6, నవంబర్ 2019, బుధవారం

సమస్య - 3183 (మరణమ్మును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్"
(లేదా...)
"మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై"

137 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    తరుమగ భార్య వెంటబడి తన్నుచు కొట్టుచు చీపురెత్తుచున్
    కరవగ పిల్ల జెల్లలును క్యాన్సరు రాగను బుర్రలోననున్
    పరమును చేరుటందునను పండుగ జేయుచు వంద యేండ్లకున్
    మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై...

    రిప్లయితొలగించండి


  2. అరయగ తప్పనిదగు నా
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
    తరలిక కష్టమ్ములపడ
    క, రోగములులేక పోవ కాటికి సుమ్మీ


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తరలి + ఇక' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

      తొలగించండి

    2. తరలిక - యాత్ర
      ఆంధ్రభారతి ఉవాచ :)


      జిలేబి

      తొలగించండి
  3. విరివింటి దొర శరమ్ముల
    గరిమను తెల్పంగ వశమె కల్పము నందున్
    నిరతము కోర్కెల తో కా
    మ రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      చక్కని విరుపుతో ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  4. భరణము లీయగ విసిగిన
    మరణమ్మును గోరుకొంద్రు మానవు లెల్లన్
    వరమని కోరిన ప్రాణము
    మరిమరి నిలుపంగ లేడు మాధవు డైనన్

    రిప్లయితొలగించండి
  5. నరకసమాన మాపురము నమ్ముడు రాజయి దానికొక్కడున్
    నిరత మనంతదుఃఖములు నిల్పుచు పౌరుల జీవనంబునన్
    చెరచుచునుండ సౌఖ్యములు, చేకొన దౌష్ట్యము జూపి సంపదల్
    మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై.

    రిప్లయితొలగించండి
  6. పరపీడన పరమావధి
    దురహంకారులకు నెల్ల దుస్సహమౌరా !
    నరకాసురు వంటి ఖలుల
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై"

      ధర జనియించియుంటిని విధాతృకృపారసలేశమంది, శ్రీ..
      హరి కరుణాకటాక్షములనంది శుభంబుగనుంటి , నింక శం..
      కర ! భవబంధమున్ దునిమి కావుమటంచు భవమ్ము లేనిదౌ
      మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.

      తొలగించండి


  8. తరుగుట తప్పదా కలిమి దారిని పుట్టిన వారికిన్, సఖీ
    యరయగ తప్పదమ్మి నరులా సుడుగాడుకు బోవ తీరగన్
    తరలిక, భోగభాగ్యముల దందడి! రోగపు లేమితోడుతన్
    మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. (అయ్యప్పస్వామికి భక్తుల విన్నపం )
    " శరణము స్వామి ! నీవు మము
    జల్లగ జూడుము నెల్లవేళ ; నీ
    చరణములే కదా మదుల
    జక్కగ నిల్పితిమయ్య ! మాయ సం
    వరణమునందు నుంటిమి ; ని
    వారణ జేయు " మటంచు భక్తి నా
    మరణము గోరుకొందురట
    మానవులెల్లరు ముక్తకంఠులై .


    రిప్లయితొలగించండి
  10. పెరుగును జబ్బులు ముదిమిని,

    దరిజేరరు సతి సుతులును తరుగక జబ్బుల్

    తరిమిన ,సుఖముగ కలిగెడు

    మరణమ్మునుకోరుకుంద్రుమానవులెల్లన్

    రిప్లయితొలగించండి

  11. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అమిత్ షా ఉవాచ:

    అరచుచు మోడి చోరుడని హైరన నొందుచు వాడవాడలన్
    పరుగులు పెట్టి జందెమును భారత మాతకు చుట్టి వేడ్కతో
    వరుడగు సోని పుత్రుడిట వర్ధిలు వేళ ప్రధాన మంత్రియై
    మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై...

    రిప్లయితొలగించండి


  12. అరకొర తెలివిడి వలదని
    మరణమ్మును, గోరుకొంద్రు మానవులెల్లన్
    చిరకాలమ్ము బతుకగా!
    పరమార్థకవి పలికె సెలవా మరణమ్మే!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  13. పరుగిడి కోరుకొనుమ యొరి
    మ! రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
    సరియైనదికాదది విను
    మ! రణమ్మును గోరుచుట్టు మచ్చుగనుమికన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  14. పరుగుపరుగుల నెపుడు ధన
    ము రొప్పుచు ములుగును చూచి ముచ్చటపడుచున్
    పరపతి తోడుత గొప్పగ
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  15. సరిసరి జిలేబి కోరకు
    మరణమ్మును! గోరుకొంద్రు మానవులెల్లన్
    జరలేని బతుకు! కోరుకొ
    ను రవంతయు నీవదియె మనుగడయె సాగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. మరణము తథ్యము మనిషికి
    తరుణమ్మాసన్నమైన తప్పదుబోవన్
    పరువగు జీవనగతిలో
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్"

    రిప్లయితొలగించండి
  17. మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

    సరియగు కోర్కెలు కలుగక
    పరులను జూచిన మనసిక భరియింపని, యా
    యరిషడ్వర్గమ్ముల తగు
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

    🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సిరులను యెన్నియు కలిగిన
      సరియగు వైద్యులు దొరకక సహకారమునన్
      భరియింపని రోగము నా
      మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "సిరులవి యెన్నియు..." అనండి.

      తొలగించండి
  18. శ్రీశైలములో ఇప్పటికినీ "వీరశిరోమంటపము" అనేది ఒకటున్నది.
    మోక్షముకొరకు శైవులు ప్రాణత్యాగ జేసెడివారు.
    కం.
    స్మరణము జేసిన వినడని
    నరులున్ శ్రీశైలమందు నటరా జెదుటన్ l
    శిరముల్ ఖండించి సుకృత
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్ ll

    రిప్లయితొలగించండి


  19. యోగవాశిష్టము



    "మరిమని" వశిష్టుడనె, "రా
    మ! రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
    శరణాగతి జీవితమున
    నరయగ మేలగునయా వినాశమ్మీగన్"!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  20. నా పూరణ. చం.మా.
    ** *** *** **

    ధరపతులెల్ల యుద్ధమున దస్యుని ద్రుంచుట శౌర్యమౌను గా

    ని రణమునందు వైరి గని నివ్వెఱ జెందుచు వెన్ను జూపుచున్

    పరిగిడ గేళిజేయుదురు పత్నులె;సంగర మందు వీరమౌ

    మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై

    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  21. శ ర ణ ము గోరియు రుద్రుని
    వరమి మ్మ ని వేడు కొనుచు బాధ ల సుడి లో
    కరము గకల త లు బడు చు న్
    మర ణ మ్మె గోరు కొంద్రు మానవులె ల్ల న్

    రిప్లయితొలగించండి


  22. పరిపరి విధముల కోరిక
    ల రహస్యముగ తలదాల్చి లాభము కొరకై
    పొర కనుల కట్టగా కా
    మ రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. వరుసఁగ హత్యలు చేయుచు 
    మరణమ్మును కోరితెచ్చు మానవమృగమున్ 
    దురహంకారుని దుష్టుని 
    మరణమ్మును కోరుకొంద్రు మానవులెల్లన్ 

    రిప్లయితొలగించండి
  24. తరుగగ ప్రాయము ధనమును
    జరయందున రుజలనంది జాయాసుతులే
    బరువంచును వేసారగ
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరిసిన యౌవనంబదియె వీగగ ద్రుంచుచు గర్వమంతయున్
      కురులవి వెల్లబారగను కూరిమితగ్గగ లోకవాంఛలన్
      సరగున జేరగాదివిని సారసనేత్రుని బూజసేయుచున్
      మరణము గోరుకొందురట మానవులెల్లను ముక్తకంఠులై

      ముక్తకంఠులు = ముక్తినివ్వమని ప్రార్ధించువారు

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి


  25. అరె ప్రెసిడెంటవగ, యొబా
    మ! రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
    నెరపితి వీవెగ శాంతిని!
    పరిగ్రహించుకొనుమింక ప్రైజిదె నోబెల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  26. చిరుతన యాటల తోడన
    తరుణిమ ఘన కీ ర్తితోడ దనుపుగ గడువన్
    జరయందున రోగరహిత
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చిరుతను క్రీయలతోడను" అనండి.

      తొలగించండి
  27. వరియించిన పూబోడిక
    సరిజోడై తోడు రాగ సరసము తోడన్
    పరిపరి గోరుచునా కా
    మ రణమ్మును గోరుకొంద్రు మానవు లెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పూబోడి + ఇక' అన్నపుడు సంధి లేదు. "పూబోడియె" అనండి.

      తొలగించండి

  28. ప్రత్యక్ష ప్రమాణము - మిలాల్ :) వుంటే వద్దంటామా ? :)



    అరె! ణిసిధాత్వర్థముగా
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
    పరమాత్మునికొలువందు క
    లరూపు తధ్యమనగా! మిలాల్ లేదు కదా:)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  29. పరువము దాటి కాలమున భాగ్యము లెన్నియొ బొంది ముచ్చటన్
    వరుసగ ముత్తరంబులను వార్థకమందున జూచి తృప్తులై
    జరఠపు బాధలేని సహజంబగు దీర్ఘ సుషుప్తి నొందెడిన్
    మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై

    రిప్లయితొలగించండి
  30. ధరలో కష్టము లందుచు
    నరకమ్మగు బాధ చేత నానా రోతల్
    భరియించువారు నిజముగ
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్.

    రిప్లయితొలగించండి

  31. జీపీయెస్ వారి మరియు యితర కవుల ఐఫోను ఆండ్రాయిడు ఫోనుల కంకితము :)



    విరివిగ పొద్దుపొడువ శం
    కరాభరణమందు విడువక టకాల్మనుచున్
    చరవాణి నొక్కి కైపద
    మ! రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్



    జిలేబి

    రిప్లయితొలగించండి
  32. పిరమగు జీవితమ్ము గద వేదనలెన్నియొ చుట్టుముట్టినన్
    స్థిరమగు భావనన్ జెలఁగి తేకువతోఁ బెనఁగాడుచున్ బ్రభున్
    వరముల నీయమంచు భవవార్ధిని దాటగ నంత్యమందు నా
    "మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై"

    రిప్లయితొలగించండి


  33. నరకమ్మె లేదు! స్వర్గం
    బరయగ తధ్యము జనాళి ప్రభువుని చేరం
    గ రయము రారండన సం
    స్మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  34. (3)
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

    సరియగు తరుణము యనుకొని
    కరుణను లేక జనులనిట కఠినముగా సం
    హరణము జేసెడి లష్కర
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

    🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరిహద్దున సైనిక సో
      దరుల మరణమును గన పరితరియించెడి యా
      పరదేశ శత్రువులకు దు
      ర్మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
      🙏🙏

      తొలగించండి
    2. మురిపెముగా జూచు కొనెడి
      సరియగు తోడు వయసయెడి సమయాన్నే లే,
      మరు జన్మమె వలదని యిక
      మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

      🙏🙏

      తొలగించండి
    3. ::6::
      సరదాగా రాసినదే జిలేబి గారి స్పూర్తితో 🙏😀

      సరియగు నెట్వర్క్ తెలియక
      సిరులన్నియు పోసితిమిగ సిగ్నల్ కొరకున్
      విరివిగ డేటా దొరకక
      మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

      🙏🙏😀

      తొలగించండి
    4. మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో "తరుణమ్మనుకొని కరుణను విడిచి" అనండి.
      రెండవ పూరణలో 'పరితరియించెడి'?
      మూడవ పూరణలో 'సమయాన్నే' అనడం సాధువు కాదు. "సమయమ్మున" అనండి.

      తొలగించండి
  35. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  36. Modi no to RCEP agreement signing


    అరె! ఆర్. సి.ఇ.పి.వలదయ
    త్వరితము చైనా దినుసులు తలమించునికన్
    విరివిగ! దేశపు వృద్ధికి
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  37. విరిబాలలు విచ్చకనే,
    మరి రవియుదయించులోన మానసమున శం
    కరులిచ్చు సమస్యా గరి
    మ రణమ్మును గోరుకొంద్రు మానవు లెల్లన్

    రిప్లయితొలగించండి
  38. ధరలో ముదిమిని వ్యాధులు
    భరియింప వశమె జనులకు భారమె కాదా
    బరువుగ జన్మము తలచుచు
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

    రిప్లయితొలగించండి
  39. తరిగొన సంఘంబులు రా
    ష్ట్ర రవాణా నిలువ నేడు రాజీ రాజా
    త్వరమే మాన్పుడి లేదా
    మరణమ్మును గోరుకొంద్రు మానవు లెల్లన్

