17, నవంబర్ 2019, ఆదివారం

సమస్య - 3194 (భార్యనుఁ గనినంత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్"
(లేదా...)
"కనుఁగొని భార్యనంత వడఁకం దొడఁగెం బతి భీతచిత్తుఁడై"

55 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    పనికిని బోవునంచు భళి పండుగ పూటను తారసిల్లుచున్
    మనమున సుందరాంగినిడి మైకమునందున పారిపోవుచున్
    వనమున సారసాక్షి యొడి పన్నుగ చేరిన మూర్తమందునన్
    కనుఁగొని భార్యనంత వడఁకం దొడఁగెం బతి భీతచిత్తుఁడై....

    రిప్లయితొలగించండి
  2. కర్యమునతోటకువెడలి,

    ధైర్యము తోనొక పడతిని" దా"యని పిలువన్,

    ఆర్యా యేమిటని యడుగు

    భార్యనుగనినంత భర్త వడవడ వణికెన్

    రిప్లయితొలగించండి
  3. భార్యయె లేదనుచు నతడు
    ధైర్యముతో వారకాంతఁ దాకొని తెచ్చెన్
    శౌర్యా! తిరిగటు వచ్చిన
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్.

    రిప్లయితొలగించండి


  4. భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్

    ఇందులో సమస్య ఎక్కడుందీ :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఆ మాటే కంద పద్యములో పూరించండి :)

      తొలగించండి

    2. లోకా జగన్నాధ శాస్త్రి:

      "స్వాభావికమేకదా...అంటారా..😄😄😄"

      తొలగించండి

    3. శేష కుమార్:

      "😄😄😄👍👍 వాస్తవం చెప్పారు!!🙏🙏🙏"

      తొలగించండి
    4. మైలవరపు మురళీకృష్ణ:

      "అదే మాట మేమంటే పెద్ద *సమస్యే*😄🙏"

      తొలగించండి
    5. సమస్య సారసాక్షి లోనండీ...☺️☺️☺️☺️

      తొలగించండి


    6. జీపీయెస్ వారి కోరిక కాదంటే యెట్లా :)


      భార్యా విధేయుడాతడు!
      భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్!
      తూర్యపు మంగళనాదము
      పర్యాప్తిగ చేరగ చెవి పరితుష్టిగనెన్ :)



      జిలేబి

      తొలగించండి


    7. లోకా జగన్నాధ శాస్త్రి గారి మాటగా :)


      వార్యోకమువలె పట్టిన
      నార్యుని విడువననెడు నళినాక్షి జిలేబీ!
      ఆర్యా! స్వాభావికమే!
      భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్!


      జిలేబి

      తొలగించండి


    8. ఆకుల శాంతి భూషణ్ వారికి :(


      ఆర్యా సత్యము పల్కిరి!
      భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్!
      వర్యము! సమస్య యెక్కడ?
      ఆర్యకుడ! సమస్య సారసాక్షియె సుమ్మీ !


      జిలేబి

      తొలగించండి

  5. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గోదావరి భాష (మా చిన్నప్పటి మాటలు):

    వినకయె ప్రీతి పూర్వకపు విన్నప మెప్పుడు మొండిముండగా...
    ధనమును దాచిపెట్టి తన దయ్యపు కూతుకు నంటగట్టగా...
    కినుకను నత్తగారినిక క్రిందను మీదను చావగొట్టగా...
    కనుఁగొని భార్యనంత వడఁకం దొడఁగెం బతి భీతచిత్తుఁడై...

    రిప్లయితొలగించండి
  6. మైలవరపు వారి పూరణ


    మనము ముదమ్మునన్ మురియ, మానిని కైకను బ్రేమ జేరి , వా...
    ర్తను వినిపించగా దశరథప్రభువే చన., మంథరోక్తిసం...
    జనితరుషానలోగ్రపరుషస్వరభాషణభీకరాకృతిన్
    కనుఁగొని భార్యనంత వడఁకం దొడఁగెం బతి భీతచిత్తుఁడై !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తనయుడు ప్రాకుచున్న గది దగ్గర సర్పము గాంచి, చేతిలో
      పనినటు పారవైచి , తన ప్రాణములన్ గణియింపబోక , పు...
      త్రుని కడకేగుదెంచు మతితో కదలాడుచునుండ., భర్త రాన్
      కనుఁగొని భార్యనంత వడఁకం దొడఁగెం బతి భీతచిత్తుఁడై.!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  7. సూర్యోదయమయ్యెను దిన
    చర్యనికనయిన మొదలిడు ! సలుపుట కెన్నో
    కార్యములట్లె మిగిలె నను
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్

    రిప్లయితొలగించండి
  8. సూర్యోదయాన నొక శుభ
    కార్యము జేయఁ గ తలచుచు కదలిడ తానే
    ధైర్య ముగ మేకపుగనని
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్
    🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. (2)

      భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్

      ధైర్యము తోడుగ దెచ్చుకు
      భార్యకు కొనుటకు వెడలఁగ బంగారమునే
      ఆర్యా! వడ్డాణ మనిన
      భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్
      🙏🙏

      తొలగించండి
    2. (3)

      భార్యల దేమున్నది దిన
      చర్యలు యున్నవ తెలుపుము జప్పున జేయఁన్
      సౌర్యులు మేమనుచునె తా
      భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్
      🙏🙏

      తొలగించండి


  9. చర్యాతీతియు సర్వో
    పర్యాసీనసమవేతపాదాంగుష్ఠిన్
    వర్యముగానాడించెడు
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్!


    Its a matter of fact Watson :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. అనుపమమైన రత్నముల హారము, మేలిమిపట్టుచీరెలున్,
    ధనకనకాదికంబులును దా ననిశంబును గాంక్షసేయుచున్
    దనపతి దైన్యమున్ గనక తాండవ మాడుచునున్నదానినిన్
    గనుఁగొని భార్యనంత వడఁకం దొడఁగెం బతి భీతచిత్తుఁడై.

    రిప్లయితొలగించండి
  11. కం.
    వీర్యోచిత యుద్ధంబున
    మర్యాద నతిక్రమించు మకురుని జంపన్ !
    శౌర్య పరాక్రమవతియగు
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్ !!

    రిప్లయితొలగించండి
  12. భార్యను పంపగ యూరికి 
    భార్యయె లేకున్న పనియు భద్రము తలచెన్ 
    భార్యయు తెలుసుకు వఛ్చిన 
    భార్యను గనినంత భర్త గడగడ వడకెన్

    రిప్లయితొలగించండి
  13. కం.
    చర్యకు ప్రతిచర్యగ, తా
    మర్యాదలు జేసెదనని మగనిని బిలువన్ !
    మిర్యాలచారు బోసిన
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్ !!

    రిప్లయితొలగించండి
  14. ( బయట పులి - ఇంట పిల్లి )
    వినయము మీర దండముల
    బెట్టెడి భృత్యుల లెక్కసేయకన్ ;
    బనిగొని వేచినన్ గనులు
    బైరులు గ్రమ్మగ బల్కరింపకన్ ;
    మను మిను గానకన్ మొగము
    మంచిగ నుంపని పోతురాయడే
    కనుగొని భార్యనంత వడ
    కం దొడగెం బతి భీతచిత్తుడై .

    రిప్లయితొలగించండి


  15. కారణం తాత గారి యోచన సుమా కంది వారు :)


    మనుజుని సృష్టి చేసెదను, మాలిని తొంటిని, వాడు కర్తయౌ
    నను తలవంగ నెప్పుడు, త్సునామి సమానముగా జిలేబిగా!
    మునుగడ తాత యోచన సమున్నత కారణమాయె శంకరా
    కనుఁగొని భార్యనంత వడఁకం దొడఁగెం బతి భీతచిత్తుఁడై!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. వనమున కంపి రాఘవుని భావి యయోధ్యకు రాజుగా నికన్

    తనయునిఁ జేయమంచు తన ధారయె కోరిన కోర్కె నాలకిం

    ప నృపుని కంట నీరుబికె బాధయె పొంగగ కైక పంతమున్

    కనుఁగొని భార్యనంత వడఁకం దొడఁగెం బతి భీతచిత్తుఁడై

    రిప్లయితొలగించండి
  17. ధైర్యము సడలెను భర్తకు
    భార్యామణి గోర మగని భారపునగలన్
    ఆర్యా తనమాటవినని
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్

    రిప్లయితొలగించండి
  18. కార్యంబుల కానకనిటు
    సూర్యోదయ కాలమందు చోద్యపు వ్యాఖ్యల్
    మర్యాద గాదని బలుకు
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్

    రిప్లయితొలగించండి
  19. ధైర్యము జేసియు నగలను
    చౌర్యము జేయంగ బూన సతి లేని తరి న్
    కార్యము కాదయ యిది యను
    భార్య ను గని నంత భర్త వడ వ డ వణికె న్

    రిప్లయితొలగించండి
  20. చౌర్యము సేయగ గుట్టుగ
    భార్యామణి పుట్టినింటి భరణపు సొమ్మున్
    మర్యాదమరచి తిట్టెడు
    భార్యను గనినంత భర్త వడవడ వణికెన్

    రిప్లయితొలగించండి


  21. కొంచెం భయంతో కొంచెం భక్తితో మోడీ పై ఇవ్వాళ్టి ఆంధ్రజ్యోతి కృ.తి. యోపాఖ్యానము :)



    ఆర్యా ! కవివర ! కందివ
    రార్యా! కొంచెము భయమ్ము, రవ్వంతగనౌ
    నార్యా భక్తి! కనుకనే
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్ :(



    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య


    (భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్)

    ఇచ్చిన పాదము కందము పాదము నా పూరణము సీసములొ



    వెడలెను నాభార్య విజయవాడకు, రాదు వారము వరకును, వరుస బెట్టి
    చేసు కొందుము పార్టి చీర్సనుచు నిచట మందు తోడ, మగువ పొందుతోడ,
    నని పిలచె నొకడు తనయింటికి చెలికాండ్రను, వల్లె యని వార వనిత తోడ
    రయముగ వచ్చె,పరాచకముల హోరు సలుపుచున్ మత్తులో కులుకు చుండ
    మ్రోగె తలుపు గంట, మూల్గుచు తలుపును తీయ గేహిని యెదు రాయె, వచ్చి

    నట్టి (భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్), కాళిఐ దవడ పగల


    గొట్టె, భర్తను చీపురు కట్ట నెత్తి
    చితక బాదుచుండగ చచ్చె సిగ్గు తోడ
    భర్త మిత్రుల్, తమను కూడ బాదు ననెడు
    భయము కలుగగ బయటకు పరుగులెత్తె

    రిప్లయితొలగించండి
  23. భార్యనుదక్కువజేసియు
    నార్యా!పలుకంగనిట్లు న్యాయమె మీకున్
    గర్యలలోజూచితె?యే
    భార్యనుగనినంత భర్తవడవడవడకెన్

    రిప్లయితొలగించండి


  24. కార్యాలయమున సింహము!
    పర్యంకమ్మున హిహకము! పదతాడనమే
    మర్యాదగతలచునతడు!
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. ధైర్యము చాలక నిత్యము
    కార్య వినాశిని విరుద్ధ కథన నిరత నా
    యార్యోద్దాలకుఁ డడలున
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్


    పనులఁ జెలంగు నిత్యమును భర్త వశానుగతైక నిష్ఠ స
    జ్జన గణ గౌర వాయత యశష్ఫల సంచయ మోద చిత్తయున్
    వనజ దళాయ తాంబక నవారిత ఘోర రుజార్త చిత్తనుం
    గనుఁగొని భార్యనంత వడఁకం దొడఁగెం బతి భీతచిత్తుఁడై

    రిప్లయితొలగించండి
  26. భార్యా బాధితు లందఱు
    కార్యక్రమ నిర్వహణకు కదలగ;వచ్చెను
    సూర్యారావు కళత్రము,
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్
    (స్వభావోక్తి)

    రిప్లయితొలగించండి
  27. కార్యాలయమున పనిచే
    భార్యామణి చెప్పినట్టి పనులను మరువన్
    ధైర్యము కోల్పోవుచునట
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్

    మరొక పూరణ

    ఆర్యా లెమ్మిక తూర్పున
    సూర్యోదయమయ్యెనెండ జోరయె, నాగెన్
    కార్యములని గద్దించెడి
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్

    అనవరతమ్ము త్రాగుచు నుయాలిని కొట్టుచునుండరోయుచున్
    కనలుచు రుబ్బు గుండునట గట్టిగపట్టినయంతనే వడిన్
    తనువున నున్న మైకమది తగ్గగ క్రోధముతోడ చూడగా
    కనుగొని భార్యనంత వడ కం దొడగెం బతి భీతచిత్తుడై



    రిప్లయితొలగించండి
  28. పర్యావరణముగాంచగ
    మర్యాదనుమట్టుగలుపు మహిళేయెదురై
    ‘కార్యము’శూన్యమునేడను
    భార్యనుగనినంతభర్త వడ వడవణకెన్

    రిప్లయితొలగించండి
  29. కార్యాకారణ సూత్రము
    భార్యాభర్తలతగవునభగభగమండెన్
    సూర్యునితాపముమించిన
    భార్యనుగనినంతభర్త వడవడవణికెన్
    *********************
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  30. కార్యమ్ము నాడు ప్రేమగ
    పర్యంకము చేరు పతిని వలదని తిట్టన్
    పర్యవసానమె కదరా
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్

    రిప్లయితొలగించండి
  31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  33. subbaraoనవంబర్ 17, 2019 1:43 PM

    అనయముజిందులాడుచునునారడివెట్టుచునుండుదావెసన్
    గనుగొనిభార్యనంతవడకెందొడగెంబతిభీతచిత్తుడై
    కొరకొరలాడుచుండుచునుగోపముతోడనునూగుచుండగా
    వెరవదిలేకచిత్తమున వేంకటనాధునినాశ్రయించెనే

    రిప్లయితొలగించండి
  34. శౌర్యముగా బారుకు చని
    చౌర్యముగా గోడ దూకి ఛాయను చొరగా |
    ధైర్యము సడలెగ నకటా |
    *"భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్"
    (ఛాయ -ఇల్లు )

    రిప్లయితొలగించండి
  35. కందం
    ఆర్యా! రాముని వనముల
    పర్యటన, భరతుఁ డయోధ్య ప్రభువగు వరముల్
    సూర్యోదయమున కిడుమను
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్

    చంపకమాల
    పనిగొనఁ జేయ మంధర చివాలున పంక్తిరథున్ వరమ్ములం
    చు నిలువరించి కైక పురుషోత్తము రాముని కాన కంపగన్
    గొణుగుచు సూనుడౌ భరతుఁ గూర్చొన జేయుము రాజుగా యనన్
    గనుఁగొని భార్యనంత వడఁకం దొడఁగెం బతి భీతచిత్తుఁడై

    రిప్లయితొలగించండి
  36. వినుమని యాప్తమిత్రునికి వేదన నంతయు వెల్లడించుచున్
    పనులను జేయదేమియు వివాదములందునె మొగ్గు జూపు దా
    ననుచు విషణ్ణుడై బ్రతుకు నాశము జేసెనటంచు నింతలో
    కనుఁగొని భార్యనంత వడఁకం దొడఁగెం బతి భీతచిత్తుఁడై

    రిప్లయితొలగించండి
  37. భార్యా భర్తలునొకటిగ
    కార్యాచరణమ్ములందు కర్మల,నొకటై
    అర్యా,నడచుటమేలన
    భార్యనుగనినంత భర్త వడవడ వడకెన్

    రిప్లయితొలగించండి
  38. వినుటకు వింత బాధయిది,వేనకువేలుగ భర్తలందునన్
    కనులకు గొప్పలై మిగుల,కన్నులుగప్పెడు వింత భార్యలే
    వినరదదేదిజెప్పినను,వింతగజూతురు వారివైఖరుల్
    కనుగొని భార్యనంత, వడకందొడగెంబతి భీతచిత్తుడై.

    రిప్లయితొలగించండి
  39. అనలముకన్న మిన్నయగు యావిడ తాపముజూడలేములే
    సణుగుడు మానదెప్పుడును ,సాధ్యమె గాదిక తన్ను మార్చుటన్
    వినయమువీగిపోవగను,వీధికినీడ్చెడు నట్టిరీతులన్
    కనుగొనిభార్యనంత,వడకందొడగెం, బతిభీతచిత్తుడై

    రిప్లయితొలగించండి
  40. వినదుగనెంతజెప్పినను,వీధికినెట్టెడుతీరు మారదే
    పనులనుపేరబెట్టుటన,పట్టుగనెట్టును వాయిదాలకున్
    కనులకు గొప్పదై నిలుచు,కాంతనుమెచ్చుదురందరామెనే
    కనుగొని భార్యనంత,వడకం దొడగెంబతిభీతచిత్తుడై.

    రిప్లయితొలగించండి
  41. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్

    సందర్భము: కైక వరాలు కోరగా దశరథుడు శోకిస్తూ ఇలా తలపోసినాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    కార్యము చెడె రాముని, దని
    వార్యమె యని, చిన్న భార్య పలుకు లవి శిరో
    ధార్యము లని, కైకను దన
    భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    17.11.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి