27, ఫిబ్రవరి 2020, గురువారం

సమస్య - 3293 (కంటకములున్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కంటకములున్న పాన్పు సుఖంబునిచ్చు"
(లేదా...)
"పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు కంటకపూర్ణమైనచో"

48 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    తరచుగ నిల్లు జేరుచును తంటలు పెట్టుచు రోజురోజునన్
    కరచుచు నల్లుడిన్ సతము గారము చేయగ కూతురిన్ సదా..
    మురియుచు పండుగన్ కొనగ ముద్దులు మీరుచు నత్తగారికిన్;...
    పరమ సుఖంబు నిచ్చుఁ గద;...పానుపు కంటకపూర్ణమైనచో

    రిప్లయితొలగించండి
  2. మంటబుట్టించు నొడలంత మనుజునకును
    కంటకములున్న పాన్పు;సుఖంబునిచ్చు
    మల్లెపూవుల దాల్చిన మగువతోడ
    పంచుకొన్నట్టి మెత్తని పాన్పు నిజము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కరకగు నస్త్రసంచయము కాయమునంతయు నింపివేయగా
      వరమవ నిచ్ఛమృత్యువట పార్ధుడుగూర్చిన బాణతల్పమున్
      తరగని ఙ్ఞానసంపదను ధర్మజుకున్ వివరింప తాతయై
      పరమ సుఖంబు నిచ్చుగద పానుపు కంటకపూర్ణమైనచో!
      తాత=తాత,బ్రహ్మ

      తొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    విరివిగ బూది మెత్తుచును వేషము వేయుచు నంగసాధుగా
    మురియుచు సంగమందునను ముచ్చట మీరగ కుంభమేళలో
    వరములు కోరి స్వర్గమున భంగును త్రాగెడు ఫేకు యోగికిన్
    పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు కంటకపూర్ణమైనచో

    రిప్లయితొలగించండి
  4. నల్లి కుట్టిన సమయాన వెల్లి విరిసె
    ప్రేమ కొపరంపు కవులకు ప్రియము గాను
    సతిని హత్తుకు పోవగ మతియె లేక
    కంట కములున్న పాన్పుసు ఖంబు నిచ్చు

    రిప్లయితొలగించండి
  5. నిండు నాలుగు దినముల నిద్ర లేమి
    సడలి , తీరిక దొరికిన సమయ మందు
    కంటకములున్న పాన్పు సుఖంబునిచ్చు
    నిద్ర సుఖము నెరుగదన నిక్కమదియ

    రిప్లయితొలగించండి
  6. లసదనంగవిలాసజాలమునజిక్కి
    రసమ యాలింగనానంద రతులవంగ
    రక్కొను మిథున పులకాంకు రంబులనెడు
    కంటకములున్న పాన్పు సుఖంబునిచ్చు"

    రక్కొను : కలుగు

    రిప్లయితొలగించండి
  7. ( సంగ్రామరంగంలో శరతల్ప గతుడైన
    భీష్ముడు శ్రీకృష్ణునితో )
    అరమరలేని మాటలను
    మాధవ ! పల్కెద నాలకింపుమా !
    కరమరుదైన జీవితము
    గాంచితి నెంతయు కాలమీ భువిన్ ;
    శరములశయ్య నాకునిడె
    సన్మతి ; మన్మడు ; పార్థు డిట్టులన్ ;
    బరమసుఖంబు నిచ్చుగద !
    పానుపు కంటకపూర్ణమైనచో .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. " అరమర లేని మాటలు మురాంతక ! " అని చదువ మనవి.
      యతివిషయం గుర్తుచేసి సరిచేసిన శంకరార్యులకు 🙏

      తొలగించండి
  8. పెరిగిన పొట్ట బట్టతల పీలగ వక్షము పాచి దంతముల్
    మురిగిన వస్త్ర సంచయము ముక్కున చీమిడి మెల్ల కన్నులై
    సరసకు జేరి కోర, సుఖ సాగర మన్మథ భావమబ్బునే?
    పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు కంట 'క' పూర్ణమైనచో!!

    క = మన్మథుడు
    కంట 'క' పూర్ణమైనచో = కంటికి మన్మథుడు వలె కాన వచ్చిన

    రిప్లయితొలగించండి


  9. నీరుగారిబోవు మనిజుని బలువిడియు
    కంటకములున్న పాన్పు సుఖంబునిచ్చు
    మైక మున్ను తా నెరుగక మానసమ్ము
    చింతయున్ గాంచు విడువక చిక్కువడుచు


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. సరఘకు కన్ను గప్పి సరసంబగు తేనెలపట్టు బట్టుచున్
    బరుగున వచ్చి యింటికి కవాటము మూయుచు మంచమెక్కి తా
    నురుగతి బిండి చేకొనుచు నుండెడి వానికి దానిమాధురుల్
    పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు కంటక పూర్ణమైనచో

    పానుపుకు+అంటక

    రిప్లయితొలగించండి
  11. అరయ కష్టాలె కసరత్తు లనిరి బుధులు
    రాపిడి కెపుడు గురిచేసి రాటు దేల్చు
    పూలు కాకయే మెత్తని పూలవంటి
    "కంటకములున్న పాన్పు సుఖంబునిచ్చు"
    **()()**
    { The bed should not be too smooth but a bit rough }

    రిప్లయితొలగించండి
  12. కంటికి నిదుర దూరమౌ కష్టములను
    కంటకము లున్న,పాన్పు సుఖంబు నిచ్చు
    ననుట వాస్తవంబైనను నార్తి నిండి
    నట్టి వారికసాధ్యమౌ నవని యందు.

    రిప్లయితొలగించండి
  13. తాను గోరిన నెచ్చెలి దయను చూపి
    యింట నొంటరినంచు నాయింతి పిలిచి
    సంప్రయోగము గోరిన సమయమందు
    కంటకములున్న పాన్పు సుఖంబునిచ్చు.

    రిప్లయితొలగించండి
  14. పాదము లెపుడు నడవక బాధ నిడును?

    తెల్పు మింకొక పేరును తల్పమునకు,

    పడతి పతికేమి నిచ్చును పడక టింట?

    కంటకములున్న,పాన్పు,సుఖమ్మునిచ్చు

    రిప్లయితొలగించండి
  15. కంద మూలాలె జిహ్వకు కమ్మనౌను
    విషమె పీయూషమై మారు వింత గాను
    యోగనిద్రలో నుండెడి యోగులకిల
    "కంటకములున్న పాన్పు సుఖంబునిచ్చు"

    రిప్లయితొలగించండి
  16. నిరయసమానమై నిఖిలనిర్భరవేదన లంద జేయు సం
    సరణము, చిల్లులుం కఠినసాయకఘాతమొనర్చు నల్లులన్
    వరలిన మంచమై యటుల భార్యయు బిడ్డలతో ననిర్వచః
    పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు కంటకపూర్ణమైనచో.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  17. .... శంకరాభరణం....
    27/02/2020.... గురువారం

    సమస్య.
    *******
    "పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు కంటకపూర్ణమైనచో

    నా పూరణ. చం.మా.
    ** *** *****
    తరలెను బుట్టినింటికిని దారయె యాషడ మాసమందునన్

    విరహము దాళలేక కడు వేదన జెందెను ప్రాణనాథుడే

    పరుగున నత్తయింటికిని భార్యను గూడగ చాటుగా జనెన్

    పరమ సుఖంబు నిచ్చు గద పానుపు కంటకపూర్ణమైనచో!

    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి


  18. పరిమళమొప్ప గా మరియు ఫాండము నిండుగ భోజనమ్ముతో
    పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు! కంటకపూర్ణమైనచో
    గురువర నిద్రరాదు గొణుగుల్ సణుగుల్ విపరీతమై ప్రభా
    కరుడరు దెంచు వేళ యిక కష్టము మీరగ నిద్రవచ్చుగా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. మైలవరపు వారి పూరణ

    హరిపదరక్తులై యహరహమ్మును మున్గి తపస్సమాధిలో
    పరమమునెంచునట్టి మునివర్యులకేల సుఖంబు?., లెంచనో...
    గిరములు కందమూలములు., కేలుపధానము., వారికిద్ధరన్
    పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు కంటకపూర్ణమైనచో !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో పూరణ..

      సరసత సుంత లేని సతి , జ్ఞాన విహీనుడు వారసుండు , కూ..
      తురు గన భర్తృహీన , కులదూరుని సేవ , కుభోజనమ్మిలన్
      వరుసగ దుఃఖహేతువులు! వాని భరింపగ గల్గువానికిన్
      పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు కంటకపూర్ణమైనచో !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మిత్రుని హితబోధ😃🙏

      ఎరుగక వంగకాయలనదే పనిగా భుజియించితీవు! దు..
      ర్భరముగ బుట్టెనీ దురద! బాధ భరింపుము., వీపు గోడకున్
      బరబర గీకుచుండుమనివార్యము., రే బవళించుమీ గతిన్
      పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు కంటకపూర్ణమైనచో !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

    3. దురదస్య దురదః ముక్కు దురదః :)


      జిలేబి

      తొలగించండి


  20. సరసపు మాటలన్ విసిరి సన్నిధి పోవలదంచు త్రోయుచున్
    మరిమరి గోముగా ముఖము మాటికిమాటికి త్రిప్పి త్రిప్పకన్
    పరిపరి రీతులన్ గృహిణి పామిడిముక్కదె గీరగా యెదన్,
    పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు, కంటకపూర్ణమైనచో!



    నారదా!
    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. మిత్రులందఱకు నమస్సులు!

    [కురుపాండవ సంగ్రామమున నేలకొరిగిన భీష్ముఁడు, తాను స్వచ్ఛంద మరణము నందునంత వఱకు శయనించుటకై యంపశయ్యను నిర్మింపఁజేయుమని శ్రీకృష్ణునిఁ గోరిన సందర్భము]

    "సరవినిఁ గృష్ణ! చూడ, రథ సప్తమి పిమ్మట వచ్చునట్టి వా
    సరమున నే యదృచ్ఛమృతి సన్మతి నందెద! నంపశయ్య నే
    ర్పఱుపఁగఁజేయుమయ్య యిట ఫల్గునుచే! శయనింప నా కిఁకన్

    బరమ సుఖంబు నిచ్చుఁ గద, పానుపు కంటకపూర్ణమైనచో!"

    రిప్లయితొలగించండి
  22. నిద్ర యొసఁగును జనులకు నిర్మలంపు
    శక్తి పనుల నిర్వహణ ము చక్క బరచ
    వలయు విశ్రాంతి యల సి న వారి కి ల ను
    కంట కము లున్న పాన్పు సుఖంబు నిచ్చుఁ

    రిప్లయితొలగించండి
  23. గోర్లు దురద నుపశమింప గోరు వారి
    యాయుధమ్ములుదురదాకునంటువాని
    దురదకేమందుబాగుబాగరయకఱకు
    కంటకములున్న పాన్పు సుఖంబునిచ్చు"

    రిప్లయితొలగించండి
  24. కొరతనువేసియేసునునకుంఠితలక్ష్యముజేరునట్టుగా
    పరమిహమష్టకష్టములబాధసహించప్రవక్తవక్తయౌ
    నరుగుడిశిల్వవేయుడిసమాదరణంబుజెరూసలంబులో
    బరమ సుఖంబు నిచ్చుగద పానుపు కంటకపూర్ణమైనచో

    రిప్లయితొలగించండి
  25. చంపకమాల
    తరిమెడు కష్టముల్ చెలఁగ దైవ శరణ్యము సన్నగిల్లగన్
    వెఱపును బాపుచున్ హృదయ వేదనఁ దీర్చెడు భార్యతోడుగన్
    బరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు, కంటకపూర్ణమైనచో
    తెరవు నమాత్యుఁ బోలి తగు తేఁకువ గూర్చితొలంగ జేయఁగన్

    రిప్లయితొలగించండి
  26. వెన్ను నొప్పి మానక మది వేదనాయె |
    చీని వైద్యులు సూచించె చిట్క యొకటి |
    పడక నాక్యు ప్రెషరనెడి పధ్ధతిగను |
    "కంటకములున్న పాన్పు సుఖంబునిచ్చు"

    రిప్లయితొలగించండి
  27. తేటగీతి
    "మనిషి జన్మ నరకమౌను మనసు తనది
    కానిచో" నని యూరటఁ గలుఁగఁ బాడి
    తరుణి తొలగించఁగ బ్రతుకు తెఱవునందు
    కంటకములున్న పాన్పు సుఖంబునిచ్చు

    రిప్లయితొలగించండి
  28. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "కంటకములున్న పాన్పు సుఖంబునిచ్చు"

    సందర్భము:
    ధ ర్మావిరుద్ధం భూతేషు
    కామోఽస్మి భరతర్షభ.. అన్నాడు గీతాచార్యుడు. జీవులయందు ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని నేను.. అని.. అంటే ధర్మబద్ధమైన కామం.. తన స్వరూపమే.. అని..
    కామానికి కట్టుబాట్లు సమాజశ్రేయస్సును దృష్టిలో నుంచుకొని ఏర్పరచబడినవే! వాటిని త్రోసివేస్తే సమాజ శ్రేయస్సుకు సహకరించినట్టు కాదు గదా!
    ధర్మం విలక్షణమైనది. దేశకాలాతీతమయినది. శాశ్వతమైనది. తాము నడచుకునే తీరే ధర్మం అయి తీరా లని పట్టుబట్టటం.. రాక్షసత్వమే కాని మరొకటి కాదు.
    ధర్మానికి కామానికి సంఘర్షణ ఏర్పడినప్పుడు ధర్మానిది పైచేయి అయితే అతడు దివ్యత్వానికి సమీపంగా వెళుతాడు. కామానిది పైచేయి ఐతే రాక్షసత్వం కమ్ముకుంటుంది.
    అధర్మమైన కామంతో సతమతమౌతున్న జీవునికి వ్యర్థమైన ఆరాటం తప్ప నిజమైన సుఖ మేది? అలసిపోయి నిదురించా లని పాన్పుపై చేరితే అందులో ముళ్ళుండి మాటిమాటికీ కుచ్చుకుంటుంటే నిద్ర ఎలా పట్టుతుంది?
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *ధర్మ కామము*

    ధర నధర్మ కామమునందుఁ దగులుకొన్న

    జీవితంబున సుఖ మేది రావణునికి?

    ఇవ్విధినిఁ బల్కవచ్చునే యెవ్వడైన?

    "కంటకము లున్న పాన్పు సుఖంబు నిచ్చు"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    27.02.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  29. తే గీ

    పగలు చెమటోడ్చి కష్టపు పనులు జేసి
    ఒళ్ళు యలసి పోయి నొకింత నోప లేక
    కటిక నేలను కంటెను కనుగొన నిల
    *"కంటకములున్న పాన్పు సుఖంబునిచ్చు"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరదా పూరణ యత్నం 🙏🙏

      *తే గీ*

      కోరికలు తెలియక తను కోపమాయె
      సరసమునొదిలి పాన్పున సర్రుమనె డి
      నిటుల నుండెడి నొక్కయు నింతి కన్న
      *"కంటకములున్న పాన్పు సుఖంబునిచ్చు"*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*

      తొలగించండి
  30. వరముగ దోచుగా బడలి వాలిన వేళల ప్రాణి కోటికిన్
    పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు; కంటకపూర్ణమైనచో
    విరి శయమైన నేమి యది వెన్నెల రాత్రియు నైన నేమి యా
    సిరి గల వానికైన దరి జేరదుగా సుఖమెంత మాత్రమున్

    రిప్లయితొలగించండి
  31. చం:

    అరయగ విద్య ఛాత్రుడుగ నాశ్రయమొంద కఠోర పూనికన్
    నెరపగ గొప్ప కార్యముల నెన్నగ నొప్పునఖండ పాటులన్
    కరకున యుండుటే సకల కార్యము లందున సిద్ధి గాంచుటౌ
    పరమ సుఖంబు నిచ్చు గద పానుపు కంటక పూర్ణ మైనచో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  32. సురభిని గ్రోలినీవిటుల చోద్యముగా పలుకంగనేలరా
    సరిసరి నీదు మాటలిక చాలును హెచ్చుగ వాగుబోకుమా
    ధరుణము కాదు, సత్యమిది తప్పుడు మాటలు మాను మెవ్విధిన్
    బరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు కంటకపూర్ణమైనచో

    రిప్లయితొలగించండి
  33. పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు కంటకపూర్ణమైనచో!
    చురచురలాడు భార్య వినుచుండగ కేకలు పెట్టితిన్, అహో
    పరపితి పూలబాణములు పాతుకొనెన్ యెదముళ్లనేకమై
    పరిణతి తోడ తాలిమిడి ప్రాయము పంచిన సౌఖ్యమేగదా౹౹

    రిప్లయితొలగించండి
  34. నిదురరానీయదెప్పుడు నీరజాక్ష!
    కంటకములున్నపాన్పు,సుఖంబునిచ్చు
    నెల్లవేళలరామునియుల్లమలర
    భజనజేయునరులకిల భవ్యముగను

    రిప్లయితొలగించండి
  35. దిన కృత నిజ కార్య శ్రమ జనిత దుర్భ
    ర క్లమావృత మాన వార్భకుల కెంచ
    నుత్కట నర విపత్కర మత్కుణ హర
    కంటకములున్న పాన్పు సుఖంబునిచ్చు


    చిరముగ నున్న దీ పఱుపు శ్రేయము లెన్నొ చెలంగె నంచు బా
    గరి వచియింప కిత్తరి సుఖమ్ములు ముఖ్యము మానవాళికిన్
    వర మగు నన్య సంస్తరము పద్మదళేక్షణ నిద్రవోవగం
    బరమ సుఖంబు నిచ్చుఁ గద, పానుపు కంటకపూర్ణమైనచో

    రిప్లయితొలగించండి
  36. సమస్యాపూరణం:

    "పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు కంటకపూర్ణమైనచో"

    తరుణినిపెళ్ళియాడిఫలితంబుగ బాధ్యతమోయజాలవే?
    యరుగునతిష్టవేసిగృహమం దుననుందువెమౌనివైపరా
    త్పరునిగురించిజేయుముతపంబునమోఘమనంతమైనతత్
    పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు కంటకపూర్ణమైనచో

    గాదిరాజు మధుసూదన రాజు
    ----------------------------------------
    వివాహము వద్దు అంటున్న ముదిరిన బ్రహ్మచారి తో .బాధ్యత గలిగిన.బ్రాహ్మణుడైన బావ గారు ..నిష్టూరంగా...

    రిప్లయితొలగించండి
  37. పరుపుయుతంబునైవిరులవాసనగుప్పుమనంగనుండుచో
    పరమసుఖంబునిచ్చుగదపానుపు,కంటకపూర్ణమైనచో
    వెరచుదురందరచ్చటకువేగమయేగుటకెట్టివేళలన్
    వరమదిజేయనెప్పుడునుబానుపునుంచనుసున్నితంబుగా

    రిప్లయితొలగించండి
  38. విరహము తాళలేని సతి ప్రేమను జూపుచు సైగజేసినన్
    మురిపము తోడ వల్లభుడు భోగగృహమ్మును జేర స్వర్గమై
    పరమ సుఖంబు నిచ్చుఁ గద, పానుపు కంటకపూర్ణమైనచో
    సరసము లాడ జేరరు సుచక్షణు లెవ్వరు తెల్సుకొమ్మికన్.

    రిప్లయితొలగించండి
  39. అందరికీ నమస్సులు🙏
    ఈ రోజు సమస్యకు నా పూరణ...

    సతతము నసపెట్టి సణుగు సతిని తోడ

    హంస తూలికా తల్పమౌ నంపశయ్య

    వళ్ళు హూనమవ యలసి వచ్చు పతికి

    *కంటకములున్న పాన్పు సుఖంబు నిచ్చు*

    ధన్యవాదములు🙏

    రిప్లయితొలగించండి
  40. సమస్య:
    "చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"

    కందము

    చెలగన్ సమస్య నేడిట
    చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే
    యిలననసీతాదేవియు
    ఝలిపించెన్ పద్యమున్ ప్రశంసింపబుధుల్

    గాదిరాజు మధుసూదనరాజు

    రిప్లయితొలగించండి