13, నవంబర్ 2019, బుధవారం

సమస్య - 3190 (శుభములు లభియించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శుభములు లభియించుఁ గాక చోర విటులకున్"
(లేదా...)
"శుభములు గల్గుఁ గాక ఖల చోర విటాళికి శిష్టు లౌననన్"

38 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    సభలను నెత్తికెత్తుచును సంఘము నందున పాట పాడుచున్
    విభవము నిచ్చి యెన్నికలు వీలుగ గెల్చెడి దారిజూపుచున్
    నభమున కెత్తి రాక్షసులు నమ్మిన బంట్లకు రాజ్యమీయగా
    శుభములు గల్గుఁ గాక ఖల చోర విటాళికి శిష్టు లౌననన్

    రిప్లయితొలగించండి
  2. అభయమొసంగును హరుడే

    శుభ సౌఖ్యములు వరియించు సుజనుల కనుచున్

    విభుడే శపించు నిటుల న

    శుభములు లభియించుఁ గాక చోర విటులకున్"

    రిప్లయితొలగించండి
  3. అభయము నీయము కృష్ణా
    విభవమునే గోరి జనులు విజ్ఞత విడిరే
    విభుడవికను కలిగించుమ
    శుభములు లభియించుఁ గాక చోర విటులకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "అభయము నొసగుము" అనండి.

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    విభవము లేనివారు, రసవీథి చరించెడివారు , మత్తులో
    నభము శుభమ్మునెంచక ధనాదుల చౌర్యము జేసి చిక్కినా...
    రభవ ! రవంత దివ్య కరుణామృతమున్ కురిపించి మార్చవే!
    శుభములు గల్గుఁ గాక ఖల చోర విటాళికి శిష్టు లౌననన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. గురువు గారు నమస్కారము నిన్నటి పూరణ. ఒకసారి పరీశీలించండి

    రిప్లయితొలగించండి
  7. ( వంకరటింకర పలుకుల రాజుగారి బావమరది
    శకారుడు మోహంతో సుందరి వసంతసేనతో )
    ఇభగమనా ! వసంత ! విన
    వేమె మదీయపు భాషణంబులన్ ?
    ప్రభువును దింపి నేను పరి
    పాలన జేసెద జృంభణంబుగా ;
    నభయము నిచ్చుచుంటి నిక
    నమ్మవె ; నాదగు రాజ్యమందునన్
    శుభములు గల్గుగాక ! ఖల
    చోరవిటాళికి ; శిష్టు లౌననన్ .
    ( ఇభగమన - గజగమన ; జృంభణముగా -పుష్కలముగా )


    రిప్లయితొలగించండి
  8. అభయము నిచ్చును ముదముగ
    నభమున సరసమ్ము లాడు నలువ యనంగా
    విభవము నతేలు చుండగ
    శుభములు లభియించుఁ గాక చోర విటులకున్

    రిప్లయితొలగించండి


  9. నా పూరణ. చం.మా.
    ** *** *** **
    ప్రభువు త్రిలోచనుండును కపాలి పురారి దిగంబరుండు దా

    నభయ మొసంగుచున్ సతత మా కడు దీనులు సజ్జనాళికిన్

    విభవము, సౌఖ్యమిచ్చు కద ప్రీతి;త్రియంబకు డెట్లు గాచయో

    శుభములు గల్గు గాక ఖల చోర విటాళికి శిష్టు లౌననన్


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి

  10. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పాపము శమించుగాక!

    శుభములు గల్గుఁ గాక ఖల చోర విటాళికి శిష్టు లౌననన్!
    విభవము గల్గు గాకనిక భీరులు నీచులు రాసభాలకున్!
    రభసలు గల్గు గాక వడి రాజులు సాధులు పండితాళికిన్!
    సభలను గల్గు గాక భళి సంస్తుతి గుఱ్ఱము శాస్త్రి వర్యుకున్!

    రిప్లయితొలగించండి




  11. ప్రభువుని బిడ్డల్లారా!
    శుభములు లభియించుఁ గాక! చోర విటులకున్
    రభటిల్లు రీతి దేవుడు
    లభించు సత్యంబు పాపులకు సై ! ఆమెన్!


    పరలోకంలో ఉన్న మా యేసు భూ లోకమంతటికి వెలుగు


    ఆమెన్!
    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. అభములు తెలియని పిల్లలు 
    సుఖముగ ఆటల చదువుల శోభల నుండన్ 
    చెరచెడు దుష్టులకున్ యా  
    శుభములు లభియించుగాక చోర విటులకున్ 

    రిప్లయితొలగించండి


  13. సభకు జనుల్ జపమ్ములకు సాదరమై తరలండి జెచ్చెరన్!
    ప్రభువుని బిడ్డలెల్లరికి భాసిలు కైవడి యేసునాధుడిన్
    శుభములు గల్గు గాక! ఖల చోర విటాళికి శిష్టు లౌననన్
    నిభముగ దక్కు, నిక్కముగ నెల్లరు పాపులకున్‌ తరాకుగా!

    యేసునాధుడె తీర్థము !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. ప్రభు వా కావుము పాపుల
    క భయ ము నొసగి యు ను వారి కండ గనీవై
    విభ వము గూర్చియు మార్చుము
    శుభ ములు లభియించు గాక చోర విటు ల కున్

    రిప్లయితొలగించండి
  15. విభుడయి దుష్టు డొక్కడు వివేకవిహీనుడు విస్తృతంబుగన్
    సభలను జేసి దేశమున సత్కృతులన్ విరమింపజేసి ధీ
    విభవము జూపువారలకు భీతిని గొల్పుచునుండ నచ్చటన్
    శుభములు గల్గుఁ గాక ఖల చోర విటాళికి శిష్టు లౌననన్.

    రిప్లయితొలగించండి
  16. అభయ మొసంగెడి దేవుని
    విభవము తలచుచు పరితప విమల మనమ్మున్
    విభుని పదములను పట్టిన
    శుభములు లభియించుఁ గాక చోర విటులకున్

    రిప్లయితొలగించండి
  17. శిశుపాలుని ఆగడం:

    చంపకమాల
    ప్రభువన లోక పూజ్యుడన భావ్యమె? దొంగిల పాలు వెన్నలన్!
    రభసలొనర్చ గోపికల ప్రాణసమానపు మాన చోరుడై
    సభలట! నగ్రపూజలట శౌరికి! !ధర్మజ! నీదు పాలనన్
    శుభములు గల్గుఁ గాక ఖల చోర విటాళికి శిష్టు లౌననన్

    రిప్లయితొలగించండి
  18. కం.

    ప్రభవము ప్రథమము మూలము
    అభయము సంఘము నొసగగ నదియే ద్వికము
    న్ను భయము వికటింప నిటుల
    శుభములు లభియించుగాక చోర విటులకున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  19. విభవముకై పెడదారులు
    నభమునుభూవలయములనునరకముజేయున్
    క్షభములువారణజేయ న
    శుభములు లభియించుఁ గాక చోర విటులకున్

    రిప్లయితొలగించండి
  20. ప్రభువులు గద్దెల కొఱకై
    యభములు కావేవి యని బకాసురులగుచున్
    విభవము గూడంబెట్టగ
    "శుభములు లభియించుఁ గాక చోర విటులకున్"

    రిప్లయితొలగించండి
  21. శిశుపాలుఁడు ధర్మరాజుతో..

    కందం
    ప్రభువగునె వెన్నదొంగిల
    విభవమ్మా? గోపికలను వేశ్యలుగ గొనన్!
    సభ నగ్రపూజ? లిటులే
    శుభములు లభియించుఁ గాక చోర విటులకున్!!

    రిప్లయితొలగించండి
  22. అభిమానముగా జనులిటు
    సభలో నిలిపిరి తెలియక చవటల నిటులన్
    ప్రభువే చోర శిఖామణి
    శుభములు లభియించుఁ గాక చోర విటులకున్

    రిప్లయితొలగించండి
  23. గురువు గారికి నమస్సులు
    విభుడే యిచ్చును శ్రీకర
    శుభములు, లభియించు గాక చోరవిటులకున్
    వుభయావమాన సిగ్గుయు
    ప్రభాత భేరిగ ,విధాత ప్రతిభయు కనుడీ !

    రిప్లయితొలగించండి
  24. అభవుని జేరదల్చుచు భయమ్మును వీడిపలాయనించియున్
    అభకము మీరి గోపకుని యక్కున జేరిరి గోపకాంతలున్
    అభయము నిచ్చె కృష్ణుడు సహాయుల కోర్కెలు తీర్చి వారికిన్
    శుభములు గల్గు గాక ఖల చోర విటాళికి శిష్టులౌననన్

    రిప్లయితొలగించండి
  25. ప్రభువును గలియగ మురియుచు
    అభినేత్రులు మనసున యభిమానము తోడన్
    ప్రభవము జేరగ బలికెను
    శుభములు లభియించుగాక చోర విటులకున్

    రిప్లయితొలగించండి
  26. చం.

    అభినయ మాడుచుందురట నాశము గోరగ సజ్జనాళికిన్
    ప్రభుతన గొల్వు బొందుటన పాపపు గార్యము జేయ ముచ్చటై
    నభయము లందజేతురట నక్కర మేరకు టక్కరాధముల్
    శుభములు గల్గు గాక ఖల చోర విటాళికి శిష్ఠు లౌననన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  27. అభయ నవనీత చోరులు
    శుభ వ్రజాన్వయ వధూ వసు మనో హరులున్
    విభవ శ్రీ చిత్త హరులు
    శుభములు లభియించుఁ గాక చోర విటులకున్

    [చోరవిటులకున్ = కృష్ణునకు, బహుమాన పురస్సర బహువచనము; విభవ శ్రీచిత్త హరులు = (భక్తుల) విభవము, లక్స్మీ దేవి హృదయమును హరించు వారు]


    అభయము నిచ్చి మార్చ వలె హత్యలు ధర్మము కాదు దుష్ట సౌ
    రభులని కూడ దెన్నఁడు నిరంకుశ మిద్ధర రాజ దండనం
    పు భయము పాఱఁ ద్రోల మఱి పూర్వపు బుద్ధిని వీడి యుండగా
    శుభములు గల్గుఁ గాక ఖల చోర విటాళికి శిష్టు లౌననన్

    రిప్లయితొలగించండి
  28. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    శుభములు లభియించుఁ గాక
    చోర విటులకున్

    సందర్భము:
    యుద్ధానికి ముందు లంకాద్వీపం చేరుకొని వానర సహితులైన రామలక్ష్మణులు ఆరాత్రి సువేలాద్రిపై విశ్రమించవలె ననుకున్నారు. రాముడు ఇలా అన్నాడు రావణుని గురించి.
    ఏకో హి కురుతే పాపం
    కాల పాశ వశం గతః
    నీచే నాత్మాపచారేణ
    కులం తేన వినశ్యతి
    (ఒక్కడు మాత్రం మృత్యు పాశాలకు చిక్కి పాపం చేస్తాడు. ఆ నీచుని అపచార ఫలంగా అతడే గాక అతని వంశ మంతా నశిస్తుంది.)
    చోరులో విటులో అయ్యేవాళ్ళు పై మాటలను గుర్తు పెట్టుకోవాలి.
    రావణుడు సీత నపహరించినాడు గాన చోరుడు. వాలి సోదరుని భార్యతో గడిపినాడు గాన విటుడు. వీరికి అశుభములే కలిగినవి. అట్లే ఎల్లప్పటికీ చోరులకు విటులకు అశుభములే కలుగని గాక!

    ఐంద్రి= వాలి
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    రభసలకు వెఱువని బల

    ప్రభవము గల రావణైంద్రు
    లకు నశుభంబుల్

    లభియించినట్లు సతము న

    శుభములు లభియించుఁ గాక
    చోర విటులకున్!

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    13.11.19
    -----------------------------------------------------------
    శ్రీ సూరం శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలతో..

    రిప్లయితొలగించండి
  29. విభవము కవితగు వారికి
    శుభములు లభియించుఁ గాక ; చోర విటులకున్
    నిభముల నెన్ని నుడివినను
    సభలను బయటను ఘటిల్లు సంపాతములే !

    రిప్లయితొలగించండి
  30. విభవము గోరి మానవులఁ విజ్ఞత వీడెడు దుష్టలన్ భువిన్
    విభుడవు గానమార్చుమని వేడుచు నుంటిని నీలకంఠుడా
    యభయమొసంగి దుర్మతుల హార్దము మార్చుచు వారికెల్లెడన్
    శుభములు గల్గుఁ గాక ఖల చోర విటాళికి శిష్టు లౌననన్

    రిప్లయితొలగించండి
  31. విభవములు గలుగు చోటున
    శుభములులభియించుగాక చోరవిటులకున్
    నభములు శుభములు దెలియని
    ప్రభులనుదాదోచుకొండ్రు పగలును ఱేయిన్

    రిప్లయితొలగించండి
  32. అభయమునిచ్చురామునకునన్నిప్రదేశములందుదప్పకన్
    శుభములుగల్గుగాక!ఖలచోరవిటాళికిశిష్టులౌననన్
    నభవునిశాపముండుటను నార్తినిగ్రుంగుచు నంత్యమందునన్
    విభవములన్నినూడ్చుకొనివేగతిబోవునుసోమశంకరా!

    రిప్లయితొలగించండి
  33. అభవుని దయతో మనలకు
    శుభములు లభియించు గాక; చోర విటులకున్
    అభిమానబలము పెరుగగ
    లభియించగ వలెను కీర్తి; లాలస తొలుగన్!

    రిప్లయితొలగించండి