరకే
    మున్నుగ పౌత్రునికి బువ్వుము జవిగొనుపుడీ

    రిప్లయితొలగించండి
  29. అన్నమన మంకు జేసెడి
    కన్నని మది ప్రాశనపు టగత్యము నరయన్
    చెన్నగునటు మఱియొకపరి
    యన్నప్రాశనము జేయు డారవ యేటన్!

    రిప్లయితొలగించండి
  30. అన్నా!మూడవనెలలో
    నన్నప్రాసనముజేయు డాఱవయేటన్
    జెన్నుగ బడిలో వేసిన
    మిన్నంటును జదువులందు మీకంటెనుసూ

    రిప్లయితొలగించండి
  31. సన్నాయి వాద్య మలరన్
    విన్నాణమ్ముగఁ జెలంగి విభవం బొప్పన్
    విన్నంబోవఁగ నేలా
    యన్నప్రాశనముఁ జేయుఁ, డా ఱవ, యేటన్

    [ఆఱు+ అవ = ఆఱవ; ఆఱు = ఉపశమిల్లు; అవ = అవ్వ; ఏటన్ = ఏఁడాదిలో]


    చన్నే యివ్విధిఁ బాల మాత్రమున నీ చంటిన్ విలోకించవే
    పన్నుల్రాకయుఁ చప్పరించుఁ దమి నింపారంగఁ దా నవ్వుచుం
    గన్నా యంచును బుజ్జగించి విరియన్ గారమ్ము మాసాంతర
    మ్మన్నప్రాశన మాచరింప హితమౌ నాఱేండ్లకున్ సద్విధిన్

    [ఆఱేండ్లకు = ఆఱు నేడు సంఖ్యలకు; ఆఱు నేడుమాసముల మధ్య]

    రిప్లయితొలగించండి
  32. అన్నా!యెప్పుడుగూడమూడవనెలన్ హర్షంబులింపారగా
    నన్నప్రాసన మాచరింప హితమౌ,నాఱేండ్లకున్ సద్విధిన్
    మిన్నున్నంటగ సంతసంబులుగడున్ మీరంగ జేర్పించుచో
    జిన్నిన్ ,బాఠమునేర్వగాబడినిదా నేర్చున్ సువిద్యాదులన్

    రిప్లయితొలగించండి
  33. అన్నన్నా! తగదెంతమాత్రమిక నీవా మాటలన్ బల్కుటే
    నున్నెవ్వండును చెప్పలేదిటుల నేపొత్తమ్ములో లేదుగా
    యన్నప్రాశన మాచరింప హితమౌ నాఱేండ్లకున్ సద్విధిన్
    విన్నాణమ్మగు నారుమాసముల కీ వేడ్కల్ ప్రశస్తమ్ముగా

    రిప్లయితొలగించండి
  34. కం.
    తిన్నది లే దొక్క మెతుకు
    నిన్నేళ్ళుగ పాడు వ్యాధి యేడ్పించెను మి
    మ్మన్నా చాలు బ్రతికినా
    రన్నప్రాశనముఁ జేయుఁ డాఱవయేటన్.

    రిప్లయితొలగించండి
  35. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    అన్నప్రాశన మాచరింప హితమౌ నారేండ్లకున్
    సద్విధిన్

