3, ఫిబ్రవరి 2020, సోమవారం

సమస్య - 3270 (పెండ్లిచూపులకున్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి"
(లేదా...)
"పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్"

116 కామెంట్‌లు:


  1. తలుపులు లేని వాటికను తాతలు ప్రేతల కాల్చగానటన్
    కలిమిని గోరి బిల్డరులు కమ్మగ గుట్టుగ నాక్రమించుచున్
    వలపులు మీర కట్టగను వందల ఫ్లేటులు, పిల్లలందునన్
    పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్

    రిప్లయితొలగించండి
  2. కస్తూరి శివశంకర్సోమవారం, ఫిబ్రవరి 03, 2020 12:40:00 AM

    వర సిరులు బూయ సంసార వనములోన
    భావి జీవంబు రసరమ్య బంధురముగ
    వలపు లొలయు సమయమున నెలవు లేమి ?
    పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి

    రిప్లయితొలగించండి
  3. అందరికీ నమస్సులు 🙏
    *తే గీ:*
    మంచి వారల నెపుడును మాయ జేయుఁ
    దొరికిన జనులను తరచు దోచ గోరు
    వారి నింటను జేయుఁ పనులగు నట్టి
    *"పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మాయ జేయు' తరువాత అరసున్న అవసరం లేదు. "వారి యింటను.." అనండి.

      తొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    బలమున భీముడచ్చటను భండనమందు సుయోధనుండనున్
    గెలువగ చంపగా కడకు కీర్తిని పొందుచు భారతమ్మునన్...
    వలపులు మీర కట్టుచును భారత వాసులు యూనివర్సిటిన్
    పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్

    యూనివర్సిటి = Kurukshetra University

    రిప్లయితొలగించండి
  5. కలల తలపుల సడిలోన వలపు విరులు
    మదిని విరియంగ సంతస మందు వేళ
    చెలియ సరసను కోరుచు చేరి సుఖము
    పెండ్లి చూపులకుం దగుఁ బ్రేత భూని

    రిప్లయితొలగించండి


  6. అర్ధ రాత్రి లగనమాయె నన్నపూర్ణ
    పెండ్లి కూతురు! కొమరుడు ప్రేతగోపు
    డౌర! దీనిలో తప్పేమి డప్పు వేయి
    పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. ఇల పిలవాండ్లుగా జనన మీ శివపాడున పెంపుగాననా
    వలపులు మీరె నిర్వురికి ఫారెను వెళ్ళిరి బుద్ధిజీవులై
    కలయిక కోరె డెందములు కార్డులు వేసిరి ప్రేమమీరగా
    పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. (దయ్యాలవారి అమ్మాయికి కొరవిదయ్యాల
    వారి అబ్బాయికి వల్లకాటిలో అర్ధరాత్రి పెండ్లిచూపులు )
    అలయక రెండువర్గముల
    యందున మోదము మిన్నుముట్టగా
    కలవగ నిశ్చయించిరట
    గట్టిగ దయ్యపు పెద్దలందరున్ ;
    కలకల యట్టహాసములు
    గ్రక్కున వీనులవిందు సల్పగా
    పిలిచిరి పెండ్లిచూపులకు
    వేడుక మీర శ్మశానభూమికిన్ .

    రిప్లయితొలగించండి
  9. తలపులవొక్కటై తరుమ,ధన్యతనందిరి శైవభక్తులీ
    వలపువసంతమున్ గెలిచి వావిరిబుట్టెడు రత్నమన్నటుల్
    కలిమినిలెక్కజేయకను,కార్యమునందతి శోభగూర్చగా
    పిలిచిరి పెండ్లిచూపులకు, వేడుక మీఱ శ్మశానభూమికిన్.

    రిప్లయితొలగించండి
  10. సలలిత రాగభావముల సన్నిహితత్వముగోరు కాంతయే
    వలపువసంతమున్ గెలిచి,వద్దనిజెప్పిన పెద్దలొప్పగా
    తలపున నూరు కోరికలు, ధన్యతనొందగ ప్రేమభావమున్
    పిలిచిరి పెండ్లిచూపులకు, వేడుక మీఱ శ్మశానభూమికిన్.

    రిప్లయితొలగించండి

  11. మైలవరపు వారి పూరణ

    వలదతడేమొ యొంటిపయి భస్మముతో, మెడలోన పాముతో,
    నలసిన యెద్దునెక్కి తిరుగాడుచునుండు పరేతభూమిలో
    వలదన దల్లి., గౌరి దృఢవైఖరి దెల్పగ., వెళ్లి శంకరున్
    పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  12. దుర్మతులతోడ సావాస దోషమిదియె
    శుభము గూర్చెడు తలపులె శూన్యమయ్యె
    నపశకునపు మాటలనిక యాపు మేల
    పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి?

    రిప్లయితొలగించండి
  13. చక్కటి వసతిగల తన సౌధ మందు
    పెండ్లిచూపులకుం దగుఁ : బ్రేతభూమి
    యందు దిగవేయ దగు కట్నమడిగినయెడ
    భావనమిదియ శంకరాభరణ మందు

    రిప్లయితొలగించండి
  14. మున్ను మరుభూమి నేడట ముచ్చటైన
    భవన నిర్మాణముజరిగె భవ్యముగను
    నచటవసియించువారికినదియెకాదె
    పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి

    రిప్లయితొలగించండి
  15. తెలుపగ నెంచుచొక్క యువతీ యువకుల్గల సంస్థ ప్రేమతోన్
    కలిసిన మానసంబులవి ఖాతరు చేయవు మూఢ నమ్మకం
    బులనుచు నెల్లరొక్కతరి బూనిక బూనుచు బంధుమిత్రులన్
    పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్"

    రిప్లయితొలగించండి
  16. పొలతుక పెండ్లి ప్రాయమును పొందుగ జేరగ సంతసమ్మునన్
    గులమును శీలమున్ దరచి, గోత్రము నెంచి, గుణమ్ము రాశులున్
    గలిసిన కూటమిం గనియు, కాటికి కాపరి కూతుకై వరున్
    "బిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్

    రిప్లయితొలగించండి
  17. మనుజు లెల్లరుఁ బరిణయ మాడి మోద
    మందుటను గాంచి పెండ్లిపై మనసు పడిన
    పెద్ద శాఖిణీ ఢాఖిణీ ప్రేతములకు
    పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి

    మనుషులందరూ పెళ్ళిళ్ళు చేసుకుని బాగా సంతోషంగా ఉండటం చూసి, తమకూ పెళ్ళి కావాలని మనసు పడిన శాఖిణీ, ఢాఖిణీ లాంటి ప్రేతాల పెళ్ళి చూపులకు శ్మశానమే తగిన వేదిక అవుతుంది!!

    రిప్లయితొలగించండి
  18. నడచినదారి ఎందుకనీ... 'విట్టెక్కు పూరణ'

    కలవని మూడు మార్గములు గౌరితప స్సిలు కాటికాపరుల్,
    సులువని భావనమ్ములివె సొంపుగ గూర్చగ నంచుఁ జూడగా
    పొలుపుగ శంకరాభరణ పూరణలందున సత్కవీశ్వరుల్
    "పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్"

    ** గౌరితపస్సు... సిద్ధము కాని *సాధ్యమే* కదా అనుకొనీ.... 😊

    రిప్లయితొలగించండి
  19. మారె మరు భూమి నేడ ట మహిత మైన
    వాస యోగ్యము లైనట్టి భవనము లు గ
    నన్ని హంగులు గల్గియు నలరు చుండ
    పెండ్లి చూపుల కుం దగు ప్రేత భూమి

    రిప్లయితొలగించండి
  20. "కలదు మదీయ సద్గృహము కాటికి ప్రక్కన వీథిలోపలన్
    మలుపులు మూడు దాట శివమందిర ముండును దాని ప్రక్కనే"
    "తెలియదు దారి, చేరితి మిదే యిటు మీరలె రం" డటంచటన్
    బిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్.

    రిప్లయితొలగించండి
  21. పెండ్లికుమారుడు ప్రేతై 
    పెండ్లి యనంగ చనిపోవ పేర్మిని వారల్ 
    పెండ్లి తలచి యనిరిటుల 
    "పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి"  

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్యాపాదం తేటగీతి అయితే మీరు కందం వ్రాసారు. మరో ప్రయత్నం చేయండి.

      తొలగించండి
  22. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తల్లిదండ్రులు + ఎంచి' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

      తొలగించండి
    2. మెచ్చి పెద్దవారెల్లరు దెచ్చినట్టి
      ప్రేత కళలతోవెలుగొందు పెండ్లి కొడుకు
      వికృత ముఖము గాంచియువతి వెక్కిరించె
      పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి

      కృతజ్ఞతలు గురువు గారు.
      సరిచేశాను, చిత్తగించండి.

      తొలగించండి
  23. ఇలపయి నున్న క్షేత్రముల నెల్లను జూడ మహత్వదీప్తితో
    వెలుగుచునుండు కాశి యది విశ్వమునందు మహాశ్మశాన మా
    స్థలముననుండు వారొకరు స్వాత్మజ జూడ వరానుసారులన్
    బిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్.

    రిప్లయితొలగించండి


  24. మన బ్లాగులోకపు టపా కామెంటు ఆధారముగా పూరణ :)


    ఎదని శవమయి నావే జిలేబి మదిని
    ఖననమైనావె పువుబోడి కానవచ్చె
    నగ్నిహోత్రమ్ములట జజ్జినకరినకరి
    పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  25. అలయక గౌరిదేవియట నాకులసైతము స్వీకరింపకే
    వలదని నెంతజెప్పినను వానినిబొందుటె నేకదీక్షగన్
    దలపగ,దల్లిదండ్రులిక తాపసి శంభుని తోషమందుచున్
    బిలిచిరి పెండ్లిచూపులకు వేడుకమీర శ్మశానభూమికిన్

    రిప్లయితొలగించండి
  26. చంపకమాల
    పలికిరి రాజధానియని పాలకులప్పు డదే 'శ్మశానమై'
    నిలిచెను నేటిపాలకుల నిర్ణయమందున సత్యమేమిటో?
    కొలువున నున్నవారి యొక కూతురు నీడగు నన్న మా సుతున్
    బిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీర 'శ్మశాన' భూమికిన్

    రిప్లయితొలగించండి
  27. స్వేఛ్ఛ కితిలోద కాలిచ్చి స్త్రీల చేతి
    కీలు బొమ్మన, ప్రేతము బోలు మనెద
    మనెడి భావన నుండెడి మగడు తలచు
    పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి

    రిప్లయితొలగించండి
  28. మిత్రులందఱకు నమస్సులు!

    జ్వలితతపఃప్రభావయుత శైలసుతామృతరాగతీవ్రతా
    కలితపరీక్షితస్సదవగాహుఁడునై శివుఁ డప్డు సప్తమౌ
    నులఁ బనుపన్, నగాధిపు వినూత్నముగా వినుతించి, చెప్పి, వే

    పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్!

    రిప్లయితొలగించండి
  29. సుతయు వలచెను మనసారా శూలిని విను
    మనుచు పలికెను హిమవంతు డాలితోడ
    మసన వాసి యాతడుగాన మనలకిపుడు
    పెండ్లి చూపులకు తగు ప్రేత భూమి.

    రిప్లయితొలగించండి
  30. ప్రేతభూమినినివసించుబీదవారి
    పెండ్లిచూపులకుందగుబ్రేతభూమి
    ప్రేతభూమినినొకచోటవేదికగను
    జేసిచూపులుజరిపింత్రు వాసిగాను

    రిప్లయితొలగించండి
  31. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

    పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి"

    ఇచ్చిన పాదము తేటగీతి సీస సహిత ఎత్తుగీతిలో నాపూరణము

    మనిషి చనిపోయిన స్వర్గ స్తుడైనాడు అంటాము
    తలచిన వారితో పెండిలి జరుగక ఇంటి నుంచి వెళ్ళి పోయి ప్రేమించినవారిని పెండ్లి చేసుకున్నప్పుడు
    Maariaages are made in Heaven అని సమర్ధించు కొందురు స్వర్గము మరణమునకు చివరి సోపానము .వివాహమునకు మొదటి సోపానము. స్వర్గమురెంటికి సమానము అయినప్పుదు మరుభుమిలో పెండ్లి చూపులు తప్పులేదు అను భావన


    (మ)నుజులు పొందగ (మ)రణము తెలిపెద(రు)గ వారు చేరె ధ(రు)ణము నకని,

    (నీ) భువనములోన (నె)ల్లరకును, శివ (సా)న్నిధ్య మందురు (శై)వు లెల్ల ,

    (వై)ష్ణవు లెల్లరు (వై)కుంఠ మునుజేరె (నను)చు తెలుపునుగా (ఘన)త తోడ,

    (త)లచిన వారితో (దా)రక్రియ జరుగ (కు)న్నసమర్ధించు (కొం)దురెల్ల

    (రు)ను “వివాహములు జ(రు)గుచుండు గా స్వర్గ (మం)దు తొట్టదొలుత , (మ)నుజు లెల్ల

    (రు) విధి తప్పించ లే(రు) గదా యనుచు దాట (వే)సి సాగించు జీ(వి)తము నెపుడు,

    (చివ)రి మెట్టాయెను మృతికి (తవి)ష మెపుడు,

    (మొ)దటి మెట్టాయె పెండ్లికి (ము)దముగాను,

    (పెం)డ్లి చూపుల కుందగు (బ్రే)త భూమి

    (యను)చు పిలువంగ తప్పేమి (ఘన)త తోడ


    ,ధరుణము, తవిష = స్వర్గము
    దారక్రియ = వివాహము

    రిప్లయితొలగించండి
  32. తే.గీ.

    పెండ్లి చూపులు వలదని బెట్టుసేయ
    మంచి తరుణము నిరువంక నెంచి జూడ
    శరణు వేడగ దేవర స్థలము జూప
    పెండ్లి చూపులకుం దగు బ్రేతభూమి

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  33. రిప్లయిలు
    1. సమస్యాపూరణం సమస్య....

      "పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్

      చంపకమాల:

      పలువురుగ్రామనాయకులప్రార్ఠనమేరకుపార్లమెంటు స
      భ్యులెయొసగన్ నిధుల్ జరిగిపోయెశ్మశాననిర్మితుల్
      కులపువివాహవేదికయుకూడెను,పెద్దలుయంపిమూర్తినే
      పిలిచిరి పెండ్లిచూపులకు, వేడుక మీఱ శ్మశానభూమికిన్

      గాదిరాజు మధుసూదన రాజు

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    3. సమస్యాపూరణం సమస్య....

      "పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్

      చంపకమాల:

      పలువురుగ్రామనాయకులప్రార్ఠనమేరకుపార్లమెంటు స
      భ్యులెయొసగన్ నిధుల్ జరిగిపోయెశ్మశానసహాయనిర్మితుల్
      కులపువివాహవేదికయుకూడెను,పెద్దలుయంపిమూర్తినే
      పిలిచిరి పెండ్లిచూపులకు, వేడుక మీఱ శ్మశానభూమికిన్

      గాదిరాజు మధుసూదన రాజు

      తొలగించండి
  34. తెలియనివారలైన,ననుతేజునిజెంతనునుండగోరియే
    పిలిచిరిపెండ్లిచూపులకువేడుకమీఱ,శ్మశానభూమికిన్
    వలదుర యేగకెన్నడునుబంగరుగట్టునువింటిగాదగ
    న్నలరిన శంకరుండచటయార్తినిదాపసవృత్తినుండుటన్

    రిప్లయితొలగించండి
  35. ఏండ్ల నుండి పిశాచపు దండ్ల కెంచ
    నిండ్లుగా సమాధు లడర ముండ్ల తోడఁ
    బండ్లు గా నుండ నెముకల గుండ్లు మీఱి
    పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి


    సలలిత గంధ సార సుమ సంచయ తోరణ మండల ప్రభా
    విలసిత వార కూట పరివేష్టిత పీఠ విరాజితమ్ము యా
    వలఁ దనరంగ నేత్ర విభవమ్ముగ నొక్క విశాల హర్మ్యమే,
    పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ, శ్మశానభూమికిన్

    [శ్మశానభూమికిన్ –ఆవల]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. వాహ్!

      నేత్ర విభవమ్ముగ విశాల హర్మ్యము‌ శ్మశానవాటిక కావలన్!


      Truely represents current cities of India !


      జిలేబి

      తొలగించండి
    2. కామెస్వర రవు గారికి నమస్కారము అతయద్భుతముగా నున్నది.

      తొలగించండి
    3. సుకవిమిత్రులు పోచిరాజువారికి నమస్సులు!
      మీ రెండు పూరణములు చాలా బాగున్నవి. అభినందనలు!

      రెండోపూరణలోని ద్వితీయ పాదాంతాన ఉత్వమునకు, పరమైన అచ్చునకు, సంధి చేయకుండా, యడాగమం వేశారు. పరిశీలించగలరు.

      తొలగించండి
    4. జిలేబిగారికి, కృష్ణకుమార్ గారికి ధన్యవాదములు.

      కవి పుంగవులు మధుసూదన్ గారు నిజమే నండి. గమనించ లేదు ధన్యవాదములు. “విరాజితమ్మ” గా సవరించెదను, యావల తో మూడవపాదము ముందు ముగించిగా దొర్లిన దోష మిది. నమస్సులు.

      సలలిత గంధ సార సుమ సంచయ తోరణ మండల ప్రభా
      విలసిత వార కూట పరివేష్టిత పీఠ విరాజితమ్మ యా
      వలఁ దనరంగ నేత్ర విభవమ్ముగ నొక్క విశాల హర్మ్యమే,
      పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ, శ్మశానభూమికిన్

      [శ్మశానభూమికిన్ –ఆవల]

      తొలగించండి
    5. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  36. కలిసెను జాతకమ్ములిక గావలె మీ శుభ దీవనల్ యనిన్
    పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ; శ్మశానభూమికిన్
    వలపల దారిలో గల వివాహపు వేదిక నందు విందనిన్
    దెలిపిరి బంధుమిత్రులకు దీయని వార్తను పెళ్ళి పెద్దలే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. 'దీవనల్ + అనిన్' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  37. వలదని చెప్పకో జనని ప్రాణసమానము గాదలంచితిన్
    లలనను, ప్రేతగోపుడు ఝలన్ సుమ కోమలిఁ బెండ్లియాడగా
    కులమత భేదమంచు నిక కుట్రలు పన్నక సాగగా వలెన్
    బిలిచిరి పెండ్లిచూపులకు వేడుకమీఱ శ్మశానభూమికిన్.

    రిప్లయితొలగించండి
  38. మాతృ గర్భస్థ వాసము మరల జన్మ
    గృహము వీడెడు వేదన గృహిణి రాగ
    వాన ప్రస్థి గా మెల్గుము వయసు పెరుగ
    పెండ్లి చూపులకుం దగు బ్రేతభూమి
    ,

    మరణించ గానే లేదా ఈ జన్మ రావటానికి మాతృ గర్భస్థ వాసా దుఃఖం
    నేటి సమాజంలో కుటుంబ విలువలు పోవటం వల్ల , ఇల్లే నరకం అనిపిస్తుంది
    అన్ని బాధ్యతలు వదలి, వృద్ధాశ్రమం లో చేరానిపిస్తుంది అదొక నరకం
    అందుకు పెళ్లిచూపులు స్మశానంలో మొదలు పెడితే జీవిత సత్యం బోధపడును
    Krishna Mohan Nallan Chakravarthula

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణమోహన్ గారూ,
      మీ పూరణ చూచి చాల సంతోషిస్తున్నాను.
      'వానప్రస్థ' మన్నపుడు 'న' గురువై గణదోషం.

      తొలగించండి
  39. తేటగీతి
    బూది నిండిన భూమిపై పాదుకొలిపి
    గతఁపు మరుభూమి ఛాయలఁ గానకుండ
    మేడలు వెలయన్ వేడుకల్ మిగులఁ జరుగఁ
    బెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి

    రిప్లయితొలగించండి
  40. *నేటి సమస్యకి నా సరదా పద్యం* 😊😊

    *కం||*

    రాతిరి సమస్య చూడగ
    బేతాళుడు వచ్చెననుచు బెంబేలైతిన్
    ప్రేతభువిన పెండ్లి కనిన
    పోతిరి చూపులకొరకని పోరడు తోడన్!!
    🙏🙏

    రిప్లయితొలగించండి
  41. కొలువుగనుండెనొక్కతరి,కోవెలగానిది రాజధానిగా
    నిలిచిరిదేవతాగ్రణులు,నిచ్చట ప్రేమగ వారివాసమై
    నిలువుగముంచివేయుటకు ,నిద్ధర యంత యెడారియైనదా?
    పిలిచిరిపెండ్లిచూపులకు వేడుకమీఱశ్మశానభూమికిన్

    రిప్లయితొలగించండి
  42. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి"

    సందర్భము: బారులు తీరి భూపతులు బంగరు గద్దెలమీద కూరుచున్నారు (కరుణశ్రీ)
    అప్పుడు జనకు డిట్లు ప్రకటించినాడు.
    "ధాత్రీ ద్రవ్య మహా పరీమళ సనాథన్ భూమి సంజాత నే
    ధాత్రీశుండు గుణంబునన్ ధనువు సంధానించు నాతండుగా
    బాత్రుం డంచును సీత నిచ్చుటకు సంభావించితిన్.."
    (రామాయణ కల్పవృక్షం బా. కాం. ధనుష్ఖండం..285)
    ఎందరో రాకుమారులు ప్రయత్నించి విఫలురైనారు. వా రిట్లా భావించసాగినారు.
    "జనకు డిలా ప్రకటిస్తాడా! మమ్మలను మించిన పరాక్రమవంతులు లేరు కదా! ఇంకెవ్వరూ యీ ధను వెత్తలేరు. ప్రయత్నించి భంగపడుతారు. పరాభవింపబడినట్టు భావిస్తారు. వారు జనకునిపై దండెత్తుతారు. కొద్ది సేపట్లో సభాప్రాంగణమంతా రక్తసిక్తమై పీనుగుల పెంట అవుతుంది. పెండ్లి విఫల మౌతుంది. ఇదంతా చూడ ముచ్చటైన ప్రేత భూమి ఔతుంది."
    ఇదీ పద్య భావం.
    తర్వాత వా రనుకున్నట్టే రాజు లంతా కుమ్మక్కై దాడిచేయగా జనకు డొక్క సంవత్సరకాలం ఓపికపట్టి విధిలేక దేవతల నర్చించి బలోపేతుడై చివరకు వారల నోడించి పారద్రోలినాడు.
    ఇది శివధనుర్భంగానికి ముందు జరిగిన కథ.
    పలుము = శబ్దం వెలుపలకు రాకుండా పెదవులాడించు.. గొణుక్కొను..
    (పాలమూరు మాండలికం)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *శివ ధనుర్భంగము*

    అది జానకీ దేవి యపురూప మగు స్వయం
    వర, మందు జనకుండు ప్రకటనమ్ముఁ
    గావించె "నెవ్వరేఁ గాని యీ శివ ధను
    స్సెక్కిడుదురొ వారినే వరించు
    సీత.." యనంగానె ప్రీతితో యత్నించి
    విఫలురై రెందరో వీర మణులుఁ..
    గొంద రెత్తగ లేక కూలిరి.. కుందిరి..
    కొందరేమో పల్ముకొనిరి యిట్లు..
    "కినిసి రాజలోకం బెల్ల జనకుమీద
    విరుచుక పడనున్నది. స్వయంవరము గాదు.
    ఇదొక వల్లకాడే!.. ఇదియె విఫల మగు
    పెండ్లి..చూపులకుం దగుఁ బ్రేతభూమి"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    3.02.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  43. సుందరోద్యాన మందిర శోభలందు

    జనులు, నగ శిఖరాగ్రాల. జంతుతియు,

    ధరణి గాఢాంధ చారులౌ దయ్యములకు,

    పెండ్లి చూపులకుందగు బ్రేత భూమి.

    రిప్లయితొలగించండి