1, డిసెంబర్ 2019, ఆదివారం

సమస్య - 3208 (చూడఁ జూడ రుచుల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చూడఁ జూడ రుచుల జాడ యొకటె"
(లేదా...)
"శోధనఁ జేయుచున్ రుచులఁ జూడఁగ జాడ యొకండె మిత్రమా"
(జి. ప్రభాకర శాస్త్రి గారికి ధన్యవాదాలతో...)

104 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  కలియుగ కృష్ణ పరమాత్మ ఉవాచ:

  రాధను రుక్మిణిన్ మిగుల రాజస మొప్పెడు సత్యభామనున్
  మేధను తల్చుచున్ వెరసి మెండుగ వారలు నెత్తికిచ్చెడిన్
  బాధల సైచజాలకయె బావురు మంచును రోజురోజునున్
  శోధనఁ జేయుచున్ రుచులఁ జూడఁగ జాడ యొకండె మిత్రమా

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  __________________________

  వేడి వేడి కోడి - వేపుడైన నొకటె
  మాడి మసిగ మారు - మాంసమొకటె
  తాగుబోతులకును - తారతమ్యము లేదు
  చూడఁ జూడ రుచుల - జాడ యొకటె !
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !
  __________________________

  నాడు రాజధాని - గోడు గోడు మనెను ! (నిర్భయ)
  నేడు భాగ్యనగరి - గొల్లుమనెను ! (ప్రియాంకరెడ్డి)
  తాగుబోతులకును - తారతమ్యము లేదు !
  చూడఁ జూడ రుచుల - జాడ యొకటె !
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అసనారె గారికి ధన్యవాదములతో :

   __________________________

   నాడు రాజధాని -గోడు గోడు మనెను ! (నిర్భయ)
   భాగ్యనగరి నేడు - వగచు చుండె ! (ప్రియాంకరెడ్డి)
   తాగుబోతులకును - తారతమ్యము లేదు !
   చూడఁ జూడ రుచుల - జాడ యొకటె !
   __________________________

   తొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  "Bombay Talkies"

  క్రోధము మీరగా చెలగి గొంతులు కోసెడి శైవసైనికున్
  మేధను తొల్చు భాజపను మేలిమి సోనియ "పావరా"లతో
  బాధను నాది చూచుచును భారత దేశపు రాజనీతినిన్
  శోధనఁ జేయుచున్ రుచులఁ జూడఁగ జాడ యొకండె మిత్రమా

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-3)
  __________________________

  తల్లి యక్క వదినె - చెల్లెలై న నొకటె
  కొసరు దీర్చు కొనుట - కొరకు నిజము !
  తాగుబోతులకును - తారతమ్యము లేదు !
  చూడఁ జూడ రుచుల - జాడ యొకటె !
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 6. సూర్యచంద్రులంచు స్థూలదృష్టికిదోచు
  చూడచూడ రుచులజాడ యొకటె
  పంచుచుంద్రు వెలుగు వంతులవారిగ
  రెండు కండ్లవోలె రేయిపవలు
  రుచి = ప్రకాశము  రిప్లయితొలగించండి
 7. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-4)
  పందులను గేదెలను మేకలను ఆవులను రేప్ చెయ్యడం చదివాం
  నిన్న ఈ వెధవలు శవాన్ని కూడా నట !!!!?????
  __________________________

  కుతిని దీర్చు కొనగ - కోమలాంగియె కాదు
  పశువు శిశువు పీన్ గు - పంది మేక
  తాగుబోతులకును - తారతమ్యము లేదు !
  చూడఁ జూడ రుచుల - జాడ యొకటె !
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 8. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-5)
  నిన్నటి వార్త :
  సంవత్సరము నుండి కోమాలో ఆసుపత్రిలో నున్న వనిత
  పురిటి నొప్పులు పడుతూ మెలకువ లో కొచ్చినదట
  ఏ వెధవ చేసాడో దర్యాప్తు చేస్తున్నారట
  చిత్రమేమిటంటే
  ఆవిడకు గర్భమని సిబ్బంది కూడా గమనించ లేదట
  __________________________

  అంపశయ్య నున్న - నతివనూ విడువరు
  కామ వాంఛ దీర - కాముకు లదె
  తాగుబోతులకును - తారతమ్యము లేదు !
  చూడఁ జూడ రుచుల - జాడ యొకటె !
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అతివనూ' అనడం వ్యావహారికం. "అతివనైన విడరు" అనండి.

   తొలగించండి
  2. శంకరార్యులకు ధన్యవాదములతో :
   __________________________

   అంపశయ్య నున్న - నతివనైన విడరు
   కామ వాంఛ దీర - కాముకు లదె
   తాగుబోతులకును - తారతమ్యము లేదు !
   చూడఁ జూడ రుచుల - జాడ యొకటె !
   __________________________

   తొలగించండి
 9. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-6)
  నిన్నటి వార్త :
  నెల్లూరులో ననుకుంటా
  ఒక త్రాష్టుడు కన్నకూతురు మీదనే యట
  ఆ అమ్మాయే పోలీసులకు ఫిర్యాదు
  __________________________

  కన్న కూతురన్న - కనికారమూ లేదు
  కన్న తండ్రి కాదు - దున్నపోతు
  తాగుబోతులకును - తారతమ్యము లేదు !
  చూడఁ జూడ రుచుల - జాడ యొకటె !
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కనికారము' అన్న పదం సాధువు కాదు. కేవలం శ్రీహరి నిఘంటువు పేర్కొన్నది. అది ప్రమాణం కాదు. "కనికరమే లేదు" అంటే సరి!

   తొలగించండి
  2. శంకరార్యులకు ధన్యవాదములతో :
   __________________________

   కన్న కూతురన్న - కనికరమే లేదు
   కన్న తండ్రి కాడు - దున్నపోతు
   తాగుబోతులకును - తారతమ్యము లేదు !
   చూడఁ జూడ రుచుల - జాడ యొకటె !
   __________________________

   తొలగించండి
 10. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-7)
  అన్నిటికీ మూల కారణం త్రాగుడనే నా అభిప్రాయం
  అందుకే మూడవ పాదం మార్చ బుద్ధవడం లేదు :
  __________________________

  విస్కి బ్రాంది రమ్ము - పేర్లదె వేర్వేరు
  మతిని ధృతిని గతిని - మార్పు జేయు
  తాగుబోతులకును - తారతమ్యము లేదు !
  చూడఁ జూడ రుచుల - జాడ యొకటె !
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 11. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-8)
  అన్నిటికీ మూల కారణం త్రాగుడనే నా అభిప్రాయం
  అందుకే మూడవ పాదం మార్చ బుద్ధవడం లేదు
  అదేదో సినిమాలో ఏమని వర్ణించనూ
  అన్నట్టు
  యెన్నని వ్రాయగలం
  ఏడుపొస్తోంది
  ఇంక ఆపేస్తా :
  __________________________

  అన్ని వార్త లివియె - కన్నను విన్నను >(పేపరు, టీవి)
  కడుపు కదలి కనులు - కారుచుండె
  తాగుబోతులకును - తారతమ్యము లేదు !
  చూడఁ జూడ రుచుల - జాడ యొకటె !
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 12. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-9)
  విద్దె గలదు గాని బుద్ధి, వినయమేది ???
  ఆయనుంటే మంగలెందు కన్నట్టు
  అవే ఉంటే యివన్నీ జరగవు గదా :
  __________________________

  విద్య బుద్ధి మరియు - వినయంబు నేర్పగా
  పిల్లలకును; వలయు - తల్లి, తండ్రి
  విద్దె గలదు గాని - బుద్ధి, వినయమేది ???
  చూడఁ జూడ రుచుల - జాడ యొకటె !
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 13. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !
  B-1)
  లడ్డూ కాజా బర్ఫీ ---ఏది తిన్నా అదే తీపి :
  __________________________

  వాదన లేలనోయి పలు - వన్నెల చిన్నెల తీపి గల్గు నా
  సాధృత మందు నమ్మ బడు, - చక్కని చిక్కని పాకమంతటిన్
  మేదు పదార్థముల్ గనిన ; - మిక్కిలి మక్కువ మెక్క నెన్నియున్;
  శోధనఁ జేయుచున్ రుచులఁ - జూడఁగ జాడ యొకండె మిత్రమా !
  __________________________
  సాధృతము = అంగడి

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 14. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  B-2)
  వీరుని కాంతియె కామవల్లభౌ :
  __________________________

  మేదిని జూడగన్ పవలు - మిన్నున మిత్రుడు వెల్గు చుండెడిన్
  మేదిని రాత్రియందు గన - మింటిని చంద్రుని వెన్నెలల్ గదా
  భేదము లేదుగా దెలియ - వీరుని కాంతియె కామవల్లభౌ !
  శోధనఁ జేయుచున్ రుచులఁ - జూడఁగ జాడ యొకండె మిత్రమా !
  __________________________
  కామవల్లభ = వెన్నెల

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కామవల్లభ + ఔ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

   తొలగించండి
  2. శంకరార్యులకు ధన్యవాదములతో :

   వీరుని కాంతియె చంద్రబాలయౌ:
   __________________________

   మేదిని జూడగన్ పవలు - మిన్నున మిత్రుడు వెల్గు చుండెడిన్
   మేదిని రాత్రియందు గన - మింటిని చంద్రుని వెన్నెలల్ గదా
   భేదము లేదుగా దెలియ - వీరుని కాంతియె చంద్రబాలయౌ !
   శోధనఁ జేయుచున్ రుచులఁ - జూడఁగ జాడ యొకండె మిత్రమా !
   __________________________
   చంద్రబాల = వెన్నెల

   తొలగించండి
 15. కనులు గాన కుండ కామాంధు లందరు
  ఆధు నికమ టంచు నంప శయ్య
  పశువు కంటె మిన్న పడతిని గాంచిన
  చూడ్ఁ జూడ రుచుల జాడ యొకటె

  రిప్లయితొలగించండి

 16. కంది వారి మనో భావము గా

  అనుదినము సమస్యలను వేసి పూరణ
  లెల్ల చదివి చూడ లెస్సగాను
  నిలచె మదిని నొక్క నిక్కపు తలపోత
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   (ఒక్కొక్కసారి అటువంటి అనుభూతికి లోనవుతూ ఉంటాను).

   తొలగించండి
 17. మైలవరపు వారి పూరణ

  ఈ ధరణిన్ జనించు, టొక యింతిని గూడుట, బిడ్డ నొందుటల్,
  సాధన జేసి ప్రేమనిడి సాకుట, పెండిలి జేసి పంపుటల్,
  బాధను పొందుటన్నదనివార్యము ., మానవజాతి గాధలన్
  శోధనఁ జేయుచున్ రుచులఁ జూడఁగ జాడ యొకండె మిత్రమా !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 18. పనస తొనలు కదళి పాయసాన్నము లడ్డు
  లిక్షు రసము పోలె లింతి పెదవి
  తేనె కజ్జికాయ తెలుగు భాషఁ దరచి
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె.

  రిప్లయితొలగించండి


 19. సాధన చేసి పాడనదె చక్కగ జాడయొకండె మిత్రమా
  బోధన చేసి చూడనదె బుద్ధుల జాడ యొకండె మిత్రమా
  శోధనఁ జేయుచున్ రుచులఁ జూడఁగ జాడ యొకండె మిత్రమా
  రాధన మెల్ల మానసపు రావడి గారడి నందివర్ధనా!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 20. BTW, ఈ "యొకండె" ఏదో కొద్దిగ అర్థం కాకుండా వుంది. యొక్కటె - జాడ యొక్కటె అని కదా అనాలి? జాడ ఒకండగునా ?  జిలేబి

  రిప్లయితొలగించండి
 21. రాజకీయ నేతలనుడి వేరుగనుండు
  జూడఁ జూడ రుచుల జాడ యొకటె
  పీఠమెక్కి రాజ్య పెద్దరికమునొంద
  జనుల మోసగించ సాధ్యమనుచు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రాజ్య పెద్దరికము' దుష్ట సమాసం.

   తొలగించండి
 22. (నాటి నన్నపార్యుని నుండి నేటి శంకరా
  ర్యుని వరకు విభిన్నప్రక్రియలతో వివిధకావ్య
  ఫలాలు పండించినా వాటి రసానంద మొక్కటే )
  సాధన సల్పుచున్ గవులు
  సత్కవి నన్నయ నుండి కాంచగా
  నాధునికుండు శంకరవ
  రార్యుని దాకను నెన్ని నూత్నమౌ
  గాధల కావ్యభంగిమలు
  కమ్రముగా వెలయింపజేసినన్ -
  శోధన జేయుచున్ రుచుల
  జూడగ , జాడ యొకండె మిత్రమా !!
  ( కమ్రముగా - మనోహరంగా )

  రిప్లయితొలగించండి
 23. కామమునను గలుగు గాటపు క్రోధమ్ము
  క్రోధ మిచ్చు మోహ లోభములను
  మదము మచ్చరములు తుదకై నశించును
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె.

  రిప్లయితొలగించండి
 24. ఆడవారి కన్న నశ్వమై యెగయును
  పురుషుల మనసులవి ధరణిపైన
  సందు దొరికె నేని సరస మాడునపుడు
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె

  రిప్లయితొలగించండి
 25. పార్టి లంటు బెట్టి ప్రజలమనసుదోచి
  గద్దె లెక్కగానె గానరెవరు
  క్యాప్టలిస్ట్లె ప్రజలఁ కాటు వేతురుగదా
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె

  రిప్లయితొలగించండి
 26. మోసగింఛువారుమూర్ఖులై మసలుచు
  నెట్టిి వారినైన నేవగించి
  బాధ పెట్టు చుంద్రు పంతముు పట్టియున్
  చూడ ఛూడ రుచుల జాడయొకటె

  రిప్లయితొలగించండి
 27. మట్టి కుండలందు మట్టియే సత్యంబు;
  కుండలెన్నియున్న గుట్టు నొకటె;
  తనువులెన్ని యున్న దైవం బదొక్కటే!
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె.

  రిప్లయితొలగించండి


 28. నా పూరణ. ఆ.వె
  ** *** ***
  చేదు తీపి పులుపు లాది షడ్రుచుల ప

  దార్థముల దిన విశదమగు మదికి

  కడుపులోకి జొచ్చి కడ కిడు శక్తినే

  చూడఁ జూడ రుచుల జాడ యొకటె"


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
 29. పుట్టి పెరిగి చచ్చు పుడమినిజీవులు
  మధ్యలోన బడుచు మత్సరమును
  నిముషమైన మనసు నిల్పగలేరుగా
  చూడచూడ రుచులజాడ యొకటె

  రిప్లయితొలగించండి
 30. పప్పుచారు యనగ పడిచచ్చెదరు తిన
  జిహ్వ లేచి వచ్చు జీవులకును
  పక్క రాష్త్ర వంట బాతు బిసిబెళయు
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె

  రిప్లయితొలగించండి
 31. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  శోధనఁ జేయుచున్ రుచులఁ
  జూడఁగ జాడ యొకండె మిత్రమా

  సందర్భము: సుగ్రీవాజ్ఞ మేరకు అంగదుని నాయకత్వంలో సీతాన్వేషణకై హనుమంతుడు జాంబవంతుడు నీలుడు మొదలైన మహామహులైన వానర వీరులు దక్షిణ దిశగా బయలుదేరారు.
  ఈ సమూహానికి ఒక ప్రత్యేకత వుంది. వేరే దిక్కులకు పంపిన గుంపులమీదకన్న ఈ సమూహంమీదనే సుగ్రీవు డాశలు పెట్టుకున్నాడు. అతణ్ణి చూసి రాముడు ఆశలు పెట్టుకోవటమే కాక పెంచుకున్నాడు కూడా. అందుకే మారుతిని పిలిచి సీత కనిపిస్తే యీయ మని రామముద్రిక నిచ్చాడు.
  దదౌ తస్య తతః ప్రీతః
  స్వనామాంకోపశోభితం
  అంగుళీయ మభిజ్ఞానం
  రాజపుత్రాః పరంతప
  (సుం.కాం. 44 స.12 శ్లో.)
  సుగ్రీవుని ఆజ్ఞ శిరసావహించి భయభక్తులతో అంగదుని మార్గదర్శకత్వంలో ఆ వానర వీరు లుత్సాహంగా వెళుతూ దారిలో ఒకరితో నొకరు ఈ విధంగా అనుకుంటున్నారు.
  "సీధువు (మద్యము) తాగుతున్నారా! మాంసం తింటున్నారా! అన్నది కాదు ముఖ్యం. సీతమ్మ జాడ (కనుక్కోవా లన్నది) ఒక్కటే బోధను (జ్ఞానంలో.. ఎఱుకలో) నిల్పి (మరచిపోకుండా) ముందుకు పోవాలి.
  మన కందరికీ (సీతమ) "జాడ ఒక్కటే!" అనేది మంత్రం కావాలి (అహోరాత్రులూ). అప్పుడు మాత్రమే రోధము (తీరం) చేరగలం. విరోధం కల్గదు. (తేడా రాదు.)
  పోతే మీరు శోధన (సీతాన్వేషణ) చేస్తూ రుచులు చూస్తే తప్పు లేదు. చేయకుండా (మరచిపోయి), కర్తవ్యం విస్మరించి రుచులు చూడడంలో మునిగిపోతే తప్పు.. ముప్పు కూడ. అంటే సుగ్రీవాజ్ఞ ఉల్లంఘనంవల్ల కఠిన శిక్ష..
  రుచు లంటే జనపదాల్లో సాగుతూ వున్నప్పుడు భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలు.. షడ్రుచులు.. లేదా మద్య మాంసాదుల రుచులు. వనాలలో వెళుతున్నప్పుడు కందమాలాలు.. పుట్ట తేనెలు.. ఫలాలు.. ఫలరసాలు మొదలైనవాటికి చెందిన రుచులు.
  అందుకే నేను చెప్పే దే మంటే మిత్రమా! "(సీతమ) జాడ యొకండె".. "జాడ యొకండె".. అనే మంత్రం వల్లిస్తూ వుండండి పైకి అయినా సరే! లోలోపల ఐనా సరే!(అదే క్షేమంగా తీరానికి చేరుస్తుంది.) గత్యంతరం లేదు." ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  సీధువు గ్రోలు, డిం కొకటిఁ
  జేయుడు.. సీతమ జాడ యొక్కటే
  బోధను నిల్పి ముందునకుఁ
  బోవలె.. "జాడ యొకండె!" మంత్రమౌ..
  రోధముఁ జేరవచ్చును.. వి
  రోధము కల్గదు.. తప్పు కాదులే
  శోధనఁ జేయుచున్ రుచులఁ
  జూడగ!.. "జాడ యొకండె!" మిత్రమా!

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  1.12.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 32. మ్యానిఫెస్టులందు మార్పులుఁ జూపుదు
  రన్ని పక్ష నేత లన్ని సార్లు
  ఆచరించిఁ జూపు మనియడిగినవేళ
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె

  రాజకీయ పార్టీలు మేము అందరిలాగా కాదు అని రకరకాల మ్యానిఫెస్టోలు ఎన్నికల ముందు విడుదల చేస్తాయి. గెలిచిన తర్వాత ఆచరణలో చూస్తే అన్ని పార్టీలు ఒకేలాగా ఉంటాయి.

  రిప్లయితొలగించండి
 33. చూడచూడరుచుల జాడయొకటెకాదు
  చూడచూడరుచుల జాడవేరె
  యనుచుజెప్పెవేమ నార్యుడుతనదుశ
  తకమునందు వినరె?తనయులార!

  రిప్లయితొలగించండి
 34. ఉప్మ యైన గాని యుల్లి దోశయె గాని
  ఉప్పు లేదు కారముండ బోదు
  వంటకమ్ములన్ని వండునొక్కటె దీరు
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె

  రిప్లయితొలగించండి
 35. *చూడఁ జూడ రుచుల జాడ యొకటె*

  చదువులున్ననేమి సంకయు నాకగ
  బుద్ధి యనునదిచట బుగ్గిపాలు
  అబల యనిన మదిన యాట పరికరము
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె
  🙏🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆరు రుచులనెంచు పండుగ తెచ్చెర
   కొత్త వత్సరమున కొత్త దనము
   ఎన్ని రుచులు కలిపి యేమేమి చేసిన
   చూడఁ జూడ రుచుల జాడ యొకటె
   🙏🙏

   తొలగించండి
 36. ఆ॥వె॥
  మనుషులందుపెరిగె మధుమేహరోగమ్ము

  తీపిచెక్కెరుండతినగ చేటు!
  చాకరేనుయందు చక్కరయుండదు

  చూడఁ జూడ రుచుల జాడ యొకటె

  గాదిరాజు మధుసూదనరాజు

  రిప్లయితొలగించండి
 37. వాదములేల నేడిటుల భారత దేశపు రాజకీయమున్
  వేదన మాత్రమే మిగిలె వేడుక మాటల పెద్దలన్ గనన్
  నీదని నాదనంచు మన నేతలు దోచుచు పంచుకొందురే
  శోధనఁ జేయుచున్ రుచులఁ జూడఁగ జాడ యొకండె మిత్రమా

  రిప్లయితొలగించండి
 38. పల్లె పదములైన భావ గీతములైన
  వచన కవితయైన పద్యమైన
  భావమమరినపుడె ప్రజలను రంజించు
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె

  రిప్లయితొలగించండి
 39. సాధననెంతజేసినను సత్కవులెల్లరిపద్యమాలికల్
  బోధనజేయునట్లుగను బోడిమితోడనునుంటచే యవిన్
  శోధనజేయుచున్ రుచులుజూడగ జాడయొకండెమిత్రమా!
  యీధరణిన్ జనించుకవులెవ్వరెయైననునిట్లనేసుమా

  రిప్లయితొలగించండి
 40. రామనామంబన్న
  రంభాఫలపు తీపి
  పరగ సీతాలక్ష్మి పండు ద్రాక్ష
  వేంకన్ననామమ్ము
  వెలలేనిమామిడి
  తల్లి పద్మావతి దాడిమమ్ము
  శివనామమెంచంగ చిలుకకొట్టిన జామ
  శివగామియరుదైన సీమరేగు
  నరసింహ నామమ్ము
  నారికేళసమమ్ము
  చెంచులక్ష్మినిజూడ శ్రీఫలమ్ము
  నామమేదియైన
  నరజన్మదాటించి
  నాకమందజేయు
  నావయొకటె
  ఫలమదేదియైన ఫలదాతయొక్కడే
  చూడ జూడరుచుల
  జాడయొకటె.

  రిప్లయితొలగించండి
 41. శ్రీ వినాయక


  కమలాసనుడు తన కామపు చిత్తము వలనకో ల్పోయెనౌ దలము నొకటి
  వేయిక నులు పొందె వేల్పుల గమిగాడు కామాంధుడై ముని భామ కూడి
  పరకాంత పొందును విరటుని బావ మరిది కోరి నిలలో మరిమనుపొందె
  రావణ బ్రహ్మయు రమణి సీతను కోరి కోదండ పాణిచే కూల్చ బడెను

  తరచి చూడ చేసె తప్పులు నిరువురు
  యెంచి చూడ నొక్క కంచె లోన
  మేసె మేతను పొల మేపరుల్ ను, సురలు,
  చూడ చూడ రుచుల జాడ యొకటె,

  రిప్లయితొలగించండి
 42. వేడి యైన నేమి వింత శీతల మైన
  నేమి తియ్య నైన నేమి చేదు
  నైన నేమి యింద్రియమ్ములు లేకున్నఁ
  జూడఁ జూడ రుచుల జాడ యొకటె


  బోధన మందు నందఱును బూర్ణ వివేకత నుందు రక్కటా
  బాధలు వారి ముంచ నిఁకఁ బాటవ మెల్లయుఁ దెల్ల మౌనులే
  యీ ధరఁ గష్ట కాలముల నెట్టి మనుష్యులు నట్టులే చుమీ
  శోధనఁ జేయుచున్ రుచులఁ జూడఁగ జాడ యొకండె మిత్రమా

  రిప్లయితొలగించండి
 43. పదవికొరకు పడును పడరానియిక్కట్లు
  పదవిజిక్కమరచు ప్రజల నొకడు
  తిరిగిపదవిపొందు తిప్పలింకొకడివి
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె

  రిప్లయితొలగించండి
 44. విశ్వమంత దిరిగి విశ్వేశ్వరుని పేర
  దేవదేవుఁ లేక దేవి గొల్వ
  విశ్వఁ మందు దానె విశ్వ బాహ్యముదానె
  చూడ జూడ రుచుల జాడ యొకటె

  రిప్లయితొలగించండి
 45. కందమూలములను విందుగా దలపగా
  వంద వంటకాల వరుస లేల
  కంది మౌనివర్యు కవనంబు సమమౌనె
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె

  రిప్లయితొలగించండి
 46. పార్టిలెన్ని యున్న బాలన యొకటిగా
  నుద్ధరింతు మనుచు నుద్భవించు
  నుర్వి బార్టి లెల్ల నొకతాను ముక్కలే
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె !

  రిప్లయితొలగించండి
 47. పార్టిలెన్ని యున్న బాలన యొకటిగా
  నుద్ధరింతు మనుచు నుద్భవించు
  నుర్వి బార్టి లెల్ల నొకతాను ముక్కలే
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె !

  రిప్లయితొలగించండి
 48. పేదల కైనధాత్రిఁ గడు పెన్నిధిఁ గల్గిన వారకైన నా
  బాధలు తప్పవయ్యె పెను బాధ్యత లెన్నియొ మోయు వారకై
  యీ ధరణీ తలమ్మునను, హేతువదేని, మనస్సులన్ సదా
  శోధనఁ జేయుచున్ రుచులఁ జూడఁగ జాడ యొకండె మిత్రమా

  రిప్లయితొలగించండి
 49. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె

  సందర్భము: సీతారామ లక్ష్మణులు పంపాసరస్సు పశ్చిమ తీరంలోని శబరి ఆశ్రమానికి చేరుకున్నారు. సేవాభావం, వ్రతాచరణ, ధర్మనిష్ఠ కల శబరి రాముని పట్ల శరణాగతి భావంతో పెద్దకాలం నిరీక్షించింది. రాగానే పూజించింది. మధుర ఫలాలు సమర్పించింది. రాము డెంతో ప్రేమతో స్వీకరించాడు.
  "అద్య మే సఫలం జన్మ
  స్వర్గశ్చైవ భవిష్యతి
  త్వయి దేవవరే రామ!
  పూజితే భరతర్షభ!
  దేవ శ్రేష్ఠుడవైన నీవు పూజితుడ వౌటచే నా జన్మ సఫల మయింది. నాకు పరమపదం సిద్ధిస్తుంది.
  మా గురువులు మతంగ మహర్షి దివ్య లోకాలకు వెళుతూ రాముడు వస్తా డని, చూడగానే నీకు ముక్తి లభిస్తుం దని చెప్పారు."
  అని వనమంతా చూపించి గురువుగారి పావన జీవనాన్ని కొనియాడింది. ఆమె గురుసేవను మెచ్చుకొని రాముడు అర్చితోఽహం త్వయా భక్త్యా గచ్ఛ కామం యథా సుఖమ్.. (నన్ను భక్తితో పూజించినావు. కోరిన పుణ్య లోకానికి సుఖంగా పొమ్ము.) అన్నాడు.
  "శ్రీ మద్రామాయణ కల్పవృక్షం.. శబరి పాత్ర" అనే అంశం మీద శ్రీ కుమార స్వామి నాయుడు గారు 1983 లో ప్రామాణికమైన ఎంఫిల్ పరిశోధనను గావించగా 1990 లో "యువభారతి" వారు ప్రచురించారు.
  భక్తుడు భగవంతుని పట్ల నెరపేది భక్తి. భగవంతుడు భక్తుని పట్ల నెరపేది కరుణ. రెండూ ప్రేమతో కూడుకున్నవే! కాబట్టి రుచి ఒకటే! అది వా రిద్దరికే తెలుసు..
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  భక్తి రుచి య దేదొ భగవాను డెఱుగును..
  వాని కరుణ రుచిని భక్తు డెఱుగు..
  రామునికిని శబరి రమ్య ఫలా లిచ్చె..
  జూడఁ జూడ రుచుల జాడ యొకటె..

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  1.12.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి

 50. సన్నివేశమొప్పు సరియైన పద్యమ్ము
  వ్రాయనేర్పుయున్న రాతమారు
  విషయమెట్టిదైన విజ్ఞత గలుగుచో
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె!

  రిప్లయితొలగించండి
 51. ఉత్పలమాల
  ఈ ధరణిన్ సతిన్ వలచుటే తగురా పురుషార్థ సాధనన్
  వీధుల జంతువై మరిగి వేశ్యల కర్రులు చాచుటేలనో?
  బేధమె పాసెమున్దినగ శ్వేతపు నిత్తడి రాగి పాత్రలన్?
  శోధనఁ జేయుచున్ రుచులఁ జూడఁగ జాడ యొకండె మిత్రమా!

  రిప్లయితొలగించండి
 52. ఆ.వె//
  ఉప్పు, కప్పురంబు యుండు నొకటెతీరు l
  వంటచెరకు నుండి వచ్చు తీపి l
  పటిక, బెల్లములను పలువిధరీతుల l
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె ll

  రిప్లయితొలగించండి
 53. ఆ.వె//
  భక్తితోడ చదువ భాగవతమ్మును l
  మెచ్చి, ముక్తి కొరకు మేలుకొలిపి l
  రక్తి బంచు నట్టి రామాయణమ్మును l
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె ll

  రిప్లయితొలగించండి
 54. పాలు నొసగు నట్టి పశువుల రంగులు
  ఎరుపు తెలుపు నలుపు లిట్లు వేరు
  వేరయినను త్రాగు వేళలందెల్లయు
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె
  [
  మరొక పూరణ

  యాస యేది యైన బాసయొకటెనంచు
  మురిసె తెలుగు తల్లి ముదము తోడ
  వాడు పదము వేరు భావమొక్కటెగదా
  చూడ చూడ రుచుల జాడ యొకటె.

  రిప్లయితొలగించండి
 55. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె

  సందర్భము: కురు పాండవ యుద్ధంలో అస్త్రసన్యాసం చేసి రథంలో చతికిలబడిన అర్జునునికి గీతోపదేశం చేస్తూ విశ్వ రూపం చూపించినాడు కృష్ణభగవానుడు. అది చూడలేక పార్థు డిలా అన్నాడు.
  "సూర్యు డతి సన్నిహితు డైతే నేమి సంబరం? నీవు హితుడ వైతే నేమి సంబరం? నేను తేరిపార నీవైపు చూడలేను కదా!
  (చూస్తే కండ్లే పోతాయి ఆ దుర్నిరీక్ష్యమైన కాంతికి.) కండ్లు మూసుకుంటాను."
  అంటే సూర్యుణ్ణి దగ్గరగా చూడడం కష్టమే! విశ్వ రూపం ధరించిన కృష్ణుణ్ణి చూడడమూ కష్టమే! అందుకే...
  "చూడను గాక చూడను. మీ ఇద్దరి రుచుల (కాంతుల) జాడ (తీరు) ఒక్కటే సుమా!" అన్నాడు అర్జునుడు.
  అప్పుడు కృష్ణుడు..
  "న తు మాం శక్యసే ద్రష్టు
  మనే నైవ స్వచక్షుషా
  దివ్యం దదామి తే చక్షుః
  పశ్య మే యోగ మైశ్వరమ్..
  (ప్రాకృతములైన నీ కండ్లతో నన్ను చూడలేవు. దివ్య నేత్రాలను ప్రసాదిస్తున్నాను. నా అఘటన ఘటనా సామర్థ్యాన్ని చూడు.)
  అని దివ్య చక్షువులను ప్రసాదించగా అర్జునుడు చూడగలిగాడు.

  చూడఁ జూడ = చూడను.. చూడను..
  రుచులు = కాంతులు
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "అయిన నేమి సూర్యు డతి సన్నిహితుడు? నీ
  వయిన నేమి హితుడ? వకట! యింకఁ..
  గనులు మూసికొందుఁ గాని సూటిగ నేను
  చూడఁ జూడ.. రుచుల జాడ యొకటె!"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  1.12.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 56. ఆటవెలది
  సంపద గలుఁగంగ గుంపౌచు బంధువుల్
  వీడి నంత రారు తోడు నీకు
  దేశమేదియైన దృశ్యమ్ములివియేర
  చూడఁ జూడ రుచుల జాడ యొకటె

  రిప్లయితొలగించండి
 57. ఆ.వె.

  రాజకీయ మనిన రణ రంగమైననూ
  గెలుపు గలిగినపుడె గొలుపు గలుగు
  సూటి మాటలుండు నోటమి చవిచూడ
  చూడ చూడ రుచుల జాడ యొకటె

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 58. హితము బోధ యేను హేతువు గానున్న
  రచనజేయువారి రాశి మేలు
  విధములెవ్వియైన విజ్ఞత తోడున్న
  చూడచూడరుచులజాడయొకటె

  రిప్లయితొలగించండి