16, నవంబర్ 2019, శనివారం

సమస్య - 3193 (ధర్మము వీడు వారలకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్"
(లేదా...)
"ధర్మము వీడు వారలకుఁ దప్పక కల్గును శాంతి సౌఖ్యముల్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

104 కామెంట్‌లు:

  1. విరించి.

    మర్మమెఱుంగ కుంటివి సుమా! యిది ఘోరము పాపమే కదా
    ధార్మికు డెవ్వడేని విని తాళగ లేడిక చాలు చాలికన్
    శర్మిల, తప్పుమాటల ప్రచారము చేయకు మంటి, నెవ్విధిన్
    ధర్మము వీడు వారలకు తప్పక గల్గును శాంతి సౌఖ్యముల్.

    రిప్లయితొలగించండి


  2. ధార్మికుడున్ యథార్థమును దప్పని వాడు యుధిష్టరుండు నా

    ధర్మజుడున్ సమీకమున ధర్మము వీడె వధింప ద్రోణునిన్

    ధర్మము నాల్గు పాదముల ధాత్రిని స్థాపన జేయ నెంచుచున్

    ధర్మము వీడు వారలకు తప్పక గల్గును శాంతి సౌఖ్యముల్


    -- ఆకుల శాంతి భూషణ్

    వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      (సమయాభావం వల్ల మీ పూరణను ఆకాశవాణిలో చదువలేకపోయాను. పేరు మాత్రం చదివాను)

      తొలగించండి

  3. ప్రాతః కాలపు గంభీర పూరణ:

    "అశ్వత్థామ హతః"; "న కరోతి న లిప్యతే"

    ధర్మపు మర్మమున్ తెలిసి, తప్పని వేళను కృష్ణుడాదటన్
    నిర్మల రీతి నేర్పినవి నేయములన్నియు నాచరించుచున్,
    కర్మపు యోగమున్ గఱచి, కర్మఫలమ్మున మోజులేక, త
    ద్ధర్మము వీడు వారలకు తప్పక గల్గును శాంతి సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    మర్మములేని మానసికమంజులవైష్ణవభక్తి యొక్కటే
    నిర్మలనిశ్చలస్థితిని నిర్గుణగమ్యముజేర్చు మానవా!
    ధర్మమధర్మమంచు పలుదారులవేలనొ ? లౌకికమ్మునౌ
    ధర్మము వీడు వారికిల తప్పక కల్గును శాంతి సౌఖ్యముల్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  5. మర్మము మానసం బునను మాటల జూడగ తేనెలూరుచున్
    భర్మమె దీక్షగా దలచి పాపపు కృత్యము సల్పువారటుల్
    నిర్మల చిత్తులన్ పరుల నీమము నిష్టల పాడుజేయు నా
    ధర్మము వీడువారలకు దప్పక కల్గును శాంతిసౌ ఖ్యముల్

    రిప్లయితొలగించండి
  6. ఉత్పలమాల

    నిర్మల మానసమ్మున ననేక విధమ్ముల మానవాళికిన్
    గర్మల మేలుఁ జేసిననె కాంతురు జన్మతరించు మోదమున్
    మర్మమిదందు జీవితపు మాధురికిన్, బ్రజ మెచ్చనట్టిదౌ
    ధర్మము వీడువారలకు తప్పకఁ గల్గును శాంతిసౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  7. వచ్చే వారానికి ఆకాశవాణి సమస్య....
    "కలికిరొ! కొల్వఁగాఁ దగదు కార్తికమాసమునందు శంకరున్"
    మీ పూరణలను క్రింది చిరునామాకు గురువారం సాయంత్రంలోగా పంపండి.
    padyamairhyd@gmail.com

    రిప్లయితొలగించండి
  8. ధర్మము నేలగూలినచొ,దారినిదప్పును నిత్యకర్మలే
    ధర్మమునిల్చి గెల్చినచొ,దారుణ మారణహోమమాగులే
    ధర్మము సర్వమై నిలువ,దారికివచ్చును సర్వశక్తు, లే
    ధర్మమువీడువారలకు, తప్పకగల్గును శాంతిసౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చో'ను హ్రస్వంగా ప్రయోగించరాదు.
      (సమయాభావం వల్ల ఆకాశవాణిలో మీ పేరు తప్ప పూరణ చదువలేకపోయాను)

      తొలగించండి
    2. ధర్మము నేలగూలగనె ,దారినిదప్పును నిత్యకర్మలే
      ధర్మమునిల్చి గెల్చినచొ,దారుణ మారణహోమమాగులే
      ధర్మము సర్వమై నిలువ,దారికివచ్చును సర్వశక్తు, లే
      ధర్మమువీడువారలకు, తప్పకగల్గును శాంతిసౌఖ్యముల్
      [సవరణ పాఠము ధన్యవాదాలతో]

      తొలగించండి

  9. మర్మము లెన్నొజేయు చును మానస మందున చింతచే యుకున్
    నిర్మల మైనచి త్తమున నీతిగ సద్గతి నాచరిం పకే
    ధర్మము వీడు వారలకు తప్పక గల్గును శాంతి సౌఖ్యముల్
    కర్మలు పుణ్యపా పములు కావట కావలి యక్రమం బునన్

    రిప్లయితొలగించండి
  10. మర్మములు పెక్కు తెలిసిన
    శర్మిష్టయె పలికె నంట శపధము లెన్నో
    కర్మలు జేసిన కలగవు
    ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  12. Edit with the Docs app
    Make tweaks, leave comments, and share with others to edit at the same time.
    NO THANKSUSE THE APP

    Google Keep Document

    మర్మము సల్పినాడుమును మాయల కృష్ణుడు భారతంబులో
    కర్మయె వారిధర్మమనికర్తల జేసెను పాండుపుత్రులన్
    నిర్మల శాంతచిత్తుడటు నేరము జేసియసత్యమాడగా
    ధర్మమువీడువారలకు తప్పక గల్గును శాంతిసౌఖ్యముల్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు,మీర్ పేట్ ,రంగారెడ్డి

    రిప్లయితొలగించండి
  13. ధర్మము కాదు బంధు సముదాయము జంపుట లందు వేమి యో
    ధర్మజు తమ్ముడా రిపుల దద్దయు జంపుట క్షాత్రమైన నీ
    ధర్మము కాన వీడకు స్వధర్మము యుక్తము కాని యన్యమౌ
    ధర్మము వీడు వారలకుఁ దప్పక కల్గును శాంతి సౌఖ్యముల్.

    రిప్లయితొలగించండి
  14. ధర్మమువీడక సతతము
    కర్మలు మంచివి సలిపెడి ఖలరహితులకున్,
    నిర్మలమగు మదినొందు న
    ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్"

    రిప్లయితొలగించండి
  15. మర్మము నందుయోగిగను,మాటలమాటున మాంత్రికుండునే
    ధర్మమునింటగెల్వకను దారిని దప్పుచు నుండువారలై
    నిర్మలమైన భాషణకు,నిందలు వేసెడు వారుజెప్పు నా
    ధర్మము వీడువారలకు,దప్పకదక్కును శాంతిసౌఖ్యముల్.

    రిప్లయితొలగించండి
  16. నిర్మలచిత్తుడై సతము నిష్ఠనుబూని చరించుచుండి స
    త్కర్మల జేయుచుండినను గానక సౌఖ్యము దుఃఖమగ్నుడై
    శర్మ వచించె మిత్రునకు "సత్యమురా కలికాల మిచ్చటన్
    ధర్మము వీడు వారలకుఁ దప్పక కల్గును శాంతి సౌఖ్యముల్".

    రిప్లయితొలగించండి


  17. అర్మిలి తోడై వేదపు
    మర్మము లెల్లతెలుపుచు సమాజహితముగా
    పర్ముని నుపయోగించెడ
    ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్


    జిలేబి

    రిప్లయితొలగించండి

  18. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    "Congress wants Uddhav Thackeray as Chief Minister" ... News Report

    "కర్మము నాదు పాలిచట కాంగ్రెసు నేతయి ఠాకరయ్యకున్
    కుర్మను వండిపెట్టుచును కూటమి నందున కొల్వునిచ్చితిన్...
    చర్మము కాలగా నయొయొ జంబము వీడుచు నెత్తి వ్రాతగా
    ధర్మము వీడు వారలకుఁ దప్పక కల్గును శాంతి సౌఖ్యముల్"

    రిప్లయితొలగించండి
  19. కర్మల నేమి కలిగినను
    మర్మము తెలుసుకొనుడు నిల మహిలో నెపుడున్
    నిర్మల మైన నిజముగ న
    ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్

    🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవ పూరణము

      కర్మల ఫలములు తప్పవు
      ధర్మచ్యుతులకె, శుభములు దప్పక కల్గున్
      నిర్మల మనసును నిలుపుచు
      ధర్మము పాటించదలచ దప్పక నెపుడున్
      🙏🙏

      తొలగించండి
    2. 3

      చర్మము మందము పెంచక
      ధర్మము దరిజేరజూడు ధర్మాత్ములకున్
      ధర్మము విలువలు తెలిసి న
      ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్
      🙏🙏🙏

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

  20. రఫేలు తీర్పు తరువాయి ప్రసాద్ ఉవాచ :)


    పర్ముని వేటు కోర్టదె నివారణ చూపెను! కాలధర్మమా
    ధర్మము వీడు వారలకుఁ దప్పక కల్గును! శాంతి సౌఖ్యముల్
    నిర్మల మై ప్రభుత్వమును నీతియు న్యాయము తోడు చేయగా
    నర్మిలి చూపి మోడివలె నాటని నెక్కొను నిక్క మిద్దియే


    జాల్రా
    జిలేబి

    రిప్లయితొలగించండి

  21. మర్మము లేక చెప్పెదను
    మంజులమూర్తి ! సమాలకింపుమా !
    ధర్మజ ! కష్టనష్టములె
    త్రాష్టులు భ్రష్టులు ధూర్తజీవులున్
    ధర్మము వీడువారలకు ;
    దప్పక కల్గును శాంతిసౌఖ్యముల్
    ధర్మము వీడనట్టి మమ
    తాసమతాఘనసత్వమూర్తికిన్ .



    రిప్లయితొలగించండి


  22. ఆకాశవాణికి పంపినది


    అర్మిలియే సురక్ష ! వినుడయ్య వినాశము విస్తృతమ్ముగా
    ధర్మము వీడు వారలకు తప్పక గల్గును; శాంతి సౌఖ్యముల్
    నిర్మల మానసమ్మున పునీతపు చింతన తోడు ప్రేమయే
    వర్మము గా సదా జనులు వర్ధిల సల్పగ దక్కు నిక్కమై!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. మర్మము లేక లోకమున మంచిని పెంచుటె ధ్యేయమై సదా
    నిర్మల చిత్తులై వెలిగి, నీల్గక నిశ్చలమైన బుద్ధితో
    కర్మల నాచరించుచును, కల్లల నిల్పునదౌ విరుద్ధమౌ
    ధర్మము వీడు వారలకుఁ, దప్పక కల్గును శాంతి సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కర్మమున కలుగు బాధల
      మర్మమెరిగి తగువిధమ్ము మనవలె భువిపై
      నిర్మల మగుమదిని చను న
      ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్

      తొలగించండి
    2. 'రాకుమార' గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. ఆకాశవాణిలో గురువుగారు చదివిన నా పూరణ పద్యం:
    ధర్మము రక్షజేయ నిను ధర్మమె రక్షగ గాచునెన్నఁడున్
    కర్మములాచరించుతరి కాంచగనొప్పును ధర్మ సూక్ష్శముల్
    మర్మమెరింగి సాధుజన మానసముల్ కెరలించునట్టిదౌ
    ధర్మము వీడువారలకు తప్పక కల్గును శాంతి సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి

  25. ఉ: కర్మమటంచు బాధలను కాంచుచు నుందురు మొప్పె లెప్పుడున్
    ధర్మము మారుచుండు వసుధన్ యుగ ధర్మము బట్టి కాన నా
    మర్మమెరింగి సాగవలె మాన్యజనాళి సతమ్ము, పాతదౌ
    ధర్మము వీడు వారలకు తప్పక కల్గును శాంతి సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  26. ధర్మ విచక్షణ లెంచక
    మర్మము లెన్నియొనెరిగియు మార్గము దప్పన్
    ధర్మము దప్పెసుయోధను
    ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మర్మము లెన్నియొ యెఱిగియు...' అనండి.

      తొలగించండి
  27. కర్మలనాచరించికడు కామనలన్నియు విడ్వగోరినన్
    మర్మము దెల్సియు మదనమంజరు లన్నియు చుట్టుముట్ట నే
    దుర్మతి నైతినిం గనక దుర్మరణంబె శ రణ్యమవ్వ యే
    ధర్మము వీడు వారలకు తప్పక కల్గును శాంతి సౌఖ్యముల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మర్మ మెఱింగియున్... శరణ్యమైన నే ధర్మము..." అనండి.

      తొలగించండి
  28. కర్మలు శుచితో జేయుచు
    నిర్మల చిత్తులయి మెలగు నేర్పరు లెపుడే
    మర్మము లేక మసలెడి న
    ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్

    రిప్లయితొలగించండి
  29. కర్మ ఫలమ్ము నందు మమకారము లేక చరించు వారలున్
    నిర్మల చిత్తులై నిరత నిర్గుణ ధ్యానము జేయు వారలున్
    మర్మపు మాటలన్ జనుల మాయను జేసెడి దుష్ప్రవర్తనా
    ధర్మము వీడు వారలకుఁ దప్పక కల్గును శాంతి సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  30. కర్మలు చాలచేసినను గానగరావుగబుణ్యకార్యముల్
    ధర్మమువీడువారలకు,తప్పకగల్గునుశాంతిసౌఖ్యముల్
    ధర్మము దప్పకుండగను దాచరియించుచు నెల్లవారినిన్
    ధర్మమువైపుద్రిప్పుచును ధార్మికబోధన జేయువానికిన్

    రిప్లయితొలగించండి
  31. కందం
    ధర్మాధర్మములెంచక
    మర్మము నెఱిఁగిన గిరిధరు మాటల గెల్వన్
    బేర్మిని, భగవద్ప్రేరిత
    ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్

    రిప్లయితొలగించండి
  32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ నాటి శంకరా భరణము సమస్య

      ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్

      ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

      బహు వసంతంబులు పరితోషముగ నేలె దుర్యోధనుండను దుండగీడు,
      పలువత్సరంబులు పాలనమును జేసె రమ్యగతిని దుష్ట రావణుండు
      ఘనముగ నేలెను ఖలమును ఖలుడగు నా కంస భూపతి నంద కలిగి,
      తొలుతనే (ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గు)నెప్పుడు భరణి లోన

      తల్కమందు గడిపె గదా ధర్మజుండు,
      రాజ్యమును వీడి గడిపెను రాఘవుండు,
      నందునింట పెరిగె గదా నల్లనయ్య,
      ధర్మమే యోడెను తొలుత తరచి చూడ

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ లో రెండు సవరణలు సూచించాను. చూడండి.

      తొలగించండి
    3. నమస్కారము గురువు గారు ఇది మార్చినది

      తొలగించండి
  33. కర్మలు సేయుచు శుద్ధిగ
    ధర్మమునేవిడువకుండ దానాదులనున్
    నిర్మల మనసున జేయున
    ధర్మచ్యుతులకెశుభములు తప్పక గలుగున్

    రిప్లయితొలగించండి
  34. కం.

    మర్మము దెలిసిన తగవరి
    నిర్మమ జూపగ తగువిధి నిజమే గెలుచున్
    కర్మము నాకే మనుకొన
    ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  35. నిర్మ ల చిత్తము న్ గలిగి నీతియు ధర్మము న్యాయ వర్తు లై
    కర్మ ల నాచ రించుచు ను గాసిలు వారికి యండ దండ యై
    మర్మము మా య లేవియు ను మానస మందున వారి లే
    ధర్మము వీడు వారల కు దప్ప క గల్గు ను శాంతి సౌఖ్యము ల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాన స మందు న లేని వార లే అని సవరణ చేయడ మైనది

      తొలగించండి
    2. ఉ. ధర్మము ఱేని కెన్నటికి తండ్రిగ రాజ్యము నేల నీ ధరన్ ,
      మర్మమెరింగి రాజునకు మార్గము జూపగ మంత్రికే తగున్!
      కర్మల నైజమున్ దెలిసి కార్యము లెంచగ నేర్చి యన్యమౌ
      ధర్మము వీడు వారలకె తప్పక కల్గును శాంతి సౌఖ్యముల్!

      తొలగించండి
    3. రాజేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ****
      శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పూరణలో "వారికి నండదండయై..." అనండి.

      తొలగించండి
  36. శర్మము శాంతియు దక్కదు
    ధర్మచ్యుతులకు;శుభములు దప్పక గల్గున్
    ధర్మాచారులకు సతము
    నర్మిలితో పాటుబడగ నానందముగన్

    శర్మము గల్గనేరదుగ శాస్త్రమునమ్మక నాస్తికత్వమున్
    ధర్మము వీడువారలకు;తప్పకగల్గును శాంతిసౌఖ్యముల్
    మర్మముదెల్సి చేయగను మాధవసేవను భక్తితోడుతన్
    కర్మలనన్నిటిన్ విడచి కామునిదండ్రిని నాశ్రయించినన్

    రిప్లయితొలగించండి
  37. మర్మమెఱింగి తమ్ములను మైకము నుండి విముక్తిజేయ యా
    ధర్ముడి యక్ష ప్రశ్నలె యుదాహరమైనవి - సమ్ముఖమ్మునన్
    ధర్మము వీడు, వారలకుఁ దప్పక కల్గును శాంతి సౌఖ్యముల్
    ధర్మజుఁ నాల్గు దమ్ములకు, ధర్ముని బాటన వెంట సాగినన్౹౹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "విముక్తి జేయ నా...యుదాహృతమైనవి ... ధర్మజు తమ్ము లెల్లరకు..." అనండి (నలుగురు తమ్ములు... నాల్గు తమ్ములు కాదు)

      తొలగించండి

  38. నేటి ఆకాశవాణి విశేషములు తెలుపగలరు


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యథావిధిగా మీ పూరణ చదువబడినది...పేరులో పెన్నిధి...

      నిన్న నా బ్లాగును మీరు దర్శించ లేదు :(

      తొలగించండి
    2. శంకరాభరణం సమస్య - 1830

      "లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్"


      ములుగుచు ముక్కుచున్ దవిలి ముందుకు దెచ్చుచు "నాంధ్రభారతిన్"
      కులికెడు శబ్దమున్ గనగ గుట్టుగ చట్టున తస్కరించుచున్
      తెలుగున రోజురోజునను తియ్యని రీతిని నావి వోలెడిన్
      లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్

      😊

      తొలగించండి
  39. కర్మా నుగతమ్ముగఁ గలు
    షోర్మి సుకృత సంచయ పరిశోధన గతముల్
    నర్మార్తమ్ములు నిత్యా
    ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్


    మర్మము నేర నేరి కగు మాయలు విష్ణు కృతమ్ము లౌర దు
    ష్కర్మము లెన్ని సేసినను సౌఖ్యము లందెను ధార్తరాష్ట్రుఁడే
    ధర్మజుఁ డందెనే తుదను ధాత్రియు సౌఖ్యము లెల్ల నాదినిన్
    ధర్మము వీడు వారలకుఁ దప్పక కల్గును శాంతి సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి


  40. శతకమంటే వంద చాలా వందపై యెనిమది వేయాలాండీ ? :)



    గోస్తనమిది కందివరుల
    కై స్తవమిదియే జిలేబి కైవారముగా
    చేస్తున్న వందనమిదియె
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    వంద పూర్తయ్యె :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "శతకమంటే వందపద్యాల గ్రంథం కదండీ! మరి ఏ శతకాన్ని చూసినా 101, 105, 108, 116 ఇలా వందకంటే ఎక్కువ పద్యాలుంటున్నాయి. ఎందుకండీ?" అని మేము కాలేజీలో చదువుకునే సమయంలో ఒక విద్యార్థి అడిగితే మా లెక్చరర్ సరదాగా చెప్పిన సమాధానం..."శత అంటే వంద, 'క' అంటే కలుపవలసినవి. (శత + క).. అందుకే శతకంలో వందకంటే కొన్ని పద్యాలు ఎక్కువుంటాయి" అని.
      మనకు అష్టోత్తర శత నామాలున్నవి. ఎవరికైనా కట్నమో, కానుకో ఇవ్వాలనుకుంటే పూర్ణసంఖ్య కాకుండా నూటొక్కటో, నూట పదహారో ఇచ్చే సంప్రదాయం ఉంది కదా... అలాగే ఇదీనూ...

      తొలగించండి
    2. వస్తు! వందా ఒకటి పూర్తయ్యె

      పేలాల లవంగక శతకము పూర్తి

      వేస్తా వందకొకటి కలి
      పేస్తో కందము జిలేబి పేరిట! సరదా
      గా స్తంభాకారాధిగ
      బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


      జిలేబి

      తొలగించండి
  41. మర్మమెఱుంగవు గదనే
    ధర్మాధర్మముల గూర్చి తర్కింపకుమో
    నిర్మల, కలియుగ మందున
    ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్.

    రిప్లయితొలగించండి
  42. కర్మలనాచరించకనుకాలముపుచ్చుచు దుష్టబుధ్ధితో
    దుర్మతితోచరించుచును దొంగతనమ్ములు చేయ శిక్షయౌ
    ధర్మము వీడువారలకు,తప్పక కల్గును శాంతి సౌఖ్యముల్
    ధర్మము నాచరించెడు వదాన్యులకెల్లపుడీ ధరా
    స్థలిన్.


    కర్మఫలమ్మను భోక్త్యము
    ధర్మచ్యుతులకు,శుభములు తప్పక కల్గున్
    ధర్మమె దైవమటంచును
    కర్మల నెప్పుడు నువీడకసలుపు ప్రజకున్

    కర్మము పీడించు విడక
    ధర్మచ్యుతులకె, శుభములు దప్పక కల్గును
    నిర్మల హృదయులు మాయా
    మర్మములేవియును లేని మనుజుల కిలలో

    రిప్లయితొలగించండి
  43. పేర్మిని దానమిచ్చు బలి భీషణ ప్రజ్ఞను గాంచి ఖిన్నుడై
    యోర్మిని శుక్రుడక్క్రతువు నోపక నాపగ నెంచి సెప్పెడిన్
    మర్మము పాపకార్యమది మన్నన గూడదు సత్యదూరమౌ
    ధర్మము వీడు వారలకుఁ దప్పక కల్గును శాంతి సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  44. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్

    సందర్భము:
    సర్వ ధర్మాన్ పరిత్యజ్య
    మా మేకం శరణం వ్రజ
    అహం త్వా సర్వ పాపేభ్యో
    మోక్ష యిష్యామి మాశుచ
    అని గీతావాక్యం.
    ధర్మమే అనుష్ఠించాలి ఎంత కష్టమైనా.. అదే శ్రేయో మార్గం. ఐతే అన్ని ధర్మాలనూ వదలిపెట్టి (పట్టించుకోకుండా) రాముని (భగవానుని) శరణువేడి కర్మ లన్నీ వానికే అంకితం చేసి నిష్కామంగా నిశ్చింతగా గడుపటం అనేది అన్నింటికన్నా మించినది.
    ఆ విధంగా శరణాగతి చెందిన వాని యోగక్షేమాలు భగవానుడే చూసుకుంటాడు. అటువంటివాడి జీవితంలో ధర్మ మంటే ఏమిటో తెలిసినప్పటికీ అప్పుడప్పుడు ధర్మ నిర్వహణలో అనుకోకుండా పొరపాటు జరిగితే దైవమే చూసుకుంటాడు. అతనికి శుభాలే కలుగుతాయి.
    విభీషణుడు తన వారందరికీ దూరమైనా రాక్షస ధర్మాన్ని కా దని ఆ ధర్మంనుంచి చ్యుతి (జారుపాటు) పొందినప్పటికీ రాముణ్ణి సర్వస్య శరణాగతి చెందటంవల్ల అంతిమ విజయాన్ని కైవసం చేసుకోగలిగాడు.
    రాక్షస ధర్మ మంటే ఎదుటివారి ధన కనక వస్తు వాహనాలను రాజ్యాలను రమణులను నయాన్నో భయాన్నో సొంతం చేసుకోవటమో.. చేసుకునే వారికి వంత పాడడమో! అంతే కదా! రావణ కుంభక ర్ణాదులలాంటి వారే కదా! వారి అంతిమ దశ లెలాంటివో చెప్ప నక్కర్లేదు!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    కర్మము రామాంకితముగ
    నిర్మల భక్తిని సలుపుటె నిక్కమయినదౌ
    ధర్మము.. తెలిసియుఁ బొరపడు
    ధర్మ చ్యుతులకె శుభములు దప్పక కల్గున్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    16.11.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి