7, ఫిబ్రవరి 2020, శుక్రవారం

సమస్య - 3274 (బంగారమ్మును పేద...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బంగారమును నిరుపేద పంచె జనులకున్"
(లేదా...)
"బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్"
(వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలతో...)

91 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  సంగంబొందుచు సత్యధర్మములతో శౌర్యమ్మునన్ గోచితో
  రంగంబందున దూకుచున్ దొరలతో రమ్యమ్మునౌ పోరునన్
  కంగారేమియు లేక కర్ర గొనుచున్ గారాబు స్వాతంత్ర్యమన్
  బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబిగారికి అంకితం)

  కాశ్మీరు పండిత్ ఉవాచ:

  సంగంబొందుచు సత్యధర్మములతో శౌర్యమ్మునన్ యోగియై
  రంగంబందున దూకుచున్ ఖలులతో రమ్యమ్మునౌ పోరునన్
  కంగారేమియు లేక చాయి గొనుచున్ గారాబు స్వాతంత్ర్యమన్
  బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్

  రిప్లయితొలగించండి
 3. సింగా రించగ కావ్యము
  పొంగా రగపేద వాని భూరిగ రచనల్
  అంగీక రించి ప్రభువిడ
  బంగారమును నిరుపేద పంచె జనులకున్

  రిప్లయితొలగించండి
 4. సరదా పూరణ
  గోంగూర వంటి పచ్చడి
  నంగీ కరించి తినగను యానంద మహో
  సింగారము లేల జన్మకు
  బంగారమును నిరుపేద పంచె జనులకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   రెండవ, మూడవ పాదాలలో గణభంగం. ఫేసుబుక్కులో నా సవరణలను చూడండి.

   తొలగించండి
  2. గోంగూర వంటి పచ్చడి
   నంగీ కృతితెలిపి తినగ నానంద మహో
   సింగార మేల జన్మకు
   బంగారమును నిరుపేద పంచె జనులకున్

   తొలగించండి
 5. అంగీకారము జూపి రండు సతతం బత్యంతహర్షంబు మీ
  కుం గల్గించగ రోగనామకమహత్క్రూరారులన్ గూల్చు స
  ద్భంగిన్ జూపెద నంచు యోగివరు డవ్వాడన్ సుయోగాఖ్యమౌ
  బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్"

  రిప్లయితొలగించండి
 6. (శ్రీకృష్ణకరుణాకటాక్ష వీక్షణపాత్రుడైన కుచే
  లుడు తిరిగి తన యింటికి చేరి చేసిన పని)
  సింగారమ్ముల మాధవుండు సఖునిన్
  జెల్వార వీక్షించుచున్
  బొంగారన్ ; దన భార్యలే మురియ పెం
  పొందంగ శ్రీనీయగా ;
  నంగాంగంబులు బుల్కరింప శముడై
  హర్మ్యమ్మునే చేరుచున్ ;
  బంగారమ్మును పేద పంచె సుఖసౌ
  భాగ్యమ్ములం బొందగన్ .
  (పొంగారన్- సంతోషింపగా ; శముడు - శాంతుడు )

  రిప్లయితొలగించండి
 7. సింగారమ్ముగ జాతరేగితినిగా,శ్రీకారమౌ కాంక్షతో
  బంగారమ్మును నెత్తినెట్టుకుని,నేభావించుచున్ కోరికల్
  సింగారించుచు భక్తితో మెలగి,నీ,సంసిద్ధతన్ దెల్పుచున్
  బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్"

  రిప్లయితొలగించండి
 8. బంగారపు ముక్కెరనే
  యంగన కోరిన తరుణమె యజ్ఞానమ్మే
  భంగురమై యాటవెలది
  బంగారమును నిరుపేద పంచె జనులకున్

  రిప్లయితొలగించండి
 9. రంగుల వానలు కురియగ
  రంగడు 'ఆరెంపి 'యిచ్చె రయమున మందుల్
  చెంగున నారోగ్యంబను
  బంగారమును నిరుపేద పంచె జనులకున్.