    సందర్భము:
    తేషాం జన్మ క్రియాదీని
    సర్వకర్మా ణ్యకారయత్
    (రామాయణం..బా.కాం. 18 స. 23 శ్లో.)
    పుత్రులకు దశరథుడు జాతకర్మ అన్నప్రాశన చౌల ఉపనయనాది సంస్కారములను చేయించినాడు.
    రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఆరవ నెల నడుస్తూ వున్నది. పురోహితుడైన వశిష్ఠుడు రాకుమారులకు అన్నప్రాశనం జరిపించే సమయం సమీపించగా
    "పిల్లల కెన్ని నెల" లని దశరథ భూవరుని ప్రశ్నించినాడు.
    "కన్నుల పండుగ చేస్తూవున్న పుత్రకులకు ఆరు మాసా" లన్నాడు రాజు.
    "ఇకనేం! ఆ.. రేండ్లకు (ఆ చిన్న రేండ్లకు ఆ చిన్న రాజులకు ఆ చిన బాబులకు) అన్నప్రాశనం జరిపించాల్సిందే!" అన్నాడు వశిష్ఠుడు.
    ఇదీ పద్యంలో వున్న వశిష్ఠ దశరథుల సంభాషణం..
    పుత్రుని కైతే ఆరవ నెలలోను పుత్రికకైతే ఐదవ లేదా ఏడవ నెలలోను చేయించవలె నని మహాకవి కాళిదాసు జ్యోతిర్విదాభరణంలో వున్నది.
    యముడు, శంఖముని, లోకాక్షి, మార్కండేయుడు అన్నప్రాశన విధానములను ప్రతిపాదించిరి.. మొత్తానికి శిశువుకు ఆరవ లేదా ఎనిమిదవ నెలలో ఈ సంస్కారంతోబాటు శిశుజీవికా పరీక్ష జరుగవలసివున్నది.
    ఈ విషయం పరాశర మాధవీయములో చూడవచ్చు. (పరాశరస్మృతి, మాధవాచార్య వ్యాఖ్య.. ఆంధ్రభాషాంతరీకరణము.. బ్రహ్మ శ్రీ తెలకపల్లె విశ్వనాథ శర్మ 374 పు)
    (అనుసంధించబడిన చిత్రంలో మరిన్ని..)
    చినరేండ్లు= చిన్న రాజులు (చినబాబులు.. అన్నట్టు) రాకుమారులు..
    ఆ రేండ్లు= ఆ చిన రేండ్లు.. ఆ రాకుమారులు
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "అన్నప్రాశనముం బొనర్చుటకునై
    యాలోచనం బున్న.. దీ
    చిన్నారుల్, చినరేండ్ల కెన్ని నెలలో
    చెప్పం దగున్ భూవరా!"
    "మ న్నే త్రోత్సవ రాజ పుత్రకులకున్
    మాసంబు లా..." "రిప్పుడే
    యన్నప్రాశన మాచరింప హితమౌ..
    నా రేండ్లకున్ సద్విధిన్"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    3.11.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  36. మిన్నగనాఱవనెలలో
    నన్నప్రాశనముజేయుఁ, డాఱవయేటన్
    తిన్నగబడిలోజేర్చుడు
    చిన్ననిభవితవ్యమునకు చెన్నులుగూర్చున్

    రిప్లయితొలగించండి
  37. చిన్నారిన్ గన ముచ్చటౌ నిజముగా శ్రీలక్ష్మియే యామెకున్
    అన్నప్రాశన మాచరింప హితమౌ; నాఱేండ్లకున్ సద్విధిన్
    విన్నాణమ్ముగ విద్యలన్ గరపు సద్విద్యాలయమ్మందునన్
    సన్నాహమ్మున జేర్చుటే విహితమౌ సత్పుత్రికారత్నమౌ

    రిప్లయితొలగించండి
  38. ఇద్దరు స్నేహితురాల్ల సంభాషణ :

    శార్దూలవిక్రీడితము
    చిన్నోడిన్ గన నైదు మించి నటులన్ జెల్లంగ పెట్రేగునే
    జిన్నా! రమ్మని నీవుఁ జన్గుడుపుటల్ జిత్రంబుగన్ దోచు నీ
    విన్నాల్లైనను పాల నీయ తగదే! యీరీతి నాశిల్లకే!
    యన్నప్రాశన మాచరింప హితమౌ నాఱేండ్లకున్ సద్విధిన్


    రిప్లయితొలగించండి
  39. చిన్నారి కారవ నెలన్
    యన్నప్రాశనము చేయుడారవయేటన్
    యన్నియు నేర్వగ పంపుడు
    తిన్నగ నక్షరములనిల దిద్దగ బడికిన్.

    రిప్లయితొలగించండి