2, ఫిబ్రవరి 2020, ఆదివారం

సమస్య - 3269 (తోడ్పడలేదు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్"
(లేదా...)
"తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్"

68 కామెంట్‌లు:


  1. (నడిరేయి + ఆటవిడుపు) సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ముడ్పుగ జేయబోవగను పూరణ మెట్టులొ నేటి రేయినిన్
    కడ్పది కాలెనయ్యయొయొ గద్గద మయ్యెను నాదు కంఠమే
    గాడ్పుల నిచ్చె నా హృదిని గందర గోళపు కైపదమ్మయో:👇
    "తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్"

    గమనిక: "ముడ్పు, కడ్పు, గాడ్పు"
    శబ్దములు ఆంధ్రభారతి నిఘంటువులోనున్నవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మీరు నా బ్లాగును తరచు "వీక్షించుట" నాకు మహదానందంగా నున్నది.

      కంది సారు అడిగారు: "మీ కెలా తెలుస్తుంది?"

      "I have my methods"...like Sherlock Holmes 😊

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఏడ్పులు వద్దు క్లిష్టమగు నిట్టివి ప్రాసల నీయఁబోనికన్'

      తొలగించండి
  2. ఏడ్పడబోదుసంగరము యేలికదోచినరీతినెప్పుడున్
    గాడ్పులవీచు భాస్కరుడు,గాయముసేయక నూరకుండునా?
    ముడ్పునగట్టి కోరికలమూఢముగానిటు జేయలేననన్
    తోడ్పడలేదు పార్ధునకు,దోచినరీతిన కృష్ణుడెప్పడున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సంగరము+ఏలిక' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  3. నేటి శంకరా భరణము సమస్య

    తోడ్పడ డర్జునునకు హరి దోచిన రీతిన్

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


    శ్రీ కృష్ణుని సాయము గూర్చి రాజరాజు తాను చేసిన ఘనకార్యము తన మామ శకునికి తెల్పు సందర్భం


    కోరితి నప్పుడా గోపాలుని భటుల
    నివ్వమనుచునేను,
    నిజము గాను


    మామా ,తరచి చూడ మనకేల నంద సు
    తుడునొక్కడు రణమున్,
    బుడతడు కడు

    ముదముగ కోరెను మురహరి నొక్కడిన్ ,
    సమరము చేయడు,సతతము నత

    డని లోన తోడ్పడ డర్జును నకు, హరి
    దోచిన రీతినా దురము లోన



    సాయమును చేయు చుండును సరస గతిని


    ననుచు పలుకగా , వెర్రి వా డననుచు తల

    పోయు నే నతనిని కోర పురము లోన

    నని సుయోధను డనెను శకుని
    ని గాంచి

    రిప్లయితొలగించండి
  4. ( తన భర్తమరణంతో ఉద్విగ్నహృదయ,
    నిండుచూలాలు ఉత్తర మనోభావాలు )
    ఏడ్పులపాలు జేసెగద
    నిట్లభిమన్యుని తల్లిదండ్రులన్ ;
    వేడ్పుల నెన్ని సల్పితిని
    వీరుని కాంతుని గావుమంచెదన్ ;
    మోడ్పడియుంటి నింక గన
    బోవుచు చిట్టి నిసుంగు ; నెట్టులో ?
    తోడ్పడలేదు పార్థునకు ;
    దోచినరీతిని గృష్ణు డెప్పుడున్ !
    (వేడ్పులు - ప్రార్థనలు ; మోడ్పడి - కొయ్యబారి )

    రిప్లయితొలగించండి


  5. తోడ్పడ డెవ్వరికిన్ తను
    తోడ్పడ డాతడు జిలేబి తొందరపడగా!
    తోడ్పడు తనదగు కైవడి,
    తోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. కంది వారివ్వాళ సెలవా :)


    తోడ్పడడాతడౌ మనము తొందర చేయగ తోడ్పడే సఖీ
    తోడ్పడడే! ప్రధానముగ తొయ్యలి కావలె మేల్చరిత్రముల్!
    తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్
    తోడ్పడినాడు ధర్మమదె తుండుపడంగ సమంజసమ్ముగా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దుష్కర్మ ప్రాస వస్తే వారు సెలవే

      తొలగించండి

    2. సవరించినది

      తోడ్పడడాతడౌ మనము తొందర చేయగ చేయగా సఖీ
      తోడ్పడడే! ప్రధానముగ తొయ్యలి కావలె మేల్చరిత్రముల్!
      తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్
      తోడ్పడినాడు ధర్మమదె తుండుపడంగ సమంజసమ్ముగా!


      జిలేబి

      తొలగించండి
    3. మీ పూరణ బాగుంది. అభినందనలు.
      సెలవేమీ లేదండీ... షెడ్యూల్ చేసిన వరుసలో అది అలా వచ్చేసింది.

      తొలగించండి


  7. సలహా యిచ్చిన దెవరు ? శకునియా ?


    అనుమానమేల దుర్యో
    ధన!కృష్ణుని సాయమడుగు తా తోడ్పడఁ డ
    ర్జునునకు హరి దోఁచిన రీ
    తి నుడివెదన్ ఖచ్చితమ్మిదియె వెడలుమికన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వా ప్రాస మార్చారు ఎలాగైనా జిలేబి పాకము జిలేబే

      తొలగించండి
    2. సమస్యాపాదాన్ని స్థానభ్రంశం చేసి ప్రాస క్లేశాన్ని తప్పించుకొన్న మీ పూరణ ప్రశంసనీయం. అభినందనలు.

      తొలగించండి
  8. పాడ్పడితివేమి తెలియగ ?
    తోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్
    గాడ్పు పలుకులెగద , యిటుల
    తోడ్పడుటయె విధిగ దలచు ధ్రువుననదగునే !

    రిప్లయితొలగించండి
  9. తోడ్పడ వరమిచ్చె నరుకు 
    తోడ్పడ తలచెను  సతతము దొసగులు లేకన్ 
    తోడ్పడె ధర్మము వైపుకె 
    తోడ్పడ డర్జునునకు హరి తోచిన రీతిన్ 

    రిప్లయితొలగించండి
  10. తూడ్పదలచు కౌరవులకు
    తోడ్పడఁ, డర్జునునకు హరి దోఁచిన రీతిన్
    తాడ్పాటందించి యతని
    చేడ్పాటును ద్రుంచె గదర శ్రీకృష్ణుండే.

    రిప్లయితొలగించండి
  11. కీడ్పడునేమి ధర్మమున క్రిందగునేవిధి న్యాయమచ్చటన్
    చేడ్పడునేమి సత్యమును క్షేమము గూలి ప్రజాసమూహ మ
    ట్లేడ్పున నుండునేమి సుఖియించక దీనికి కారణంబుపో
    తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్"

    రిప్లయితొలగించండి
  12. ఒడ్పుగ నాయుధమును గొని
    తోడ్పడ డర్జునునకు హరి, తోచినరీతిన్
    గడ్పగ నపాయముల దన
    కడ్పునబుట్టిన శిశువుగ కాపాడెగదా!

    రిప్లయితొలగించండి
  13. తూడ్పగ బాండుపుత్రులను దుష్ట చతుష్టయ పన్నకమ్ములన్
    దూడ్పుచు ధర్మమున్ నిలుప దుష్టులు కౌరవ మూక కెప్పుడున్
    దోడ్పడలేదు, పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁడెప్పుడున్
    దోడ్పడుచున్ జయమ్మునకు దోహదమందగ జేసె చక్రియే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగుంది. అభినందనలు.
      '...చతుష్టయ పన్నకమ్ములు, కౌరవ మూక' అనడం దుష్టసమాసాలు.

      తొలగించండి


  14. ఈ వారపు ఆకాశవాణి‌ సమస్య తెలుపగలరు‌

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. కళ్యాణ్ చక్రవర్తిఫిబ్రవరి 01, 2020 8:03 AM
      వచ్చే వారానికి ఆకాశవాణి సమస్య....
      *అన్నను పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్*
      మీ పూరణలను గురువారం సాయంత్రంలోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
      padyamairhyd@gmail.com

      ప్రత్యుత్తరం
      ప్రత్యుత్తరాలు

      G P Sastry (gps1943@yahoo.com)ఫిబ్రవరి 01, 2020 8:17 AM

      శంకరాభరణం సమస్య - 2099

      "అన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ"

      తొలగించండి

  15. మైలవరపు వారి పూరణ


    అన్యథా శరణం నాస్తి.. అంటేనే...

    ఊడ్పగలేదు కష్టము మహోజ్జ్వలకారుణికమ్ము కల్గియున్
    గాడ్పుల నెండలం బడుచు కాననసీమ జరించువేళ., కై..
    మోడ్పుల నీవె దిక్కన విముక్తిని జూపెను! మ్రొక్కకున్నచో
    తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  16. కీడ్పడ కున్నను హాలుడు
    తోడ్పడ డర్జునునకు, హరి దోచిన రీతిన్
    తోడ్పడె బాల్యము నుండియు
    చేడ్పాటులు కలిగినపుడు చెంతనె మనుచున్!!!

    రిప్లయితొలగించండి
  17. ఈడ్పడు కర్ణుడు రణమున్
    తోడ్పడఁ, డర్జునునకు హరి దోఁచిన రీతిన్
    తోడ్పడునే, మనసిడి కై
    మోడ్పులనిచ్చి వినినంత మోక్షపు గీతన్౹౹

    రిప్లయితొలగించండి
  18. తోడ్ప డె ద ననియు పల్కుచు
    తోడ్పడె సమరాంగ ణ మున దోహద పరుడై
    తోడ్ప డె గద దా నెట్టుల
    తోడ్పడ ర్జునునికి హరి దోచిన రీతి న్

    రిప్లయితొలగించండి
  19. తోడ్పడలేదు దానెపుడు దుష్టులకార్యము జేయు వారికిన్,
    తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్,
    తోడ్పడె దుష్ట శిక్షణకు, దూరము జేయగ పాప భారమున్
    తోడ్పడె ధర్మమున్నిలుపు త్రోవను జూపగ మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  20. తోడ్పాటనునదియుండగ
    దోడ్పడడర్జునునకు హరిదోచినరీతిన్
    దోడ్పడలేదనియన,కై
    మోడ్పులనేనిడుదుసామి!మౌనముతోడన్

    రిప్లయితొలగించండి
  21. ఏడ్పులు సెలరేఁగెఁ బుడమి
    కడ్పున దారుణ మభీతి కౌరవ జనులే
    పూడ్పఁగ నభిమన్యు నహో
    తోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్


    ఉడ్పుమ వాసుదేవ యని యుద్ధము బంధు గణమ్ము తోడఁ జే
    మోడ్పున నెంత వేడినను మూర్ఖతఁ బొందఁగఁ జిత్త తాపపున్
    గాడ్పు ఘనమ్ముగా ననినిఁ గయ్యము మానుట కింత యేనియుం
    దోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్

    రిప్లయితొలగించండి
  22. తోడ్పడెఖాండవమందున
    తోడ్పడెయుద్ధమునరథము ద్రోలునెపమునన్
    తోడ్పడుకర్జముకానిచొ
    తోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కానిచొ అని హ్రస్వాంతంగా వ్రాయరాదు.

      తొలగించండి
  23. తోడ్పడలేదుపార్ధునకుదోచినరీతినిగృష్ణుడెప్పుడున్
    దోడ్పడలేద!మీకెఱికె? తోడ్పడకుండినయుద్ధభూమిలో
    నేడ్పులువచ్చెగారణమునేలికలందఱికన్నుమూతలే
    తోడ్పడెగాదెపార్ధునకుతొయ్యలిద్రౌపదిచెల్లికావుతన్

    రిప్లయితొలగించండి
  24. తోడ్పడెనందనందనుడు తోడుగపార్థునకన్నిరీతులన్
    చేడ్పడుకాలమందున సచేతనుడౌకరుణాంతరంగుడై
    తోడ్పడె పాండునందనుల, దోసముకాదొకయిట్టులన్నచో
    తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "దోసము కాదొకొ" టైపాటు.

      తొలగించండి
  25. తోడ్పడెఁజంపఁసైంధవునితోడ్పడెభీష్మునిద్రోణుఁజంపగా
    నూడ్పఁగురుప్రకాండులనుయోధులకర్ణసుయోధనాదులన్
    తోడ్పడెముందుయోచనలతోడఁబ్రయత్నఫలమ్ముతోడనే
    తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  26. నా పూరణ 🙏🙏
    *కం||*

    తోడ్పడె గద కృష్ణుడపుడు
    తోడ్పడె గద నర్జునునకు దోచిన రీతిన్
    తోడ్పడు నని చెప్ప నెటుల
    *"తోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్"*

    రిప్లయితొలగించండి
  27. హరి తనకు తోచిన రీతిననే తోడ్పడుతాడనే భావన లో...

    కం.

    తోడ్పడు నెపుడును గృష్ణుడు
    వీడ్పడడే వేళ నైన విధి యెట్లున్నన్
    కాడ్పడనీయడు పార్థును
    తోడ్పడ డర్జునునకు హరి దోచిన రీతిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి

  28. తోడ్పడె పాండుపుత్రులకు దోరపుబంథువు వాసుదేవుడై
    తోడ్పడె రాజమధ్యమున దొయ్యలిద్రౌపది కన్నరూపుడై
    తోడ్పడె ధర్మసాధనకు దుష్టులజంపగ పార్ధసారధై
    తోడ్పడ నన్నివేళలను తొందరపాటగు బల్కనిట్టులన్
    తోడ్పడలేదు పార్థునకు తోచినరీతిని గృష్ణుడెప్పుడున్

    తోడ్పడలేదు పార్థునకు తోచినరీతిని గృష్ణుడెప్పుడున్
    ఒడ్పుగ కష్టనష్టముల నోర్మిభరించుచు ధర్మవీరుడై
    ఊడ్పగ క్షత్రియాధముల నోటమిలేకయె సవ్యసాచియై
    గడ్పగ కాలమంతయును కామునిదండ్రికి కేలుమోడ్చి దా
    దోడ్పడె పార్థసారధిగ ద్రుంచగ దుష్టుల ధర్మరక్షకై !

    రిప్లయితొలగించండి
  29. ఉత్పలమాల
    తోడ్పడె మత్స్యయంత్రమును ద్రుంచఁగ ద్రౌపది చేయిపట్టగన్
    దోడ్పడె నా సుభద్ర మదిఁదోచెడు భర్తగ నిల్ప ద్వారకన్
    దోడ్పడె బాధ్యతన్ దెలియ, దుష్టులఁ గూల్చక పోరు వీడగన్
    దోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్

    రిప్లయితొలగించండి
  30. కందం
    తోడ్పడి నరనారాయణు
    లూడ్పగ శ్రమతో నధర్మముర్విని సఖులై
    జడ్పున ననివీడెదననఁ
    దోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్

    రిప్లయితొలగించండి
  31. ఏడ్పు ముఖమ్ముతో రణము హేయమటంచును వీడశస్త్రముల్
    తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్
    తోడ్పడు శిష్టరక్షణకు దుష్టుల ద్రుంచగ యుద్ధమందు కై
    మోడ్పులు వానికెప్పుడును మోహము ద్రుంచును మోహనాంగుడై

    రిప్లయితొలగించండి
  32. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "తోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్"

    సందర్భము: సీతా రాముల కళ్యాణం జరిగినాక మిథిలనుండి తిరిగి వస్తున్న రామాదులకు పరశురాము డెదురైనాడు. అందరూ భయమందినారు. వసిష్ఠాది మునులు తమలో తామిట్లు మాట్లాడుకొనిరి.
    "కశ్చిత్ పితృ వధామర్షీ
    క్షత్రం నోత్సాదయిష్యతి
    పూర్వం క్షత్రవధం కృత్వా
    గతమన్యు ర్గత జ్వరః
    (బా. కాం.74-22)
    పూర్వం తన తండ్రిని క్షత్రియుడు చంపినాడని కోపించి వారిని పరిమార్చడు గదా! మున్ను క్షత్రియులను వధించి వ్యథ తొలగించుకొనెనే!"
    అంటే మరికొంద రడుగగా కొందరిలా వివరించిరి.
    "కార్తవీర్యార్జునుడు గొప్ప దత్తోపాసకుడు. లోకైక వీరుడు. రావణుని మించిన వాడు. తనకంటె గొప్పవాని చేతిలోనే చనిపోతానని వరం పొందిన వాడు.
    ఒకనాడు తనకూ తన సైన్యానికీ షడ్రసోపేత భోజనం సమకూర్చినది నందిని అనే ధేనువు. అది పరశురాముని తండ్రి యైన జమదగ్ని మహర్షిది. ఆ ఆవు తనకు కావాలని కార్తవీర్యార్జును డడిగితే జమదగ్ని ఈయలేదు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా లాక్కుని వెళ్ళి పోయాడు.
    జమదగ్ని కుమారుడు పరశురాముడు (విష్ణ్వంశ సంభూతుడు) తిరిగివచ్చాడు. ఎవరు నచ్చజెప్పబూనినా వినలేదు.
    "ఇతని అనుభవా లెంత గొప్పవైతే నేం! అవన్నీ తుడిచిపెట్టుకుపోక తప్పదు. ఇతని దుష్టతకు ఏడ్పే మిగులుతుంది (చివరకు)."
    అంటూ కార్తవీర్యార్జునునకు పరశు రాముడు తోడ్పడలేదు. (అతడు చేసిన పనిని సమర్థించలేదు.) (పద్య భావావన్ననుసరించి..)
    యుద్ధ సన్నద్ధుడై బయలుదేరినాడు. కార్తవీర్యార్జునుని సంహరించినాడు."
    కుడ్పు = కుడుపు.. అనుభవం
    తూడ్పు = తుడిచి వేయడం
    దుష్టత = చెడ్డతనం.. (జమదగ్ని మహర్షి ఆశ్రమంలోని ఆవు నపహరించడం)
    అర్జునుడు = కార్తవీర్యార్జునుడు
    హరి = విష్ణుమూర్తి.. పరశురాముడు
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "కుడ్పు లవి గొప్పవైనను
    దూడ్పు మరిక దప్ప దితని దుష్టత కిలలో
    నేడ్పే మిగులు" నటంచును
    దోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    2.02.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి