సందర్భము: ఇది రామేశ్వరం కథ.. రాముడు రావణ వధతో అంటిన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి కైలాస పర్వతం నుంచి శివలింగాన్ని తెమ్మని హనుమంతుని పంపించినాడు. సీత ఇసుకతో శివ లింగం తయారించగా ముహూర్తం దాటిపోకుండా ప్రతిష్ఠించటం జరిగింది. హనుమ శివలింగాన్ని తెచ్చి నిరుత్సాహ పడగా దాన్నీ ప్రతిష్ఠించారు. "నీవు తెచ్చిన శివలింగానికే తొలిపూజలు జరుగుతా" యని రాముడు హనుమతో పలికినాడు. రామనాథ లింగము, రామ లింగము అంటారు సీత చేసిన శివలింగాన్ని. విశ్వలింగ మంటారు హనుమ తెచ్చిన శివలింగాన్ని. ఇక్కడ వున్న ప్రసిద్ధములైన 22 తీర్థాల్లో స్నానాలు చేస్తారు భక్తులు. తమ అమ్మాయికి మంచి భర్త లభించా లని ఆ తీర్థాల్లో స్నానాలు చేసి అర్చనలు చేస్తూ ఒక తల్లి తండ్రితో ఇలా అన్నది. "పాపయొక్క (కై) స్నానార్చనాది కార్యములను చేస్తే శివరాత్రివరకు శివ మౌతుంది కదా!" తవులు = ఆసక్త మగు ~~~~~~~~~~~~~~~~~~~~~~~
సందర్భము: ఇది శక్తి పీఠంగా పేరందిన "కన్యాకుమారి" స్థల చరిత్ర. బాణాసురుని బాధలు పడలేక దేవతలు యజ్ఞం చేసి పరాశక్తిని ప్రసన్నం చేసుకున్నారు. ఆమె "పాప" (బాలిక)గా భువికి దిగివచ్చి బాణాసురు నంతమొందిస్తా నని అదే "పాప కార్య" మని, అప్పుడే మీ పరిస్థితి చక్కబడుతుం దని అన్నది. దేవతలెంతో సంతోషించినారు. దేవేంద్రుని సతీమణియైన శచీదేవి కూడ భర్తతో పలికిం దిలా.. "సఖా! రాబోయే శివరాత్రి వరకు లోకమునకు శివమౌతుంది ఈ పాప కార్యాలు (బాణాసుర సంహారాదులు) చేస్తే.." (చేస్తే.. అంటే "మనం కూడ పరాశక్తి కనుకూల పరిస్థితులు కల్పిస్తూ సహకరిస్తే.." అని శచీదేవి ఆంతర్యం.) కన్యకచేతిలో మాత్రమే బాణాసురునికి మృత్యు వని బ్రహ్మ వరం.. నూల్కొను = చక్కబడు ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*పాప కార్యము*
భువి దిగి వత్తు "పాప"నయి పోయి దివౌకసులార! ధూర్త బా ణు వధయె "పాప కార్య" మగు నూల్కొను మీ స్థితి యప్పు డన్న దే వి వచనమున్ సురల్ వినిరి.. వేగమె యా శచి వజ్రి కి ట్లనెన్.. "శివమగుఁ బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా!"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 21.02.20 -----------------------------------------------------------
రిప్లయితొలగించండితెలంగాణా ప్రతిపక్ష నాయకులకు శివరాత్రి శుభాకాంక్షలతో విజ్ఞప్తి:
పవలును రేయినిన్ గనక పండుగ పర్వము కానకుండగన్
చవటల రీతినిన్ విరివి చప్పుడు చేయుచు డప్పుకొట్టుచున్
దవులుచు తిట్టగన్ మనము దాపున జేరుచు;...చందురన్నకున్
శివమగుఁ;...బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా!
