12, నవంబర్ 2019, మంగళవారం

సమస్య - 3189 (మాతృభాషలోఁ జదువుట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మాతృభాషలోఁ జదువుట మానుటొప్పు"
(లేదా...)
"మన బడులందిఁకన్ జదువు మానుటె యొప్పగు మాతృభాషలో"

58 కామెంట్‌లు:

  1. పొట్ట నింపదు తెలుగంచు మూర్ఖు లిపుడు
    పలుకుచున్ వారు సర్కారు బడుల లోన
    నాంగ్ల మాధ్యమ బోధననంట గట్ట

    మాతృభాషలోఁ జదువుట మానుటొప్పు

    రిప్లయితొలగించండి

  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    ఘనమగు మాటలన్ పలికి గందర గోళపు రాజకీయమున్
    వినుటకు తియ్యనిన్ తెలుగు వృత్తములందున పాటపాడుచున్
    తినుటకు తిండి నిచ్చెడివి తీరులు తెన్నుల చూపకుండగా
    మన బడులందిఁకన్ జదువు మానుటె యొప్పగు మాతృభాషలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      "వినుటకు తియ్యనౌ తెలుగు..." అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  3. మమ్మి డాడీల సంస్కృతి మనకు ముద్దు
    అమ్మయనుమాట చేదాయెనయ్యొనేడు
    తెలుగు భాషకు నేడేల తెగులుబట్టె
    మాతృభాషలో చదువుట మానుటొప్పు

    రిప్లయితొలగించండి
  4. ఘనుడయి మంత్రివర్యులకు గాంక్షలు దీరగ నాంధ్రభూమికిన్
    దనపరిపాలనంబునను దన్మయతన్ గలిగింతుగాన న
    న్ననయము నమ్ముడీ రనుచు నందము లొల్క వచించువా డనెన్
    మన బడులందిఁకన్ జదువు మానుటె యొప్పగు మాతృభాషలో.

    రిప్లయితొలగించండి
  5. ఆంగ్ల మందుమునిగి అమ్మ ఆలి నొదిలి
    ధనము పైమోజు నతరలె తల్ల డిల్లి
    మాతృ భాషలోఁ జదువుట మాను టొప్పు
    భరత మాతను వీడుట భాగ్య మనదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒదిలి' అనరాదు. "ఆలిని విడి" అనండి.

      తొలగించండి


  6. తెలుగు నభివృద్ధి చేయుడి తేనెలూర
    యనిన వేళన రరెనొక్క రైన నోరు
    విప్పలేదు మౌనము వహించిరి! జిలేబి,
    మాతృభాషలోఁ జదువుట మానుటొప్పు
    యనిన వేళని హైరాన హైలెస లెస!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తేనెలూర ననిన... మానుటొప్పు ననిన.." అనండి.

      తొలగించండి

  7. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వినుటకు ఘోరమౌ పలుకు వీనుల బాదెను కార్తికమ్మునన్:
    "మన బడులందిఁకన్ జదువు మానుటె యొప్పగు మాతృభాషలో"
    కనగను ముద్రణన్ చెడుగు కానగ వచ్చెను కైపదమ్మునన్:
    "మన బడులందిఁకన్ జదువు మానుటె యొప్పదు మాతృభాషలో"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. అదురహో!
      వెంకయ్య గారు నొప్పు నొప్పు, నొప్పి కాదని పలికిరి !

      జగను బాబు గవర్నమెంటు ఉసుకూలు లోన ఇంగ్లీషు పెడితే ప్రైవేటు వుసుకూలు వారలకు ఢోకా పడుతుందేమో! మరీ యీ క్రిటిక్కులు పెయ్డు క్రిటిక్కులై ఉంటారు జగనన్నా ముందుకు సాగి పో. మాటినమాక!


      జిలేబి

      తొలగించండి
    2. ముద్రణాస్ఖాలిత్యంగా మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. (ఎందరో ఆంధ్రులు , ఆంధ్రేతరులు మెచ్చారు తెలుగుని . మనమేమీ చేయక కదలక మెదలక మిన్నకుంటే చాలని నేతల ఉద్దేశం ! కంగారెందు
    కయ్యా నీకు తెలుగయ్యా ? )
    తెనుగు పలుంకు వేదమనె
    ధీయుతరూపుడు సోమనాథుడే !
    తెనుగది లెస్స యంచు గడు
    దీయగ బల్కెను కృష్ణరాయడే !
    తెనుగులుగా జనించుటది
    దివ్యమనెన్ కవి సుబ్రమణ్యుడే !
    తెనుగుదనమ్ము గొప్పదని
    తెల్లముజేసెను పాపయార్యుడే !
    ఘనులగు నింద రివ్విధిని
    గట్టిగ మెచ్చగ మిన్నకుండుమా !
    మన బడులందికన్ జదువు
    మానుటె యొప్పగు మాతృభాషలో .

    రిప్లయితొలగించండి
  9. మాతృ భాష లోన జదువుట మాను టొప్పు
    ననుట హర్షింప రెవ్వరీ యవని యందు
    పేద సాద ల బాగుకై విద్య యందు
    మార్పు జేయ మాధ్య మము ను మార్చి రిపుడు

    రిప్లయితొలగించండి


  10. మనుగడ తీరు కైవలయు మా పిల వాండ్లకు దేశమెల్లెడన్
    మన బడులందిఁకన్ జదువు; మానుటె యొప్పగు మాతృభాషలో
    తనరదు సూవె విద్యయను తప్పగు నమ్మిక! రాజకీయముల్
    మనమిక కట్టిపెట్టెదము మన్నిక తోడుత వృద్ధి గాంచగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పదవి యిచ్చిన దన్నుతో పాలకుండు
    ఖాద మొందుట కాంగ్లమే కఱచు మనుచు
    తల్లి నేర్పిన వాణిని తఱకు జేయ
    మాతృభాషలో చదువుట మానుటొప్పు

    రిప్లయితొలగించండి
  12. పిన్న నాటనె వికసించు వేగవేగ
    కొండిక మది , యొత్తిడి పడకుండ జేయు
    మాతృభాషలోఁ జదువుట ; మానుటొప్పు
    దొందరబడుచు తెలుగును దొలగ. జేయ

    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    మన బడులందిఁకన్ జదువు మానుటె యొప్పగు మాతృభాషలో !

    జనవరి వచ్చి చైత్రమును చాటొనరించెను , యాక్సు యాంటుల...
    మ్మను మన ఆవుమాట మటుమాయము చేసెను, నింగి చందమా...
    మను కబళించె ట్వింకిలనుమానమదేలనొ ? మిన్నకున్నచో
    మన బడులందిఁకన్ జదువు మానుటె యొప్పగు మాతృభాషలో !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  14. ఆంగ్ల బడులలోఁ జదువుల ననుసరించి
    తెలుఁగు వ్రాయుట చదువుట తెలియలేని
    ప్రజలు ప్రభుతను బొగడుచుఁ బలికిరిటుల
    *"మాతృభాషలోఁ జదువుట మానుటొప్పు"*

    రిప్లయితొలగించండి

  15. నా పూరణ. చం.మా.
    ** *** *** **

    ఘనమగు దెల్గు తల్లి కడు గద్గద కుత్తుక బల్కె నిట్టులన్

    " తనరుచు దల్లిపాలు మరి త్రాగియు రొమ్మును గ్రుద్దుటేలనో

    కనకపు జీవితమ్ములవి కల్గు పఠించగ మాతృభాషలో

    కనుకను బిడ్డలార క్షణకాలము యోచన జేయు మెవ్విధిన్

    మన బడులందికన్ జదువు మానుటె యొప్పగు మాతృభాషలో!


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  16. మధుర మైయొప్పు భావాలు మానవులకు;
    చక్కగా వ్రాయ నిరతము సలుప వలయు;
    చక్కగా నేర్చుకొన భాష సంశయమును ;
    మాతృభాషలోఁ ; జదువుట ; మానుటొప్పు !
    **)(**
    (క్రమాలంకార పూరణ)


    భాషలోఁ ; జదువుట ;మానుటొప్పు

    రిప్లయితొలగించండి
  17. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఘనమగునట్టి పెత్తనమె గల్గగజేయు నహమ్ము తోడుగా
    మనమున దోచినట్టిదగు మంచిది గాని విధమ్మునన్ దొరే
    ననువగు దెల్గు కెల్లెడల నడ్డులు గూర్చుచు నాంగ్ల ముంచగన్
    మన బడులందికన్ జదువు మానుటె యొప్పగు మాతృభాషలో

    రిప్లయితొలగించండి
  18. మాతృదేశంబు ప్రాశస్త్య మవని జాట
    మరువ దగదెట్టి వారైన మాతృ భాష
    మాతృభాషలోఁ జదువుట మానుటొప్పు
    ననుట రొమ్ము గుద్దుటె త్రాగి యమ్మ పాలు

    రిప్లయితొలగించండి
  19. తెనుఁగదియన్నఁ దీయనని ధీమతి రాయలుచెప్పెనెప్పుడో
    తెనుఁగునకెందరో వినుతిఁదెచ్చిరి వ్రాయుచు పద్య కావ్యముల్
    ఘనతరమైననట్టితెనుగక్కటనేడిటుదైన్యమొందెగా
    మన బడులందిఁకన్ జదువు మానుటె యొప్పగు మాతృభాషలో

    రిప్లయితొలగించండి
  20. ఉండగోరిన నమెరికా ఖండమందు
    మాతృభాషలో జదువుటమానుటొప్పు
    మాతృభాషకు బదులుగ మాండలికపు
    నాంగ్లభాషను జదువుట యరయమేలు

    రిప్లయితొలగించండి
  21. తెలుగు తల్లి గొంతు నొక్కితే జరుగ బోవు పరిణామము భవిష్యత్తులొ (ఇది నా అభిప్రాయము మాత్రమే సుమీ ) ఎవరిని కించ పరచి కాదు


    నన్నయ యెవరన నాన్నబంధువులుని పలికెను రయముగ బాలుడొకడు

    తిక్కనా ర్యుడెవరన తేనీరు నమ్మేటి తిక్కశంకరుడని తెలిపె నొకడు,

    యెర్రాప్రగడ యన యెర్రగ బుర్రగ నుండేటి వాడని నుడివెనొకడు,

    వేమన యెవరన వీధి చివర నుండు వెర్రి యనె నొకడు బుర్ర నూపి,

    అమ్మ యన్నయెవరనగ డాడి మదరని మామమ్మి మాకు తెలిపె

    నని వాగె నొక్కడు ఘనతతో, జరుగ గలవు భవిష్యత్తులో లక్షణముగ


    యిట్టి పరిణామములు మన యిళ్ళ లోన,
    (మాతృభాషలోఁ జదువుట మానుటొప్పు)
    ననుచు తెలుగు తల్లి కుతిక మనము నొక్క,
    తెలుగు జనులార రయముగ తెలుసుకొనుము

    రిప్లయితొలగించండి
  22. పాఠ్య పుస్తకములు చూడ పరులభాష
    అనువదించెడి గురువుల కమిత ఘోష
    అర్ధమవని విద్యలెపుడు వ్యర్ధ ములెగ
    మాతృభాషలోఁ జదువుట మానుటొప్పు

    రిప్లయితొలగించండి
  23. మాతృ భాషలో జదువుట మాను టొప్పు
    ననుచు మాటలు వర్షింప నగవు గాదె
    భాష మారిన సంస్కృతి బయట బడద
    తెలుగు వారము మనమంత తెలుగె ముద్దు

    మన బడులందికన్ జదువు మానుట యొప్పగు మాతృ బాషలో
    యనుచు తలంచి మాన్పెడు ప్రయత్నము జేయక మిన్నకుండి నన్
    జనుల తలంపు నేర్వక విశాల ప్రపంచము గూర్చి మాటలా
    డిన మనకేమి యొప్పగు గడించుట కన్న శ్రమించుటే శుభం

    రిప్లయితొలగించండి
  24. పొరపాటున యోగి వేమన నేటి విద్యను, విద్యార్థులనూ చూస్తే ఈ విధంగా స్పందిస్తాడేమో....

    వినినది కంఠ పాఠమయి వేయును వల్లియ నేటి బాలపా
    ఠనుడు, నిరర్థకంపు నిపఠమ్ములఁ జూచి భ్రమించునేమొ వే
    మన, బడులందిఁకన్ జదువు మానుటె యొప్పగు! మాతృభాషలో
    ఘనముగ నాదు పద్యములఁ జ్ఞానముఁ గ్రోలినఁ చాలుచాలనున్౹౹

    రిప్లయితొలగించండి
  25. సహజ సిద్ధముగావచ్చు చక్కనైన
    మాతృభాషలోఁ జదువుట మానుటొప్పు"*
    ననుట న్యాయమౌనె చెపుమ యవనియందు
    నమ్మలననాద రించినట్లౌను గాదె.

    అమ్మపాలును త్రాగుచు రొమ్ము గుద్ది
    నట్టు లను సామెతయు సత్యమయ్యె నేడు
    మాతృభాషలోఁ జదువుట మానుటొప్పు
    ననుట బాధకలుగ చేయు నండ్రు బుధులు.

    రిప్లయితొలగించండి
  26. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    మాతృభాషలోఁ జదువుట మానుటొప్పు

    సందర్భము:
    *అధ్యాత్మ రామాయణం* వేదవ్యాస ప్రణీతం.. బ్రహ్మాండ పురాణంలోనిది. అందులో ఇలా పేర్కొనబడింది.
    ప్రియాయై గిరిశ స్తస్యై
    గూఢం వ్యాఖ్యాతవాన్ స్వయం
    పురాణోత్తమ మధ్యాత్మ
    రామాయణ మితి స్మృతమ్
    శివుడు ప్రియురాలైన పార్వతీదేవికి స్వయంగా రహస్యమైన అధ్యాత్మ రామాయణ మని పేరొందిన ఉత్తమ పురాణాన్ని వివరించి చెప్పాడు.
    కార్తిక పూర్ణిమ నా డీ ప్రసక్తి రావటం ఔచిత్యభరితం.

    రామాయణం చదువుతూ పైకి వినిపించకుండా లోలోపలే గొణుక్కుంటున్న ఒక శిష్యునితో గురువుగా రిలా అంటున్నారు.
    "తెలుగే కదా! మనకు తెలుసులే! ఎలా చదివితే ఏముందిలే! అనుకొని ఏదో రీతిగా పలుమ (గొణుగ) రాదు. అలా చేస్తే ఉచ్చారణ దోషా లేవో తెలియకుండాపోతాయి సుమా!
    అందుకే చదివేటప్పుడు గొంతెత్తి బిగ్గరగా పలుకాలి. లోలోపలే చదువుకోవటం మానుకోవాలి."
    రామగాథకైనా మాతృభాషకైనా అన్వయిస్తుంది లోఁ జదువటం మానుకోవా లన్నది.

    పలుకు దోషాలు= ఉచ్చారణ దోషాలు
    పలుముట= శబ్దం పైకి వినిపించకుండా పెదవులాడించడం.. లోలోపల గొణుగటం.. (గద్వాల మాండలికం)
    విశ్వనాథుని రాముని విమల గాథ =
    1.విశ్వనాథ రామాయణంలోని రాముని కథ..
    వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితి వంచనిపించుకో.. అన్న తండ్రి యాజ్ఞ మేరకు జీవుని వేదనను బట్టి అద్భుతంగా కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిచేత విరచించబడింది "శ్రీమద్ రామాయణ కల్పవృక్షము."
    2.విశ్వనాథుడైన రాముని కథ..
    విశ్వస్య సృష్టి లయ సంస్థితి హేతు రేక స్త్వం.. విశ్వంయొక్క సృష్టి స్థితి లయాలకు నీ వొక్కడవే హేతువువు.. అని సుతీక్ష్ణ ముని ప్రస్తుతించాడు.
    3. విశ్వనాథుని (శివుని) యొక్క రాముని విమల గాథ.. అంటే శివుడు పార్వతికి చెప్పిన రామ కథ
    లోఁ జదువుట=లోలోపల గొణుగుకొనుట
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    పలుకు దోషాలు తెలియవు..
    తెలుగె యనుచు
    పలుమ దగదోయి! గొంతెత్తి పలుకదగును..
    విశ్వనాథుని రాముని విమల గాథ
    మాతృభాష... లోఁ జదువుట మాను టొప్పు..

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    12.11.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  27. మంచి బుద్ధిని నీ వింకఁ బెంచ కున్న
    మించి పెద్దల నిఁక గౌరవించ కున్న
    మంచి మతి నుంచి నే వివరించి చెప్ప
    మాతృభాషలోఁ, జదువుట మానుటొప్పు


    కనఁదగ నంత విత్త గుణకారపు బుద్ధినిఁ గల్గి యుండినం
    గనపడ కుండఁ బోవ నుపకారికి నెంచిన వాని మెచ్చినం
    గని నిను బెంచి నట్టి మమకారపుఁ దల్లినిఁ దల్చకుండినన్
    మన బడులందిఁకం జదువు మానుటె యొప్పగు మాతృభాషలో

    రిప్లయితొలగించండి
  28. మనబడులందికన్జదువుమానుటెయొప్పగుమాతృభాషలో
    ననుటనునొప్పుగాదిలనుహర్షముజెందరులోకులెవ్వరున్
    వినుమది నేనుజెప్పుదునుబేర్మినినేర్వగమాతృభాషలో
    ననువుగనర్ధమౌచునటయడ్డులులేకనుసాగిపోవుగా

    రిప్లయితొలగించండి
  29. విన మెవ రేమి చెప్పినను వేగిరమే మన పాఠశాలలన్
    ఘనమగు నాంగ్లమే వెలయు కాగల బోధన మాధ్యమమ్ముగా
    వినుడని చెప్ప మంత్రి యిక వేరొక డున్నదె దారి వెంటనే
    మన బడులందిఁకన్ జదువు మానుటె యొప్పగు, మాతృభాషలో
    నన విన నోచబోని చదు వన్నను కాదె నిరర్ధకం బిలన్.

    రిప్లయితొలగించండి
  30. చం.
    తనమన వారలందరి విధానము
    లన్నియు మారె, కాలమే
    మనవలెనిట్టి భారత సమాజము నంతయు నాంగ్ల మాక్రమిం
    పను,తెగ సద్వివేకము తుఫానున గొట్టుక బోవ జూడగా
    మన బడులందిఁకన్ జదువు మానుటె యొప్పగు మాతృభాషలో
    తే.
    దేవ భాషను మరపించు తెల్గు చచ్చె
    మమ్మి డాడుల పల్కులు మారు మ్రోగె
    నన్ని భాషలన్ మ్రింగగ నాంగ్లమొచ్చె
    మాతృభాషలోఁ జదువుట మానుటొప్పు

    రిప్లయితొలగించండి
  31. తండ్రి నుద్యోగబదిలీగ తరలివెళ్ల?
    డిల్లియందున జదివించ"పిల్లకచట
    మాతృభాష లోజదువుట మానుటొప్పు
    ఆంగ్ల మేగద ననువైన దనుటతప్ప!
    శ్రీ. కె.ఈశ్వర ప్ప.ఆలూరు.

    రిప్లయితొలగించండి
  32. ముఖ్యమంత్రి ఉవాచ...

    చంపకమాల
    అనుటకు నిందజేయుటకు స్వార్థము గుర్తుకు రాదె వారికిన్?
    తనయుల నాంగ్లమున్ జదువు దారుల కంపుట విస్మరించిరే!
    వినుడు ప్రపంచమందు మన పిల్లల ధీటుగ నిల్ప నాదు కా
    మన బడులందిఁకన్ జదువు మానుటె యొప్పగు మాతృభాషలో

    తేటగీతి
    మాత యొడిలోన నేర్చిన మాతృ భాష
    బోధనమున గూర్చిన మేలు, భుక్తినంద
    మాతృభాషలోఁ జదువుట మానుటొప్పు
    ననక యాంగ్ల బోధ లదన మైన చాలు




    రిప్లయితొలగించండి
  33. ఘనమగు భాష యాంగ్లమది కావలె బోధన భాషగా, భువిన్
    మనుగడలేని భాషనిక మానుటమేలని చెప్పి నేతలే
    మనదగు మాతృ భాషను సమాధిని చేయగ నెంచిరే కనన్
    మన బడులందిఁకన్ జదువు మానుటె యొప్పగు మాతృభాషలో

    రిప్లయితొలగించండి
  34. భావమేభాషలోదెల్పపరుగులెత్తు?
    సారమెరుగగ నేవిధిసాధకుండు?
    సాటి భాషను దూలుట సమత యగునె?
    మాతృభాషలో,జదువుట‌,మానుటొప్పు
    కొరుప్రోలు రాధాకృష్ణారావు,





    రిప్లయితొలగించండి
  35. ఆంగ్లమందున విద్యల నభ్యసింప
    పలు విదేశము లందున కొలువు దొరకు
    భరత దేశములో పని దొరకకున్న
    మాతృభాషలోఁ జదువుట మానుటొప్పు

    రిప్లయితొలగించండి
  36. ధన సముపార్జనమ్ముఁ గన ధారుణి పైయొనగూడు సౌఖ్యముల్
    కనము పనుల్ స్వదేశమునఁ గల్గు జనమ్ముల కారణమ్మునన్
    పనులు విదేశమున్ గలుగు పట్టును గాంచిన నాంగ్లమందునన్
    మన బడులందిఁకన్ జదువు మానుటె యొప్పగు మాతృభాషలో

    రిప్లయితొలగించండి
  37. తెనుగదియేలనింక,తెలతెల్లగమారును తెల్వినంతయున్
    తెనుగును నేర్చినంతనిల , తీరుగ దెప్పనుగాల్చినట్లగున్
    ఘనమగుకొల్వుగోరుటకు, ఘాటుగనాంగ్లమునేర్వమంచిదౌ
    మనబడులందికన్,జదువు, మానుటె గొప్పగు మాతృభాషలో!

    రిప్లయితొలగించండి
  38. కునుకున ముంచివేసినిను,కుట్రలె జేయును తోటివారితో
    మునుమునబట్టి పీకినచొమూలములన్నియు యెండిపోవగన్
    చనువది జంపగావలెను,చప్పుననేడిక మాతృభాషపై
    మనబడులందికన్ జదువుమానుటె గొప్పగు మాతృభాషలో

    రిప్లయితొలగించండి
  39. అనయము మాతృభాషయని, యంగలనార్చుటమానుమింకనున్
    వినయమునిచ్చు విద్యలవి,వీధికి నెట్టును పోటిధాత్రినన్
    గుణముగ గెల్చు భాషయన, గుట్టుగజెప్పగనాంగ్లమేయగున్ !
    మనబడులందికన్ జదువు, మానుటె గొప్పగు మాతృభాషలో

    రిప్లయితొలగించండి
  40. ధనమునుబొందగోరినచొ,దారినిమార్చుటమేలు సోదరా!
    వినయమునిచ్చువిద్యలకు,వీక్షణ యుండదు భావికాలమున్
    పనుపుననేర్వమేలగును పద్ధతిమార్చుచునాంగ్లభాషనే
    మనబడులందికన్ జదువు మానుటె గొప్పగు మాతృభాషలో!!
    +++++++++++++++++++++++++++++++++++++++++++
    [ఆంగ్లాంధ్రప్రదేశ్ ప్రభుత కామన]

    రిప్లయితొలగించండి
  41. సునిశితమైన భావనను సూనృతవాక్యమువోలెజెప్పునీ
    ఘనమగు భాషయందిటుల,గారవమిప్పుడు తగ్గజేయుచున్ ?
    మనమునదోచినట్లుగను,మన్నననివ్వని వారిచేతులన్
    మనబడులందికన్, జదువుమానుటె గొప్పగు మాతృభాషలో!

    రిప్లయితొలగించండి
  42. ధనమును బెద్దసేయుటకు,దారినిజూపెడు నట్టిదాంగ్లమే
    గొణకొనియెవ్వరైనయిల,గోసలుబెట్టిన జూచినేతలే
    మనసున మాతృభాషపయి ,మన్నన బెంచుట మానకున్నచో
    మనబడులందికన్, జదువుమానుటె గొప్పగు మాతృభాషలో!

    రిప్లయితొలగించండి