పాత కాలం తెలుగు పద్యాలలో విరామ చిహ్నాలు లేక "దండాన్వయం" తో చంపి పెట్టేవారు మన తెలుగు మాష్టార్లు. పాత కాలం షేక్స్పియరు డ్రామాలలో కూడా ఉండేవి కాదు. అందుకే రచయితలు నటులకు ప్రక్కన కూర్చొని పలకడం నేర్పించేవారట...
నా పూరణ *** *** *** భర్త తిండిపోతు..ఎప్పుడు తిండికోసం భార్యని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు...వంట నిత్యం వండలేక ఆమె మొగుడు తో కొట్లాడుతూనే ఉంటుంది.. ఆ సంధర్భంగా భార్య ఇలా ఆంటున్నది..
దండముబెట్టివేడెదను దారినియడ్డెసుదీర్ఘకాయమే మండెనుగుండెగొంతుకలు,మార్చగజేసిన వైద్య విద్యతో అండముమానివేసితిని,ఆతృతమానితి వంటకమ్ము, పై తిండినిమానివేయగనె,తీరినదాకలియద్భుతమ్ముగన్.
సందర్భము: "ధిక్ క్షత్రియబలం బ్రహ్మ తేజోబలం బలం" అనుకున్నాడు వశిష్ఠునికి ఓడిన విశ్వామిత్రుడు. తానూ బ్రహ్మర్షి కావాలని *వేయియేండ్లు* తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై *"రాజర్షి వైనా"* వన్నాడు. త్రిశంకుని శునశ్శేపుని కథలు నడిచినవి. మరో *వేయియేండ్ల* తపస్సుతో *"ఋషి"* యైనా విశ్వామిత్రుడు మరింత ఘోర తపస్సు చేశాడు. మేనకవల్ల తపోభంగమై హిమగిరికి వెళ్ళి కౌశికీనదీ తీరంలో *వేయియేండ్లు* తపస్సు చేసి *"మహర్షి"* యైనాడు. దేవతలు రంభను పంపిస్తే "పదివేలయేండ్లు శిలవై యుండు" మని శపించి విశ్వామిత్రుడు కోపానికి లొంగినానని చింతించాడు. తూర్పు దిశకు వెళ్ళి తిండి తినక గాలి పీల్చక *వేయియేండ్లు* ఘోర తపస్సు చేసి విరమించి భోజనానికి సిద్ధమైనాడు. ఇంద్రో ద్విజాతి ర్భూత్వా తం సిద్ధ మన్న మయాచత 65-5 (ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారియై పక్వాన్న మడిగినాడు.) తస్మై దత్వా తదా సిద్ధం సర్వం విప్రాయ నిశ్చితః నిశ్శేషితేఽన్నే భగవా నభుక్త్వైవ మహాతపః 6 న కించి దవద ద్విప్రం మౌనవ్రత ముపస్థితః పక్వాన్నమంతా బ్రాహ్మణుని కీయ నిశ్చయించి సమర్పించి ఏమీ పలుకకుండా అన్నం లేనందుకు తానూ తినక మౌనం వహించినాడు విశ్వామిత్రుడు. (పద్యంలో పేర్కొన బడిన దిదే!) మళ్ళీ *వేయియేండ్లు* కేవల కుంభకంతో తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై *"నీవు బ్రహ్మర్షి వైనా"* వన్నాడు. వశిష్ఠు డా మాట అనాలి అన్నాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు వచ్చి *"బ్రహ్మర్షీ"* అన్నాడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*విశ్వామిత్రుడు*
దీక్ష ముగియంగ నన్నమున్ దినగబోవ
దేవపతి వచ్చి యాకలిఁ దీర్పు మనగ
నతని కిచ్చి విశ్వామిత్రు డపుడు తాను
తిండి మానఁగ.. నాకలి దీరిపోయె
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 5.02.20 -----------------------------------------------------------
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండినడిరేయి సరదా పూరణ:
పండుగ వారమందునను బంధువు లెల్లరు వచ్చిచేరగా
దండుగ సీరియల్సునొహొ దాపున చూడక టీవిలోననున్
వండగ నాయనమ్మ భళి; పస్తలు పిజ్జల జంకుఫుడ్డనన్
తిండిని మానివేయఁగనె; తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభక్తి మీరగ భజనలు ముక్తి కొఱకు
రిప్లయితొలగించండిమనసు నిండగ దేవుని మైక మందు
గగన మంటిన మోక్షము కడుపు నిండె
తిండి మానఁగ నాకలి దీరి పోయె
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
Ketonic Diet సర్వరోగ నివారిణి
రిప్లయితొలగించండిబండగు కాయమేకరగి పల్చని సుందర రూపమేర్పడున్
తిండిని మానివేయగను;తీరినదాకలి యద్భుతమ్ముగ
న్నెండిన పండ్లనేదినగ నెంచుచునందలి పోషకమ్ములన్
నిండగు జీవనమ్మునకు నిత్యము చేయుము యోగసాధనల్
ఎండిన పండ్లు = Dry fruits(బాదామ్ ,పిస్తా వంటివి)
Ketogenic diet
తొలగించండివంటతిప్పలు తీరగ వారిజాక్షి!
తొలగించండియెంచుకోగదె భుక్తిగ నెండుపండ్ల
సన్నబియ్యము పప్పులు సంగమించు
తిండిమానగ నాకలి దీరిపోయె!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిడ్రైఫ్రూట్స్ కూడా తిండే కదా?
ధన్యవాదములు గురువర్యా!పూరణలోని విరుపును మీరు గమనించినట్లు లేదు!పప్పన్నం మానివేసి ఎండిన పండ్లను తింటే ఆకలి తీరినదని నాభావన!నమస్సులు!
తొలగించండివిరుపుతో బాగున్నది పద్యము.
తొలగించండివిరుపుకు మొదటా, చివర, సెమి కోలనులు (;) ఉంచినచో భావము స్పష్టముగా తోచి చదువుటకు తేలిక అవుతుంది.
వంటతిప్పలు తీరగ వారిజాక్షి!
తొలగించండియెంచుకోగదె భుక్తిగ నెండుపండ్ల;
సన్నబియ్యము పప్పులు సంగమించు
తిండిమానగ; నాకలి దీరిపోయె!
పాత కాలం తెలుగు పద్యాలలో విరామ చిహ్నాలు లేక "దండాన్వయం" తో చంపి పెట్టేవారు మన తెలుగు మాష్టార్లు. పాత కాలం షేక్స్పియరు డ్రామాలలో కూడా ఉండేవి కాదు. అందుకే రచయితలు నటులకు ప్రక్కన కూర్చొని పలకడం నేర్పించేవారట...
తొలగించండి
తొలగించండి....వారి కందంలో కూడా ఇటువంటి దోషాలు చాలా ఉన్నాయి! దయచేసి దండాన్వయం చూసుకోకుండా వ్రాయవద్దని అందరికీ మనవి....
https://kandishankaraiah.blogspot.com/2016/06/2067.html?m=1
(పై వ్యాఖ్య కంది సారుది కాదు 😊)
ధన్యవాదములు!మొదటి పూరణలో విరామ చిహ్నమునుంచితిని!
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
భాగ్యనగర్ స్పెషల్:
కొండొక ఢాబనున్ జనుచు కుమ్ముచు లాగగ కోడి బిర్యనిన్;...
పండుగ పర్వమున్ గనక వాడుక వీడక దోసపప్పునున్
వండుచు మిర్చి బజ్జిలను వడ్డన చేసెడి యత్తగారిదౌ
తిండిని మానివేయఁగనె;..తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిOh my juicy crispy mouth watering dishes what have you all done to us ! the more we eat the more hungry ghosts we are :)
కాల మహిమ నెటుతిరుగ కన్నులట క
నబడె తినుబండముల దుకాణములు! కృష్ణ!
తిండి తిండికి నడుమ కతికెడు చిన్న
తిండి మానఁగ నాకలి దీరిపోయె
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తినుబండములు'? బండారములు కదా?
తొలగించండితినుబండములు : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
Eatables.
తినుబండారపువస్తువులు provisions.
ఆంధ్ర భారతి ఉవాచ :)
జిలేబి
దోస దినగమేనెల్లను దురదలొచ్చె
రిప్లయితొలగించండితిండి గొనక కనలితి నే దివసమెల్ల
భిషగు డొసగిన విరుగుడు పిదప గొనగ
తిండి మానఁగ నాకలి దీరిపోయె"
తిండి : మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.)
గోకుడు; దురద.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(దుర్యోధనుని దుర్బోధ తలకెక్కిన దుర్వాస
రిప్లయితొలగించండిమునీంద్రుడు మధ్యాహ్నవేళలో శిష్యత్రిశతి
సమేతుడై పాండవులవద్దకు భోజనానికై
వచ్చి కృష్ణమాయతో కడుపునిండి దొర్లుతూ
ఆయాసపడ్డాడు .)
ఎండలు మండుచుండినను
నీర్ష్య సుయోధను డంపగా మహో
ద్దండుడు వచ్చె పాండవుల
ధర్మము చూడగ దూర్వసుండదే !
అండగ నున్న కేశవుని
యాంతరశక్తిని పొట్టలుబ్బగన్ ;
దిండిని మానివేయగనె ;
తీరినదాకలి యద్భుతమ్ముగన్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'దూర్వసుడు'?
పాండు పుత్త్రుల నవమాన పరుప వచ్చి
రిప్లయితొలగించండినట్టి దుర్వాస ఋషికి శిష్యగణమునకు
కృష్ణ మాయచే వింతగ నెల్లరకును
తిండి మానఁగ నాకలి దీరిపోయె!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఎండకు వానకున్ దడిసిరెన్నొ దినంబులు., స్వీయచిత్తమం...
దుండెడి లౌకికార్థములనొక్కటి యొక్కటిగా త్యజించుచున్
బండిన భక్తి భుక్తి యను భావన జేయు మునీశ్వరాళికిన్
తిండిని మానివేయఁగనె తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరోగ బాధలు శమియించు వేగముగను
రిప్లయితొలగించండివైద్య సలహాలు పాటించి వ్యర్థపు చిరు
తిండి మానగ : నాకలి దీరి పోయె
నియమముగ భుజి యింపగ నిశ్చయముగ
విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిబండగమారె కాయమని, బాధనుజెప్పితి వైద్యురాలితో
రిప్లయితొలగించండితిండిని మానవద్దనుచు,తిన్నగనామె యె బోధసేయగా
పండ్లు ఫలమ్ములన్నియును,పాటుగదిన్నను మేలుమేలనన్
తిండినిమానివేయగనె,తీరినదాకలియద్భుతమ్ముగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు శంకరార్యా!
తొలగించండికండలుబెంచు కాయమును, ఖాయముజేయును బియ్యపన్నమే
రిప్లయితొలగించండివండుమునేటినుండియిక,వంటగనింక చపాతిరొట్టెలన్
గుండుగనున్నబొజ్జయిక,గుండగుసున్నగజేయనెంచుచున్
తిండినిమానివేయగనె,తీరినదాకలియద్భుతమ్ముగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు శంకరార్యా!
తొలగించండిరండిట మీకు యోగ్యమును రమ్యతరంబగు త్రోవ జూపెదన్
రిప్లయితొలగించండిదండిగ స్వాస్థ్య మందునని తానొకయోగి వచించ చేలలో
పండిన శాకముల్ గొనుచు వండిన వాని భుజించకుండగా
తిండిని మానివేయఁగనె తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికండలుబెంచుఖాయముగ, ఖాద్యముజేసిన తీపివంటలన్
రిప్లయితొలగించండిమండెడు సూర్యగోళముగ,మాడగజేయుటమేలు బొజ్జనే
తిండిగదంపుబియ్యమును,తిన్నగ సేవనజేయ గొప్ప, యా
తిండినిమానివేయగనె,తీరినదాకలియద్భుతమ్ముగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు శంకరార్యా!
తొలగించండిమెండగుబొజ్జబెంచెనని,మేరుగపర్వతమంచుబిల్వగా!
రిప్లయితొలగించండికొండొకగుండుబొజ్జనిక,కొయ్యగజేయగనెంచినాతడే
వండెదు వంటమానెనిక,వాటముగాదినె నాకుకూరలా
తిండినిమానివేయగనె,తీరినదాకలియద్భుతమ్ముగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"జేయగ నెంచి యాతడే" అనండి.
మెండగుబొజ్జబెంచెనని,మేరుగపర్వతమంచుబిల్వగా!
తొలగించండికొండొకగుండుబొజ్జనిక,కొయ్యగజేయగనెంచియాతడే!!
వండెడు వంటమానగనె ,వాటముగాదినె నాకుకూరలా
తిండినిమానివేయగనె,తీరినదాకలియద్భుతమ్ముగన్.
[సవరణపాఠము ధన్యవాదాలతో]
నాలుగు దినము లలవాటు నడుప , మారు
రిప్లయితొలగించండిజీవ నవిధము , మొదలగు జీవ ఘంట ,
నిరసన దెలుప పరిబూను నేత కిపుడు
తిండి మానఁగ నాకలి దీరిపోయె
జీవ ఘంట = biological clock
పరి = పట్టుదల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికండలుయున్నవారలిక,ఖాయముజేయుడు మాదువైద్యమున్
రిప్లయితొలగించండిఅండగనున్న శాస్త్రమును,ఆదరమొప్పగజేయుచుండగన్
కొండగనున్న దేహమును,కోరివరించెడు తీపివంటలౌ
తిండినిమానివేయగనె,తీరినదాకలియద్భుతమ్ముగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కండలు గల్గు... వైద్యమే యండగ... శాస్త్రముల నాదరమొప్పగ..." అనండి.
కండలుగల్గు వారలిక,ఖాయముజేయుడు మాదువైద్యమే
తొలగించండియండగనున్న శాస్త్రముల నాదరమొప్పగజేయుచుండగన్
కొండగనున్న దేహమును,కోరివరించెడు తీపివంటలౌ
తిండినిమానివేయగనె,తీరినదాకలియద్భుతమ్ముగన్.
[సవరణపాఠము ధన్యవాదాలతో]
అండజవాహ నిన్ను హృదయమ్మున నమ్మియు నీదునామమున్
రిప్లయితొలగించండిపండిన భక్తిభావమను పళ్ళెరమందున సారెసారెకు
ద్ధండత జుర్రుచున్ మిగుల తన్మయమొందుచు ప్రొద్దుమాపులున్
*తిండిని మానివేయఁగనె తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమెక్క సాగిరి జనులెల్ల మిక్కుటముగ
రిప్లయితొలగించండిసార మొక్కింత లేనివౌ చౌక తిళ్ళు
స్వాస్థ్యము మెఱుగౌనటువంటి చౌక బారు
తిండి మానఁగ ; నాకలి దీరిపోయె
ననుచు తినరాదు చిరుతిళ్ళ నవిరళముగ
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివండిన పదార్థములుగన స్వల్ప మయ్యె
రిప్లయితొలగించండివచ్చినట్టి బంధు వులేమొ వాసియైరి
యతిథులు భుజించినంతనా కందదయ్యె
మాస శివరాత్రి యనియుప వాస మనుచు
తిండి మానఁగ నాకలి దీరిపోయె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితిండియనంగనోటికతి తిగ్మము శీతము గాక నుండగన్
రిప్లయితొలగించండివెండియుకాలపాలనము వీడగ రాదు శు చిన్విశు ద్ధమై
యుండుట మేలటంచు మది నొప్పియ కాలమశుద్ధ
మానమౌ
తిండిని మానివేయఁగనె తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి"పండితుఁ డౌట కోసమయి బండెడు పొత్తములం బఠింపఁగా
నెండుఁ గదయ్య పొట్ట!" యని యెన్నియొ వంటకముల్ భుజింపఁగా,
నెండెను పండితాశయమె! యెంచియుఁ దాఁ జదువంగఁ బూనియున్,
దిండిని మానివేయఁగనె, తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్!
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండిఅందరికీ నమస్సులు 🙏🙏
రిప్లయితొలగించండి*సరదా పూరణ* 😊
*తే గీ:*
స్టారు హోటలు పోతిమి సంధ్య వేళ
మెనుని జూడ నడిగితిమి మేమతనిని
టీకి ధరను జూడగ మాకు తిరిగె కళ్ళు
*తిండి మానఁగ, నాకలి దీరిపోయె"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌹🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికండలన్నియు కరిగెను,కడుపు మాడె
రిప్లయితొలగించండితిండి మానగ;నాకలి తీరిపోయె
పండుగను శాక పాకాల భక్షణమున-
వండి వడ్డించు వారలు పరవశింప.
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిరామలక్ష్మణులకు ప్రాంతరమున నాడు
రిప్లయితొలగించండిబల యతిబల మంత్రములను బాగుగాను
గాధిజుడు దెల్పినంతనె సోదెముగను
తిండి మానగ నాకలి దీరిపోయె!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఓగిర మదికమయిపొట్ట సాగిపోవ
రిప్లయితొలగించండినాకలియును పెరిగిపోయె ననుగుణముగ
వైద్యుని సలహాలను మదిఁ బాటి గొనుచు
తిండి మానఁగ నాకలి దీరిపోయె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఫాస్టు ఫుడ్డులు తినుచును పరమ ప్రీతి
రిప్లయితొలగించండియెంత తిన్నను తరగని వింత పసికి |
కారణము తెలియక మది కళవెళ పడ
"తిండి మానఁగ నాకలి దీరిపోయె"
(పసి-ఆకలి)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిసూర్య సూక్ష్మ కాంతినిఁ బొంది సోహమనుచు
నణువులున్మేన దివ్య పునర్నవమ్ము
నందు యోగవిద్యన్ మౌనులాశ్రయించ
తిండి మానఁగ నాకలి దీరిపోయె!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఒడలుదగ్గెనుజక్కగ నుమకుచూడు
రిప్లయితొలగించండితిండిమానగ, నాకలిదీరిపోయె
కమలతిట్టినదిట్లకు కడుపునిండి
చాలుచాలింక మీతోటిసహగమనము
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువు గారు మార్చిన పద్యము
తొలగించండిఈ నాటి శంకారా భరణమువారి సమస్య
తొలగించండితిండి మానఁగ నాకలి దీరిపోయె"
సరదాగా నేటి ఉద్యోగస్తుల పై వ్రాసిన సీస పద్యము
(ఉద)యము బెడ్ కాఫి (ముద)ముగ త్రాగుచు
(దం)తావధానము (త)దుపరి మర
(ల) నొకమారున్ టీ ని (ల)క్షణముగ నేను
(సే)వించు చుంటిని, (చి)న్న సైజు
(పూ)రీ లొక పదిని (పొ)ట్ట లోనికి పంపి
(నా)ఫీసు కున్ వెళ్ళి (నా)డ నడక
(లే)క, మీటింగులన్ (లె)క్కకు మించి నే
(బి)స్కె ట్లు టీలను (బి)డియ పడక
(పం)పు వాడను పట్టు (బ)ట్టి, సతి యి
(చ్చి)న బాక్సు పనిమని(షి)కి నొసంగి
(బి)ర్యాని నేను తె(ప్పిం)చు కొని భుజించు
(వా)డను, గంటలు (మూ)డు జూప
(గ)డియారమున, లేచి (క)మ్మ నైనట్టి స
(మ్మో)సా లెనిమిదిని (తో)సి పొట్ట
(లో)నికి నే సీటు (లో)నికి జారెడి
(వా)డ, నాఫీసును (వ)దలి స్నేహి
(తులు) పిల్వ పిస్తాలు (సులు)వుగ రెండునే
(తి)నుచు నుండెడి వాడ (తి)రిగి తిరిగి
(యి ల్లు)ను జేరగ (నిల్లా)లు వండిన
(బ)జ్జీలు నాలుగు (భం)గ పడక
(నుద)రము లోనికి (పది)లముగా నేను
(నె ట్టు)వాడ, పదిని (గొట్ట)గ గడి
(యార)ము హోటలు (వారు) పంపిన జంకు
(ఫు)డ్డు నేను భుజించి (పొ)రలు చుండు
(వా)డను గా నిద్ర వచ్చు (వ)రకు నేను,
(లి)వరు చెడె, షుగరు (లె)వెలు పెరిగె,
(గుం)డె నడక నాకు (కుం)టు బడెను, పొట్ట
(స)మ్మెతో నాకలి (చ)చ్చి పోయె
(యాం)టి బయాటిక్సు (హా)ని నిడగ నాంగ్ల
(వై)ద్యము వికటించె, (వాం)తు లందు
(ర)క్తము పడుచుండె, (ర)క్ష యే ప్రకృతి
(వై)ద్యమని తెలుప (వ)దలి యాశ
(లన్ని) నాపై జేర్చె (నన్ని)చట, పలుర
(కము)ల కషాయముల్ (విము)ఖత నిడ
(వ)లదనె నాలుక ,(బల)వంతముగ నాకు
(త్రా)గించ నెలలొన (త)గ్గి పోయె
(లి)వరు జబ్బు, ఫలము (లె)న్నియో తినుచుండ
(తరి)గెను దోషముల్, (పెరి)గె చెత్త
(తిం)డి మానంగ నాకలి, (దీ)రిపోయె
(బా)ధ లన్నియు ప్రకృతి (వై)ద్య విధిని
(మొ)దలు పెట్టగ నని పల్కె (ము)దము తోడ
(బం)ధువుల తో డ నొక్కడు (బా)ధ మరచి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎండిపోయె నితని దేహమిట్టులాయె
రిప్లయితొలగించండితిండి మానఁగ; నాకలి దీరిపోయె
పిండి వంటల దోడనే పెళ్ళి యింట
నిండె మదిని కృతజ్ఞత నిజము జూడ
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపూరణకై సమస్య ఇది...
రిప్లయితొలగించండి"తిండిని మానివేయఁగనె తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్
ఉత్పలమాల
మండఁనిరంతరంబుననుమానముతోనుదరంబెయాకలిన్
మండలవైద్యుఁజేరఁనిజమౌమధుమేహవికారమేయనెన్
ఖండితమైనపథ్యవిధికట్టితినాల్కనుతన్నిషిద్ధమౌ
తిండిని మానివేయఁగనె తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్
గాదిరాజు మధుసూదనరాజు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యోస్మి!
తొలగించండి"సుధామాధుర్య భాషణ సుధాకరాననా" అనే కీర్తనలో త్యాగరాజస్వామివారు "కథామృతముచే బహుకాలము ఆకలిదీరి యున్నాను బ్రోవుము" అని మొరపెడతాడు!
రిప్లయితొలగించండిదాని ఆధారంగా పూరణ!
రామకీర్తన నాల్కపై రమ్యముగను
నాట్యమాడగ త్యాగయ్య నందితుండై
త్రాగి హరికథామృతమును,రాజసంపు
దిండిమానగ,నాకలి దీరిపోయె!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నందితుడయి' అనండి. లేకుంటే గణదోషం.
ధన్యవాదములు గురుదేవా,సవరిస్తాను!
తొలగించండిబొండమువోలెనౌతనువు పూర్తిగదగ్గెనుసాంబమూర్తికిన్
రిప్లయితొలగించండిదిండినిమానివేయగనె,తీరినదాకలియద్భుతమ్ముగన్
బండటిపిల్లవానిగనిపార్వతిసంతసమొందుచుండుటన్
తిండినిమానుచోమనకుతీరనినష్టముగల్గునేగదా
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅన్న భక్ష్యాదులను పండ్లు తిన్న వాని
రిప్లయితొలగించండికొనరె నారోగ్యము శుభము, గనగ చెత్త
తిండి మానఁగ నాకలి దీరి, పోయె
గదర యామ్లపిత్తమనెడి వేదనలిక౹౹
పండు వెన్నెల యటఁ గాయు చుండ నుండఁ
రిప్లయితొలగించండిగొండ పట్టి డాపటి మేటి దండ వింత
వెండికొండ దర్శించఁగఁ గొండయల్లుఁ
దిండి మానఁగ నాకలి దీరిపోయె
మండుచు నుండ నాకలికి మాతరొ యే చిఱు తిండి యింత యే
నుండదె యిమ్ము నా కనఁగ నోర్పు వహించి కరమ్ము వేగఁ దా
వండిన నింటఁ గుక్షిఁ దమిఁ బన్నుగ నన్నము, చెడ్డ దైన యా
తిండిని మాని, వేయఁగనె తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్
ఉ:
రిప్లయితొలగించండిదండిగ పుస్తకమ్ములను ధాటిన వ్రాయుచు మెప్పునొందగన్
నిండగు జీవితమ్మునిక నెమ్మది మార్పు గ్రహింప నంతలో
పండిత మాన్యమున్ బడయ భారత గౌరవ పట్టమందగన్
తిండిని మాని వేయగనె తీరినదాకలి యద్భుతమ్మునన్
వై. చంద్రశేఖర్
'ఒక యోగి అత్మకథ'లో గల 'నిరాహార యోగిని గిరిబాల'వృత్తాంతము నేపథ్యము....
రిప్లయితొలగించండిఉత్పలమాల
మెండుగ తిండి పోతువని మెచ్చక యత్తయె తిట్టిపోయగన్
మొండి యనన్ 'క్రియా క్రి' యను పూజ్య గురూత్తము నాశ్రయంబునన్
బండగ నభ్యసించి 'గిరిబాలయె' దివ్యపునర్నవమ్మునన్
తిండిని మానివేయఁగనె తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్
👌
తొలగించండి🙏
తొలగించండివండిన వంటలేమొ కడు స్వల్పము వచ్చిన బంధువుల్ గనన్
రిప్లయితొలగించండిదండిగ నుండ గాంచితిని ధాకము నాకు హుళుక్కియంచునే
నుండ, భుజింపమిప్పుడని హోటలులో తిని వచ్చినందునన్
దిండిని మానివేయగనె, తీరినదాఁకలి యద్భుతమ్ముగన్.
నోటిరుచియు పాడయ్యెను నొప్పి చేత
రిప్లయితొలగించండితనువు కలసటయు కలిగె తలయు తిరిగె
*తిండి మానగ ,నాకలి తీరిపోయె"
రాగి జావను త్రాగంగ రయముగాను.
జ్వరము టైపాయ డనిరటవైద్య వరులు
రిప్లయితొలగించండినమలగలిగిన తిండినమానమనిరి
తిండి మానగనాకలి? తీరిపోయె
పళ్లరసముల సారమ్ము పత్యమందు!
రిప్లయితొలగించండిశంకరాభరణం..
05/02/2020...బుధవారం
సమస్య
"తిండిని మానివేయఁగనె తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్
నా పూరణ
*** *** ***
భర్త తిండిపోతు..ఎప్పుడు తిండికోసం భార్యని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు...వంట నిత్యం వండలేక ఆమె మొగుడు తో కొట్లాడుతూనే ఉంటుంది.. ఆ సంధర్భంగా భార్య ఇలా ఆంటున్నది..
ఉ.మా.
ఉండడు గంట సేపు తినకుండగ నా పతి..వండలేక నే
మండుచు వారిపై కెగర మాకెపుడున్ జగడమ్ము లయ్యె..నా
తొండపు దేవుడే కరుణతో నను బ్రోచెనొ వారు మిక్కిలౌ
తిండిని మానివేయగనె తీరినదా కలి యద్భుతమ్ముగన్
( కలి అనగా జగడము. )
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
ఉత్పలమాల
రిప్లయితొలగించండిమొండి యతండనన్ కలహ భోజన మాకలి తీర్చు మౌనికిన్
బండుగ వోలె రుక్మిణికి పారిజ మీయగ కృష్ణమూర్తి, యు
ద్దండత రేగ సత్యకది తంటల జెప్పఁగ నాడు స్థూలమౌ
తిండిని మానివేయఁగనె తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్
కండలుబెంచు ఖాయముగ,ఖాద్యముజేసిన తీపివంటలున్
రిప్లయితొలగించండిమండెడు సూర్యగోళమయి,మంటల బూదగు దీర్ఘ కాయమే
తిండిన దంపుబియ్యమును,తిన్నగజేర్చుడు,యట్టి పూర్వపున్
తిండినిమానివేయగనె,తీరినదాకలియద్భుతమ్ముగన్.
కండలుబెంచు కాయమును, ఖాయముజేయును బియ్యపన్నమే
రిప్లయితొలగించండివండుమునేటినుండియిక,వంటగనింక చపాతిరొట్టెలన్
గుండుగనున్నబొజ్జయిక,గుండగుసున్నగజేయనెంచుచున్
తిండినిమానివేయగనె,తీరినదాకలియద్భుతమ్ముగన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎంతతిన్నను నాకలిసుంతయేని
రిప్లయితొలగించండిదీరకుండెను వైద్యుడు దివ్యమైన
మందునిచ్చెను తిండిని మానుమనెను
తిండి మానఁగ నాకలి దీరిపోయె
దండముబెట్టివేడెదను దారినియడ్డెసుదీర్ఘకాయమే
రిప్లయితొలగించండిమండెనుగుండెగొంతుకలు,మార్చగజేసిన వైద్య విద్యతో
అండముమానివేసితిని,ఆతృతమానితి వంటకమ్ము, పై
తిండినిమానివేయగనె,తీరినదాకలియద్భుతమ్ముగన్.
*మరో పూరణ*
రిప్లయితొలగించండి*తే గీ*
అన్నమనిన జూచెను గద యలుసుగాను
పిండి వంటలనగ పెట్టె విసుగుతోడ
మొగము జూడగ నెపుడది ముడుచు కుండె
*తిండి మానఁగ, నాకలి దీరిపోయె"*
🙏
ఎండిన కుక్షితోజనులునెక్కుడు నాకలినొంది కుందగన్
రిప్లయితొలగించండిదండిగ భోజనంబులను దండగజేయగ న్యాయమౌనొకో
మెండగు భాగ్యవంతుడొక మేలునుజేయగ పేదవానికిన్
తిండిని మానివేయఁగనె తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"తిండి మానఁగ నాకలి దీరిపోయె"
సందర్భము: "ధిక్ క్షత్రియబలం బ్రహ్మ తేజోబలం బలం" అనుకున్నాడు వశిష్ఠునికి ఓడిన విశ్వామిత్రుడు. తానూ బ్రహ్మర్షి కావాలని *వేయియేండ్లు* తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై *"రాజర్షి వైనా"* వన్నాడు.
త్రిశంకుని శునశ్శేపుని కథలు నడిచినవి.
మరో *వేయియేండ్ల* తపస్సుతో *"ఋషి"* యైనా విశ్వామిత్రుడు మరింత ఘోర తపస్సు చేశాడు.
మేనకవల్ల తపోభంగమై హిమగిరికి వెళ్ళి కౌశికీనదీ తీరంలో *వేయియేండ్లు* తపస్సు చేసి *"మహర్షి"* యైనాడు.
దేవతలు రంభను పంపిస్తే "పదివేలయేండ్లు శిలవై యుండు" మని శపించి విశ్వామిత్రుడు కోపానికి లొంగినానని చింతించాడు.
తూర్పు దిశకు వెళ్ళి తిండి తినక గాలి పీల్చక *వేయియేండ్లు* ఘోర తపస్సు చేసి విరమించి భోజనానికి సిద్ధమైనాడు.
ఇంద్రో ద్విజాతి ర్భూత్వా తం సిద్ధ మన్న మయాచత 65-5 (ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారియై పక్వాన్న మడిగినాడు.)
తస్మై దత్వా తదా సిద్ధం సర్వం విప్రాయ నిశ్చితః నిశ్శేషితేఽన్నే భగవా నభుక్త్వైవ మహాతపః 6
న కించి దవద ద్విప్రం మౌనవ్రత ముపస్థితః
పక్వాన్నమంతా బ్రాహ్మణుని కీయ నిశ్చయించి సమర్పించి ఏమీ పలుకకుండా అన్నం లేనందుకు తానూ తినక మౌనం వహించినాడు విశ్వామిత్రుడు. (పద్యంలో పేర్కొన బడిన దిదే!)
మళ్ళీ *వేయియేండ్లు* కేవల కుంభకంతో తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై *"నీవు బ్రహ్మర్షి వైనా"* వన్నాడు. వశిష్ఠు డా మాట అనాలి అన్నాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు వచ్చి *"బ్రహ్మర్షీ"* అన్నాడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*విశ్వామిత్రుడు*
దీక్ష ముగియంగ నన్నమున్ దినగబోవ
దేవపతి వచ్చి యాకలిఁ దీర్పు మనగ
నతని కిచ్చి విశ్వామిత్రు డపుడు తాను
తిండి మానఁగ.. నాకలి దీరిపోయె
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
5.02.20
-----------------------------------------------------------