1, ఫిబ్రవరి 2020, శనివారం

సమస్య - 3268 (మంచివారల కెంచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మంచివారికి రాదులే మంచిరోజు"
(లేదా...)
"మంచివారల కెంచి చూడఁగ మంచిరోజులు రావులే"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

99 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  మంచి వాడగు డింపులన్నయె మమ్మి గూడుచు దిల్లినిన్
  మంచి రోజును నెంచి చూచుచు మంచి జందెము నూనగా
  దంచి కొట్టెను మోడియే భళి దారుణమ్మగు రీతినిన్...
  మంచివారల కెంచి చూడఁగ మంచిరోజులు రావులే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
   ఇంతకూ ఆ 'డింపులన్న' నిజంగానే మంచివాడా? మంచివాడిగా నటిస్తున్నాడా?

   తొలగించండి

  2. నాలాటి మంచి వారికి అన్నీ మంచిగానే కనిపిస్తాయి సార్! నా పూరణలో మొత్తం ఆరు "మంచి" పదములున్నవిగా

   😊

   తొలగించండి

  3. Historian Ramachandra Guha:

   "I have nothing against Rahul Gandhi personally. He is a decent fellow, very well-mannered. But young India does not want a fifth-generation dynast. If you Malyalis make the mistake of re-electing Rahul Gandhi in 2024 too, you are merely handing over an advantage to Narendra Modi," said Guha on the second day of the ongoing Kerala Literature Festival (KLF) during his talk, "Patriotism Vs Jingoism"...

   https://www.google.co.in/amp/s/m.economictimes.com/news/politics-and-nation/kerala-did-a-disastrous-thing-by-electing-rahul-gandhi-ramachandra-guha/amp_articleshow/73355149.cms

   తొలగించండి
 2. కొంచమై ననుమాన వత్వము కోరి జాలము జేయకన్
  కంచికే గనికబ్బ మంటిది కానలం బడు కౌముదౌ
  వంచనే మరిగాన కుండగ భార మైనను ప్రేమిడన్
  మంచివా రలకెంచి చూడగ మంచి రోజులు రావులే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కౌముది+ఔ' అన్నపుడు సంధి లేదు.

   తొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  మంచి వాడుర రామ భక్తుడు మంచి జేయగ పూనుచున్
  మంచి బాబ్రిని నేలగూల్చుచు మంత్రియై మనుచుండగా
  దంచి కొట్టెను మోడియే భళి దారుణమ్మగు రీతినిన్...
  మంచివారల కెంచి చూడఁగ మంచిరోజులు రావులే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   ఇంతకీ మంచి మంత్రి ఎవరబ్బా? నాకంతగా రాజకీయ పరిజ్ఞానం లేదు.

   తొలగించండి

  2. రంగ రాయ వాస్తవ శతకం ( March 2015): Banned now:👇

   73. Advani settles for Padmavibhushan---Vajpayee gets Bharat Ratna

   పట్టు బట్టి ఘట్టి ప్రాణయామము జేసె
   బస్సు మిస్సు కాగ బండి నెక్కె
   బ్రతికి యున్న నాళ్ళు బలుసాకు తినుచును
   వేంకటాద్రి సుతుడ వినుర రంగ

   తొలగించండి

 4. ఎంచిచూడక హెచ్చుతగ్గుల ఎల్లలన్నియుదాటుచున్
  మంచిబెంచుచు సాయమిచ్చుచు మానవత్వముజాటగన్,
  సంచితంబగు నన్నిరోజులు సత్యసాధన మార్గమై
  మంచివారల కెంచి చూడగ మంచిరోజులు రావులే
  కొరుప్రోలు రాధాకృష్ణా రావు‌,మీర్ పేట్ ,రంగారెడ్డి

  రిప్లయితొలగించండి
 5. మించు శక్తిని గొప్పవారయి మేదినిన్ వెలుగొందినన్
  బంచుచుండిన ప్రేమభావము పావనత్వము నందినన్
  సంచితంబగు పూర్వపాపము ఛాయయై విడకుండినన్
  మంచివారల కెంచిచూడగ మంచిరోజులు రావులే

  రిప్లయితొలగించండి
 6. తేటగీతి
  నేను నాదను తపనల నిజము మరచి
  పరులకపకార మొనరించు మురిపెమేల
  మదిని తలపోయ నెంచక నెదుటి వారి
  మంచి, వారికి రాదులే మంచిరోజు

  మత్తకోకిల
  త్రుంచ వాలినిఁ ద్రేతయందునఁ గ్రుంగఁ జేసెను ద్వాపరన్!
  సంచితమ్మగు పాపకర్మలు శాస్తిచేయక మానునే?
  యెంచి చూడఁ బురాణ పూరుషులే భరించిరె! వీడినన్
  మంచి, వారలకెంచి చూడఁగ మంచిరోజులు రావులే!

  రిప్లయితొలగించండి


 7. సోమరులగుచు కూర్చున్న, చురుకుదనము
  లేక నీరసించినను జిలేబి పుడమి
  యందు రాదురాదిక సహాయమ్ము, పైన
  మంచివారికి రాదులే మంచిరోజు


  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. ప్రజను మోసగించి గెలుచు ప్రభుత జేయు
  పొచ్చెముకు నిరసన దెలుపు సమయమున
  కూడని కరణముల జేయకుండ నుండు
  మంచివారికి రాదులే మంచిరోజు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. 'పొచ్చెముకు' అనరాదు. "పొచ్చెమునకు" అనడం సాధువు.

   తొలగించండి


 9. ఆకాశవాణికి పంపినది  ఇంచుకైనను మానవుండిల యీప్సితమ్మును చూపకన్
  కొంచెమైనను యత్నమున్నిక కూర్మితోడుగ చేయకన్
  మంచివారల కెంచి చూడగ మంచిరోజులు రావులే
  పంచుమయ్యరొ దేశమందున భాజనమ్మగు బుద్ధులే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "మానవుండిల నీప్సితమ్మును జూపకే... యత్నమన్నది..తోడుత జేయకే..." అనండి. చూపక, చేయక అన్నవి కళలు. ద్రుతాంతాలు కావు.

   తొలగించండి
 10. భక్త రామదాసు వ్యధ...

  తేటగీతి
  కానలందునన్ బూజలన్ గానవనుచు
  గుడినిఁ గోదండ రామ! నిన్ గొలువుఁ జేయ
  దుర్భరమ్మైన ఖైదున ద్రోసినావె!
  మంచి వారికి రాదులే మంచిరోజు!!

  రిప్లయితొలగించండి
 11. మత్తకోకిల
  కాంచ లేకయె నీడలేనిది కానలందున రాఘవా!
  యంచితమ్ముగ కోవెలందున నర్చనాదులఁ దీర్చితే
  పంచినావయ! నిర్భరమ్మగు బాధలెన్నియొ ఖైదునన్
  మంచి వారలకెంచి చూడఁగ మంచిరోజులు రావులే!

  రిప్లయితొలగించండి
 12. విరించి.

  లంచగొండులు రాజ్యమేలెడు రాజ్యమందున గాంచగన్

  మంచియన్నది రూపు మాసెను మానవత్వమె మృగ్యమై

  వంచకుండ్రును స్వార్థచిత్తులు వాసి మన్నన నందగా

  మంచివారల కెంచిచూడగ మంచిరోజులు రావులే.

  .

  రిప్లయితొలగించండి

 13. మైలవరపు వారి పూరణ

  పొంచియున్నది మృత్యుదేవత! పూని మంచినొనర్చగా
  నెంచుమిప్పుడె! రేపుమాపననెట్టులుండునొ ? ఏమిటో!
  మంచిజేయగ నన్నినాళ్లు సమానమే యని యెంచుమా!
  మంచివారల *కెంచిచూడఁగ* మంచిరోజులు రావులే"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 14. (శకుంతలను సతిగా నిరాకరిస్తున్న దుష్యంతునితో ఆమె వెంట వచ్చిన కణ్వముని శిష్యుడు శారద్వతుడు )
  వంచనన్ మునివాటిలోనికి
  వచ్చినావుగ భూపతీ !
  కొంచెమైనను మాయలీలలు
  కోమలాంగన నేర్వదే !
  చంచలంబగు ప్రేమలో బడి
  చక్కగా మనసిచ్చెనే !
  మంచివారల కెంచి చూడగ
  మంచిరోజులు రావులే !

  రిప్లయితొలగించండి
 15. సంచితంబగు పుణ్యమే నరజన్మలో శుభమిచ్చులే
  వంచనల్ పరపీడనంబులు పాపమూలములే కదా
  కొంచెమైనఁ గృపాకటాక్షముఁ గోరకున్నఁ బరాత్పరున్
  మంచివారల కెంచి చూడగ మంచిరోజులు రావులే!

  రిప్లయితొలగించండి
 16. మత్త కోకిల:

  అంచనాలకు మించి వంచన లంచ గొండులు జోరుగా
  పంచజేరిన దుష్ట మూకలు కొంచెమైనను జంకకా
  పంచు రూకలు వోటువోటున దించ మందురు వారికే
  మంచి వారల కెంచి చూడగ మంచి రోజులు రావులే

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 17. సంచితంబగుమంచికర్మలు చల్లగా నినుఁగాచులే
  వంచనల్ తలబెట్టుధూర్తులపంచకెన్నడుబోకుమా
  మంచివారలకెంచి చూడగ మంచిరోజులు రావులే
  యంచుబల్కెడుమాటలెప్పుడనర్థహేతువులేసుమా

  రిప్లయితొలగించండి
 18. మానవత్వమె మృగ్యమై మహిని నరుడు
  ధనము నార్జింప బట్ట నధర్మ పథము
  దుర్మతులకెల్ల పదవులు దొరికనపుడు
  మంచి వారికి రాదులే మంచిరోజు.

  రిప్లయితొలగించండి
 19. లంచము మెక్కెడు వారలు 
  వంచకులును పెరిగినట్టి భారత వనిలో 
  కొంచెమయిన మంచి యగుటయ? 
  మంచి దలచిన రాధులే తమ మదిని లేకన్ 

  రిప్లయితొలగించండి
 20. సవరణతో

  ప్రజను మోసగించి గెలుచు ప్రభుత జేయు
  పొచ్చెమునకు ధిక్క్రియ దెలుపు సమయమున
  కూడని కరణముల జేయకుండ నుండు
  మంచివారికి రాదులే మంచిరోజు

  రిప్లయితొలగించండి
 21. మంచిచేయగ పేదవారికి మానసమ్ముఁ దలంపగా
  నెంచుచుండిరి తంపి పెట్టగ నెంచిదుష్టపు మార్గమున్
  కాంచసాధ్యమె సంతసమ్మును కష్టజీవుల మోములన్
  మంచివారల కెంచిచూడగ మంచిరోజులు రావులే

  రిప్లయితొలగించండి
 22. నేడు ఆకాశవాణిలో ప్రసారం:

  మంచిగూర్చుటయెల్లవారికి మానవత్వముసోదరా!
  మంచిచేసిన మంచినీకగు మాన్యతన్ గమనించరా!
  మంచివారలకెంచి చూడగ మంచిరోజులు రావులే
  యంచుభావనచేయబూనకుఁ మన్నివేళలయందునన్.

  రిప్లయితొలగించండి
 23. వచ్చే వారానికి ఆకాశవాణి సమస్య....
  *అన్నను పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్*
  మీ పూరణలను గురువారం సాయంత్రంలోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
  padyamairhyd@gmail.com

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. శంకరాభరణం సమస్య - 2099

   "అన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ"

   తొలగించండి
 24. ఎంచి చూడగ లోకమందున యేమి భాగ్యమొ శంకరా
  వంచనమ్ములు చేయువారికె వైభవమ్ములు దక్కుగా
  కంచె చేనును మేయు చుండెను గాంచగా కలికాలమున్
  మంచివారల కెంచి చూడగ మంచిరోజులు రావులే!!!

  రిప్లయితొలగించండి
 25. మంచికై దమ భూములన్నియు మాట నమ్మిటులీయగా
  పంచుకొంచును సంపదంతయు పాలకుల్ జెలరేగిరే
  వంచకాధములెక్కువై భువి పాపభారము హెచ్చెనే
  మంచివారల కెంచి చూడగ మంచిరోజులు రావులే

  (ఆకాశవాణికి పంపినది)

  రిప్లయితొలగించండి
 26. మంచిపూరణలెన్నిజేసిన మంచిగామరి నచ్చినన్
  యెంచి పద్దెము పాడినప్పుడె యెంతొ సంతస మౌనులే!
  కొంచెమైనను కోరకుండగ కూరదెప్పుడు కూర్మియౌ
  మంచివారల కెంచి చూడఁగ మంచిరోజులు రావులే!!

  రిప్లయితొలగించండి
 27. ముంచ జూచును పుట్టినిం దను ముందు దాటిన చోటనే
  వంచనం బరిమార్చ జూచును బంధు వైనను డబ్బుకై
  కంచి కేగవు వీరి గాధలు కాల మెల్లను కాదులే
  మంచి వారల కెంచి చూడఁగ మంచిరోజులు రావులే.

  రిప్లయితొలగించండి
 28. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "మంచివారికి రాదులే మంచిరోజు"

  సందర్భము:
  హితులకైవడి నీ మ్రోల నిచ్చకములు
  గఱపుదురు గాని కీడు మే లెఱిగి భయము
  మాని మోమోట దక్కి సేమంబు గలుగు
  నట్టి తెఱగు బోధింపలే రయ్య వీరు
  (గోపీనాథ రామాయణం యు.కాం. 174)
  "ఇక్కడ నీకు సలహాలు చెప్పేవాళ్ళంతా ఇలాంటి వాళ్ళే!
  కచ్చితంగా హితం చెప్పా లనుకుంటే కింది లక్షణా లుండరాదు..
  ఇచ్చకాలు (నచ్చే మాటలు మాత్రమే) చెప్పడం, కీడు మే లెరుగకపోవడం, భయ ముండడం, మొహమాట ముండడం..
  ఇవి పనికిరావు.. కాని వీళ్ళంతా ఇలాంటి బాబతు వాళ్ళే..అంటే పైకి మాత్రం హితులలాగా కనిపిస్తారు. జాగ్రత్త."
  అన్నాడు విభీషణుడు రావణునితో..
  విభీషణుని అనుయాయులు ఇది గమనించి "మంచి మాట విన్న రోజే మంచి రోజు. ఎన్ని రోజులు విభీషణుడు అన్న దగ్గర వుంటే ఏం లాభం? ఈయన చెప్పక మానడు. ఆయన తిరస్కరించక మానడు. మంచి వాడు మంచి మాట వినే వారి దగ్గరే.. అంటే మంచివారి దగ్గరే వుండాలి. లేకపోతే వృథా శ్రమయే కదా!" అనుకున్నారు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *భలే మంచి రోజు*

  మంచిమాట వినిన రోజె మంచిరోజు..

  ఉన్న నే మా విభీషణు డన్న యొద్ద?

  మంచిమాట విననివారి పంచనున్న

  మంచివారికి రాదులే మంచిరోజు!

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  1.02.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 29. నేటి శంకరాభరణము వారి సమస్య

  మంచి వారికి రాదులే మంచి రోజు

  నా పూరణము సీసం,లొ


  అశ్వధ్ధామ యుధ్ధము ఆఖరి రోజు రాత్రి పూట ఉపపాండవులను చంపి వేస్తాడు ద్రౌపది రోదనము చూసి
  ద్రౌపది తోను ధర్మరాజుతోను సహదేవుడు పలుకు సందర్భము


  నిండు సదము నందు నీ వలువల నూడ
  దీసిన దినము దీటు గాదు,

  మోసము తో జూదమున గెల్చి నడవుల
  కు ననిపిన దినము ననువు కాదు,

  విరటు కొలువు లోన విసవరి వేధించు
  దినము మనకు మంచి దెపుడు కాదు,

  నేడతి క్రూరుడు నీచ మనస్కుడీ
  విప్ర సుతుడు జంపె బెడుసు తోడ,

  పంచ సుతుల కుతుకలు ఛేదించె నగ్ర
  జా! విరించి మన నుదుట సౌభగమును
  చరుము లేదని తలచితి, తరచి చూడ
  మంచి వారికి రాదులే మంచి రోజు  విసవరి = దుర్మార్గుడు బెడుసు = దారుణము

  చరుము = వ్రాయు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వాట్సప్ లో నా వ్యాఖ్యను గమనించండి.

   తొలగించండి
 30. మిత్రులందఱకు నమస్సులు!

  [హరిశ్చంద్రునకుం గలిగిన కష్టములనుఁ జూచిన నక్షత్రకుఁడు తనలోఁ దాను వితర్కించుకొను సందర్భము]

  "సంచితాంచిత పుణ్యగణ్య విశాల శీలున కిప్పు డే
  మెంచి దైవము కష్టముల్ దగ నిచ్చి, దాసునిఁ జేసెనో?
  మించి, సూనునిఁ జంపి, జాయను మేటి మ్రుచ్చుగ మార్చెనో?

  మంచివారల కెంచి చూడఁగ మంచిరోజులు రావులే!"

  రిప్లయితొలగించండి
 31. లంచమిచ్చుచులబ్ధినొందెడువంచకుండులెయుండుచో
  మంచివారలకెంచిచూడగమంచిరోజులురావులే
  లంచకుండులవంచనాలకుమంచివారలెయెప్పుడున్
  గొంచెమైననుగించనొందకమంచిచేయుదురిద్ధరన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వంచకుండులె'? "వంచకుల్ గడు గల్గినన్" అందామా? 'లంచగొండుల' టైపాటు.

   తొలగించండి
 32. ఎంచిచూడగ విత్తమార్జన మేకలక్ష్యము లోకమున్
  లంచగొండులె లక్షలాదిగ రాక్షసాంశను బుట్టగా
  ముంచువారలె నేడుజూడగ పుణ్యపూరుషు లవ్వగా
  మంచివారల కెంచిచూడగ మంచిరోజులు రావులే!

  రిప్లయితొలగించండి
 33. అందరికీ నమస్సులు 🙏🙏
  రథసప్తమి శుభాకంక్షలతో ..

  నా చిరుప్రయత్నం..
  *మొదటి ప్రయత్నం* ..😞😊

  మంచి రోజుల కోసమేగద మంచివారిలలో భళా
  మంచు వంటియు నమ్మకమ్ములు మరల్ మాయము గాకనే
  ఎంచి జూచుకొనన్ ముదమ్మున నెన్నొ యోటులు వేసిరే
  మంచివారల కెంచి చూడఁగ మంచిరోజులు రావులే

  కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి
  🙏🌸🙏🌸🙏

  రిప్లయితొలగించండి
 34. మంచివారికిరాదులేమంచిరోజు
  నెంచిచూడగసత్యమే యిప్పుడమిని
  చెడ్డవారలుబొంకుచు నడ్డముగను
  రాజ్యమేలుదురప్పటిరావణునిగ

  రిప్లయితొలగించండి
 35. సమయ సందర్భ మెరిఁగియు చక్కనైన
  మధుర మైనట్టి మాటలన్ మనుజ తతిని
  మోసగించె డు వారినే పుడమి మెచ్చుఁ
  మంచి వారికి రాదులే మంచి రోజు

  రిప్లయితొలగించండి
 36. ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
  సమస్యాపూరణ కార్యక్రమంలో...
  01/02/2020 శనివారం ప్రసారమైన నా పూరణ

  సమస్య. :. మత్తకోకిల
  **** ****

  మంచివారల కెంచి చూడగ మంచిరోజులు రావులే

  నా పూరణ.
  **** *** ***

  వంచనల్ చెలరేగె భూరి ప్రపంచమందున గాంచగా

  కొంచమైనను నీతిలేకయె ఘోరముల్ కడు జేయగా

  మంచి జెప్పగ బాధబెట్టిరి మార్పుజెందక నీచులే

  మంచివారల కెంచి చూడగ మంచిరోజులు రావులే

  -- ఆకుల శాంతి భూషణ్

  వనపర్తి

  రిప్లయితొలగించండి
 37. రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "అడుగడుగునన్" అనండి.

   తొలగించండి
  2. ఖలుల కిదినిలయముసుమ్ము కలియుగమ్ము
   అడుగడుగునన్ చెడుకుసింహాసనమ్ము
   మంచి కనలేము వినలేము కొంచె మైన
   మంచివారికి రాదులే మంచిరోజు

   తొలగించండి
 38. రిప్లయిలు
  1. కాల మెట్టులు గడచును గలియుగమున
   మేలు నుడివినఁ గల్గుఁ గోపాలు మించి
   మంచి చేసిన నిందలు పొంచి యుండు
   మంచివారికి రాదులే మంచిరోజు


   మత్తకోకిల.
   పంచి తీ విఁక నాస్తి నెల్లను బంపకమ్ముల నక్కటా
   ముంచె నాస్తిని వల్లకాటను బోరు మన్నను దీరునా
   మించి ప్రేమగఁ జూచు చుండుచు మేలుఁ గూర్చిన, దుష్టులన్
   మంచి, వారల కెంచి చూడఁగ మంచిరోజులు రావులే

   [మంచి = మనిచి, రక్షించి]

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 39. మంచి" కే జయమన్న మాటల మాన్యతన్ గొను మిత్రమా!
  'మంచి వారల కెంచి చూడగ మంచి రోజులు రావులే'
  యంచు నిస్పృహతో జరించక హాయి గొల్ప జనాళికిన్
  బంచి పెట్టగ బ్రేమ సంపద, పల్లవించును సౌఖ్యముల్!

  రిప్లయితొలగించండి
 40. మంచియన్నది పెంచగల్గిన మానవత్వమునిల్చులే
  వంచనల్ ప్రజముంచువారికి,వావివర్సలు మృగ్యమే
  త్రుంచనెంచగ రాజధానిని,తూలిమాటలుపేలులే
  మంచివారలకెంచిచూడగ, మంచిరోజులురావులే
  ------------------------------------------------

  రిప్లయితొలగించండి
 41. సంచినింపెడునేతలందరు సంఘసేవనుజేతురా?
  మంచిబాగులగోరకుండనె మానవత్వముగెల్చునా?
  కుంచితమ్ముగ కోర్కెలుండిన,కొండగుట్టలు దాటునా?
  మంచివారల నెంచిచూడగ,మంచిరోజులు రావులే!!

  రిప్లయితొలగించండి
 42. పంచ జూడగ పాపమంతయు , పావనమ్మది యందుమా?
  మించభానుడితాపమంతట,మిన్నునేలకు రాలునా?
  వంచనాళికి వావివర్సలు,వాస్తవమ్ముగ యుండునా?
  మంచివారల నెంచిచూడగ,మంచిరోజులు రావులే!!

  రిప్లయితొలగించండి


 43. మంచిచేయగ నేత జూడగ
  మానవాళి సుఖింపగన్
  లంచగొండులు పొంచియుండగ
  రాచకార్యపుదార్లలో
  నెంచి జాగ్రత మాయగెల్వగ
  నించుకైన తలంపరే
  మంచివారల కెంచి చూడఁగ మంచిరోజులు రావులే

  మంచివారల కెంచి చూడఁగ మంచిరోజులు రావులే

  రిప్లయితొలగించండి


 44. పనులు చేసెడి వారికే బాధ లిలను
  తప్పదనుటయు నెప్పుడూ తథ్యమౌన
  టంచు పెద్ద లాడెడి మాట లవని నిజము
  మంచి వారికి రాదులే మంచి రోజు.
  మరొక పూరణ

  వంచనలు చేయువారికి వసుధయందు
  పేరు వచ్చుచుండెగనుడు విస్తృతముగ
  స్వార్థ పరులకెపుడు మేలు జరుగుచుండ
  మంచి వారికి రాదులే మంచి రోజు.

  రిప్లయితొలగించండి