20, నవంబర్ 2019, బుధవారం

సమస్య - 3197 (హితబోధల వినెడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హితబోధల వినెడివారికే కీడొదవున్"
(లేదా...)
"హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్"

84 కామెంట్‌లు:

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


ప్రాతః కాలపు సరదా పూరణ:

సతమున్ పోరుచు హైందవత్వమును భల్ సాధించి బాధించుచున్
గతియే లేదుర మీకటంచు మిములన్ కాపాడు క్రీస్తంచుచున్
మతమున్ మార్చుమటంచుచున్ విరివిగా మామూళ్ళ నిప్పించుచున్
హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్

విరించి చెప్పారు...

సతతము క్షేమమె కోరెడు
చతురుల నుడులాలకింప స్వస్థత కూరున్
మతిలేని వాడు చెప్పెడి
హితబోధల వినెడివారికే కీడొదవున్

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


కంది వారు ఉవాచ:

మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
*మీకటంచును మిమున్.... క్రీస్తంచు మా । మతమున్ జేరుమటంచు... మామూళ్ళ నిప్పించి నా । హితబోధల్...* అంటే అన్వయం ఇంకా బాగుంటుందని సూచన.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


"*మామూళ్ళ నిప్పించు నా । హితబోధల్..* టైపాటు."

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

purushothamarao ravela చెప్పారు...

అతివినయము వలదెప్పుడు
పతిమాటనుదాటవలదు,పనిమాలంగా
సతతముసత్యముబలుకని
హితబోధలవినెడువారికేకీడొదవున్

vsnmhari చెప్పారు...

సుతునిం జూచి యొకండు తెల్పె నిటులన్ శుద్ధాత్ముడై "బాలకా!
మతిహీనుల్ తమమేలుగోరి పలుకన్ మన్నించ రెందేని, నీ
వతులానంద యుతుండవౌచు సతతం బాసక్తినిం జూపుచున్
హితబోధల్ విను, వారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్".

vsnmhari చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
vsnmhari చెప్పారు...

సుతునిం జీరి

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


(సవరించిన) ప్రాతః కాలపు సరదా పూరణ:

సతమున్ పోరుచు హైందవత్వమును భల్ సాధించి బాధించుచున్
గతియే లేదుర మీకటంచును మిమున్ కాపాడు క్రీస్తంచుమా
మతమున్ జేరుమటంచుచున్ విరివిగా మామూళ్ళ నిప్పించు నా
హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కతలను జెప్పుచు నిరతము
వెతలను కలిగింప జేయు వేయి విధమ్ముల్
మతిలే కనుమౌ నముగా
హితబో ధల వినెడి వారికే కీడొదవున్

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

మితి మీరిన మోసముతో
గతి లేకనె జెప్పెనుబహు ఘనముగ పల్కుల్
హితమే తెలియని వారల
హితబోధల వినెడివారికే కీడొదవున్
🙏🙏

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పని మూలమునన్" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

విరుపుతో అద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

BULUSU V S MURTY చెప్పారు...

మతి యించుక లేకున్నను 
మతిమంతులమంచు పూని మంత్రాంగంబుల్ 
అతిగా జరిపెడు వారల 
హితబోధల వినెడువారికే కీడొదవున్ 

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

మైలవరపు వారి పూరణ

శ్రుతులన్ దూరుచు , భారతీయమతసుశ్లోకప్రధానమ్మలౌ
యితిహాసమ్ముల గేలిచేయుచు, నిదే యెంతేని యోగ్యమ్ము మా
మతమంచున్ వచియించువారల మహామాయావచోరూపగ....
ర్హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్ !

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

C Rama Mohan చెప్పారు...

మతబోధలు విని తరచుగ
నుతమ మతులుచెడి తికమక తలపులు జేతుర్
మతములు మనుషుల జెడిపెడు
హితబోధల వినెడివారికే కీడొదవున్

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

మతి లేకనె పాలించుచు
అతిగా జనులకు నిరతము యధికారముతో
మతమును మార్చుము యను నా
హితబోధల వినెడివారికే కీడొదవున్
🙏

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

మితమౌ రీతిని మందు కొట్టుమనుచున్ మేధస్సునున్ దొల్చుచున్
సతమున్ బీడిని పీల్చుటన్ భడవరో చాలించు నేడంచు నీ
సతినే కొల్వుము సర్వదా యనుచువే సాధించు నత్తయ్యవౌ
హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

పత న ము గోరు చు సతతము
మతుల ను మార్చెడు విధమగు మాటల తోడ న్
గతి తప్పించె డు మనుజుల
హిత బోధల వినె డు వారికే కీడొ ద వు న్

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

( వేటగాని వలలోని గింజలు తిందామన్న ముసలి
పావురం మాటలు నమ్మి వలలోపడ్డ పావురాలు )
" మతితో నా పలుకుల్ వినుండిట వట
క్ష్మాజంబు క్రీనీడలో
తతులై నిండిన నూకలన్ని భుజియిం
తం " బంచు వృద్ధం బనన్
గతులే మారిన పావురాలు వలలో
గన్నీరు మున్నీరయెన్ ;
హితబోధల్ వినువారికే యొదవు గీ
డెల్లప్డు యోచించినన్ .
(పంచతంత్రంలోని మిత్రలాభం కథ ఆధారంగా )

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మంత్రాంగములే । యతిగా..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. '... నుతమ'? 'చేతుర్' అన్న ప్రయోగం సాధువు కాదు. సవరించండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మతి లేకయె పాలించుచు । నతిగా జనులకును నిరత మధికారముతో... మార్చుకొను మనెడి । హితబోధల..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

ధన్యోస్మి, గురువుగారు చెప్పిన మార్పులతో

మతి లేకయె పాలించుచు
నతిగా జనులకును నిరత మధికారముతో
మతమును మార్చుకొన మనెడి
హితబోధల వినెడివారికే కీడొదవున్
🙏🙏

seethadevi gurram చెప్పారు...

మితిమీరిన ధనదాహము
పతనమునకు హేతువౌను భద్రము పుత్రా!
గతితప్పిన స్నేహితుల య
హితబోధల్ వినెడువారికే కీడొదవున్

కంది శంకరయ్య చెప్పారు...

చక్కని పూరణ. అభినందనలు.

seethadevi gurram చెప్పారు...

ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!

BVVHBPrasadarao చెప్పారు...

సతమతమై వెతలంబడి
రతిపతి భవు వలన బూది రాశిగ మారెన్
గతిలేక సురల తనుపగ--
హిత బోధల వినెడు వారికే కీడొదవున్.

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

సతి మాటలు వినకనెపుడు
మితి మీరిన నమ్మకమును మిత్రుల పైనన్
సతతము తప్పులు జెప్పెడి
హితబోధల వినెడివారికే కీడొదవున్
🙏🙏

రాకుమార చెప్పారు...

సతతావేశము గల్గి శాత్రవ,వినాశమ్మే ప్రధానమ్ముగా
మృతికిన్ స్వాగత మీయ భీతిలని దుర్మేధుల్ మతోన్మాదులున్
తతులై హద్దులు దాటివచ్చి యిట విధ్వంసమ్ముకై చేయు మో
హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్

తంగిరాల సుందర రఘురాం చెప్పారు...

గతమున్ చేసిన స్నేహముల్ వదలు, సౌఖ్యంబిచ్చు స్వేచ్ఛే పరా
గతిబట్టున్, పతి పాద సేవనమె ముఖ్యంబౌ, శరీరం బధో
గతి పాలౌనులె గర్భమొంది, వల దీ కష్టం బనం గావివా
హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్౹౹

chandrashekhar yelisetty చెప్పారు...

కం.

హితముల నుచితము నొసగగ
చతురత తమదే యటంచు చాటుచు దిరుగన్
పతితాగ్రేసరు నమ్మిన
హితబోధలు వినెడి వారికే కీడొదవున్

వై. చంద్రశేఖర్

వెలుదండ సత్యనారాయణ రావు చెప్పారు...

..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
హితబోధల వినెడివారికే కీడొదవున్

సందర్భము: విశ్వామిత్రుడు రామలక్ష్మణులకై రాగా దశరథుడు సందేహించగా వశిష్ఠు డన్న మాట లివి...
పితృగణ సంతృప్తికై యజ్ఞం చేస్తే మారీచ సుబాహులు విఘ్నాలు కలిగిస్తే విశ్వామిత్రుడు రామలక్ష్మణులచేత రాక్షస సంహారం చేయించేందుకై దశరథుని వద్దకు వచ్చాడు.
రామునిపై మోహంతో దశరథుడు సతమతమైతే వశిష్ఠుడు విశ్వామిత్రుని మహత్వాన్ని వివరించి, "రామునితో సీతను కూర్చడానికి వచ్చినా డితడు. హితం చేయటమే స్వభావం. రామునికి మేలే జరుగుతుంది." అన్నాడు.
దశరథుడు పంపించినాడు.
విశ్వామిత్రుడు బల అతిబల అనే విద్యలను ప్రసాదించినాడు. తాటకను వధింపజేసినాడు. అదే రాక్షస సంహారానికి నాంది. రాముడు చేయగల డని లోకానికి తెలిసింది.
విశ్వామిత్రుడు సర్వాస్త్రాలు రామున కిచ్చినాడు. (సర్వాస్త్ర జాలం స రహస్య మంత్రం ప్రీత్యాభిరామాయ దదౌ మునీంద్రః.. అధ్యాత్మ రామాయణం)
రాముడు సుబాహుని వధించినాడు. మారీచుని నూరామడలకు విసిరివేసినాడు.
విశ్వామిత్రుడు వారిని మిథిలకు తీసుకువెళ్ళాడు. దారిలో అహల్యా శాపవిమోచనం జరిగింది.
చివరకు శివధనుర్భంగం చేయించి రాముని కళ్యాణానికి మార్గం సుగమం చేశాడు.
వీ టన్నిటితో విశ్వామిత్రుని కొరిగిం దేమీ లేదు. అతడు జితకాముడు. కృతపుణ్యుడు. అలాంటి వాడే హితు డంటే...
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*"జితకాముడు, కృతపుణ్యుడు,*
*హితకారియు గాధిసూను;*
*డీ రామునకున్..*
*సతతము మేలే జరుగును..*
*హితబోధల వినెడివారి కే కీ డొదవున్?"*

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
20.11.19
-----------------------------------------------------------

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

వితత కలు షాబ్ధి జల సం
ప్లుత ఘోర నరాధమ కృత బోధనములు కు
త్సిత చిత్తుల, పాటించక
హితబోధల, వినెడివారికే కీ డొదవున్


ధృతి యుక్తమ్ముగ నిత్య కర్మముల నిర్దేశమ్ము సంధానమున్
మతి నూహించి స్వయమ్ముగాఁ దివిరి సన్మాన్యుండ వర్తించుమా
సతతక్రోధ మనో౽వివేక ఖర శంసా స్వార్థ చింతా ప రా
హితబోధల్ వినువారికే యొదవుఁ గీ డెల్లప్డు యోచించినన్

[పర+ అహిత బోధల్ = పరాహిత బోధల్]

Surya చెప్పారు...

పతితో సతి సతితో పతి
సతతము కలహముల గడుపు సంసారములన్
మతి మాలిన మూర్ఖపు స్నే
హితబోధల వినెడివారికే కీడొదవున్

subbarao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
subbarao చెప్పారు...

subbaraoనవంబర్ 20, 2019 1:06 PM

సతతము శుభములు గలుగును
హితబోధలవినెడివారికే,కీడొదవున్
మతిహీనులపలుకులువిని
యతిగావర్తించునెడల నదియేమనకున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

మత్తేభవిక్రీడితము
స్థితిమారెన్ అభివందనాలనుచు మీచే బ్యాంకువౌ మీ నమో
దితముల్ జెప్పెడు రీతి లక్షలిపుడందించంగ సిద్ధమ్మనన్
మతిహీనంబుగఁ జెప్ప మీదు నిధులౌ మాయమ్ము! యెట్లౌనివే
హితబోధల్? వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్!

gurram.jana@gmail.com చెప్పారు...

మతిమంతులు కరువయ్యిరి
శ్రుతులను వినిపించు కొనట చేదాయెనుగా!
గతితప్పిన కలియుగమున
హితబోధల వినెడివారికే కీడొదవున్ !

pks kumar చెప్పారు...

రెండవ పాదము గణ భంగము చివర

లలిత సుందరి కల్లూరి చెప్పారు...

కంద పద్యము

హితులు మన హితము కోరుచు
హితబోధలు చేయుచున్న వినవలె నెపుడున్
మతిపోయిన యోచించక
హితబోధల వినెడివారికే కీడొదవున్

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

మన్నించాలి, 🙏మార్పు చేసాను,
పరిశీలించ ప్రార్ధన

*4*

సతతము మోసముతో మన
పతనము కోరెడి జనులగు పదుగురు మనకే
హితులని తలచుచు వారివి
హితబోధల వినెడివారికే కీడొదవున్
🙏🙏

seethadevi gurram చెప్పారు...

మతిలో మత్సర ద్వేషముల్ ముసిరి దుర్మార్గంపు టాలోచనల్
మితిమీరంగ సుయోధనా!కుజన మైత్రింగూడి దాయాదుల
న్నతికష్టంబుల పాలుజేసితివి,దుర్వ్యాపార దోషాయుతా
హితబోధల్ వినువారికే యొదవు గీడెల్లప్డు యోచించినన్

purushothamarao ravela చెప్పారు...

సతతము శ్రీహరినామము
మతిగల్గుచు మనసునందు మంచిగబలుకన్
స్తుతమతి మెచ్చును గాదా
హితబోధలువినెడువారికే కీడొదవున్?

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

సతతమసత్యముబల్కున
హితకారుల మాటనమ్మనిక్కట్టులెగా
వెతలకుమూలమ్మౌనా
హితబోధల వినెడివారికే కీడొదవున్"

purushothamarao ravela చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
purushothamarao ravela చెప్పారు...

అతిగా పరభాషప్రేమ
మితముగనే,యమ్మపలుకు మ్రింగుడుపడునా??
మతిదప్పి చెరుపుజేసే
హితబోధలువినెడువారికే, కీడొదవున్!!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
మతితో మీ బ్యాంకు నమో
దితముల రాబట్టి మీరు దిగ్గురన నిథుల్
గతికెడు జిత్తుల మారుల
హితబోధల వినెడివారికే కీడొదవున్

కుసుమ ఉప్పలపాటి చెప్పారు...

మతమను ముసుగున మౌఢ్యపు
గతులను జనులను నడిపెడి కపటపు యతులన్
నతిగా నమ్ముచు వారల
"హితబోధల వినెడివారికే కీడొదవున్"

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

విరించి చెప్పారు...

అతిగా స్వార్థము కల్గినట్టి జనులున్ వ్యాపారులున్ మూఢులున్
యతిగా వేషము దాల్చి భూరిగ ధనమ్మార్జించు సన్యాసులున్
మతియేలేని వివేక శూన్యులును దుర్మార్గుండ్రిలన్ చెప్పెడిన్
హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్

BVVHBPrasadarao చెప్పారు...

ధన్యవాదములు

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మత్సర ద్వేష' మన్నపుడు 'ర' గురువై గణదోషం.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. 'చేసే' అనడం వ్యావహారికం.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కపట యతులనే । యతిగా నమ్ముచు..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా🙏

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

సతతము మంచిని కోరుచు
సుతిమెత్తనిమాటలాడి సూచన లిడస
‌న్మతితోడను విడువక యా
హితబోధల వినెడి వారికే కీడొదవున్?

సతతము శుభమే జరుగును
హితబోధలు వినెడి వారికే కీడొదవెన్
మతిహీనంబగు పనులను
మితిమీరగచేయుచుండమేదిని యందున్.

seethadevi gurram చెప్పారు...

మత్సర పొచ్చముల్ అనవచ్చా గురువుగారూ?

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

ఫణి కుమార్ తాతా చెప్పారు...

పతులుం బంధులు జూచుచుండ సభలో పాంచాలినిం బిల్చి సం
తతముం మిత్రుడటంచు పేర్కొనెడి రాధా బుత్రునిం బల్కులన్
సతి వస్త్రంబుల నూడిపించి కురురాజంకంబునం గూలె గ
ర్హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్

ఫణి కుమార్ తాతా చెప్పారు...

పతులుం బంధులు జూచుచుండ సభలో పాంచాలినిం బిల్చి సం
తతముం మిత్రుడటంచు పేర్కొనెడి రాధా బుత్రునిం బల్కులం
దతివన్ పెక్కు పరాభవించి కురురాజంకంబునం గూలె గ
ర్హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్