"...Last year in the month of September, the Parishad had released the first list of fake Babas in which 14 names were released. The 14 names in the first list were Asaram Bapu, Radhe Maa, Sachchidanad Giri, Gurmeet Ram Rahim, Nirmal Baba, Itchadhari Bhimanand, Asimanand and Narayan Sai, Rampal, Acharya Kushmuni, Brahaspati Giri and Malkhan Singh..."
సందర్భము: "వేమన ఒక రకంగా యోగ్యుడు, మరో రకంగా అయోగ్యుడు.. ఎలా నీ దృష్టిలో.." అని ప్రశ్నించిన ఉపాధ్యాయునికి ఒకానొక విద్యార్థి సూటిగా చెప్పిన సమాధానం చూడండి. "భోగా లన్నీ రామునిలాగా త్యాగం చేసినాడు కాబట్టి యోగులలో వేమన యోగ్యుడు. ఎప్పుడూ దిగంబరంగా కూర్చొని కిందికే చూచుకుంటూ వుంటాడు కాబట్టి స్తుతించడానికి అయోగ్యుడు." (వాడి కది నచ్చలేదు మరి..) ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*నచ్చని అంశము*
భోగములను రాముని వలె త్యాగముఁ జేయుట.. నెపుడు దిగంబరిగా చూ పాగక నిలుపుట.. యోగ్యుడు యోగులలో వేమనయె యయోగ్యుఁడు స్తుతికిన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 18.02.20 -----------------------------------------------------------
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
దాగుడు మూతలాడుచును త్రాగుచు భంగును తల్పు చాటునన్
వాగుచు మంచి మాటలను వక్రపు చేష్టల ప్రీతినొల్లుచున్
భోగము లన్నియున్ బడసి పొందుగ జైలున చేరుచుండెడిన్
యోగులలోన వేమన యయోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇంతకూ ఇక్కడ యోగులు, వేమన ఎవరికి సంకేతం?
తొలగించండి🙏😊
తొలగించండి"...Last year in the month of September, the Parishad had released the first list of fake Babas in which 14 names were released. The 14 names in the first list were Asaram Bapu, Radhe Maa, Sachchidanad Giri, Gurmeet Ram Rahim, Nirmal Baba, Itchadhari Bhimanand, Asimanand and Narayan Sai, Rampal, Acharya Kushmuni, Brahaspati Giri and Malkhan Singh..."
https://www.google.co.in/amp/s/www.news18.com/amp/news/india/all-india-akhada-parishad-releases-fourth-list-of-fake-babas-1705899.html
భోగము లందు మునిగెనిల
రిప్లయితొలగించండిరాగద్వే షములను వీడి రారాజు వలెన్
త్రాగుచు రమణుల పొందున
యోగులలో వేమనయె యయోగ్యుఁడు స్తుతికిన్
అక్కయ్యా,
తొలగించండిపద్యం బాగుంది.
మీరు 'భోగి వేమన' గురించి చెప్పారు. సమస్య 'యోగి వేమన' గురించి.
అక్కగారి అభిప్రాయమదేనేమో!కొందఱు వేమనను మెచ్చుకొనరు.యోగివేమన అనే మాటే వాడరు.అక్క గారే వివరించాలి.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
బాగుగ లేదు శంకరయ! వ్రాయగ నిట్టిది కైపదమ్మునున్:
"యోగులలోన వేమన యయోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్"
తూగుచు టైపు దోషమును తుంటరి రీతిని నేను దిద్దెదన్:
"యోగులలోన వేమనయె యోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్"
మీ ఆటవిడుపు పూరణ. ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'తూగుచు...' ఈ హాంగోవర్ ఎక్కడిది? నడిరేయి నిదురమత్తు కాబోలు!
🙏
తొలగించండిలేదు సార్! ప్రాసావేదన మాత్రమే 😊
తొలగించండిప్రాసావేదనయెంతయో సుఖమయా ప్రాభాతకాలమ్ములో :)
ప్రాసమైత్రి మిగుల బాధపెట్టె...
తొలగించండి( భవనం విడిచి భువనంలోకి ప్రవేశించి
రిప్లయితొలగించండిఊరూరా జ్ఞానధనాన్ని పంచాడు వేమన -
మన వేమన )
భోగపు కాంతనే వదలె ;
బుజ్జిది గోచిని మేన దాల్చె ; వే
వేగమె సంచరించె ; జన
వేదన బాపగ జ్ఞానశంఖమే
మ్రోగగజేసె గుండెలను ;
ముచ్చట గూర్చెను హృద్యపద్యముల్ ;
యోగులలోన వేమనయ
యోగ్యుడు ప్రస్తుతి నందగన్ భువిన్ .
(వేమనయ - వేమన మాత్రమే )
విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
తొలగించండివిరుపుతోపాటు భావమూ ఉదాత్తము
తొలగించండిశంకరార్యులకు , వెలుదండవారికి ధన్యవాదములు .
తొలగించండిఅందరికీ అర్థమయ్యే భాష వేమన గారి ప్రత్యేకత
రిప్లయితొలగించండిభోగమునందు జనపదుల
జాగృతి పరచ కఠిన పదజాలము తోడన్
సాగెడి ప్రవచనలిచ్చిన
యోగులలో వేమనయె యయోగ్యుఁడు స్తుతికిన్
భోగము = దేశము ( ఆం.భా )
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిభోగాతీతుండెవడో?
భోగములన్ దేలు నరుడు? పువుబోడి జిలే
బీ గారి కందపు వహియొ?
యోగులలో వేమనయె; యయోగ్యుఁడు; స్తుతికిన్
సెల్ఫుడబ్బా :)
జిలేబి
ముమ్మాటికి కాదూ కాదూ కాకూడదూ...
తొలగించండిమీ కందాలు...
అరవిందాలు...
మకరందాలు...
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఔగద! సకలజన ప్రియుడు
రిప్లయితొలగించండియోగులలో వేమనయె! యయోగ్యుడు స్తుతికిం
గాగలడెట్లు బ్రజాకవి?
బాగుండదటులని కింౘ పరుప మహితునిన్!
అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాగమృతమ్ము బంచుచును వాస్తవ మెల్లజగంబునందునన్
రిప్లయితొలగించండిరాగమయాత్ముడై తెలిపె రమ్యతరమ్ముగ పద్యమందు స
ద్యోగము నన్ జరించుచు మహోన్నత భావము తోడ గావునన్
యోగులలోన వేమనయ, యోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిభోగపు లేమి లేదు! పసి పోరి నిమీలన మయ్యె చేరగా
రోగము; చింత చేరె మది రోసెను; ధ్యానము వృద్ధి నొందగా
సాగెను చిత్తవాజి వడి చక్కటి పద్యములెల్ల సోదరా,
యోగులలోన వేమనయ, యోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభోగముల నీసడించెను
రిప్లయితొలగించండియోగుల లో వేమన యె :య యోగ్యుడు స్తుతి కిన్
రాగ ద్వేషముగలిగియు
భోగము ల న్ మునుగు వాడు భువి లో గదరా !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదూతలు నలువురి కర్తవ్యము.
తొలగించండిప్రణయాధిక్యదశానివేదనపరబ్రహ్మజ్ఞసద్వేత్తకున్ ,
గణనీయాంబువు నిచ్చు మేఘునకు,శ్రీకార్యాశయవ్యగ్రరా
వణలంకాదహనార్థికిన్, హరికి,సాఫల్యాప్తదౌత్యాబ్ధితా
రణసంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నగన్ దూతకున్.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభోగమున పేరు పొందిన
రిప్లయితొలగించండియోగులలో వేమనయె, యయోగ్యుఁడు స్తుతికిన్
యోగిగ నిత్యానందుడు
భోగములను వీడనట్టి మూర్ఖుండతడే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిన్నటి మరో పూరణ
రిప్లయితొలగించండిరణరంగంబె యవశ్యమైన, మృదుసారళ్యోక్తిసామంబవా
రణమైనం, బటుభేదకృత్యములె ధార్యంబైన, సంపద్వికీ
రణమైనన్, సఫలంబునైన పటుకార్యంబేదియేన్, లక్ష్యధా
రణసంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నగన్ దూతకున్.
సామదానభేదదండోపాయాలు ప్రయోగించి యైన లక్ష్యమే ధారణమై యుండాలి.
సంపద్ వికీరణము ధనాన్ని వెదజల్లుట.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి.... శంకరాభరణం....
రిప్లయితొలగించండి18/02/2020 ,మంగళవారం
సమస్య.
*******
యోగులలోన వేమన యయోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్
నా పూరణ. ఉ.మా.
** *** *****
భోగములన్ త్యజించి..పరిపూర్ణ యతీశ్వరుడౌచు..తుంటికిన్
పోగు ధరించి... సాగుచును ముందుకు... సూక్తిసుధారసమ్ములన్
బాగుగ దా ప్రజాతతికి బద్యము లల్లుచు బంచె..గావునన్
యోగులలోన వేమనయ యోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఈ గతి లోకరీతి రచియింపగ సాధ్యమె? తేటతెల్గులో
నాగమశాస్త్రమర్మముల నాటవెలందుల రంగరించి స...
ద్యోగమనంగ జూపిన మహోదయుడౌ మనవాడె మేటియౌ!
యోగులలోన వేమనయ యోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"యోగులలో వేమనయె యయోగ్యుఁడు స్తుతికిన్"
సందర్భము: "వేమన ఒక రకంగా యోగ్యుడు, మరో రకంగా అయోగ్యుడు.. ఎలా నీ దృష్టిలో.." అని ప్రశ్నించిన ఉపాధ్యాయునికి ఒకానొక విద్యార్థి సూటిగా చెప్పిన సమాధానం చూడండి.
"భోగా లన్నీ రామునిలాగా త్యాగం చేసినాడు కాబట్టి యోగులలో వేమన యోగ్యుడు. ఎప్పుడూ దిగంబరంగా కూర్చొని కిందికే చూచుకుంటూ వుంటాడు కాబట్టి స్తుతించడానికి అయోగ్యుడు."
(వాడి కది నచ్చలేదు మరి..)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*నచ్చని అంశము*
భోగములను రాముని వలె
త్యాగముఁ జేయుట.. నెపుడు దిగంబరిగా చూ
పాగక నిలుపుట.. యోగ్యుడు
యోగులలో వేమనయె యయోగ్యుఁడు స్తుతికిన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
18.02.20
-----------------------------------------------------------
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🐒ఒక మర్కటశంక!🐒
రిప్లయితొలగించండి"యోగులలోన వేమన యయోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్"
బాగు! భలే సమస్య యిది భావములోఁ బెను దోసమున్నదే!!
యోగి యటంచుఁ జెప్పుచు నయోగ్యత నెట్టులఁ జూపగాఁదగున్
యోగులయోగ్యులన్న నిక యోగి పదమ్మునకర్థమేమిటో!?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబాగుగ నీతుల జాటెను
రిప్లయితొలగించండియోగులలో వేమనయె;యయోగ్యుడు స్తుతికిన్
యోగము పేరిట చాటుగ
భోగములం దేలుచుండు మోసపు యతియే!
సాగుచు భోగిగామొదలు సంయమియాయెను రోసిలోకమున్
తొలగించండివ్రీగగ కామమోహములు వీడెను వస్త్రము దేహభావమున్
దాగిన తత్త్వమంతయును ధాటిగ చాటెను పద్యరూపమున్
యోగులలోన వేమనయ యోగ్యుడు ప్రస్తుతినందగన్ భువిన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబాగుగ సూక్తుల నుడివెను
రిప్లయితొలగించండియోగులలో వేమనయె : యయోగ్యుఁడు స్తుతికిన్
భోగసక్తుడు కనగా
బాగోగుల లెక్క గొనక వర్తిలు చుండన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భోగాసక్తుడు' టైపాటు.
తొలగించండిభోగము లన్నియు విడెనట,
రిప్లయితొలగించండివేగమె వస్త్రముల వదలి వెర్రినివోలెన్.
వోగులవారిటు దల్తురు
*యోగులలో వేమనయె యయోగ్యుఁడు స్తుతికిన్*
ఓగులవాడు-నీచుడు
(తెలుగు పర్యాయపద నిఘంటువు-జి యన్ రెడ్డి) 1990
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివో తో మెదలయ్యే తెలుగు పదాలు లేవు.
భోగిగ గురువై వెల్గెను
రిప్లయితొలగించండియోగులలో వేమన; యయోగ్యుడు భువిలో
వేగుచు సంగము లందున
రోగములో జిక్కువాడు రుగ్మేశ్వరుడై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిబాగుగ సూక్తుల నుడివెను
రిప్లయితొలగించండియోగులలో వేమనయె : యయోగ్యుఁడు స్తుతికిన్
భోగాసక్తుడు కనగా
బాగోగుల లెక్క గొనక వర్తిలు చుండన్.
రిప్లయితొలగించండిభోగము తెగనాడె మహా
యోగులలో వేమనయె; యయోగ్యుడు స్తుతికిన్
భోగంబున నిరత సుఖా
భోగము నందునచరించు బొప్పండెపుడున్!
బొప్పడు=మూఢుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ నమస్సులు 🙏🙏
రిప్లయితొలగించండి*యోగులలో వేమనయె యయోగ్యుఁడు స్తుతికిన్"*
*కం||*
త్యాగములెన్నియొ జేయుచు
బాగుగ మంచిని పలుకుచు ప్రజల కొరకు తా
భోగము లన్నియు నొదిలిన
*యోగులలో, వేమనయె యయోగ్యుఁడు స్తుతికిన్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏💐🙏💐🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఒదిలిన కాదు... వదలిన అనండి.
ధన్యోస్మి ఆర్యా 🙏🙏🙇🙇
తొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండిరాగముఁ జూపి విశ్వద విరాగిగ మార్చఁగ భోగలాలసున్
ధీ గుణశాలి యాటవెలదిన్ దగు నీటెగఁ జేసి కూటమిన్
మూగిన ఛాందసమ్ముల సమూలముగా పెకిలించ జూడఁగన్
యోగులలోన వేమనయ యోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి_/\_ధన్యోస్మి గురుదేవా_/\_
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిభోగములన్ని వీడి, తగ భూజను లందఱు నీతిమంతులై
వేగముగాను మాఱఁగను వేడుచుఁ, బద్యము లల్లి, యోగియై,
త్యాగము సేసి జీవితము, వ్యాపనఁ జేసెఁ బవిత్ర దీధితుల్!
యోగులలోన వేమనయ "యోగ్యుఁడు" ప్రస్తుతి నందఁగన్ భువిన్!
మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండికందం
రిప్లయితొలగించండిరాగమున మార్చ విశ్వద
ధీగుణుమున యాటవెలదిఁ దీర్చుచు గడగన్
బోగొనఁ గన మూర్ఖత నే
యోగులలో వేమనయె యయోగ్యుఁడు స్తుతికిన్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ధీగుణమున నాటవెలది..' అనండి.
గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ :
తొలగించండికందం
రాగమున మార్చ విశ్వద
ధీ గుణమున నాటవెలదిఁ దీర్చుచు గడగన్
బోగొనఁ గన మూర్ఖత నే
యోగులలో వేమనయె యయోగ్యుఁడు స్తుతికిన్?
రాగము ద్వేషముల విడక
రిప్లయితొలగించండిభోగములను మునుగుటె గద పురుషార్థమనున్
ఆ గుణ హీనుడు బలికెను
యోగులలో వేమనయె యయోగ్యుఁడు స్తుతికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగూగులు వెదుకగ దెలిసెను
రిప్లయితొలగించండిరాగముతోనుండియయెవి రాగిగననుచున్
భోగములొల్లక పిదపను
యోగులలోవేమనయెయయోగ్యుడుస్తుతికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండియోగవితర్కతర్కవివిధోక్తివివాదవినోదయోగులన్
తొలగించండిబ్రోగుల కొద్ది కాంచఁ బరిపూరకతాత్త్వికశూన్యులైరి త
ద్యోగులు, వ్యూహకల్పవదయోమయకారకులైరి వార, లా
యోగులలోన వేమన యయోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్
కంజర్ల రామాచార్య
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసమస్య..
రిప్లయితొలగించండియోగులలోన వేమన యయోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్
ఉత్పలమాల
యోగులఁప్రస్తుతింపఁఘనయోగులెగావలెరావలెన్ వృథా
బ్లాగులముఖ్యయోగులనిపట్టికలిత్తురుధ్యానరాజస
ద్యోగులువీరలేయనియయోగ్యులయోగ్యులయోగులంచు నా
యోగులలోన వేమన యయోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్
గాదిరాజు మధుసూదన రాజు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిత్యాగమయంబునైనెనరిధాత్రినినెంచగబూర్వకాలపుం
రిప్లయితొలగించండియోగులలోనవేమనయయోగ్యుడుప్రస్తుతినందగన్ భువిన్
యోగముజేయుచున్మనసునూరటపర్చెడువేమనేగదా
రాగమునొందకుండగవిరాగియువోలెనునుండునెప్పుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏ గారడి సేయఁ డెపుడు
రిప్లయితొలగించండిక్రాగి యెదను దాను మారెఁ గాషాయంపుం
బాగను గట్టఁడు మఱి యే
యోగులలో వేమనయె యయోగ్యుఁడు స్తుతికిన్
చాగును గాదె యివ్విధి నజామిళు గాథయె భారతావనిన్
బాగరు లందుఁ జిక్కు కొని పామరు రీతినిఁ గాముకుండునై
యాగతి నిల్చినం బరువ మం దవభాసము వొందఁ బాపులన్,
యోగులలోన వేమన, యయోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్
[అవభాసము = జ్ఞానము; అయోగ్యుఁడు = కూడఁదగని వాఁడు; యోగము =కూడిక, యోగ్యము = కూడఁదగినది]
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిభోగమువీడినదెవ్వరు?
రిప్లయితొలగించండియోగులలో వేమనయె, యయోగ్యుఁడు స్తుతికిన్?
భోగియె! కపటముగభువిని
యోగిగదిరుగుచుజనులనయోమయబరుచున్
భోగమునందుమున్గుచును భూతలమందునఁ దానె పూజ్యుడౌ
రిప్లయితొలగించండియోగిగ ప్రస్తుతింపబడు యూరునకొక్కొకముచ్చులైన బై
రాగులురెచ్చిపోయిరియరాచకపోకడపెచ్చరిల్లగన్
యోగులలోన వేమనయ యోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి"...ప్రస్తుతింపబడు నూరున..." అనండి.
ధన్యవాదములు గురువుగారూ! మార్చుకుంటాను
తొలగించండివీగె భవాబ్ధినా వెలది ప్రేమపయోనిధిలో మునింగి సం
రిప్లయితొలగించండియోగమె భాగ్యమయ్యె పదయోగ విధాన విలక్షణుండహో
*యోగులలోన వేమనయ!యోగ్యుఁడు! ప్రస్తుతినందఁగన్ భువిన్*
మ్రోగు శతమ్మువానిదయ* మోక్షపథమ్మును కోరువీనులన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిత్యాగుల మేమటంచు పరమాత్ముని సన్నిధి గోరునట్టి బై
రిప్లయితొలగించండిరాగులమంచు చెప్పి ధన రాశుల బోటుల పొందగోరెడా
యాగడి కాండ్రె సైకితుకులంచును నమ్ముచు పోల్చిచూడగా
యోగులలోన వేమన యయోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్
కం:
రిప్లయితొలగించండియోగము బొందుట నెఱుఁగడు
యోగిగ మనుగడ గడపడు యోగ మదేమో
యోగిన పేరును గాంచెను
యోగులలో వేమనయె యయోగ్యుడు స్తుతికిన్
వై. చంద్రశేఖర్
భోగము లందు మున్గినను, భూజనులెల్లరు మెచ్చురీతిగన్
రిప్లయితొలగించండియోగిగమారి, సూక్ష్మముల నొప్పుగ తాకగ నిత్యసత్యముల్
తీగలు సాగు భావములె తీయని పద్యములైసుమించగన్
యోగులలోన వేమనయ, యోగ్యుడు ప్రస్తుతినందఁగన్ భువిన్!!!
త్యాగము జేయువారమని,తామిక సానులచెంతజేరు యీ
రిప్లయితొలగించండిభోగులుజూడనేమిటికి?బోలుగనుండునువీరి భావమీ
రోగులకన్నహీనులుగ ,రోదనబెట్టెడు వారిజూడనీ
యోగులలోనవేమనయ, యోగ్యుడు,ప్రస్తుతినందగాభువిన్
భోగపులాలసుండుగను,భోజుడుగావెలుగొందె వేమనే
రిప్లయితొలగించండిరాగము ద్వేషముల్ గలిగి,రాజసమొప్పగనుండెనాతడే
యోగిగమారెగాకడకు,యోగ్యుడుగా నిల కీర్తిమంతుడౌ
యోగులలోన వేమనయ,యోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్