  ఆరెంపి=

  aarempi=registered medical practitioner

  రిప్లయితొలగించండి
 10. మైలవరపు వారి పూరణ

  క్రుంగున్ దాన్ మసి పీల్చి పీల్చి తనకారోగ్యంబు నష్టంబుగాన్
  మ్రింగున్ దుఃఖము సింగరేణి గనిలో రేయింబవళ్లట్టులా
  యంగారమ్మును త్రవ్వి కార్మికుడు! మీకై ప్రేమతో నల్లనౌ
  బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 'నల్ల బంగారం'తో మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.

   తొలగించండి
  2. మరో పూరణ 🙏

   బెంగన్ బొందకుమమ్మ ! నీ కొరకు నే స్వేదమ్ము జిందించెదన్ !
   గ్రుంగన్ జేసెను వారు గట్నమడుగన్ గ్రూరమ్ముగా., నైన నా
   యంగీకారము దెల్పుచుంటినని పోగైనట్టి పూసంత యా
   బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 11. రంగ నికి లాటరి తగుల
  పొంగిన నుత్సాహమున ను పుత్తడి కొని తా
  చెంగట వసించు వారికి
  బంగారమును నిరుపేద పంచె జనులకు న్

  రిప్లయితొలగించండి
 12. కందం
  రంగని ఆటో యందున
  కంగారున రైతు మఱువ కాసులనిచ్చెన్
  చెంగున, నిజాయితీ యను
  బంగారమును నిరుపేద పంచె జనులకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బంగారం వంటి నిజాయితీని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. కొద్దిపాటి సవరణతో....

   కందం
   రంగని ఆటో యందునఁ
   గంగారున రైతు మఱువఁ గాసుల నొసఁగెన్
   జెంగున, నిజాయితీ యను
   బంగారమును నిరుపేద పంచె జనులకున్

   తొలగించండి
 13. చెంగావి దుస్తు దొడిగి , తె
  లంగాణమున శమి గొల్చి రాగము తోడన్
  చంగున శమీ దళంబుల
  బంగారమును నిరుపేద పంచె జనులకున్

  రిప్లయితొలగించండి
 14. రంగుల పలు వస్త్రమ్ముల
  సింగారింపంగ వీలు చేకురె; రైతే
  భంగపడినాఁడు; తెల్లని
  బంగారమును నిరుపేద పంచె జనులకున్.
  (తెల్ల బంగారం = ప్రత్తి)

  రిప్లయితొలగించండి
 15. పొంగారెన్ జనసంద్రమే వనమునన్ పోటెత్తె మేడారమే
  సాంగోపాంగము! గద్దెలెక్కిరదిగో సమ్మక్క సారక్కలే
  రంగా!నిక్కము బెల్లమే కనకమౌ!శ్రద్ధన్ సమర్పించుచున్
  బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 16. లక్షాధికారైన లవణమన్నమె గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు

  అంగనలతో గలసి తన
  ప్రాంగణమున కర్షకుండు పాడికితోడై
  వంగ,మునగ,బెండ మడుల
  బంగారమును నిరుపేద పంచె జనులకున్

  బెంగాలునందు రైతులు
  సింగారించిరి భూమిని చెన్నగురీతిన్
  చెంగావిరంగు కందుల
  బంగారమును నిరుపేద పంచె జనులకున్

  రిప్లయితొలగించండి
 17. అందరికీ నమస్సులు 🙏

  *కం||*

  బంగరు భూమియె తనదని
  హంగూ యార్భాటములగు హరితముకొరకున్
  రంగుల కలలు గనుచు వరి
  *"బంగారమును నిరుపేద పంచె జనులకున్"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌹🙏🌹🙏

  రిప్లయితొలగించండి
 18. వెంగలిగా కనిపించుచు
  రంగేశుని నిరతమంత రంగము నిలుపున్
  ముంగిట యతనికి దొఱకిన
  బంగారమును నిరుపేద పంచె జనులకున్
  **)(**
  (అంతరంగమున నెలకొన్న దైవమే అసలు సంపద కానీ భౌతిక సంపద తృణప్రాయమా నిరపేద భక్తునకు)

  రిప్లయితొలగించండి
 19. వెంగలిగా కనిపించుచు
  రంగేశుని నిరతమంత రంగము నిలుపున్
  ముంగిట యతనికి దొఱకిన
  బంగారమును నిరుపేద పంచె జనులకున్
  **)(**
  (అంతరంగమున నెలకొన్న దైవమే అసలు సంపద కానీ భౌతిక సంపద తృణప్రాయమా నిరుపేద భక్తునకు)

  రిప్లయితొలగించండి
 20. రంగడు, మండెడి యెండల
  క్రుంగెడి పేదల గృహముల కూర్మిన చనుచున్
  గంగాళమ్ముల జలమను
  బంగారమును నిరుపేద పంచె జనులకున్

  రిప్లయితొలగించండి
 21. హంగుగ మేడారమ్మున
  పొంగుచు నాదేవతలకు బోనము లిడుచున్
  మంగళమగు నా బెల్లపు
  బంగారమును నిరుపేద పంచె జనులకున్!!!

  రిప్లయితొలగించండి
 22. ఈ నాటి శంకరాభరణము వారి సమస్య


  బంగారమును నిరుపేద పంచె జనులకున్"


  త్యాగరాజు కడు పేదవాడు సతతము శ్రీరామ పాదములు నమ్ముకొని అతనికి ఘనముగా పూజలు చెయుచు సంగీత భక్తి మాలలతొ నిరతము సేవ చెస్తు ఉంటాడు ఆ దేశపు రాజుగారు అతని విద్వత్తుకు మెచ్చి అతని పేద రికము బాపటానికి ఘనముగా బంగారపు నగలు సంభావనగ పంపుతాడు అన్నయ్య వదిన చెబుతున్నా వినకుండ వాటిని తృణీకరించి రాజుకు తిప్పి పంపుతాడు. రామ భక్తి పూర్వక సంగీత బంగారము నా వద్ద ఉన్నది అని తెలుపుతాడు. ఆ సంగీత బంగారమును తాను పేదరికము అనుభవించినా జనులకు పంచ బట్టే ఈ నాడు కొన్ని వందల సంవత్స్రములు గడిచిన త్యాగరాజకీర్తనలు పాడుకుంటున్నారు అను భావన


  (సం)గీతంబుయె గా హిరణ్యము, సదా (సం)తోష మివ్వన్మదిన్

  (కం)గారె ప్పుడు తాను పొందక నలం(కా)రంబులున్ గొల్పు నా

  (బం)గారంబును ఛీత్కరించి, మనమున్ (ప)ద్మాక్షుడు, న్నేత,హే

  (మాం)గుండా రఘురాము పాదములపై (మా)రాడకన్నెప్పు డా

  (సాం)గత్యమ్మును వీడకన్ సతము నా (సం)గీత గానమ్ము తో


  "(బం)గారమ్మును పేద పంచె సుఖ సౌ(భా)గ్యమ్ములం బొందఁగన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'సంగీతంబు+ఎ=సంగీతంబె' అవుతుంది. యడాగమం రాదు. "సంగీతంబదె గా..." అనండి.

   తొలగించండి
 23. శార్దూలవిక్రీడితము
  బెంగన్ జెందుచు నీయ నామలకమున్ భిక్షమ్ముగా సాధ్వియే
  యంగాంగంబులుఁ బుల్కరించ స్వరమైయార్ద్రమ్ముగన్ జాలువా
  రంగన్ శంకరు మోమునన్ కనకధారాస్తోత్రమే కాయలౌ
  బంగారంబును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్

  రిప్లయితొలగించండి
 24. సింగారమ్ముల దోడ వార వనితల్ చిందింతురా మాయయే
  నంగారమ్ముగ మారి జీవితమునందానందమున్ గూల్చునే
  పొంగారించుడు భక్తి భావమది సద్బుద్ధిన్ ప్రసాదించునన్
  బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్

  రిప్లయితొలగించండి
 25. మరో పూరణ 🙏🌹

  *కం ||*

  చెంగున చేనుల దూకుచు
  నింగిన యాసలు నిలుపగ నిరతము తనకై
  ఖంగును తిన్నను, లాభపు
  *"బంగారమును నిరుపేద పంచె జనులకున్"*!

  కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి
  🙏🙏

  రిప్లయితొలగించండి
 26. పూరించవలసిన
  సమస్య
  "బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్"

  పొంగెన్ బ్రేమలునిండెచుట్టములతోపుల్లయ్యపూరిల్లహో
  గంగాచిట్టివిపుట్టువెంట్రుకలొసంగన్ పుట్టనాగమ్మకున్
  సింగారించెనుపూజఁజేసెనటుదీసెన్ మట్టినా పుట్టపై
  బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్

  గాదిరాజు మధుసూదనరాజు

  పుట్ట పై మట్టిని పుట్టబంగారమని భక్తులు నుదుట ధారణ చేయటం రాయల సీమలో పలుచోట్ల ఆచారంగా ఉన్నది

  రిప్లయితొలగించండి
 27. మిత్రులందఱకు నమస్సులు!

  బంగారమ్మటువంటి తల్లి! యిడుముల్వాపంగఁ గారుణ్యమున్
  నింగిందాఁకెడునంత చూపు! సుతులన్ నిత్యమ్ముఁ దాఁ గాచు! భూ
  మిం గల్గించు సుఖాలఁ! ద్రుంచు రుజలన్! మేడారముం జేరి, కో
  రం, గోర్కెల్ వెస నిచ్చి, పెంచు, జననిం బ్రార్థించి, సమ్మక్కదౌ
  బంగారమ్మును పేద పంచె, సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్!

  [బంగారము=సమ్మక్కకు సమర్పించు బెల్లము]

  మధురకవి గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

  రిప్లయితొలగించండి
 28. రంగా పేదయెగానీ
  బంగారమువంటిమనసువానిది, యెదలో
  పొంగారెడుమంచియనెడు
  బంగారమును నిరుపేద పంచె జనులకున్

  రిప్లయితొలగించండి
 29. సింగారించగలేడిల
  బంగారమునునిరుపేద,పంచెజనులకున్
  రంగడురేషనుకార్డులు
  ముంగిటముంగిటకునేగిమోదముతోడన్

  రిప్లయితొలగించండి
 30. అంగా రార్చక విప్రుఁడు
  పింగా క్షాంఘ్రి శరణుండు వేదమ్ములు వే
  దాంగమ్ములు, మించఁగ నా
  బంగారమును, నిరుపేద పంచె జనులకున్


  శృంగారమ్ములఁ జిత్త ముంచకుఁడు సంసేవ్యుండు విష్ణుండు సా
  ష్టాంగప్రాంజలిఁ గొల్వుఁ డాతనిని స్వీయాస్వాంత పద్మమ్ములన్
  రంగారంగ యనంగ దూరమగు సంత్రాసమ్ము సద్భక్తి నా
  బంగారమ్మును బేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్

  రిప్లయితొలగించండి
 31. అంగములన్నియు వడయగ
  చెంగటకగుదెంచు నాకు కుశేలునిఁ గని యి
  వ్వంగ హరి యైశ్వర్యము
  బంగారమును నిరుపేద పంచె జనులకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "వడకగ... నా కుచేలుని...వ్వంగను హరి/వ్వంగ హరియె (గణదోషం)..." అనండి.

   తొలగించండి
 32. సమ్మక్క సారలమ్మ లకు దండా లతో...

  శా:

  సింగారించిరి వన్య దేవతలసౌశీల్యమ్ము చిత్రించుచున్
  కంగారేమియులేక జాతరన నెక్కంగెంచ నా గద్దెలన్
  పొంగారన్ ప్రజ వారిగొల్వ నతి భావోద్రేక సంరంభమున్
  బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందగన్

  వై. చంద్రశేఖర్

  బంగారము: బెల్లము( ప్రసాదము)

  రిప్లయితొలగించండి
 33. గంగ యన జంపెన మునిగి
  బంగారన బెల్లము గొని భక్తిని దా ను
  ప్పొంగి వనదేవతల కిడి
  బంగారమును నిరుపేద బంచె జనులకున్!

  రిప్లయితొలగించండి
 34. రంగా!కంటివె?నెయ్యమొప్పగదగన్ రమ్యంపునెయ్యంబనే
  బంగారమ్మునుపేదపంచెసుఖసౌభాగ్యములంబొందగన్
  సింగారించగలేరుబీదలుసుమా,శ్రీమంతులౌవారలే
  సింగారించగనర్హులౌదురుభువిన్ చిందించబంగారమున్

  రిప్లయితొలగించండి
 35. రంగారావనుపేదరైతు కడుపారంగా నతండెన్నడున్
  మ్రింగన్నేరడుగంజియైన కలియో రేయింబవల్ సేద్య వ్యా
  సంగంబే తనబోటివారలకునున్ సంప్రాప్త ధాన్యంబులన్
  బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సేద్య వ్యాసంగ' మన్నపుడు 'ద్య' గురువై గణదోషం.

   తొలగించండి

 36. శంకరాభరణం..
  07/02/2020...శుక్రవారం

  సమస్య

  బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్"

  నా పూరణ శార్ధూలము
  *** *** ***
  ఒక పేద తండ్రి ..డబ్బు శాశ్వతము కాదు..సంతోషమివ్వదు...మంచి ప్రవర్తననే సుఖాలనిస్తుందని కుమారునితో ఇలా పలుకుతున్నాడు...


  హంగార్భాటములన్నియున్ దరిని నిత్యంబౌచు వర్తిల్లదున్

  కృంగన్ బోకు కుమార లేవవి యనిన్... ఖేదంబు నీకేలనో!

  అంగాంగంబున నిల్పు ధర్మమును,సత్యంబంచు.. సచ్ఛీలమౌ

  బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వర్తిల్లదున్' అనడం సాధువు కాదు. 'క్రుంగన్' అన్నది సరైనది. దానివల్ల యతి తప్పుతుంది. 'అనిన్' అన్న ప్రయోగమూ సరి కాదు.

   తొలగించండి
 37. సాంగోపాంగము నేర్చి విద్యలను ప్రాశస్త్యుండె యౌ శాస్త్రి వే
  దాంగాలన్నియు బాలకుండ్రకికపై తా నేర్పగన్ సిద్ధ మై
  యంగీకారము తెల్పగా ప్రజలటన్ హర్షింప వేదాలనే
  బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "బాలు రెల్లరకునున్ దా నేర్పగన్.."అనండి.

   తొలగించండి
 38. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "బంగారమును నిరుపేద పంచె జనులకున్"

  సందర్భము: పుత్రకామేష్టికి ముందు
  దశరథ మహారాజు యాగాశ్వం విడిచి, ఏడాదికి సరయూనది కుత్తరాన అశ్వమేధం చేశాడు. ఇది మూడురోజుల యజ్ఞం. ఎందరో భుజించినారు. అన్నరాశులు గుట్టలుగా కనిపించాయి. (అన్నకూటాశ్చ బహవో దృశ్యంతే పర్వతోపమాః బా.కాం.14-13)
  స్థానికులేనా! దూరదూరాల నుంచీ వచ్చారు. తృప్తిగా భోంచేశారు. భోజనాలేనా! సంభావనలూ పెద్దమొత్తాలే!
  రాజు ఋత్విజులకు భూదానం చేస్తే వారు వద్దంటే పదిలక్షల గోవులను, పదికోట్ల బంగారాన్ని, నలభైకోట్ల వెండిని యిచ్చినాడు.
  (గవాం శత సహస్రాణి దశ తేభ్యో దదౌ నృపః
  దశకోటీ స్సువర్ణస్య రజతస్య చతుర్గుణం 48)
  చూడవచ్చిన బ్రాహ్మణులకు కోటి పైడి నాణా లిచ్చాడు.(తతః ప్రసర్పకేభ్యస్తు హిరణ్యం సుసమాహితః జాంబూనదం కోటిసంఖ్యం బ్రాహ్మణేభ్యో దదౌ తదా 51)
  ఒక దరిద్ర ద్విజునికి తన చేతి కంకణం యిచ్చినాడు.(దరిద్రాయ ద్విజాయాథ హస్తాభరణ ముత్తమమ్ కస్మైచి ద్యాచమానాయ దదౌ రాఘవ నందనః 52)
  అలా అశ్వమేధంలో భూరి దానాలు చేసేప్పుడు ద్రవ్యం ఒకని కందించినాడు "చక్కగా పంచు" మంటూ.. ఆ నిరుపేద సంతోషంతో బంగారాన్ని పంచినాడు. (ద్రవ్యం రాజుదైనా తన చేతిమీదుగా పంచడమూ సంతోషమే కదా!)
  అలా దశరథుడు ఇవ్వడమేకాదు. ఇప్పించినాడు కూడ. ఇప్పించినప్పుడు దానం చేసే వారికి కలిగే తృప్తి రెండు రకాలు. 1.రాజు గా రప్పజెప్పిన బాధ్యత నిర్వర్తిస్తున్నా మన్నది. 2. తమ చేతిమీదుగా ఇస్తున్నా మన్నది.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *పేద సంబరము*

  "అంగుగఁ బంచు" మనుచు ని
  చ్చెం గద ద్రవ్యంబు పేద చేతికి విభుడే
  పొంగుచు మఖమున..నప్పుడు
  బంగారమును నిరుపేద పంచె జనులకున్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  7.02.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 39. 🙏


  (దసరా రోజున శమీ పత్రం అంటే జమ్మి ఆకులను బంగారంగా భావించి అందరికీ అందించి ఆశీస్సులు పొందడం.)

  కం.
  రంగుగమీరొందవలెను
  బంగరు జీవనమటంచు భాగ్యము నొందన్
  బంగారమ్మది బ్రతుకని
  బంగారము నునిరుపేద పంచె జనులకున్.


  అంబటి భాను ప్రకాశ్🙏

  రిప్లయితొలగించండి
 40. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  బంగారమ్మును పేద పంచె సుఖ
  సౌభాగ్యమ్ములం బొందఁగన్

  సందర్భము: జమ్మి ఆకును "బంగారం"గా భావిస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లో.
  విజయ దశమి పర్వదినంనాడు సాయంత్రం గ్రామ శివారులలోని జమ్మి చెట్టువద్దకు సామూహికంగా మేళతాళాలతో వెళ్ళి ప్రదక్షిణం చేసి కూర్చొనగా పురోహితు డర్చించగా..
  "శమీ శమయతే పాపం
  శమీ శత్రు వినాశినీ.." అనే శ్లోకాలు కాగితాలమీద వ్రాసి, ఆ సంవత్సరం తమ ఆదాయ వ్యయాలు (ఆదాయం ఎక్కువగా వ్యయం తక్కువగా) వ్రాసి, మిగులు (బాలన్స్) వ్రాసి, పసుపుకుంకుమ లలంకరించి, కాగితాలు జమ్మి చెట్టుకింద వుంచి, తీర్థ ప్రసాదాలు తీసుకొని...
  జమ్మి పత్రిని సేకరించుకొని, తిరిగివచ్చి, వూళ్ళో వుండే మిత్రులను కలిసి, ఒక్కొక్కరి చేతిలో "బంగార మిదిగో!" అని ఆ ఆకును పెట్టి స్నేహ పూర్వకంగా కౌగిలించుకుని, పరస్పర శుభాకాంక్షలు తెలుపుకుంటారు. పెద్దలైతే పాద నమస్కారం చేస్తారు.
  రంగ డనే యువకుడు అలా శుభాకాంక్షలు తెలుపడం పద్యంలో పేర్కొనబడింది.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *బంగార మిదిగో!*

  "బంగార మ్మిది" యంచుఁ జేత నిడి యా
  ప్యాయమ్ము చిత్తంబునన్

  బొంగారన్ సఖులన్ గవుంగిలి బిగిం
  చున్.. బెద్దవారైనచో

  రంగం డెప్డు నమస్కరించు దసరా
  రాన్.. "జమ్మి యా" కన్న నా

  "బంగారమ్ము"ను పేద పంచె సుఖ సౌ
  భాగ్యమ్ములం బొందఁగన్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  7.02.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి