20, ఫిబ్రవరి 2020, గురువారం

సమస్య - 3286 (మారెడు కాయలోన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఊయల గలదు మారేడు కాయలోన"
(లేదా...)
"మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై"

59 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  చేరుచు నట్లతద్దియను చెల్లెలి తోడను తోటలోన భల్
  మీరిన ప్రీతినిన్ నగుచు మేకును గొట్టుచు త్రాడు కట్టుచున్;...
  తీరుగ బీజముల్ పెరిగి తేకువ మీరగ చెట్టు వోలెనున్
  మారెడు కాయలోన;...నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై...

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  "శివుని మానస పూజ"
  (చిత్తంబు శ్రీ వారణాసిలోనుండు;
  కాకుంటె నా మనసు కాశిలోనుండు...)

  తీరుగ కోవెలన్ జనుచు దేవుని పూజకు తోట జేరుచున్
  వీరుని శూరునిన్ మిగుల వెండియు బంగరు నున్నవాడినిన్
  కోరుచు భర్తగా శివుని గొల్వగ చెట్టున నూగుచుండెడిన్
  మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై...

  రిప్లయితొలగించండి


 3. చెప్పవేయమ్మ జో కొట్టి చెప్పు మమ్మ
  కథను నేనిదురను తూగ గావలయును
  "ఊ! యల గలదు మారేడు కాయ; లోన
  వృక్షము కలదు సూక్ష్మమె వృద్ధి గాన"


  నిదురపోవలె నిక :)


  జిలేబి

  రిప్లయితొలగించండి


 4. సోరణి దివ్వె వెల్గుల ప్రచోదిత మాయెను‌ నీలి నీడలే
  మారుచు బొమ్మలెల్ల కనుమాయని చేయుచు దోచు చుండగా
  ప్రేరిత మానసమందున సరీనృప రజ్జు వికల్పమై సఖీ
  మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణభంగం. "మానసంబున సరీసృప...." అనండి.

   తొలగించండి
 5. చెట్టు కేమది తాడుతో కట్టు బడెను,

  భవుని పూజకొరకు వాడు పత్ర మేమి,

  చాటు బడుచుండు నెచట బీజంబు లెపుడు,

  ఊయలకలదు, మారేడు, కాయలోన

  రిప్లయితొలగించండి
 6. కోరినకోర్కెదీరుటకు,కొండలరాయనివేడగాజనన్
  తీరుగకోర్కె దీర్చుమని,తీపిపదార్ధము వీడజూచితిన్
  నేరుగ నట్ల తద్దియని నేనొక చెట్టుకుగట్టియూహలన్
  మారెడు కాయలోననొక మానిని యూయలలూగెబ్రీతిమై.

  రిప్లయితొలగించండి
 7. లాలి యననేమి తెలుపుమ బాల యిపుడు,

  లేదుకున్ వ్యతిరేకము నేది లేమ,

  భిన్న మేది "మీ రాజుకు" బిడ్డ లార,

  పూవుకు తదుపరి దశను పొలతి దెలుపు,

  "బయట"కు విముఖ పద మేమొ పాప తెలుపు

  ఊయల,కలదు, మారేడు, కాయ,లోన:

  రిప్లయితొలగించండి
 8. మీరదు నాదుమాటలను,మేనగుయత్తకు ముద్దుకూతురే
  కోరికదీర్చరమ్మనుచు,గొప్పగనన్నిటుకీర్తిజేసెలే
  వీరుడు శూరుడీవనుచు,వేడెనుగట్టగ నూయలన్నటన్
  మారెడుకాయలోననొకమానిని, యూయలలూగె బ్రీతిమై

  రిప్లయితొలగించండి
 9. వనము నంతటను తిరిగి వచ్చితిమిక
  మారెడు తరువునకుగల మానునకొక
  యూయల గలదు :
  మారేడు కాయలోన
  నున్న గుజ్జు దీసి దినుచు నూగ నొప్పు

  రిప్లయితొలగించండి
 10. వింత కథలెన్నొ చెప్పెడు వృద్ధు రాలు
  చెప్పె నీరీతి యొకనాడు చిత్రముగను
  వడ్ల గింజలో నగల ప్రపంచ మందు
  నూయల గలదు మారేడు కాయలోన.

  రిప్లయితొలగించండి
 11. (వరమిచ్చిన పరమేశ్వరుని శిరసుపైననే
  చేయి జాపబోయిన భస్మాసురుని భరతం
  పట్టటానికి విష్ణుదేవుడు విశ్వమోహినిగా మారి వాడిని మాయలో పడేయటానికి మారేడుకాయలో దర్శనమిచ్చాడు )
  మారినబుద్ధితోడ హరు
  మన్నన పొందిన భస్మదైత్యుడే
  బారెడుచేయి జాపి " తల
  పై నిడెదన్ నిలు " మంచు బారుచున్ ;
  గారెడు స్వేదమున్ దుడిచి
  కాంచెను ; చిత్రము ; విష్ణుమాయతో ;
  మారెడుకాయలోన నొక
  మానిని ; యూయలలూగె బ్రీతిమై .
  (భస్మదైత్యుడు - భస్మాసురుడు ; పారుచున్ - పరుగెత్తుచు )

  రిప్లయితొలగించండి
 12. చేరిరి యందరచ్చటకు శీఘ్రముగా నొక మాంత్రికోత్తముం
  డౌర! యనంగ జేయు మహదద్భుతముల్ గన, వానిచేతిలో
  గోరినరీతి మారగల కొబ్బరి కాయ, విచిత్రమౌగతిన్
  మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై.

  రిప్లయితొలగించండి
 13. మారని బుద్ధితో మణులమానముదోచెడురాక్షసాధముల్
  వేరుగదల్చనేమిటికి?వేదికయేగదలంకరాజుయే
  తీరనిద్రోహమిద్దియని ,తీరుపుజెప్పిరి పూజ్యులందరున్
  మారెడుకాయలోననొక ,మానినియూయలలూగెబ్రీతిమై
  +++++++++++++=++=======
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మణుల మానము'? "సతుల మానము" అని ఉండాలనుకుంటాను. 'రాజు+ఏ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "భూపుడే" అనవచ్చు.

   తొలగించండి
 14. మైలవరపు వారి పూరణ

  ఆరయ భూమి వారియు మహౌజసమున్ పవనమ్ము వ్యోమమున్
  శ్రీ రమణీయకంఠుడె! విచిత్రము ! సత్తది ! వాని చిహ్నమే
  మారెడుకాయ! చిత్తనగ మానిని పార్వతి! యీ ప్రపంచమన్
  మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి


 15. చెరువు గట్టున మారేడు చెట్టు కొక్క
  నూయల గలదు , మారేడు కాయలోన
  విత్తు దీసి నాటి మరల వృక్షముగును
  నిదియె కాలచక్ర మహిమ నిలను గనుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "విత్తు దీసి నాట మరల వృక్షమగును" టైపాటు.

   తొలగించండి
 16. సృష్టి లోనున్న వింతలు చెప్ప తరమె
  యనుచు నొక్కండు పలికె నబ్బురము గ
  తనదు చరవాణి జూపించె దర్పముగను
  ఊయల గలదు మారే కాయ లోన

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చివరి పాదం లో మారేడు అని సవరణ చేయడ మైనది

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పలికె తా నబ్బురముగ" అనండి. లేకుంటే గణభంగం.

   తొలగించండి
 17. శ్రీగురుభ్యోనమః

  శారద రాత్రులందు విరజాజుల తావుల పారవశ్యమున్
  చారెడు కన్నులున్న చెలి జాబిలి చందన బంధురంబులో
  కోరగ హాసచంద్రికల కూజిత రాగపు భావనంబునన్
  మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై

  కస్తూరి శివశంకర్, ముంబై

  రిప్లయితొలగించండి
 18. శంకరయ్యగారూ! రండు! చకితమౌను!
  పోయి చూచివత్తము మనమును! జను లను
  కొనుచు నుండ్రి శివమహిమ గోచరమయె!
  "ఊయల కలదు మారేడు కాయలోన!"

  రిప్లయితొలగించండి
 19. మిత్రులందఱకు నమస్సులు!

  గారడివాఁ డొకండు ధనకాంక్షను నొక్కెడఁ జేరి, దండమున్
  గోరి ధరించియున్, జనులకున్ దన మాయలఁ జూప, మంత్ర స
  త్పారణ సేయఁగానె, యహొ! బమ్మియె తిమ్మిగ మాఱె! నట్టులే,
  మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై!

  రిప్లయితొలగించండి


 20. ఊరి కావల గుడికలదు సఖి తూగు
  టూయల కలదు మారేడు కాయలోన
  లింగ మును ప్రతిష్టించి భళీయనంగ
  దాని పైనిడి కొలువను తరుణమిదియె


  జిలేబి

  రిప్లయితొలగించండి
 21. పూరణకు సమస్య

  మారెడు కాయలోన మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై
  ఉత్పలమాల

  కోరెనుభార్యగాతనకుకోమలినొక్కతెజూపుమంచుఁదాన్
  దీరుగమంత్రగానిగనిధీరుడునాయువకుండునంజనం
  బారయుమంచురాసెఁగనుపట్టునటంచునుజూడఁదీక్షగాన్
  మారెడు కాయలోన మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై

  గాదిరాజు మధుసూదన రాజు

  రిప్లయితొలగించండి
 22. గజాసుర ఉవాచ :

  తేటగీతి
  బిల్వము మహాశివుడటంచు విశ్వసించి
  కోరి పూజించఁ బ్రభువుకై కుక్షిఁ జేరె
  నూపఁగా నీ గజాసురు నుల్ల మందు
  నూయల గలదు మారేడు కాయ లోన

  రిప్లయితొలగించండి
 23. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "మారెడు కాయలోన నొక మానిని యూయల
  లూఁగెఁ బ్రీతిమై"

  సందర్భము:
  బిల్వాటవీ మధ్య లస త్సరోజే
  సహస్రపత్రే సుఖ సన్నివిష్టామ్
  అష్టాపదాంభోరుహ పాణి పద్మామ్
  సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీమ్
  (కనకధారాస్తవం..)
  సీతా రామ లక్ష్మణు లొక మారేడు తోటలో నడుస్తుండగా రాము డన్నాడు గదా!.. "మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై"
  అప్పుడు లక్ష్మణు డిలా అన్నాడు "ఆ మానిని లక్ష్మియే గాని వేరే కాదు. అంతే కాదు. ఈ మారేడు తోటలో ఇప్పుడు నడుస్తున్న మా వదినమ్మయే ఆ లక్ష్మి. ఆమెయే సీతగాగా భూమిమీదకు జీవుల నుద్ధరించడానికై దిగి వచ్చిన శ్రీ హరివి నీవే!"
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *సీతా లక్ష్మి*

  శ్రీ రమ సీతగాగ భువి
  జీవులకై దిగినట్టి శ్రీహరీ!
  మారెడు కాయలో వెలుగు
  మానిని లక్ష్మియె సుమ్మి! నే డిటుల్
  మారెడు తోటలో నడచు
  మా వదినమ్మయె లక్ష్మి; అంటివే!..
  "మారెడు కాయలోన నొక
  మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  20.02.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 24. అల్ల చూడుముత్రాడుతోనల్లినట్టి
  యూయలగలదు,మారేడుకాయలోన
  గానిపించెనుశంభునిమేనువోలె
  నున్నయొకరూపు,వింతగాసన్నుతాంగి!

  రిప్లయితొలగించండి
 25. గజాసుర ఉవాచ :

  ఉత్పలమాల
  మారెడు నీవె శంకర సమంచిత రీతినిఁ గొల్తు వేగమే
  చేరుము కుక్షిలో ననుచుఁ జేయ తపమ్మును నీలకంఠుడే
  తీరెను నిర్మలాత్ముఁడటఁ దీర్చుచు మానిని శాంతి నాత్మలో
  మారెడు కాయ లోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై

  రిప్లయితొలగించండి
 26. జేరిన వారలందరు విచిత్రమహా యని మెచ్చునట్టులన్
  నేరుపు జూడ నచ్చెరువు నింపెడి జక్కని చిత్ర రాజముల్
  దీరు నమర్చినారిచట దెల్లమగున్ గనుమీ పటమ్ములో
  మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై

  రిప్లయితొలగించండి
 27. తీరుగనొక్కమాంత్రికుడుదీసెను పక్కిని శూన్యమందునన్
  కోరగనొక్కవీక్షకుఁడు కోమలిజేసెనువాని,నంతలో
  నారయనెల్లవారలునునాతనివిద్య ప్రదర్శనంబునన్
  మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై

  రిప్లయితొలగించండి
 28. రిప్లయిలు
  1. శివున కర్పించ భక్తిని శీఘ్ర మేఁగి
   కైకొనఁగఁ బ్రీతి యున్న, నక్కట చెలంగి
   స్వాంతమును వడి నూపఁగ సంది యంపు
   టూయల గలదు, మారేడు కాయలోన


   ధారుణి దూల నూపులకుఁ దా వడి దానిఁ గ్రహించు నాశతో
   వారక యెవ్వ రే మనినఁ బంతము వీడక యింత యేనియున్
   మూరఁగఁ జిత్త మందు కడు మోహము తియ్యని మావి పండుగా
   మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై

   [మారు మొగము – తిక్కన గారి ప్రయోగము ర ప్రాస యతి స్థానములో. మాఱు ప్రయోగము కూడ కలదు ]

   తొలగించండి
 29. చేరిన మంత్రగాడొకడు చిత్రము లెన్నియొ చేసిచూపెనే
  వారణమంబుదాయనముఁ వైహళి జేయుచు నుండగా సుఖా
  చారము శృంగముల్ గలిగి సాగర గామిని లోన నీదగన్
  మారెడి కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై.

  రిప్లయితొలగించండి
 30. చిన్నవస్తువు లందున చిత్రముగను
  చిర్తకుడు చెక్కుచుండెను చిత్రములను
  తండులమ్మున యీశుడు తనరునటులె
  యూయల గలదు మారేడు కాయలోన!!!

  రిప్లయితొలగించండి
 31. వారునువీరునున్ననకభర్గునిరూపముజూడరండహో
  మారెడుకాయలోన,నొకమానినియూయలలూగెబ్రీతిమై
  భీరువులేకయేతనకువీరముతోడనుబైకియూగుచున్
  నౌరయనంగదానిపుడయూహలదేలుచునుండెనేగదా

  రిప్లయితొలగించండి
 32. మఱుగుజ్జులు...

  బూరెలపై వధూవరులు పొంగుచునాడిరి బంతులాట సాం
  బారున మున్గి దంపతులు స్వర్గసుఖమ్మల నందినారు గోం
  గూరయె తల్పుమై పతిని కూడె శుభాంగి యొకర్తె మామతో
  మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై

  రిప్లయితొలగించండి
 33. కోరకనే ఫలమ్ములిడి
  కూరిమి బంచుచు నెండ వేళలన్
  చారు సుహాస బంధుర ర
  సాలము దోచెను, నేత్రపర్వమై
  జారుచు రంగులీని సుధ
  చక్కబడంగ దొడంగి పండుగన్
  మారెడు కాయలోన, నొక
  మానిని యూయలలూగె బ్రీతిమై!

  రిప్లయితొలగించండి
 34. ఉ:

  వారిజ వైరినిన్ గనిన వర్ణి గడుంగడు వర్ణనమ్మునన్
  నూరొక తీరుగా పొగడ నున్నది రూప మదేమి యంచనన్
  మారుగ కుంచె తోడు కడు మారులు చంద్రుని రూప మద్దగన్
  మారెడు కాయ లోన నొక మానిని యూయల లూగె బ్రీతిమై

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి