16, ఫిబ్రవరి 2020, ఆదివారం

సమస్య - 3282 (భామయు భామయున్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భామలు గలువంగ సత్యభామ సుతుఁ గనెన్"
(లేదా...)
"భామయు భామయున్ గలువ బాలుఁడు పుట్టెను సత్యభామకున్"
(ఆర్వీజీ కృష్ణప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

99 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  భామల బృందమందునను బారెడు మీసము మెత్తి కొందరున్
  గోముగ వెన్ను వేషమును గొప్పగ దాల్చుచు విర్రవీగుచున్
  దోమలగూడ నాటమున తోరపు ప్రీతిని పిక్కటిల్లగన్
  భామయు భామయున్ గలువ బాలుడు పుట్టెను సత్యభామకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
   'మీసము మెత్తి, వెన్ను వేషమును, నాటమున'... ఈ పదాలు అర్థం కాలేదు.

   తొలగించండి
  2. 🙏

   మెత్తు = పూయు
   వెన్నుడు = కృష్ణుడు
   నాటము = నాటకము

   (ఆంధ్రభారతి)

   తొలగించండి
 2. అందరికీ నమస్సులు 🙏🙏

  *కం||*

  మోమున చిరు నగవులతో
  ప్రేమగ చేరిరి పదుగురు వేగము తోడన్
  యామెను జూచు సమయమున
  *"భామలు గలువంగ, సత్యభామ సతుఁ గనెన్"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌷🙏🌷🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తోడన్+ఆమెను=తోడ నామెను' అవుతుంది. యడాగమం రాదు. "వేగముతో తా। మామెను జూచు..." అనండి.

   తొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  గోముగ సత్యభామకట గొప్పగ నొప్పులు సంభవింపగా
  గ్రామము వీడి సర్జరిని గమ్మున చేర్చగ, డాక్టరమ్మలున్
  నీమము తోడ కూడగను నిక్కపు రీతిని కాన్పు చేయుటన్
  భామయు భామయున్ గలువ బాలుడు పుట్టెను సత్యభామకున్

  రిప్లయితొలగించండి
 4. మరో పూరణ ప్రయత్నం 🙏🙏

  *కం||*

  ఏమగునో తెలియదు మరి
  నామదియే కలత చెందె నలుగురి కొరకై
  మేమిచ్చట నుంటిమనుచు
  *"భామలు గలువంగ, సత్యభామ సుతుఁ గనెన్"*!

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌹🙏🌹🙏

  రిప్లయితొలగించండి


 5. కోమల మైన సమయమున
  పాముకొనుచు పేర్మితోడు పరిణేతని, ఆ
  శ్యామల మేని గిరిధరుని,
  భామలు! గలువంగ సత్యభామ, సుతుఁ గనెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 6. "ప్రేమకు మారు పేరతడె! పేర్మికి యీవిడె ముద్దుగుమ్మయౌ
  కోమలమైన వేళయిదె క్రొత్తడి మారెను తల్లిగా భళా
  శ్యామలు డయ్యె జన్మదుడు" జానుగు లొగ్గుచు మాటలాడిరా
  భామయు భామయున్, 'గలువ బాలుడు' పుట్టెను సత్యభామకున్"


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పేర్మికి నీమెయె/నీయమ" అనండి. (అమ/అమ్మకు రూపాంతరం)

   తొలగించండి


 7. "ప్రేమకు పెట్టినపేరగు
  శ్యామలుడాతడె మగండు" జానుగులొగ్గం
  గా మాటలాడు కొనిరా
  భామలు, "గలువంగ సత్యభామ, సుతుఁ గనెన్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. శంకరాభరణము నేటి సమస్య


  కనుపించని కీటకమ్ము గాలుని మించెన్"

  అసురలతో కొన్ని వేల సంవత్సరములు యుధ్ధము చేసి శ్రీహరి అలసి పొయి తన తలను ధనువు పైన పెట్టి నిదురించ సాగాడు. అతను అనేక సంవత్సరములు నిదుర పోవుచుండ భూలోకములొ యాగ ఫలమును స్వీకరించు వారు లేరు అప్పుడు బ్రహ్మాది దేవతలు శివుని తో కలసి చూస్తె విష్ణుమూర్తి గాడ నిద్రలో ఉంటాడు. అది చూసి శివుడు బ్రహ్మతో గాఢ నిద్రలో ఉన్న వారిని లేపుట మహా పాపము. దీనికి ఒక పరిష్కారము కలదు. నువ్వు సృష్టించిన వాటిలొ వింటి నారిని కొరుకు ఒక క్రిమి ఉన్నది ఆ క్రిమి ఈవింటి నారిని కొరుకగా అది తెగిపొవును అప్పుడు గలుగు ఆ శబ్దమునకు శ్రీహరి నిదుర లేచును అని తెలుపుతాడు. ఆ క్రిమి కొరికిన పిదప ఆ వింటి నారి తెగి భూమి ఆకాశములు దద్దరిల్లు భయంకరమైన శబ్దములు కలుగుతాయి. జగము మొత్తము వణికి పోతుంది.. ఆ సమయములోనె ఆ వింటి నారి వల్ల శ్రీహరి తల తెగి పడిపోతుంది ఈహటాత్పరిణామమునకు అందరు నివ్వ్వెర పొయి ఆది శక్తిని ప్రార్థించగా ఆమె హయ గ్రీవుడు అనే పేరు గల రాక్షసుని సంహరించడానికి స్వామి హయగ్రీవ అవతారము ఎత్తాలి కాబట్టి ఒక హయము(గుర్రము) తలను నరికి స్వామికి అతికించి ప్రాణముపొయమని ఆది శక్తి తెలుపు తుంది. అది శంకరుడు బ్రహ్మతో తెలుపు సందర్భము.  శిరమును బెట్టి యా శ్రీహరి నిలబడె
  పంచారపు కొనల పైన, నిదుర

  బోయెగా నలసిన కాయము విశ్రాంతి
  కోరగ, జగమున కొరవడె హవ

  న ఫలపు స్వీకర్త నారాయణుండు సౌ
  ఖ్యమ్ముగ నిదురించ, కంబు పాణి


  శయన భంగము చేయ సంకల్పమున నొక
  క్రిమిని సృష్టించి గాంగేయ గర్భు

  డు తెలిపె వింటి తాడును కొరకమని, కీ
  టకము కొరికి నంత ఢమఢమ మను

  శబ్దము లనిడుచు సారంగ శింజిని
  విచ్చిన్న మవగ నా విష్ణువు తల

  తెగిపడి పోయెగా, దిగ్భ్రాంతి నొందిన
  బ్రహ్మ తోడ కపర్ధి పలికె “సాత్వి

  క కనుపించని కీటకమ్ము గాలుని మించె
  నెటులని తలచగ నేమి ఫలిత

  ము గలుగును,దేవి తెల్పెగా. ముద్గ భుజము
  శిరము నొక్కటి ఖండించి హరి శరీర
  మునకు నతికించి నాతని తనువు కాయు
  వు నిడుగ వలయు ననుచు శివుండు బల్కె


  పంచారము సారంగము = ధనస్సు శింజిని = వింటి త్రాడు
  ముద్గభుజము = గుర్రము , గాంగేయ గర్బుడు ,సాత్వికుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
   "తనువు కాయువు నిడగ.." అనండి.

   తొలగించండి
 9. గురువు గారు నమస్కారము నిన్నటి పూరణము ఒక్క సారి చూడరా

  రిప్లయితొలగించండి
 10. ధామమున జేరి పలుకులు
  సీమలు దాటంగ మోజు శ్రేయ స్కరమౌ
  లేమల వినోద మైకము
  భామలు గలువంగ సత్య భామసుతుఁ గనెన్

  రిప్లయితొలగించండి
 11. మైలవరపు వారి పూరణ

  ఆ మహితున్ దయాగుణరసాబ్ధిని యాదవవంశజున్ పరం..
  ధాముని మౌనిమానస నితాంతవిహారిని శౌరి సర్వవే...
  దామలసారరూపుని మహాత్ముని నంబుదనీలవర్ణశో...
  భామయు భామయున్ గలువ బాలుడు పుట్టెను సత్యభామకున్ !!

  ( భా మయున్... తేజోమయుని )

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 'నీలవర్ణ శోభామయునితో భామను కలిపిన' మైలవరపు వారి పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 12. ఆ మల్లా రెప్పుడు హం
  గామా జేసె, యెవరడిగె కల్ప విటపమున్,
  రామ పడసె నెవ్వరినో
  భామలు గలువంగ, సత్యభామ ,సుతుఁ గనెన్"  రామ = లక్ష్మి , కల్పవిటము పారిజాత వృక్షము,
  మల్లారి = కృష్ణుడు, పడయు = ప్రసవించు

  రిప్లయితొలగించండి
 13. రామాలయమ్ము కేగెను
  శ్రీమతి దర్శనము గోరి శ్రీకరమని యా
  కోమలి యె చెప్పె నచ్చట
  భామలు గలువంగ, సత్యభామ సుతుఁ గనెన్

  రిప్లయితొలగించండి
 14. గోముగ భర్తను విడి తన
  ధామమునందు గల పలువిధములుగ ననుమో
  దము నొందుచున్న యచ్చటి
  భామలు గలువంగ సత్యభామ సతుఁ గనెన్

  రిప్లయితొలగించండి
 15. సేమముగోరి కృష్ణుడిట ,సేవలుజేయగరుక్మిణుండగా
  నీమమువీడితానిటను ,నెయ్యముజేసెను సత్యభామతో
  కామపు శాస్త్రముంజదివి,కామితయర్ధముదీర్చునందుకీ
  భామయుభామయున్ గలువ ,బాలుడుబుట్టెను సత్యభామకున్
  ++++++++++++++++==+
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రుక్మిణి+ఉండగా అన్నపుడు యడాగమం వస్తుంది. 'కామిత+అర్థము=కామితార్థము' అవుతుంది. యడాగమం రాదు. 'తీర్చునందుకీ'?

   తొలగించండి
  2. సేమముగోరి కృష్ణుడిట ,సేవలుజేయగరుక్మిణీసతిన్
   నీమమువీడితానిటను ,నెయ్యముజేసెను సత్యభామతో
   కామపు శాస్త్రముంజదివి,కాంక్షలసంద్రమునందునీదగా
   భామయుభామయున్ గలువ ,బాలుడుబుట్టెను సత్యభామకున్
   ++++++++++++++++==+
   రావెలపురుషోత్తమరావు
   (సవరణ పాఠము ధన్యవాదాలతో)

   తొలగించండి
 16. ధామము వీడి రయమునొక

  మయె కాన్పుకొర కాసుపత్రికి చేరెన్

  కోమలులు నర్సులయ్యెడు

  భామలు గలువంగ... సత్యభామ సుతుఁ గనెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
 17. కం॥
  శ్రామికులవాడలోలల
  నామణికిన్ ప్రసవవేదనల్ మొదలయ్యెన్
  క్షేమమెఱిగిముత్తైదువ
  భామలు గలువంగ సత్యభామ సుతుఁ గనెన్"

  గాదిరాజు మధుసూదన రాజు

  ప్రేమగనత్తగారుపిలిపించెనుకోడలునొప్పులన్ బడన్
  శ్యామలమంత్రసానిఁ బరిచర్యలుసేసెనుశక్తిమీరగన్
  భామను వైద్యురాలినటు భర్తయుపిల్చెనుకాన్పుఁజేయగన్
  భామయు భామయున్ గలువ బాలుఁడు పుట్టెను సత్యభామకున్

  గాదిరాజు మధుసూదన రాజు

  రిప్లయితొలగించండి
 18. ఉత్పలమాల
  శ్రీమతి సత్యభామకును జేయగ కాన్పును వైద్యశాలలో
  నేమరి వైద్యులున్ నిపుణులిద్దరు భామలఁ జేరఁ బిల్చగన్
  సేమముకై సిజేరియను జేసిన మేలను నిర్ణయమ్ముతో
  భామయు భామయున్ గలువ బాలుఁడు పుట్టెను సత్యభామకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "...జేరఁ బిల్వగన్/బిల్చినన్" అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు.
   సవరించిన పూరణ :

   ఉత్పలమాల
   శ్రీమతి సత్యభామకును జేయగ కాన్పును వైద్యశాలలో
   నేమరి వైద్యులున్ నిపుణులిద్దరు భామలఁ జేరఁ బిల్చినన్
   సేమముకై సిజేరియను జేసిన మేలను నిర్ణయమ్ముతో
   భామయు భామయున్ గలువ బాలుఁడు పుట్టెను సత్యభామకున్

   తొలగించండి
 19. శ్యామలవర్ణుని మథురా
  ధాముని శృంగారపురుష దక్షిణనాయకున్
  ప్రేముడిమీరగ నెనిమిది
  భామలు గలువంగ, సత్యభామ సుతుగనెన్ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దక్షిణ నాయకున్' అన్నచోట గణభంగం. సవరించండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!
   సవరించిన పూరణ
   శ్యామలవర్ణుని మథురా
   ధాముని శిఖిపింఛమౌళి దామరసాక్షున్
   ప్రేముడిమీరగ నెనిమిది
   భామలు గలువంగ,సత్యభామ సుతుగనెన్

   తొలగించండి
 20. తామొక కూడలిన్ గలిసి తన్మయు లౌచును సాంఘికంబులన్
  సేమములన్ బరస్పరము చెప్పుకొనంగను బూని యచ్చటన్
  ధీమతియైన నెచ్చెలికి దెల్పిరి స్నేహితురాలి సంగతుల్
  భామయు భామయున్ “గలువ బాలుఁడు” పుట్టెను సత్యభామకున్

  రిప్లయితొలగించండి
 21. మిత్రులందఱకు నమస్సులు!

  [ప్రేమికులకు బ్రాహ్మణులు పెండ్లి సేయఁగా, వారి కామితార్థముగా సత్యభామ యను నింతికి, సరస్వతి, భామిని, చంద్రకుమారుఁడు అను మువ్వురు జన్మించిరనుట]

  క్షేమము నెంచి ప్రేమికులఁ జేర్చఁగ నొక్క ముహూర్త మూన్చియున్,
  నీమమునన్ వివాహముఁ బునీత మనస్కులు సేయ, దంపతుల్
  కామితముల్ దలిర్పఁ దమకమ్మునఁ గూడఁగ సత్క్రమాన వా

  గ్భామయు, భామయున్, గలువ బాలుఁడు పుట్టెను సత్యభామకున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   చంద్రుని 'కలువ బాలుడు' అనడం సందేహం!

   తొలగించండి
  2. 🙏ధన్యవాదాలండీ శంకరయ్యగారూ🙏
   ఆ తల్లిదండ్రులు ఏ అర్థంతో ఆ పేరు (కలువ బాలుఁడు) పెట్టారో మరి! నేను చంద్రుడేననుకున్నాను!🤪

   తొలగించండి
 22. కందం
  ఏమరి యజీర్తి వాంతుల
  ధామము విడి వైద్యశాల తరలిన క్షణమే
  యేమేమో గుసగుసలకు
  భామలు గలువంగ సత్యభామ సుతుఁ గనెన్

  రిప్లయితొలగించండి
 23. అయ్యా!ఇంతకీ సత్యభామకు కృష్ణునికి పుట్టిన కొడుకు పేరు ఏమిటో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణుడికి సత్యభామ వల్ల భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు.

   తొలగించండి
 24. ఏమె! వినంగవచ్చె కబురీ దినమంచును మాటలయ్యెడున్
  భామయు భామయుంగలువ, బాలుడు పుట్టెను సత్యభామకున్
  శ్యామల వర్ణకాయుడు శశాంకముఖుండట తండ్రిమాదిరిన్
  కామునియందమంట! పద ! కన్నుల నిండుగ చూచి వత్తమే!

  రిప్లయితొలగించండి
 25. ప్రేమగ చర్చించుకొనిరి
  భామలు గలువంగ, "సత్యభామ సుతుఁ గనెన్
  తామెల్లరు కానుకగా
  ఏమిత్తుము బారసాల కిమ్ముగ" నంచున్౹౹

  రిప్లయితొలగించండి
 26. కోమలికి నెలలు నిండగ
  సే మముగా ప్రసవ మొదవ సేవలు జేయ న్
  కామిత మొప్పగ నత్తఱి
  భామలు గలువంగఁ : సత్య భామ సుతు గనెన్

  రిప్లయితొలగించండి
 27. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "భామలు గలువంగ సత్యభామ సతుఁ గనెన్"

  సందర్భము: సత్య మనే భామకు శాంతి యనే వాడు కొడుకు. ప్రేమ, ధర్మం (తమ నెప్పుడూ రక్షిస్తా డని) రాముని వెంట నడచే భామలు. వాళ్ళు కలువగా సత్య మనే భామ తన కొడుకును చూసింది.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *సత్య ధర్మ శాంతి ప్రేమలు*

  ఆమెకు శాంతియె సుతు డగు..
  ప్రేమయు ధర్మంబును రఘు వీరుడు నిరతం
  బోము ననుచు, వెంట నడచు
  భామలుఁ గలువంగ సత్యభామ సుతుఁ గనెన్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  16.02.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 28. కామిని యందచందములఁ గాంచిన తోడనె మోహమందుచున్
  బ్రేమగ చెంతజేరుచు నభీష్టము దెల్పుచు బిల్చెనాతడే
  కామపు కేళకై, సరస కాంతుని గూడగ మోదమందెనా
  భామయు, భామయున్ గలువ బాలుఁడు పుట్టెను సత్యభామకున్.

  రిప్లయితొలగించండి
 29. సోమరి సోమరిన్ గలువ చోద్యమె!పుట్టెను బద్ధకమ్ము హే!
  ధీమతి ధీమతిన్ గలువ తేజము పుట్టె! వితండవాదమా
  భామయు భామయున్ గలువ! బాలుఁడు పుట్టెను సత్యభామకున్
  శ్రీమహనీయ భావములు స్వీకృతి జేయగ సంగమమ్మునన్

  రిప్లయితొలగించండి
 30. నేమముతో వ్రతము జరిగె
  భామలు గలువంగ సత్యభామ సుతు గనెన్
  యామార్గశిరము నందున
  సామము తో వేడ్కలెల్ల సాగెను భువిలో.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...గనెన్+ఆ' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 31. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "భామలు గలువంగ సత్యభామ సుతుఁ గనెన్"

  సందర్భము: సత్యభామ (కృష్ణుని భార్య) కొడుకు ఉయ్యాలలో ఏడుస్తూ వున్నాడు. ఇరుగు పొరుగు భామలు "ముచ్చట లేమిటో!" అంటూ ముచ్చట్లు పెట్టడానికి వచ్చారు. "పిల్లవాడు ఒక్కటే పోరుపెడుతున్నాడు. ఇప్పుడు వీలు కుదురుతుందా!" అన్నది సత్యభామ. అదీ పద్య సందర్భం.
  భాగవతం ప్రకారం సత్యభామకు భాను, సుభాను, స్వర్భాను, ప్రభాను, భానుమన్, చంద్రభాను, బృహద్భాను, అతిభాను, శ్రీ భాను, ప్రతిభాను అనే పదిమంది కొడుకులు.. సావిత్రి అనే ఒక కూతురు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *ముచ్చట్ల వేళ కాదు*

  ప్రేమంపు సుతు డుయాలను
  గోముగ నేడ్వంగ "వేళ కుదురునె!" "ముచ్చ
  ట్లేమి?" యనుచు నిరుగు పొరుగు
  భామలు గలువంగ సత్యభామ సుతుఁ గనెన్"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  16.02.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 32. ఒక చిన్న విషయము పుకార్లతో చివరకు ఘోరంగా మార్పు జెందుట లోకంలో చూసేయుంటారు. ఆ నేపథ్యంలో...
  (కలెక్టర్ జానకి చిత్రంలో ఇలాంటి పుకార్ల సన్నివేశం ఉన్నట్లు గుర్తు)

  ఉత్పలమాల
  ఆమెయె సత్యభామ యసహాయతఁ గూర్చ నజీర్తివాంతులున్
  యామెకు నంటగట్టి నొక యక్రమబంధము గర్భమంచు భా
  మామణులున్ వదంతుల కుమారికి గూర్చినయంత వ్యాప్తిమై
  భామయు భామయున్ గలువ బాలుఁడు పుట్టెను సత్యభామకున్  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వాంతులన్+ఆమెకు' అన్నపుడు యడాగమం రాదు. "... నంటగట్టి యొక" అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

   ఒక చిన్న విషయము పుకార్లతో చివరకు ఘోరంగా మార్పు జెందుట లోకంలో చూసేయుంటారు. ఆ నేపథ్యంలో...
   (కలెక్టర్ జానకి చిత్రంలో ఇలాంటి పుకార్ల సన్నివేశం ఉన్నట్లు గుర్తు)

   ఉత్పలమాల
   ఆమెయె సత్యభామ యసహాయతఁ గూర్చ నజీర్తివాంతులే
   యామెకు నంటగట్టి యొక యక్రమబంధము గర్భమంచు భా
   మామణులున్ వదంతుల కుమారికి గూర్చినయంత వ్యాప్తిమై
   భామయు భామయున్ గలువ బాలుఁడు పుట్టెను సత్యభామకున్

   తొలగించండి
 33. ఆమనిసూర్యోదయమున
  గామముతోనష్టసతులుగన్ననిదరికిన్
  గోముననేగుచునగవున
  భామలుగలువంగసత్యభామసుతుగనెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...సతులుఅన్ననిదరికిన్' అర్థం కాలేదు.

   తొలగించండి
  2. కన్ననిదరికిన్
   అనగా కృష్ణునిదగ్గరకు సర్

   తొలగించండి
 34. ఆ మున్నీటను ద్వార
  గ్రామోద్దామమ్ము ద్వారకా నగరములో
  నీ మాటయే వినంబడె
  భామలు గలువంగ సత్యభామ సుతుఁ గనెన్


  ఏమని చెప్ప నొప్పు నిట నిండ్లను రేఁగిన సంబరమ్ములం
  గామితదాయి కృష్ణునకుఁ గామిత మిచ్చెను ముద్దరా లహో
  ప్రేముడి బిడ్డ బిడ్డఁ డని పెద్దగ నార్చుచు వాదులాడఁగా
  భామయు భామయుం గలువ బాలుఁడు పుట్టెను సత్యభామకున్

  [కలువ బాలుఁడు = కలువను బోలు బిడ్డఁడు]

  రిప్లయితొలగించండి
 35. శ్యామలదేహుఁడు శౌరికి
  భామలుపదియారువేలు భక్తాగ్రణులే!
  నీమముతప్పక స్వామిని
  భామలు గలువంగ, సత్యభామ సుతుఁ గనెన్

  రిప్లయితొలగించండి
 36. ధామము వీడి రయమునొక

  భామయె కాన్పునకు నాసుపత్రికి చేరెన్

  కోమలులు నర్సులయ్యెడు

  భామలు గలువంగ... సత్యభామ సుతుఁ గనెన్

  రిప్లయితొలగించండి
 37. సోమయ్యయు సతి సత్యయు
  భామలుగ నటియించు చుండ పలు రూపములన్
  ఆమె సుతుఁ గని ప్రజలనిరి
  భామలు గలువంగ సత్యభామ సుతుఁ గనెన్

  రిప్లయితొలగించండి
 38. ( మామగారు కార్యం వాయిదాలు వేస్తుంటే
  భార్య కోమలి లేఖల నందుకొన్న భర్త సునీలు చేసిన పని )
  మామయ కార్యమున్ సలుప
  మానుచునుండె; సునీలు భార్యయౌ
  కోమలి ప్రేమలేఖలను
  గోముగ గూర్మిగ వ్రాసె; నాతడున్
  నేమము సైపలేక సతి
  నెచ్చెలి వేషము తోడ చేరెలే;
  భామయు భామయున్ గలువ
  బాలుడు పుట్టెను సత్యభామకున్ .
  (నేమము - నియమము ; నెచ్చెలి - సఖి )

  రిప్లయితొలగించండి
 39. ప్రేమగ హరి గనె జెర విడి
  భామలు గలువంగ; సత్యభామ సుతుఁ గనెన్
  ఆ మరణించిన నరకుని
  భూమిగ దన యంశమందు బుట్టిన వానిన్

  రిప్లయితొలగించండి
 40. ఆమెయె కృష్ణునిన్ దనదు నాటలపాటల గెల్చుకొన్నదై
  ప్రేమనుబంచుచున్ బతికి పేరిమిరాణిగ నష్టభార్యలన్
  గామనలన్నియున్ గడచి కన్నదియంచును మాటలాడగా
  భామయు భామయున్,బాలుడుబుట్టెను సత్యభామకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీమంతము నిన్నాయెగ
   నీమాసములోనె గనును నిరుటినివలెనే
   క్షేమంబుగ నంచు పురిటి
   భామలు గలువంగ సత్యభామ సుతుగనెన్

   తొలగించండి
 41. రూమరులెన్నొ పుట్టినవి!రోమను పట్టణమందు వింటిరా!
  భామయు భామయున్ గలువ బాలుఁడు పుట్టెను! సత్యభామకున్
  ప్రేమమయుండు కృష్ణునకు క్రీస్తు కుమారుడటంచు వింత,శ్రీ
  రామ!వదంతులల్లెదరు రంజిల సోషలుమీడియాలలో

  రిప్లయితొలగించండి
 42. ఏమగుజెప్పనా?నగునునీర్ష్యలుగోపములుద్ధృతంబుగా
  భామయుభామయున్గలువ,బాలుడుపుట్టెనుసత్యభామకున్
  గామునిమించునందమునుగల్గుచుబొద్దుగజూడముచ్చటై
  ప్రేమనుముద్దువెట్టుటకువీలగుచెక్కిలియుండువాడుగా

  రిప్లయితొలగించండి

 43. కంది వారు,

  నా పూరణలో

  --మాటలాడిరా
  భామయు భామయున్, 'గలువ బాలుడు' పుట్టెను సత్యభామకున్

  "కలువబాలుడు" సరియైన పదమేనంటారా లేక జిలేబీయముగా వున్నదా :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 44. "భామయు భామయున్ గలియ..." సమస్యకు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పూరణ:

  శ్రీమతి లేఖ పంపినది, కార్యముచేయడు మామ, తానట
  గ్రామణియైన యల్లుడొక రాతిరి తానొక చెల్మికత్తెయై
  మామ గృహంబు జేరి తన మానిని గూడెను, అయసత్య పుం
  భామయు, భామయుంగలియ బాలుడు పుట్టెను సత్య భామకున్

  రిప్లయితొలగించండి
 45. ఇది ఎవరో పంపారు. మొదటి పాదంలో చేయడు కార్యము అని చదువుకొన గలరు.

  రిప్లయితొలగించండి
 46. అలాగే 3 పాదంలో అయ్యసత్యపుం. అని చదువుకోవాలి.

  రిప్లయితొలగించండి
 47. ః... గూడెను, అయ్యసత్యపుం" అని కుదరదండీ వ్యాక్రరణం ప్రకారం. మీరు కామా పెట్టి కుదర్చటానికి చూడరాదు. అందుచేత ".. గూడగ నయ్యసత్యపుం" అని సవరించుకొనక తప్పదు మరి. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 48. కావచ్చండీ. నాకు పంపిన వాళ్ళు అలా పంపారు.

  రిప్లయితొలగించండి
 49. కందం
  ఏమరు పాటున తనయుడు
  ధామము విడి వీధి జేరి తప్పెననుకొనన్
  బ్రేమగ వెదకెడు నిరుగురు
  భామలు గలువంగ సత్యభామ సుతుఁ గనెన్

  రిప్లయితొలగించండి