5, నవంబర్ 2019, మంగళవారం

న్యస్తాక్షరి - 66

కవిమిత్రులారా,
'సు - ప్ర - భా - తం'
పై అక్షరాలతో వరుసగా నాలుగు పాదాలను ప్రారంభిస్తూ
సూర్యోదయాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి. 

70 కామెంట్‌లు:

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

మైలవరపు వారి పూరణ

సుమములన్నియు వికసించి సొంపులీన
ప్రకృతి చైతవ్యవంతమై పరిఢవిల్లు!
భానుడా! నిన్ను జూచుట భాగ్యమయ్య!
తండ్రి! గొనుమయ్య శతకోటి దండములివె!!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

విరించి చెప్పారు...

సుపతుడుద్భవింప శోభిల్లె ప్రాగ్దిశ
ప్రభలు వెల్లి విరియ వసుధ మురిసె
భాస్కరాగమనము పరికించి శకునముల్
తందరమును వీడె తరువు లందు.

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

సుకవి యెదలోన కదలాడు సూక్తులట్లు
ప్రబలుచుండిన కిరణాల పంక్తితోడ
భానుబింబము తూర్పున ప్రభవమందె ;
తండ్రి గాంచిన విశ్వమ్ము ధన్యమయ్యె .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుంద రంబైన కిరణంపు సోయ గములు
ప్రకృతి పులకించు నుదయాన పలుక రించి
భాను తేజపు విటమిను ప్రాణ బిక్ష
తనరు మదినిండ నినుగొల్చు ధన్య మయ్య

vsnmhari చెప్పారు...

(సు)మధురానందభాగ్యమ్ము చొప్పుమీర
(ప్ర)తిదినమ్మును భువిపైన బంచగోరి
(భా)ను డేతెంచు జగతికి బంధుడగుచు
(తం)బి! మ్రొక్కంగ రావోయి తన్మయమున.

Zilebi చెప్పారు...



సుదిన మిదియె రండి సుందర మైనది
ప్రగతి కిది భళా సభాస్థలి! మది
భారము తొలగంగ భాసిలు తేజము
తంకవమ్ము ద్రోలు తరుణమిదియె!

శుభోదయం రేపటి న్యస్తాక్షరి :)


జిలేబి

Yajnesh చెప్పారు...

సుగుణ కౌసల్య ముద్దుల శుద్ధ ముక్త!
ప్రకృతి వొడిలోన నిదురించు పావనత్మ!
భానుడుదయించె తూర్పున పసిడి వోలె
తండ్రి యికలేచి వర్తించు తగిన రీతి

BVVHBPrasadarao చెప్పారు...

సుప్త జగతిని మేల్కొల్పు జోత యనగ
ప్రభవమందిన యరుణపు బంతి యనగ
భాగ్య సంపూజ్య దినకర ప్రాభవములు
తంబురలు మీటు ధ్వనులను ధాత్రి నింపె.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

సుమములరవిచ్చె స్రవియించె హిమము తరుల
ప్రభలు తూరుపుదిక్కునపరచె బాల
భానుడుదయించెతిమిరమ్ము భగ్నమాయె
తండ్రి శ్రీరామ సుప్రభాతమ్ము నీకు

Yajnesh చెప్పారు...

పసిడికొండ

కంది శంకరయ్య చెప్పారు...

మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాల్గవ పాదం 'తం'తో ప్రారంభం కావాలి. "తండ్రి! మదినిండ నినుగొల్చి ధన్యనైతి" అంటే సరి!

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రేపటి న్యస్తాక్షరి'?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రకృతి యొడిలోన' అనండి.

Akula shanthi bhushan చెప్పారు...



నా పూరణ. తే.గీ.
** *** *** **

సుమము వోలె ప్రాగ్దిశ విచ్చె సూను డంత

ప్రకృతి మేల్కొని ముదమొందె ప్రభల గాంచి

భాను డిడ శక్తి బరుగిడు బ్రతుకు బండి

తండ్రి వోలె గాచు నిడు వందనము భక్తి


🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷

Zilebi చెప్పారు...


ఇవ్వాళ సుప్రభాతం‌ ఇచ్చేరు రేపు శుభోదయం ఇస్తారేమోనని :)



జిలేబి

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

సురుచి రంబైన కిరణాలు శోభి లంగ
ప్రకృతి పులకించి వికసించె భాసి లంగ
భాను డు ద యింప తూర్పున భవ్య ముగను
తండ్రి యనుచు ను ప్రణ మిల్లె ధాత్రి యంత

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

vsnmhari చెప్పారు...

(సు)దృఢమైనట్టి ధైర్యమ్ము నెదలలోన
(ప్ర)స్ఫుటింపగ జేయుటే పనిగ గొనుచు
(భా)సురంబైన రూపాన బ్రాచి నదిగొ
(తం)డ్రి యౌచును విచ్చేసె తరణి కనుడు.

కుసుమ ఉప్పలపాటి చెప్పారు...

సుజన జీవుల చైతన్య శోభ నింప |
ప్రకృతి యెల్ల పరవశించి పాట పాడ |
భాను డుదయించె ప్రాగ్దిశ భాసురముగ |
తంనమామి యని కొలుతు ! తపను నెపుడు |

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ధన్యవాదములు గురువుగారూ!

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...


సురగురు పూజ్యా! సూర్యా!
ప్రసరణ మాత్రేణ సర్వప్రాణ సుఖాయా!
భాస్కర! వసవే! దేవా!
తం!కరుణాలయ! జయాయ! తరుణా! అరుణా!
(తం - పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) ధనధాన్యాలను సిద్ధింపజేసే శక్తి కలిగిన మోహకర బీజాక్షరం)

pks kumar చెప్పారు...

(సు)క్కురుండుదయించగా సుక్రతుండు
(ప్ర)భలు వెదజల్లి ప్రాగ్దిశన్ పరిఖ మద్య
(భా)వుకమునిడ నతనికి పక్షులెల్ల
(తం)ద్ర వీడి పలికె స్వాగతంబునపుడు

తూర్పు దిశలొ శుక్రుడు సూర్యుని కన్నా ముందుగా ఉదయిస్తాడు. సూర్యుడు కొండ నడుమ మధ్య నుంచి శుభము నిడగా అప్పటిదాకా (తంద్ర = కునికిపాటు )పదుచున్న పక్షులు స్వాగతము పలికినయ్యి అను భావన

కంది శంకరయ్య చెప్పారు...

మనోహరమైన పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

చక్కని పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది. ఇది కందపద్యమనుకుంటే ప్రాసభంగం. మొత్తం సంస్కృత సంబోధనలతో ఉంది. ఆర్యావృత్తమా?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

Raja Rao చెప్పారు...

క్రొవ్విడి వెంకట రాజారావు:

సున్నితమ్ముగ పుష్పాలు సోకు లొందె
ప్రకృతి పరవశ మొందుచు వన్నె మీఱె
భాస్కరోదయ మెల్లెడ పసను దెచ్చె
తండ్రి రవి నెంచి జనులిల థన్యు లయ్యె.

Sitharamayya Solasa చెప్పారు...

సుతవుడు వెలుగునీయ వ సుధమురిసె
ప్రమితి నొసగగ నుదయించె ప్రాచి నందు.
భారిగ తన శక్తినొసగె భవ్యముగను
తండులము నుడికించుము తగినరీతి

Surya చెప్పారు...

సుమములన్నియు విరిసెను సుందరముగ
ప్రమదలల్లిరి ముగ్గులు వాకిళులను
భాను కాంతుల విప్పారె పంకజములు
తండ్రి! లోక బాంధవ నీదు దర్శనమున

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

తే గీ..🙏🙏 అర్థవంతముగా ఉన్నదో లేదో గురువులు చెప్పాలి ..
ఇది నా మొదటి తేట గీతి పద్యప్రయత్నం 🙏🙏

(సు)దినమున వచ్చును మనకు సుకిరణములు
(ప్ర)జలకు జరుగునుగ మంచి ప్రార్థన నిట
(భా)నుడి కిరణములు మన బాధ దీర్చు
(తం)డ్రి గ తలచి జరుపుము తగిన పూజ

అర్థవంతముగా లేనియెడల మన్నించ ప్రార్థన 🙏🙏

కంది శంకరయ్య చెప్పారు...

డా. జి.సీతాదేవి గారి పూరణలు.....
(1)
సుమము లన్నియు విరిసెను చుక్కలలసె
ప్రకృతి పులకించి పాడెను పరవశాన
భానుడుదయించ ప్రాగ్దిశ భాసురముగ
తంకమేటికి మాకిక తామసారి!
(2)
సుప్త జగతిని మేల్కొల్పు సూర్యదేవ
ప్రభవ మొందెదవీవదె ప్రతిదినమ్ము
భాసమాన మగుచు సుప్రభాతవేళ
తండ్రి! నీకంటె మిత్రుడు ధరకుగలడె!

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"జనులిల ధన్యులైరి" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సుతవుడు/సుతపుడు... టైపాటు.
మొదటి పాదంలో గణభంగం. "..వసుధయె మురిసె" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

చక్కని పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

ధన్యోస్మి 🙏🙏🙏🙏🙏

ఇది రాయడానికి పడ్డ కష్టం, పోస్ట్ చేసిన అనంతరం పడ్డ టెన్షన్ నాకే తెలుసు..
మరియొక సారి 🙏🙏🙏

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
సుగతిఁ గొన సుషుప్తి విడచి సతపునంది
ప్రకృతి కాంత బొట్టుగఁ జేసి బయలుదేర
భావి కర్తవ్యమదియేదొ వదలకుండు
తంత్రమిదనెడు బోధలఁ దలపులందె

pks kumar చెప్పారు...

ఈ నాటి శంకరా భరణము సమస్య

దత్త పది ( సు, ప్ర , భా, తం) ఈ అక్షరములు పాద అరంభములొ వచ్చు నట్లు సూర్యోదయ వర్ణన
నా పూరణ సీసములో ప్రతి పాదము మొదలు మరియు యతి స్ధానములలొ ఆ అక్షరములు వచ్చు నట్లు సీసము మరియు ఎత్తు గీతిలో కూడా పూరణ



(సు)తపుడు !సూతుడు!(సు)క్రతుడు!సవిత!
శూరుడు!శుష్టుడు!సూరి!హర్త!

(ప్ర)త్యూషుడు!పితువు!(ప్ర)ద్యోతనుడు!పాసి!
పద్మినీ కాంతుడు!పటుగభస్తి!

(భా)స్కరుండు!భుజుడు!(భా)సుడు!ఖాఁకుడు
కాశ్యపేయుడు!కాశి!గగన మణి! ప

(తం)గుడు!పాతంగి (తం)డ్రి!దివామణి!
దినపతి!ధరణుడు!దిశ్యకరుడు!

(సు)ప్ర భాత సమయమున (సు)షమ నిడుచు
(ప్ర)త్యహమ్మున నుదయించు (ప్ర)భలతోడ,
(భా)ను డా స్వాగతమని జం(భా)ల నిడుచు
(తం)ద్ర వీడి పల్కె పతంగ (తం)డమపుడు

జంభాలు = అవలింత , తంద్ర = కునికి పాటు , తండము = గుంపు

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కంది శంకరయ్య చెప్పారు...

సహదేవుడు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

చిత్రకవితా విశారదులు మీరు. ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.

chandrashekhar yelisetty చెప్పారు...

ఆ.వె.
సుఖము నీదు వెలుగు సూచించ ప్రగతిని
ప్రజల మేలు గోరి ప్రజ్వరిల్లు
భాగ్య దాత వీవు బహుశుభ హేతువు
తండ్రి నీదు కృపన తగ్గు నార్తి

వై. చంద్రశేఖర్

A.Satyanarayana Reddy చెప్పారు...

సురుచిరమయిన కాంతితో ధరణిపైన
ప్రజ్వరిల్లి రక్షింతువు ప్రకృతి నెపుడు
భాస్కరా నీదు దర్శన భాగ్యము సత
తంబుదయమున శుభమిడు తప్పకుండ

లలిత సుందరి కల్లూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
లలిత సుందరి కల్లూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

సుప్రభాత మన వసుధకు నెల్ల వర వి
ప్ర కుల భాజను లటఁ బ్రాజ్ఞ తంత్ర
భానునిఁ గొలువ నిలువఁగఁ తండ్రి ప్రజకు స్వ
తంత్ర రీతి జలధిఁ దరణి లేచె

సుప్రభాత మ..........
ప్ర.. భా......తం.
భా..........తం.....
తం...........

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొంత అన్వయదోషం ఉన్నది.

కంది శంకరయ్య చెప్పారు...

అద్భుతమైన పూరణ. అభినందనలు.

వెలుదండ సత్యనారాయణ రావు చెప్పారు...

..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
న్యస్తాక్షరి
*'సు - ప్ర - భా - తం'*
పై అక్షరాలతో వరుసగా 4 పాదాలను
ప్రారంభిస్తూ
సూర్యోదయాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం

సందర్భము: సుగ్రీవుడు రామునితో ఆంజనేయుని గొప్పతనాన్ని బాల్యాన్ని గురించి చెబుతూ..
"బాల భానుని చూచి పండుగా భ్రమించి ఎగిరి పట్టబోయాడట!" అన్నాడు.
యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో తాహి మధుర ఫల జానూ..
(హనుమాన్ చాలీసా.)
పం డనుకొని 16000 మైళ్ళ దూరంలో వున్న సూర్యుని వద్దకు ఒక్క ఉదుటున ఎగిరి పట్టుకున్నాడు.
శ్రీ పరాశర సంహితలో ఈ వృత్తాంతం చక్కగా వుంది.
ఒక అమావాస్యనాడు బాలుడు తల్లి నడిగినాడు ఆహారం కావా లని. "సుపక్వం చ ఫలం సూనో యత్ర కుత్రాపి భుజ్యతామ్" (ఎక్కడైనా బాగా పండిన పండు దొరికితే తిను.) అన్నది.
ఆంజనేయః ప్రహృష్టాత్మా
దివ ముత్పత్య వేగత
శిశు రుద్యంత మాదిత్యం
ఫలబుద్ధ్యా గృహీతవాన్
(ఆంజనేయు డానందంతో వేగంగా నింగి కెగిరి ఉదయించే బాలసూర్యుని ఫల మనుకొని పట్టుకొన్నాడు.) శ్రీ పరాశర సంహిత 6 వ పటలం 50 వ శ్లోకం
వెంటనే దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టగా విఫలమయింది. దేవత లంతా ప్రార్థిస్తే హనుమ సూర్యుణ్ణి విడిచిపెట్టాడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"సునయనా! రామ! అంజనీ సుతునియొక్క
ప్రకటి తోత్సాహ మే మనవచ్చు.. బాల
భాను డుదయింప నెఱ్ఱని పం డనుకొని,
తంకమును వీడి, తిన నింగి దాక యెగిరె.."

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
5.11.19
-----------------------------------------------------------
తంకము= భయము

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🛐ధన్యోస్మి గురుదేవా🛐

మొదటి పాదంలో టైపాటు 'సుతపు నంది' అని చదువుకొన ప్రార్థన

Sreedhara Rao Machavolu చెప్పారు...

తే.గీ. సుప్రభాతమో యరుణుడ! శుభముల నిడు
ప్రగతి నెఱుపును సూచింప జగతి నేలు
భాస్కరుండ! గైకొను నాదు వందనముల
తండ్రి! చైతన్య మందించు ద్వాదశాత్మ!

BVVHBPrasadarao చెప్పారు...

ధన్యవాదములు

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...



1ఆ.వె:సుప్తిని విడె జగతి శుకపిక రవముతో
ప్రకృతి పరవశించి ప్రభలు నింపె
భానుడుదయమొంద భక్తితో జనులు స
తంబు మ్రొక్కు చుంద్రు ధరణి యందు

2ఆ.వె:సులభ రీతి లోన సుజను లెల్లరు చేరి
ప్రత్యహమును విడక వాసి గాను
భాను కర్ఘ్య మొసగి భక్తితో మ్రొక్కుచు
తండ్రి గొనుమటండ్రు తన్మయతను

3.తే.గీ:సుమము లెల్లయు వికసించె సుందరముగ
ప్రమద లెల్లమాలగ కట్టి పరవశమున
భానుమూర్తిని నచ్చోట భక్తి కొలిచి
తండ్రి దీవించు మనుచును దండ మిడిరి

4.తే.గీ:.సురుచిరంబగు కాంతిని సూక్తి గతిని
ప్రజల కిల ప్రత్యహంబును పంచునట్టి
భాసురాంగుడ వీవని భక్తి మోడ్తు
తండ్రి గొనుమిదే యంజలి తరణి దేవ.


కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

వెలుదండ సత్యనారాయణ రావు చెప్పారు...

..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
న్యస్తాక్షరి
*'సు - ప్ర - భా - తం'*
పై అక్షరాలతో వరుసగా 4 పాదాలను
ప్రారంభిస్తూ
సూర్యోదయాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం

సందర్భము: రఘువంశ రాజులకు పురోహితుడైన వశిష్ఠుడు చెప్పగా ఆ విధంగానే రాముడు సూర్యునికి పుష్పాంజలి సమర్పించినా డన్నది పద్యంలోని భావం.

వశిష్ఠుడు:
"రామచంద్రా! అదిగో! నీ వంశకర్త సూర్య భగవానుడు. రఘుకు లాన్వయమునకు మూల పురుషుడైన ఈ మహనీయునకు పుష్పాంజలులు సమర్పించు నాయనా!"

రాముడు:
"సప్తాశ్వ రథ మారూఢం
ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మ ధరం దేవం
తం సూర్యం ప్రణమా మ్యహమ్"

( *లవకుశ* చలనచిత్రంలోని సన్నివేశాన్ని స్మరించవచ్చు.)

తంపు= జ్ఞాపకం
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"సుప్రభాత రవికి సురభి పుష్పాంజలి
ప్రమద మొప్ప నిడుమ! రామ!" యన్న
భాను కుల తిలకుడు వర పురోహితు మాట
తంపున నిడి యా విధముగఁ జేసె

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
5.11.19
-----------------------------------------------------------

తంగిరాల సుందర రఘురాం చెప్పారు...

తే౹౹
సుగుణ సతి భ్రూవు కనుమలఁ సుందరముగ
ప్రస్ఫురిల్లు కుంకుమఁ బోలె ప్రాగ్దిశన ప్ర
భాకరు డుదయించగ పటాపంచలయ్యె
తంద్ర చీకట్లు, వెల్గు లతలు పెనగొనె౹౹

లలిత సుందరి కల్లూరి చెప్పారు...

సుదినమాయె దైవ సుస్మరణంబుతో

ప్రణవనాద సుధలు పలికె మదిని

భానుడుదయ కాంతి భాసురముగ జల్ల

తంబురప్ర ణవము తనువుఁ మీటె
🙏🙏

seethadevi gurram చెప్పారు...

ధన్యోస్మి గురుదేవా,నమస్సులు!!

Sistla Sharma చెప్పారు...

సుమము వికసించె నరుణంపు సొబగు లీని
ప్రభల జిందించె నుదయాద్రి క్రమముతోడ
భాను బింబోష్ణ కిరణముల్ ప్రాపు గొనగ
తంత్రులై మీటె పులకింత ధాత్రి పైన!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుంద రంబైన కిరణంపు సోయ గములు
ప్రకృతి పులకించు నుదయాన పలుక రించి
భాను తేజపు విటమిను ప్రాణ బిక్ష
తండ్రి మదినిండ నినుగొల్చి ధన్య నైతి