10, ఫిబ్రవరి 2020, సోమవారం

సమస్య - 3277 (ఉండియు లేని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఉండి లేని దొకటె యున్నదేమొ"
(లేదా...)
"ఉండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో"

84 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  "వస్తా వట్టిదె పోతా వట్టిదె..."

  తిండిని పెట్టకే సతికి తిట్టుచు త్రోయుచు నత్తగారినిన్
  కొండొక రీతినిన్ వడిగ కోరిక తీర్చగ కోటికోటులౌ
  దండిగ గూర్చి రూకలను, దాపున రాగనె పోతురౌతహో:
  "ఉండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో"

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  శ్మశాన వైరాగ్యం:

  మెండుగ నేడ్చి పుట్టుచును మీరిన ప్రీతిని దారనొల్లుచున్
  దండిగ పింఛనున్ గొనుచు దబ్బున వీడెడి లోకమియ్యదే...
  గండర గండులౌ మునులు కన్నుల కానగ లేని మాయరో:
  "ఉండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో"

  రిప్లయితొలగించండి
 3. మూలప్రకృతి రవ్యక్తా!వ్యక్తావ్యక్త స్వరూపిణీ!

  మండితమైన నీజగతి మర్మపురీతిని సంచలింపగా
  నండగ పంచభూతములు హద్దులుమీరక వర్తిలంగ నా
  పండితులందరున్ దెలిసి పల్కిన వాస్తవమియ్యదే భువి
  నన్నుండియు లేనిదొక్కటియె,యున్నద?యున్నది,లేద?లేదుపో!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బ్రహ్మసత్యం,జగన్మిధ్య!

   నిండుగ సూర్యచంద్రులిట నేర్పునగూర్చగ రేబవళ్ళనున్
   దండిగ జీవరాసులిదె దాల్చుచుజన్మలు నేనునేన
   న్నండగనుండి యీజగతి నాటగనాడెడు బ్రహ్మసత్యమై
   యుండియు లేనిదొక్కటియె,యున్నద?యున్నది,లేద?లేదుపో!

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. ధన్యవాదములు గురుదేవా!నమస్సులు!

   తొలగించండి
 4. ( మకరిబారిన పడిన మత్తేభరాజు పరిపరి
  విధాల పరిదేవనతో పలుకుతున్నాడు )
  ఎండినగొంతుతో , మిగుల
  నెండిన యాస్తికభావనమ్ముతో ,
  కండల లాగు నామకరి
  ఖండనచేష్టల జృంభణమ్ముతో ,
  మండెడి బాధతోడ బర
  మాత్మ దలంచు గజేంద్రు డిట్లను
  " న్నుండియు లేని దొక్కటియె ,
  యున్నద ? యున్నది , లేద ? లేదుపో ."

  రిప్లయితొలగించండి
 5. చలన చిత్ర మందు చక్కని రీతిని
  ప్రేక్షకుల మతులను రెచ్చగొట్టు
  నాట్యమాడు నటికి నడుమున వస్త్రము
  ఉండి లేని దొకటె యున్నదేమొ

  రిప్లయితొలగించండి
 6. లేకనె గలదనెడి రీతి గాంచిన గూడ
  నుండి లేని దొకటె యున్నదేమొ
  యనుచు దలచ కుండ నవమానపడి, సుయో
  ధనుడు మానసమున తాపమొందె

  రిప్లయితొలగించండి
 7. పుట్టి గిట్టు టేల మురిపించ బ్రతుకున
  లేక యున్న దనెడి మైక మందు
  బ్రమను వీడి మనగ బంగారు భవితకు
  ఉండి లేని దొకటె యున్న దేమొ

  రిప్లయితొలగించండి
 8. నేతి నేతి యనుచు నిత్యవస్తువుగాంచ
  జ్ఞానచర్వణమ్ము సలిపి సలిపి
  నిశ్చయమ్ము సేయ నేరక జెప్పిరి
  ఉండి లేని దొకటె యున్నదేమొ"

  రిప్లయితొలగించండి
 9. జనన మరణ ము లవి జనులకు సహజము
  శాశ్వత o బు లనుట జరుగ దిలను
  ధనము కీర్తులనుట ధరణి లో జూడంగ
  ఉండి లేని దొకటె యున్న దే మొ?

  రిప్లయితొలగించండి
 10. పొలములిచ్చి వారుపొలమారిపోవగ
  రైతుహితముగోరు రాజులేక
  రాజధానిలేనిరాష్ట్రము మనదాయె
  ఉండిలేనిదొకటెయున్నదేమొ
  +++++++++
  రావెలపురుషోత్తమరావు
  రిప్లయితొలగించండి
 11. అందమైనదంచు నలనాడు మెరిసినా
  ముగ్ద నేడు చూడ ముద్దియయ్యె
  శాశ్వతమ్ము కాదు సౌందర్యమన్నది
  యుండి లేని దొకటె యున్నదేమొ

  రిప్లయితొలగించండి
 12. స్లోగనులను జెప్పు సొంపుగా బ్రతుకక
  పన్ను గట్టరాక పటిమఁ జూపు
  వాని దేశభక్తి వాదమ్ములందున
  "నుండి లేని దొకటె యున్నదేమొ"

  రిప్లయితొలగించండి
 13. ఆ.వె॥
  తాడు జూచి నేను త్రాచు పామనుకొంటి
  దగ్గర చని చూడ తాడు తాడె!
  దైవ సృష్టి లోన జీవులింతేనయా!
  ఉండి లేనిదొకటె యున్నదేమొ!

  రిప్లయితొలగించండి
 14. జగమే మాయ బ్రతుకే మాయ!

  మాయ జగము బ్రతుకు మాయయంచెరుగుము
  వేదసారమిదియె వెర్రివాడ
  ఏదిగలదుభువిని యేమిటి లేనిది?
  యుండి లేని దొకటె యున్నదేమొ!

  రిప్లయితొలగించండి
 15. మఒలవరపు వారి పూరణ


  దండుగమారి వాదనలు దైవము లేడని యుండెనంచు., మా...
  ర్తాండుడు సంచరించెడి పథమ్ము విహాయసమున్ వచింపుమా?
  యుండెన? లేక శూన్యమ ? అయోమయమౌ, భగవంతుడట్టులే !
  నుండియు లేనిదొక్కటియె
  ఉన్నద యున్నది లేద ? లేదుపో !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. మరో పూరణ...

   నిండగు చందమామ తరుణీ! భవదానన., మోష్ఠయుగ్మమున్
   బండిన దొండపండ్లు., తెఱవా! చనుదోయి రథాంగయుగ్మమౌ !
   నండజయాన ! బల్క దరమా! తనుమధ్యఁ., దలోదరీ! సఖీ!
   యుండియు లేనిదొక్కటియె
   ఉన్నద యున్నది లేద ? లేదుపో !

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 16. దండుగ నున్ననేతలిక, దారుణమై నిటుజేయధర్మమా??
  పండుగ పబ్బముల్ మరచి ,పాటునరైతులుదీక్షసేయగా
  కండువమార్చురీతినిట,కర్మముగాల్చిరి రాజధానికే
  ఉండియులేనిదొక్కటియె,ఉన్నదియున్నదె లేదలేదెపో
  ++++++++++++++++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 17. మండెడు భాను భంగి ముఖ మండలమొప్పెడు బాలు గాంచియా
  ఖండల వైరి దానగుణగణ్యుడునౌ బలిభూవిభుండు భూ
  ఖండము నివ్వబూనుతరి కాదను శుక్రుని తోడబల్కె నే
  "నుండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో"

  రిప్లయితొలగించండి
 18. నిండిన కుండలా యనగ నీల్గు కుచమ్ములు నిక్కమే సఖీ!
  పండిన వాతెరన్ గనగ వచ్చును కన్నుల సోయగమ్ములన్
  వెండి పిఱుందులున్ ధ్రువము వెక్కసమౌనెఱుగంగ కౌను హే!
  *యుండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉండీ లేని నడుము గురించి పూరణ చేయాలని ఈ సమస్యను సిద్ధం చేసినప్పుడే అనుకున్నాను. నేను పూరణ చేసేలోగా మీరే ఆ పని చేసారు.
   మనోహరంగా, అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించండి
 19. అండగనౌదు దాసుడనటంచును వేడిన, నీ విపత్తులన్
  జెండద నొక్క సారి ననుఁ జేరిన చాలు త్వదీయునంచు, ని
  ట్లండగ నిండి యుండ నిల, నన్ను దలంచని వాని కోసమై
  యుండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో

  రిప్లయితొలగించండి


 20. మాయ లోన గడచు మానవ జీవన
  మనెడి సంగతెరిగి యనవరతము
  బ్రతుకు చుందురల్ల భ్రమయెశాశ్వతమని
  యుండి లేనిదొకటె యున్నదేమొ
  మరొక పూరణ.

  ఆస్తి పాస్తులుండి యనుభవించువయసు
  నరుని జన్మ మందు నాస్తి కాగ
  తనువు నందు గట్టి దనము తగ్గుచు నుండ
  యుండి లేని దొకటె యున్నదేమొ

  రిప్లయితొలగించండి
 21. అందరికీ నమస్సులు 🙏🙏
  *ఆ వె |*

  చదువు జెప్పు ననుచు చక్కగా మాకును
  ఫీజులన్ని కూడ పిండుచుండ
  కలలు గన్న చదువు కాన రాదు గదర
  *"ఉండి లేని దొకటె యున్నదేమొ"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌸🙏🌸🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అందరికీ నమస్సులు 🙏🙏

   వృద్దాశ్రమములోని వారి పరిస్థితిని తలచుచు ..🙏

   *ఆ వె |*

   కొడుకుయుండె ననుచు గొప్పగ చెప్పగ
   కోడలొచ్చి జేరి కూతురనెనె
   వేరు కాపురమట వెడలి పోయెగదర
   *"ఉండి లేని దొకటె యున్నదేమొ"*

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏🌸🙏🌸🙏

   తొలగించండి
 22. మిత్రులందఱకు నమస్సులు!

  [ఒక ప్రియుఁడు తన ప్రేయసి యందమును వర్ణించు సందర్భము]

  "నిండగు చందురున్ గెలుచు నీ నగుమో; మిఁకఁ గల్వలో కనుల్;
  మెండగు దొండపం డదివొ మెప్పుల మోవియ; నువ్వుఁబూ వదో
  దండి సునాసిక; మ్మదియ, తన్విరొ! నీదగు కౌనె? యయ్యయో!

  యుండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో!"

  రిప్లయితొలగించండి
 23. నిండె జగమ్ములంత దన నిర్మల తత్వమె సత్యమై సదా
  నిండు మనమ్ముతో దనను నిత్యము ధ్యానము సేయు వారికిన్
  ఉండవు చింతలేవియును యుండగ నండగ నీశుడింక నీ
  కుండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో

  రిప్లయితొలగించండి
 24. రిప్లయిలు
  1. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

   ఉండి లేని దొకటె యున్నదేమొ"

   నా పూరణ సీస పద్యములో

   శ్రీకృష్ణుడు జగన్నాటక సూత్ర ధారి అతను ఎవరు భక్తితో కొలిస్తె వారి వద్ద ఉన్నట్లు కనిపిస్తాడు రాస లీల జరుగు చున్నప్పుడు ఒకసారి నారదుడు భూలోకం వస్తాడు అప్పుడు బృ0 దా వనములో గొపాలుని ఒకె సమమయములొ అనెక మంది స్త్రీల తో చూస్తాడు చివరికి సత్య భామ మందిరములొ రుక్మిణీ మందిదిరములో కుడా ఒకే సమయములో చూస్తాడు అధి భ్రమ. మిధ్య తనతో ఉన్నాడ అంటె ఉన్నట్టే . లేడా అమెతో ఉన్నాడా అన్నట్లె .అక్కడ ఉన్నట్లె మరి అక్కడ ఉంటె ఇక్కడ ఒకే సమయములో ఉండడు గదా మరి అతని రూపము ఎక్కడ అన్నది ధర్మ సందెహము కలిగెను నారదునికి .


   (మ ల్లె)పూ దండను (మెల్ల)గా నొకనాతి
   (కు)రులందు పెట్టుచు (కు)లుకు చుండె

   (నొ)కచోట, వేణువు (నూ)దుచు నొకచోట
   (ప)డతి చెంత నిలిచె (ప)రవశముగ,

   (క)రములు రెంటితో (కౌ)గిలిం చుకొనుచు
   (నుం)డె బింబాధర (నొ)క్కచోట,

   (ను)గ్మలి కూర్చుడ (నూ(రువు పై త ల
   (బె)ట్టి పరుండెను (ప్రే)మతోడ

   (నొక)చోట , కోలాట (మొక)చోట నాడుచూ
   (కొ)మరాళ్ళకు ముదము (గూ)ర్చు చుండె,

   (దాగు)డు మూతలు (బాగు)గా నాడుచు
   (పడ)తుల గుంపులో (గడు)పు చుండె

   (నొక)చోట, వర నెల(తుక) సత్య భామకు
   (నలు)కతీర్చుచునుండె (చెలి)మి తోడ

   (నంత)పురము లోన, (సంత)సముగ ధర్మ
   (ప)త్నియా రుక్మిణి (పా)ద పూజ

   (లను)చేయు చుండగన్ (కను)చు తాదాత్మ్యము
   (పొం)దుచు నుండె (పు)రము లోన

   (యెచ)ట చూడ నుండె (నచ)ట గో పాలుడు
   (నుం)డె నుగద నిచట (నుం)డె నచట
   (నుం)డె నా నడపొడ (నుం)డెనా రూపము
   (నుం)డి లేని దొకటి (ను)న్న దేమొ


   (త)రచి చూడ గా నిదియంత (త)మరి మాయ
   (గా)దె , నరహరీ ,మురబిధా, (గ)రుడ గమన,
   (దే)వకీ,నందనా, సూరి, (దే)వదేవ,
   (యను)చు నారదుడు తలచె (మన)సు లోన

   తొలగించండి
 25. తరచి చూడ కాంతి కెరటమా?రేణువా?
  యుండి కూడ యుండు నుండ నట్లు
  జగతిని నడిపించు శక్తివంటిది తాను
  ఉండి లేని దొకటె యున్నదేమొ ?

  రిప్లయితొలగించండి
 26. కక్కసముల కడలి కలిలోన సృష్టించి
  నీవె మమ్ము ముంచి నీవె లాగి
  కనుల బడక జేయు పెనుమాయ లేలయా?
  యుండిలేని దొకటె యున్నదేమొ!!!

  రిప్లయితొలగించండి
 27. ఉత్పలమాల
  ఉండిన శక్తితో మకరి నొంచఁగఁ జూచితి లావు చాలదే!
  నిండుమనమ్ముతో ప్రభువ! నీవె శరణ్యమనన్ గజమ్ముతో
  నండగ నుండరమ్మనెద నార్తిని! ప్రాణము నిల్ప లేవొకో?
  యుండియు లేని దొక్కటియె! యున్నద? యున్నది, లేద? లేదుపో!

  రిప్లయితొలగించండి
 28. నిండు మనస్సుతో గొలువ నీకది మేలును గూర్చు గాదె, బ్ర
  హ్మాండము నేలునట్టి పరమాత్ముని రూపమదొక్కటే కదా
  దండుగ మాటలెందుకు వితండము మానుము వాని రూపమే
  ఉండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో!

  రిప్లయితొలగించండి
 29. దినముదినముద్రాగి యెనలేనిమాటలు
  పలుకుచుండునతడు భరణిబ్రతికి
  యుండిలేనిదొకటె,యున్నదేమొచెపుమ
  వానివలన ఫలముబ్రజకరయగ

  రిప్లయితొలగించండి
 30. శంకరాభరణం... 10/02/2020 ..సోమవారం

  సమస్య.
  *******

  "ఉండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో"

  నా పూరణ.
  ** ***

  ( కూరలో ఉల్లిగడ్డలు లేవని భర్త కోప్పడితే...అవి ప్రియమైనవని అందుకే వేసి వేయనట్టల వేసానని భార్య చెబుతున్న సంధర్భ)

  ఉ.మా

  మెండుగ నుల్లిపాయలను బ్రీతి భుజించెడు భర్త కూరలో

  పండుగ రోజు లేవవని భార్యను బిల్చుచు జిందులేయగన్

  దండము బెట్టి యిట్లనెను" తారల నంటెను దాని మూల్యమే

  యుండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో"


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
 31. సమస్యాపూరణ....

  ఉండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో

  ఉత్పలమాల

  పండితులున్ గ్రహింపసులభంబొకొవిశ్వఖగోళమట్టిబ్ర
  హ్మాండములండపిండములుమాయగనెంతురులేవటంచుఁదా
  నుండెవిరాట్స్వరూపిపురుషోత్తముడందురుసూత్రధారియై
  ఉండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో


  గాదిరాజు మధుసూదన రాజు

  రిప్లయితొలగించండి
 32. ఉ:

  మొండిగ మాటలాడుచును మోమున నిత్యము వెంగెమాడుచున్
  తిండికి నాదరించుచును తిక్కను యెంచక పక్క జేరుచున్
  బండిన గట్టు బాపతున బల్కెడి వృద్ధుల ప్రేమ జూడగ
  న్నుండియు లేనిదొక్కటియె, యున్నద? యున్నది లేద? లేదు పో

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 33. ఎన్నియున్నగాని యిడుములున్నప్పుడు
  ఎవరు జెప్పనతడు వినగబోడు
  ఉన్నవేవొ వాటి నోర్మితో గనినంత
  ఉండి లేని దొకటె యున్నదేమొ!!

  రిప్లయితొలగించండి
 34. శాంతిఁ గాంచ లేము సంతత మిద్ధర
  నెగఁడె సందియమ్ము నీది యైన
  యిప్పలుకు నిజంబె యిప్పురి నొక తరి
  నుండి లేని దొకటె యున్నదేమొ

  [ఒకప్పు డుండి యిప్పుడు లేనిది యొకటి (అశాంతి) యున్నదేమో]


  అండము కాంచ రాని దగు నందపుఁ బక్కియ కాదె యెంచఁగన్
  మెండగు దైవశక్తి ధర మీఱుచు నుండు ననంగఁ దర్కముల్
  భండన రీతి రేఁగె నిటఁ బండిత పామర భేద మెంచకే
  యుండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో

  రిప్లయితొలగించండి
 35. పండితు లిట్లు పల్కెదరు వాస్తవ మియ్యది జీవనంబు నే
  డుండిన నేమి యేనిమిష ముర్విని గూలునొ చెప్ప శక్యమే?
  దండుగ కాదె దీనికయి తన్మయతన్ జరియించు టెల్ల దా
  నుండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో"

  రిప్లయితొలగించండి
 36. అండమునందుజూడగనునాపరమాత్మునిరూపులీలగా
  నుండియులేనిదొక్కటియెయున్నద?యున్నదిలేద?లేదుపో
  కొండొకచోటజూడగనుగోప్యముతోడనుగానకుండగా
  నుండుచులేనివోలెనునదొక్కటెయున్నదిగాదలంచెసూ

  రిప్లయితొలగించండి
 37. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "ఉండి లేని దొకటె యున్నదేమొ"

  సందర్భము:
  సంశ్రవే మధురంవాక్యం వైదేహ్యావ్యాజహార హ
  (ఆంజనేయుడు సీతకు వినబడేట్లు తీయనైన వాక్యాన్ని పలికినాడు.సుం.కాం.31-1)
  రాజో దశరథో నామ.2 అని ఆరంభించి.. అస్యా హేతో ర్విశాలాక్ష్యాః సాగరం వేగవాన్ ప్లుతః..14 (ఈ విశాల నేత్ర సీతకోసం సముద్రాన్ని లంఘించినాను.) అన్నాడు.
  ఏ పుణ్యాత్ముడొ కనులకుఁ జూపట్టక నేడు శ్రవణసుఖముగ నాహా నాపతి వృత్తాంతము కడు దీపుగ మృదు ఫణితి వగపు దీఱఁ బలికెడిన్ (గోపీనాథ రామాయణం సుం.కాం.693) అనుకొని... మిక్కిలి అచ్చెరు వంది.. ఉన్నమ్య వదనం భీరుః శింశుపావృక్ష మైక్షత 17 (భయస్థురాలైన సీత మొగ మెత్తి శింశుపావృక్షం వైపు చూసింది.)
  చూసి ఎలా తలపోసిందో పూరణ పద్యంలో పేర్కొనబడింది..
  ఆత్మ నాథుడైన రాముని చూస్తా నన్న ఆశ సన్నగిల్లింది. అస లది ఉందో! లేదో! చెట్టుమీదినుంచి మాటలు విన్నాక మాత్రం ఆశ వుం దనే అనాలి మరి.
  అలా చూడగా 'ఉదయగిరిమీద రవి భంగి నొప్పు' మారుతి కనిపిస్తే ఆ సాధ్వి ఇలా భావించింది.
  (కలయో వైష్ణవ మాయయో.. అనే భాగవత పద్యానికి అచ్చుగుద్దినట్టున్న పద్యం చూడండి.)
  కలయో దైత్యుని మాయయో హృదయ వైకల్యోత్థమో నిక్కమో తెలియ న్నేరక యున్నదాననొ ధరిత్రీపుత్రినో కానొ కేవల భక్తిన్ బ్లవగుండు నాదు విభునిన్ వర్ణించుచున్ ధీ సముజ్జ్వలుడై యుండుట కేమి హేతువొ మహాశ్చర్యంబు చింతింపగన్
  (గోపీనాథ రామాయణం సుం. కాం.702)
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *ఆశా దీపము*

  అమృతమధుర మయిన
  యాత్మ నాథుని గాథ
  చెట్టుమీదినుండి చెవినిబడియె..
  సత్య మౌనొ కలయొ! సత్యసమమొ ఆశ
  యుండి లేని దొకటె!.. యున్నదేమొ!.."

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  10.02.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 38. జగతి లోన మనుజ సుగతి నెన్నగ జేయు
  పథము నొసగు విధము బరచు చుండి
  ప్రకృతి యుందు నిండి పరమాత్మ యను భావ
  ముండి లేని దొకటి యున్నదేమొ?!

  రిప్లయితొలగించండి
 39. కనిపించీ కనిపించని మేఘం కోసం ఆకాశంవైపు కడుపు చేతపట్టుకుని ఆర్తిగా చూస్తూ ఒక రైతన్న..

  ఆటవెలది
  అదును మీరు చున్నఁ బదును వానయె లేదు
  భుక్తి, ఋణ విముక్తి పూజ్యమౌనొ?
  శ్రావణంబు దాట! జలదము నాకాశ
  ముండి లేని దొకటె! యున్నదేమొ?

  రిప్లయితొలగించండి
 40. కండగల్గినంత కన్నులకింపగు
  గండుమీను కనుల కాంత యురము
  చండిరాణితేరు సంకాశ కటియది
  ఉండి లేనిదొకటి యున్నదేమొ!

  రిప్లయితొలగించండి
 41. పూసపాటి గురువుల ఆశీస్సులతో.....వారికి ప్రణామాలు సమర్పిస్తూ🙏 నా తొలి ప్రయత్నం....
  ఈ రోజు సమస్యకు నా పూరణ ఆటవెలది లో...👇
  షోడశోపచారాలు చేస్తాము...
  అయనప్పటికీ
  దేవుడు ఉండి లేనివాడుగా
  లేకనే వున్నవాడుగా
  చెప్పబడుతున్నాడు
  అన్న అర్ధం తో వ్రాసాను...

  ****
  ఆ. వె

  అర్ఘ్య పాద్యులిచ్చి నావాహనము జేసి
  భజన స్తోత్ర ములును, పాయసాన్న
  మునిడి సతము కొలుతుము
  నిను వైష్ణవ మాయ
  యుండి లేనిదొక టె యున్నదేమొ

  వాణిశ్రీ నైనాల, హైదరాబాద్

  రిప్లయితొలగించండి
 42. సుస్తిజేసెనాకు సుఖమునీయగలేను
  మరచిపొమ్మునదియె మనల మధ్య
  ‘అస్తినాస్తియాయె ఆశల హరి విల్లు‘
  యుండిలేనిదొకటెయున్నదేమొ
  ———————-
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 43. మొండిగనున్నరాజునకు,మోహముయుండునరాష్ట్రప్రజలపై?
  ఉండగకష్టనష్టములు,ఊదరగొట్టుటధర్మమౌనకో?
  పండగలేదుమాకనుచు ,పాపమురైతులుదీక్షజేయుచో
  నుండియులేనిదొక్కటియె,యున్నది యున్నదిలేదలేదుపో
  ++++++===================
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి