23, ఫిబ్రవరి 2020, ఆదివారం

సమస్య - 3289 (మోడీ చర్యలు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్"
(లేదా...)
"మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్"
(మొన్నటి సురభి శంకర శర్మ గారి అష్టావధానం సమస్య)

51 కామెంట్‌లు: 1. "చూడండి భాజ పాయే
  నోడెను ఢిల్లీని మన మనుకొని నటులనే"
  మేడమ్ము గారు చెప్పిరి
  "మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్"


  జిలేబి

  రిప్లయితొలగించండి

 2. నడిరేయి సరదా పూరణ:

  జాడూ గైకొని కేజ్రివాలు నగుచున్ జంబమ్మునన్ గెల్వగా
  తాడూపేడును గానకే మురియుచున్ తందాన తానంచు మా
  దాడీవారలు హైద్రబాదు నగరిన్ దంభమ్మునన్ పల్కిరే: 👇
  "మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్"

  రిప్లయితొలగించండి
 3. ఝాడూ చేగొని నూడ్చుచు
  నేడే ఢిల్లీప్రజలదె నిక్కముసుమ్మీ
  ఓడించిరి కమలమ్మును
  మోడీ సమకూర్చలేడు మోదముబ్రజకున్

  రిప్లయితొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  చూడంగానట దిల్లినిన్ వదరెడిన్ షోకైన బుర్కాలనున్
  వాడల్ వాడల బూబుసానులనహో బంధించుచున్ కౌగిటన్
  గోడల్ దూకిన రీతి దీది నగుచున్ కొల్కత్తనున్ పాడెనే: 👇
  "మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్"

  రిప్లయితొలగించండి
 5. మోడీ యొక్కడె గెల్చెన్
  కాడా యేకాకియై దగన్లోకసభన్
  ఆడిల్లీకుచితములిడి
  మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్"

  రిప్లయితొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  హౌడీ మోడి"యటన్న వేదికను బాహాటమ్ముగా ట్రంపుతో
  జోడీగా మెలగన్ గనన్ వడకి విస్తుంబోయి నిశ్చేష్టతన్
  పాడెన్ రాగము శోకపూర్వముగ నా పాక్ రాజ్యసమ్రాట్టిటుల్
  మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

  రిప్లయితొలగించండి
 7. రౌడీలకు గూండాలకు
  నాడిన యాటలిక చెల్లవంచును తెలియన్
  కేడీ లెల్లురు పలికిరి
  మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్

  రిప్లయితొలగించండి
 8. ఆడిన ప్రతిజ్ఞలన్నియు
  మోడీ సమకూర్చలేఁడు ; మోదము ప్రజకున్
  కూడును సాగిన వన్నిటి
  తోడనె సరిపు చ్చుకొనిన తోయమునందే

  తోయము = సమయము

  రిప్లయితొలగించండి


 9. మీటింగులో ఉద్ఘాటనమ్ము :)  మేడమ్ గారు "జనాళి నాడి యిది ప్రామీత్సంపు సంఘాతమే!
  తాడింపుల్ భళి" గట్టిగా నొడువుచున్ దంబమ్ముతోపల్కిరౌ
  "చూడండీ మన ఢిల్లి యెన్నికలనే చూపెన్ గదా చీపురున్?
  మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్"


  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. కం:

  కీడును యెంచక విముఖులు
  వాడగు మాటల ముసుగున వంచన జేయన్
  కారణ మెరుగక మొరిగిరి
  మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్

  వై. చంద్రశేఖర్

  వాడగు=వాడి+అగు

  రిప్లయితొలగించండి
 11. వాడల్వాడలు పౌరసత్వమను సంపద్వంత భావానికే
  మేడన్గట్టదు కూడుగూడును వినామ్లేచ్ఛాధముల్ రెచ్చరే
  తోడైపోయెను చంద్రశేఖరుడు నాదుర్మార్గ మజ్లిస్కనెన్
  మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్"

  రిప్లయితొలగించండి
 12. ఆడిన మాటలు తప్పక
  పోడిమి పాలనకు జనులు మురియుచు నుండన్
  పాడియె కాదందు రెచట
  మోడీ సమకూర్చ లేడు మోదము ప్రజకున్?

  రిప్లయితొలగించండి
 13. గోడల్దూకెడునేతలు
  మేడల్గట్టరెతెరాసమేల్మేలంచున్
  గాడీతప్పెనుపాలన
  "మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్"

  రిప్లయితొలగించండి


 14. కీడున్ జేయడయా మా
  మోడీ, సమకూర్చలేఁడు మోదము ప్రజకున్
  చాడీలన్ చెప్పుచు, పని
  వాడిగ చేయు నెలకొల్పు ప్రగతిని సుమ్మీ


  జాల్రా
  జిలేబి

  రిప్లయితొలగించండి


 15. పూర్వాశ్రమంలో మోడీ రామకృష్ణామిషన్ లో సన్యాసం స్వీకరిస్తానంటే వారి గురువుల ఉద్బోధ- ప్రజల సేవలో నీ ప్రగతి కల్యాణం కలదని చెప్పడం

  బాడబుడెవ్వండున్ ఓ
  మోడీ, సమకూర్చలేఁడు మోదము ప్రజకున్
  వాడిగ నరేంద్రుని వలెన్
  వేడిగ పనిచేయవలె నవిఘుడవగుమయా!


  జాల్రా
  జిలేబి  రిప్లయితొలగించండి
 16. మోడీకెనయగుజోడీ
  మోడీ, సమకూర్చలేఁడు మోదము ప్రజకున్
  మోడీగాకమరొక్కడు
  మోడీయే ప్రజలకిలనుమోదముగూర్చున్

  రిప్లయితొలగించండి
 17. చీడల్ చెట్టును పాడుచేసెడివిధిన్ జేరెన్ సమాజమ్మునం
  దీడన్ దౌష్ట్యము లక్రమార్జన మహా హీనత్వ సంబంధముల్
  వీడం జూడవు చిత్తసీమనలమెన్ వీటిన్ నిరోధించగా
  మోడీ! చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్

  రిప్లయితొలగించండి
 18. రౌడీ మూకలు తీవ్రవాదులకు నా రాజ్యమ్ములో చోటదే
  మోడీలేదని చెప్పగా వినుచు నో మూర్ఖుండు తాఁ జెప్పెనే
  నాడా వ్యర్థుల పాలనమ్మె మన కానందమ్ము కల్గించెనే
  మోడీచర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్.

  రిప్లయితొలగించండి
 19. గాడుల్దప్పినయార్థిక ప్రగతికిన్ మార్గాంతరంబెంచు చున్
  దాడుల్జేయగ నక్రమార్జన పరుల్ధైర్యంబు గోల్పోవ గా
  తోడైరందరునొక్కటై నిరతమున్దుర్వార్తలంబంచు చో
  మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్"

  రిప్లయితొలగించండి
 20. ఏడీ తెలుసుకొని ప్రజా
  నాడీ పాలించు వాడు నాణ్యత యొప్పన్?
  చూడగ మన దేశమునన్
  మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్ !

  రిప్లయితొలగించండి
 21. మిత్రులందఱకు నమస్సులు!

  [ట్రంపు నాహ్వానించుటకై మోడీ చేసెడి యార్భాటమునుం గాంచిన కాంగ్రెసు నాయకుల ఉవాచ]

  "హౌడీమోడికి మాఱుగా నిడెడి నీ హల్లోహలిం గాంచుచో,
  నేఁ డా ట్రంపున కిచ్చి పుచ్చు హితముల్, స్నేహంపు టామోదముల్,
  తేడాగాఁ గనిపించుచుండెను గదా! దీనత్వపుం బెంపుచే,
  గోడుల్ గొంపలు, బీద బిక్కి యిఁకపై ఘోషించు సాబర్మతిన్!

  మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గా విప్పుడున్!"

  రిప్లయితొలగించండి
 22. తోడుగ నిలిచిన కపిచయ
  మోడీ, సమకూర్చలేడు మోదము ప్రజకున్
  ఱేడగు శ్రీరామునకున్
  వేడుక యగునే! హనుమకు వీరులు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 23. మోడీయనయుగపురుషుడు
  మోడీకిలసాటిలేడుమొనగాడెవడున్
  బాడియె?పలుకుటయిట్లుగ
  మోడీసమకూర్చలేడుమోదముప్రజకున్

  రిప్లయితొలగించండి
 24. అందరికీ నమస్సులు 🙏🙏

  *కం||*

  వాడనె వీడనె కాదుగ
  వేడిగ టాక్సుల చురకలు పెట్టెను మనకే
  మూడెను మనకని తలచగ
  *మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌹🙏🌹🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సరదా పూరణ

   *కం||*

   గోడెవరిది వినడాతడు
   వాడనుకున్నదె సతతము వలదన జేయున్
   మూడున హిట్లర్ పోలిన
   *మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్"*!!
   🙏🌹🙏🌹🙏

   తొలగించండి
  2. అందరికీ నమస్సులు 🙏

   *కం||*

   గాడని తలచిరి గద పని
   గాడని తలచిరి మరి మొన గాడని తలచెన్
   గోడుని వినడని తెలిసిన
   *మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్"*
   🙏🌹🙏🌹🙏

   తొలగించండి
 25. మోడీయొక్కడెభారతమ్మునుదగన్మోదమ్ముగానుంచుచో
  మోడీచర్యలుభారతప్రజకుసమ్మోదమ్ముగావిప్పుడున్
  నేడీవాక్యముబల్కభావ్యమె?దొరా!నీవుంగజింతింపుమా
  మోడీవల్లనెగాదె!కాశ్యపిజనుల్ మోదమ్ముతోనుంటెగా

  రిప్లయితొలగించండి
 26. పార్టీవేదిక మీద ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా...

  కందం
  కూడును సేమముఁ దమకని
  నేడిచ్చిరి జనులు జయము, నీతిగ నడువన్
  దోడుండక మీరలు నీ
  మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్

  రిప్లయితొలగించండి
 27. శార్దూలవిక్రీడితము
  కాడిన్ మోసెడు నెద్దుగా నిలచి డొక్కాడించు నంచెన్నగన్
  గీడుల్ దప్పవటంచు భీతి వడి పాకిస్తాను గొంతెత్తుచున్
  మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడం
  చాడెన్ వేదిక దొర్కినంత పగలన్సాధించ నల్దిక్కులన్

  రిప్లయితొలగించండి
 28. వాడల వాడల నాటఁగఁ
  బాడిగఁ బచ్చని తరువులు పంచక, నాకీ
  వాడని కడింది చక్కటి
  మో డీ, సమకూర్చలేఁడు మోదము ప్రజకున్

  [మోడు =ఈ = మోడీ; మోడు = మొక్క]


  వాఁ డెవ్వం డగు నాజ్ఞ లీయ మనకుం బార్థుండె యోచింపగం
  బాడన్ మేలగు శాంతిగీతములు సంభావ్యమ్ముగా నెన్నడుం
  దేడా వచ్చిన నింక లాభ మగు నీ తీవ్రంపుఁ బోరందు వే
  మో డీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్

  [డీ చర్యలు = డీకొట్టు పనులు]

  రిప్లయితొలగించండి
 29. వాడిగ నిట కొందరనగ
  "మోడీ సమకూర్చ లేడు మోదము బ్రజకున్ "
  వేడిగ మరి కొందరితం
  డీడేర్చు ననిరి మరువక నెల్లరి కోర్కెల్ !

  రిప్లయితొలగించండి
 30. కీడును జేయగ నిధులను
  మోడీ సమకూర్చలేఁడు; మోదము ప్రజకున్
  తోడుగ నిలిచి యరాచక
  దాడుల నరికట్టు నతని ధైర్యము గాంచన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్
   కీడౌ నీతని వల్ల నంచు దమ సంఘీభావమున్ జూపుచున్
   నేడీ నాయకులందరున్నిటుల దుర్నీతిన్ ప్రదర్శించినన్
   మోడీ చర్యలు భారతీయుల సదా మోదమ్మునే గూర్చునే

   తొలగించండి
 31. ఓడి వగచు గాంధీలకు
  మోడీ సమకూర్చలేఁడు మోదము; ప్రజకున్
  నేడది సంబరమాయెను
  చూడగ రాముని గొలిచెడు శూరుని పతిగన్

  రిప్లయితొలగించండి
 32. రిప్లయిలు
  1. క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుఫిబ్రవరి 23, 2020 12:07 PM
   మోడీయుండెప్రధానియై మనకునామోదింపదక్షుండుకా
   పాడన్ దేశమునీప్రపంచమునుశుభ్రంబందవీధుల్ హృదుల్
   చూడన్ చేయవిమర్శలన్ పరమనీచుల్ తప్పగున్ !స్తుత్యమౌ
   మోడీ చర్యలు !భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్

   గాదిరాజు మధుసూదన రాజు

   తొలగించండి
 33. My opinion on disinvestment of LIC of India

  గాడే దప్పుచు నర్థశాస్త్ర నిపుణుల్ గంభీర రీతిన్ భళా
  పాడాలోచన లీవిధంబు సలుపన్ పాపాత్ములై జేరగన్
  తోడై నిల్వక భారతీయ నిగమున్ దోచేయగాదల్పగా
  మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్

  -యజ్ఞేశ్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లెస్స పలికితిరి యజ్ఞేష్ గారు.
   వ్యవస్థలను ఎందుకిలా భ్రష్టు పట్టిస్తున్నారో తెలియడం లేదు. ప్రభుత్వరంగ సంస్ధలకు తలమానికం లాంటిది ఎల్.ఐ.సి. దాన్ని వదిలేటట్లు లేరు. దేశ ప్రజల దౌర్భాగ్యం.

   తొలగించండి
  2. ప్రపంచీకరణ పిదప అన్నిదేశాలనూ కార్పొరేటు సంస్థలే పాలిస్తున్నాయి!మనదేశానికీ తప్పడం లేదు!భారతీయ సంచార నిగమమన్నా నష్టాలలో ఉన్నదికాని,
   జీవితభీమా సంస్థను ప్రైవేటుపరం చేయడం దౌర్భాగ్యం!!

   తొలగించండి


  3. Its high time lic realises and works more efficiently. The returns on policies can be more than what it is guarantees currently. Hope lic realises and benefits policy holders.

   Cheers
   జిలేబి

   తొలగించండి
 34. లేడీవిశ్వమునందువేరొకఁడుఁ నీలీలన్ ప్రజాక్షేమమున్
  జూడంగాఁదగుపాలకుండు మనికిన్ జూపించు మార్గమ్ములన్
  మోడీ చర్యలు, భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్
  తేడామాటలుబల్కుటల్, ప్రగతి కెంతేనిన్ విఘాతమ్మగున్

  రిప్లయితొలగించండి
 35. నేడీ యాంధ్ర జనాళి మూర్ఖుడగు నిర్ణేతన్నిరోధింపగా
  మోడీ, షా లకు విన్నవించినను ప్రాముఖ్యమ్మునే జూపకన్
  కాడై పోయిననేమి రాష్ట్రమిది మీ ఖర్మంబు మాకేలనన్
  మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్

  రిప్లయితొలగించండి
 36. Rahul statement, public reaction

  మోడిము లేకను బలికెను
  మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్
  మోడుపడిన చేతిని గని
  మోడిచి గన్నులు జనులిక మోవివిఱిచెనే

  రిప్లయితొలగించండి
 37. పాడిగ చక్కని పాలన
  తోడను జాతిని దరుమపు త్రోవను నడిపెన్
  చూడగ ప్రధాని గాకను
  మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్

  రిప్లయితొలగించండి


 38. వాడిగ నిర్ణయములు గొని
  వేడుకతోనమలుచేయ బెంబేలెత్తన్
  నోడిన వారలు పలికిరి
  మోడియు సమకూర్చలేడు మోదము ప్రజకున్

  రిప్లయితొలగించండి


 39. అష్టావధాని గారి పూరణ చూడాలని వుంది ప్రచురిచగలరు !  జిలేబి

  రిప్లయితొలగించండి
 40. చూడగ భద్రతె ముదమన
  మోడీ సమకూర్చగలడు మోదము ప్రజకున్
  నేడుచి తములే పరమన
  మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్

  రిప్లయితొలగించండి