4, నవంబర్ 2019, సోమవారం

సమస్య - 3182 (వేసమ్మె ప్రధానమగును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వేసమ్మె ప్రధానమగును వేదాంతమునన్"
(లేదా...)
"వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారం బిదే"

42 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    మీసమ్ముల్ గొరిగించి గడ్డమునుభల్ మేధావిగా నెగ్గుటన్
    దోసమ్ముల్ తొలగించి రాత్రి పవలున్ తోషమ్ముగా వేదికన్
    కాసింతౌ పిలకన్ ధరించి పలుకన్ కంగారు లేకుండనే
    వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారం బిదే

    రిప్లయితొలగించండి
  2. కాసుల నార్జింపగ నిక
    మోసము జేయంగ వలయు మోక్షార్థులనే
    వాసిగ రూపము మార్చుము
    వేసమ్మె ప్రధానమగును వేదాంత మునన్

    రిప్లయితొలగించండి

  3. వేదాంత సారమిదియె :)


    నీ సరసపు పలుకులు తగ
    వే! సమ్మె ప్రధానమగునువే! దాంతమునన్
    వాసుర! వెనువెంట తిరుగ
    నీ సూక్ష్మత తోడు పతిని నిలుపవలెను వే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. మోసమె జేయుట ముదమని
    రాసులు కోరుచు జనులను రంజిల జేయన్
    గోసాయి పలుకు లందున
    వేసమ్మె ప్రధాన మగును వేదాంతము నన్

    రిప్లయితొలగించండి
  5. వేసమ్మె ప్రధానమగును వేదాంతమునన్

    వేసుకు కాషాయమునిట
    ఊసులు సక్కంగ జెప్పి యూరించుచు తా
    మోసము జేయఁగ తలచిన
    వేసమ్మె ప్రధానమగును వేదాంతమునన్

    🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాసుల మీదనె మోజిడ
      మోసము జేయఁగ జనులను మోముని జూపన్
      మీసము గెడ్డము పెంచెడి
      వేసమ్మె ప్రధానమగును వేదాంతమునన్

      🙏🙏

      తొలగించండి
    2. కూసిని మాటలు తెలివిగ
      మోసపు చిత్తము తెలుపక మోమున నవ్వుల్
      దోసిట బూడిద తేగల
      వేసమ్మె ప్రధానమగును వేదాంతమునన్

      🙏🙏

      తొలగించండి
    3. పూజలు చేస్తూ సెల్ఫీ లు తీస్తూ నెట్ లో పెట్టడం గురించి సరదాగా రాసినది,

      వేసెను పోజులు బుక్ లో
      చేసిన సెల్ఫీ భజనలు చేరగ జనులన్
      ఆశగ జూచెడి లైక్ లన్
      వేసమ్మె ప్రధానమగును వేదాంతమునన్

      🙏🙏

      తొలగించండి
    4. కాసిని మాటలు జనులకు
      ఆసువుగానిట తెలుపుచు యాసలు రేపన్
      మోసములను జేయఁగ నిల
      వేసమ్మె ప్రధానమగును వేదాంతమునన్
      🙏🙏

      తొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారం బిదే"

    వస్త్రేణ వపుషా వాచా విద్యా వినయేన చ
    వకారైః పంచభిర్యుక్తో నరః ప్రాయాతి గౌరవమ్ !!


    వాసమ్మున్ గని పల్లెటూరని యిటుల్ వాపోవగానేల? నీ
    త్రాసమ్మేలర ? వాగ్వపుర్వినయవిద్యావస్త్రపంచాఖ్యమౌ
    వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారం బిదే!
    ఏ సమ్మానమునైన పొందగనివే హేతుల్ ప్రధానమ్ములౌ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ పద్యం లో నాలుగవపాదంలో చిన్న సవరణ..
      మన్నింతురు గాక!

      శంకరాభరణం.. సమస్యాపూరణం..

      వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారం బిదే"

      వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ
      వకారైః పంచభిర్యుక్తో నరః ప్రాయాతి గౌరవమ్ !!


      వాసమ్మున్ గని పల్లెటూరని యిటుల్ వాపోవగానేల? నీ
      త్రాసమ్మేలర ? వాగ్వపుర్వినయవిద్యావస్త్రపంచాఖ్యమౌ
      వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారం బిదే!
      ఏ సమ్మానమునైన పొందుటకివే యింపైనవౌ హేతువుల్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  7. మోసపుజగమిది సోదర
    కాసులె పెంచును మెఱవడి కలికాలమునన్
    గ్రాసపు సముపార్జనకై
    వేసమ్మె ప్రధానమగును వేదాంతమునన్

    రిప్లయితొలగించండి

  8. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మా కాలం పెండ్లిచూపులు:

    రాసుల్ రాసులు ప్రీతి భాషలహహా రమ్యంబుగా పల్కుచున్
    దోసెల్ తోడుత లడ్డులున్ మురుకులున్ తోషమ్ముతో పంచుచున్
    మోసమ్మున్ రవచేసి కన్నెనిడుటన్ మోదంపు మేకప్పుతో
    వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారం బిదే

    makeup details నన్ను అడగకండి

    రిప్లయితొలగించండి

  9. పీపుల్స్ పల్స్ ఫేవర్ గా వున్నట్టనిపించడంలె
    ఇప్పటికి

    కేసీయారుల మాట చెల్ల వలె! స్ట్రైకేలన్న! మానండి! ఆ
    ర్టీసీవారల మాట లన్ వినుచు పెట్రేగన్ జనుల్ సిద్ధమై
    మీ సాయమ్ముగ లేరె! సంధి వలయున్!మించార గా దోస్తులై
    వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారం బిదే!



    రిప్లయితొలగించండి
  10. మోసమ్మెంతయు చేయబోక మది సమ్మోహమ్ములం దేలి త
    ద్వ్యాసంగాంబుధి లోన మున్గక, మనోవాక్కాయ
    శుద్ధుండునై
    భాసద్వాదశకోర్ధ్వపుంఢ్రవిలసద్ప్రాంచఛ్శిఖాధారిగన్
    వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారం బిదే"

    రిప్లయితొలగించండి
  11. రోసమ్మేమియు లేదయ
    వేసమ్మె ప్రధానమగును వేదాంతమునన్
    యీసంగతి మోకాలికి
    నాసాంతము బోడిగుండు యనుపము కాదే

    రిప్లయితొలగించండి
  12. మీసము గడ్డము బెంచి యు
    వాసిగ పుండ్ర ము లు దాల్చి వంచన జేయ న్
    రాసి గ ధన మార్జిం ప గ
    వేస మ్మె ప్రధాన మ గును వేదా o త ము న న్

    రిప్లయితొలగించండి
  13. ఆసంద్రమ్మును ద్రచ్చువేళ నటకున్ హర్షంబునన్ జేరరే
    దాసానుగ్రహసాగరుల్ హరిహరుల్ తద్భూమి నవ్వారికిన్
    వేసంబయ్యెను భాగ్యకారకమహో వేయేల నిక్కమ్ముగా
    వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారం బిదే.

    రిప్లయితొలగించండి
  14. ( నిద్రమత్తులోని భీముని వృద్ధుని రూపంలో వచ్చి " మత్తు
    వదలరా " అని మేల్కొల్పుతున్న శ్రీకృష్ణుడు )
    వాసిం గాంచిన భీమసేనుడవు బా
    వా ! నీవిటుల్ నిద్రలో
    నాసాంతమ్ము మునింగియుండినను నా
    నాపాటులే కల్గుగా !
    వీసమ్మంతయు యోచనన్ సలుపవా ?
    వీరోద్ధతా ! నాకు నీ
    వీసమ్మంతయు యోచనన్ సలుపవా
    వీరుండ ! నాకిప్పు డీ
    వేసమ్మే కడు ముఖ్యమౌను ; గనగన్
    వేదాంతసారమ్మిదే .

    రిప్లయితొలగించండి
  15. ధ్యాసను దేవునిపైనిడి
    కాసులకున్ లొంగనట్టి కళ్యాణములన్
    చేసిన కాషాయాంబర
    వేసమ్మె ప్రధాన మగును వేదాంతమునన్.

    రిప్లయితొలగించండి


  16. మీసమ్ముల్ దుమికించి తర్కములతో మేధస్సు తో పోరుటే
    లా! సంధ్యాసమయమ్మునన్ జపములేలా! గోపతిన్ పొంద కై
    లాసమ్మేల! మనస్సు క్షేత్రినిక కొల్వంగన్ ప్రియత్వంపు చే
    వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారంబిదే!


    ప్రియత్వంపు చేవేసము - ప్రేమ అనెడు చేవ కలిగినట్టి ఈస- నాగటిచాలు


    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. బాసల నన్నియు నేర్చితి
    మోసపు లోకానగంటి మూర్ఖుల నెల్లన్
    వీసం బైనను భావా
    వేసమ్మె ప్రధానమగును వేదాంతమునన్

    రిప్లయితొలగించండి
  18. వీసము జ్ఞానము లేకయె
    మోసమునే నమ్ముకొనెడి ముష్కరులకహో!
    గ్రాసము సంపాదింపగ
    వేసమ్మె ప్రధానమగును వేదాంతమునన్

    రిప్లయితొలగించండి
  19. వాసిగ హితవాక్యము గృహ
    వాసులకు తెలిపెడి సాధు వరులకు నెపుడున్ |

    భాసురమె ,నిరాడంబర
    "వేసమ్మె ప్రధానమగును వేదాంతమునన్"

    రిప్లయితొలగించండి
  20. శార్దూలవిక్రీడితము
    వాసమ్ముల్ విడి చెట్టు పుట్ట కరుగన్ వచ్చేది యేముండురా!
    మోసమ్మున్ విడి సంఘ సేవ మదిఁ బెంపొందన్ గృహస్తాశ్రమ
    మ్మే సేమం బన దైవచింత ప్రతిబింబించంగ సౌమ్యంపు దౌ
    వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారం బిదే

    రిప్లయితొలగించండి
  21. కందం
    కాసిన కాయలు పండఁగ
    చూసితివా వర్ణమేదొ సుమతీ! యటులే
    కాషాయాంబరములతో
    వేసమ్మే ప్రధానమగును వేదాంతమునన్

    రిప్లయితొలగించండి
  22. మోసము జేసెడి వారికి
    వేసమ్మె ప్రధానమగును; వేదాంతమునన్
    దోసము లెంచుచు వారలు
    కాసుల కొరకై జనులకు గారడి జూపన్

    రిప్లయితొలగించండి
  23. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వాసిగ జనులుండుటకై
    గోసనపుచ్చుచు నజితుని గొల్చెడి యతికిన్
    మీసరమగు కాషాయపు
    వేసమ్మె ప్రధానమగును వేదాంతమునన్.

    రిప్లయితొలగించండి
  24. దాసగణు తలచెనిటులన్
    వేసమ్మె ప్రధానమగును వేదాంతమునన్
    శ్రీ సాయి పలికె నంతట
    దాసా వినవో చిడతలు దాల్చిన చాలున్

    రిప్లయితొలగించండి
  25. *వనవాస పరిసమాప్తిలో ధర్మరాజు భీమునితో పలికిన మాటలుగా నూహించిన పద్యం*

    ఓ సంవత్సర కాలమే మిగిలె నేనూహింప లేకుంటిరా
    వేసమ్ముల్ మనమింక వేయవలెనో బీమయ్య, యజ్ఞాతమే
    వాసమ్మౌనిక తప్పినన్ మనకు ఘోరాటవే
    వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారం బిదే

    రిప్లయితొలగించండి
  26. ఆసలు స్వీయారులు దో
    షాసాంగత్యము సరళత సచ్చింతనలే,
    మోసము సేయకు విడు మీ
    వేసమ్మె, ప్రధానమగును వేదాంతమునన్


    కాసింతైనను భక్తి నుంచి మది ముక్తప్రాప్తి కర్మాసలే
    భాసిల్లంగ వికుంఠ వాస రతి యుద్భాసిల్లఁగా వెల్గుచున్
    నీసుల్ వీడుచు లోక మందుఁ గరమున్ నిష్కల్మషంబై వఱల్
    వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంత సారం బిదే

    రిప్లయితొలగించండి
  27. మోసములఁ జేయక సదా
    దోసరహితజీవనమ్ముతోడ వెలుగుచున్
    కాసుల కాశపడని స
    త్వేసమ్మే ప్రధానమగును వేదాంతమునన్

    రిప్లయితొలగించండి
  28. మోసాల్జేతురు మాయ చేష్టలతొ సమ్మోదంపు వాగ్ధాటితో
    కాసుల్ రాసులుకొల్లగొట్టుటకునై కాషాయముంగట్టుచున్
    గోసాయింబలె వేషధారణముతో, క్షోణీతలంబందునన్
    వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారం బిదే

    రిప్లయితొలగించండి
  29. 1కం:మోసము చేసెడి వారికి
    వేసమ్మె ప్రధానమగును, వేదాంతమునన్
    వాసిగ నెప్పుడు తెలిపెడు
    యా సాధుజనములకునది యనవసరంబౌ.

    2ఆ.వె:కాసుల సంపాదించగ
    వేసమ్ము ప్రధాన మగును వేదాంతమునన్
    యాసక్తిగల సుజనులకు
    వేసము పైధ్యాస పోదు వినుమిది పుత్రా.

    3.ఆ.వె;మోసమును చేయు వారికి
    వేసమ్మె ప్రధాన మగును వేదాంతమునన్
    వాసిగ నెరుంగ దలచిన
    వేసము మార్చెడి తలపునె వీడుదు రెపుడున్.

    రిప్లయితొలగించండి