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిధ్రువమగు నరకపు శిక్షలు
రిప్లయితొలగించండిశివరాత్రికిఁ బాపకర్మఁ జేసిన; శివమౌ
భవహరు నర్చించు నిరత
శివ పూజా తత్పరులకు స్థిరమగు పరమున్
శివ శివ యంచు భవ్య శశి శేఖరు భూతగణాది సేవితున్
తొలగించండిభవహరు నీశ్వరున్ పరమ పావన మూర్తిని నమ్మి గొల్చుటన్
శివమగుఁ; బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా
ధ్రువమగు గాదె వేదనయు దూరమగున్ గద శాంతి సౌఖ్యముల్
విరుపుతో మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
ముత్తుకూరు హైస్కూలు పరీక్షల వేళ (1957):
నవలలు మెండుగా చదివి నందము నొందుచు క్లాసులందునన్
పవలును రేయి రుబ్బినను పాసగు ఛాన్సులు డౌటుగుండగా
చివరకు గైడులన్ కొనుచు చింపుచు పేజిలు కాపికొట్టగన్
శివమగుఁ బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా
మీ ఆటవిడుపు పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండికవులకు నివ్వుమా శుభము,కావ్యము గూర్చెడు కార్యమందునన్!
రిప్లయితొలగించండిశివమగుగాకనేతలకు శీఘ్రముగానిక బుద్ధివచ్చుచో
కువకువలాడుచున్ జగతి,కూర్మివహించక నెట్టులిచ్చటన్
శివమగు,బాపకార్యముల జేసినచో శివరాత్రికిన్ సఖా..
నవనవలాడుచున్ బ్రజలు, నాణ్యములైనటువంటి కోరికల్!
రిప్లయితొలగించండిభవమున దీరగానిడుము, భవ్యజగత్తున వారిసంపదల్
కువకువలాడుచున్ కవులు, కూర్మివహించగ సాహితీప్రభల్
శివమగు,బాపకార్యముల, జేసినచో శివరాత్రికిన్ సఖా..
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిజవరాళ్ళతోతిరిగినన్
రిప్లయితొలగించండికువలయమునదొంగవైనకుటిలత్వంబై
శివభక్తులదూషించిన
శివరాత్రికి పాపకర్మ జేసిన శివమౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'శివమౌ' అన్నది ఏ అర్థంలో స్వీకరించారు?
శివ మెటులగునో తెలియదు
రిప్లయితొలగించండిశివరాత్రికి బాపకర్మ చేసిన? శివమౌ
భువిలో సతతంబింటను
శివపూజలు విడక చేయ శీఘ్రము గానే
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిశివ శివ యని చలి పారును?
శివ శివ యని వేడుకొనుట శివమైనది సూ
వె? వరలు సుందర సత్యము?
శివరాత్రికిఁ ;బాపకర్మఁ జేసిన; శివమౌ!
జిలేబి
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశివదర్శనము సలుపనగు
రిప్లయితొలగించండిశివరాత్రికిఁ ; బాపకర్మఁ జేసిన శివమౌ
భవుని దయ కలిగినయెడల ,
భువిపై కవి సలుపు నేటి పూరణమిదియే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి( కైలాసంలో ఒకప్పటి దుర్మార్గుడుగుణనిధి
రిప్లయితొలగించండిఒకప్పటి పాపాత్ముడు సుకుమారునితో..)
నవనవలాడు కోర్కెలవి
నర్తనసేయగ దుష్టమార్గముల్
ధ్రువముగ బట్టినారలము
దుందుడుకొప్పగ జీవితాంతమున్ ;
భవుడగు నీశుదర్శనపు
భాగ్యము నందుట ముక్తులైతిమే !
శివమగు బాపకార్యముల
జేసినచో శివరాత్రికిన్ సఖా !
(ధ్రువముగ - నిశ్చయముగా ; శివము -శుభము )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివ్యవసితమౌ నరక మికను
రిప్లయితొలగించండిశివరాత్రికిఁ బాపకర్మఁ జేసిన, శివమౌ
భవభయ హారి నభవుని య
నవరతము కొలిచిన చాలు నరునకు భువిలో.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభవమొసగెన్ మహేశ్వరుడు భాగ్యచయంబును గాంచుచుండు మీ
రిప్లయితొలగించండియవనిని దీనులందు బరిహాసము లాడకు పంచు మర్థముల్
స్తవముల నందుమా యనెను ధన్యత గల్గును దానిచే, ధృతా
శివమగుఁ బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికువలయమేలు భార్గవుడు కోడెవయాళి వజీరు డాతడే
రిప్లయితొలగించండిభవభయ హారి, శంకరుని భక్తిగ కొల్చెడి వారి కెల్లెడన్
శివమగు, బాపకార్యములఁ జేసినచో శివరాత్రికన్ సఖా
వ్యవసిత మౌను నారకము వాస్తవమంచును చెప్పిరెందరో.
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండినిన్నటి పూరణ
రిప్లయితొలగించండిమారెడుకాయయే ప్రకృతి, మవ్వపుటూయల మాయ యయ్యె, నిం
పారిన మోహమే బువిని మానిని యయ్యెను, భ్రాంతియుక్తని
స్సారపు జీవనమ్మున నశాశ్వతసౌఖ్యనిమజ్జితాంగి యై,
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఇవ్వాళ్టికి జై బోలో శంకరు మహరాజ్ కీ :)
శ్రవమును చక్కగానిలిపి జాబిలితాల్పుని గీర్ణి నేర్వుమా
రవణపు డప్పులన్ హరుని రాత్రిని మేల్కొని చేయ ప్రార్థనల్
శివమగుఁ, బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా
భవమును దాటవేడుకొన ఫాలుని దక్కు విమోచనమ్మయా
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిస్తవనయుతోపవాసమహదర్చనలున్, విహితాభిషేకముల్,
రిప్లయితొలగించండిశివునకు ప్రీతిదాయకముఁ జేసినచో శివముల్ గడించగన్,
బువి వరదానధర్మకృతపూర్వజపుణ్యముల్ నశించి, ని
శ్శివమగుఁ బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా".
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅవరోధమునాగామికి
రిప్లయితొలగించండిభవబంధములిహమునందు బారన్ ద్రోలన్
అవలీలగ సంచితమును
శివరాత్రికిఁ బాప,కర్మఁ జేసిన శివమౌ"
విలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాని 'పాపన్+కర్మ=పాపఁ గర్మ..' అవుతుంది.
నవనీతము ప్రేయసి మది
రిప్లయితొలగించండియవలీలగ మాయ జేసి యానం దించన్
సవతిని తెచ్చిన సుఖమే
శివరాత్రికిఁ బాపఖర్మఁ జేసిన శివమౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశంకరాభరణం.. సమస్యాపూరణం..
శివమగుఁ బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా"
ధ్రువముగ బాపమే యగును త్రోయుచు లేఁగల, బాలు పిండుటల్ !
ధ్రువముగ బాపమే యగును తోలుచు తుమ్మెదఁ బూలు కోయుటల్ !
భవునకె యంచు జేయునెడ పాపము గాదు! శివార్చనావిధిన్
శివమగుఁ బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
అధ్భుతమైన పూరణ అవధానిగారూ!నమోనమః!
తొలగించండిమైలవరపు వారి పూరణ అత్యద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశివనామము జపియించుచు
రిప్లయితొలగించండిభవహర మముగావుమనుచు ప్రార్ధించినచో
నెవరైనను నిశ్చలముగ
శివరాత్రికిఁ,బాపకర్మ జేసిన శివమౌ!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎవరును జేయరు మహిలో
రిప్లయితొలగించండిశివరాత్రికి పాపకర్మ : చేసిన శివమౌ
శివ పూజలు కడు భక్తిగ
శివ శివ యనుచును జపింప చేకురు శుభ ము ల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅవిరళముగ మంచి పనులు
రిప్లయితొలగించండిభువిలోపల జేసినంత పుణ్యము దక్కున్
సవివరముగ గన నెవ్విధి
శివరాత్రికిఁ బాపకర్మఁ జేసిన శివమౌ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండికందం
నవసుమముగ మానసమును
భవునకు నర్పించఁ గూర్చి వందన మంచున్
శివ! శివ! యని పూజ, విడచి
శివరాత్రికిఁ బాపకర్మఁ, జేసిన శివమౌ!
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిశివశివ శివశివ శివశివ
రిప్లయితొలగించండిశివశివ శివశివ శివశివ శివశివ శంభో
శివశివ శంభో యనగా
శివరాత్రికిఁ, బాపకర్మ జేసిన, శివమౌ!
బాగుంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండివివశము నొందుచున్ మిగుల ప్రీతిగ నీశుని గాంచుచున్ మదిన్
రిప్లయితొలగించండిశివయను మంత్రమున్ విధిగ చింతనజేయుచు నిశ్చలమ్ముగన్
భవమున జేయు తప్పులను బాపుమ యంచును వేడుకున్నచో
శివమగుఁ, బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ శివరాత్రి నమస్సులతో 🙏🙏
రిప్లయితొలగించండి*నా పూరణ ప్రయత్నం* 🙏
*కం||*
శివరాత్రికి యభిషేకము
శివరాత్రికి పూజచేయ శివదర్శనమౌ
ఇవియన్నియు నొదిలి నెటుల
*"శివరాత్రికిఁ బాపకర్మఁ జేసిన శివమౌ"??*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"శివరాత్రికి నభిషేకము... యన్నియు వదలి యెటుల..." అనండి.
మరో ప్రయత్నం ..🙏
తొలగించండిసరదా పూరణ🙏😊
*కం||*
చెవిలో జెప్పెను గురువిల
శివరాత్రికిఁ బాపకర్మఁ జేసిన శవమౌ
హ, వినకనె పలికె శిష్యుడు
*"శివరాత్రికిఁ బాపకర్మఁ జేసిన శివమౌ"*
🙏
రిప్లయితొలగించండిమరొక పూరణ
శివజపమున శాంతి కలుగు
శివరాత్రికిఁ, బాపకర్మఁ జేసిన శివమౌ
శివరాత్రినపస్తుండుచు
భవునారాధించుచున్న వాసిగ నెపుడున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅవనిన మానవులందరు
రిప్లయితొలగించండిభవహరుడౌ శివుని గొలువ పాపము పోదే?
శివశివ యనుచును నేలా
శివరాత్రికిఁ బాపకర్మఁ జేసిన శివమౌ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అవనిని' అనండి.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"శివమగుఁ బాపకార్యములఁ జేసినచో
శివరాత్రికిన్ సఖా"
సందర్భము: ఇది రామేశ్వరం కథ..
రాముడు రావణ వధతో అంటిన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి కైలాస పర్వతం నుంచి శివలింగాన్ని తెమ్మని హనుమంతుని పంపించినాడు. సీత ఇసుకతో శివ లింగం తయారించగా ముహూర్తం దాటిపోకుండా ప్రతిష్ఠించటం జరిగింది. హనుమ శివలింగాన్ని తెచ్చి నిరుత్సాహ పడగా దాన్నీ ప్రతిష్ఠించారు.
"నీవు తెచ్చిన శివలింగానికే తొలిపూజలు జరుగుతా" యని రాముడు హనుమతో పలికినాడు.
రామనాథ లింగము, రామ లింగము అంటారు సీత చేసిన శివలింగాన్ని. విశ్వలింగ మంటారు హనుమ తెచ్చిన శివలింగాన్ని.
ఇక్కడ వున్న ప్రసిద్ధములైన 22 తీర్థాల్లో స్నానాలు చేస్తారు భక్తులు.
తమ అమ్మాయికి మంచి భర్త లభించా లని ఆ తీర్థాల్లో స్నానాలు చేసి అర్చనలు చేస్తూ ఒక తల్లి తండ్రితో ఇలా అన్నది.
"పాపయొక్క (కై) స్నానార్చనాది కార్యములను చేస్తే శివరాత్రివరకు శివ మౌతుంది కదా!"
తవులు = ఆసక్త మగు
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*శివాకాంక్ష*
అవనిజ సైకతంబుఁ గొని
యందముగా నొనరించె లింగమున్..
బవనజు డేగి తెచ్చె నొక
భవ్యమునౌ శివలింగ.. మర్చనల్
దవులుచుఁ బాప పెండ్లికయి
తల్లి యొనర్చుచుఁ దండ్రి కి ట్లనెన్..
"శివ మగుఁ బాప కార్యములఁ
జేసినచో శివరాత్రికిన్ సఖా!"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
21.02.20
-----------------------------------------------------------
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశివుని మదినిలిపి భక్తిని
రిప్లయితొలగించండి"శివరాత్రికిఁ బాపకర్మఁ జేసిన శివమౌ"
భవహరమనుచు నతితెలివి|
భువిలో తలతురు జనులు కుబుధ్ధిమతులనన్ |
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశివసాయుజ్యముదక్కదు
రిప్లయితొలగించండిశివరాత్రికిఁ బాపకర్మఁ జేసిన, శివమౌ
శివశివయనమది నిరతము,
శివనామస్మరణమహిమఁజెప్పగవశమా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభవహరమగు శివపూజయె
రిప్లయితొలగించండిశివరాత్రికి;బాపకర్మ జేసిన,శివమౌ
లవలేశమైన పుణ్యము
ధ్రువముగ నశియించుగాదె రుద్రునిరాత్రిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా!నమస్సులు!
తొలగించండిమిత్రులందఱకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండి[శివునకు ద్రోహముఁ జేయుచుంటినని యెఱుఁగకయే, స్వార్థపరుఁడై తన హృదయందు శివుని బంధించినాఁడు గజాసురుఁడు. తన పరాక్రమమును నిరూపింపఁబూని, భిల్లుఁడు తాను పూజించు శివుఁడని యెఱుఁగక, యాతని తోడనే యుద్ధ మొనర్చినాఁ డర్జునుఁడు. శివునకుఁ గీడొనర్చునేమో యని తలఁచి, శివుని దీపము నార్పఁబూని, చచ్చినది సాలెపురుఁగు. శివ భక్తులను జంపుచుంటిమను విషయ మెఱుఁగక, రోషమున, నొండొరులఁ జపుకొనినవి గజసర్పములు. రక్తమాంసములు దైవనైవేద్యములు గావను విషయ మెఱుంగక, దిక్కెవరు లేక యాఁకలితో నలమటించుచుండెనని తలంచి, శివునకు రక్తమాంసము లొసంగినాఁడు తిన్నఁడు. ఈ విధముగఁ దెలియనితనమున వారు శివద్రోహ మొనరించినను చివరకు శివసాయుజ్యమునే పొందినారు. కావున, శివరాత్రినాఁ డిటువంటి శుభంకరమైన పాపకార్యము లొనరించినచో శుభములే యొనఁగూడు ననుట.]
భువిని గజాసురుండు శివుఁ బొందఁ గదించె నెడంద స్వార్థియై!
భవునిఁ బరాక్రమాన గెలువంగఁ బెనంగెఁ బృథాతనూజుఁడే!
శివు దివియం దినెం జెలఁది, చీల్పఁగఁ బూనె గజాహు లొండొరుల్!
నవయు శివున్ వెసం గనియు, నల్లయు, నంజుడు నిచ్చెఁ దిన్నఁడే!
శివమగుఁ బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండిభవమేనాశనమౌనుగ
రిప్లయితొలగించండిశివరాత్రికిబాపకర్మజేసిన,శివమౌ
శివరాత్రిపర్వదినమున
శివశివయనిపలుకునెడలశివునింగరుణన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజవమున విఱ్ఱవీగి కలుషాత్ములు కౌలిక దుష్టచిత్తులా
రిప్లయితొలగించండిభవుని కఠోర వాక్కులను; భక్తులు శాంతిగ నుండు వేళ;లో
కువ గని దూఱువాఁరికిని కుత్తుకలన్నియు ద్రుంచివేయగన్
శివమగుఁ బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా
శివనింద చేసిన వారి తల తీసివేయాలని మా అమ్మ పార్వతీదేవి చెప్పింది
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచంపకమాల
రిప్లయితొలగించండినవవిధ భక్తి మార్గముల నైజమెరుంగని భక్తకన్నడున్
శివునకు పుక్కిలింతనిడి చేయఁగ భక్తి మహాభిషేకమే
యవమను భావనన్ విడచి యక్కున జేర్చెనె! మూఢభక్తితో
శివమగుఁ బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా!
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిపూరింపవలసిన సమస్య ఇది...
రిప్లయితొలగించండి"శివమగుఁ బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా
చంపకమాల
ధృవమిదిమూర్ఖమర్త్యులుమదించిచరించుచుజ్ఞానశూన్యులై
భువినియనేకదుర్వ్యసనభోగపరాయణులైనభ్రష్టులున్
శివయనమోక్షమబ్బునభిషేకముచేనఘధౌతమౌనికన్
శివమగుఁ బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా
గాదిరాజు మధుసూదనరాజు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"భువిని ననేక..." అనండి.
శివరాత్రిశుభాకాంక్షలు నమస్సుమాంజలులు
తొలగించండిభువినిననేక..సవరించెద..ధన్యోస్మి
చం:
రిప్లయితొలగించండిభువనము నందు నుండుటయు భూరి యశస్సుల గూర్చు వాడుగన్
కవనము నందు గాని మది కందిన రీతిని మ్రొక్కు చుండగన్
సవరణ జేయకుండ నిడు జాలిగ దివ్యము తానెరుంగుటన్
శివమగు బాపకార్యముల జేసినచో శివరాత్రికిన్ సఖా
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశివయనిభక్తితోఁగొలువశీఘ్రమెసాంబశివుండు మెచ్చగా
రిప్లయితొలగించండిశివమగుఁ, బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా
భవితయెకాళరాత్రమగుభావనజేయగ మానవాళికిన్
భవభయహారకమ్మిదె శుభమ్ములుగూర్చును శర్వునామమే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅవనిని మానవ జన్మ మ
రిప్లయితొలగించండిది వరమనఁ బడసిన ఫల మది విడువఁ దగునే
శివపూజ, మాని నీవీ
శివరాత్రికిఁ బాపకర్మఁ, జేసిన శివమౌ
శివశివ యంచుఁ గొంద ఱిల సేవలు సేసి తరింత్రు కొంద ఱీ
యవనిని విష్ణునామముల నర్చన లందు నభేద మిద్దఱన్
భవునిలు సేరి నిల్చిన నభక్తిని మూర్ఖత నేరకుండఁగా,
శివ మగుఁ, బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా
మహాశివరాత్రి పర్వదినమున శివ నామస్మరణము:
తొలగించండివిద్వన్మండల హృత్సరోజ విలసద్విఖ్యాత కీర్త్యంగనా
చిద్వైచిత్ర్య తనూ విలాస కరు ణాశ్లిష్టాత్మ భక్తాళి రా
జద్వైశిష్ట్య గుణోత్క రాగుణ గణ క్షామాంతరంగ ప్రభా
యుద్విగ్నార్త జనావ నైక రత సద్యోరక్ష శూలీ నతుల్
ప్రేత భూ సంచారి రిక్తాంబరుండు త్రినేత్రుండు వరదుండు నిత్య శుభుఁడు
భస్మ చందన దేహి ఫణివృత బాహుండు శీతాంశు జాహ్నవీ శేఖరుండు
నలి జటాజూటుండు నమరారి బంధుండు నత నిర్జర గణుండు సిత తనుండు
నట నానురాగుండు పటు విషగ్రీవుండు నక్షిత్రయుం డభయ ప్రదుండు
ప్రమథ నిచయ భూతప్రేత పాలకుండు
నస్థి మాలి కర కపాలసుస్థిరుండు
నశుభ దృశ్య మాన నిరంతర శుభ దాయ
కుండు నా విశ్వనాథుని రండు కొలువ
శివశివయంచునిత్యమునుశ్రీయుతుబ్రార్ధనజేయుచోనిలన్
రిప్లయితొలగించండిశివమగు,బాపకార్యములజేసినచోశివరాత్రికిన్ సఖా!
పవలునుఱేయియున్ననకబాధలనొందునుదీవ్రశైలిలో
శివునిమదిందలంచుమికచేయునుసత్కృతినినెల్లవేళలన్
మైలవరపువారి బాటలో!
రిప్లయితొలగించండినవనవలాడు పూవుల వనంబున చేతుల నుత్తరించుటే
శివమగు బిల్వపత్రముల చెట్టున దోటిని ద్రుంచివేయుటే
భవునకు ప్రీతిపాత్రమగు,పావనమేయగు లింగపూజలన్
శివమగు బాపకార్యముల జేసినచో శివరాత్రికిన్ సఖా!
రిప్లయితొలగించండికవులిట కూడిరి నొకచో
కవనము సేయగ శివమున ఘనముగ రాత్రిన్
శివమే వెలుగంగ నెటుల
శివరాత్రికిఁ బాపకర్మఁ జేసిన శివమౌ!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"శివమగుఁ బాపకార్యములఁ జేసినచో
శివరాత్రికిన్ సఖా"
సందర్భము: ఇది శక్తి పీఠంగా పేరందిన "కన్యాకుమారి" స్థల చరిత్ర. బాణాసురుని బాధలు పడలేక దేవతలు యజ్ఞం చేసి పరాశక్తిని ప్రసన్నం చేసుకున్నారు. ఆమె "పాప" (బాలిక)గా భువికి దిగివచ్చి బాణాసురు నంతమొందిస్తా నని అదే "పాప కార్య" మని, అప్పుడే మీ పరిస్థితి చక్కబడుతుం దని అన్నది. దేవతలెంతో సంతోషించినారు.
దేవేంద్రుని సతీమణియైన శచీదేవి కూడ భర్తతో పలికిం దిలా..
"సఖా! రాబోయే శివరాత్రి వరకు లోకమునకు శివమౌతుంది ఈ పాప కార్యాలు (బాణాసుర సంహారాదులు) చేస్తే.."
(చేస్తే.. అంటే "మనం కూడ పరాశక్తి కనుకూల పరిస్థితులు కల్పిస్తూ సహకరిస్తే.." అని శచీదేవి ఆంతర్యం.)
కన్యకచేతిలో మాత్రమే బాణాసురునికి మృత్యు వని బ్రహ్మ వరం..
నూల్కొను = చక్కబడు
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*పాప కార్యము*
భువి దిగి వత్తు "పాప"నయి
పోయి దివౌకసులార! ధూర్త బా
ణు వధయె "పాప కార్య" మగు
నూల్కొను మీ స్థితి యప్పు డన్న దే
వి వచనమున్ సురల్ వినిరి..
వేగమె యా శచి వజ్రి కి ట్లనెన్..
"శివమగుఁ బాపకార్యములఁ
జేసినచో శివరాత్రికిన్ సఖా!"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
21.02.20
-----------------------------------------------------------
శివయను చింతనామృత వి
రిప్లయితొలగించండిచింతిత పాన సుధాస్రవంతిలో
భవహరు బూజజేసి పరి
వార గణంబుల భక్తిగొల్చుచున్
స్తవమున నాదిదంపతుల
సాదరమున్నెద నింపి కొల్వగన్
శివమగు, పాప కార్యములు
జేసినచో, శివరాత్రి కిన్ సఖా!