    రిప్లయితొలగించండి


  40. దొరలుచు దుముకుచు కాదం
    బరి కౌగిలిని కరుగుచు సఫలమనుకొనుచున్
    మురుగప్పా వైన్సు కెడని
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  41. కందం
    నిరతము తమతమ కర్మల
    నెరవేర్చెడు ధ్యాస లోన నిర్గుణు నెదలో
    మఱచుచుఁ గష్టమ్ములలో
    స్మరణమ్మును గోరు కొంద్రు మానవులెల్లన్

    రిప్లయితొలగించండి


  42. మురుకులు జిలేబి లడ్డులు
    కరకర యంచు నములుచు ప్రకాశము గా వీ
    రరసమ్మిదె యనుకొనుచున్
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  43. ఈ నాటి శంకరా భరణము బ్లాగు వారి సమస్య

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసము లో

    నేటి జనతను గాంచి ఆలయములొ ఒక గొప్ప సాధువు పలుకు మాటలు

    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్ (సమస్య)




    ముప్పది వచ్చిన ముద్దాడు నధికమౌ
    రక్తపోటు లలన రమ్య గతిని,

    నలుబది దాటిన చెలిమిని కోరును
    మధుమేహపు మగువ మనసు బడుచు,

    యేబది లో జేర డాబుగ, పైబడి
    దంతపు టింతులు దాడి జేయు,

    తరుణము దొరికిన కరుణను తలచక
    కాలేయపు కలికి కాటు వేయు,

    పాపం బనుకొనక నూపిరి తిత్తుల
    పడతుక లిరువురు బాధ పెట్టు,

    తినకున్న నూపిరి తిత్తులు నలుగు, తి
    నిన మధు మేహము నిబ్బరించు,

    నిజసతి దరిజేర గజగజ వణుకును
    వాసన నిడుచుండు వపువు గాంచి,

    హతవిధీ నిరతము హత్నువుల్ కూడుస్వ
    ర్గమనము వలదు, సుగమ
    ముగ కలు

    గు మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్ల
    నెప్పుడు ధరలోన నిజము సుమ్మి,



    కలుగు మీకట్టి మరణము కాంక్ష లెల్ల

    వీడి సతతము దేముని వేడుచున్న,


    కరుణ నిడి కొనిపోవును పరమ పదము

    నకని పలికె బైరాగి జనతను గాంచి

    వపువు = శరీరము హత్నువుల్ = రోగములు

    రిప్లయితొలగించండి
  44. చంపకమాల
    దొరికిన దెల్లఁ దోచి మది తోషము నందఁగ పుత్రపౌత్రులున్
    మురిసెదరంచు భావనల ముందుకు సాగుచు నంత వృద్ధులై
    తరుమగ కన్నవారలె యధార్థము నెంచక యాశ్రమమ్ముకున్
    మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై

    రిప్లయితొలగించండి
  45. అరయగనెల్లజీవులకునాయువుమూడుట తథ్యమేకదా
    జరయొకశాపమౌను మనుజాళికి రుగ్మత సంక్రమింపగన్
    కరుణనుజూచువారెవరుకానక తల్లడమందువేళలన్
    మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై

    రిప్లయితొలగించండి
  46. నెరవేర కోర్కెలు గడిపి
    ధరణిని సుఖజీవితమ్ము తద్దయు ప్రీతిన్
    కఱకంఠుని యాజ్ఞ సహజ
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

    రిప్లయితొలగించండి
  47. కం.

    విరివిగ వాడిన ప్లాస్టిక్
    తరగని రాసులు నిలిచిన తాకగ తెవులున్
    నరకము దలుపన జగతిన
    మరణమ్మును గోరు కొంద్రు మానవులెల్లన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  48. సరియగు పంటలు పండక
    కరువిట నాట్యములు జేయఁ కలికాలమునన్
    వరదలు తోడుగ ముంచిన
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

    🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శ్రీ కంది శంకరయ్య గారి నమస్సుమాంజలి🙏🙏 .. ధన్యుణ్ణయితిని 🙏🙏

      నావి మరియు ఇంకొందరివి, మరికొన్ని పూరణలు మీ పరిశీలనకు నోచుకోలేదు..

      దయచేసి పరిశీలింప ప్రార్ధన 🙏🙏

      తొలగించండి
  49. నిరతమ్మిట జోడించుచుఁ
    గర యుగ్మమ్ములు ముదమ్ముగఁ బ్రశాంతంబౌ,
    శరణమ్మని వేడు కొనుచు,
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్


    పరఁగిన శిష్ట కార్యరతిఁ బార్థుల నెల్లరు భక్తి యుక్తులై
    నిరతము కోరుకొందు రట నీరజ పత్ర విలోచనా భువిం
    బరఁగిన దుష్ట కార్యరతిఁ బార్థలతోడ జితాంబుజాస్య! లే
    మ! రణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలలో మొదటిది ప్రశస్తంగా ఉన్నది. రెండవది అర్థం కాలేదు. దయచేసి వివరించండి.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      అంతగా నన్వయలోపముగా నున్నదాండి నా పూరణము!

      నా భావము పద విభజనతో విశదపఱచఁ బ్రయత్నించెద నండి.

      శిష్ట కార్యరతిఁ బరగిన బార్థుల నెల్లరు భక్తి యుక్తులై నిరతము కోరుకొందురట భువిన్
      దుష్ట కార్యరతిఁ బరఁగిన బార్థల తోడ రణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై
      మిగిలినవి సంబోధనలే.
      నీరజ పత్ర విలోచనా
      జితాంబుజాస్య: జయింపఁబడిన చంద్రుఁడు గల ముఖము కలదానా
      లేమ: మగువా
      గుణదోషములఁ దెలుప గోరెదను.

      తొలగించండి
  50. అరువగ జూచు భార్య పయి నామెయు వృద్ధయె యేమి చేయులే
    సరియని తగ్గు, ప్రేమగను చల్లగ నామెను తాక నామెయున్
    సరిసరి యిప్పు డేమి సరసాలను, వృద్ధులె యైన భార్య ప్రే
    మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై.


    రిప్లయితొలగించండి
  51. గరళము మ్రింగి కాచె నలికాక్షుడు, పాపులు లోకకంటకా
    సురులను సంహరించి యిలఁ స్యూమము నిల్పిన దాదిశక్తియే
    నరులకు దారహమ్ము రఘునందనుఁ జీవన మిట్టి దేవతా
    స్మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై౹౹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'రఘునందను' తరువాత అర్ధానుస్వారం అవసరం లేదు.

      తొలగించండి
  52. ధరణిని జీవరాశి కది ధర్మమటంచును జాతిపెంపుకై
    విరివిలుకాడు బాణముల వేయు నటందురు సత్యమే కదా
    హరిసుతుడైన మన్మథుని యస్త్ర మహత్తది మోహమందు కా
    మ రణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై.

    రిప్లయితొలగించండి
  53. వరమై దొరికిన జీవన
    హరువున్, బరువులకు నోర్చి
    యాస్వాదనమున్
    దరిజేర్చి, ముక్తి నొందగ
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!

    రిప్లయితొలగించండి
  54. ఉరగము కంఠాభరణము
    కురులందున సుమమువోలె కుముదేశుడనే
    ధరియించిన శివ నామ
    స్మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కుదేశు దలన్ ధరియించిన..." అనండి.

      తొలగించండి
  55. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    *"మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్"*

    సందర్భము:
    మారుతి సంజీవనీ పర్వతాన్ని తెచ్చేటపుడు విఘ్నం కలిగించమని రావణుడు చెబితే
    "సీతాం ప్రయచ్ఛ రామాయ.." (రామునికి సీత నిమ్ము.) అని కాలనేమి చెప్పినాడు. (అధ్యాత్మ రామాయణం..యుద్ధకాండం 6 స. 46 శ్లో)
    ఇతః పరం వా వైదేహీం
    ప్రేషయస్వ రఘూత్తమే
    అధ్యాత్మ రామాయణం.. (యుద్ధ కాండం.. 10 స. 54 శ్లో)
    ఇకనైనా సీతను రాముని వద్దకు పంపించు.. అని మండోదరి చెప్పినది.
    ఇంకా విభీషణుడు కుంభకర్ణుడూ చెప్పినాడు.. ఎవరు చెప్పినా రావణుడు వినలేదు.

    ధర్మప్రియులు నరులు.
    నరులంటే మానవులు.
    ధర్మాధర్మ విచక్షణ లేని వారు అసురులు.
    అసురులంటే రాక్షసులు.
    అసురులతో నరుల కెప్పుడూ బాధ లుండనే వుంటవి.
    రావణాదులు రాక్షసులు.
    రామాదులు మానవులు.
    మానవుల ధన మాన ప్రాణాదులను దోచుకోవటం రాక్షసుల సరదా..
    ఐతే ఆ యుగంలో నర నారీ పీడాసక్తుడు ఒక్క రావణుడే కనిపిస్తున్నాడు. కాబట్టి ఒక్క రాము డవతరించడంతో సరిపోయింది. కాని ఈనా డడుగడుగునా నారీ పీడాకరు లంటే స్త్రీలను పీడించేవారు.. అత్యాచారాలు హత్యాచారాలు చేసేవారు సమాజంలో మితిమీరిపోతున్నారు. ఇది అత్యాశ అనుకోకపోతే ఇంటింటా ఒక రాము డవతరించాల్సిన తరుణం ఏతెంచింది.
    కాబట్టి యువతీ యువకు లందరూ కేవలం సంతానం కలుగా లని మాత్రమే కోరుకోవడానికి అలవాటుపడటం పొరపా టని తెలిసికొని రామునిలాంటి సంతానం మాత్రమే కలుగా లని కోరుకోవడం నేర్చుకోవాలి.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    సరిగా రామునిఁ బోలిన
    నరునిం గనఁ గోరుకొంద్రు.. నారీ పీడా
    కర రావణా ద్యసురులకు
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    6.11.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  56. నిరతము పరమాత్ముని శ్రీ
    చరణములే దిక్కు నమ్మి శరణమ్మంచున్
    పరమును వరముగ దలచుచు
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

    రిప్లయితొలగించండి
  57. బరువయి కన్నవారలకు, బాధగ జీవనమై, కదల్చగా
    కరమును కాలు నింకొకరి గానక, గ్రమ్మిన పక్షవాతమై,
    నిరతము శయ్యకుం దగిలి, నిత్యము చచ్చుట లేలరా? హఠా
    న్మరణము గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై.

    రిప్లయితొలగించండి
  58. కరములుమోడ్చుచునెపుడున్
    హరిహరబ్రహ్మాదిదులెల్ల హాయిగమదిలో
    నిరతమునిలుపుచుభువిలో
    మరణమ్మేగోరుకొంద్రుమానవులెపుడున్
    ++++++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  59. సమస్య :-
    "మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్"

    *కందం**

    జ్వరమునకు కారణమ్మై
    భరియించగలేని హెచ్చు బాధలు పెట్టన్
    పురమున పీడిత దోమల
    మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
    .....................✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పీడిత దోమల' దుష్టసమాసం. అవి పీడించేవే కాని పీడితాలు కావు కదా! "పురమున హెచ్చిన దోమల" అనండి.

      తొలగించండి
  60. కరిమొర వినివేగము గా
    సిరికిని చెప్పక పరుగున శ్రీహరి రాగా
    మురహరుడౌ యా దానవ
    హరుని కరమునందు చక్రమలరారు గదా.

    2.కం:శిరమునశశి,డమరుకమది
    హరుని కరమునందు, చక్రమలరారు గదా.
    కరివరదుండగు నా శ్రీ
    హరికరముల కంబుతోడ ననవరతంబున్

    3.కం:నిరతం బుండును శూలము
    హరుని కరమునందు, చక్రమలరారు గదా.
    సురలను మునులను కావగ
    కరిరాజ వరదుని దివ్య కరముల యందున్.

    4కం:కరుణాకర కావుమనుచు
    కరిమొరలిడనాలకించి కారుణ్య ముతో
    పరుగున వచ్చిన దానవ
    హరుని కరమునందు చక్రమలరారు గదా.

    5.కం:కరుణను చూపగ రారా
    మురారి యనుచును మొరలిడు పుడమీ సురులన్
    సరుగున గాచిన రాక్షస
    హరుని కరమునందు చక్రమలరారు గదా.

    6.చం:అరదము నెక్కి సాగుచును యామిని యందు
    నవేణువూదుచున్
    మరులను గొల్పి మానినుల మానసముల్ హరియించు చున్నటన్
    నిరతము పాండు పుత్రులకు నెమ్మిని కూర్చిన
    శ్రీరమా మనో
    హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్"*




    రిప్లయితొలగించండి